
న్యూఢిల్లీ: ఆసియా దేశాల్లో భాగమైన పాకిస్తాన్ ఎప్పుడూ తమతో శత్రుత్వాన్ని మాత్రమే కోరుకుంటోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. వారి(పాకిస్తాన్)తో ఎప్పుడూ శాంతి చర్చలకోసం ప్రయత్నించినా అది విఫలయత్నంగానే మిగిలిపోయిందన్నారు. వారితో శాంతి చర్చలు చేసిన ప్రతీసారి ద్రోహం, శత్రుత్వం మాత్రమే ఎదురైంది. వారికి ఎప్పటికైనా జ్ఞానం కలిగి తమతో శాంతి మార్గాన్ని ఎంచుకుంటారనే ఆశిస్తున్నామన్నారు ప్రధాని మోదీ.,
లెక్స్ ఫ్రిడ్ మ్యాన్ తో జరిగిన పాడ్ కాస్ట్ లో పాకిస్తాన్ తో ఎదురైన అనుభవాలను ప్రధాని మోదీ పంచుకున్నారు.2014లో తాను ప్రధానిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసే క్రమంలో అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించిన సంగతిని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో పాకిస్తాన్ తో సంబంధాలు తిరిగి గాడిలో పడతాయని ఆశించినట్లు ఆయన పేర్కొన్నారు. కానీ వారితో ఎప్పుడు శాంతి ప్రయత్నాలు చేసినా అవి విఫలంగానే మిగిలిపోయాయన్నారు మోదీ.
కాకపోతే పాకిస్తాన్ లో ప్రజలు ఎప్పట్నుంచో శాంతిని కోరుకుంటున్నారని, వారు ఇప్పటికే అక్కడ జరిగే ఉగ్రదాడులతో అలసిపోయి ఉన్నారన్నారన్నారు. తాను తొలిసారిగా ప్రధానిగా సేవలందించే క్రమంలోనే పాకిస్తాన్ తో శాంతి చర్చల కోసం ఆహ్వానించానన్నారు.
‘దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ దౌత్యపరమైన చర్యలకు అడుగులు వేశాం. విదేశాంగ విధానం పట్ల నా విధానాన్ని ఒకప్పుడు ప్రశ్నించిన వ్యక్తులు.. అన్ని సార్క్ దేశాధినేతలను ఆహ్వానించానని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోయారు. ఆ విషయాన్ని మన అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన జ్ఞాపకాలలో అందంగా రాసుకున్నారు కూడా’ అని మోదీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment