fake account
-
'దయచేసి అది నమ్మొద్దు'.. ఫ్యాన్స్‌ను కోరిన స్టార్ హీరో భార్య
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే చిత్రంలో నటిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాదికి పొంగల్ కానుకగా రిలీజ్ కానుంది. దీంతో పాటు విడాయమర్చి అనే మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం ఏడాది చివర్లో థియేటర్లలోకి రానుంది.అయితే అజిత్ నటి షాలినిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2000లో అజిత్ కుమార్- షాలిని పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా షాలిని పేరుతో నకిలీ ట్విటర్ ఖాతా బయటపడింది. ఈ విషయాన్ని షాలిని అజిత్ కుమార్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. 'ప్రతి ఒక్కరికీ నా మనవి.. ఇది నా అఫీషియల్ ట్విటర్ అకౌంట్ కాదు.. దయచేసి ఎవరూ కూడా నమ్మి ఫాలో అవ్వొద్దు. ధన్యవాదాలు' అంటూ అభిమానులను కోరింది. షాలిని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. View this post on Instagram A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022) -
Vidya Balan: పోలీసులను ఆశ్రయించిన విద్యాబాలన్!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో విద్యాబాలన్ ఒకరు. తన సినిమా అప్డేట్స్తో పాటు వ్యక్తిగత విషయాలనూ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు చిట్ చాట్ చేస్తూ అభిమానుల ప్రశ్నలకు సరదా సమాధానాలు ఇస్తుంటారు. ఇప్పుడదే కొంతమంది మోసగాళ్లకు బలమైంది. నెట్టింట చురుగ్గా ఉండే విద్యాబాలన్ పేరుతో ఓ నకిలీ అకౌంట్‌ని క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా విద్యాబాలన్ దృష్టికి వెళ్లడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. జాబ్స్ ఇప్పిస్తానంటూ.. తనదైన అందం అభినయంతో బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విద్యాబాలన్. వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్గా ఎదిగారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాను మాత్రం పక్కకి పెట్టదు. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆమె ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పడు ఇన్‌స్టాలో అప్లోడ్ చేస్తుంటారు. అయితే ఆ మధ్య అచ్చం విద్యాబాలన్ నిజమైన ఇన్స్టాగ్రామ్ ఐడీతోనే ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు కొంతమంది దుండగులు. ఆమె అకౌంట్లోని ఫోటోలు, వీడియోలు అన్ని ఫేక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. కొన్నాళ్ల తర్వాత అభిమానులతో చాట్ చేస్తూ.. వారి నుంచి డబ్బులు వసూలు చేశారు. కొంతమందికి జాబ్స్ ఇప్పిస్తామని, అందుకోసం కొంత అమౌంట్ ఖర్చు అవుతుందంటూ పెద్ద ఎత్తున్న డబ్బులు కాజేశారు. ఈ విషయం ఆలస్యంగా విద్యాబాలన్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆమె వెంటనే ఖార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెక్షన్ 66 (C) ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన ముఠాను కనిపెట్టే పనిలో ఉన్నారు. ఆ మధ్య సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్స్ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేశారు. Bollywood actress Vidya Balan lodged an FIR against an unknown person for creating a fake Instagram account in her name and asking for money from people. An unknown person who created an identical Instagram ID asked people for money by assuring them of jobs. Khar Police has… — ANI (@ANI) February 21, 2024 ‘భూల్ భూలయ్య 3’లో విద్యా బాలన్ సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు విద్యాబాలన్. కథ, తన పాత్ర నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం భూల్ భులయ్య 3లో నటిస్తున్నారు. అందులో మంజులిక పాత్రను పోషించబోతున్నట్లు హీరో కార్తిక్ ఆర్యన్ ప్రకటించాడు. అనీస్ బజ్మీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. -
షాకింగ్ రిపోర్ట్: వదల బొమ్మాళీ అంటున్న ఎలాన్ మస్క్
న్యూఢిల్లీ: వరల్డ్ బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌పై మరోసారి తన దాడిని ఎక్కుపెట్టాడు. ట్విటర్లో 5 శాతానికిపైగా నకిలీ ఖాతాలు ఉన్నాయన్న విషయాన్ని నిరూపించేదాకా వదల..వదల బొమ్మాళీ అన్నంత పట్టుదలగా ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా తన అభిప్రాయానికి బలాన్నిచ్చే కథనాన్ని ట్విట్ చేశారు టెస్లా బాస్. ఇది చదవండి: SpiceJet: భారీ నష్టాలు,సీఎఫ్‌వో గుడ్‌బై, కుప్పకూలిన షేర్లు పదింటిలో ఎనిమిది ట్విటర్ ఖాతాలు నకిలీవే అన్న టాప్ మోస్ట్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ వాదనను ఉటంకిస్తూ ట్వీట్ చేశారు. ఖచ్చితంగా నకిలీ ఖాతాల సంఖ్య 5 శాతానికంటే ఎక్కువే అంటూ ట్విటర్‌ను ఎద్దేవా చేశారు. యుఎస్ ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్, ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్లతో 20 సంవత్సరాలకు పైగా పనిచేసిన సైబర్‌సెక్యూరిటీ కంపెనీ ఎఫ్-5 గ్లోబల్ హెడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ డాన్ వుడ్స్ 80 శాతానికి పైగా ట్విటర్ ఖాతాలు నకిలీవి కావచ్చని ది ఆస్ట్రేలియన్‌తో అన్నారు. డార్క్ వెబ్‌లో నకిలీ ఫాలోవర్స్‌ను కొనుగోలు చేస్తున్నారని కూడా వుడ్స్ పేర్కొన్నారు. అలాగే ఎలాన్ మస్క్, ట్విటర్ రెండూ కంపెనీ ఈ సమస్యను తక్కువగా అంచనా వేసినట్లు చెప్పారు. (ఇదీ చూడండి: SC On Check Bounce Case: చెక్ బౌన్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు) కాగా నకిలీ ఖాతాల విషయంలో ట్విటర్ తప్పుదారి పట్టించిందని ఆరోపించిన మస్క్.. వీటి లెక్కలు తేలాల్సిందే అని డిమాండ్ చేస్తూ 44 బిలియన్ డాలర్ల ట్విటర్ కొనుగోలు ఒప్పందం నుంచి గత జూలైలో తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ట్విటర్, మస్క్ మధ్య న్యాయపోరాటానికి తీసింది. ఇపుడు ఈ వివాదం కోర్టుకు చేరింది. Sure sounds higher than 5%! https://t.co/Va7TxxzoI6 — Elon Musk (@elonmusk) September 1, 2022 -
కలెక్టర్ టీనా దాబికే షాకిచ్చాడు.. మాములు ఐడియా కాదుగా..
Tina Dabi.. అందమైన ఆఫీసర్‌గా పేరున్న ఐఏఎస్ అధికారిణి టీనా దాబి అందరికీ సుపరిచితురాలే. ఇటీవలే ఆమె రెండోసారి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఐఏఎస్ టీనా దాబీ, ఐఏఎస్ ప్రదీప్ గవాండేను వివాహం చేసుకున్నారు. కాగా, మరోసారి టీనా దాబి వార్తల్లో నిలిచారు. అయితే, కలెక్టర్ టీనా దాడి ఫొటోనే వాట్సాప్‌లో వాడుకుంటూ ఓ వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడు. దీంతో, విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని దుంగార్పూర్కు చెందిన ఓ యువకుడు.. ఓ మొబైల్ నెంబర్‌తో వాట్సాప్ ఓపెన్ చేసి, దాంట్లో ఐఏఎస్ టీనా దాబి ఫొటోను డీపీగా పెట్టుకున్నాడు. అనంతం వాట్సాప్‌లో ఆ నెంబర్‌తో గుర్తు తెలియని వ్యక్తులకు మెసేజ్‌లు చేశాడు. అమెజాన్ గిఫ్ట్ కార్డులు పంపాలంటూ చాలా మందికి మెసేజ్‌లు పెట్టాడు. దీంతో, కలెక్టర్ టీనా దాబీనే గిఫ్ట్ కార్డులు అడిగిందే ఏమో అని వారు కూడా రెస్పాన్స్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆ రాష్ట్ర అర్బన్ ఇంప్రూవ్మెంట్ ట్రస్టు సెక్రటరీ సునితా చౌదరీకి కూడా అమెజాన్ గిఫ్ట్ కార్డు పంపాలంటూ అతడి వాట్సాప్ నుంచి మెసేజ్ వెళ్లింది. దీంతో, ఎందుకైనా మంచిదని ఆమె.. టీనా దాబికి ఫోన చేసి అసలు విషయం అడిగింది. గిఫ్ట్ కార్డు గురించి చెప్పడంతో షాకైన కలెక్టర్ టీనా దాబి.. ఈ విషయంపై ఫోకస్ పెట్టింది. ఈ విషయాన్ని స్థానిక ఎస్పీకి తెలియజేసింది. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు.. యువకుడిని అరెస్ట్ చేశారు. CM अशोक गहलोत के बाद अब IAS टीना डाबी के नाम पर ठगी, अफसर से ही मांग लिया गिफ्ट#IAS #Tinadabi https://t.co/zTbOOBvIMM — Zee Salaam (@zeesalaamtweet) August 9, 2022 ఇక.. దళిత వర్గం నుంచి మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించిన టీనా దాబి.. 2015 సివిల్స్ సర్వీసెస్ ఎంట్రెన్స్‌లో టాపర్. కాగా, రెండో ర్యాంకర్ అయిన అథర్ అమీర్ ఖాన్‌తో ఆమె రిలేషన్లో ఉన్నట్లు 2016లో సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ సమయంలో మతపరమైన చర్చతో పెను దుమారమే చెలరేగింది. అయినా ఈ జంట వెనక్కి తగ్గలేదు. ఇక 2018లో వీళ్లిద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ జంట 2020లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం జైపూర్ కోర్టు నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఇది కూడా చదవండి: సీఎం యోగితోనే పరాచకాలా.. తేడా వస్తే ఇలాగే ఉంటంది.. -
లేటెస్ట్ టెక్నాలజీతో సెబీ రెడీ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అత్యంత ఆధునిక టెక్నాలజీని, సంబంధిత టూల్స్‌ను సమకూర్చుకుంటోంది. వీటి సహాయంతో ఇన్సైడర్ ట్రేడింగ్, అక్రమ లావాదేవీల కేసులపై కొరడా ఝళిపించనుంది. తద్వారా నకిలీ ఖాతాల వినియోగంతో అక్రమాలకు పాల్పడిన కేసులను అత్యంత భారీ స్థాయిలో వెలికితీయనుంది. వెరసి క్యాపిటల్ మార్కెట్లు, కార్పొరేట్ ప్రపంచంలో పేరున్న ఇలాంటి కొంతమంది ప్రధాన అక్రమార్కులపై కేసులు నమోదు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కోవిడ్–19వల్ల తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఈ తరహా కేసులపై ఇటీవల సెబీ పలు ఆదేశాలు జారీ చేసింది. ఈ బాటలో ఇకపై ఇలాంటి కేసులను మరిన్నింటిని గుర్తించనున్నట్లు తెలుస్తోంది. ఆధునిక టెక్నాలజీతో పర్యవేక్షణ వ్యవస్థల సామర్థ్యం 100 రెట్లు బలపడిన కారణంగా సెబీ మరింతలోతైన అధ్యయానికి తెరతీస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఆల్గోరిథమ్స్, బిగ్ డేటా, కృత్రిమ మేథ తదితర టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు వివరించాయి. -
నకిలీలకు రతన్ టాటా హెచ్చరిక
ప్రసిద్ధ ఇండస్ట్రియలిస్ట్ నకిలీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. అదే విధంగా తమ జోలికొస్తే నకిలీరాయుళ్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టాటా సన్స్ గ్రూపు ద్వారా దేశవ్యాప్తంగా భారీ ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలను టాటాలు చేపడుతున్నారు. అయితే రతన్‌టాటా ఫౌండేషన్ పేరుతో కొందరు కేటుగాళ్లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఫేక్పేజీలు సృష్టించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇలాంటి నకీల పేజీల్ను నమ్మోద్దంటూ రతన్ టాటా ప్రజలను కోరారు. టాటా ఫౌండేషన్ ఎటువంటి డొనేషన్లను ఇలాంటి పద్దతుల్లో స్వీకరించదని తేల్చి చెప్పారు. టాటా ఫౌండేషన్ పేరుతోనే కాకుండా తన సన్నిహతులు, కొలిగ్స్ పేరుతో కూడా నకిలీ ఖాతాలు తెరిచి డొనేషన్లు అడుగుతున్నారని, అలాంటి వాటిని గుర్తించి ఫిర్యాదు చేయాలని సూచించారు. అంతేకాదు నకిలీ పేజీలతో అక్రమంగా నగదు వసూలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామంటూ రతన్ టాటా హెచ్చరించారు. చదవండి: మన పిల్లలేమీ శాండ్విచ్లు కాదు - రతన్‌టాటా -
కలెక్టర్ పేరుతో వాట్సాప్ మెసెజ్‌లు.. అమెజాన్ గిఫ్ట్ కార్డులంటూ..
సాక్షి, కుమురం భీం జిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్‌లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేరుతో సైబర్ నేరగాళ్లు డబ్బులు వసూలు చేసిన ఘటన మరుకవముందే మరో సంఘటన చోటుచేసుకుంది. కుమురం భీం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ డీపీతో డబ్బుల కోసం అదికారులకు వాట్సాప్ మెసెజ్‌లు పంపుతున్నారు. డబ్బులు, అమెజాన్ గిఫ్ట్ కార్డుల పేరుతో మోసం చేసేందుకు యత్నిస్తున్నారు. జిల్లా ఉన్నాతాదికారులకు, ఎమ్మార్వో, ఎంపీడీఓలకు మెసెలు పంపుతున్నారు. సైబర్ నేరగాళ్ల మెసెజ్‌లతో అధికారులు భయపడిపోతున్నారు. అదేవిధంగా కలెక్టర్ అదికారులను అప్రమత్తం చేయడంతో పోలీసులకు పిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చదవండి: ‘మామూలు’ ఇస్తే.. ఆ ఒక్కటీ సరైపోతుందని హింట్ -
నారాయణపేట జిల్లా కలెక్టర్ ఫోటోతో వాట్సాప్ ఖాతా తెరిచి..
సాక్షి, నారాయణపేట: ఏకంగా కలెక్టర్ ఫొటోతో నకిలీ వాట్సాప్ ఖాతాను తెరవడమేగాక.. ఆ నంబర్ నుంచి పలువురికి సందేశాలు పంపి రూ.2.4లక్షలు మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈమేరకు ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించిన వివరాలిలా.. గుర్తు తెలియని వ్యక్తి 8210616845 నంబర్ పేరిట నారాయణపేట కలెక్టర్ దాసరి హరిచందన ఫొటోతో వాట్సాప్ ఖాతా తెరిచాడని, దాన్నుంచి పలువురు ఉన్నతాధికారులు, ఇతరులకు సందేశాల పంపించాడని తెలిపారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి నుంచి అమేజాన్ పే యాప్ ద్వారా కొంత కొంత మొత్తం చొప్పున పలు దఫాలుగా రూ.2,40,000 సైబర్ నేరగాడు వేయించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. నకిలీ ఖాతా విషయాన్ని గుర్తించిన అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎన్సీఆర్పి పోర్టల్ ద్వారా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేసి విచారించామని తెలిపా రు. ఈ వాట్సాప్ నంబర్‌కు, జిల్లా యంత్రాంగానికి ఎలాంటి సంబంధం లేదని, దాని నుంచి వచ్చే సందేశాలను ఎవరూ నమ్మవద్దని కలెక్టర్ హరిచందన సైతం పేర్కొన్నట్లు తెలిపారు. ఎవరికైనా సందేహాలు వస్తే పోలీసు అధికారులకు తెలియజేయాలని సూచించారు. చదవండి: బీజేపీ కార్యకర్త మృతి.. వచ్చే నెల 4వ తేదీనే పెళ్లి.. జార్ఖండ్ వ్యక్తిగా గుర్తింపు నకిలీ వాట్సాప్ ఖాతా సృష్టించి మోసం చేసిన అతను జార్భండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని, ఈ విషయంపై విచారణ చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. సామాజిక మాద్యమాల్లో ఇలా అధికారుల ఫొటోలు పెట్టి డబ్బులు అడుగుతుంటారని, అలాంటి వారి వివరాలను పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సైబర్ నేరాల నుంచి రక్షణకు ఎన్‌సిఆర్‌పి పోర్టల్, టోల్‌ఫ్రీ నం.1930 కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. -
వీడు భర్తేనా.. ఇన్‌స్టాగ్రామ్‌లో భార్యకు అసభ్యకరంగా..
సాక్షి, ముంబై: కట్టుకున్న భార్యనే సోషల్ మీడియా వేధికగా వేధింపులకు గురి చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసిన ఆమెకు అసభ్యకరమైన మేసేజ్‌లు చేస్తూ వేధించాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. దేశంలో త్రిపుల్ తలాక్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. అయితే, ‘త్రిపుల్ తలాక్ ’ విధానంలో తనకు విడాకులు ఇచ్చాడని ఓ యువతి తన భర్తపై కేసు పెట్టింది. కేసు పెట్టిందన్న కోపంతో ఆమె భర్త.. ఇన్‌స్టాగ్రామ్‌లో 11 ఫేక్ అకౌంట్లు సృష్టించాడు. ఆ అకౌంట్లతో ఆమెకు.. అసభ్యకరంగా మెసేజ్‌లు చేయడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా ఆమెతోపాటు, కుమార్తెకు కూడా ఇలా మెసేజ్‌లు పంపించాడు. అతని ఆగడాలకు చిరెత్తిపోయిన ఆమె.. పోలీసులను ఆశ్రయించింది. తన భర్త అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. -
వార్నీ! సొంత తండ్రితోనే సినీ నటుడి ఆన్లైన్ డేటింగ్..
వాషింగ్టన్: హాలీవుడ్ నటుడు, దర్శకుడు జేమ్స్ మోరొసినికి వింత సమస్య వచ్చి పడింది. ఆయన గత కొన్ని రోజులుగా ఫేస్బుక్లో ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నాడు. ఆన్లైన్ వేదికగా 31 ఏళ్ల జేమ్స్ మోరొసినికి, బెక్కా అనే అమ్మాయికి పరిచయమైంది. అభిరుచులు, అలవాట్లు, ఆసక్తులు కలవడంతో వారి మధ్య స్నేహం చిగురించింది. స్నేహం కాస్తా ఆన్లైన్ డేటింగ్‌కు దారితీసింది. ఇలా కొన్ని రోజులు ఆ అమ్మాయితో మనోడు డేటింగ్, చాటింగ్ చేస్తూనే ఉన్నాడు. ఈక్రమంలోనే తనకు సంబంధించిన చాలా విషయాలు ఆ అమ్మాయి చెప్తున్నవాటితో సరిపోలడంతో అతనికి డౌట్కొట్టింది. దీంతో మరింత లోతుగా ఆ యువతి బెక్కా వివరాలు తెలుసుకుని షాకయ్యాడు. అతడు ఆన్లైన్లో ఇన్నిరోజులూ డేటింగ్ చేస్తున్నది తన తండ్రితో అని తెలిసి బిక్కచచ్చిపోయాడు. అయితే, తన తండ్రి ఫేక్ ఫేస్బుక్ ప్రొఫైల్‌తో అలా ఎందుకు చేశాడో తెలుసుకుని కుదుటపడ్డాడు. (చదవండి: మార్లిన్ మన్రో చిత్రానికి భారీ ధర.. అక్షరాలా రూ.1521కోట్లా..!) అమ్మాయిల పట్ల తన ప్రవర్తన ఎలా ఉంది. ఇతరులతో ఆన్లైన్ స్నేహాలు గట్రా చేసే క్రమంలో ఓవర్ చేస్తున్నాడా? అని తెలుసుకునేందుకే ఆయన అలా చేశాడని తెలిసింది. ఆన్లైన్ యుగంలో సైబర్ నేరాలకు కొదవే లేకుండా పోయింది. గుడ్డిగా నమ్మి మోసపోయినవారెందరో ఉన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లల డిజిటల్ వ్యవహారాలపట్ల అప్రమత్తంగా ఉండటం మంచిదే కదా! (చదవండి: అర్ధరాత్రి పరుగులు.. ఫేమస్ చేయొద్దంటూ దణ్ణం పెడుతున్నాడు!) -
నటుడి పేరుతో ఫేస్బుక్లో నగదు మోసం
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): టీవీ నటుడి పేరుతో ఫేస్బుక్లో ఖాతా ప్రారంభించి ఓ మహిళ వద్ద రూ.2.56 లక్షలు నగదును మోసం చేసిన కేసులో చెన్నైకి చెందిన దంపతులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. మదురై జిల్లా ఉసిలంపట్టి సమీపం పాప్పాపెట్టికి చెందిన బాలయ్య భార్య భాగ్యలక్ష్మి (26). ఈమె ఫేస్బుక్ అకౌంట్లో టీవీ నటుడు అంటూ.. ఒకతను చేరాడు. వీరి మధ్య పరిచయం ఏర్పడి ఇద్దరూ అనేక మెసేజ్‌లు పంపుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి వైద్య ఖర్చుల కోసం తనకు అత్యవసరంగా రూ.2.56 లక్షలు కావాలని కోడంతో భాగ్యలక్ష్మి అతని అకౌంట్లో నగదు జమ చేశారు. తరువాత ఫేస్బుక్ మూలంగా పరిచయమైన అతనిని సంప్రదించగా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో మోసపోయిన భాగ్యలక్ష్మి మదురై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రత్యేక బృందం పోలీసులు దర్యాప్తు చేయగా, టీవీ సీరియల్ నటుడు అని పరిచయం అయిన వారు చెన్నై తిరువొత్తియూరు, చిన్నమెట్టు పాలయంకు చెందిన సంతోష్‌రాజా అతని భార్య చిత్ర అని తెలిసింది. దీంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. చదవండి: చిన్నారిని కిడ్నాప్ చేయించిన మేనమామ -
షాకింగ్.. హీరోయిన్ ఇన్‌స్టా పేజీలో న్యూడ్ ఫోటోలు!
బయటే కాదు స్క్రీన్ మీద కూడా సంప్రదాయబద్దకంగా నడుచుకునే నటి సాధికా వేణుగోపాల్. అలాంటిది ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్ పేజీలో నగ్న ఫోటోలు దర్శనమిచ్చాయి. కొంతమంది ఇండస్ట్రీ జనాలు ఆమెకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పడంతో సాధిక షాకై.. పోలీసులను సంప్రదించింది. వివరాల్లోకి వెళితే.. మలయాళ నటి సాధికా వేణుగోపాల్‌కు ఇటీవల ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘మీరు పద్దతిగా నటిస్తారనుకున్నాం కానీ, సోషల్ మీడియాలో ఇలాంటి నగ్న ఫోటోలు పెడతారాని ఊహించలేదండి’అని ఆయన అన్నారు. దీంతో కంగుతిన్న సాధిక.. ‘ఏంటి? నా ఇన్‌స్టాలో బూతు బొమ్మలా? నేను ఎక్స్‌పోజింగే చేయను, అలాంటిది న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో ఎలా పెడతాను? అని తిరిగి అతన్ని ప్రశ్నించింది. ఆ అకౌంట్ ఆమె పేరు మీదనే ఉందని, ఫోటోలు తనవే అని చెబుతూ.. ఆ లింక్‌ని సాధికాకు షేర్ చేశాడు సదరు వ్యక్తి. ఆ లింక్ ఓపెన్ చేసిన నటికి దిమ్మతిరిగిపోయింది. ఆమె ఫోటోలను మార్పింగ్ చేసి నలికీ అకౌంట్‌తో సోషల్ మీడియాలో నగ్న ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపి ఆధారంగా సదరు ప్రబుద్దుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతని కెరీర్ పాడుచేయటం ఇష్టం లేక గట్టి వార్నింగ్ ఇచ్చి, కేసు వాపసు తీసుకుంది సాధికా. ఈ విషయాన్ని సాధిక తన అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. View this post on Instagram A post shared by Sadhika Venugopal official (@radhika_venugopal_sadhika) -
ఆ అకౌంట్లో తన ఎత్తు, బరువు, రేటు.. చదివి షాకైన నిత్య
‘‘నిత్యా, ఈ సెమిస్టర్లో కూడా నువ్వే ఫస్ట్, కంగ్రాట్స్!’ అంటూ వస్తూనే స్నేహితురాలిని అభినందించింది ఐషు. ‘థాంక్స్’ అంటూ నవ్వింది నిత్య. ఇద్దరూ క్లాసులోకి వెళ్లారు. క్లాస్మేట్స్ అందరూ నిత్యను అభినందనలతో ముంచెత్తారు. నిత్య, ఐషు (ఇద్దరి పేర్లు మార్చడమైంది) బీటెక్ సెకండియర్ చదువుతున్నారు. అందరితో కలివిడిగా ఉండే నిత్య అంటే క్లాసులో అందరికీ అభిమానం. క్లాస్ అయిపోగానే నిత్య, ఐషులు తమ క్లాస్మేట్ రఘుతో కలిసి పార్టీకి బయటకెళ్లారు. మరుసటి రోజు కాలేజీకి వచ్చింది నిత్య. అందరూ తనను అదోలా చూస్తుండటం గమనించింది. ఎవరూ మునుపటిలా పలకరించట్లేదు. తను పలకరించినా ముభావంగానే ఉన్నారు. పక్కసీటులో ఉండే క్లాస్మేట్ ప్రవర్తన కొత్తగా అనిపించడంతో ‘ఏమైందంటూ’ దబాయించింది నిత్య. తన ఫోన్ చూపుతూ, అందులో వచ్చిన మెసేజ్‌లు చూపించింది క్లాస్మేట్. అవన్నీ నిత్యకు సంబంధించినవే. తన పేరుతో ఉన్న అకౌంట్లో తన ఎత్తు, బరువు, రేటు .. అంటూ ఏవేవో వివరాలు.. చదివిన నిత్య షాకైంది. అంతే కాదు ఫొటోలు కూడా అసభ్యంగా ఉన్నాయి. తన గురించి ఇంత చెత్తగా అదీ తన అకౌంట్ నుంచి ఎవరు పోస్ట్ చేశారో అర్ధం కాలేదు నిత్యకు. క్లాసులో చుట్టూ చూసిన నిత్యకు అవమానంతో అక్కడే భూమిలోకి వెళ్లిపోతే బాగుండనిపించింది. వెంటనే క్లాస్ నుంచి ఇంటికి వచ్చేసింది. విషయం తెలిసి వెంటనే నిత్యకు ఫోన్ చేసింది ఐషు. తనకేమీ తెలియదని చెబుతూనే, ఆ రోజుంతా ఏడుస్తూనే ఉంది నిత్య. కూతురి పరిస్థితి చూసిన తల్లితండ్రులు తల్లడిల్లిపోయారు. కూతురు భవిష్యత్తును దెబ్బతీయాలనుకున్న వారిపై చర్య తీసుకోవాలంటూ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి కేసు ఫైల్ చేశారు. నిపుణుల సాయంతో ఆ ఫ్రాడ్ ఎవరో కనిపెట్టారు పోలీసులు. నిత్య పేరుతో చెత్త కామెంట్లు, ఫొటోలు అప్లోడ్ చేసింది ఎవరో కాదు నిత్య క్లాస్మేట్ రఘు అని తెలిసి ఆశ్చర్యపోయారు. రఘుని అరెస్ట్ చేశారు పోలీసులు. తనంటే ప్రత్యేక అభిమానం చూపే రఘు ఇంత దారుణానికి పాల్పడ్డాడంటే నిత్యకు నమ్మబుద్ధి కావడం లేదు. ఇదే విషయం పోలీసులకు చెప్పింది నిత్య. ఎప్పుడూ కలిసి ఉండే రఘు, నిత్య, ఐషులను విడివిడిగా ప్రశ్నించిన పోలీసులకు ఓ కొత్త విషయం అర్థమైంది. నిత్య మీద అసూయతో రగిలిపోయే ఐషు ఈ పని చేసిందని తెలుసుకున్నారు. రఘు ఫోన్‌ని వాడేది ఐషు. ఫ్రెండ్ కదా అని రఘు అడ్డు చెప్పేవాడు కాదు. రఘు తనను కాకుండా నిత్యను అభిమానిస్తున్నాడని, అన్నింటా తనే ముందుంటుందన్న అసూయ ఐషులో పెరిగిపోయింది. రఘు ఫోన్ నుంచి నిత్య పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, నిత్య గురించి చెడుగా కామెంట్ చేయడం మొదలుపెట్టింది. విషయం తెలిసి నిత్య–ఐషుల స్నేహం చెడిపోయింది. రఘు జీవితం ఇబ్బందుల్లో పడింది. టెక్నికల్‌గా ఐషు మీద యాక్షన్ తీసుకోలేమని, ఇలాంటి స్నేహితులకు దూరంగా ఉండమని పోలీసులు నిత్యకు హితవు చెప్పారు. అసూయను దరిచేర్చుకుంటే అది ద్వేషంగా మారి పతనం వైపుగా అడుగులు వేయిస్తుందనడానికి ఈ స్నేహితుల కథే ఉదాహరణ. ఫేక్ ప్రొఫైల్స్.. తస్మాత్ జాగ్రత్త స్నేహితులే కదా అని తమ ఫోన్ పాస్వర్డ్ వివరాలతో సహా చెప్పేసుకుని, అనుకోని పరిణామాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారిని ఇటీవల చూస్తున్నాం. ఆల్రెడీ మన ఫ్రెండ్ లిస్ట్‌లో ఉన్నవారి నుంచి మళ్లీ రిక్వెస్ట్ ఎందుకు వస్తుంది..? అనేది గుర్తించాలి. తమ ఫ్రెండ్స్‌ని అలెర్ట్ చేయాలి. తెలియని వారు పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయకూడదు. చాలా మంది ఎంత మంది ఫ్రెండ్స్, ఫాలోవర్స్ ఉంటే అంత గొప్ప అనుకుంటారు. వీటిల్లో హనీ ట్రాప్‌లో ఇరుక్కున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. ఫేక్ అని తెలియగానే ఆ సదరు అకౌంట్‌ని బ్లాక్ చేస్తే మంచిది. ఇటీవల ఫేక్ అకౌంట్స్ బారిన పడి మోసపోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. యువతలో డేటింగ్ సైట్స్ వాడే వారి సంఖ్య ఎక్కువ. ఈ సైట్లలో 50 శాతం ఫేక్ ప్రొఫైల్స్ ఉంటాయి. వాళ్ల స్నేహం మాయ గురించి మోసపోయాక కానీ తెలియదు. నిజానికి సోషల్‌మీడియాలో ఫేక్ ప్రొఫైల్ చూస్తేనే అర్థమైపోతుంది. అకౌంట్ ఇటీవల క్రియేట్ అయ్యి ఉండి, అందులో పూర్తి వివరాలు లేకుండా ఉంటే అనుమానించాలి. యూజర్‌నేమ్‌లో ఫస్ట్, లాస్ట్ నేమ్ అంటూ ఉండదు. ఆ అకౌంట్‌కి ఫాలోవర్లు ఉండరు. ఉన్నా.. వారే సృష్టించిన ఫేక్ ఐడీల జాబితాయే ఉంటుంది. వారి ఫ్రెండ్స్ లిస్ట్ చూస్తే వింత పేర్లు, స్టాక్ ఫొటోస్ పెట్టినవి ఉంటాయి. వాళ్ల కామెంట్స్ లిస్ట్‌లో సేమ్ కామెంట్స్ ఉంటాయి. ఫేక్ అకౌంట్స్‌కి ఒకే ఒక్క ఫొటో ఉంటుంది. ఆ ఫొటో కూడా ఎక్కడ నుంచి తీశారో గూగుల్ ఇమేజ్ టూల్ ద్వారా తెలుసుకోవచ్చు. వీటిని బట్టి అకౌంట్ ఫేక్ అని గుర్తించాలి. ఇలా గుర్తించినప్పుడు కంప్లైంట్ చేయాలి. మన ప్రొఫైల్ కూడా లాక్ చేసుకోవాలి. మనం తీసుకునే జాగ్రత్తలే సైబర్ నేరాలకు అడ్డుకట్ట. – జి.ఆర్. రాధిక, ఎస్పీ, (సైబర్ క్రైమ్ విభాగం), ఏపీ పోలీస్ -
ఏపీ డీజీపీ ట్విటర్ నకిలీ అకౌంట్ తొలగింపు
సాక్షి, అమరావతి: డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ అధికారిక ట్విటర్ అకౌంట్‌ను పోలిన నకిలీ అకౌంట్‌ను సృష్టించిన ఆగంతకుడు అందర్నీ బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. ఇది ‘డీజీపీ అంధ్రప్రదేశ్’ అధికారిక అకౌంట్ అంటూ అపరిచితుడు చేసిన ట్వీట్‌తో అనుమానించిన డీజీపీ కార్యాలయం ఆరా తీస్తే అది నకిలీ అకౌంట్ అని బయటపడింది. వెంటనే రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు, ఏపీ పోలీస్ టెక్ సర్వీసెస్ అధికారులు ‘డీజీపీ ఆంధ్రప్రదేశ్ ః ఏపీస్టేట్డీజీపీ’ పేరుతో ఉన్న నకిలీ అకౌంట్‌ను బ్లాక్‌చేసి దాన్ని వినియోగించే అవకాశం లేకుండా తొలగించారు. చదవండి: సక్సెస్ మంత్ర: రైతు బిడ్డ నుంచి ఇస్రో శాస్త్రవేత్తగా.. నైపుణ్య కళాశాలలు: ఏపీ సర్కార్ కీలక ముందడుగు.. -
ఎమ్మెల్యే పేరుతో నకిలీ ఫేస్బుక్.. డబ్బులు పంపాలంటూ
సాక్షి, కాకినాడ : కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేరుతో ఓ నకిలీ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ అయింది. ఎమ్మెల్యే పేరు, ఆయన ఫొటో వాడి సొమ్ములు గూగుల్‌పే చేయాలంటూ ఓ వ్యక్తి ద్వారంపూడి సన్నిహితులు, అభిమానులను మోసం చేసేందుకు ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే ఎమ్మెల్యే ద్వారంపూడి పేరుతో సోమవారం ఓ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ అయ్యింది. ఎమ్మెల్యే ఫొటో, ఆయన పేరుతోనే అకౌంట్‌ను గుర్తు తెలియని వ్యక్తి ఓపెన్ చేశాడు. మరికొద్ది సేపటికే తనకు డబ్బులు కావాలని గూగుల్‌పే ఉంటే చేయాలని పోస్టింగ్‌లు పెట్టాడు. సొమ్ము తిరిగి మరుసటి రోజు ఇచ్చేస్తానంటూ పోస్టులు కొనసాగించాడు. ఈ విషయాన్ని కొంతమంది ద్వారంపూడి అనుచరులు గుర్తించి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఈ సమాచారాన్ని ఎస్పీ నయీం అస్మి, ఇతర పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సదరు ఫేస్బుక్ అకౌంట్‌కు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని స్క్రీన్ షాట్లను తీసి ఎమ్మెల్యే పేరుతో పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ముమ్మిడి పవన్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలు మోసపోవద్దు నకిలీ ఫేస్బుక్ అకౌంట్లను చూసి ప్రజలు మోసపోవద్దని ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రజలకు సూచించారు. అటువంటి వ్యక్తులపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిని ఏ మాత్రం ఉపేక్షించబోమని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సొమ్ములు పంపాలంటూ పెట్టిన పోస్టింగులు -
కలకలం: కలెక్టర్ పేరుతో నకిలీ అకౌంట్
సాక్షి, నిజామాబాద్ : నానాటికీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను హ్యక్ చేయడం, నకిలీ అకౌంట్లు సృష్టించి నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. తాజాగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పేరుతో గుర్తు తెలియని వ్యక్తలు నకిలీ ఫేస్బుక్ అకౌంట్ తెరిచారు. బంధువులు ఆసుపత్రిలో ఉన్నారంటూ ఎనిమిది వేల రుపాయలు పంపాలని సంబంధిత ఫేస్బుక్ నుంచి మెసేజ్‌లు చేశారు. ఈ విషయంపై అప్రమత్తమైన కలెక్టర్ అసలు అది తన అకౌంట్ కాదని పేర్కొన్నారు. తన పేరుతో ఎవరు డబ్బులు అడిగిన పంపవద్దని స్పష్టం చేశారు. ఈ అకౌంట్‌పై పోలీసులకు కలెక్టర్ ఫిర్యాదు చేశారు. చదవండి: ఫేస్‘బుక్’ అయ్యారు -
‘ఐయామ్ 420’‘ప్రేమ’ వల వేసి..
గుంటూరు ఈస్ట్: ఇంజనీరింగ్ విద్యార్థిని నగ్న చిత్రాలను ‘ఐయామ్ 420’ పేరుతో ఇన్‌స్ట్ర్రాగామ్‌లో అప్లోడ్ చేసి.. ఆమెను బ్లాక్మెయిల్ చేసిన ఘటనలో మరో ఏడుగురు నిందితులను గుంటూరు అర్బన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితులైన వరుణ్, కౌశిక్‌లను జూన్ 27వ తేదీ అరెస్ట్ చేసిన విషయం విదితమే. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో పక్కా ఆధారాలు సేకరించి మిగిలిన నిందితుల్ని గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి సోమవారం వెల్లడించారు. (విద్యార్థిని నగ్న చిత్రాల కేసు: ఏడుగురు అరెస్ట్) ‘ప్రేమ’ వల వేసి.. ♦ ఓ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన వరుణ్ అనే విద్యార్థి ప్రేమ పేరుతో వలవేసి తన సహ విద్యార్థినిని వంచించాడు. ఆమె నగ్న వీడియో చిత్రీకరించి.. ఆమెను బ్లాక్మెయిల్ చేయడంతోపాటు తోటి విద్యార్థులకు ఫార్వార్డ్ చేశాడు. ♦ రెండో నిందితుడైన కౌశిక్ ద్వారా ఆ విద్యార్థిని నగ్న చిత్రాలు భాస్కర్, అతని ద్వారా ధనుంజయరెడ్డి, అతని నుంచి మణికంఠ, తులసీకృష్ణ, వారి నుంచి కేశవ్, క్రాంతి కిరణ్, రోహిత్ అనే విద్యార్థులకు చేరాయి. ♦ వీరిలో మణికంఠ, ధనుంజయరెడ్డి వాటిని ఆ యువతికి పంపి.. ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు. మిగిలిన ఐదుగురికి ఇదే విషయం చెప్పడంతో వాళ్లు కూడా ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. ♦ వారిలో మణికంఠ అనే విద్యార్థి‘ఐయామ్ 420’ అనే పేరిట ఫేక్ అకౌంట్ తెరిచి ఇన్‌స్ట్రాగామ్ ద్వారా ఆ యువతికి చెందిన నగ్న చిత్రాలను ఆమెకే పంపి చాటింగ్ చేశాడు. ♦ ఆమెను బ్లాక్మెయిల్ చేసి రూ.50 వేల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితురాలు అతడి బ్యాంక్ అకౌంట్ వివరాలు పంపాల్సిందిగా కోరగా.. నిందితులు దొరికిపోతామన్న భయంతో అకౌంట్ నంబర్ పంపకుండా మిన్నకుండిపోయారు. ♦ ఆ యువత ధైర్యం చేసి తనను బ్లాక్మెయిల్ చేస్తున్న విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పక్కా సాంకేతిక ఆధారాలతో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి ల్యాప్‌టాప్, 14 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ♦ ఫేక్ అకౌంట్‌ను ఛేదించడం, సాంకేతిక ఆధారాలను సేకరించడంలో అర్బన్ టెక్నికల్ అనాలసిస్ టీమ్ ఇన్చార్జి విశ్వనాథరెడ్డి, సాంకేతిక సిబ్బంది విశేష కృషి చేశారని ఎస్పీ చెప్పారు. ♦ నిందితులపై రౌడీషీట్లు తెరుస్తామని ఎస్పీ తెలిపారు. ♦ దీనివల్ల వారిపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని చెప్పారు. కేసును ఛేదించేందుకు కృషి చేసిన దిశ డీఎస్పీ ఎ.లక్ష్మీనారాయణ, ఎస్ఐలు కోటయ్య, బాజీ బాబులను ఎస్పీ అమ్మిరెడ్డి అభినందించారు. -
ఆ అకౌంట్ నాది కాదు.. స్వాతి క్లారిటీ
సినీ సెలబ్రిటీల పేరు మీద సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలను క్రియేట్ చేయటం అకతాయిలకు సరదాగా మారుతోంది. రోజురోజుకు ఈ ఫేక్ అకౌంట్ల సమస్య సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితానికి ముప్పుగా మారుతోంది. తాజాగా తన పేరుతో ట్విటర్లో నకిలీ ఖాతా చలామని అవుతున్నట్లు గుర్తించి హీరోయిన్ కలర్స్ స్వాతి తీవ్రంగా మండిపడ్డారు. ‘వారం రోజుల తర్వాత నేను ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చాను. @swathireddyoffl అనే ట్విటర్ అకౌంట్ నాది కాదు. అసలు నాకు ట్విటర్ ఖాతానే లేదు. అదేవిధంగా నాకు ఫేస్బుక్ అకౌంట్ కూడా లేదు. నా ఫేస్బుక్ అకౌంట్‌ను 2011లోనే తొలగించాను. నేను ఎందుకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను కలిగి ఉన్నానో తెలియదు. (తండ్రి పాత్రలో నటించడానికి రెడీ: కరణ్) కానీ, ఇలాంటి సందర్భంలో నాకు సంబంధించిన విషయాలను పంచుకోవడానికి ఇది ఉపయోగపడుతోంది. నా పేరుతో ట్విటర్లో నకిలీ అకౌంట్ ఉన్నట్లు తెలియజేసిన వారికి కృతజ్ఞతలు. నకిలీ ప్రొఫైల్స్, ఆర్టికల్స్, సోషల్ మీడియాలో పోస్టులు, నకిలీ సంబంధాలు ఉన్న ఈ కాలంలో ఉండటం కంటే పాత కాలంలోకి వెల్లడమే మంచిది’ అని ఆమె చెప్పారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. స్వాతి 2018లో వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం ఆమె ఏ సినిమాలో నటించలేదు. ఇక కార్తికేయ-2 చిత్రం ద్వారా స్వాతి మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. View this post on Instagram Checked Instagram today after a week and it’s this, @SwathiReddyOffl Twitter handle is NOT mine. Am NOT on Twitter. I never will be. Am NOT on Facebook. I quit it in 2011. ( I have a page handled by someone else, which is dormant ) And. I don’t know why am still on Instagram. Maybe it provides a voice to say the below. Those of you who brought it to my notice, thank you. This account keeps returning and coming to my notice. ( who are you boss? #Darr ) If you have Twitter and the energy, then please flag it, I have not had much power over what’s written and said about me in the past. I know this shouldn’t matter, it’s not a big deal, am not so relevant also currently blah blah but home girl is just tired of fake. I don’t understand the patience to be a fake me when the real me is not able to be herself completely online. Fake profiles, Fake articles, fake posts, fake relationship standards, fake images, fake positive. Take me back to the 90s where a landline ensured more quality conversations, power cuts because of a drizzle and not a quarantine meant bonding, softy ice cream and egg puffs was standard socialising and Doordarshan was enough stimulation. #Uff #Lol A post shared by Swathi (@swati194) on May 5, 2020 at 3:48am PDT -
హాయ్.. నేను విజయ్ దేవరకొండ!
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ పేరుతో ఫేస్బుక్లో ఓ నకిలీ పేజీ ఏర్పాటైంది. దీని ద్వారా యువతులకు వల వేస్తున్న మోసగాడు విజయ్ మాదిరిగా చాటింగ్స్ చేస్తున్నాడు. ఈ విషయం గుర్తించిన విజయ్ దేవరకొండ తన సహాయకుడినే మహిళగా రంగంలోకి దింపి చాటింగ్ చేయించారు. విషయం రూఢీ కావడంతో మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు తన మేనేజర్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు దర్యాప్తు చేపట్టారు. ఫేస్బుక్లో విజయ్ దేవరకొండ పేరుతో కొన్నాళ్ల క్రితం ఓ నకిలీ పేజ్ ఏర్పాటైంది. దీన్ని చూసిన అనేక మంది ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపిస్తున్నారు. ఇలాంటి రిక్వెస్ట్ల్లో యువతులకు సంబంధించినవి గుర్తిస్తున్న మోసగాడు వారితో మెసెంజర్ ద్వారా చాటింగ్‌కు దిగుతున్నాడు. (చదవండి : ‘క్లబ్ రౌడీ..మేం రెడీ... ’) కొన్ని రోజుల తర్వాత తొలుత తనకు డబ్బింగ్ చెప్పే ఆర్టిస్టుతో చాటింగ్ చేయాలని, పూర్వాపరాలు పరిశీలించిన అతడు చేసే సిఫార్సు ఆధారంగా నేను చాటింగ్ చేస్తానంటూ విజయ్ దేవరకొండ మాదిరిగా సదరు మోసగాడు చెప్తున్నాడు. ఆపై తన డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటూ ఓ ఫోన్ నంబర్ ఇస్తున్నాడు. దీంతో వాట్సాప్ ద్వారా చాటింగ్ చేస్తున్న యువతులతో అతగాడు ప్రేమ, పెళ్లి, సహజీవనం అంటూ ఎర వేయడం చేస్తున్నాడు. ఈ వ్యవహారాన్ని ఇటీవల కొందరు సన్నిహితులు విజయ్ దేవరకొండ దృష్టికి తీసుకెళ్లారు. సదరు మోసగాడికి చెందిన వాట్సాప్ నంబర్ సైతం అందించారు. దీంతో అసలు నిజం తెలుసుకోవాలని భావించిన ఆయన తన వద్ద సహాయకుడిగా పని చేసే గోవింద్‌ను యువతి మాదిరిగా ఆ నంబర్‌తో చాటింగ్ చేయమని సూచించారు. తన పేరు హేమ అంటూ పరిచయం చేసుకున్న గోవింద్ ఆ మోసగాడితో చాటింగ్ చేయగా... తాను విజయ్ దేవరకొండ డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని అంటూ పరిచయం చేసుకున్న అతగాడు ప్రేమ, పెళ్లి కథలే మొదలెట్టాడు. దీంతో పాటు ఆ మోసగాడు దాదాపు పది మంది యువతులను ఇలానే మోసం చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో మంగళవారం గోవింద్‌తో పాటు విజయ్ దేవరకొండ మేనేజర్ సైతం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల్ని కలిసి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసును సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడిని గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఆ పోస్ట్ నాది కాదు: టీనా దాబీ
న్యూఢిల్లీ: దేశం నలుమూలలా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అట్టుడుకుతున్న నేపథ్యంలో.. కొంతమంది దుండగులు ప్రముఖుల పేరుతో నకిలీ ఫేసుబుక్ ఖాతాలు సృష్టించి.. అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. తాజాగా మంగళవారం ఐఏఎస్ అధికారిణి టీనా దాబి పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించి పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా హిందీ భాషలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. 'ఐఏఎస్ టీనా దాబి' పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా వెలువడటంపై టీనా దాబీ ప్రముఖ మీడియా సంస్థ ఏఎన్ఐకు వివరణ ఇచ్చారు. అది నకిలీ ఖాతా అని, ప్రజలను పక్కదోవ పట్టించడానికి ఇలా తప్పుడు మార్గాలను ఎంచుకున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. కాగా ఢిల్లీకి చెందిన దళిత యువతి టీనా దాబి నాలుగు సంవత్సరాల క్రితం (2015) ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పరీక్షలో మొదటి ర్యాంకును కైవసం చేసుకొన్నారు. ఆ తర్వాత తన బ్యాచ్‌మేట్ అయిన కశ్మిరీ ఐఏఎస్ అథర్ ఖాన్‌ను ప్రేమించి.. గతేడాది పెళ్లి చేసుకున్నారు. తరువాత, ఇద్దరికి రాజస్థాన్‌లోని భిల్వారాలో పోస్టింగ్ లభించింది. కాగా టీనా భర్త అథర్ సివిల్ సర్వీసెస్‌లో రెండవ ర్యాంకు సాధించడం విశేషం. ఇక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మతపరమైన హింసను ఎదుర్కొని 2014 డిసెంబర్ 31 న లేదా అంతకు ముందు భారత్‌కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు త్వరితగతిన భారత పౌరసత్వం కల్పించేందుకు వీలుగా పౌరసత్వ సవరణ చట్టం రూపొందించిన విషయం తెలిసిందే. చదవండి: సివిల్స్ టాపర్ టీనా దాబి -
అక్రమ రవాణాపై ప్రభుత్వ కొరడా..
సాక్షి, అమరావతి : అక్రమ ఇసుక రవాణాపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నకిలీ ఐడీలతో ఇసుక బకింగ్ చేస్తున్న వారిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా పలువురు ఇసుక బ్రోకర్లు పెద్ద మొత్తంలో ఇసుక కొనుగొలు చేస్తుండటంతో పోలీసులు, మైనింగ్ అధికారులు ఆన్లైన్ ఐపీ అడ్రస్ ద్వారా వీరిని గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరుకు చెందిన కిశోర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. రూ. 1,27,000 విలువ గల ఇసుకను కీశోర్ నకిలీ ఐడీతో బుక్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇతని నుంచి 27 టన్నుల ఇసుకను, 7 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గన్నవరానికి చెందిన దుర్గారావుపై మరో కేసు నమోదు చేశారు. బినామీ పేర్లతో దుర్గారావు 3 లక్షల 80 వేల ఇసుక బుక్ చేసినట్లు తెలిపారు. మీ సేవ ఆపరేటర్‌గా పనిచేస్తూ నకిలీ బుకింగ్ చేసిన దుర్గారావుపై కేసు నమెదు చేశారు. -
వరుసకు చెల్లెలు అయిన మహిళ ఫొటోను..
గుంటూరు, పిడుగురాళ్లటౌన్: పట్టణానికి చెందిన తాడేపల్లి సందీప్‌కుమార్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు సీఐ వీరేంద్రబాబు తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ పట్టణానికి చెందిన తాడేపల్లి సందీప్‌కుమార్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి తన తండ్రితో పాటు వ్యాపారం చేస్తున్నాడు. 2017 డిసెంబర్ నెలలో ఓ ఫేక్ ఫేస్బుక్ అకౌంట్‌ను ఏర్పాటు చేసుకుని అప్పటినుంచి పట్టణంలోని వరుసకు చెల్లెలు అయిన ఓ మహిళ ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్‌చేసి ఆమెకు అసభ్యకరమైన సందేశాలను పంపిస్తున్నాడు. ఈ క్రమంలో మహిళ, ఆమె భర్త పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్డీపీఓ ఆదేశాల మేరకు సీఐ వీరేంద్రబాబు, ఎస్ఐ టీపీ నారాయణస్వామి, సిబ్బంది శాస్త్రీయ పరిశోధన ద్వారా కేసును దర్యాప్తు చేసి పూర్తి ఆధారాలతో గురువారం పిడుగురాళ్ల బస్టాండ్‌లో సందీప్‌ను అరెస్ట్‌చేశారు. నిందితుడిని శుక్రవారం కోర్టుకు హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. -
ఎలర్ట్: వరద సాయం పేరుతో నకిలీ ఖాతా
కేరళ వరద విపత్తును కూడా క్యాష్ చేసుకోవడానికి నకిలీ కేటుగాళ్లు సిద్ధమైపోయారు. ఎస్బీఐ ఖాతా ద్వారా వరద విరాళాలను అక్రమంగా వసూలు చేసేందుకు ఎత్తుగడవేశారు. అయితే ఈ ప్రయత్నాలకు ఎట్టకేలకు ఫుల్స్టాప్ పెట్టారు అధికారులు. కేరళ సీఎం డిస్ట్రబ్ రిలీఫ్ ఫండ్ పేరుతో నకిలీ బ్యాంకు ఖాతాను ఛేదించామని ఎస్బీఐ ప్రతినిధి వెల్లడించారు. 20025290179, త్రివేండ్రం పేరుతో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయింది. అయితే తమిళనాడులోని తిరుచిరాపల్లిలో బ్యాంకు బ్రాంచ్‌గా ఐఎఫ్ఎస్సీ కోడ్ ద్వారా గుర్తించారు. అయితే ఈ ఖాతాలో రెండు, మూడువేలు మాత్రమే ఉన్నాయని దీన్ని ఇప్పటికే బ్లాక్ చేశామని బ్యాంకు ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇంకా ఎలాంటి లావాదేవీలు సాధ్యంకాదని వివరించారు. దీనిపై విచారణకు ఆదేశించామన్నారు. అంతకుమించి వివరాలు వెల్లడించారు. సీఎం రిలీఫ్ ఫండ్ నిజమైన బ్యాంకు ఖాతా 67319948232 ముఖ్యమంత్రి అధికారిక ట్విట్టర్ ఖాతా, ఫేస్బుక్లో షేర్ చేశారు. మరోవైపు మోసపూరిత సందేశాలు / పోస్టర్లు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో నకిలీ ఖాతాలు, సందేశాలపట్ల అప్రమత్తంగా ఉండాలని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రజలకు సూచించింది. అలాగే సైబర్ నేరస్థులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు కఠిన ఆదేశాలు జారీ చేసింది. విరాళాలు పంపాల్సిన అసలైన బ్యాంకు ఖాతా, చిరునామా లబ్ధిదారు పేరు: ప్రిన్సిపల్ కార్యదర్శి (ఫిన్), కోశాధికారి, సీఎండీఆర్ఎఫ్ బ్యాంక్ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతా సంఖ్య: 67319948232 శాఖ: సిటీ బ్రాంచ్, తిరువనంతపురం IFSC: SBIN0070028 ఆఫ్‌లైన్ కాంట్రిబ్యూషన్: తిరువనంతపురానికి చేరేలా చెక్‌ను లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ను ఈ కింది చిరునామాకు పోస్ట్ చెయ్యవచ్చు / పంపవచ్చు చిరునామా: ప్రిన్సిపల్ కార్యదర్శి (ఫైనాన్స్) కోశాధికారి సీఎండీఆర్ఎఫ్ సెక్రటేరియట్, తిరువనంతపురం - 695 001 అలాగే సీఎం సహాయ నిధికి పంపే విరాళాలకు ఆదాయం పన్ను మినహాయింపు లభిస్తుంది. ఎస్బీఐతో పాటు పేటిమ్, భీమ్, తేజ్, ఫోన్ పే వంటి యునిఫైడ్ చెల్లింపు ప్లాట్‌ఫాంల ద్వారా కూడా సహాయాన్ని పంపించవచ్చు. -
ఫేస్.. బుక్..!
ఫేస్బుక్ ద్వారా తప్పుడు పనులు చేస్తున్నారా..? ‘గుర్తించలేరు.. పట్టుకోలేరు..’ అనుకుంటున్నారా..? సైబర్ ల్యాబ్ టీం.. మీపై ఓ కన్నేసి ఉంచింది...! ఏ క్షణాన్నయినా మీ ‘ఫేస్’ను ‘బుక్’ చేస్తుంది..!! నమ్మలేకపోతున్నారా..? అసాధ్యమనుకుంటున్నారా...? అయితే, మీరు తప్పకుండా ఇది చదవాల్సిందే... ఖమ్మంక్రైం: ఫేస్బుక్ నకిలీ అకౌంట్లతో అమ్మాయిలను మోసగిస్తున్న ఇద్దరిని ఖమ్మం సైబర్ ల్యాబ్ బృందం ‘బుక్’ చేసింది. ఈ సైబర్ ల్యాబ్ బృందాన్ని పోలీస్ కమిషనర్(సీపీ) తఫ్సీర్ ఇక్బా ల్ అభినందించారు. నగరంలో గురువారం విలేకరుల సమావేశంలో సీపీ వెల్లడించిన వివరాలు... ప్రేమ.. పెళ్లి.. ప్రమాదం.. లక్షలు.. స్వాహా ఖమ్మం నగరానికి చెందిన కృష్ణ (అసలు పేరు కాదు) ఫేస్బుక్ అకంట్ను ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ జులాయి హ్యాక్ చేశాడు. అందులోగల కృష్ణ, ఫోటోలు, వివరాలతో నకిలీ ఖాతా తెరిచాడు. తాను డాక్టర్‌నని పరిచయం చేసుకుంటూ ఎన్ఆర్ఐలు, డాక్టర్లయిన యువతులతో చాటింగ్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. వాట్సాప్ వాయిస్ కాల్స్, వాట్సాప్ చాటింగ్, ఫోన్ కాల్స్ ద్వారా వారికి దగ్గరయ్యాడు. ప్రేమ.. పెళ్లి పేరుతో వల విసిరాడు. పెళ్లి వరకు తీసుకొచ్చాడు. అప్పుడు, తనకు హార్ట్ ఎటాక్ వచ్చిందనో.. రోడ్డు ప్రమాదం జరిగిందనో అబద్ధాలు చెప్పేవాడు. అత్యవసర చికిత్స కోసం డబ్బు కావాలనేవాడు. ఇదంతా నిజమేనని అవతలి వారు నమ్మేవారు. ‘‘నువ్వు నా కాబోయే భార్యవే కదా..! నీ డబ్బొకటి.. నా డబ్బొకటా..?!’’ అనేవాడు. అవతలి వారు పూర్తిగా పడిపోయి, అతడి అకౌంట్లో డబ్బులు వేసేవారు. ఇలా కొందరిని నుంచి లక్షల రూపాయలు గుంజాడు. తన అకౌంట్ హ్యాక్ చేశారన్న విషయం ఖమ్మంలోని కృష్ణకు తెలియలేదు. దీనిని, విదేశాలలో సైకాలజిస్ట్‌గా పనిచేస్తున్న అతడి మిత్రురాలైన ఓ యువతి ముందుగా గమనించింది. వెంటనే కృష్ణను అప్రమత్తం చేసింది. అతడు నేరుగా పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్‌కు ఫిర్యాదు చేశాడు. కమిషనర్ ఆదేశాలతో కేసు నమోదైంది. ఖమ్మం సైబర్ ల్యాబ్ బృందం రంగంలోకి దిగింది. నిందితుడు కేవలం ఫేస్బుక్ లో చాటింగ్ చేస్తున్నాడు. వీడియో కాల్ మాట్లాడేవాడు కాదు. అయినప్పటికీ, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆ మోసగాడిది ఆదిలాబాద్ జిల్లాగా సైబర్ ల్యాబ్ బృందం కనిపెట్టింది. ఖాతా హ్యాక్.. ఫొటోల తస్కరణ... ఖమ్మం నగరానికి చెందిన ఓ యువతి ఫేస్బుక్ ఖాతాను ఒకడు హ్యాక్ చేశాడు. ఆమె పేరుతో అసభ్యకరమైన ఫొటోలను అందులో నుంచి అందరికీ పంపుతున్నాడు. ఒకసారి ఆమె ఫేస్బుక్ ఖాతాలో ఈ ఫోటోలను ఆమె సోదరుడు చూశాడు. ఆమెను నిలదీశాడు. తనకు ఏ పాపం తెలియదని, ఎవరో కావాలనే ఇలా చేస్తున్నారని ఆమె నెత్తీనోరు బాదుకుంది. తన సోదరుడితో కలిసి పోలీసులను ఆమె ఆశ్రయించింది. కేసు నమోదైంది. ఖమ్మం సైబర్ ల్యాబ్ కేంద్రం రంగంలోకి దిగింది. ఆ మోసగాడిని, ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉన్నట్టుగా కనుగొంది. మోసగాడి గుర్తింపు కారేపల్లికి చెందిన వాడి పేరు నవీన్ కుమార్. అదే ప్రాంతానికి చెందిన బాలికను ప్రేమపేరుతో నమ్మించాడు. ఆమెను తీసుకుని ఎటో వెళ్లిపోయా డు. తన సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. ఆ బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సైబర్ ల్యాబ్ బృందం రంగంలోకి దిగింది. ‘సోషల్ మీడియా అనాలిసిస్ టూల్స్’ ద్వారా వారిద్దరూ తిరువూరు వద్ద ఉన్నట్టుగా కనిపెట్టారు. అతడిని వెంటనే అరెస్ట్ చేశారు. ఇప్పటికి 43 కేసులు కొలిక్కి.. జిల్లాలోని సైబర్ ల్యాబ్ బృందం గణనీయ ఫలితాలు సాధిస్తోంది. ఇది ఇప్పటివరకు 43 కేసులను ఛేదించింది. ఈ సైబర్ ల్యాబ్ బృందం ఎస్ఐ చంద్రమోహన్, సిబ్బంది శ్రీనివాస్, సురేష్, ప్రసాద్, వైవి.కృష్ణారావు, రాధాకృష్ణను పోలీస్ కమిషనర్(సీపీ) తఫ్సీల్ ఇక్బాల్ ప్రత్యేకంగా అభినందించారు. ‘‘సోషల్ మీడియా ద్వారా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దిగితే... సోషల్ అనాలసిస్ టూల్స్ ద్వారా మొత్తం సమాచారం మాకు కొన్ని క్షణాల్లోనే తెలిసిపోతుంది, కాబట్టి.. అనవసరమైన విషయాలు, సంఘ వ్యతిరేకమైన పోస్టింగులతో ఇబ్బందులుపాలు కావద్దు’’ అని సీపీ హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ సురేష్‌కుమార్ పాల్గొన్నారు. -
ట్రస్టు సొమ్ముపక్కదారి..
జిల్లా కేంద్రంలోని మెథడిస్ట్ చర్చి నిధులు దుర్వినియోగమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రస్టు ఆస్తులను కాపాడాల్సిన బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు జట్టుగా మారి.. రూ.5.2 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా పక్కదారి పట్టించారు. దీనికి సంబంధించి.. ట్రస్టు సభ్యులు, విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ : అమెరికాకు చెందిన క్రాఫర్డ్ అనే మహిళ తన కూతురు హాల్దా పేరిట వికారాబాద్‌లో మిషన్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. 1913లో పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపాన 5.7 ఎకరాల విస్తీర్ణంలో సేవలు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు వైద్యంతో పాటు విద్య అందించాలనే సంకల్పంతో పాఠశాలను నెలకొల్పారు. అంతేకాకుండా మెథడిస్ట్ చర్చి, ఆస్పత్రి, విద్యా విభాగాల్లో పనిచేసే సిబ్బంది కోసం క్వార్టర్స్ నిర్మించి చేయూతనిచ్చారు. మొత్తం 120 ఎకరాల్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదల అభ్యున్నతికి పాటుపడ్డారు. ప్రజల కనీస అవసరాలను తీర్చడం కోసం విద్య, వైద్యంతో వేలాది మందికి ప్రాణదానం, అక్షర జ్ఞానం అందించారు. దాదాపు వంద ఏళ్లకు పైగా సమాజ సేవలో ఆపన్నహస్తం అందించారు. కొద్ది సంవత్సరాల క్రితం క్రాఫర్డ్డ్ కన్నుమూశారు. ఆ తర్వాత ట్రస్తు ఆస్తుల పరిరక్షణ కోసం హైదరాబాద్ రీజియన్‌గా తీసుకొని ట్రస్టీని ఏర్పాటు చేశారు. క్రాఫర్డ్ ఉన్నన్ని రోజులు విద్య, వైద్యం, సేవల పరంగా ఈ ప్రాంత ప్రజలు ఎంతో లబ్ధిపొందారు. అనంతరం కాలక్రమేణా ఈ సేవలకు గండిపడింది. పాఠశాలలో ఒకప్పుడు 4 వేల మంది విద్యార్థులు చదువుకుంటే.. ప్రస్తుతం వీరి సంఖ్య 40కి చేరింది. వైద్యాస్పత్రిలో నిధులు లేక సేవలు నీరుగారుతున్నాయి. దుర్వినియోగం ఇలా... మెథడిస్ట్ ఆస్తులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు దేశ వ్యాప్తంగా ఏ రీజియన్‌లో జరిగినా సెం ట్రల్ ట్రెజరీ ముంబైలో ఉన్న ఖాతాలోకి డబ్బులు వెళ్లాలనే నిబంధన (బుక్ ఆఫ్ డిసిప్లిన్) బైలాస్ ప్రకారం ఉంది. కానీ దీనికి భిన్నంగా.. పరిహారం కింద వచ్చిన డబ్బులను డీఎస్ తిమోథీ హైదరాబాద్‌లోని ఎస్బీఐ చిరగల్లిబ్రాంచ్లో ఉన్న ఖాతా నంబర్ 35736421990లోకి దారి మళ్లించారు. మెథడిస్ట్ చర్చి పేరు మీద వచ్చిన నష్టపరిహారాన్ని ఈయన సెంట్రల్ ట్రెజరీ అకౌంట్ ముంబైలోని ఖాతాలో జమ చేయకుండా హైదరాబాద్ రీజినల్ కాన్ఫరెన్స్ పేరున ఉన్న ఖాతాలో డిపాజిట్ చేయడంలో కీలక పాత్ర పోషించారని స్థానిక సంఘా లు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇదిలా ఉండ గా సదరు వ్యక్తి రూ.25 లక్షలను ఇటీవల పట్టణానికి చెందిన పారిశ్రామిక కంపెనీ ఖాతాలో జమచేయడంతో పాటు.. ఈ మొత్తాన్ని లంచాల రూ పంలో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉన్నతాధికారులకు అందజేశారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా డివిజన్ పరిధిలోని రెవెన్యూ విభాగంలో పని చేస్తున్న ఓ వ్యక్తికే ఎక్కువ మొత్తంలో ముట్టజెప్పినట్లు సమాచారం. ఈ అన్యాయాన్ని జీర్ణించుకోలేని పలువురు చర్చి సభ్యులు సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఇన్‌కంట్యాక్స్ శాఖలకు ఫిర్యాదు చేశారు. చెక్కు రూపంలో పరిహారం... ప్రభుత్వం నుంచి మంజూరైన నష్టపరిహారాన్ని వికారాబాద్ ఆర్డీఓ చెక్కు రూపంలో అందజేశారని ట్రస్టు సభ్యులు చెప్పారు. ఈ నిధుల నుంచి డీఎస్ తిమోథీ రూ.25 లక్షలు వికారాబాద్‌లోని ఓ సుద్ద ఫ్యాక్టరీకి ఆర్టీజీఎస్ చేశారన్నారు. మరో వ్యక్తికి రూ.50 లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేసినట్లు వివరించారు. డబ్బులు కొల్లగొట్టిన వారిని ఊరికే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ట్రస్టు సభ్యులు చెబుతున్నారు. దీనిపై సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొంటున్నారు. ఇందుకోసం చర్చి మెంబర్లతో సంతకాలు సేకరిస్తున్నామని, నిధుల పక్కదారిపై త్వరలోనే ఫైల్ సిద్ధం చేసి సీబీఐకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. డబ్బులు కాజేశారు మెథడిస్ట్ చర్చి ఆస్తులు అమ్మడానికి ఎవరికీ హక్కులేదు. ఒక వేళ అమ్మాలి అనుకుంటే చర్చి కమిటీ అప్రూవల్ తీసుకోవాలి. కొంతమందితో కుమ్మౖక్కైన బిషప్ రూ.5 కోట్లకు పైగా డబ్బులను కాజేశారు. నేను ఇక్కడే పుట్టా.. ఇక్కడే పెరిగా.. చిన్ననాటి నుంచే చర్చి సభ్యుడిగా ఉన్నా. పది నెలల క్రితం చర్చి పేరున ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులను స్థానిక ఆర్డీఓతో కలిసి డీఎస్ తిమోథీ, బిషప్ స్టీఫెన్, దయానంద్ కొల్లగొట్టారు. దీనిపై సీబీఐకి ఫిర్యాదు చేస్తాం. – జేమ్స్, చర్చి సభ్యుడు బిషప్, డీఎస్ హస్తం ఉంది మెథడిస్ట్ ఆస్తులకు సంబంధించి దేశ వ్యాప్తంగా ఏ రీజియ న్లో ఆర్థిక లావాదేవీలు జరిగినా ముంబైలోని సెంట్ర ల్ అకౌంట్లో జమ చేయాలి. దీనికి విరుద్ధంగా చర్చి డబ్బులను హైదరాబాద్‌లోని ఎస్బీఐ అకౌంట్లోకి వేయ డం వెనక బిషప్తో పాటు డీఎస్ హస్తం ఉంది. ఇక్కడి ఆస్తులు అమ్మాల్సిన అవసరం ఏమీ లేదు. రోడ్డుకు సంబంధించిన నష్టపరిహారాన్ని వాళ్లు సొంత అకౌంట్లో వేసుకునేందుకు వీల్లేదు. హైదరాబాద్‌లోని చిరగల్లిలో ఉన్న ఎస్బీఐ అకౌంట్లో తిమోథీ పేరు ఉన్న ఖాతాలో జమ కావడం ఏమిటో అర్థం కావడం లేదు.ఒకసారి రూ.69 లక్షలు, మరోసారి రూ.4.69 కోట్లు జమయ్యాయి. – సుధాకర్, చర్చి సభ్యుడు