
కలెక్టర్ రామ్మోహన్‌రావ్‌కు జ్ఞాపికను అందజేస్తున్న గురుద్వారా కమిటీ సభ్యులు
బోధన్ టౌన్(బోధన్) : బోధన్‌లో నూతనంగా నిర్మించిన గురుద్వారాాను ఆదివారం సిక్కుమత ఆచారం ప్రకారం మతగురువులు బాబా రామ్‌సింగ్‌జీ (హజారే సాహెబ్– సచ్‌ఖండ్)బల్విందర్ సింగ్ బాబాజీ (లంగార్ నాందేడ్) ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆమేర్‌లు ప్రారంభించారు. తెలంగాణ, మహరాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి అనేక మంది సిక్క మతగురువులు, సిక్కులు వేలసంఖ్యలో తరలివచ్చారు. గురుద్వారా ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేకపూజలు నిర్వహించారు.
గురుద్వారాా కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. మత ఆచారం ప్రకారం ఎమ్మెల్యేకు తల్వార్ చేతికి అందించారు. జ్ఞాపికను అందజేశారు. భక్తి కీర్తలను మధ్య ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. బోధన్‌లో గురుద్వారాా నిర్మాణం చేపట్టడం అభినందనీయం అన్నారు. గురుద్వారాా ప్రహరి గోడ నిర్మాణానికి తనవంతు నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.
గురుద్వారాను దర్శించుకున్న కలెక్టర్
బోధన్‌లోని గురుద్వారాాను కలెక్టర్ రామ్మోహన్‌రావ్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్‌కు గురుద్వారాా కమిటీ ఆధ్వర్యంలో జ్ఞాపికను అందజేశారు. అనంతరం బీజేపీ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి గురుద్వారాను సందర్శించుకున్నారు.
కనులపండుగగా శోభాయాత్ర
గురుద్వారాా ఆలయ ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా బోధన్‌లో నిర్వహించిన శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. ఈ శోభాయ్రాతలో రథంపై సిక్కుల పవిత్ర గ్రంథం ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన మతుగురువుల పవిత్ర వాహనాలతో పాటు గుర్రాలు యాత్రలో ఉన్నాయి. భాజాబజంత్రీల మధ్య సాగిన శోభాయాత్రలో యువకులు తల్వార్‌తో విన్యాసాలు ప్రదర్శించారు.
ఈ శోభాయాత్ర గురుద్వారాా నుంచి ప్రారంభమై అంబేద్కర్ చౌరస్తా మీదుగా పాతబస్టాండ్, హెడ్ పోస్టాఫీసు మీదుగా కొత్త బస్టాండ్ నుంచి గురుద్వారాా వరకు సాగింది. ఈ యాత్రలో యువకులు, మహిళలు, మత గురువులు, గురుద్వారాా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment