Nizamabad Collector
-
కడ్తా తీస్తే కాల్ చేయండి
సాక్షి, ఇందూరు : కడ్తా పేరిట రైతులను దోచుకుంటున్న వారిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. కడ్తా తీసే మిల్లర్లపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. నాణ్యమైన ధాన్యానికి కూడా రైస్ మిల్లర్లు కడ్తా తీస్తే రైతులు కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. కడ్తా తీసిన వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ ఆదివారం క్యాంప్ కార్యాలయం నుంచి వ్యవసాయ, సహకార, రెవెన్యూ, సివిల్ సప్లయి, ఐకేపీ అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో సేకరిస్తున్న నాణ్యమైన ధాన్యాన్ని కడ్తా లేకుండా తీసుకునేలా అన్ని చర్యలు జిల్లా యంత్రాంగం తీసుకుంటోందని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. అయితే, నాణ్యంగా ఉన్న ధాన్యానికి రైస్ మిల్లర్లు కడ్తా తీసుకున్నా, కొనుగోలు కేంద్రాల్లో ఇతర ఏ సమస్యలున్నా పరిష్కరించడానికి రైతుల కోసం కాల్ సెంటర్ (18004256644, 73826 09775)ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయా నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. రైతులు పంట కోసే ముందు హార్వెస్టర్ యంత్రాల్లో సరైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. యంత్రం వేగం ఏ–2, ఏ–3లలో, బ్లోయర్ వేగం 19–26 మధ్యలో ఉంచి కోతకు వెళ్లాలని, తద్వారా నాణ్యమైన ధాన్యం వస్తుందని కలెక్టర్ వివరించారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు వచ్చిన తరువాత వ్యవసాయ అధికారులు పరిశీలించి నాణ్యతను ధ్రువీకరిస్తారని, నాణ్యత సరిగా లేకుంటే కడ్తా ఎంత తీయాలో సూచిస్తారన్నారు. వర్షాలు, తదితర కారణాల వలన నాణ్యత తక్కువగా ఉంటే అందులో ఐదు నుంచి పది శాతానికి మించి నాణ్యత తగ్గదన్నారు. రైస్ మిల్లర్లు కూడా వ్యవసాయ అధికారుల ధ్రువీకరణ ఆధారంగా ధాన్యాన్ని తీసుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి కడ్తా తీసుకుంటే మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో కొనుగోలు కేంద్రం బాధ్యులు, ఇతరులపై కూడా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. సంబంధిత శాఖల అధికారులపై కూడా చర్యలుంటాయన్నారు. రైతులు కూడా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలని, చెన్నీ తప్పనిసరిగా పట్టాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాబ్‌లో ఓపీఎంఎస్ ఎంట్రీ ఎప్పటికప్పుడు చేసి రైతులకు చెల్లింపులు జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు సమీక్షించుకుంటూ రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. -
కలకలం: కలెక్టర్ పేరుతో నకిలీ అకౌంట్
సాక్షి, నిజామాబాద్ : నానాటికీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను హ్యక్ చేయడం, నకిలీ అకౌంట్లు సృష్టించి నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. తాజాగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పేరుతో గుర్తు తెలియని వ్యక్తలు నకిలీ ఫేస్బుక్ అకౌంట్ తెరిచారు. బంధువులు ఆసుపత్రిలో ఉన్నారంటూ ఎనిమిది వేల రుపాయలు పంపాలని సంబంధిత ఫేస్బుక్ నుంచి మెసేజ్‌లు చేశారు. ఈ విషయంపై అప్రమత్తమైన కలెక్టర్ అసలు అది తన అకౌంట్ కాదని పేర్కొన్నారు. తన పేరుతో ఎవరు డబ్బులు అడిగిన పంపవద్దని స్పష్టం చేశారు. ఈ అకౌంట్‌పై పోలీసులకు కలెక్టర్ ఫిర్యాదు చేశారు. చదవండి: ఫేస్‘బుక్’ అయ్యారు -
బోధన్ ఏఈ సస్పెన్షన్, కలెక్టర్ ఉత్తర్వులు జారీ
సాక్షి, బోధన్(బోధన్): బోధన్ పట్టణంలోని పాండుఫారం శివారులో నూతనంగా నిర్మించిన తెలంగాణ బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణంలో అవకతవకలకు పాల్పడిన ఏఈ నాగేశ్వర్‌రావ్‌ను నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి సస్పెండ్ చేశారు. గురువారం తెలంగాణ బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల కాంప్లెక్స్‌ను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. చేపట్టిన పనులకు మెజర్మెంట్ బుక్‌లో రికార్డు చేసిన పనులకు మధ్య వ్యత్యాసాన్ని పరిశీలించి గుర్తించారు. రికార్డులను నమోదు చేసిన తెలంగాణ రాష్ట్ర ఈడబ్ల్యూఐడీసీ నిజామాబాద్ డివిజన్‌కు చెందిన ఏఈ ఎన్. నాగేశ్వర్‌రావ్‌ను సస్పెండ్ చేయాల్సిందిగా ఆ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తిచేసిన పనులకు సంబంధించిన కొలతల్లో భారీగా వ్యత్యాసం చూపుతూ రికార్డులు నమోదు చేయడం, అధికారులను తప్పుదోడ పట్టించడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఈని సస్సెండ్ చేసి విచారణకు ఆదేశాలు జారీచేశారు. అధికారులు తమకు కేటాయించిన విధుల పట్ల బాధ్యతాయుతంగా ఉంటూ అధికారుల ఆదేశాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. -
‘రూ.599 కోట్లలో 10 శాతం కుడా ఖర్చు చేయలేదు’
సాక్షి, నిజామాబాద్ : ధాన్యం కొనుగోళ్లలో రైతు సమస్యలపై గురువారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో బీజేపీ ఎంపీ దర్మపురి అర్వింద్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. కడ్తా పేరుతో 3 నుండి 5కిలోల వరకు తరుగు తీస్తున్నారని, దీని వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల వలస కార్మికుల కోసం కేంద్రం ఇచ్చిన రూ. 599 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం కుడా ఖర్చు చేయలేదని దుయ్యబట్టారు. వలస కార్మికుల కోసం కేటాయించిన 599 కోట్ల నుంచే 1500 చొప్పున అందరికి ఇస్తున్నారని ఆరోపించారు. కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. (మే 17 వరకు లాక్డౌన్ పొడగింపు) -
లాక్డౌన్: కానిస్టేబుల్‌పై లారీ డ్రైవర్ దాడి
సాక్షి, బోధన్ రూరల్: అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద వాహనాన్ని ఆపకుండా దూసుకెళ్లడమే కాకుండా కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డాడో లారీ డ్రైవర్. కరోనా నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూర అంతరాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలు జిల్లాలోకి రాకుండా నియంత్రిస్తున్నారు. అయితే, మంగళవారం తెల్లవారుజామున బోధన్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న లారీ (పీబీ13ఏఎల్9637)ని పోలీసులు ఆపేందుకు యత్నించారు. అయితే, సదరు లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అతివేగంగా దూసుకెళ్లాడు. దీంతో పోలీసులు వెంబడించి లారీని పట్టుకుని వివరాలు సేకరిస్తుండగా పంజాబ్‌కు చెందిన లారీ డ్రైవర్ గురుప్రీత్‌సింగ్ కర్రలతో దాడికి దిగాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్ జీవన్ తలకు గాయాలయ్యాయి. దీంతో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సయ్యద్ అహ్మద్ తెలిపారు. (మీడియా మౌనం.. అసలు కిమ్‌కు ఏమైంది? ) సాక్షి, ఇందూరు(నిజామాబాద్ ): ఉద్యోగులు అవసరం లేకున్నా ఆన్ డ్యూటీ స్టిక్కర్లు వాహనాలపై వేసుకుని బయట తిరిగితే క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నారాయణ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా అధికారులకు సర్క్యూలర్ ద్వారా ఆదేశాలిచ్చారు. ప్రభుత్వం నిర్ధేశించిన లాక్డౌన్ ఆదేశాలకు అనుగుణంగా కొన్ని శాఖల్లో రొటేషన్ ప్రకారం ఉద్యోగులను కార్యాలయాలకు విధులకు అనుమతించిందన్నారు. కానీ కొందరు ఉద్యోగులు విధుల్లో లేకున్నా కూడా వాహనాలకు ఆన్‌డ్యూటీ స్టిక్లర్లు అతికించుకుని అనవసరంగా రోడ్లపై తిరుగుతున్నారని, ఈ విషయా లు జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చిందని, ఇ టువంటి ఉద్యోగులపై యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. (స్వీట్హార్ట్.. డిన్నర్ ఎక్కడ చేద్దాం' ) ఈ విధంగా ప్రవర్తించడం లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. అంతేకాక వైరస్ వ్యాప్తికి కారణం కావడంతో పాటు ఆ కుటుంబాల్లో వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశం కలుగుతుందని తద్వారా ఆ కు టుంబాలకు కూడా ప్రమాదకరమని తెలిపారు. అయితే అత్యవసర విధులు నిర్వహించే పో లీ సు, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, అగి్నమాపక, తదితర శాఖల్లో పనిచేసే అధికారులు, సిబ్బందికి మాత్రమే కార్యాలయాల వేళలు త ర్వాత కూడా విధులకు హాజరు కావడానికి ప్రభుత్వ ఆదేశాలున్నాయన్నారు. కావునా ఆ యా కార్యాలయాలకు చెందిన సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు. అదే విధంగా కొందరు అధికారుల కుటుంబ సభ్యులు, ప్రైవేట్ వ్యక్తులు కూడా ప్రభుత్వ వాహనాల్లో నిబంధనలకు విరుద్దంగా స్టిక్కర్లు అతికించుకుని బయట తిరుగుతున్నారని, అలాంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. లాక్డౌన్ నిబంధనలు ఎవరు అతిక్రమించినా అధికారు లు, ఉద్యోగులు, సిబ్బందిపైన సీరియస్‌గా కఠనంగా చర్యలు తీసుకుంటామన్నారు. (‘పుష్ప’ సర్ప్రైజ్: బన్నీకి లవర్‌గా నివేదా ) ప్రజలు తిరిగే ప్రాంతాల్లో జాగ్రత్త.. కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రజలు వచ్చే అన్ని ప్రాంతాలతో పాటు రైతులు తీసుకొచ్చే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కరోనా వైరస్ నిరోధించడానికి అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధిహామీ ప నులు, వ్యవసాయ పనులు చేయడానికి కూలీ లు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అక్కడ భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు.బ్యాంకులు, కిరాణా దుకాణా లు, మాంసం దుకాణాల వద్ద జనం ఎక్కు ఉంటారని ఇక్కడ మరింత పటిష్టంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటు సంబంధిత యాజమాన్యాలు కూడా వారి ప్రాంతాలకు వచ్చే ప్రజలు క్రమ శిక్షణ, భౌతిక దూరం పాటించేలా చూసుకోవాలన్నారు. దుకా ణాల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాల న్నారు. ఈ జాగ్రత్త చర్యలు తీసుకోని వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. (ప్రారంభమైన కేంద్ర కేబినెట్ భేటీ ) -
క్యూలో నిల్చుని.. నేలపై కూర్చుని..
నిజామాబాద్ అర్బన్: శుక్రవారం ఉదయం 8 గంటలు.. ఓ వ్యక్తి సైకిల్‌పై సాదాసీదాగా సర్కారు దవాఖానాకు వచ్చాడు. ‘జలధార’వద్దకు వెళ్లి లీటర్ నీటికి ధర ఎంత? అని ఆరా తీశాడు. ఓపీ విభాగం వద్ద రోగులతో పాటే లైన్లో నిల్చుని మాట కలిపాడు. మెట్ల దగ్గర కింద కూర్చొని.. ఏం పెద్దయ్యా.. ఆరోగ్యం బాగా ఉందా అని అడిగాడు. వైద్యులు బాగానే చూస్తున్నారా..? అని అడిగి తెలుసుకున్నాడు. అక్కడి నుంచి గైనిక్, జనరల్ తదితర విభాగాల్లోనూ కలియ తిరిగాడు. అయితే, గంట తర్వాత ఆస్పత్రిలో ఒక్కసారిగా హడావుడి మొదలైంది. వచ్చిన వ్యక్తి కలెక్టర్ అని తెలియడంతో వైద్యులు, సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఉరుకులు పరుగులు పెట్టారు. అప్పటి దాకా తమతో మాట్లాడిన వ్యక్తి కలెక్టర్ అని తెలిసి రోగులు, వారి బంధువులు అవాక్కయ్యారు. నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శుక్రవారం ఉదయం జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ జిల్లాకు బదిలీపై వచ్చి మూడు రోజులవుతోంది. తాను బస చేసిన ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి సైకిల్‌పై బయలుదేరి ఉదయం ఎనిమిది గంటలకల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. పార్కింగ్‌లో సైకిల్ స్టాండ్ వేసి మొదట ఆస్పత్రి ఆవరణలో జలధార కేంద్రానికి వెళ్లారు. లీటరు మంచినీరు రెండు రూపాయలకు విక్రయించడాన్ని గుర్తించారు. రూపాయికే విక్రయించాలి కదా అని అడగ్గా.. నిర్వాహకుడు రెండు రూపాయలే అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. అక్కడి నుంచి ఆస్పత్రిలోని ఓపీ విభాగం వద్ద రోగులతో పాటే లైన్లో నిల్చుని మాట కలిపారు. వారి ఆరోగ్య సమస్యలేంటో తెలుసుకున్న ఆయన.. వైద్యులు బాగానే చూస్తున్నారా.. సౌకర్యాలు సరిగా ఉన్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి గైనిక్, జనరల్ తదితర విభాగాల్లో కలియ తిరిగాడు. బాలింతలతో మాట్లాడారు. నాలుగైదు చోట్ల మెట్ల వద్ద, వార్డుల వద్ద కింద కూర్చొని రోగులతో మాట్లాడారు. ఓ రోగి బంధువును తనతో పాటు తీసుకుని వెళ్లి వార్డులను తనిఖీ చేశారు. జనరిక్ మందుల షాపులను పరిశీలించారు. వార్డు బాయ్‌లు, నర్సులు, సెక్యూరిటీ గార్డులతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ శిబిరం వద్ద వివరాలు తెలుసుకున్నారు. అయితే.. గంట తర్వాత ఆస్పత్రిలో ఒక్కసారిగా హడావుడి మొదలైంది. కలెక్టర్ వచ్చాడని తెలియడంతో వైద్యులు, సిబ్బంది అలర్ట్ అయ్యారు. అప్పటి దాకా తమతో మాట్లాడిన వ్యక్తి కలెక్టర్ అని తెలిసి రోగులు, వారి బంధువులు సంభ్రామాశ్చర్యానికి లోనయ్యారు. 111 సిబ్బందికి మెమోలు కలెక్టర్ మూడు గంటల పాటు తనిఖీలు నిర్వహించి వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. విధుల్లో గైర్హాజరైన 111 మంది సిబ్బందికి మెమోలు జారీ చేశారు. జలధార కేంద్రాన్ని సీజ్ చేశారు. -
‘26 మందిని సస్పెండ్ చేసి వచ్చాను’
‘అనుమతి లేకుండా జిల్లా అధికారులు, ఆయా శాఖల ఉద్యోగులు, సిబ్బంది విధులకు గైర్హాజరైతే కఠినంగా ఉంటా.. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండి ఆలస్యంగా వస్తే ఊరుకోను... ఈ విషయాల్లో ఇప్పటికే ములుగు జిల్లాలో 26 మందిని సస్పెండ్ చేసి వచ్చాను’. అంటూ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సి నారాయణరెడ్డి సున్నితంగా హెచ్చరించారు. విధులను నిర్లక్ష్యం చేయకుండా ఫ్రెండ్లీగా పని చేసుకుందామన్నారు. సాక్షి, నిజామాబాద్ : జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సి నారాయణ రెడ్డి తొలిరోజే తన మార్క్‌ను ప్రదర్శించారు. కల్టెరేట్‌లోని అన్ని శాఖలను సందర్శించి ఉద్యోగులతో మాట్లాడారు. ఎన్నికల సెక్షన్లో సంబంధిత తహసీల్దార్, కిందిస్థాయి ఉద్యోగులు చెప్పే వివరాలు పొంతన లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అధికారి లేకపోవడంతో ఎక్కడికి వెళ్లారని కిందిస్థాయి సిబ్బందిని ప్రశ్నించి ఎవరి అనుమతి తీసుకుని వెళ్లారో తనకు తెలపాలన్నారు. కలెక్టరేట్ నుంచి డివిజన్, మండల స్థాయి అధికారులతో రెండు గంటలకు పైగా పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అన్ని శాఖలకు వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి, ప్రతి విషయాన్ని తనకు తెలియజేయాలన్నారు. అనంతరం నూతన కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణాన్ని పరిశీలించారు. బాధ్యతలు చేపట్టగానే జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి మంగళవారం కలెక్టరేట్లోని అన్ని జిల్లా కార్యాలయాలను తిరిగి పరిశీలించారు. ముందుగా కలెక్టర్ పరిపాలనా విభాగంలోని డీఆర్వో చాంబర్‌కు వెళ్లారు. అక్కడి నుంచి సెక్షన్ల వారీగా అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నా రు. అక్కడే ఉన్న కాల్ సెంటర్‌ను పరిశీలించారు. ఎన్నికల సెక్షన్లో సంబంధిత తహసీల్దా ర్, కిందిస్థాయి ఉద్యోగులు చెప్పే వివరాలు పొంతన లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. టాయిలెట్ల నుంచి దుర్వాసన రావడంతో వాటిని క్లీన్‌గా ఉంచాలని ఆదేశించారు. అనంతరం స్ట్రాంగ్ రూం, వీడి యో కాన్ఫరెన్స్ గదిని పరిశీలించారు. పక్కనే గల రికా ర్డు గదికి వెళ్లారు. అక్కడ రికార్డులు సక్రమంగా లేకపోవడంతో రికార్డులను భద్రంగా ఉంచేందుకు అవసరమైన నిధులు తానిస్తానన్నారు. కలెక్టరేట్ పరిసరాలు పిచ్చి మొక్కలు, చెత్తతో నిండి ఉండడంతో అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్ రెండు, మూడు రోజుల్లోగా కార్యాలయం పరిశుభ్రంగా కనిపించాలని, చెట్టు దిమ్మెలకు రంగులు వేయాలని కలెక్టరేట్ పరిపాలనా అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్ సమావేశ మందిరాన్ని, అక్కడి నుంచి పెన్షన్, డీఆర్డీఓ, ఉపాధిహామీ, ఐసీడీఎస్, ఇతర విభాగాలను పరిశీలించారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ కార్యాలయాలు పరిశీలించారు. ప్రగతిభవన్ దగ్గర పాడైన నీటి యంత్రాన్ని తొలగించాలని లేదా కొత్తదైనా ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ కార్యాలయం, ప్రగతిభవన్ గోడలపై ఉన్న మొక్కలు, చెట్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు. బీసీ వెల్ఫేర్ ఉద్యోగులకు హెచ్చరిక... బీసీ సంక్షేమ శాఖ కార్యాలయానికి వెళ్లగానే జిల్లా అధికారి శంకర్ లేకపోవడంతో ఎక్కడికి వెళ్లారని కిందిస్థాయి సిబ్బందిని ప్రశ్నించారు. కోర్టు పనిమీద వెళ్లారని చెప్పారు. ఎవరి అనుమతి తీసుకుని వెళ్లారో తనకు తెలపాలన్నారు. అక్కడే ఉద్యోగులతో మాట్లాడిన కలెక్టర్... అనుమతి లేకుండా ఎవరైనా విధులకు గైర్హాజరైతే ఊరుకోనని, కఠినంగా ఉంటానని హెచ్చరించారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్వో అంజయ్య ఉన్నారు. ప్రతి శాఖ వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేయాలి ప్రతి శాఖ జిల్లా స్థాయిలో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి తన ఫోన్ నంబర్, సీసీ నంబరు యాడ్ చేసి శాఖా పరంగా జరుగుతున్న ప్రతి విషయం తనకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి డివిజన్, మండల స్థాయి అధికారులతో రెండు గంటలకు పైగా పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.అధికారికంగా నిర్వహించే అన్ని కార్యక్రమాలకు ప్రొటోకాల్ పాటించాలని, డివిజన్లో ఆర్డీవోను, జిల్లాలో డీఆర్వో కార్యాలయాన్ని సంప్రదించాలన్నా రు. అధికారులు ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించి సాయంత్రం కార్యాలయ విధులు నిర్వహించుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో సిబ్బందిచే బాగా పని చేయించడానికి ఎంపీడీఓలు, తహసీల్దా ర్లు, మున్సిపల్ కమిషనర్లు పట్టు సాధించాలన్నారు. సెలవు రోజుల్లో ఇబ్బంది పెట్టనని, ఆరోగ్యం పాడు చేసుకోవాల్సి పని లేదని, పని రోజుల్లో మాత్రం అనుమతి లేకుండా గైర్హాజరైతే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఏ స్థాయి సమస్యలు ఆ స్థాయిలోనే పరిష్కారం కావాలని, జిల్లా స్థాయికి వస్తే మాత్రం మొహమాటం లేకుండా కలానికి పని చెప్పా ల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజావాణి అద్భుతంగా జరగాలన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి షెడ్యులు విడుదలైనందున వార్డుల వారీగా ఫొటో ఎలక్ట్రోల్ జాబితా 30న ప్రచురించాలన్నారు. ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిని నియమిస్తామన్నా రు. నూరుశాతం తప్పుల్లేకుండా ఓటర్ల జాబితా సిద్ధ చేసుకోవాలని, అభ్యంతరాలన్నీ రిజిస్టర్లలో నమోదు చేసి పరిష్కరించాలన్నారు. అలాగే పల్లె ప్రగతి కార్యక్రమానికి మించినది మరొకటి లేదని, గ్రామాల్లో మార్పులు తేవడానికి కృషి చేయాలన్నారు. అర్హత గల రైతులందరికీ పాసు పుస్తకాలివ్వాలని, ఇబ్బందులు పెడితే ఉపేక్షించనన్నారు. కలెక్టరేట్ భవన సముదాయం పరిశీలన... జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల వద్ద జరుగుతున్న నూతన కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణాన్ని కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. అధికారులతో కలియతిరిగి అన్ని వివరాలు, మ్యాప్‌ను పరిశీలించారు. వీలైనంత త్వరగా భవనాన్ని పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల్లో జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో అంజయ్య, డీఎఫ్ఓ సునీల్, జడ్పీ సీఈఓ గోవింద్, డీపీఓ జయసుధ, ఇతర జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తదితరులు పాల్గొన్నారు. -
ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ రామ్మోహన్ రావు
నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో తీరు మారలేదు. ఆస్పత్రిని కలెక్టర్ రామ్మోహన్ రావు గతంలో ఆకస్మిక తనిఖీ చేసిన సమయంలో పలువురు వైద్యులు అనధికారికంగా విధులకు హాజరుకాని విషయం వెలుగులోకి వచ్చింది. కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్యాధికారులు గైర్హాజరైన వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి హెచ్చరించారు. శనివారం కలెక్టర్ మరోసారి ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేయగా అదే పరిస్థితి ఎదురైంది. పలువురు వైద్యులు గైర్హాజరయ్యారు. కలెక్టర్ ఆస్పత్రిలోని వివిధ వార్డులను సందర్శించగా, అత్యవసర విభాగంలో ఒకరికి బదులు మరొకరు విధులు నిర్వర్తిస్తూ కనిపించారు. దీంతో కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్వక్తం చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ అనుమతి లేకుండానే మరొకరికి బదులు గా అత్యవసర విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ యుగేంధర్, అదేవిధంగా మెటర్నిటీ వార్డులో విధులకు గైర్హాజరైన వైద్యులు కృష్ణ కూమారి, నస్రీన్ ఫాతిమా, భీంసింగ్, స్టాఫ్ నర్సు ప్రేమలతలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంఐసీ, ఐసీయూ, ఆర్థోపెడి క్ విభాగాలతో పాటు వంటగది, బ్లడ్‌బ్యాంకు, సదరం క్యాంపును కలెక్టర్ పరిశీలించారు. వివిధ విభాగాల వార్డుల్లో ఆస్పత్రి సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. రోగులను పరామర్శించారు. రోగులకు ఎదురయ్యే సమ స్యలను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నా రు. అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి సమ స్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రి సిబ్బంది, అధికారులు సమస్వయంతో కలిసి పని చేయాలన్నారు. రోగులకు అసాకర్యం కలుగకుండా సేవలు అందించాలన్నారు. ప్రతిరోజు ఆస్పత్రి ని శుభ్రంగా ఉంచాలని, ఆస్పత్రి ఆవరణలో ఎక్కడకూడా చెత్త, ఇతర వస్తువులు కనిపించ కూడదన్నారు. వార్డుల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను నోటీసు బోర్డులో ప్రదర్శించాలన్నా రు. వార్డుల్లో స్పేస్ విభజన సక్రమంగా లేదని క లెక్టర్ పేర్కొన్నారు. ఒక్కో వార్డులో ఒక్కో విధం గా ఉందన్నారు. పరిశీలించి తగు విధంగా ఏ ర్పాటు చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చే స్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీలో ఆస్పత్రి సూ పరింటెండెంట్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, ఆర్ఎంఓ ఉంటారన్నారు. ఈ కమిటీ పదిహే ను రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. ఆస్పత్రిలో పది లిఫ్ట్‌లు ఉండగా, రెండు మాత్రమే పని చే స్తున్నాయి. మిగతా లిఫ్ట్‌లకు వెంటనే మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాల ని కలెక్టర్ సూచించారు. వైద్య విద్యార్థులకు మె నూ ప్రకారం భోజనం, టిఫిన్ అందించాలన్నారు. సదరం క్యాంపులో దివ్యాంగులకు వేగంగ సర్టిఫికెట్లు జారీ చేయాలన్నారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించి ఆస్పత్రి అ భివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ సూచించారు. -
పాసు పుస్తకాలు ఇవ్వాల్సిందే !
సాక్షి, నిజామాబాద్ అర్బన్ : రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా అర్హులైన వారందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు అందజేయాలని ఇదివరకే చాలా సార్లు చెప్పాను. అయినా తీరు మార్చుకోవడం లేదు. మండలాల్లో సమస్యలు పరిష్కరించడం లేదని రైతులు జిల్లా కేంద్రానికి వచ్చి మొర పెట్టుకుంటున్నారు. మండలాల్లో మీరేం చేస్తున్నట్లు..? అంటూ జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు తహసీల్దార్లపై సీరియస్ అయ్యారు. మంగళవారం ప్రగతిభవన్‌లో తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రైతుల రికార్డులు ఇంకా సరిచేయకపోవడం వల్ల ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో జిల్లా నలు మూలల నుంచి రైతులు వ్యయ ప్రయాసలతో జిల్లా కేంద్రానికి వచ్చి విన్నపాలు అందజేస్తున్నారని తెలిపారు. మండల స్థాయిలో పరిష్కరించడం లేదన్నారు. కోర్టు స్టే ఇచ్చినవి అనర్హత కేసులు తప్ప మిగతా అన్నింటినీ వెంటనే పరిష్కరించాలని ఇప్పటికే పలుసార్లు వీడియో కాన్ఫరెన్స్‌లో ద్వారా స్వయంగా అలాగే మండలాలను తనిఖీ చేసిన సందర్భంగా ఆదేశాలు జారీ చేసినా కూడా నిర్లక్ష్యంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటగిరిల వారీగా అర్హత గల వారందరికీ పట్టా పాసు పుస్తకాలు సత్వరమే అందజేయాలని, లేని పక్షంలో ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం నిర్ణయం తీసుకుని అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హత గలవారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
మొదటి రౌండ్‌కు రెండు గంటలు
ఇందూరు (నిజామాబాద్ అర్బన్) : నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఓట్ల లెక్కంపులో మొదటి రౌండ్ ఫలితం రావడానికి రెండు గంటలకు పైగా పట్టవచ్చని కలెక్టర్ రామ్మోహన్ రావు పేర్కొన్నారు. రెండో రౌండ్ నుంచి సమయం తగ్గుతుందన్నారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు 16 రౌండ్లు, జగిత్యాల, కోరుట్లకు 15 రౌండ్లు, బాల్కొండ, బోధన్‌లకు 14 రౌండ్లు, ఆర్మూర్‌కు 13 రౌండ్లు ఉంటాయన్నారు. కాగా కౌంటింగ్ ఏజెంట్ల నియామకం కోసం అభ్యర్థులు మూడు రోజుల ముందుగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. శనివారం కలెక్టరేట్లోని ప్రగతిభవన్‌లో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఈ నెల 23న కౌటింగ్ నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. పార్లమెంట్ పరిధిలో నిజామాబాద్‌లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు డిచ్పల్లిలోని సీఎంసీలో, జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలకు జగిత్యాలలో లెక్కింపు జరుగుతుందన్నారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం అవుతుందని, ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 18 టేబుళ్లు ఏర్పాటు చేస్తామని, అదనంగా మరో టేబుల్ ఆర్వో కోసం ఉంటుందన్నారు. ఇందుకు గాను పోటీ చేసే అభ్యర్థులు ఏజెంట్లను నియమించుకోవాలన్నారు. ఇందుకు ఫారం–18 ద్వారా ఏఆర్వోకు దరఖాస్తు చేయాలన్నారు. నిజామాబాద్‌కు ప్రత్యేకంగా 36 టేబుళ్లు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతివ్వాలని ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపించామని, అనుమతి వస్తే ఏర్పాటు చేస్తామన్నారు. కౌంటింగ్ సందర్భంగా ప్రతి ఒక్కరూ రహస్యాన్ని పాటించాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కౌంటింగ్ హాల్ లోనికి సెల్‌ఫోన్ తనుమతి లేదన్నారు. అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తయిన తరువాత ప్రతి నియోజకవర్గం పరిధిలో ర్యాండంగా ఐదు వీవీ ప్యాట్లను ఒక దాని తరువాత ఒకటి లెక్కించనున్నట్లు తెలిపారు. మొదట కౌటింగ్‌కు, వీవీప్యాట్ కౌటింగ్లో తేడా వస్తే, వీవీప్యాట్ ఓట్లనే ప్రమాణికంగా తీసుకుంటాన్నా రు. అయితే 2013 నుంచి ఇప్పటి వరకు కౌంటింగ్‌లో ఎలాంటి తేడాలు రాలేదన్నారు. పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చుల వివరాలు అందించాలి– కలెక్టర్ రామ్మోహన్ రావు ఇటీవల నిర్వహించిన నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ రోజు వారి ఖర్చుల వివరాలను వచ్చే జూన్ 21వ తేదీలోగా అందజేయాలని కలెక్టర్ రామ్మోహన్ రావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖర్చుల వివరాలను సమర్పించడంలో సందేహాలు, సలహాలు తీసుకోవడానికి ఎన్నికల వ్యయ నోడల్ అధికారి(జిల్లా సహకార) కార్యాలయంలో ప్రత్యేకంగా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే పోటీ చేసిన అభ్యర్థులకు ఈ–ఫైలింగ్‌పై అవగాహన కల్పించడానికి జూన్ 15 అవగాహన కార్యక్రమం, 18న ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున అభ్యర్థులందరూ తప్పక హాజరు కావాలన్నారు. -
కలెక్టర్‌కు ఈసీ పిలుపు
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ పార్లమెంట్ స్థానం రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావుకు ఎన్నికల సంఘం నుంచి పిలుపందింది. ఉన్నఫలంగా హైదరాబాద్ రావాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో జిల్లా కలెక్టర్ సోమవారం సాయంత్రం హుటాహుటిన హైదరాబాద్ తరలివెళ్లారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ తీరును పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు సోమవారం హైదరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌కు ఈ పిలుపు అందినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ప్రత్యేక పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఏర్పాట్లపై చర్చించేందుకు కలెక్టర్‌ను పిలుపందినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నిజామాబాద్ కలెక్టర్‌తో పాటు, జగిత్యాల జిల్లా కలెక్టర్ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కలెక్టర్ హైదరాబాద్ వెళ్తూ సమీక్ష సమావేశాల నిర్వహణను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లకు అప్పగించారు. కాగా తమ సమస్యను జాతీయ స్థాయిలో నిరసన తెలిపేందుకు పసుపు, ఎర్రజొన్న రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో అభ్యర్థుల సంఖ్య అనూహ్యంగా 185 చేరిన విషయం విధితమే. ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలింగ్‌ను బ్యాలెట్ ద్వారా నిర్వహించాలా? ఈవీఎంల ద్వారా నిర్వహించాలా అనేదానిపై ఎన్నికల సంఘం ఇటీవలే స్పష్టత ఇచ్చింది. ఎం–3 ఈవీఎంలతో పోలింగ్ జరపాలని కూడా ఆదేశించింది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది. చెకింగ్‌కు సమాయత్తం.. అభ్యర్థుల సంఖ్య 185 చేరడంతో ఈ పార్లమెంట్ స్థానానికి 26,820 బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఈసీ ఆదేశించింది. అలాగే 2,240 కంట్రోల్ యూనిట్లు, 2,600 వీవీపీఏటిలను అందించాలని ఎన్నికల సంఘం ఈసీఐఎల్‌ను ఆదేశించింది. త్వరలోనే ఈ పరికరాలన్నీ జిల్లాకు చేరనున్నాయి. వీటి పనితీరును పరిశీలించాల్సి ఉంటుంది. వీటి పరిశీలన, పోలింగ్ నిర్వహణకు 600 మంది ఇంజనీర్లు కావాలని ఎన్నికల సం ఘం గుర్తించింది. ఈ ఈవీఎంల ఫస్ట్‌లెవల్ చెకింగ్, ర్యాండమ్ చెకింగ్ వంటి ప్రక్రియలు నిర్వహించాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం ప్ర త్యేక ఇంజనీర్లు జిల్లాకు రానున్నారు. ఈ మేరకు పరిశీలనకు ఏర్పాట్లు సిద్ధంగా ఉం డాలని జిల్లా అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఆయా రెవెన్యూడివిజన్ల పరిధిలో పోలింగ్ కేంద్రాలను మరోమారు పరిశీలించి రెండు రోజుల్లో నివేదిక అందజేయాలని సహాయ రిటర్నింగ్ అధికారుల ను జేసీ ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై జరిగిన సమీక్ష సమావేశంలో నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ జాన్‌శాంసన్, ఆర్మూర్, నిజామాబాద్ ఆర్డీవో లు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ట్రాన్స్‌పోర్టు డిప్యూటీ కమిషనర్ డి.వెంకటేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ మహమ్మద్ ముర్తుజా, జిల్లా ఉన్నతాదికారులు చతుర్వేది, స్రవంతి, ఉదయ్‌ప్రకాష్, రాజారాం తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్లపై దృష్టి.. నిజామాబాద్ లోక్‌సభ స్థానం ఎన్నికల పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగం వేగవంతం చేసింది. బ్యాలెట్ ద్వారానే పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష జరిపారు. తన చాంబర్లో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో సమావేశమయ్యారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే అధికారులకు, సిబ్బందికి ఇప్పటికే మొదటి దశలో శిక్షణ ఇచ్చారు. తాజాగా రెండో దశ శిక్షణ తరగతులను నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు. పోలింగ్ అధికారులు, సిబ్బందిని, అలాగే ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామగ్రిని తరలించేందుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేయాలని రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. ఈసారి పోలింగ్ నిర్వహణకు వాహనాల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఒక్కో పోలింగ్ కేంద్రానికి కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్లతో పాటు, 12 బ్యాలెట్ యూనిట్లను తరలించాల్సి ఉంటుంది. దీంతో సాధారణం కంటే రెట్టింపు స్థాయిలో వాహనాలు అవసరం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. -
అపోహలకు తావులేదు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): రానున్న ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంలు అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పాటు పారదర్శకంగా పని చేస్తాయని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. ఈవీఎంల ప్రాథమిక పరిశీలన పూర్తయిన సందర్భంగా సోమవారం నగరం లోని వినాయక్‌నగర్‌లో గల ఈవీఎం గోదాములో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఈవీఎంల పనితీరుపై అవగాహన కల్పించారు. భారత ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ ఈ ఈవీఎంలను కొత్తగా సిద్ధం చేసిందని, వీటిలో ఎటువంటి అనుమానాలకు, అపోహలకు తావు లేదన్నారు. వీటికి ఎటువంటి ఇంటర్నెట్ సౌకర్యం లేనందున, వేరే చోట నుంచి నడిపే అవకాశం లేదన్నారు. ఏ నంబరు ఈవీఎం ఎక్కడికి వెళ్తుందో, వాటి ర్యాండమైజేషన్ వరకు తెలియదని, ఏ అభ్యర్ధి పేరు ఏ క్రమ సంఖ్యలో వస్తుందో ముందస్తుగా అంచనా వేయలేమన్నారు. ట్యాంపరింగ్‌కు ఎట్టిపరిస్థితుల్లో అవకాశం లేదని వివరించారు. రాజకీయ పార్టీల ద్వారా ప్రజలకు వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈవీఎంలకు వీవీ ప్యాట్ల సదుపాయం అందుబాటులోకి వచ్చిందన్నారు. దీనిలో ఏ అభ్యర్థికి, ఏ గుర్తుకు ఓటు వేశామో ఆ ఓటరుకు ఏడు సెకండ్ల పాటు కనిపిస్తుందని చెప్పారు. ప్రతి బ్యాలెట్ యూనిట్లో 16 బటన్లు ఉంటాయని, ఒక బటన్ నోటా ఉంటుందన్నారు. పోటీలు ఉన్న అభ్యర్థులెవరూ నచ్చకుంటే ఓటరు 16వ బటన్ నోటా నొక్కవచ్చన్నారు. 15 మందికంటే ఎక్కువ అభ్యర్థులు పోటీలో ఉంటే మరో బ్యాలెట్ యూనిట్ ఉపయోగిస్తారన్నారు. వీటి ప్రథమస్థాయి చెకింగ్‌లో సిబ్బంది, ఇంజనీర్లు, అధికారులు చాలా కష్టపడి కొద్ది రోజుల్లోనే పూర్తి చేసినందుకు కలెక్టర్ వారిని అభినందించారు. కార్యక్రమంలో డీఆర్ఓ అంజయ్య, రెవెన్యూ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
వైభవంగా గురుద్వారా ప్రారంభం
బోధన్ టౌన్(బోధన్) : బోధన్‌లో నూతనంగా నిర్మించిన గురుద్వారాాను ఆదివారం సిక్కుమత ఆచారం ప్రకారం మతగురువులు బాబా రామ్‌సింగ్‌జీ (హజారే సాహెబ్– సచ్‌ఖండ్)బల్విందర్ సింగ్ బాబాజీ (లంగార్ నాందేడ్) ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆమేర్‌లు ప్రారంభించారు. తెలంగాణ, మహరాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి అనేక మంది సిక్క మతగురువులు, సిక్కులు వేలసంఖ్యలో తరలివచ్చారు. గురుద్వారా ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేకపూజలు నిర్వహించారు. గురుద్వారాా కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. మత ఆచారం ప్రకారం ఎమ్మెల్యేకు తల్వార్ చేతికి అందించారు. జ్ఞాపికను అందజేశారు. భక్తి కీర్తలను మధ్య ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. బోధన్‌లో గురుద్వారాా నిర్మాణం చేపట్టడం అభినందనీయం అన్నారు. గురుద్వారాా ప్రహరి గోడ నిర్మాణానికి తనవంతు నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. గురుద్వారాను దర్శించుకున్న కలెక్టర్ బోధన్‌లోని గురుద్వారాాను కలెక్టర్ రామ్మోహన్‌రావ్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్‌కు గురుద్వారాా కమిటీ ఆధ్వర్యంలో జ్ఞాపికను అందజేశారు. అనంతరం బీజేపీ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి గురుద్వారాను సందర్శించుకున్నారు. కనులపండుగగా శోభాయాత్ర గురుద్వారాా ఆలయ ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా బోధన్‌లో నిర్వహించిన శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. ఈ శోభాయ్రాతలో రథంపై సిక్కుల పవిత్ర గ్రంథం ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన మతుగురువుల పవిత్ర వాహనాలతో పాటు గుర్రాలు యాత్రలో ఉన్నాయి. భాజాబజంత్రీల మధ్య సాగిన శోభాయాత్రలో యువకులు తల్వార్‌తో విన్యాసాలు ప్రదర్శించారు. ఈ శోభాయాత్ర గురుద్వారాా నుంచి ప్రారంభమై అంబేద్కర్ చౌరస్తా మీదుగా పాతబస్టాండ్, హెడ్ పోస్టాఫీసు మీదుగా కొత్త బస్టాండ్ నుంచి గురుద్వారాా వరకు సాగింది. ఈ యాత్రలో యువకులు, మహిళలు, మత గురువులు, గురుద్వారాా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
అనాధలను ఆదరిస్తున్న కలెక్టర్ యోగితా రాణి
-
రైతు ప్రయోజనమే లక్ష్యంగా..
♦ మార్కెట్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు ♦ త్వరలో యార్డులో అత్యాధునిక నాణ్యత పరీక్షా ల్యాబ్ ♦ సమష్టి కృషితోనే ఈ–నామ్‌కు జాతీయ అవార్డు సాక్షి, నిజామాబాద్ :ఆరుగాలం శ్రమించి పండించిన పంట క్రయవిక్రయాల్లో రైతుల ప్రయోజనమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అన్నారు. రైతుల ఉత్పత్తుల కొనుగోళ్లను జాతీయస్థాయిలో విస్తృతం చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. జిల్లా అధికార యంత్రాంగం సమష్టి కృషితోనే నిజామాబాద్ మార్కెట్ యార్డుకు ఈ–నామ్ అమలులో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిందని ఆమె పేర్కొన్నారు. ఈ అవార్డు తనపై బాధ్యతను పెంచిందని అన్నారు. సివిల్ సర్వీసెస్ డే పురస్కరించుకుని ప్రధానమంత్రి విశిష్టసేవ అవార్డును నరేంద్రమోడీ చేతులు మీదుగా అందుకున్న అనంతరం కలెక్టర్ యోగితారాణా సోమవారం జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో మాట్లాడారు. సాక్షి : జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్నందుకు ఎలా ఫీలవుతున్నారు? కలెక్టర్ : జాతీయ స్థాయి అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇందులో జిల్లా అధికార యంత్రాంగం కృషి ఉంది. ఈ అవార్డు రావడానికి మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీష్‌రావు, డైరెక్టర్ లక్ష్మిబాయిలు ఎంతో ప్రోత్సహించారు. సాక్షి : అవార్డు రావడానికి మీరు ప్రత్యేకంగా చేపట్టిన చర్యలేంటీ? కలెక్టర్ : ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాం. ఈ–నామ్ విధానంపై వివిధ స్థాయిల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాం. ఈ విధానంతో ఉండే ప్రయోజనాలను సహకార సంఘాల ద్వారా రైతులకు వివరించాం. ఇటు వ్యాపారులను కూడా ఆ దిశగా ప్రోత్సహించాం. సాక్షి : జిల్లాలోని పసుపు రైతులు ఇక్కడ సరైన ధర రావడం లేదని మహారాష్ట్రలోని సాంగ్లీకి వెళ్తున్నారు కదా? కలెక్టర్ : వాస్తవమే.. సాంగ్లీకి వెళ్లే రైతుల సంఖ్య సుమారు 20 శాతం వరకు తగ్గిందని భావిస్తున్నా. సాంగ్లీలో ఉన్న ధర ప్రకారం ఇక్కడే కొనుగోలు చేసేలా అక్కడి వ్యాపారులతో కూడా మాట్లాడుతాం. సాక్షి : డీపీసీ విధానం ద్వారా కమీషన్ ఏజెంట్లకు చెక్ పడిందని భావిస్తున్నారా? కలెక్టర్ : యార్డులో ప్రత్యేకంగా డైరెక్ట్ పర్చేస్ సెంటర్(డీపీసీ)ని ఏర్పాటు చేశాం. ఈ కేంద్రంలో రైతులు తమ ఉత్పత్తులను విక్రయిస్తే కమీషన్ ఏజెంట్లకు రెండు శాతం కమీషన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా, నేరుగా ఖరీదుదారులకు విక్రయించేలా చర్యలు చేపట్టాం. ఈ అంశంపై యార్డుకు వచ్చే రైతులకు అవగాహన కల్పించాం. చాలా వరకు రైతులకు ప్రయోజనం చేకూరుతోంది. సాక్షి : ఇప్పటికీ కొందరు ఖరీదుదారులు సిండికేట్‌గా మారి ధర దోపిడీకి పాల్పడుతున్నారు కదా? కలెక్టర్ : ప్రస్తుతానికి స్థానిక వ్యాపారులు మాత్రమే ఈ–బిడ్డింగ్‌లో ధర కోట్ చేస్తున్నారు. దీంతో సిండికేట్‌గా అయ్యేందుకు అవకాశం ఉంది కావచ్చు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఖరీదుదారులు ఆన్లైన్ బిడ్డింగ్‌లో పాల్గొంటే ఈ సిండికేట్ వ్యవహారానికి పూర్తిగా చెక్ పడుతుంది. సాక్షి : ఆమ్చూర్ కొనుగోళ్లలో కమీషన్ ఏజెంట్లు క్యాష్ కటింగ్ పేరిట పది శాతం వరకు రైతులను దోపిడీ చేస్తున్నారు. కొందరు మార్కెట్ సిబ్బంది కొందరు ఏజెంట్లతో కుమ్మక్కయ్యారనే విమర్శలున్నాయి? కలెక్టర్ : వివిధ జిల్లాల నుంచి రైతులు ఆమ్‌చూర్‌ను విక్రయించేందుకు ఇక్కడికి వస్తున్నారు. కమీషన్ ఏజెం ట్లు రెండు శాతానికి మించి కమీషన్ వసూలు చేయరాదు. అంతకంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్య లు తీసుకుంటాం. మార్కెటింగ్ శాఖ సిబ్బంది అక్రమాలకు పాల్పడితే విచారణ చేసి చర్యలు చేపడుతాం. సాక్షి : యార్డులో ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? కలెక్టర్ : క్రయవిక్రయాల ప్రక్రియను పూర్తిగా కంప్యూటరైజ్డ్ చేశాము. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించడంతో కమీషన్, హమాలీ, చాటా వంటి చార్జీల పేరుతో ఇష్టారాజ్యంగా రైతుల చెల్లింపుల్లో కోత వి«ధించడానికి చెక్ పడింది. రైతుల ఉత్పత్తులకు ఈ–లాట్, ఈ–బిడ్డింగ్ వంటి ఏర్పాట్లు చేయడంతో ధర నిర్ణయంలో పారదర్శక పెరిగింది. ఆయా ఉత్పత్తులకు వచ్చిన ధర సంబంధిత రైతులకు ఎస్ఎంఎస్ రూపంలో వచ్చేలా ఏర్పాట్లు చేశాం. సాక్షి : రానున్న రోజుల్లో ఈ విధానం పకడ్బందీగా అమలయ్యేందుకు తీసుకోబోయే చర్యలు? కలెక్టర్ : యార్డులో అత్యాధునికమైన ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తాం. ఈ ల్యాబ్ రైతుల ఉత్పత్తుల నాణ్యతను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఉంచుతుంది. తద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా కొనుగోలుదారులు ఈ సరుకుల నాణ్యతను పరిశీలించి ఆన్లైన్లో బిడ్డింగ్ చేసేలా ఏర్పాటు చేస్తాం. కోల్డ్ స్టోరేజ్‌ను నిర్మించి ధర రాని పక్షంలో రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునేలా చర్యలు తీసుకుంటాం. నిజామాబాద్ యార్డుకు ప్రస్తుతం వస్తున్న పంటలే గాక ఇతర పంటల క్రయవిక్రయాల వేదికగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నాం. -
వరద పరిస్ధితిని సమీక్షిస్తున్నాం