
అవన్నీ నమ్మొద్దు..!
గాసిప్
మనీషా కోయిరాలా ఒకప్పటి అగ్రశ్రేణి హీరోయిన్. నిజజీవితంలో చాలామంది అమ్మాయిలకు ఎదురయ్యే అనుభవమే ఆమెనూ ఇబ్బంది పెట్టింది. చాలామంది ఫేక్ అకౌంట్‌తో ఎదుటివాళ్లను నమ్మిస్తుంటారు. కానీ ఇక్కడ ఆమె పేరు చెప్పి, తానే మనీషానంటూ చాలామంది తప్పుడు యవ్వారాలకు పాల్పడుతున్నారట. అచ్చం... ఆమె పంపినట్టే సందేశాలు పంపుతున్నారట. ఆమె నడుపుతున్నట్టే ఫేస్‌బుక్ అకౌంట్ నడుపుతున్నారట. అలాంటి సంఘటనలు ఆమె దృష్టికి కూడా వచ్చాయట.
ఆమె పంపని సందేశాలు పంపడం, ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఆమె రాసుకున్నట్లే గాసిప్‌లు రాయడం చేస్తున్నారట. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు ఇదేమిటంటూ షాక్‌కు గురవుతున్నారట. చనువున్న కొందరు ఆమెనే నేరుగా నిలదీస్తున్నారట. ఆమె కూడా తెలియక ఏమిటని అడిగితే... ఈ వ్యవహారాలు ఆమె దృష్టికి వచ్చాయట. దాంతో అలర్ట్ అయిన ఆమె ‘ఈ ఫేక్ గాసిప్స్ నమ్మకండి’ అంటూ స్వయంగా ప్రకటించాల్సి వచ్చిందట!