'పులి బిడ్డ' అంటూ అజిత్‌ కుమారుడి విజయంపై ప్రశంసలు | Ajith Kumar Son Aadvik Wins School Sports Competitions | Sakshi
Sakshi News home page

'పులి బిడ్డ' అంటూ అజిత్‌ కుమారుడి విజయంపై ప్రశంసలు

Jan 29 2025 2:06 PM | Updated on Jan 29 2025 3:21 PM

Ajith Kumar Son Aadvik Wins School Sports Competitions

కోలీవుడ్‌ ప్రముఖ హీరో అజిత్‌ కుమారుడు ఆద్విక్‌ రన్నింగ్‌ రేసులో విజయం సాధించి ప్రథమ బహుమతి అందుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను అజిత్‌ ((Ajith Kumar)) సతీమణి షాలిని (Shalini) సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోపై ఆయన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కారు రేసింగ్‌లో తండ్రి సత్తా చాటితే.. కుమారుడు రన్నింగ్‌ రేస్‌లో దుమ్మురేపుతున్నాడని, అదే రక్తం అంటూ..ఆద్విక్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

అజిత్‌లాగే  ఆయన కుమారుడు అద్విక్‌కి కూడా క్రీడలంటే చాలా ఆసక్తి. తాజాగా అద్విక్ తమిళనాడు అంతర్ పాఠశాలల క్రీడా పోటీలలో సత్తా చాటాడు. రన్నింగ్ రేస్, రిలే రేసులలో మొదటి స్థానంలో నిలిచి తండ్రికి తగిన కుమారుడని పేరు గడించాడు. ఏకంగా మూడు మెడల్స్‌ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను షాలిని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయడంతో అభిమానులు వైరల్‌ చేస్తున్నారు. వీడియో చూసిన నెటిజన్లు పులికి పులినే పుడుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు.  తండ్రి అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధిస్తుంటే.. కుమారుడు పాఠశాల నుంచి తన విజయాలను మొదలు పెట్టాడని చెప్పుకొస్తున్నారు. భవిష్యత్తులో భారతదేశం గర్వపడేలా మంచి రన్నింగ్‌ రేసర్‌ కావాలని ఫ్యాన్స్‌ ఆశిస్తూ..శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

'అజిత్‌ కుమార్ రేసింగ్‌' పేరుతో ఇటీవల ఒక రేసింగ్‌ టీమ్‌ను ప్రకటించిన అజిత్‌..  దుబాయ్‌ వేదికగా జరిగిన '24హెచ్‌ దుబాయ్‌' కారు రేసింగ్‌లో పాల్గొని విజయాన్ని అందుకున్నారు. పలు దేశాలకు చెందిన రేసర్లతో పోటీపడి హోరా హోరీగా సాగిన ఈ పోటీల్లో ఆయన టీమ్‌ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రమాదంలో గాయపడినప్పటికీ దానిని లెక్కచేయకుండా బరిలోకి దిగినందుకు గాను.. స్పిరిట్‌ ఆఫ్‌ రేస్‌ అనే అవార్డుతో అజిత్‌ను గౌరవించారు. 

సినీ పరిశ్రమకు అజిత్‌ చేసిన సేవలకు దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారంతో కేంద్రం గౌరవించింది. తాజాగా ఆయన్ను పద్మభూషణ్‌తో సత్కరించింది. తన విజయానికి, సంతోషానికి షాలినీ ప్రధాన కారణం అని అవార్డ్‌ వచ్చిన సందర్భంగా అజిత్‌ తెలిపారు. ఆయన నటించిన కొత్త సినిమా 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' ఏప్రిల్‌ 10న తెలుగు,తమిళ్‌లో విడుదల కానుంది. ఈ మూవీని అధిక్‌ రవిచంద్రన్‌ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ భారీ బడ్జెట్‌తో 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement