పాట్నా : వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తుండగా.. ఆ దేశంలో పర్యటించేందుకు భారత్ నిరాకరించింది. ఈ నిర్ణయంపై రాజకీయం వివాదం రాజుకుంది.
ఈ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్, రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ తప్పుబట్టారు. బిర్యానీ తినేందుకు ప్రధాని మోదీ పాకిస్థాన్‌కు వెళ్లొచ్చు. కానీ భారత క్రికెర్లు అక్కడకు వెళ్లి క్రికెట్ ఆడకూడదా? అని ప్రశ్నించారు. క్రీడలకు రాజకీయాలను ఉంచాలని కేంద్రాన్ని కోరారు.
‘క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదు.. వాళ్లు (పాకిస్తాన్) మన దేశానికి రావాలి. మన ఆటగాళ్లు పాకిస్థాన్‌కి వెళ్లాలి. క్రీడలతో సమస్య ఏంటి? దాయాది దేశాల మధ్య క్రీడలు జరుగుతుంటే యుద్ధం జరుగుతున్నట్లు కాదుగా అని అన్నారు. మోదీ బిర్యానీ తినేందుకు పాక్‌కు వెళితే మంచి విషయం. కానీ భారత క్రికెట్ టీమ్ వెళితే తప్పా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర స్థాయి క్రికెట్‌లో జార్ఖండ్‌కు ప్రాతినిధ్యం వహించిన తేజస్వి ప్రధాని హోదాలో ప్రధాని మోదీ 2015లో పాకిస్తాన్ లోని లాహోర్ నగరంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధానితో కలిసి మోడీ విందు చేశారు. ఈ పర్యటనను ఉద్దేశిస్తూ తేజస్వీ యాదవ్ పై విధంగా కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే.. భారత క్రికెట్ జట్టు చివరిసారిగా 2008లో పాకిస్థాన్‌లో పర్యటించింది. ఇక అప్పటి నుండి టీమిండియా మళ్లీ పాక్‌కు వెళ్లలేదు. చిరకాల ప్రత్యర్థులు చివరిసారిగా 2012-13లో భారత్‌లో ద్వైపాక్షిక సిరీస్ ఆడారు.
Comments
Please login to add a commentAdd a comment