న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 9న భారత్ వైపున కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభిస్తారు. పాకిస్తాన్‌లో నెలకొన్న సిక్కుల గురుద్వారాకు యాత్రికులతో కూడిన తొలి బ్యాచ్‌కు పచ్చజెండా ఊపుతారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో కర్తార్‌పూర్ యాత్రికుల కోసం కొత్తగా నిర్మించిన టెర్మినల్ వద్ద జరిగే కార్యక్రమానికి ప్రధాని హాజరవుతారు. కాగా, అదే రోజు తమ భూభాగంలో నిర్మంచిన కర్తార్‌పూర్ కారిడార్‌ను పాకిస్తాన్ ప్రారంభించి భారత యాత్రికుల తొలి బ్యాచ్‌ను స్వాగతిస్తుంది. పాకిస్తాన్ కారిడార్ నరోవల్ జిల్లాలో ఏర్పాటైంది. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు, వివరాలను చర్చించేందుకు ఈనెల 23న తలపెట్టిన సమావేశానికి హాజరు కావాలని పాకిస్తాన్‌కు భారత్ ఆహ్వానం పంపింది. దీనిపై పాకిస్తాన్ ఇంకా స్పందించాల్సి ఉంది. మరోవైపు కర్తార్‌పూర్‌లో గురుద్వార దర్బార్ సాహిబ్‌ను సందర్శించే భారత యాత్రికుల నుంచి పాకిస్తాన్ 20 డాలర్ల ఫీజును వసూలు చేసే ప్రతిపాదనపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ అభ్యంతరం పైనా పాకిస్తాన్ ఇప్పటివరకూ స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment