
సాక్షి, నిజామాబాద్ : నానాటికీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను హ్యక్ చేయడం, నకిలీ అకౌంట్‌లు సృష్టించి నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. తాజాగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పేరుతో గుర్తు తెలియని వ్యక్తలు నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ తెరిచారు. బంధువులు ఆసుపత్రిలో ఉన్నారంటూ ఎనిమిది వేల రుపాయలు పంపాలని సంబంధిత ఫేస్‌బుక్ నుంచి మెసేజ్‌లు చేశారు. ఈ విషయంపై అప్రమత్తమైన కలెక్టర్ అసలు అది తన అకౌంట్ కాదని పేర్కొన్నారు. తన పేరుతో ఎవరు డబ్బులు అడిగిన పంపవద్దని స్పష్టం చేశారు. ఈ అకౌంట్‌పై పోలీసులకు కలెక్టర్ ఫిర్యాదు చేశారు. చదవండి: ఫేస్‘బుక్’ అయ్యారు
Comments
Please login to add a commentAdd a comment