Gurudwara
-
మన్మోహన్ చితాభస్మం నిమజ్జనం
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చితాభస్మాన్ని కుటుంబసభ్యులు సిక్కు ఆచారాల ప్రకారం ఆదివారం మజ్జు కా తిలా గురుద్వారా సమీపంలోని యమునా నదిలో కలిపారు. ఆదివారం ఉదయం నిగమ్‌బోధ్ ఘాట్‌లో చితాభస్మాన్ని కుటుంబసభ్యులు సేకరించారు. మనోహ్మన్ భార్య గురుశరణ్ కౌర్, ముగ్గురు కుమార్తెలు ఉపీందర్ సింగ్, దమన్ సింగ్, అమృత్ సింగ్ తమ బంధువులతో కలిసి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. సిక్కు మతాచారాలను అనుసరించి జనవరి ఒకటో తేదీన మన్మోహన్ అధికార నివాసం మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లోని మూడో నంబర్ భవనంలో ‘అఖండ్ పథ్’జరపనున్నారు. దీంతోపాటు, జనవరి 3న భోగ్, అంతిమ్ అర్దాస్, కీర్తన్ కార్యక్రమాలను పార్లమెంట్ కాంప్లెక్స్ సమీపంలోని రకాబ్ గంజ్ గురుద్వారా నిర్వహించనున్నారు. కాగా, ఆదివారం జరిగిన కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలెవరూ పాల్గొనకపోవడాన్ని బీజేపీ తప్పుపట్టింది. అత్యంత గౌరవనీయుడైన సింగ్ జీ పట్ల కాంగ్రెస్ తీరు విచారకరమని పేర్కొంది. -
గురుద్వారా సేవా కార్యక్రమంలో మోదీ! ఏంటీ లంగర్ .?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ బిహార్‌లోని పాట్నాలో పర్యటించారు.ఆ నేపథ్యంలో అక్కడ గురుద్వారాను సందర్శించారు. అక్కడ సిక్కులు ఎక్కుగా మట్లాడుకునే లంగర్ సేవాలో పాలు పంచుకున్నారు ప్రధాని మోదీ. అక్కడ ఆయనే స్వహస్తాలతో తయారు చేసిన భోజనాన్ని అక్కడ కమ్యూనిటీలకు వడ్డించారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఏంటీ లంగర్ సేవా? ఏం చేస్తారంటే..ఇక్కడ హరిమందిర్ జీ పాట్నా సాహిబ్ గురుద్వారాలో సేవా స్ఫూర్తిని ప్రతిబింబించేలా లంగర్ సేవా అనే సమాజ సేవాలో పాల్గొన్నారు మోదీ. అక్కడ మోదీ సిక్కు మాదిరిగా నారింజరంగు తలపాగా ధరించి చక్కగా గరిటి తిప్పతూ వంటలు చేశారు. ఇక్కడ లంగర్ అంటే.. గురుద్వారాకి సంబంధించిన సాముహిక వంటగది. ఇక్కడ మనుషుల ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ఎలాంటి రుసుము తీసుకోకుండా బోజనం అందిస్తారు. ఇక్కడ గురుద్వారాను సందర్శించినప్పుడు సందర్శకులుకు సాంప్రదాయకంగా తీపి ప్రసాదంతో స్వాగతం పలుకుతారు. ఇది గురువు కృపకు ప్రతీక. సేవల సమయంలో హజరైన వారికి పూర్తి లంగర్‌తో కూడని భోజనంతో స్వాగతం పలుకుతారు. ఇది మతపరమైన భాగస్వామ్యం, ఆతిథ్య స్ఫూర్తిని సూచిస్తుంది. ఇక్కడ భోజనాలు చేసేవారంతా నేలపైనే కలిసి కూర్చొని.. సమానత్వాన్ని చాటుకుంటారు. ఈ వంటగదిని సిక్కు వాలంటీర్లు నిర్వహిస్తారు. వారంతా సమాజానికి నిస్వార్థంగా సేవ చేస్తారు. ఈ సంప్రదాయం సిక్కు మతంలోని సమానత్వం కలుపుగోలుతనం, నిస్వార్థ సేవలకు నిదర్శనంగా కనిపిస్తుంది. గురుపురబ్, బైసాఖి వంటి పండుగ సందర్భాల్లో కుటుంబాలు గురుద్వార వద్ద సమావేశమవుతాయి. ఇక్కడి వాతావరణం మతపరమైన స్ఫూర్తితో నిండి ఉంటుంది. ఈ సాముహిక అన్నసమారాధనలో అన్ని రకాల వయసుల వ్యక్తులు చురుకుగా పాల్గొంటారు. కాగా, ఈ పాట్నాలోని గురుద్వారా గురు గోవింద్ సింగ్ జన్మస్థలాన్ని జరుపుకోవడానికి నిర్మించిన సిక్కుల పవిత్రమైన ఐదు తఖత్‌లలో(దేవాలయాల్లో) ఒకటిగా చెబుతారు. (చదవండి: ఆ డ్రగ్‌తో ఎదుటివాళ్ల మైండ్‌ని మన కంట్రోల్లో పెట్టుకోవచ్చట!) -
రోటీ చేసి, భోజనం వడ్డించిన ప్రధాని మోదీ - వీడియో
పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలోని ప్రసిద్ధ సిక్కు మందిరం గురుద్వార్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా లంగర్లో భక్తులకు భోజనం వడ్డించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మోదీ పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సిక్కుల ప్రార్థనా స్థలంలో మోదీ ఒక స్టీల్ బకెట్ తీసుకుని, అందులోని ఆహారాన్ని అక్కడి ప్రజలకు వడ్డించడం చూడవచ్చు. అంతే కాకుండా మోదీ స్వయంగా రోటీ తయారు చేయడానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.इतनी सुंदर और गोल रोटी तो महिलाये भी नहीं बनाती होगी.... मान गये मोदी जी आपको pic.twitter.com/0VZuMxMsi4— Hardik Bhavsar (Modi Ka Parivar) (@Bitt2DA) May 13, 2024ఆదివారం బీహార్‌లో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్‌షో నిర్వహించారు. బీహార్‌లో రోడ్‌షో నిర్వహించిన తొలి ప్రధాని మోదీ. సోమవారం ప్రధానమంత్రి రాష్ట్రంలోని హాజీపూర్, ముజఫర్‌పూర్, సరన్ నియోజకవర్గాల్లో ఎన్నికల ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.ऐसा सनातन का पुरोधा ढूंढने पर भी न मिलेगा Proud of you My PM 🔥 pic.twitter.com/nDAZWQKGqo— Hardik Bhavsar (Modi Ka Parivar) (@Bitt2DA) May 13, 2024ఇదిలా ఉండగా లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం దేశ ప్రజలను అధిక సంఖ్యలో ఓటు వేయాలని కోరారు. ''నాలుగో దశ లోక్ సభ ఎన్నికలలో పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 96 స్థానాలలో పోలింగ్ జరుగుతుంది.ఈ నియోజక వర్గాలలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారనీ ఓటింగ్ పెరుగుదలకు.. యువ ఓటర్లు మహిళలు దోహదం చేస్తారనీ నమ్ముతున్నాను.రండి ,మనందరం మన కర్తవ్యాన్ని నిర్వర్తించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం'' అని మోదీ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.Sikhism is rooted in the principles of equality, justice and compassion. Central to Sikhism is Seva. This morning in Patna, I also had the honour of taking part in Seva as well. It was a very humbling and special experience. pic.twitter.com/0H8LufyzJ6— Narendra Modi (@narendramodi) May 13, 2024 -
భారత రాయబారిపై ఖలిస్తానీ వాదుల దూషణలు
న్యూయార్క్: గురుపూరబ్ పర్వదినం సందర్భంగా ప్రార్థనల్లో పాల్గొనేందుకు అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న గురుద్వారాకు వెళ్లిన భారత రాయబారి తరన్జీత్ సింగ్ సంధుపై ఖలిస్తానీ వాదులు నోరుపారేసుకున్నారు. లాంగ్ ఐలాండ్‌లో హిక్స్‌విల్లే గురుద్వారాకు వెళ్లిన సంధుకు ఘన స్వాగతం లభించింది. ఇది జీర్ణించుకోలేని ఖలిస్తానీ వాదులు ఆయన్ను దూషించారు. కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటనపై ఆయనపై పలు ప్రశ్నలు సంధిస్తూ పెద్దగా కేకలు వేశారు. స్థానిక సిక్కు సమాజ సభ్యులు సంధుకు రక్షణగా నిలిచి, ఖలిస్తానీ వాదులను బయటకు పంపించారు. -
యూకే గురుద్వారాలో భారత హైకమిషనర్ అడ్డగింత
లండన్: ఖలిస్తాన్ సానుభూతిపరుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కెనడాతో ఖలిస్తాన్ అంశంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే అవి యూకేకు కూడా పాకాయి. స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో ఒక గురుద్వారాలోకి వెళ్లకుండా భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామిని ఖలిస్తానీ అతివాదులు అడ్డుకున్నారు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ (టీఎఫ్సీ) హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్కాట్లాండ్లో ఖలిస్తానీ సిక్కు యువత రెచ్చిపోవడం ఆందోళన కలిగిస్తోంది. యూకే పర్యటనలో ఉన్న దొరైస్వామి అల్బర్ట్ డ్రైవ్‌లోని గ్లాస్గోలో గురుద్వారా గురు గ్రంథ సాహిబ్ కమిటీ సభ్యులతో సమావేశమవడానికి శుక్రవారం వచ్చారు. ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న ఖలిస్తానీ యువత ఆయనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. గురుద్వార సిబ్బందిని కూడా వారు బెదిరించారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గురుద్వారా కమిటీ ఆహ్వానం మేరకే భారత హైకమిషనర్ అక్కడికి వచ్చినా సిక్కు యువకులు వారిని అడ్డుకున్నారు. ఇద్దరు యువకులు విక్రమ్ దొరైస్వామి కూర్చున్న కారు తలుపుని తీయడానికి ప్రయత్నించారు. దీంతో మరింత ఘర్షణని నివారించడానికి దొరైస్వామి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. అడ్డుకోవడం అవమానకరం దొరైస్వామి కాన్వాయ్‌ని ఖలిస్తానీ సానుభూతిపరు లు అడ్డుకోవడాన్ని భారత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. బ్రిటన్ ప్రభుత్వం దృష్టికి దీనిని తీసుకువెళ్లింది. మరోవైపు లండన్‌లో భారత హైకమిషన్ ఈ చర్యను ఉద్దేశపూర్వకంగా అవమానించారంటూ మండిపడింది. బ్రిటన్ ప్రభుత్వానికి, పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేసింది. -
పంజాబ్ సర్కార్ కీలక ముందడుగు.. ఇక ఉచితంగా గుర్బానీ ప్రసారాలు
అమృత్‌సర్‌లోని శ్రీ హర్మందిర్ సాహిబ్ (స్వర్ణ దేవాలయం) నుంచి గుర్బానీని ఉచితంగా ప్రసారం చేసేలా ‘సిక్కు గురుద్వారాస్ (సవరణ) బిల్లు 2023’ను పంజాబ్ అసెంబ్లీ ఆమోదించింది. రాజకీయంగా వివాదాల నడుమ ఈ బిల్లుకు అసెంబ్లీలో మంగళవారం ఆమోద ముద్ర పడింది. సెక్షన్ 125ఏ సవరణ ద్వారా ఇక నుంచి గుర్బానీ ప్రసారాలు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. బిల్లు ప్రవేశ పెట్టిన తర్వాత అసెంబ్లీలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ.. గుర్బానీ ప్రసారాన్ని అందరికీ ఉచితంగా అందించడమే ఈ బిల్లు లక్ష్యమని, దీనికి టెండర్ అవసరం లేదని తెలిపారు. ఇకపై గుర్భానీని ప్రసారాలను ప్రతి ఒక్కరు తమకు నచ్చిన ఛానల్ నుంచి అయినా ఉచితంగా వినవచ్చు, చూడవచ్చని సీఎం పేర్కొన్నారు. బాదల్ కుటుంబంపై విమర్శలు గుప్పిస్తూ తను సొంతంగా ఎలాంటి ఛానల్ నిర్వహించడం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘నా ఛానల్‌కు టెలికాస్ట్ హక్కులు ఇవ్వాలని నేను అడగడం లేదు. అలాంటప్పుడు బాదల్‌కు ఎందుకు సమస్య’ అని ప్రశ్నించారు. ఇకపై గుర్బానీ ప్రసారాలు ఉచితంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు. చదవండి: కేదార్నాథ్: ఆలయ గర్భగుడిలో అపచారం.. కరెన్సీ నోట్లు వెదజల్లి.. కాగా, గుర్బానీ అనేది సిక్కుల పవిత్ర శ్లోకం. సిక్కు గురువులు, రైటర్లు కంపోజ్ చేసిన పవిత్ర కీర్తనలను గుర్బానీ అంటారు. స్వర్ణదేవాలయంలో పఠించే ఈ శ్లోకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు భక్తిశ్రద్ధలతో ఆలకిస్తారు. ఈ శ్లోకం ప్రసార హక్కులు ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఛానల్ దగ్గర మాత్రమే ఉన్నాయి. 2007 నుంచి రాజకీయంగా శక్తివంతమైన శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన ప్రైవేట్ చానల్ పీటీసీ ప్రసారం చేస్తోంది. ఈ మేరకు శిరోమణి గురుద్వారా పర్భంధక్ కమిటీకి ప్రతి ఏడాది రూ. 2 కోట్లు చెల్లిస్తుంది. అయితే ఈ ప్రసార హక్కులను ఒక ఛానల్‌కే పరిమితం చేయకుండా అందరికీ అందుబాటులో ఉండేలా ఉచితంగా ప్రసారం చేయాలని పంజాబ్ సర్కారు నిర్ణయించింది. ఇందుకు బ్రిటిష్‌కాలంనాటి సిక్కు గురుద్వారాస్ చట్టం 1925 సవరణ ప్రతిపాదనలకు పంజాబ్ రాష్ట్ర మంత్రి మండలి సోమవారమే ఆమోదముద్ర వేసింది. ఈ చట్టాన్ని సవరించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సామర్థ్యం ఉందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. హర్యానాకు ప్రత్యేక గురుద్వారా కమిటీ అంశంపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చిందని, ఇది రాష్ట్ర పరిధిలోనిదని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) మండిపడుతోంది. 1925 చట్టాన్ని పార్లమెంట్ చేసిందని దీనికి సవరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని విమర్శిస్తోంది. మరోవైపు పీటీసీ ప్రైవేట్ చానెల్‌కు అధిపతి అయిన శిరోమణి అకాళీదళ్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకే సర్కార్ ఈ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది . -
గురుద్వారా ఆవరణలో మద్యం తాగిన మహిళ.. కాల్చి చంపిన సేవాదార్..
చండీగఢ్: పంజాబ్ పాటియాలలో షాకింగ్ ఘటన జరిగింది. దుక్నివరణ్ సాహిబ్ గురుద్వారా కాంప్లెక్స్‌లో మద్యం సేవిస్తున్న ఓ మహిళపై అక్కడి సేవాదార్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఐదు రౌండ్లు షూట్ చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. ఆస్పత్రికి తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మృతురాలిని పర్మీందర్ కౌర్‌గా గుర్తించారు పోలీసులు. ఆమె వయసు 32 ఏళ్లు. పెళ్లికాలేదు. గురుబక్ష్ కాలనీలో నివాసముంటోంది. ఆదివారం సాయంత్రం గురుద్వారా ఆవరణలో మద్యం సేవించింది. ఈ సమయంలో ఆమెను చూసిన సాగర్ మల్హోత్రా అనే సేవాదార్ ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో అతనితో ఆమె వాగ్వాదానికి దిగింది. అనంతరం పర్మీందర్ కౌర్‌ను గురుద్వారా మేనేజర్ దగ్గరకు తీసుకెళ్తుండగా.. ఈ సమయంలో అక్కడున్న మరో సేవాదార్ మహిళ తీరుపై ఆగ్రహంతో ఆమెపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సాగర్ మల్హోత్రాకు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను రాజేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చదవండి: హృదయ విదారకం.. అంబులెన్సుకు డబ్బుల్లేక కుమారుడి శవంతో 200 కిమీ.. -
AP: సిక్కులకు కార్పొరేషన్
సాక్షి, అమరావతి: సిక్కుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారు. గురుద్వారాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు కల్పించాలన్న సిక్కు మతపెద్దల విజ్ఞప్తిపై అప్పటికప్పుడు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు గురుద్వారాలపై ఆస్తి పన్నును తొలగించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన సిక్కు మత పెద్దలతో సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. ఏపీ స్టేట్ మైనార్టీస్ కమిషన్ సభ్యుడు జితేందర్‌జిత్‌సింగ్ నేతృత్వంలో సిక్కు మతపెద్దలు ముఖ్యమంత్రిని కలిశారు. శతాబ్దం క్రితం నుంచి సిక్కులు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారని సిక్కుమత పెద్దలు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులకు ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు అందుతున్నాయని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేశారు. సిక్కుల కోసం ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి నవరత్నాలను మరింత సమర్థంగా అందించాలని కోరగా ముఖ్యమంత్రి అందుకు అంగీకరించారు. గురుద్వారాల్లో పూజారులైన గ్రంథీలకు ప్రయోజనాలు గురుద్వారాల్లో పూజారులైన గ్రంథీలకు పూజారులు, పాస్టర్లు, మౌల్వీల మాదిరిగానే ప్రయోజనాలు కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. గురునానక్ జయంతి రోజైన కార్తీక పౌర్ణమి నాడు సెలవురోజుగా ప్రకటించేందుకు అంగీకారం తెలిపారు. ఓ మైనార్టీ విద్యాసంస్థను నెలకొల్పేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి తీర్మానం కూడా చేస్తామని ప్రకటించారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే క్రమంలో సిక్కులకు అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వివిధ సామాజిక వర్గాలకు చెందినవారు నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈల వ్యాపారాలను పెంచే క్రమంలో ఈ చర్యలు ఉండాలని నిర్దేశించారు. పది రోజుల్లోగా ఇవన్నీ కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఎండీ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్‌తో సిక్కు మత పెద్దలు భేటీ
-
సిక్కు మత పెద్దలకు సీఎం జగన్ కీలక హామీ
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్యాంపు కార్యాలయంలో సిక్కు మత పెద్దలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌తో పలు అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో సిక్కు మత పెద్దల విజ్ఞప్తిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. - సిక్కుల కోసం కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్. - గురుద్వారాలకు ఆస్తి పన్ను మినహాయింపు విజ్ఞప్తిపై సీఎం జగన్ అంగీకారం తెలిపారు. ఈ క్రమంలో గురుద్వారాలపై ఆస్తి పన్ను తొలగించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. - గురుద్వారాల్లోని పూజారులైన గ్రంధీలకు పూజారులు, పాస్టర్లు, మౌలాలీల మాదిరిగానే ప్రయోజనాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. - గురునానక్ జయంతి రోజైన కార్తీక పౌర్ణమి నాడు సెలవు ప్రకటనపై సీఎం జగన్ అంగీకారం తెలిపారు. - వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి తీర్మానం కూడా చేస్తామని స్పష్టం చేశారు. - ఒక మైనార్టీ విద్యాసంస్థను పెట్టుకునేందుకు సహాయం అందిస్తామన్నారు. - వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా సిక్కులకు అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. - పారిశ్రామికంగా కూడా సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఎంఎస్ఎంఈల వ్యాపారాలను పెంచే క్రమంలో చర్యలు ఉండాలని సీఎం జగన్ సూచించారు. 10 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇది కూడా చదవండి: విద్యార్థుల తరలింపు సీఎం జగన్ కృషి వల్లే సాధ్యమైంది: ముత్యాలరాజు -
అమెరికాలోని గురుద్వార్‌లో కాల్పులు..ఇద్దరికి తీవ్ర గాయాలు
అమెరికాలో మరోసారి కాల్పులక కలకలం చోటు చేసుకుంది. ఈ మేరకు అమెరికాలోని గురుద్వార్‌లో ఇద్దరు దుండగలు కాల్పులకు తెగబడినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఐతే ఈ కాల్పులు ద్వేషపూరిత నేరాని సంబంధించినది కాదని చెప్పారు. ఈ ఘటన కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీలోని గురుద్వారాలో చోటు చేసుకుంది. ఇది తెలిసిన వ్యక్తుల మధ్య చోటు చేసుకున్న కాల్పుల దాడి అని శాక్రమెంటో కౌంటీ షెరీఫ్ కార్యాలయం పేర్కొంది. కాల్పుల జరగాడానికి ముగ్గురు వ్యక్తుల మధ్య చిన్న ఫైట్ జరిగిందని, ఆ తర్వాత అదికాస్త కాల్పులకు దారితీసిందని షెరీష్ కార్యాయల ప్రతినిధి అమర్ గాంధీ పేర్కొన్నారు. అలాగే అనుమానితుల్లో ఒకరు భారతీయ వ్యక్తి కాగా, మరో అనుమానిత షూటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, యూఎస్‌లో గతేడాది దాదాపు 44 వేల తుపాకీ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. వాటిలో సగం హత్య కేసులు, మరికొన్ని ప్రమాదాలు, ఆత్మరక్షణ, ఆత్మహత్యలు కారణంగా జరిగినవి. (చదవండి: అమెరికాలో భారత ఎంబసీపై దాడికి విఫలయత్నం) -
గురుద్వారాని సందర్శించి..పూజలు చేసిన కింగ్ చార్లెస్: వీడియో వైరల్
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ లండన్‌కి 30 కి.మీ దూరంలో లూటన్ అనే పట్టణంలో కొత్తగా నిర్మించిన గురుద్వారాను సందర్శించారు. అక్కడ పూజలు చేసి భక్తులతో మమేకమయ్యారు. ఈ మేరకు గురద్వారాకు విచ్చేసిన ప్రిన్స్ చార్లెస్‌కు వివిధ మతాలకు చెందిన పిల్లలు సిక్కు జెండాలతో స్వాగతం పలికారు. అక్కడ పిండివంటలు తయారు చేసే పాకశాలను, అక్కడ పనిచేసే వాలంటీర్లను కలిశారు. వారానికి ఏడు రోజులు, ఏడాదిలో 365 రోజులు గురుద్వారా శాఖాహారంతో కూడిని వేడి వేడి భోజనాన్ని అందిస్తుంది. కోవిడ్ మహమ్మారీ సమయంలో వారు చేసిన సేవలను కూడా ఎంతగానే కొనియాడారు. ఈ గురద్వార్లో కోవిడ్ వ్యాక్సిన్ క్లినిక్‌ని నడుపుతోంది. అలాగే వ్యాక్సిన్‌కి సంబంధించి అపోహలను పోగొట్టేలా గురుద్వార్ ఇతర ప్రార్థన స్థలాలకు సహాయ సహకారాలను అందించి ప్రోత్సహించింది. At the newly built Guru Nanak Gurdwara, His Majesty met volunteers who run the Luton Sikh Soup Kitchen Stand. The kitchen provides vegetarian hot meals 7 days a week, 365 days a year at the Gurdwara. pic.twitter.com/G6DaMkfkeW — The Royal Family (@RoyalFamily) December 6, 2022 (చదవండి: జిన్‌పింగ్ మూడు రోజుల సౌదీ పర్యటన...టెన్షన్లో అమెరికా) -
అఫ్గాన్ గురుద్వారాలో పేలుళ్లు
కాబూల్/న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని కర్తే పర్వాన్ గురుద్వారా వద్ద శనివారం భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో మొత్తం ఐదుగురు చనిపోయారు. వీరిలో ఒకరు సిక్కు కాగా, మరొకరు భద్రతా సిబ్బంది. ఉదయం 6 గంటల సమయంలో గురుద్వారా గేటుపైకి దుండగులు గ్రనేడ్ విసిరారు. ఈ ఘటనలో ఒక అఫ్గాన్ సిక్కుతోపాటు భద్రతా సిబ్బంది ఒకరు చనిపోయారు. అనంతరం దుండుగులు పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో గురుద్వారా వైపు వస్తుండగా బలగాలు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా కొన్ని గంటలపాటు బలగాలతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు దుండగులు చనిపోయారని అఫ్గాన్ తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. దాడి ఘటనకు తామే బాధ్యులమంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. అయితే, అఫ్గాన్‌లోని మైనారిటీలపై తరచూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. అఫ్గాన్‌లోని గురుద్వారాపై దాడి ఘటనను ప్రధాని మోదీ ఖండించారు. Kabul Update: Sikh Sangat (approx 10-15 in number) stuck in Gurdwara Karte Parwan in Kabul which was attacked by terrorists today morning. One person has been reported dead in this attack.#GurdwaraKarteParwan #Kabul @ANI @PTI_News @TimesNow @punjabkesari @republic pic.twitter.com/XLjSikVPYs — Manjinder Singh Sirsa (@mssirsa) June 18, 2022 ఇది కూడా చదవండి: రష్యాకు ఊహించని ఎదురుదెబ్బ.. షాక్‌లో పుతిన్! -
సిక్కుల జెండా అపవిత్రానికి యత్నం
కపుర్తలా/అమృత్సర్/న్యూఢిల్లీ: అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలోని నిషిద్ధ ప్రాంతాన్ని అపవిత్రం చేసి, మూకదాడిలో ఒక వ్యక్తి హతమైన ఘటన జరిగి 24 గంటలైనా గడవకమునుపే పంజాబ్‌లో మరోచోట అలాంటి పరిణామమే చోటుచేసుకుంది. తాజా ఘటనకు కపుర్తలా వేదికైంది. అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్‌లో చోటుచేసుకుంటున్న ఈ ఘటనలపై ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) ఆందోళన వ్యక్తం చేసింది. కపుర్తలా జిల్లా నిజాంపూర్‌లోని గురుద్వారా వద్దకు ఆదివారం ఉదయం ఒక గుర్తు తెలియని వ్యక్తి చేరుకున్నాడు. గురుద్వారా పైకెక్కి అక్కడున్న పవిత్ర జెండా(నిషాన్ సాహిబ్)ను తొలగించేందుకు యత్నించాడు. గమనించిన గ్రామస్తులు అతడిని వెంటాడి పట్టుకుని తీవ్రంగా కొట్టడంతో మృతి చెందాడని పోలీసులు చెప్పారు. కపుర్తలా పోలీసులు ఈ ఘటనపై స్పందిస్తూ.. గురుద్వారా పైనున్న జెండాను తొలగించేందుకు అగంతకుడు ప్రయత్నించాడని చెప్పారు. ఏవిధమైన అపవిత్రత చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. స్వర్ణదేవాలయంలో ఘటనపై సిట్ స్వర్ణదేవాలయంలో శనివారం జరిగిన ఘటనపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేసినట్లు పంజాబ్ ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి సుఖ్జీందర్ సింగ్ రణ్‌ధావా వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారన్నారు. సిట్ నివేదిక రెండు రోజుల్లో అందుతుందని చెప్పారు. శనివారం నాటి ఘటనపై ఆయన మాట్లాడుతూ.. మూకదాడిలో హతమైన వ్యక్తి ఉదయం 11 గంటల సమయంలో ఆలయంలోకి ప్రవేశించినట్లు సీసీ ఫుటేజీని బట్టి తేలిందన్నారు. కానీ, అతడెవరో గుర్తించాల్సి ఉందన్నారు. అతడి లక్ష్యం ఏమిటి? ఆలయంలోకి ఏ మా ర్గంగుండా ప్రవేశించాడు? వెంట వేరెవరైనా ఉన్నా రా? అనే విషయాలపై క్షుణ్నంగా దర్యాప్తు జరుపు తామని చెప్పారు. అతడి వద్ద సెల్‌ఫోన్, పర్స్, ఐ డెంటిటీ కార్డువంటివి ఏవీ లేదని తెలిపారు. ఘట న నేపథ్యంలో రాష్ట్రంలోని గురుద్వారాలు, దేవాలయాలు, చర్చిలు, మసీదుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. ఇలా ఉండగా, ఆదివా రం సాయంత్రం సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్ని స్వర్ణదేవాలయాన్ని సందర్శించి, ప్రార్థనలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కొన్ని స్వార్థ శక్తులు ఈ ఘటనకు కుట్ర చేసి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. అశాంతిని సృష్టించేందుకు కుట్ర.. స్వర్ణదేవాలయాన్ని అపవిత్రం చేసేందుకు జరిగిన ప్రయత్నాన్ని ఆర్ఎస్ఎస్ ఖండించింది. సమాజంలో అశాంతిని ప్రేరేపించేందుకు జరిగిన కుట్రగా పేర్కొంది. ఇలాంటి ఘటనలకు ప్రేరేపించిన వారిని కఠినంగా శిక్షించాలని ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబలే అన్నారు. -
‘అదేమన్నా పిక్నిక్ స్పాటా’.. మోడల్‌పై ప్రధానికి ఫిర్యాదు
న్యూఢిల్లీ: సిక్కులు పవిత్రంగా భావించే కర్తార్‌పూర్ గురుద్వారా దర్బార్ సాహిబ్ వద్ద ఫోటోషూట్ చేయడమే కాక.. తలపై వస్త్రం ధరించనందుకు గాను పాకిస్తాన్ మోడల్ని ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. ఆ వివరాలు.. పాకిస్తాన్‌కు చెందిన దుస్తుల కంపెనీ మన్నత్ కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా వద్ద ఓ యాడ్‌ని షూట్ చేసింది. దీనిలో నటించిన మోడల్ తలపై వస్త్రం ధరించకుండా షూట్లో పాల్గొని.. ఫోటోలకు పోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సదరు కంపెనీ, మోడల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. ముఖ్యంగా సిక్కు సామాజిక వర్గం వారు ఈ యాడ్‌పై చాలా గుర్రుగా ఉన్నారు. ‘‘మేం ఎంతో పవిత్రంగా భావించే స్థలంలో మీరు యాడ్ షూట్ చేస్తారా.. ఇదేమైనా పిక్నిక్ స్పాట్ అనుకుంటున్నారా ఏంటి’’ అంటూ విమర్శిస్తున్నారు. (చదవండి: కుక్క హెయిర్ డై కోసం 5 లక్షలు.. మోడల్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు.!) ఈ నేపథ్యంలో శిరోమణి అకాళీ దల్ నేత (ఎస్ఏడీ), ఢిల్లీ సిక్కు గురుద్వారా పర్బంధక్ కమిటీ అధినేత మంజిందర్ సింగ్ సిర్సా దీనిపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కోరారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మినిస్టర్ పవాద్ చౌదరి స్పందిస్తూ.. సదరు దుస్తుల కంపెనీ, మోడల్ తమ చర్యలకు గాను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఫొటోకు ఫోజులు.. మండిపడుతన్న నెటిజన్లు) వివాదం కాస్త పెద్దదవడంతో మన్నత్ కంపెనీ క్షమాపణలు చెప్పింది. అంతేకాక ‘‘సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఫోటోల ప్రకారం కర్తార్‌పూర్ కారిడార్ వద్ద ఫోటో షూట్ చేసింది తాము కాదని.. థర్డ్ కంపెనీ వారు తమ మన్నత్ వస్త్రాలు ధరించి.. అక్కడ యాడ్ షూట్ చేశారని’’ తెలిపారు. The Designer and the model must apologise to Sikh Community #KartarPurSahib is a religious symbol and not a Film set….. https://t.co/JTkOyveXvn — Ch Fawad Hussain (@fawadchaudhry) November 29, 2021 చదవండి: మోడల్ దారుణ హత్య: గొంతు కోసి.. నగ్నంగా మార్చి -
చేసిన సాయం చెప్పుకోవాలా?: అమితాబ్
ముంబై: చేసిన సాయం చెప్పుకోవడం తనకు ఇష్టం ఉండదని ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్(78) స్పష్టం చేశారు. దేశమంతటా కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది బాధితులు ప్రాణాలు విడుస్తున్నా సినీ రంగం పెద్దలు, సెలబ్రిటీలు నిద్ర నటిస్తున్నారని, సాయం చేయడానికి వారికి మనసొప్పడం లేదంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విమర్శలపై ఆయన సోమవారం స్పందించారు. కరోనా విపత్తు సమయంలో తాను చేపట్టిన కొన్ని దాతృత్వ కార్యక్రమాలను బయటపెట్టారు. రైతు ఆత్మహత్యలను నివారించా.. కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి సాధ్యమైనంత ఎక్కువ మందికి సాయం అందిస్తున్నానని బిగ్‌బీ పేర్కొన్నారు. చేసిన మేలు చెప్పుకోవడం ఎవరికైనా ఇబ్బందికరంగానే ఉంటుందన్నారు. చెప్పడం కంటే చేయడాన్నే తాను నమ్ముతానని తెలిపారు. తన వ్యక్తిగత నిధి నుంచి కరోనా ఫ్రంట్‌లైన్ యోధులకు మాస్కులు, పీపీఈ కిట్లు అందించానని చెప్పారు. విదేశాల నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు తెప్పించి, ఢిల్లీ, ముంబైలో ఆసుపత్రులకు అందించానని తెలిపారు. ఢిల్లీ గురుద్వారాలో 250 నుంచి 450 పడకల కేర్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. తన తాత, నాన్నమ్మ, తల్లి పేరిట ఖరీదైన ఎంఆర్ఐ యంత్రం, సోనోగ్రాఫిక్, స్కానింగ్ పరికరాలు అందజేశానన్నారు. 1,500 మందికి పైగా పేద రైతులకు ఆర్థిక సాయం చేశానని ఉద్ఘాటించారు. వారి బ్యాంకు రుణాలను తానే తీర్చేశానని వివరించారు. తద్వారా వారి ఆత్మహత్యలను ఆపగలిగానని అమితాబ్ సంతృప్తి వ్యక్తం చేశారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రవాద దాడిలో మరణించిన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలను ఆదుకున్నానని చెప్పారు. గత ఏడాది లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా 4 లక్షల మంది దినసరి కూలీలకు నెల రోజులపాటు ఆహారం అందజేశానన్నారు. వలస కార్మికులు వారి సొంతూళ్లకు తిరిగి వెళ్లేందుకు సహకారం అందించానని వెల్లడించారు. కోవిడ్ కేర్ సెంటర్‌కు అమితాబ్ రూ. 2 కోట్ల విరాళం బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తన ఉదారతను చాటుకున్నారు. కోవిడ్‌పై పోరుకు ఆయన రూ. 2 కోట్లు విరాళంగా అందజేశారు. ఢిల్లీలోని శ్రీ గురు తేగ్ బహదూర్ కోవిడ్ కేర్‌సెంటర్‌కు ఆయన ఈ డబ్బును అందించినట్లు ఢిల్లీ సిఖ్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మణ్జిందర్ సింగ్ శీర్షా సోమవారం తెలిపారు. కోవిడ్‌తో పోరాడే వారికి సిక్కులు ఎనలేని సేవలు అందిస్తున్నారని, అందుకే వారికి ఈ సాయం అందిస్తున్నట్లు అమితాబ్ పేర్కొన్నారని ఆయన వెల్లడించారు. 300 పడకల ఈ కోవిడ్ కేర్ సెంటర్ సోమవారం మధ్యాహ్నం నుంచి రోగులకు సేవలు ప్రారంభించింది. విదేశాల నుంచి ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించి మరీ సాయం అందించారని కొనియాడారు. -
Amitabh Bachchan: బిగ్ బీ రెండు కోట్ల విరాళం
న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఢిల్లీలో కోవిడ్ కేర్ సెంటర్‌గా మారిన రాకబ గంజ్ గురుద్వారకు 2 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. ఈ విషయాన్ని ఢిల్లీ సిక్కుల గురుద్వార మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మంజిందర్ సింగ్ సిర్సా మీడియాకు వెల్లడించారు. అమితాబ్ రెండు కోట్లు విరాళంగా ఇస్తూ.. సిక్కులు గొప్పవాళ్లని, వారి సేవలకు సెల్యూట్ చేయాల్సిందేనని మెచ్చుకున్నాడని తెలిపారు. అంతేకాకుండా విదేశాల్లో నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సైతం ఈ కోవిడ్ కేర్ సెంటర్‌కు తెప్పించాడని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకుంటున్నాడని మంజిందర్ చెప్పుకొచ్చారు. కాగా కోవిడ్ సేవలు అందించేందుకు సిద్ధమైన ఈ గురుద్వారను సోమవారం ప్రారంభించనున్నారు. ఇందులో 300 బెడ్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, అంబులెన్సులతో పాటు కరోనా రోగులకు చికిత్స అందించేందుకు వైద్యులు, ఇతర సిబ్బంది కూడా అందుబాటులో ఉండనున్నారు. ఇక ఈ సేవలన్నీ పేషెంట్లకు ఉచితంగా అందిస్తుండటం విశేషం. చదవండి: అభిషేక్ బచ్చన్ ట్వీట్: ఆయన కన్నా గొప్ప నటుడు ఎవరూ లేరు -
గురుద్వారాలో ప్రధాని ప్రార్థనలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆకస్మికంగా ఢిల్లీలోని గురుద్వారా రకాబ్ గంజ్ సాహిబ్‌ను సందర్శించారు. అక్కడ 9వ సిఖ్ గురు అయిన గురు తేగ్ బహదూర్‌కు నివాళులర్పించారు. గురు తేగ్ బహాదూర్ అంతిమ సంస్కారాలు గురుద్వారా రకాబ్ గంజ్‌లోనే జరిగాయి. పార్లమెంట్ హౌస్ దగ్గరలోని గురుద్వారాకు ప్రధాని ఆకస్మికంగా రావడంతో ఎలాంటి ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేయలేదు. సామాన్యుల రాకపోకలపై ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించలేదు. ‘శ్రీ గురు తేగ్‌బహదూర్ భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు జరిగిన చరిత్రాత్మక గురుద్వారా రకాబ్ గంజ్‌లో ఈ ఉదయం ప్రార్థనలు చేశాను. శ్రీ గురు తేగ్ బహదూర్ దయార్ద్ర జీవితంతో స్ఫూర్తి పొందిన వేలాదిమందిలో నేనూ ఒకడిని’ అని గురుద్వారా సందర్శన అనంతరం మోదీ ట్వీట్ చేశారు. పంజాబీలోనూ ఆయన ఈ ట్వీట్ చేశారు. హిందూ మతాన్ని రక్షించే క్రమంలో గురు తేగ్ బహదూర్ ప్రాణాలర్పించారని, సౌభ్రాతృత్వ భావనను విశ్వవ్యాప్తం చేశారని ప్రధాని కొనియాడారు. తమ ప్రభుత్వ హయాంలోనే గురు తేగ్ బహదూర్ 400వ ప్రకాశ పర్వ్ కార్యక్రమం రావడం ఎంతో ఆనందదాయకంగా ఉందని, ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని ప్రధాని మోదీ మరో ట్వీట్లో పేర్కొన్నారు. తమ ఆదేశాలను ధిక్కరించారని పేర్కొంటూ గురు తేగ్ బహదూర్‌కు మొఘల్ రాజు ఔరంగజేబు మరణ శిక్ష విధించారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు, ప్రధానంగా పంజాబ్, హరియాణాలకు చెందిన సిఖ్ రైతులు ఢిల్లీ శివార్లలో మూడు వారాలకు పైగా నిరసన తెలుపుతున్న సమయంలో ప్రధాని ఢిల్లీలోని ప్రముఖ గురుద్వారాను సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
గురుద్వారాను సందర్శించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం ఢిల్లీలోని చారిత్రక గురుద్వారా రకాబ్ గంజ్ సాహిబ్‌ను సందర్శించారు. నేడు సిక్కుల తొమ్మిదో గురువు ‘గురు తేగ్‌బహదూర్’ వర్ధంతి కావడంతో ఆయన త్యాగాలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు. ఇది న్యూఢిల్లీలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనానికి సమీపంలో ఉంది. అయితే ప్రధాని గురుద్వారా సందర్శన షెడ్యూల్ ప్రకారం నిర్వహించినది కాదు. ఈ పర్యటనను ఉన్నట్టుండి ప్లాన్ చేశారు. సాధారణంగా ప్రధాని ఇలాంటి పర్యటనకు వెళ్తే అక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటారు. కానీ గురుద్వారా చేరుకునే సమయంలో ఆయనకు ఏ విధమైనటువంటి ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదు. చదవండి: భారత్ ఎందుకొద్దు? పర్యటనలో ప్రధాని మోదీ గురుద్వారాలో ప్రార్థనలు చేశారు. అక్కడ పోలీసు బందోబస్తు లేదని, ఎక్కడా బారికేడ్లు పెట్టలేదని అధికారులు తెలిపారు. అలాగే ఈ మార్గంలో ఎటువంటి ట్రాఫిక్ మళ్లింపులు చేయలేదని, సామాన్యులకు ఎలాంటి అడ్డంకులూ లేవని అధికారులు పేర్కొన్నారు. ఉదయాన్నే మంచుకురుస్తుండగా, ఒక సాధారణ వ్యక్తి మాదిరిగా ప్రధాని మోదీ గురుద్వారా రకాబ్ గంజ్ చేరుకొని గురు తేగ్ బహదూర్‌కు సమాధి వద్ద నివాళులు అర్పించారు. కాగా ఢిల్లీలో గురుద్వారా రకాబగంజ్ 1783వ సంవత్సరంలో నిర్మితమైంది. ఢిల్లీలోని ప్రముఖ గురుద్వారాల్లో ఎక్కువ మంది సందర్శకులు వెళ్లే గురుద్వారాల్లో ఇదీ ఒకటి. ఓవైపు పంజాబ్ రైతులు కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న సమయంలో ప్రధాని మోదీ ఈ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: నాకు పేరొస్తుందనే.. మోదీ ధ్వజం ప్రధానమంత్రి మోదీ తన గురుద్వారా సందర్శనకు సంబంధించిన ఫొటోలను ట్విటర్లో షేర్ చేశారు. దీనితోపాటు గురుముఖి భాషలో సందేశమిచ్చారు. ‘నేను ఈ రోజు ఉదయం చారిత్రాత్మక గురుద్వారా రకాబగంజ్ సాహిబ్‌కు ప్రార్థనలు చేశాను. అక్కడ గురు తేగ్‌బహదుర్ పవిత్ర శరీరానికి అంతిమ సంస్కారాలు నిర్వహించాను. ఈ ప్రపంచంలోని లక్షల మందిని ప్రభావితులను చేసి, ఆధ్యాత్మిక మార్గంవైపు మళ్లించిన గురు తేగ్‌బహదూర్ దయతోనే ఎంతో ప్రేరణ పొందాను. గురు సాహిబ్స్ విశేష కృపతోనే మన ప్రభుత్వ పాలనా కాలంలో గురు తేగ్‌బహదూర్ 400వ ప్రకాశ్ పర్వాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా తేగ్ బహదూర్ ఆదేశాలను గుర్తు చేసుకుంటున్నాం. కాగా గురు తేగ్ బహదూర్ సిక్కు మతంలోని పదిమంది గురువులలో తొమ్మిదవ గురువు. 17వ శతాబ్దంలో ఢిల్లీలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు అతన్ని హత్య చేశారు. -
రూ .150 కే స్కానింగ్, రూ. 50 కే ఎంఆర్ఐ
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని గురుద్వారా బంగ్లా సాహిబ్ పేద రోగులకు ఊరట కల్పించనుంది. దేశంలోనే అతి చౌక డయాగ్నొస్టిక్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. తక్కువ ఖర్చుతో స్కానింగ్, ఎంఆర్ఐ లాంటి సదుపాయాలను కల్పించనుంది. అలాగే కిడ్నీ రోగులకోసం త్వరలోనే ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబరు మాసంనుంచి తక్కువ ఖర్చుకే ఎంఆర్ఐ, స్కానింగ్ లాంటి సదుపాయాలను కల్పించనున్నామని మేదాంతా చైర్మన్, గురుహరికిషన్, రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ అరవిందర్ సింగ్ సోనీ వెల్లడించారు. అల్ట్రాసౌండ్ లేదా ఎక్స్‌రే కోసం 150 రూపాయలు, ఎంఆర్ఐ కేవలం 50 రూపాయలు మాత్రమే వసూలు చేయనున్నామని తెలిపారు. తద్వారా అల్పాదాయ ఆదాయ వర్గాల ప్రజలకు సహాయపడాలని నిర్ణయించామన్నారు. అలాగే గురుద్వార ప్రాంగణంలో మూత్రపిండాల రోగుల కోసం హరికిషన్ ఆసుపత్రిలో డయాలసిస్ చేస్తున్నట్లు సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ (డిఎస్జిఎంసి) మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. ఇది వచ్చే వారంనుంచి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. డయాలసిస్ ప్రక్రియకు 600 రూపాయలు మాత్రమే చార్జ్ చేస్తామన్నారు. అవసరమైన ఇతర రోగులకు ఎంఆర్ఐ స్కాన్‌కు 800 రూపాయలు (ప్రైవేటు కేంద్రాల్లోఎంఆర్‌ఐకి ఖరీదు రూ.2,500) ధరకే అందించినున్నట్టు కూడా తెలిపారు. అయితే ఈ రాయితీ ఎవరికివ్వాలనే విషయాన్ని ఆసుపత్రి కమిటీ నిర్ణయిస్తుందని వెల్లడించారు. ఇందుకోసం 6 కోట్ల విలువైన డయాగ్నొస్టిక్ యంత్రాలను ఆసుపత్రికి విరాళంగా ఇచ్చామన్నారు. వీటిలో నాలుగు డయాలసిస్ మెషీన్స్, ఒక్కో అల్ట్రాసౌండ్, ఎక్స్-రే,ఎంఆర్ఐ యంత్రాలు చొప్పున ఉన్నట్టు ప్రకటించారు. After a low-cost dispensary, Gurudwara Bangla Sahib is now slated to open a cheap diagnostic facility. An ultrasound will cost Rs. 150 & an MRI Scan Rs. 50! 🙏 pic.twitter.com/oZLKQblUTa — Dr. Arvinder Singh Soin (@ArvinderSoin) October 5, 2020 -
50 రూపాయలకే ఎమ్ఆర్ఐ స్కాన్
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత తక్కువగా ఎమ్ఆర్ఐ స్కాన్ ను కేవలం రూ. 50 కే అందించనున్నట్లు ఢిల్లీ సిఖ్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ చెప్పింది. గురుద్వారా ప్రాంగణంలోనే ఉన్న గురు హరిక్రిషన్ ఆస్పత్రిలో ఈ సేవలు అందించనున్నట్లు తెలిపింది. డిసెంబర్ మొదటి వారంలో ఆయా సేవలు మొదలవుతాయని చెప్పింది. ఈ ఆస్పత్రిలో డయాలసిస్ ను కేవలం రూ. 600కే అందిస్తామని కమిటీ అధ్యక్షుడు మన్జిందర్ సింగ్ చెప్పారు. పేదలకు ఎమ్ఆర్ఐ కేవలం రూ. 50కే అందిస్తామని తెలిపారు. ప్రైవేటు ల్యాబుల్లో ఎమ్ఆర్ఐ రూ. 2,500 వరకూ ఉంది. -
‘గురుద్వార్‌ను మసీదుగా మార్చడాన్ని ఖండిస్తున్నాం’
చండీగఢ్ : లాహోర్‌లోని చారిత్రాత్మక గురుద్వార్‌ను మసీదుగా మార్చడానికి పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మంగళవారం ఖండించారు. ఈ అంశంపై భారత్ ఇప్పటికే పాకిస్థాన్‌పై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై పంజాబ్ సీఎం స్పందిస్తూ..సిక్కుల సమస్యలను పొరుగు దేశానికి తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ‘లాహోర్‌లోని పవిత్ర గురుద్వార్ శ్రీ షాహిది అస్తాన్‌ను మసీదుగా మార్చడానికి చేసిన ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సిక్కుల గౌరవ ప్రదేశాలను కాపాడటానికి పంజాబ్ ఆందోళనలను పాకిస్తాన్‌కు బలంగా తెలియజేయాలని విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కోరుతున్నాం’ అని సింగ్ ట్వీట్ చేశారు. (పంజాబ్‌లో పెన్షన్ స్కామ్ కలకలం) కాగా గురుద్వార్ షాహిది అస్తాన్ 1745లో భాయ్ తరు సింగ్ ప్రాణాంతకంగా గాయపడిన ప్రదేశంలో నిర్మించిన చారిత్రక మందిరం. గురుద్వార్ సిక్కులకు పవిత్ర పుణ్యక్షేత్రం. లాహోర్‌లోని గురుద్వార్‌ను మసీదుగా మారుస్తున్నట్లు వచ్చిన వార్తలపై పాకిస్తాన్ హైకమిషన్‌కు భారత్ సోమవారం తీవ్ర నిరసన తెలిపింది. ఈ సంఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని, ఈ విషయంపై దర్యాప్తు జరిపి తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌కు పిలుపునిచ్చినట్లు ఎంఈఎం ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. పాకిస్తాన్లో మైనారిటీ సిక్కు సమాజానికి న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. (కరోనా కల్లోలం: భారత్‌లో కొత్తగా 47,704 కేసులు) -
మరేం చేయాలి.. లొంగిపోవాలి అంతే!
ముంబై: టీవీ నటులు మనీష్ రాయ్‌సింఘన్, సంగీత చౌహాన్ పెళ్లి చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న వీరు మంగళవారం వివాహ బంధంలో అడుగుపెట్టారు. ముంబైలోని ఓ గురుద్వారలో అత్యంత సన్నిహితుల సమక్షంలో లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా వీరి పెళ్లి జరిగింది. ఇక వధూవరులిద్దరు తమ దుస్తులకు మ్యాచ్ అయ్యే మాస్కులు ధరించడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో నెటిజన్లు, అభిమానులు కొత్తజంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ‘ససురాల్ సిమర్ కా’ అనే హిందీ సీరియల్‌తో పాపులర్ అయిన మనీశ్ రాయ్‌సింఘన్.. ఆ తర్వాత ‘ఏక్ శ్రింగార్- స్వాభిమాన్’ మరో సీరియల్లో నటించాడు. (వెండితెరపై ‘1200 కిలో మీటర్ల పయనం’) ఈ క్రమంలో సహ నటి సంగీత ప్రేమలో పడిన అతడు ఇరు కుటుంబాల అంగీకారంతో ఆమెను వివాహమాడనున్నట్లు ఇటీవలే ప్రకటించాడు. ఇక పెళ్లి సందర్భంగా.. ‘‘అసలు ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా ఎన్నడూ ఊహించలేదు! నాకు పెళ్లా? మరి ఏం చేయను.. తన సింప్లిసిటీ, నిష్కల్మషమైన మనసుతో ఓ అమ్మాయి మనల్ని ఆకర్షిస్తే ఏం చేయగలం. లొంగిపోవాలి అంతే కదా.. ఆ లవ్లీ లేడీ సంగీత చౌహాన్. నాతో జీవితాంతం కలిసి ఉండే శిక్ష అనుభవించకతప్పదు. ఇకపై ఆ దేవుడే తనను కాపాడాలి. స్వాగతం సంగీత’’అంటూ కాబోయే భార్యను తన జీవితంలోకి ఆహ్వానించాడు. ఇక తన ప్రాణ స్నేహితుడినే భర్తగా పొందడం నమ్మలేకుండా ఉన్నానని సంగీత పేర్కొన్నారు. (బాలీవుడ్‌కీ హోమ్ డెలివరీ ) View this post on Instagram Its Finally Official ! WE ARE GETTING MARRIED !!! Swip left... This was the time when I met him first to know him as a great friend which landed me to fall in love with him head over heals soon for the kind of person he is...still can’t believe how time has passed and here we are today sharing our vows! ♥️♥️♥️Manish I Love U ♥️♥️♥️ Thankyou for choosing me🤗🤗🤗 . . And most importantly Thankyou @purvapandit aka my best friend ! For creating this wonderful invite for us... which speaks thousand words/thousand feelings in such a simple way💕 #sangva A post shared by Sangeita Chauhaan (@sangeitachauhaan) on Jun 29, 2020 at 11:06am PDT -
ఏఎస్ఐ చేయి నరికేశారు!
చండీగఢ్: లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ ముఠా ఇదేమని ప్రశ్నించిన పోలీసులపై కత్తులతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి చేయి తెగిపోగా మరో ముగ్గురు పోలీసులు సహా నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రం పటియాలా జిల్లా సనౌర్ పట్టణంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, పాస్‌లు ఉన్న వారినే లోపలికి అనుమతిస్తున్నారు. అదే సమయంలో అక్కడికి కొందరు నిహంగ్(సిక్కుల్లోని ఓ వర్గం)లు ఎస్యూవీ వాహనంలో అక్కడికి వచ్చారు. పోలీసులు వారిని పాస్‌లు చూపించాలని కోరగా బారికేడ్లపైకి వాహనాన్ని నడిపారు. అడ్డుకున్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్సై) హర్జీత్ సింగ్ చేతిని తమ వద్ద ఉన్న కత్తితో నరికారు. మార్కెట్ అధికారితోపాటు మరో ముగ్గురు పోలీసులను కూడా గాయపర్చారు. పోలీసులు వెంబడించగా దుండగులు అక్కడికి 25 కిలోమీటర్ల దూరంలోని బల్బేర్ గ్రామంలోని గురుద్వారాలో దాక్కున్నారు. ఈలోగా గాయపడిన హర్జీత్ సింగ్‌ను, తెగిన చేయి సహా అధికారులు చండీగఢ్‌లోని పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్)కు తరలించారు. నిహంగ్‌ల ముఠా గురుద్వారాలో దాగిన విషయం తెలిసిన పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆ ప్రదేశాన్ని దిగ్బంధించారు. లోపలున్న మహిళలు, చిన్నారులకు హాని కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. లొంగిపోవాలని హెచ్చరించినా దుండగులు వినకుండా గ్యాస్ సిలిండర్లతో గురుద్వారాను పేల్చి వేస్తామని బెదిరించడంతోపాటు పోలీసులపైకి కాల్పులకు దిగారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకా>ల్పుల్లో ఆ ముఠాలోని ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. అనంతరం దాడికి పాల్పడిన ముఠాలోని ఐదుగురు, ఓ మహిళ సహా మొత్తం 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు పిస్టళ్లు, కత్తులు, మత్తు కోసం వాడే గసగసాల పొడిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, పీజీఐఎంఈఆర్లోని వైద్య బృందం ఏఎస్సై హర్జీత్ సింగ్ తెగిపోయిన చేతిని ఏడున్నర గంటలపాటు సర్జరీ చేసి విజయవంతంగా అతికించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. హర్జీత్ సింగ్‌ను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం -
గురుద్వారాలో చిక్కుకున్నవారిలో పాకిస్తాన్ వాసులు
సాక్షి, ఢిల్లీ: లాక్డౌన్ కారణంగా దేశ రాజధాని ప్రాంతంలోని మజ్ను కా తిల్లా ప్రాంతంలోని గురుద్వారాలో చిక్కుకున్న 200 మందికి పైగా సిక్కులను అధికారులు నెహ్రూ విహార్ పాఠశాలలో క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. నిజాముద్దీన్‌లోని తబ్లీగి జమాద్ కార్యక్రమానికి హాజరైన వారిలో 24 మంది కోవిడ్-19 నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం ఈ కార్యక్రమానకి ఎంతమంది హాజరయ్యారు, వారు ఎవరెవరిని కలిశారన్న దానిపై రాష్ర్టప్రభుత్వాలు డాటా సేకరణ పనిలో నిమగ్నమయ్యాయి. ఒకే చోట ఎక్కువమంది గుమికూడరాదు అన్న ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాజ్ మతాధికారిపై కేసు నమోదైంది. గురుద్వారాలో చిక్కుకున్న వారిలో ఎక్కువమంది పంజాబ్‌కి చెందిన సిక్కులున్నారని, వారిని తిరిగి పంజాబ్‌కి రప్పించడంలో ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఏమాత్రం చొరవ చూపలేదని ఢిల్లీ సిక్కు గురుద్వారా కమిటీ ప్రెసిడెంట్ మజీందర్ సింగ్ సిర్సా ఆరోపించారు. పాకిస్తాన్‌వాసులు కూడా గురుద్వారాలో చిక్కుకున్నవారిలో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఇక కరోనా వైరస్ కారణంగా ఢిల్లీలో 120 కేసులు నమోదుకాగా వారిలో ఆరుగురు కోలుకున్నారు. ఇద్దరు మృతిచెందారు. కోవిడ్-19కి బలవుతున్న వారిలో ఎక్కువగా ఇంతకు మందే ఆరోగ్య సమస్యలున్నవారు, చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నారు.