
సాక్షి, అమరావతి : అక్రమ ఇసుక రవాణాపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నకిలీ ఐడీలతో ఇసుక బకింగ్ చేస్తున్న వారిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా పలువురు ఇసుక బ్రోకర్లు పెద్ద మొత్తంలో ఇసుక కొనుగొలు చేస్తుండటంతో పోలీసులు, మైనింగ్ అధికారులు ఆన్‌లైన్ ఐపీ అడ్రస్ ద్వారా వీరిని గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరుకు చెందిన కిశోర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. రూ. 1,27,000 విలువ గల ఇసుకను కీశోర్ నకిలీ ఐడీతో బుక్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇతని నుంచి 27 టన్నుల ఇసుకను, 7 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గన్నవరానికి చెందిన దుర్గారావుపై మరో కేసు నమోదు చేశారు. బినామీ పేర్లతో దుర్గారావు 3 లక్షల 80 వేల ఇసుక బుక్ చేసినట్లు తెలిపారు. మీ సేవ ఆపరేటర్‌గా పనిచేస్తూ నకిలీ బుకింగ్ చేసిన దుర్గారావుపై కేసు నమెదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment