Podcasts
-
‘విద్య’లో గందరగోళం.. లక్ష్యం బడికి తాళం. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యను భ్రష్టు పట్టిస్తోన్న కూటమి ప్రభుత్వం
-
శాంతి కోసం యత్నిస్తే.. శత్రుత్వం, ద్రోహమే ఎదురైంది: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఆసియా దేశాల్లో భాగమైన పాకిస్తాన్ ఎప్పుడూ తమతో శత్రుత్వాన్ని మాత్రమే కోరుకుంటోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. వారి(పాకిస్తాన్)తో ఎప్పుడూ శాంతి చర్చలకోసం ప్రయత్నించినా అది విఫలయత్నంగానే మిగిలిపోయిందన్నారు. వారితో శాంతి చర్చలు చేసిన ప్రతీసారి ద్రోహం, శత్రుత్వం మాత్రమే ఎదురైంది. వారికి ఎప్పటికైనా జ్ఞానం కలిగి తమతో శాంతి మార్గాన్ని ఎంచుకుంటారనే ఆశిస్తున్నామన్నారు ప్రధాని మోదీ., లెక్స్ ఫ్రిడ్ మ్యాన్ తో జరిగిన పాడ్ కాస్ట్ లో పాకిస్తాన్ తో ఎదురైన అనుభవాలను ప్రధాని మోదీ పంచుకున్నారు.2014లో తాను ప్రధానిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసే క్రమంలో అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించిన సంగతిని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో పాకిస్తాన్ తో సంబంధాలు తిరిగి గాడిలో పడతాయని ఆశించినట్లు ఆయన పేర్కొన్నారు. కానీ వారితో ఎప్పుడు శాంతి ప్రయత్నాలు చేసినా అవి విఫలంగానే మిగిలిపోయాయన్నారు మోదీ.కాకపోతే పాకిస్తాన్ లో ప్రజలు ఎప్పట్నుంచో శాంతిని కోరుకుంటున్నారని, వారు ఇప్పటికే అక్కడ జరిగే ఉగ్రదాడులతో అలసిపోయి ఉన్నారన్నారన్నారు. తాను తొలిసారిగా ప్రధానిగా సేవలందించే క్రమంలోనే పాకిస్తాన్ తో శాంతి చర్చల కోసం ఆహ్వానించానన్నారు.‘దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ దౌత్యపరమైన చర్యలకు అడుగులు వేశాం. విదేశాంగ విధానం పట్ల నా విధానాన్ని ఒకప్పుడు ప్రశ్నించిన వ్యక్తులు.. అన్ని సార్క్ దేశాధినేతలను ఆహ్వానించానని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోయారు. ఆ విషయాన్ని మన అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన జ్ఞాపకాలలో అందంగా రాసుకున్నారు కూడా’ అని మోదీ పేర్కొన్నారు. -
బీఆర్ఎస్ నాయకుల స్టేచర్ గుండుసున్నా.. కేసీఆర్ వందేళ్లు ఆరోగ్యంగా, ప్రతిపక్ష నేతగా ఉండాలి, నేను సీఎంగా ఉండాలి ..రేవంత్‌రెడ్డి
-
కేసీఆర్‌ను గద్దె దింపిందీ నేనే. నాది సీఎం స్థాయి.. ఆయనది మాజీ సీఎం స్థాయి. తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్య
-
సుప్రీం కోర్టులో రణవీర్ అల్హాబాదియాకు ఊరట
ఢిల్లీ : తల్లిదండ్రుల గురించి, శృంగారం పైన ప్రశ్నించి వివాదాల్లో చిక్కుకున్న ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియాకు సుప్రీం కోర్టులో (supreme court) ఊరట దక్కింది. వివాదాస్పద వ్యాఖ్యలతో ఆగిపోయిన పాడ్ కాస్ట్ ‘ది రణ్వీర్ షో’తో పాటు ఇతర షోలను తిరిగి ప్రారంభించుకోవడంతో పాటు వాటిని ప్రసారం చేసుకోవచ్చని తెలిపింది.‘ఇండియాస్ గాట్ లాటెంట్’ (India's Got Latent) వేదికగా యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో అల్హాబాదియా వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. అల్హాబాదియా చేస్తున్న షోలు సైతం ఆగిపోయాయి. అయితే, అల్హాబాదియా తాను ఇంటర్వ్యూలు, షోలు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అంతేకాదు,తాను చేస్తున్న షోలపై సుమారు 280 మంది ఆధారపడ్డారని, షోలు ఆగిపోవడం వల్ల వారికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు ఆ పిటిషన్‌పై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సూర్యకాంత్, ఎన్.కోటీశ్వర్ సింగ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. అల్హబాదియా పిటిషన్‌పై కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (Solicitor General Tushar Mehta) తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా తాను ఉత్సుకతతో అల్హాబాదియా షోను చూశానని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ఆ షో అసభ్యంగా మాత్రమే కాదు.. వక్రంగా ఉందని వ్యాఖ్యానించారు. హాస్యం, అసభ్యత, వక్రబుద్ధి మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉందని నొక్కి చెప్పారు.ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వాక్ స్వాతంత్ర్యం ప్రాథమిక హక్కు, అశ్లీలత విషయంలో స్పష్టమైన సరిహద్దు ఉండాలని పునరుద్ఘాటించింది. ఈ సందర్భంగా అల్హాబాదియాకు సుప్రీం కోర్టు చురకలంటించింది. భావప్రకటనా స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయని, అసభ్య పదజాలం వాడటం హాస్యం కాదని మందలించింది. అల్హాబాదియా షోలు చేసుకోవచ్చని, నైతికంగా, మర్యాద ఉండాలని సూచించింది.👉చదవండి : హాస్యం పేరిట అల్హాబాదియా నీచపు వ్యాఖ్యలు -
‘అసైన్డ్’ దోపిడీకి రాజముద్ర!. అమరావతిలో పేదల భూములు కాజేసిన పచ్చ ముఠాలకు ‘రిటర్నబుల్ ప్లాట్లు. సీఆర్డీఏకు చంద్రబాబు సర్కారు ఆదేశం
-
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో అడుగడుగునా దగా... హామీల అమలు ఊసే లేదు
ఆంధ్రప్రదేశ్‌లో 3 లక్షల 22 వేల కోట్ల రూపాయలతో కూటమి ప్రభుత్వం 2025-26 ఆర్దిక సంవత్సరం బడ్జెట్‌ను శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. అయితే ఎన్నికల హామీల అమలుకు నిధుల కేటాయింపులు చేయలేక చతికిలపడింది.
-
అట్టుడికిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి... వీసీల రాజీనామా.. ఆరున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు.. 4 లక్షల ఉపాధి అవకాశాలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ సభ్యులు
-
చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి
బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద స్కాంగా నిలిచిన ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంలో నిందితురాలిగా ఉన్న చందా కొచ్చర్ కొత్త జర్నీని ప్రారంభించారు. ఐసీఐసీఐబ్యాంక్ సీఎండీగా ఉన్నపుడు చందా కొచ్చర్ క్రిడ్‌ప్రోకు పాల్పడ్డారనే ఆరోపణలు సంచలనం రేపాయి. ఈ కేసులో ఉద్యోగం కోల్పోవడంతో పాటు భర్త దీపక్ కొచ్చర్తో సహా జైలు శిక్ష అనుభవించారు. ప్రస్తుతం భర్తతో పాటు బెయిల్‌పై ఉన్న చందా కొచ్చర్ సోషల్ మీడియాలో సంచలనం రేపేందుకు సన్నద్ధమయ్యారు. యూట్యూబ్ పాడ్‌కాస్ట్ సిరీస్ 'జర్నీ అన్‌స్క్రిప్టెడ్ విత్ చందా కొచ్చర్' ను లాంచ్ చేశారు. ఎలాంటి పరిణామాన్నైనా ఎందుర్కొనేందుకు ద్ధంగా ఉన్నాననీ, తన పాడ్‌కాస్ట్ చాలా విషయాలను వెలుగులోకి తీసుకొస్తుందని అన్నారు. జెన్ జెడ్ కి ఇష్టమైన మాధ్యమం ద్వారా వెలుగులోకి వస్తున్న చందాకొచ్చర్ పాడ్కాస్ట్పై కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.'జర్నీ అన్‌స్క్రిప్టెడ్' అనే పాడ్‌కాస్ట్‌ను చందా కొచ్చర్ ప్రారంభించారు. స్వయంగా తాను ఎంతో రీసెర్చ్ చేసి, అతిథులను స్వయంగా ఎంచుకుంటానని ఈ సందర్బంగా ఆమె చెప్పారు. నెలకు మూడు పాడ్‌కాస్ట్‌లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు. ప్రతిరోజూ కొత్తది నేర్చుకోవడం, మార్పుతోపాటు ముందుకు సాగడం ఈ రెండే తన లక్ష్యాలని ఆమె చెప్పారు. ఈ షోలో ఆమె తొలి అతిథి మారికో వ్యవస్థాపకుడు, ఛైర్మన్ హర్ష్ మారివాలా. రెండో గెస్ట్‌గా నటుడు రాబోతున్నారని కూడా హింట్ ఇచ్చారు. కానీ ఆ గెస్ట్ పేరును వెల్లడించడానికి నిరాకరించారు. ఈ పాడ్‌కాస్ట్‌ను స్వతంత్ర కంటెంట్, డిజైన్ ఏజెన్సీ ‘ది సాల్ట్ ఇంక్’ రూపొందిస్తోంది. తొలి ఎపిసోడ్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్విటర్లో దీన్ని షేర్ చేశారు. కాగా 1984లో ICICI బ్యాంక్‌లో చేరారు చందాకొచ్చర్. 2009లో బ్యాంకు ఎండీ, సీఈవో అయ్యారు. బ్యాంకింగ్ పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధి చెందిన మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు. బ్యాంకులు లాభాల పరుగులు పెట్టించి గోల్డెన్ గర్ల్‌గా ప్రశంస లందుకున్నారు. 2010లో ఫోర్బ్స్ 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళలలో ఒకరిగా కూడా స్థానం దక్కించుకున్నారు. అంతేకాదు దేశీయ అత్యంత గౌరవనీయమైన ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ సహా, ఇంకా అనేక అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకున్నారు.Thoroughly enjoyed this insightful debut podcast by Chanda Kochhar and one of my favorite people @hcmariwala. So many valuable learnings which Harsh has generously shared from his life experiences! Hear the full podcast in https://t.co/Tf2Ax3n8w1 . Some snippets here… pic.twitter.com/dwnkKVeH93— Harsh Goenka (@hvgoenka) February 16, 2025 2017లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ప్రాథమిక విచారణ ప్రారంభించినప్పుడు ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కు రూ.3,250 కోట్ల విలువైన రుణాల కేటాయింపు విషయంలో బ్యాంకు సీఎండీ అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. 2019లో, వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌కు రూ.300 కోట్లు ఇచ్చాన మంజూరు కమిటీలో కొచ్చర్ భాగమని, చివరకు ఆ కంపెనీ దానిని చెల్లించడంలో విఫలమైందని సీబీఐ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఈ కేసులో వేణుగోపాల్ ధూత్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ మధ్య జరిగిన క్విడ్ ప్రోకోలో కొచ్చర్ భాగమని సీబీఐ ఆరోపించింది. వీడియోకాన్‌కు రూ.300 కోట్ల రుణం క్లియర్ అయిన ఒక రోజు తర్వాత దీపక్ కొచ్చర్ కంపెనీ నుపవర్ రెన్యూవబుల్స్‌లో వీడియోకాన్ రూ.64 కోట్లు పెట్టుబడి పెట్టిందని సీబీఐ ఆరోపించింది. -
తెలంగాణలో వెంటనే కొత్త రేషన్‌కార్డులు జారీ చేయాలి... అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం
-
ఏపీ సీఎం చంద్రబాబుతో సీఐడీ బంధం... ‘కరకట్ట బంగ్లా’ కేసులో అటాచ్మెంట్ పొడిగింపు కోరని దర్యాప్తు సంస్థ
-
చంద్రబాబు నాయుడు మోసకారి కాదా? ప్రజలను మోసం చేసినందుకు 420 కేసు పెట్టకూడదా?... వైఎస్సార్సీసీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
జేఈఈ మెయిన్ తొలి సెషన్ ఫలితాలు విడుదల.. 14 మంది విద్యార్థులకు 100 పర్సంటేజ్
-
కులగణన, ఎస్సీల వర్గీకరణపై నివేదికలను ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ
-
‘సూపర్ సిక్స్’ ఇవ్వలేమని స్పష్టంచేసిన ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచికలతో నీతి ఆయోగ్ నివేదికపై ప్రజెంటేషన్‌లో సీఎం వెల్లడి
-
అమెరికాకు ఇక స్వర్ణయుగమే... డొనాల్డ్ ట్రంప్ స్పష్టీకరణ... 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం
-
కేంద్ర మంత్రికి మెటా క్షమాపణలు
మెటా సీఈఓ మార్క్ జూకర్బర్గ్ చేసిన పొరపాటుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు సంస్థ క్షమాపణలు చెప్పింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలపై కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీకి సారథ్యం వహిస్తున్న డాక్టర్ నిషికాంత్ దూబే నేతృత్వంలోని ప్యానెల్ మెటాకు సమన్లు జారీ చేయాలని యోచించినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మెటా సీఈఓ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.కోవిడ్ -19 మహమ్మారిని నిర్వహించడంలో భారత ప్రభుత్వం విఫలమైందని జుకర్‌బర్గ్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో అన్నారు. దాంతో ప్రస్తుత ప్రభుత్వం 2024 ఎన్నికల్లో విజయం సాధించబోదని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఈ అంశంపై అప్పట్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ మార్క్ జూకర్బర్గ్ మాటలు తప్పని రుజువైందన్నారు. ప్రజలు తమ పార్టీకే స్పష్టమైన మెజార్జీ అందించారని చెప్పారు. జూకర్బర్గ్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీకి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ దూబే ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితమైన సమాచారం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ‘ఈ తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేసినందుకు కమిటీ మెటాపై చర్య తీసుకోవాలని చూస్తుంది. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా తప్పుడు సమాచారం దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది. ఈ పొరపాటుకు ఆ సంస్థ భారత పార్లమెంటుకు, ఇక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అని దూబే అన్నారు. ఈ వ్యవహారంపై మెటా స్పందించింది.ఇదీ చదవండి: పనితీరు సరిగాలేదా.. సర్దుకోవాల్సిందే..మెటా పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ శివంత్ తుక్రాల్ కంపెనీ సీఈఓ చేసిన తప్పుకు క్షమాపణలు కోరారు. కంపెనీకి భారత్ ఎంత ప్రాముఖ్యమైందో పునరుద్ఘాటించారు. ‘అధికారంలో ఉన్న అనేక పార్టీలు 2024 ఎన్నికల్లో తిరిగి విజయం సాధించవనే మార్క్ వ్యాఖ్యలు అనేక దేశాలకు వర్తిస్తుంది. కానీ, భారత్ అందుకు మినహాయింపు. ఈ అనుకోని పొరపాటుకు మేం క్షమాపణలు కోరుతున్నాం. కంపెనీకి భారత్ ఎంతో ప్రాముఖ్యమైంది’ అని తుక్రాల్ అన్నారు. -
'ఏది వడ్డించినా సంతోషంగా తింటా': మోదీ
‘జెరోదా’ సహ వ్యవస్థాపకుడు(Zerodha co-founder) నిఖిల్ కామత్(Nikhil Kamath)కు ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తొలి పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండు గంటల సుదీర్ఘ ఇంటర్వ్యూలో పలు అంశాలపై విస్తారంగా ముచ్చటించారు. ముఖ్యంగా భోజనం విషయంలో తన ఆహార వ్యవహారంకి సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. ఆ ఇంటర్వ్వూలో కామత్ ఇటలీలో జరిగిన G7 సమ్మిట్(G7 Summit) గురించి మాట్లాడుతూ ఇటలీ గురించి మోదీకి బాగా తెలుసనని ప్రజలు అంటున్నారని నవ్వుతూ అన్నారు. ఇంటర్నెట్లలో ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని పేరుతో వచ్చిన మెలోడి మీమ్‌లు గురించి కూడా ప్రస్తావించారు. వాటన్నింటిని తోసిపుచ్చుతూ..తనకు ఇటలీ నుంచి తనకెంతో ఇష్టమైన పిజ్జా వచ్చిందని చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఆహారం విషయంలో తాను ఎలా ఉంటాననే దాని గురించి వివరించారు. తాను స్వతాహాగా ఫుడ్డీని కాదన్నారు. ఏదేశంలోనైనా తనకు ఏది వడ్డించినా సంతోషంగా తింటా. ప్రత్యేకంగా ఇది అని నియమం లేదు. అయితే అది శాకాహారమే అయ్యి ఉండాలనేది షరతు. ఇప్పటికీ తనికి రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఆర్డర్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. మెనూ ఇవ్వగానే ఏం తినాలో తెలియదని, అదసలు తనకు అర్థం కాదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో తన తొలినాళ్ల నాటి కథను గుర్తుచేసుకున్నారు. ఆ టైంలో తనకు దివంగత అరుణ్ జైట్లీ తరచుగా తనకు ఆహారం ఆర్డర్ చేయడంలో ఎలా సహాయం చేశారో చెప్పారు. తనకు కూడా ఫుడ్‌ని ఆర్డర్ చేయమని కోరేవాడిని. అయితే అది శాకాహారమే అయ్యి ఉండాలని షరతు విధించేవాడినని నాటి రోజులని గుర్తు చేసుకున్నారు. ఈ పాడ్‌కాస్ట్ ఎపిసోడ్ శ్రోతలకు ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని మరింతగా పరిచయం చేసింది. (చదవండి: నాడు టెక్కీ ఇవాళ లెహంగాల వ్యాపారవేత్త.. ఏడాదికి రూ. 5 కోట్లు.. ) -
నేను దేవుణ్ని కాను...
న్యూఢిల్లీ: ‘‘తప్పులు చేయడం మానవ సహజం. తెలిసీ తెలియక అందరూ తప్పులు చేస్తారు’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘నేను దేవుడిని కాదు. సామాన్య మానవుడినే. కాబట్టి నేను కూడా తప్పులు చేశా’’ అని అంగీకరించారు. అయితే తాను చేసిన తప్పుల్లో చెడు ఉద్దేశం ఏనాడూ లేదని స్పష్టం చేశారు. మనుషులు చేసే తప్పుల వెనుక ప్రమాదకరమైన ఉద్దేశాలు ఉంటాయని అనుకోవడం లేదన్నారు. ‘జెరోదా’ సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌కు మోదీ ఆదివారం తొలి పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. రెండు గంటల సుదీర్ఘ ఇంటర్వ్యూలో పలు అంశాలపై విస్తారంగా ముచ్చటించారు. తన రాజకీయ ప్రస్థానంతో సహా పలు అంశాలపై మనసు విప్పారు. తన జీవితంలోని అనేక దృక్కోణాలను ప్రస్తావించారు. తప్పులు చేస్తానని తాను తొలిసారి సీఎం అయినప్పుడే ప్రజలకు చెప్పానని గుర్తు చేసుకున్నారు. ఆ తప్పుల్లో చెడు ఉద్దేశం మాత్రం ఉండదని వివరించానన్నారు. పాడ్‌కాస్ట్‌లో మోదీ ఏం చెప్పారంటే... గోద్రాలో భావోద్వేగాలు అదుపు చేసుకున్నా ‘‘గుజరాత్ సీఎం అయిన తొలినాళ్లలో ఓ సభలో మాట్లాడుతూ మూడు విషయాలు ప్రజలతో పంచుకున్నా. ‘‘నా కృషిలో ఏ లోపమూ లేకుండా జాగ్రత్త పడతా. నాకోసం ఏదీ చేసుకోను. మనిషిని కాబట్టి తప్పులు చేస్తా, కానీ వాటిలో చెడుద్దేశం ఉండబోదు’’ అని వివరించా. ఆ మూడూ నాకు జీవన మంత్రాలు! 2002 ఫిబ్రవరి 27న గోద్రా రైలు దహనం గురించి తెలియగానే అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నా. చూస్తే హెలికాప్టర్ అందుబాటులో లేదు. చివరకు బహుశా ఓఎన్జీసీకి చెందిన సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ సమకూర్చినా, అది వీఐపీలకు ఉద్దేశించింది కాదంటూ భద్రతా సిబ్బంది అభ్యంతరపెట్టారు. ‘నేను వీఐపీని కాను, మామూలు పౌరుడినే’నని బదులిచ్చి అందులోనే గోద్రా చేరుకున్నా. అందుకోసం ఎంతో వాదించాల్సి వచ్చింది. చివరికి, ఏం జరిగినా నాదే బాధ్యత అని రాసివ్వడానికి కూడా సిద్ధపడ్డా. అంతే తప్ప రిస్క్ చేయడానికి వెనకాడలేదు. తీరా వెళ్లాక గోద్రాలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. నేనూ మనిషినే. నాకూ భావోద్వేగాలుంటాయి. కానీ సీఎంను గనుక వాటికి దూరంగా ఉండాలని నాకు తెలుసు. అందుకే భావోద్వేగాలను అదుపు చేసుకున్నా. అందుకోసం మానసికంగా చేయగలిగిందంతా చేశా. ఆ ఫలితాల రోజు నాలో ఆదుర్దా కలగలేదని చెప్పలేను. కానీ దాన్ని అధిగమించాలని గట్టిగా అనుకున్నా. అందుకే మధ్యాహ్నం దాకా ఫలితాల గురించి నాకు చెప్పొద్దని సిబ్బందికి సూచించా. ఆ రోజు టీవీ కూడా చూడలేదు. మధ్యాహ్నానికల్లా నా ఇంటిముందు ఆనందోత్సాహాలు మిన్నంటాయి. చూస్తే మాకు మూడింట రెండొంతుల మెజారిటీ దక్కింది. మిత్రులు నన్ను సీఎంగానే చూసేవారు నా చిన్నప్పుడు అప్పుడప్పుడు మా కుటుంబ సభ్యుల బట్టలు ఉతికేందుకు ఇష్టపడేవాడిని. అలాగైతే చెరువు దగ్గరికి వెళ్లనిస్తారు కదా! సీఎం అయ్యాక కూడా చిన్నప్పటి మిత్రులను అధికారిక నివాసానికి ఆహా్వనిస్తూ ఉండేవాడిని. కానీ వారు నన్ను సీఎంగానే చూసేవారు. దాంతో నన్ను ‘నీవు’ అని పిలిచేవారే కరువయ్యారు. రాజకీయాల్లో సొంత లాభం కూడదు వ్యాపారానికి, రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉంది. వ్యాపారంలో వ్యక్తిగత, ఆర్థిక అభివృద్ధే ముఖ్యం. రాజకీయాల్లో మాత్రం సమాజ సంక్షేమానికే ప్రాధాన్యమివ్వాలి. అందుకు ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. సొంత లాభం మానుకోవాలి. వ్యాపారంలో ఎలా పైకి ఎదగాలన్నదే కీలకం. రాజకీయాల్లో త్యాగాలెలా చేయాలన్నది కీలకం. వ్యాపారంలో కంపెనీని నంబర్‌వన్‌గా ఎలా మార్చాలో ఆలోచించాలి. రాజకీయాల్లో మాత్రం దేశమే తొలి ప్రాధాన్యం కావాలి. దేశాన్ని నంబర్‌వన్‌గా మార్చే ఆలోచన చేయాలి. రాజకీయాలంటే కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం కాదు. అది ప్రజాసేవకు సంబంధించిన అంశం. వ్యక్తిగత ఆశల కంటే ప్రజాసేవే పరమావధి కావాలి. అంతేతప్ప రాజకీయాలంటే ‘లేనా, పానా, బనానా (దండుకోవడం)’ కాదు. అలాంటివారు దీర్ఘకాలం కొనసాగలేరు.కంఫర్ట్ జోన్లో ఉండలేను నేనెప్పుడూ కంఫర్ట్ జోన్లో జీవించలేదు. అలా ఉండిపోయేవారు విజయాలు సాధించలేరు. కంఫర్ట్ జోన్ బయట ఉన్నా గనుక ఏం చేయాలో నాకు తెలిసింది. సురక్షిత స్థానంలో ఉండిపోవడానికి నేను సరిపోనేమో! రిస్క్ తీసుకొనే మనస్తత్వమే మనల్ని ముందుకు నడుపుతుంది. అయితే రిస్క్ తీసుకొనే సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వాడుకోలేదు. చిన్నచిన్న విషయాలే నాకు సంతృప్తినిచ్చాయి. పాత ఆలోచనలు వదిలేయడానికి నేనెప్పుడూ సిద్ధమే. నాది సాధారణ నేపథ్యంనేను అతి సాధారణమైన నేపథ్యం నుంచి వచ్చా. నేను ప్రాథమిక పాఠశాల టీచర్నయినా నా తల్లి ఆనందంతో అందరికీ స్వీట్లు పంచేదేమో! అలాంటి నేపథ్యం నాది. చిన్నప్పుడు స్కూల్లో సాధారణ విద్యార్థినే. కేవలం పాసయ్యేందుకు చదివేవాడిని. ఇతర కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొనేవాడిని. సైనిక్ స్కూల్లో చేరేందుకు దరఖాస్తు చేయడానికి నా తండ్రి అంగీకరించలేదు. డబ్బు లేకపోవడమే అందుకు కారణం. అయినా నేనెప్పుడూ అసంతృప్తి చెందలేదు. జీవితంలో నేను ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందులే నాకు యూనివర్సిటీ. అవే నాకెన్నో పాఠాలు నేర్పాయి. పుట్టుక, చావు గురించి నేనేనాడూ ఆలోచించలేదు. సీఎం అయినప్పుడు నేనెలా అయ్యానని ఆశ్చర్యపోయా’’. గాంధీ ఎన్నడూ టోపీ ధరించకున్నా.. ‘‘మహాత్మా గాంధీ తన జీవితంలో ఎన్నడూ టోపీ ధరించలేదు. కానీ గాంధీ టోపీని ప్రపంచమంతా నేటికీ గుర్తుంచుకుందంటే ఆయన నాయకత్వ పటిమే కారణం. గాంధీ గొప్ప వక్త కాకపోయినా ప్రజలతో మమేకమయ్యే విషయంలో ఆయనకు ఆయనే సాటి! తన వ్యక్తిత్వం, పనితీరుతో దేశమంతటినీ ఒక్కటి చేసి చూపాడు! రాజకీయాల్లో ప్రవేశించడం సులువే. కానీ రాణించడమే కష్టం. అందుకు తిరుగులేని అంకితభావం, ప్రజలతో మమేకమవడం, వారి మంచి చెడుల్లో అండగా నిలవడం, చక్కని భావ వ్యక్తీకరణ వంటి లక్షణాలు చాలా అవసరం. అందుకే వ్యక్తిగత ఆకాంక్షలు లేని, నిస్వార్థంగా దేశ సేవ చేయాలన్న భావన నరనరానా నింపుకున్న కనీసం లక్షమంది యువకులు కావాలిప్పుడు’’.‘మెలోడీ’ మీమ్స్‌పై.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో తన పేరును కలిపి మెలోడీ అంటూ సాగిన మీమ్స్ వెల్లువను ప్రస్తావించగా మోదీ సరదాగా స్పందించారు. ‘‘అలాంటివి నడుస్తూనే ఉంటాయి (వోతో చల్తా హీ రహేగా)’’ అన్నారు. అలాంటి వాటిపై సమ యం వృథా చేసుకోనన్నారు. ‘‘నేను భోజనప్రియుణ్ని కాదు. పర్యటనలప్పుడు అందుబాటులో ఉన్నది తింటా. రెస్టారెంట్‌కు తీసుకెళ్లి మెనూ చేతికిస్తే ఏం కావాలో ఆర్డర్ కూడా ఇవ్వలేను. అలాంటప్పుడు దివంగత అరణ్ జైట్లీ నన్ను ఆదుకునేవారు’’ అని చెప్పుకొచ్చారు.జిన్‌పింగ్‌తో ప్రత్యేక బంధం చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో తన తొలి సంభాషణను మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘2014లో నేను ప్రధాని అయ్యాక ఎందరో దేశాధినేతలు అభినందనలు తెలియజేశారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా మాట్లాడారు. ఇండియాలో పర్యటించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘తప్పకుండా రండి, మీకు స్వాగతం’ అని చెప్పాను. ‘‘గుజరాత్లో మీ సొంతూరు వాద్‌నగర్‌ను సందర్శించాలని ఉంది. ఎందుకంటే మనిద్దరి మధ్య ప్రత్యేక బంధం ఉంది. అలనాటి ప్రఖ్యాత చైనా తత్వవేత్త, పర్యాటకుడు హుయాన్‌త్సాంగ్ వాద్నగర్లో చాలాకాలం నివసించారు. చైనాకు తిరిగొచ్చాక నా స్వగ్రామంలో నివసించారు’ అని జిన్‌పింగ్ చెప్పుకొచ్చారు’’ అంటూ మోదీ గుర్తు చేసుకున్నారు.An enjoyable conversation with @nikhilkamathcio, covering various subjects. Do watch... https://t.co/5Q2RltbnRW— Narendra Modi (@narendramodi) January 10, 2025 ప్రధాని రేసులో నేనూ ఉన్నా.. భారత సంతతి కెనడా ఎంపీ -
దేవుడి పేరుతో ఉపవాసం ఉండండి : పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్(Puri Jagannadh) కొన్నాళ్లుగా యూట్యూబ్ వేదికగా ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకుంటున్న సంగతి తెలిసిందే. పూరి నిర్వహిస్తున్న ఈ పాడ్‌కాస్ట్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. సరికొత్త విషయాలను చెబుతూ తన అభిమానులకు జ్ఞానంతో పాటు కొన్ని విషయాల్లో ధైర్యాన్ని కూడా అందిస్తున్నాడు. తాజాగా ఈ డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ ‘ఆటోఫజీ’ అనే పదానికి అర్థం వివరిస్తూ దాని వెనుక ఉన్న కథను చెప్పాడు.‘‘ఆటోఫజీ’అనేది ఓ గ్రీకు పదం. ఆటో అంటే సెల్ఫ్ అని, ఫజీ అంటే తినడం అని అర్థం. దీన్నే ఇంగ్లీష్‌లో సెల్ఫ్ ఈటింగ్ అంటారు. ఇది శరీరంలో జరిగే జహన ప్రక్రియ. మన శరీరంలో ఉన్న పనికి రాని, దెబ్బతిన్న కణాలను మన శరీరమే తినేస్తుంది. ఆటోఫజీ(Autophagy) అనేది శరీరంలో జరిగే రీసైక్లింగ్ ప్రక్రియ. మన ఆరోగ్యానికి హానికలిగించే ఏ పదార్థం ఉన్నా, దాన్ని కూడా బయటకు పంపుతుంది. అలాగే, దెబ్బతిన్న ప్రొటీన్లను తీసేస్తుంది. ఈ ఆటోఫజీ వల్ల మన మెటబాలిజం పెరిగి, మరింత శక్తి చేకూరుతుంది. వృద్ధాప్య ఛాయలు కనపడకుండా చేస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్‌లాంటి రోగాలు రాకుండా చేస్తుంది. మనం ఉపవాసం ఉన్నప్పుడు, వ్యాయామం చేసినప్పుడే ఈ ఆటోఫజీ సక్రమంగా జరుగుతుంది. హీట్ అండ్ కోల్డ్ థెరపీలోనూ బాగా పనిచేస్తుంది. దీని వల్ల మన జీవన కాలం పెరుగుతుంది. మన ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. అందుకే పెద్దలు ఉపవాసం అలవాటు చేశారు. మీరు కూడా ఏదో ఒక దేవుడి పేరు చెప్పి, అప్పుడప్పుడు ఉపవాసాలు చేయండి. మీ వ్యాధి నిరోధకశక్తి, మెదడు పనితీరు పెరుగుతుంది. రోజూ వ్యాయామం, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మంచిది. మన టిష్యులు రిపేర్ అయి, శరీరంలో హీలింగ్ ప్రక్రియ వేగం అవుతుంది. జపాన్‌కు చెందిన యష్నోరి అనే బయాలజిస్ట్ ఈ ఆటోఫజీ గురించి మొదట కనుక్కొన్నాడు. అతడికి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. ఉపవాసాలు, వ్యాయామాలు, చన్నీటి స్నానాల వల్ల ఆటోఫజీ యాక్టివేట్ అయి, ఆరోగ్యంగా ఉంటారు. దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే, మీ డాక్టర్‌ను సంప్రదించండి’ అని పూరి అన్నారు. ఇక సినిమాల విషయాలకొస్తే..పూరి ఇటీవల తెరకెక్కించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్దా బోల్తా కొట్టాయి. భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన ‘లైగర్’ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌గా తీసిన డబుల్ ఇస్మార్ట్ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో పూరి కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం పలు కథలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ స్టార్ హీరోతో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
సమంత సలహాపై విమర్శలు.. ఈ పని అప్పుడే చేయాల్సింది!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్: హనీ బన్నీ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో వరుణ్ ధావన్‌కు జోడీగా కనిపించనుంది. ఆ తర్వాత మా ఇంటి బంగారం అనే చిత్రంలో నటించనుంది. గతేడాది చివరిసారిగా ఖుషీ చిత్రంలో కనిపించింది సామ్. మయోసైటిస్ నుంచి కోలుకున్నాక ఇప్పుడిప్పుడే సినిమాల్లో ఫుల్ యాక్టివ్ అవుతోంది.గతంలో మయోసైటిస్ చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆరోగ్యానికి సంబంధించి పాడ్‌కాస్ట్‌లు విడుదల చేస్తోంది. కొద్ది రోజుల క్రిత ఆమె ఇచ్చిన వైద్య సలహాపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. నెబ్యులైజేషన్ కోసం హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించాలంటూ సమంత సూచించింది. అయితే దీనిపై కొంతమంది వైద్యులతో పాటు పలువురు సమంత సలహాను తప్పుబట్టారు.అయితే సమంత తాజాగా మరో పాడ్‌కాస్ట్‌ను రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా స్టోరీస్ ద్వారా పంచుకుంది. అయితే ఈ సారి ముందు జాగ్రత్తగా డిస్క్లైమర్ను కూడా రాసుకొచ్చింది. ఈ ఎపిసోడ్లో ఉన్న ఆడియో, టెక్స్ట్, గ్రాఫిక్స్, ఇమేజ్‌లు కేవలం సమాచారం కోసమేనని తెలిపింది. ఈ ఎపిసోడ్‌లోని అంశాలు వైద్య సలహా, రోగ నిర్ధారణ, చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించింది కాదు.. వైద్య చికిత్సకు సంబంధించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీరు వైద్యుడిని సంప్రదించండి అంటూ డిస్‌క్లైమర్‌లో వివరించింది. కాగా.. గతంలో తన సలహాపై పెద్దఎత్తున విమర్శలు రావడంతోనే ఈ నిర్ణయం తీసుకుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా మరోసారి విమర్శలు రాకుండా సమంత జాగ్రత్త పడిందని మరికొందరు అంటున్నారు. కాగా.. సమంత రూత్ ప్రభు టేక్ -20 అనే పేరుతో హెల్త్ పాడ్‌క్యాస్ట్‌ని నిర్వహిస్తోంది. -
సినిమాల్లేవుగా సంపాదన ఎలా? హీరో సుశాంత్ ప్రేయసి సమాధానమిదే!
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరు తలుచుకున్నప్పుడల్లా చిన్న వయసులో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడా అని ఫ్యాన్స్ ఇప్పటికీ బాధపడుతుంటారు. సుశాంత్ చనిపోయిన తర్వాత అతడి ప్రేయసి, హీరోయిన్ రియా చక్రవర్తిపై లెక్కలేనన్ని విమర్శలు వచ్చాయి. ఈమె వల్లే చనిపోయాడని కూడా అన్నారు. ఇప్పటికే పూర్తిగా యాక్టింగ్‌కి దూరమైపోయిన రియా.. ఏం చేస్తున్నాను? సంపాదన ఎలా అనే విషయాల్ని తన పాడ్‌కాస్ట్‌లో బయటపెట్టింది.(ఇదీ చదవండి: 'కల్కి 2898' టీమ్‌కి లీగల్ నోటీసులు.. హీరో ప్రభాస్‌కి కూడా!)'ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను. నా జీవనాధారం ఏంటని కొందరు అడుగుతున్నారు. గత కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. మోటివేషనల్ స్పీకర్‌గా మారి డబ్బులు సంపాదిస్తున్నాను. నా జీవితంలో ఇది రెండో ఛాప్టర్ అని చెప్పొచ్చు. గతంలో ఏం జరిగిందో, ఎలాంటి బాధ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ఎవరికి వాళ్లు ఏదేదో ఊహించని, నా గురించి అన్ని తెలిసినట్లు చాలా విమర్శలు చేశారు. ఇంకొందరైతే నేను చేతబడి చేశానని అన్నారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నిజాయతీగా ఉన్నా, ధైర్యంగా ముందుకు సాగుతున్నాను' అని రియా చక్రవర్తి చెప్పుకొచ్చింది.బ్యాక్ గ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌లోకి వచ్చిన సుశాంత్ సింగ్.. 'చిచ్చోరే' లాంటి సినిమాలతో హీరోగా చాలా ఫేమ్ సంపాదించాడు. కానీ ఏమైందో ఏమో గానీ 2020 జూన్‌లో ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీనికి బాలీవుడ్‌లోని నెపోటిజం కల్చరే కారణమని, బడా హీరోలే ఇతడికి అవకాశాలు రాకుండా చేసి, మానసికంగా హింసపెట్టి చంపేశారని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఇతడి ప్రేయసి రియాపై కూడా విపరీతమైన ట్రోల్స్ రావడంతో ఇప్పుడు ఆమె పూర్తిగా నటనకు దూరమైపోయింది. తాజాగా ఈ విషయాన్ని ఈమెనే బయటపెట్టింది.(ఇదీ చదవండి: భార్య ఉపాసనకి కొత్త పేరు పెట్టిన రామ్ చరణ్) -
ఆంధ్రప్రదేశ్‌లో ‘తల్లికి వందనం’ పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు యూటర్న్... ఇంట్లో పిల్లలందరికీ కాకుండా ఒక్కరికే అంటూ మోసం .. ఇంకా ఇతర అప్డేట్స్
-
స్టార్ హీరోయిన్ కోసం చెరువులో దూకిన అభిమాని.. ఆ తర్వాత!
హీరోహీరోయిన్లకు అభిమానులు చాలా మంది ఉంటారు. కానీ కొందరు మాత్రం అభిమానం పేరుతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. తెలుగులో చాలామంది స్టార్ హీరోలకు ఇలాంటి ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్లు చేసే అతి మామూలుగా ఉండదు. రీసెంట్గా అలాంటి ఓ వీరాభిమాని, తన అభిమాన హీరో దర్శన్ చేతిలో హత్యకు గురయ్యాడు. దీని గురించి అలా వదిలేస్తే.. హీరోయిన్ సోనాలి బింద్రే కోసం ఓ అభిమాని ఏకంగా చెరువులు దూకి చనిపోయాడు. అప్పుడెప్పుడో జరిగిన ఈ సంఘటన తాజాగా మరోసారి చర్చనీయాంశమైంది.1999,2000ల కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్గా స్టార్డమ్ అనుభవించిన సోనాలి బింద్రే.. కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే పెళ్లి చేసుకుంది. కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడి.. దాన్నుంచి బయటపడింది కూడా. ఇప్పటికీ అడపాదడపా యాక్టింగ్ చేస్తున్న సోనాలి బింద్రే.. తాజాగా ఓ పాడ్ కాస్ట్ షోలో పాల్గొంది. తన గురించిన ఒకప్పటి విషయాల్ని బయటపెట్టింది.(ఇదీ చదవండి: హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో)అప్పట్లో షూటింగ్ కోసమని సోనాలి.. భోపాల్ వెళ్లింది. అయితే ఈమెని చూసేందుకు ఓ అభిమాని చెరువులో దిగి మృత్యువాత పడ్డాడు. దీని గురించి ఏమైనా తెలుసా? అని సోనాలిని యాంకర్ అడగ్గా.. 'ఆ సంఘటనని నిజంగా నమ్మలేకపోతున్నాను. ఈ క్రేజీ ఫ్యాన్ కల్చర్ నాకు అస్సలు అర్థం కాదు. ఇప్పటికీ ఆ సంఘటన గురించి తెలిదు. ఇంతకీ నిజంగానే అలా జరిగిందా? అసలు అభిమాన హీరోయిన్ చూడటం కోసం ప్రాణాలు కోల్పోవడం చాలా బాధకరమైన విషయం. నమ్మలేకపోతున్నా' అని విచారం వ్యక్తం చేసింది.'అప్పట్లో మెయిల్స్, ఉత్తరాలు నాకు చాలా వచ్చేవి. కొందరు రక్తంతో ఉత్తరాలు రాసేవారు. అది నిజంగా వాళ్ల రక్తమేనా? అది రక్తమేనా అనే సందేహం వచ్చేసింది. ఎందుకు మనుష్యులు.. తమలాంటి మరో మనిషి కోసం ఇంతలా తాపత్రయపడతారో అర్థమయ్యే కాదు. బాలీవుడ్‌లోని ఫ్యాన్ కల్చర్, హీరోహీరోయిన్ పట్ల అతిప్రేమ నాకు అస్సలు ఇష్టముండదు' అని సోనాలి బింద్రే చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!) -
దేశ అభివృద్ధి కోసమే మూడోసారి బీజేపీ ప్రభుత్వం, ఈ ఎన్నికల్లో గెలుపు నా కోసం, నా కుటుంబం కోసం కాదు.. ప్రధాని మోదీ స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఆ ఏడాది నాకు చాలా కష్టంగా గడిచింది: సమంత
హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పేరుకే తమిళమ్మాయి గానీ టాలీవుడ్లో వరస సినిమాలు చేసింది. అలానే హీరో నాగచైతన్యని పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలైపోయింది. అయితే వ్యక్తిగత కారణాలతో 2021లో సమంత-చైతూ విడాకులు తీసుకున్నారు. ఇది జరిగిన ఏడాది సమయంలోనే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడినట్లు సామ్ బయటపెట్టింది. ఇప్పుడు దాన్నుంచి కోలుకుంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. 'ఏ మాయ చేశావె' సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న సమంత.. ఆ తర్వాత తెలుగులో మహేశ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. మయోసైటిస్ వ్యాధి చికిత్స కోసం సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇచ్చేసింది. చివరగా 'ఖుషి' చేసింది. ప్రస్తుతం ఈమె చేతలో కొత్త ప్రాజెక్టులేం లేవు. దీంతో యూట్యూబ్ ఛానెల్లో పాడ్ కాస్ట్ మొదలుపెట్టింది. తాజాగా తొలి ఎపిసోడ్ వీడియో రిలీజ్ చేసింది. ఇందులోనే ఆటో ఇమ్యూనిటీ గురించి మాట్లాడింది. (ఇదీ చదవండి: బాలీవుడ్లో డబ్బులిచ్చి ఆ పని చేయించుకుంటారు: ప్రియమణి) సమంతతో పాటు ఈ పాడ్ కాస్ట్లో ప్రత్యేక నిపుణుడు అల్కేశ్తో కనిపించింది. అతడు ఆటో ఇమ్యూనిటీ గురించి వివరంగా చెప్పుకొచ్చాడు. 'శరీరంలోని చెడు కారకాలు.. బయటికి వెళ్లే చెడు కారకాల మధ్య బ్యాలెన్స్(సమ తుల్యత) దెబ్బతిన్నప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. ప్రస్తుత జీవన విధానంలో పర్యావరణానికి సంబంధించిన టాక్సిక్స్ (చెడు కారకాలు) ఎక్కువగా ఉన్నాయి. కాస్మోటిక్స్, దుస్తులు, వంట సమాన్లతో పాటు చాలా విషయాలు.. ఆటో ఇమ్యూనిటీ విషయంలో ప్రభావం చూపిస్తాయి' అని ఇతడు చెప్పుకొచ్చాడు. దీనిపై స్పందించిన సమంత.. 'చాలామంది మంచి ఆహారం తింటూ బాగున్నామని, ఎలాంటి సమస్యలు రావని అనుకుంటున్నారు. నేను కూడా అలానే అనుకున్నాను కానీ ఆటో ఇమ్యూనిటీ సమస్యని ఎదుర్కోవాల్సి వచ్చింది. తద్వారా మయోసైటిస్ బారిన పడ్డాను. అయితే వ్యాధి రావడానికి ముందు ఏడాది అయితే నాకు చాలా కష్టంగా గడిచింది' అని సమంత చెప్పుకొచ్చింది. ఈ వీడియో బట్టి సమంతకు సౌందర్య సాధనాలు (కాస్మోటిక్స్) వల్లే మయోసైటిస్ సమస్య ఏర్పడిందా అనే సందేహం కలుగుతోంది. (ఇదీ చదవండి: తల్లి కాబోతున్న 'కల్కి' హీరోయిన్? పెళ్లయిన ఆరేళ్లకు ఇలా!) -
ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన చలి తీవ్రత.. వణుకుతున్న మన్యం జిల్లాలు..ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన చలి తీవ్రత.. వణుకుతున్న మన్యం జిల్లాలు
-
పాడ్‌కాస్ట్‌కు మరింతగా పెరుగుతున్న ఆదరణ!
వీడియోలను విరివిగా చూడటం అనేది కోవిడ్ కాలం తర్వాత వేగంగా పెరిగింది. ఇంట్లోనే ఉండాల్సిన నాటి సమయంలో వినోదం కోసం వీడియోలను చూస్తూ టైమ్‌పాస్ చేశారు. వీడియోలపై ప్రేక్షకులకు పెరుగుతున్న క్రేజ్‌ను గమనించిన బడా టెలివిజన్ నెట్‌వర్క్‌లు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లోకి ప్రవేశించాయి. ఇప్పుడు ఓటీటీలకు ప్రత్యామ్నాయంగా పాడ్కాస్ట్ల ట్రెండ్ మరింతగా పెరుగుతోంది. పాడ్‌కాస్ట్..అంటే మోడ్రన్ రేడియో.. విద్య, వినోదం, వార్తలు, మత ప్రసంగాలు, నవలలు, మతపరమైన పుస్తకాలు, సాహిత్యం... ఇలా సమస్తం ఇప్పుడు ఆడియో రూపంలో మనకు అందుబాటులోకి వస్తున్నాయి. యువత, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులలో పాడ్కాస్ట్పై విపరీతమైన క్రేజ్ పెరుగుతోంది. భారీ కోచింగ్ సెంటర్లు, పాఠశాలలు, కళాశాలలు చదువును ఎలా సులభతరం చేయాలనే దానిపై దృష్టి సారిస్తున్నాయి. కోవిడ్ కాలంలో ఆన్లైన్ తరగతులు విరివిగా నిర్వహించేవారు. అయితే ఇప్పుడు పెద్దపెద్ద విద్యా కేంద్రాలు సిలబస్‌ను ఆడియో రూపంలో మార్చడానికి, విద్యార్థులకు సరళమైన భాషలో పాఠాలను బోధించేందుకు కృషి చేస్తున్నాయి. ఆడియో బుక్కు సంబంధించిన మెటీరియల్‌ను వివిధ సబ్జెక్టుల నిపుణులు సరళమైన భాషలో సిద్ధం చేస్తున్నారు. వాటిని నిపుణుల సహకారంతో ఆడియో బుక్‌గా మార్చి విద్యార్థులకు అందుబాటులో ఉంచుతున్నారు. మొబైల్లోని విద్యాసంబంధిత పాడ్‌కాస్ట్‌ను ఆన్ చేసి, చెవుల్లో ఇయర్ఫోన్లు పెట్టుకుని విద్యార్థులు సులభంగా వాటిని వినవచ్చు. అర్థం కాని సందర్భంలో మరోమారు వినేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. వినోదం కోసం ఇప్పుడు స్టోరీ పాడ్‌కాస్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా వివిధ రకాల కథలను వినేందుకు అవకాశం ఏర్పడుతోంది. క్రైమ్, హర్రర్, కామెడీ ఇలా విభిన్న తరహాలలోని కథలు మనం వినవచ్చు. సెలబ్రిటీ వాయిస్‌లలో రికార్డ్ చేసిన పాడ్‌కాస్ట్‌లు, ఆడియో పుస్తకాలు ఇప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. వాటికి విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రేరణాత్మక ప్రసంగాలు మొదలుకొని మతపరమైన ప్రసంగాల వరకు సమస్తం పాడ్‌కాస్ట్ రూపంలో మన ముందుకు వచ్చాయి. వివిధ పాడ్‌కాస్ట్ యాప్‌లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. పలువురు మోటివేషనల్ స్పీకర్లు తమ పాడ్‌కాస్ట్‌లను విడుదల చేస్తున్నారు. ప్రపంచం, దేశం, రాష్ట్రం, స్థానిక వార్తలను అందించే పలు పాడ్‌కాస్ట్‌లు ఆదరణ పొందుతున్నాయి. న్యూస్ యాప్‌లలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళల్లో ప్రత్యేక పాడ్‌కాస్ట్ బులెటిన్లను చాలామంది క్రమం తప్పక వింటున్నారు. ఇప్పుడు పాడ్‌కాస్ట్‌లలో షేర్ ట్రేడింగ్ మొదలుకొని ఉద్యోగంలో విజయం వరకు అనేక రకాల సమాచారం విశేష ఆదరణ పొందుతోంది. ఇది కూడా చదవండి: ఒడిశా, బీహార్ గుణపాఠాల తర్వాత రైల్వేశాఖ ఏం చేస్తున్నదంటే.. -
ఆస్ట్రేలియాను ఇపుడు కొంటారా? సత్య నాదెళ్ల షాకింగ్ స్పందన
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా క్రికెట్ అభిమాని. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చాలాసార్లు పలు వేదికల మీద ప్రకటించారు. క్రికెట్ పట్ల తనకున్న ప్రేమ, తనకు టీం కృషిని, నాయకత్వాన్ని నేర్పిందని, అది కార్పొరేట్ ప్రపంచంలో కీలక మలుపులను అధిగమించడంలో సహాయపడిందని పేర్కొన్నారు. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ను, అంతకు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌ను కూడా వీక్షించారు. రాత్రంతా మేల్కొని మరీ మ్యాచ్ చూశాంటూ ఇండియా విజయాన్ని ఎంజాయ్ చేశారు. కానీ ఫైనల్లో ఇండియా ఓటమి కోట్లాదిమంది అభిమానులను నిరాశపర్చింది. ఈ సందర్భంగా టైటిల్ చేజార్చుకున్న రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు కృషిని ప్రశంసించిన నాదెళ్ల కప్ గెలుచుకున్న ఆసీస్‌ను అభినందించారు. అలాగే అయితే తాజాగా ఒక పోడ్కాస్ట్లో సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. కారా స్విషర్ పోడ్కాస్ట్లో మాట్లాడిన సత్య నాదెళ్ల పలు విషయాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా భారతదేశం ఓడిపోయిన తర్వాత ఆస్ట్రేలియాను కొనుగోలు చేయాలనుకుంటున్నారా అని కారా సరదాగా ప్రశ్నించాడు. దీనికి నాదెళ్ల మాట్లాడుతూ ఓపెన్ఏఐని కొనుగోలు చేయడం, ఆస్ట్రేలియాను కొనడం రెండూ ఒకటి. ఈ రెండింటీలో ఏదీ సాధ్యం కాదు. అయితే ఓపెన్ఏఐతో భాగస్వామిగా ఉండటంతోపాటు ఆసీస్ క్రికెట్‌ను కూడా ఆస్వాదిస్తామంటూ సమాధాన మిచ్చారు. దీంతో భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇది ఇలా ఉంటే చాట్‌జీపీటీ సృష్టికర్త శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన AI పరిశోధనా సంస్థ OpenAI, సామ్ ఆల్ట్‌మన్‌ను ఆకస్మికంగా తొలగించింది. దీంతో ఆల్ట్మాన్ ఆహ్వానం పలికిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ళ ఆయన మైక్రోసాఫ్ట్‌లో చేరుతున్నారని, అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ టీమ్‌ను ముందుండి నడిపిస్తారని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణాలు, నగరాల్లో రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశం..ఇంకా ఇతర అప్డేట్స్
-
పీ ఫర్ పాడ్‌కాస్ట్.. బీ ఫర్ భార్గవి
లాక్డౌన్ లైఫ్స్టైల్లో మెరిసిన ఒక ట్రెండ్.... పాడ్‌కాస్ట్. ‘పాడ్‌కాస్ట్’ పాపులారిటీ గురించి వినడమేగానీ దాని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడానికి, సక్సెస్ఫుల్ పాడ్‌కాస్టర్‌గా రాణించాలనుకునే వారికి సాధికారికమైన సమాచారం కరువైంది. ఈ లోటును పూరించడానికి మంచి పుస్తకాన్ని తీసుకువచ్చి ఔత్సాహికులకు మేలు చేసింది భార్గవి.. లీడింగ్ హెచ్ఆర్ కన్సల్టింగ్ కంపెనీ ‘ఎక్సెల్ కార్పోరేషన్’కు సీయీవోగా ఉన్న బెంగళూరుకు చెందిన భార్గవి స్వామి మన దేశంలోని లీడింగ్ పాడ్కాస్టర్లలో ఒకరు. కంటెంట్ ప్రొడ్యూసర్‌గా కూడా తన సత్తా చాటుతుంది. మన దేశంలో పాడ్కాస్ట్పై వచ్చిన తొలిపుస్తకం ‘పీ ఫర్ పాడ్‌కాస్ట్’ రచయిత్రిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తన అనుభవాలను క్రోడీకరించి ఫస్ట్–పర్సన్లో రాసిన ఈ పుస్తకం పాడ్‌కాస్ట్ గురించి ప్రాథమిక విషయాలను తెలుసుకోవాలనుకునేవారికి దిక్సూచిలా నిలిచింది. ‘ఆర్ట్ ఆఫ్ పాడ్‌కాస్టింగ్’ను అక్షరాల్లోకి తెచ్చింది. బిజినెస్ పాడ్‌కాస్ట్ షో ‘పీపుల్ హూ మ్యాటర్’తో సక్సెస్ఫుల్ పాడ్‌కాస్టర్‌గా పేరు తెచ్చుకుంది భార్గవి. పాడ్‌కాస్టర్‌గా ప్రయాణం మొదలుపెట్టే ముందు దాని లోతుపాతులు ఏమిటో తెలుసుకోవడానికి చిన్నపాటి రీసెర్చ్ లాంటిది చేసింది. అయితే పాడ్‌కాస్టర్‌గా తొలి అడుగులు వేయడానికి అవసరమైన సమాచారం దొరకడం గగనం అయింది. ‘జీరో ఇన్ఫర్మేషన్’ అనేది వెక్కిరిస్తున్నా తన పరిశోధనలో ఎక్కడా తగ్గింది లేదు. మాస్కమ్యూనికేషన్లో మాస్టర్స్ చేసిన భార్గవి తనదైన పద్ధతిలో పరిశోధన చేస్తూ సమాచారాన్ని సంపాదించింది. ‘తెలుసుకోవడానికి ఇన్ని విషయాలు ఉన్నాయా!’ అనిపించింది. తాను సక్సెస్ఫుల్ పాడ్‌కాస్టర్‌గా రాణించడానికి అవి మంచి మార్గాన్ని చూపాయి. తన సక్సెస్‌తోనే ఆగిపోకుండా పాడ్‌కాస్టింగ్‌లో సక్సెస్ కావాలనుకునేవారి కోసం ‘పీ ఫర్ పాడ్‌కాస్టింగ్’ అనే పుస్తకం రాసింది. వెబ్‌సీరీస్‌ల కోసం స్క్రిప్ట్ రాసినప్పుడు ఫస్ట్ డ్రాఫ్ట్‌లోనే ఓకే అయిపోయేది. ‘పీ ఫర్ పాడ్‌కాస్టింగ్’ విషయంలో మాత్రం పలుసార్లు పుస్తకాన్ని తిరగరాసింది. ఏదో ఒక విషయాన్ని కొత్తగా చేరుస్తూ వచ్చింది. ఈ పుస్తకానికి భార్గవి తల్లి ఎడిటర్లా వ్యవహరించింది. సూచనలు ఇచ్చింది. తల్లితో కలిసి ఈ ప్రాజెక్ట్ మీద పనిచేయడం భార్గవికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ‘పుస్తకాలు ఎక్కువగా చదవడం వల్ల రచనల ద్వారా ఒక విషయాన్ని సులభంగా కమ్యూనికేట్ చేయగలిగే విద్య పట్టుబడింది. నాలోని భావాలను ఆవిష్కరించడానికి రచనలను ఒక మాధ్యమంలా చేసుకుంటాను. అయితే పీ ఫర్ పాడ్‌కాస్ట్ అనేది నాలోని భావాల ఆవిష్కరణకు మాత్రమే పరిమితమైపోలేదు. ఎంతోమందికి దారి చూపించింది’ అంటుంది భార్గవి. అరవింద్ అడిగ, కిరణ్ దేశాయ్, అశ్విని సంఘీ.. మొదలైన వారి రచనలపై ఆసక్తి చూపించే భార్గవి కార్పొరేట్ దిగ్గజాల ఆలోచనలను, లీడర్షిప్, కోచింగ్‌లకు సంబంధించి పుస్తకాలను ఇష్టపడుతుంది. సంతోషం వెనక ఉండే శాస్త్రీయతను తెలుసుకోవడానికి ఆసక్తి ప్రదర్శిస్తుంది. ‘పాడ్‌కాస్టర్‌గా నా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మరింతగా ప్రయత్నిస్తున్నాను’ అంటున్న భార్గవి స్వామి వెబ్‌సీరీస్ కోసం స్క్రిప్ట్‌లు రాయడానికి, ఒక యంగ్ ఎంటర్ప్రెన్యూర్ గురించి ఫిక్షన్ బుక్ రాయడానికి సన్నాహాలు చేస్తోంది. సక్సెస్ మంత్ర లాక్డౌన్ లైఫ్‌స్టైల్ వల్ల రీడింగ్, రైటింగ్ అనేవి మనకు బాగా చేరువయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా పాడ్‌కాస్ట్ సెగ్మెంట్ దూసుకుపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పాడ్‌కాస్టర్‌గా ప్రయాణం మొదలుపెట్టాను. ‘పాడ్‌కాస్టర్‌గా సక్సెస్ కావాలి’ అనుకోగానే సరిపోదు. అందుకు తగిన కసరత్తులు చేయాలి. మనదైన ప్రత్యేకత కోసం ప్రయత్నించాలి. స్కూల్‌రోజుల్లో నేను చదువుల్లో ముందు ఉండడంతో పాటు పాటలు పాడేదాన్ని. నృత్యాలు చేసేదాన్ని. ఉపన్యాస పోటీల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. అయితే ఇవేమీ స్కూలు దగ్గరే ఆగిపోలేదు. సృజనాత్మక విషయాలలో నాకు నిరంతరం తోడుగా నిలుస్తున్నాయి. ‘మీ సక్సెస్ మంత్ర ఏమిటి?’ అని చాలామంది నన్ను అడుగుతుంటారు. సక్సెస్‌కు షార్ట్కట్లు ఉండవు. మనల్ని సక్సెస్‌ఫుల్‌గా మార్చడానికి గాడ్ఫాదర్లు ఉండరు. వృత్తిపై మనం చూపే ఆసక్తి, పడే కష్టం, మన పరిచయాలు విజయపథంలో దూసుకుపోవడానికి కారణం అవుతాయి. సక్సెస్ కోసం ఒకరిని అనుసరించాలనే రూల్ ఏమీలేదు. ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేమిటో కనుక్కుంటే చాలు. – భార్గవి స్వామి, స్టార్ పాడ్‌కాస్టర్, ఎంటర్ప్రెన్యూర్ (చదవండి: పట్టుదారంతో జీవితాన్ని అల్లుకుంది ) -
'నెట్ బౌలర్‌గా ఆఫర్.. బోర్డు పరీక్షలను స్కిప్ చేశా'
టీమిండియా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన వైవిధ్యమైన బౌలింగ్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. తీవ్రమైన పోటీ కారణంగా టీమిండియాలో అవకాశాలు దక్కించుకోలేనప్పటికి ఐపీఎల్ ద్వారా మరోసారి పలకరించనున్నాడు. రూ.4 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ)కు అమ్ముడైన రవి బిష్ణోయ్‌కు ఇది నాలుగో ఐపీఎల్ సీజన్. ఇప్పటివరకు 37 మ్యాచ్‌ల్లో 37 వికెట్లు తీశాడు. మార్చి 31న ఐపీఎల్ 16వ సీజన్‌కు తెరలేవనుంది. శనివారం(ఏప్రిల్ 1న) ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గతేడాది కేఎల్ రాహుల్ సారధ్యంలోని లక్నో మంచి ప్రదర్శనే కనబరిచింది. 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, ఐదు ఓటములతో మూడో స్థానంలో నిలిచిన లక్నో.. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో పరాజయం పాలైంది. రవి బిష్ణోయ్ లక్నో సూపర్ జెయింట్స్ తరపున 13 వికెట్లు తీసి పలు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈసారి కూడా అంతకుమించి ప్రదర్శన నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతున్న రవి బిష్ణోయ్ ఎల్ఎస్జీ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తన క్రికెట్ జర్నీని వివరించాడు. ''2018లో నాకు రాజస్తాన్ రాయల్స్ నెట్ బౌలర్‌గా ఆఫర్ వచ్చింది. అదే సమయంలో 12వ తరగతి బోర్డు పరీక్షలు. కానీ క్రికెట్‌పై ఉన్న పిచ్చి ప్రేమ ఆ ఏడాది నన్ను బోర్డు పరీక్షలకు దూరం చేసింది. వృత్తి పరంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడైన నాన్న నన్ను వెనక్కి రమ్మని ఆదేశించారు. అదే సమయంలో రాజస్తాన్ బౌలింగ్ కోచ్ క్యాంప్‌లోనే ఉండమన్నారు. దీంతో ఆ ఏడాది 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్‌లను రాయొద్దని నిర్ణయించుకొని నెట్ బౌలర్‌గా సేవలందించా. ఇంటికి వచ్చిన తర్వాత నాన్నను ఒప్పించడం తలకు మించిన బారంలా అనిపించింది. మొత్తానికి ఏదోలా నాన్నను ఒప్పించి మరుసటి ఏడాది 12వ తరగతి పరీక్షలను పూర్తి చేశా. ఆ తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసి క్రికెట్‌పై పూర్తి దృష్టి సారించాను. ఇక పదేళ్ల వయసులోనే క్రికెట్ అకాడమీలో జాయిన అయిన నేను 15 ఏళ్లు వచ్చేసరికి చదువు ఆపేద్దామనిపించింది. కానీ నా తండ్రి సహా కోచ్‌లు చదువుతో పాటు క్రికెట్‌ను కంటిన్యూ చెయ్యాలి.. రెండింటిని బ్యాలెన్స్ చేస్తేనే రేపు జీవితంలో ఏదో ఒకటి సాధించగలవు. కావాలంటే డిగ్రీ పూర్తయ్యాకా క్రికెట్‌పై పూర్తి దృష్టి సారించు.. అంతేకాని చదువును నిర్లక్ష్యం చేయొద్దు అంటూ హితబోధ చేశారు.'' అంటూ తెలిపాడు. ఇక అండర్-19 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్లో ఓడిపోయిన తర్వాత జరిగిన పరిణామాలపై రవి బిష్ణోయ్ పంచుకున్నాడు. ''ఆరోజు ఫైనల్లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు మా బ్యాటర్లపై అదే పనిగా స్లెడ్జింగ్‌కు దిగారు. తొలుత వాళ్లు లైన్ క్రాస్ చేయడంతోనే మేము గొడవకు దిగాం. వారు ముందు మొదలుపెట్టడంతో మాకు కూడా కోపం వచ్చింది. అయితే అప్పటి సంఘటన తర్వాత ఇంకెప్పుడు ఎవరిని స్లెడ్జ్ చేయొద్దని నిర్ణయించుకున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. There is only one @bishnoi0056 when it comes to Cricket. Lekin off the field, ek Ravi Bishnoi toh hum sabme hain 🤭 Hai na, #LSGBrigade? 👇#GazabAndaz | #LucknowSuperGiants | #LSGUnfiltered | #LSGTV | #LSG pic.twitter.com/xnvmXi2jHW — Lucknow Super Giants (@LucknowIPL) March 28, 2023 చదవండి: సాధించాడు.. టాప్-5లో భారత్ ఫుట్‌బాల్ స్టార్ అదే 26 పరుగులు.. శాసించిన చివరి ఓవర్ -
ఆర్ఆర్ఆర్.. జూనియర్ ఎన్టీఆర్‌ను సైడ్ యాక్టర్ చేశారా?
ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్.. ఏ ఒక్కరినీ తక్కువ అంచనా వేయలేం. వీరిద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా సినిమా సంపూర్ణంగా ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. నటించడంలో, అభిమానుల మనసులు గెలుచుకోవడంలో ఇద్దరూ పోటీపడి చివరకు గెలిచారు. ఇక ఈ సినిమా నుంచి నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ రేసులో దిగిన విషయం తెలిసిందే! ఈ క్రమంలో ట్రిపుల్ ఆర్ టీమ్ అమెరికాలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా ఉంది. ఈ తరుణంలో రామ్‌చరణ్ 'టాక్ ఈజీ విత్ సామ్ ఫ్రాగోసో' అనే పాడ్‌క్యాస్ట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వీరిద్దరూ పలు విషయాల గురించి చర్చించారు. పనిలో పనిగా తాను పాటించే అయ్యప్ప మాల విశిష్టత, విధివిధానాలను సైతం వివరించాడు చరణ్. అయితే ఇక్కడ యాంకర్ ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడే సమయంలో ఎన్టీఆర్‌ను సైడ్ యాక్టర్ అన్నాడంటూ ఓ క్లిప్ వైరలవుతోంది. ఇది చూసిన తారక్ ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఎన్టీఆర్‌ను సైడ్ యాక్టర్ అనడమేంటని విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి హోస్ట్ తారక్‌ను సైడ్ యాక్టర్ అని అనలేదు. ఎలాంగ్సైడ్ యాక్టర్(నీతోపాటు కలిసి నటించిన నటుడు) అని పేర్కొన్నాడు. కావాలని కొందరు నెటిజన్లు సగం క్లిప్‌ను కట్ చేసి వైరల్ చేయడంతో ఈ వివాదం చెలరేగింది. అయితే పూర్తి పాడ్‌క్యాస్ట్ విన్న జనాలు ఎందుకిలా పనిగట్టుకుని ఫ్యాన్స్ వార్ సృష్టిస్తారు? అని మండిపడుతున్నారు. Along side, actor @tarak9999 ante eellu side actor ani cut chesaru… 🙏 @AlwaysRamCharan Em Editing Batch Ra cheddys 💦 pic.twitter.com/9Ji4hiJsL2 — TOLLYWOOD THALIVA (@VishnuReddyNTR) March 9, 2023 -
సీరియస్ విషయాలే కాస్త సరదాగా!
పాడ్‌కాస్ట్‌లో కడుపుబ్బా నవ్వించే జోక్స్ వినవచ్చు. కమ్మని సంగీతం వినొచ్చు... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో! అయితే మహిళల ఆధ్వర్యంలోని కొన్ని పాడ్‌కాస్ట్‌లు మాత్రం ఎన్నో విషయాలను నీళ్లు నమలకుండా చర్చిస్తున్నాయి. మన గురించి, సమాజం గురించి ఆలోచించడానికి అవసరమైన ప్రేరణ ఇస్తున్నాయి... సీరియస్ విషయాలను సీరియస్‌గానే మాట్లాడుకోవాలనే నిబంధన ఏమీ లేదు. నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా కూడా మాట్లాడవచ్చు. ఈ పాయింట్ దగ్గరే విజయం సాధించింది నవ్య నవేలీ నందా. నవ్య పాడ్‌కాస్ట్ ‘వాట్ ది హెల్ నవ్య’ శ్రోతలకు దగ్గర కావడానికి కారణం ‘సీరియస్ విషయాలైనా సరే కాస్త సరదాగా మాట్లాడుకుందాం’ అనే కాన్సెప్ట్. ఈ పాడ్‌కాస్ట్‌కి సంబంధించిన ఒక కార్యక్రమంలో మూడు తరాలకు చెందిన నవ్య నందా, శ్వేతా నందా, జయబచ్చన్లు జీవితానికి సంబంధించిన భిన్నమైన కోణాల గురించి మాట్లాడారు. అయితే వారేమీ ఉపదేశం ఇచ్చినట్లు, ఉపన్యాసాలు ఇచ్చినట్లు ఉండదు. సరదాగా మాట్లాడుతున్నట్లుగానే ఉంటుంది. ఇరుగుపొరుగుతో సహజంగా సంభాషిస్తున్నట్లుగానే ఉంటుంది. ‘నేను నవ్య అమ్మను మాట్లాడుతున్నాను. ఒక సరదా విషయం మీకు చెప్పుకోవాలని ఉంది’ అంటూ తనను తాను పరిచయం చేసుకుంటుంది శ్వేతా నందా. ‘నేను నవ్య నానీని. మీకు కొన్ని రహస్యాలు చెప్పాలని ఉంది’ అని ఊరిస్తుంది జయబచ్చన్. ‘త్రీ లేడీస్’ ‘త్రీ జెనరేషన్స్’ ‘త్రీ పర్స్పెక్టివ్స్’ అంటూ వచ్చిన ప్రోమో ఆకట్టుకొని ఆసక్తి పెంచింది. వ్యాపారం అనేది అనుకున్నంత సులువు కాదు. ఎంత దిగ్గజ వ్యాపారికైనా అడుగడుగునా పరీక్షలు ఎదురవుతుంటాయి. వాటిలో ఏ మేరకు ఉత్తీర్ణత సాధించారనేదానిపైనే వారి విజయం ఆధారపడి ఉంటుంది. ‘నో సుగర్ కోట్’ పాడ్‌కాస్ట్ ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లు, పోరాటస్ఫూర్తి, అనుసరించాల్సిన వ్యూహాలు...ఇలా ఎన్నో విషయాల గురించి చర్చిస్తుంది పూజా దింగ్రా. ఔత్సాహిక ఎంటర్ప్రెన్యూర్లతో పాటు ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనుకునేవారిని ఆకట్టుకుంటున్న పాడ్‌కాస్ట్ ఇది. చెఫ్‌గా మంచి పేరు తెచ్చుకున్న పూజా సీజన్వన్లో ఎంతో మంది సక్సెస్ఫుల్ చెఫ్‌లు, ఫుడ్రైటర్స్ను ఇంటర్వ్యూ చేసింది. ‘నల్లేరుపై నడక అనేది వాస్తవం కాదు. భ్రమ. ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందే’ అంటోంది పూజా. మానసిక ఆరోగ్యంలాంటి సీరియస్ విషయాలతో పాటు బ్యాచ్‌లర్ పార్టీలాంటి తేలికపాటి విషయాల గురించి మాట్లాడటానికి ‘రియల్ టాక్ విత్ స్మృతి నొటాని’ పాడ్‌కాస్ట్ వేదిక అవుతుంది. స్మృతి మాట్లాడుతుంటే అప్పుడే పరిచయమైన ఫ్రెండ్ గలగలమని మాట్లాడుతున్నట్లుగానే ఉంటుంది. సోషల్ మీడియా ధోరణుల గురించి కూడా తనదైన శైలిలో వ్యాఖ్యానిస్తుంటుంది స్మృతి. ‘ఫ్యాట్.సో?’ ....పేరు ద్వారానే తన పాడ్‌కాస్ట్ లక్ష్యం ఏమిటో తెలియజేశారు పల్లవినాథ్, అమేయ నాగరాజ్. స్థూలకాయం వల్ల నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బంది పడే అమ్మాయిలు, ఆత్మన్యూనతకు గురయ్యే వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ఆత్మవిశ్వాసం నింపి ముందుకు నడిపిస్తుంది ఈ పాడ్‌కాస్ట్. ‘మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు ఆత్మవిశ్వాసం దగ్గరవుతుంది. అదొక ఆయుధం అవుతుంది. అద్భుతమైన విజయాలు సాధించడానికి ఇంధనం అవుతుంది’....ఇలాంటి మాటలు ఎన్నో ‘ఫ్యాట్.సో’లో వినిపిస్తాయి. -
Podcast: ఆత్మీయనేస్తంగా పాడ్‌కాస్ట్! యూత్‌కు దగ్గరైన జానర్లలో అగ్రస్థానం దానిదే
కోవిడ్ టైమ్‌లో యూత్‌కు సన్నగా పరిచయం అయిన ‘పాడ్‌కాస్ట్’ ఇప్పుడు వారికి ఆత్మీయనేస్తం అయింది. హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన చరితకు పాటలు వినడం అంటే ఇష్టం. అయితే ఇప్పుడు ఆమె పాడ్‌కాస్టింగ్‌లో పాటలు ఒక భాగం మాత్రమే. ‘నాకు పాటలు వినడం అంటే ఎంత ఇష్టమో ట్రావెల్ చేయడం అంటే కూడా అంతే ఇష్టం. ముసాఫిర్ స్టోరీస్లాంటి ట్రావెల్ పాడ్కాస్ట్ల ద్వారా ఎప్పటికప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోగలుగుతున్నాను’ అంటుంది చరిత. నాగ్‌పుర్‌కు చెందిన భానుకు రాత్రి ఒక పట్టాన నిద్ర పట్టదు. అయితే ఎవరైనా కబుర్లు చెబుతుంటే, వింటూ వింటూ నిద్రపోతుంటాడు! ఇప్పుడు అతడికి పాడ్‌కాస్ట్ అనేది ఆత్మీయనేస్తం అయింది. ఎన్నో రంగాలకు చెందిన కబుర్లు వింటూ వింటూ నిద్రపోతుంటాడు. పద్దెనిమిది నుంచి ఇరవైనాలుగు సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారి నుంచి పాడ్‌కాస్ట్‌కు అమితమైన ఆదరణ లభిస్తున్నట్లు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. యూత్‌కు దగ్గరైన పాడ్‌కాస్ట్ జానర్లలో ‘మెంటల్ హెల్త్’ అగ్రస్థానంలో ఉంది. భోపాల్‌కు చెందిన తన్వీకి అకారణ దిగులు. ఎలాంటి సమస్యా లేదు...మరి దిగులెందుకో తెలియదు! స్నేహితుల సలహా మేరకు ‘ది హ్యాపీ టైమ్స్’ ‘ఎమోషనల్ ఫీల్’ ‘బుద్ధిస్ట్ సొల్యూషన్స్ ఫర్ లైఫ్స్ ప్రాబ్లమ్స్’....మొదలైన పాడ్‌కాస్ట్‌లు వింటూ ఉంది. ఇప్పుడు ఆ అకారణ దిగులు మాయం అయినట్లు చెబుతుంది తన్వీ. యూత్‌కు స్ట్రెస్ బస్టర్‌గా పాడ్‌కాస్టింగ్ ఉపయోగపడుతోంది. తెలుసుకోవడం, నేర్చుకోవడం, పరిష్కారాలు అందిపుచ్చుకోవడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. సృజనాత్మకంగా స్వీయవ్యక్తీకరణకు పాడ్కాస్టింగ్ను బలమైన వేదికలా ఉపయోగించుకుంటోంది యూత్. చదవండి: Diet Tips To Control Asthma: ఆస్తమా ఉందా? వీటిని దూరం పెట్టండి.. ఇవి తింటే మేలు! -
'ఆ తొమ్మిది వికెట్లు నా తలరాతను మార్చాయి'
-
'ఆ తొమ్మిది వికెట్లు నా తలరాతను మార్చాయి'
మహ్మద్ సిరాజ్.. ప్రస్తుతం టీమిండియా స్టార్ పేసర్‌గా ఎదుగుతున్నాడు. 2017లో టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సిరాజ్ మొదట్లో జట్టులోకి వస్తూ.. పోతూ ఉండేవాడు. గత ఏడాది కాలంగా అన్ని ఫార్మాట్లలోనే రెగ్యులర్ ప్లేయర్‌గా కొనసాగుతూ కీలకంగా మారుతున్నాడు. ఇక ఐపీఎల్లో సిరాజ్.. ఆర్సీబీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కోహ్లి, మ్యాక్స్‌వెల్‌ను రిటైన్ చేసుకున్న ఆర్సీబీ సిరాజ్‌పై ఉన్న నమ్మకంతో తమ వద్దే అట్టిపెట్టుకుంది. మార్చి 26 నుంచి ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో సిరాజ్ ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌కు చిన్న ఇంటర్య్వూ ఇచ్చాడు. క్రికెట్లో తన అడుగు ఎలా పడిందనేది మహ్మద్ సిరాజ్ ఆసక్తికరంగా వివరించాడు. చదవండి: Mohammed Siraj: 'క్రికెట్ వదిలేయ్.. మీ నాన్నతో వెళ్లి ఆటో తోలుకో' ''నా కెరీర్ విషయమై అమ్మ, నాన్న ఎప్పుడు గొడవపడుతుండేవారు. నేను జాబ్ చేయాలా లేక చదువుకోవాలా అనే దానిపై రోజు పెద్ద చర్చ నడిచేది. కానీ నాకు ధ్యాసంతా క్రికెట్‌పైనే.. చదవడం, జాబ్ చేయడం ఇష్టం లేదు. ఈ విషయం అమ్మానాన్నకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఆ సమయంలో మా మామయ్య నాకు సహకరించాడు. ఒకరోజు గొడవ జరుగుతున్న సందర్భంలో మామయ్య ఇంటికి వచ్చాడు. అతనికి ఒక క్రికెట్ క్లబ్ ఉంది. మావాళ్లు చెప్పిందంతా విన్న మామయ్య.. వాడిని(సిరాజ్) క్లబ్‌కు తీసుకెళుతాను. అక్కడికి వచ్చి సిరాజ్ క్రికెట్ ఆడతాడు.. ఆ తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేద్దాం అన్నాడు. నేను సరే అని ఒప్పుకున్నా. ఆడిన తొలి మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు తీశా. నా ప్రదర్శన చూసిన మామయ్య ఆశ్చర్యపోయి.. ఇంత బాగా ఆడతావని ఊహించలేదన్నాడు. వెంటనే నాన్నకు ఫోన్ చేసి.. వాడిని చదవమని.. జాబ్ చేయమని బలవంతం చేయొద్దు.. నచ్చింది చేయనివ్వండి. సిరాజ్‌కు అండగా నేనుంటా.. ఖర్చులన్నీ భరిస్తా అని చెప్పి ఐదు వందలు రూపాయలు నా చేతిలో పెట్టాడు. బహుశా అదే నా తొలి సంపాదన అనుకుంటా. అందులో మూడు వందలు నా కుటుంబానికి ఇచ్చి.. మిగతా రెండు వందల రూపాయాలు నా దగ్గరే పెట్టుకున్నా. ఒక రకంగా నేను క్రికెట్లో అడుగుపెట్టడానికి మామయ్య పరోక్షంగా కారణం అయితే.. ప్రత్యక్షంగా ఆ 9 వికెట్లు ఉంటాయి. నిజానికి ఆ తొమ్మిది వికెట్లు నా తలరాతను మార్చాయి.. లేకుంటే ఈరోజు ప్రపంచస్థాయి బౌలర్‌ను మీరు చూసి ఉండరు'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సిరాజ్ టీమిండియా తరపున 4 టెస్టులు, 2 వన్డేలు, 12 టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్లో 50 మ్యాచ్‌ల్లో 50 వికెట్లు తీశాడు. చదవండి: Ravichandran Ashwin: 'సోయి లేకుండా మాట్లాడొద్దు'.. జర్నలిస్ట్‌ను ఉతికారేసిన అశ్విన్ Womens World Cup 2022: టాయిలెట్లో చిక్కుకుపోయిన మహిళా క్రికెటర్.. మ్యాచ్ కోసం The RCB Podcast: Mohammed Siraj’s rise to stardom@mdsirajofficial talks about his earliest memory of playing cricket, struggling years trying to make it big in the world of cricket, and plenty of other anecdotes in the #RCBPodcast powered by @KotakBankLtd. #PlayBold pic.twitter.com/t12VHUXHB2 — Royal Challengers Bangalore (@RCBTweets) March 1, 2022 -
ఆ పాట మీనింగ్ అది కాదు.. నాతో పాటు అంతా తప్పుగా అర్థం చేసుకున్నారు: పూరీ
యూట్యూబ్ వేదికగా ‘పూరి మ్యూజింగ్స్’పలు విషయాలపై తన అభిప్రాయాలు చెబుతూ వరుస ఆడియోలు రిలీజ్ చేస్తున్నాడు డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఎలాంటి వివాదాలకు తావులేకుండా, చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేస్తూ ఆలోచనల్లో పడేస్తున్నాడు. తాజాగా ఆయన ప్రపంచంలో ఆడవాళ్లు అనేవాళ్ళు లేకపోతే ఏడుపులు ఉండవనే భావన చాలా తప్పని చెబూతూ.. బాబ్ మార్లే పాడిన పాటకు అసలైన అర్థాన్ని ఆయన వివరించారు. అసలు ఆయన ఏం చెప్పారో ఆయన మాటల్లోనే.. ‘ఓ చల్లటి సాయంత్రం.. పటాయ్‌లో బీచ్ ఒడ్డున రెస్టారెంట్లో నేను కూర్చున్నప్పుడు, ఒక వ్యక్తి బాబ్ మార్లే పాటలు పాడుతూ ఉన్నాడు. రెండు పాటల తర్వాత అతను ‘నో విమెన్ నో క్రై’ అనే సాంగ్‌ని మొదలుపెట్టాడు. ఆ సాంగ్ వింటూనే రెస్టారెంట్‌లోని మగవాళ్లంతా కూడా అరుపులు అలాగే విజిల్స్ వేయడం ప్రారంభించారు. దీంతో రెస్టారెంట్‌లోని ఆడవాళ్లంతా కూడా మొహాలు చిన్నబుచ్చుకుని కూర్చున్నారు. సింగర్ ‘నో విమెన్ నో క్రై’ అన్నప్పుడల్లా రెస్టారెంట్‌లోని మగాళ్లు అతడితో గొంతు కలిపి మరి అంతకంటే పెద్దగా పాడేశారు. మిగతా ఏ లిరిక్స్ పాడరు కానీ ఆ ఒక్కలైన్ మాత్రంగా గట్టిగా పాడేస్తారు. న్యూజిలాండ్‌లోనూ.. గోవాలోనూ ఇదే జరిగింది. కానీ ఈ పాట అసలు భావం ‘నో విమెన్ నో క్రై’ కాదు, ‘నో విమెన్ న క్రై’. అంటే ఆడవాళ్లు అస్సలు ఏడవద్దు అని అర్థం. చాలా మంది ఈ పాట బాబ్ మార్లే రాశాడని అనుకుంటారు. నిజానికి ఈ పాట రాసింది మాత్రం విన్సెంట్ ఫోర్డ్. విన్సెంట్ ఫోర్ట్ రాసిన ఈ లిరిక్స్‌ను స్ఫూర్తిగా తీసుకుని బాబ్ మార్లే ఈ పాట పాడాడు. ‘ట్రెంచ్ టౌన్లో ఒక బిడ్డను పోలీసులు కొడుతుంటే ఆ ఏడుపు నాకు బాగా వినిపిస్తుంది. ట్రెంచ్ టౌన్లో ప్రభుత్వ స్థలంలో కూర్చున్నప్పుడు మంచి వ్యక్తులను మరియు స్నేహితులను కలవడం అలాగే రాత్రులు దీపాలు వెలిగించడం అదే విధంగా కార్న్ మీల్‌తో పూరిట్జ్ వండుకోవడం నాకు బాగా గుర్తుంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వ రాజకీయాల వల్ల అలాంటి ఆహ్లాదరకరమైన వాతావరణాన్ని మనం బాగా కోల్పోతున్నాం. త్వరలోనే మనకు మంచి రోజులొస్తాయి’ అని విన్సెంట్ రాశాడట . దాని స్ఫూర్తితో బాబ్ మార్లే ఆడవాళ్లు మీరు ఏడవద్దు అంటూ ఆలపించాడు. కానీ ఈ పాటను మనం అందరమూ కూడా తప్పుగా అర్థం చేసుకున్నాం. అసలు ఆడవాళ్లే లేకపోతే ఎలాంటి సమస్యలు ఉండవని మనమందరం అనుకుంటున్నాం. జమైకా మినహా ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా అందరు ఈ పాటను తప్పుగా అర్థం చేసుకున్నారని ‘నో విమెన్ నో క్రై’ అనే పదం మినహా పాటలోని మిగతా లిరిక్స్ గురించి అస్సలు ఎవరూ పట్టించుకోలేదు. అలా ఈ పాటను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్లలో నేను కూడా ఉన్నాను.ఒకవేళ ఈ జాబితాలో నాతోపాటు మీరు కూడా ఉంటే ఇకపై పాట విన్నప్పుడు అస్సలు గొడవ చేయొద్దు. ఇది ఆడవాళ్ల కన్నీళ్లు తుడిచే పాట అని నో విమెన్ నో క్రై ’అని పూరి చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల విషయాలకొస్తే.. ప్రస్తుతం పూరి... విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి, అపూర్వా మెహతా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ఆగస్ట్ 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆపిల్, స్పొటిఫైలకు సవాల్ విసురుతున్న అమెజాన్
వెబ్‌డెస్క్ : పొడ్కాస్ట్ రంగంలో తీవ్రమైన పోటీకి రంగం సిద్ధమవుతోంది, మార్కెట్ లీడర్లుగా ఉన్న ఆపిల్, స్పొటిఫైలకు అమెజాన్ నుంచి గట్టిపోటీ ఎదురుకాబోతుంది. రెండేళ్లుగా పొడ్‌కాస్ట్‌లో పట్టు కోసం ప్రయత్నిస్తోన్న అమెజాన్ తాజాగా మరో అడుగు ముందుకు వేసింది పొడ్‌కాస్ట్‌లో దూసుకుపోతున్న ఆర్ట్ 19 కొనుగోలుకు సిద్ధమైంది. అయితే డీల్ వివరాలు ఇంకా బయటకు వెల్లడి కాలేదు. ఫ్యూచర్లో పొడ్కాస్ట్ డిజిటల్ విప్లవం వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ రూపు రేఖలు మారిపోయాయి. గత ఐదేళ్లుగా వీడియో కంటెంట్ ఈ విభాగంలో రాజ్యమేలుతోంది. అయితే భవిష్యత్తులో ఆడియో కంటెంట్‌కి కూడా ఇదే స్థాయిలో డిమాండ్ ఏర్పడనుంది. ఇప్పటికే ఆపిల్ పొడ్‌కాస్ట్‌లో మార్కెట్ లీడర్‌గా ఉంది. ఇటీవల ఆపిల్‌కి స్పొటిఫై నుంచి తీవ్ర పోటీ ఎదురువుతోంది. పొడ్‌కాస్ట్‌లో తనదైన మార్క్ చూపించేందుకు అమెజాన్ రెండేళ్లుగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా 2020 సెప్టెంబరుల అమెజాన్ మ్యూజిక్ పేరుతో మార్కెట్లోకి వచ్చినా ఆశించిన ప్రభావం చూపలేకపోయింది. అంతకు ముందు వండరేనీ కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆర్ట్ 19తో మరో ప్రయోగం చేయబోతుంది. మార్కెట్‌పై పట్టు కోసం వీడియో కంటెంట్‌లో నెట్‌ఫ్లిక్స్‌కు దీటుగా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వచ్చింది. అదే తరహాలో పొడ్కాస్ట్లోనూ మార్కెట్లో వాటా కోసం అమెజాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆర్ట్ 19ని టేకోవర్ పూర్తైన తర్వాత పొడ్కాస్ట్ కంటెంట్, మార్కెటింగ్‌లో అమెజాన్ మరింత దూకుడు ప్రదర్శించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చదవండి : Drone Delivery: డ్రోన్లతో లాజిస్టిక్స్ డెలివరీకి రెడీ -
జియోసావన్ లో మరో సరికొత్త ఫీచర్
దక్షిణ ఆసియాలో అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన సంగీత ప్రియులకు ఇష్టమైన జియోసావన్ మరో కొత్త ముందుకు వచ్చింది. జియోసావన్ టీవీ పేరుతో విదేయో కంటెంట్ అందించనుంది. ఇప్పటివరకు రేడియో, పాడ్ క్యాస్ట్ సేవలను అందించిన జియోసావ్న్ ఇప్పడు వీడియో సేవలను అందించనుంది. ప్రత్యేకమైన ఈ వీడియో ఫీచర్ వల్ల మరింత మందికి అద్భుతమైన కంటెంట్ అందించనున్నట్లు పేర్కొంది. జియోసావన్ ప్లాట్‌ఫాం విస్తృతంగా ప్రాచుర్యం పొందిన ఆడియో సేవలతో పాటు సంగీతం కోసం కొత్తగా టెలివిజన్ అనుభవాన్ని సృష్టిస్తుంది. ఈ ఫీచర్ వినియోగదారులకు అత్యధిక నాణ్యత గల వీడియో స్ట్రీమింగ్ అందిస్తుంది. వినియోగదారులు ఇప్పుడు హోమ్‌పేజీలోని క్రొత్త ట్యాబ్‌లో మ్యూజిక్ టీవీ ఛానెల్‌లను, మ్యూజిక్ వీడియో ప్లేజాబితాలను యాక్సెస్ చేయవచ్చు. దీనివల్ల చూడాలనుకుంటున్న వీడియోను వెంటనే చూడటానికి వీలు కలుగుతుంది. కొత్త ఫీచర్ వల్ల ఎందరో ప్రసిద్ద కళాకారులు చెందిన వీడియోలను సులభంగా చూడవచ్చు. చదవండి: చిన్న ఎస్ఎంఎస్తో ఆధార్ డేటాను రక్షించుకోండి -
ఈ పాడ్ కాస్ట్స్ చాలా పాపులర్ గురూ!
టెక్నాలజీతో పరిచయం ఉన్నవాళ్లకు పాడ్‌కాస్ట్స్ గురించి తెలిసే ఉంటుంది. ఒక సీరిస్లాగా కంప్యూటర్ లేదా మొబైల్లో డౌన్లోడ్ చేసుకునే వీలుండే డిజిటల్ ఆడియో ఫైల్స్‌ను పాడ్‌కాస్ట్ అంటారు. ఆయా దేశాల్లో వివిధ అంశాలపై పాడ్‌కాస్ట్స్‌ను రిలీజ్ చేస్తుంటారు. ప్రముఖులు రిలీజ్ చేసే పాడ్‌కాస్ట్స్‌కు ఆదరణ ఎక్కువగా లభిస్తుంటుంది. అయితే ఇటీవల కాలంలో పాశ్చాత్య సమాజంలో కొత్త తరహా పాడ్ కాస్ట్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. దయ్యపు కథలు, హారర్ ప్రదేశాలు, దయ్యాల వేటగాళ్ల గురించిన కథలుండే పాడ్‌కాస్ట్స్‌కు అమెరికా తదితర దేశాల్లో భారీగా ఆదరణ లభిస్తోంది. 10మందిలో నలుగురు అమెరికన్లు దయ్యాలున్నాయని నమ్ముతారని యూగవ్ సర్వే చెబుతోంది. సమాజంలో ఈ నమ్మకమే హారర్ పాడ్‌కాస్ట్స్ డిమాండ్ పెంచుతోంది. ఇలా పాపులరైన కొన్ని పాడ్ కాస్ట్స్ వివరాలు.. రియల్ ఘోస్ట్ స్టోరీస్ ఆన్లైన్: రోజూ పలు పారానార్మల్ కథలను ప్రసారం చేస్తుంది. ఈ అంశాలు అనుభూతి చెందిన ప్రజల అనుభవాలను వారి నోటితోనే వినిపిస్తుంది. వినేవాళ్లు కావాలంటే తమ సొంత దయ్యపు కథలను అప్ లోడ్ చేయవచ్చు. ఆసక్తి ఉన్నవారు bit.ly/36n20vb లో ట్రై చేయవచ్చు. హంటెడ్ ప్లేసెస్: భూగ్రహంపై అత్యంత భయానక ప్రదేశాల గురించి వివరాలు ఇస్తుంటుంది. పలు హాంటెడ్ స్థలాల గురించి హోస్ట్ గ్రెగ్ పాల్సిన్ భయంకరంగా వర్ణిస్తారు. ప్రతి గురువారం ఒక కొత్త ప్రదేశం గురించిన కథ ఉంటుంది. మీరు కూడా వినాలనుకుంటే parcast.com/haunted లో ప్రయత్నించవచ్చు. రియల్ లైఫ్ ఘోస్ట్ స్టోరీస్: దయ్యం పట్టి వదిలిన వాళ్లు, వారి సంబంధీకుల కథలను ప్రసారం చేస్తుంది. కావాలంటే stitcher.com/show/real&life&ghost&storie లో వినవచ్చు. అన్ఎక్స్ప్లైన్డ్: రెండువారాలకు ఒకమారు ప్రసారమయ్యే ఈ సీరిస్‌లో అంతుచిక్కని మార్మిక కథల లోగుట్టు వివరించే యత్నం చేస్తారు. అలాగే అర్థం కాని, ఆన్సర్ లేని పారానార్మల్ అంశాలను వినిపిస్తారు. ఆసక్తి ఉంటే unexplainedpodcast.com/ లో ట్రై చేయండి. -
ఇంతకు ‘పాడ్‌క్యాస్ట్’ అంటే ఏమిటీ?
సాక్షి, న్యూఢిల్లీ : నేటి ఆధునిక సాంకేతిక రంగంలో వీడియో, ఆడియోలు విజ్ఞానంతోపాటు వినోదం ఇచ్చే అద్భుత అంశాలుగా మారిన విషయం తెల్సిందే. అందుకే ఈ రెండింటిని తోబుట్టువులుగా అభివర్ణిస్తారు. ముందుండి వీడియో రంగం దారి చూపుతుంటే వెనకాల వెన్నంటి ఆడియో రంగం అనుసరిస్తోంది. ఇంటర్నెట్ మందగమనం వల్ల కూడా అప్పుడప్పుడు ఆడియోకు అదృష్టం కలిసొస్తోంది. ఆడియో సంగీతం అలా అభివృద్ధిలోకి వచ్చిన విషయం తెల్సిందే. స్టాక్‌హోమ్ కేంద్రంగా పనిచేస్తోన్న ఓ కంపెనీ సంగీతం అందించేందుకు ‘స్పాటిఫై’ యాప్‌ను గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టగా, దానికి పోటీగా మూడు వారాల్లోనే ‘యూట్యూబ్ మ్యూజిక్’ భారత్‌లో ప్రవేశించింది. అప్పటికే రంగప్రవేశం చేసిన ఆపిల్, అమెజాన్ మ్యూజిక్, గానా, జియోసావన్, హంగామా యాప్‌ల మధ్య పోటీ తీవ్రమైంది. సరిగ్గా ఈ సమయంలోనే ‘పాడ్‌క్యాస్ట్’ ఆడియో విభాగానికి ఆదరణ పెరిగుతూ వచ్చింది. ప్రస్తుతం దేశంలో 50 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉండగా, కేవలం నాలుగు కోట్లమందే పాడ్‌క్యాస్ట్ శ్రోతలు ఉన్నారు. అయినా ఇది మంచి పెరుగుదలగానే చెప్పవచ్చు. ఒక్క 2018లోనే ఈ రంగం 60 శాతం వృద్ధి రేటును సాధించింది. ఇంతకు ‘పాడ్‌క్యాస్ట్’ అంటే ఏమిటీ? ఐప్యాడ్ ప్లస్ బ్రాడ్‌క్యాస్ట్ కలిపి ‘పాడ్‌క్యాస్ట్’ను సృష్టించారు. ఐప్యాడ్లను రూపొందించిన ఆపిల్ కంపెనీ దీనిపై పేటెంట్‌ను కోరకపోవడంతో పలు కంపెనీలు, వ్యక్తులు ‘పాడ్‌క్యాస్ట్’ పదాన్నే ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. ఐప్యాడ్‌ను గుర్తుచేయడం ఇష్టంలేని వారు మాత్రం వీటిని ‘నెట్క్యాస్ట్’ అని వ్యవహరిస్తున్నారు. తొలుత డిజిటల్ ఆడియో ఫైల్స్‌తో మాత్రమే ఇవి మార్కెట్లోకి వచ్చాయి. కంపెనీల నుంచే కాకుండా ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తి లేదా యూజర్ ‘పాడ్‌క్యాస్ట్’ ద్వారా సమాచారాన్ని షేర్ చేసుకొనే అదనపు సౌకర్యం ఉంది. సైన్స్, సాంకేతిక రంగాలతోపాటు రాజకీయాల నుంచి సాంస్కృతిక, కళారంగాల వరకు, విజ్ఞానం నుంచి వినోదం వరకు సకల రంగాలకు చెందిన సమాచారాన్ని ‘పాడ్‌క్యాస్ట్’ ద్వారా గ్రహించవచ్చు. అంటే ఆయా రంగాలకు చెందిన సమాచారాన్ని ఇంతకు ముందు వ్యక్తులు, ఇప్పుడు వ్యక్తుల బృందం అందజేస్తోంది. వీటిని ప్రసారం చేయడానికి ‘యాంకర్’పాటు పలు యాప్‌లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. గూగుల్, యాపిల్ కంపెనీలు రూపొందిస్తున్న ‘పాడ్‌క్యాస్ట్’లను యాంకర్ యాప్ ద్వారానే ప్రసారం అవుతున్నాయి. 2004 సంవత్సరం నాటికి ఇంగ్లీషులో కొన్ని పాడ్క్యాస్ట్లే ఇంటర్నెట్లో అందుబాటులోకి రాగా, నేడు లక్షా యాభై వేల వరకు అందుబాటులో ఉన్నాయి. ఇతర భాషలకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు. ఇప్పుడు వీడియో పాడ్‌క్యాస్ట్‌లను ‘యూప్ట్యూబ్’ ప్రసారం చేస్తోంది. వీటిని నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్‌లో ఇష్టం ఉన్నప్పుడు చూసే అవకాశం కూడా ఉంది. నచ్చే పాడ్‌క్యాస్ట్‌లను ముందుగానే ఎంపిక చేసుకుంటే ఆటోమేటిక్‌గా కూడా డౌన్లోడ్ అవుతాయి. డబ్బులు కూడా వస్తాయి ? మనుషుల అభిరుచులకు తగ్గట్టుగా విజ్ఞానం, వినోదాన్ని పంచడంతోపాటు వివిధ భాషలు, సంగీతాన్ని నేర్పే ‘పాడ్‌క్యాస్ట్’లు కూడా నేడు అందుబాటులోకి వచ్చాయి. కమేడియన్లకు కూడా ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రైవేటు రేడియో కంపెనీలు కూడా ఇప్పుడు ఈ రంగంలో పోటీ పడుతున్నాయి. వీటికి శ్రోతలు లేదా వీక్షకులు సబ్‌స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. సబ్స్క్రైబ్లనుబట్టి పాడ్‌క్యాస్ట్ నిర్మాతలకు యాడ్స్ రూపంలో డబ్బులు వస్తాయి. వాటిల్లో 30 శాతం రెవెన్యూను నేడు వాటి ‘ప్రసార మాద్యమాలే’ లాగేసుకుంటున్నాయి. పాడ్‌క్యాస్ట్‌ల ద్వారా యాంకర్లు కూడా సెలబ్రిటీలుగా మారుతున్నారు. సంగీతాన్ని అందించే ‘స్పాటిఫై’ ఈ రంగంలోకి ప్రవేశించి ‘లవ్ ఆజ్ కల్’ పాడ్‌క్యాస్ట్‌ను ప్రసారం చేయడంతో దాని యాంకర్లయిన ఆస్థా, అంకిత్‌లు సెలబ్రిటీలుగా మారిపోయారు. వారికి సోషల్ మీడియాలో ఫ్యాన్‌ఫాలోయింగ్ కూడా పెరిగింది. ‘ఓయో గదుల్లో సెక్స్ సురక్షితమా, కాదా ?’ లాంటి ప్రశ్నలే ఎక్కువగా వారికి వస్తుంటాయి. అది వేరే విషయం. కరన్ జోహర్, కరీనాకపూర్ అతిథేయులుగా విడుదల చేసిన పాడ్‌క్యాస్ట్‌లకు మంచి ఆదరణ ఉంది. కంపెనీల పరంగా ఆపిల్ కంపెనీ విడుదల చేస్తోన్న పాడ్‌క్యాస్ట్‌లకు 30 నుంచి 35 శాతం ఆదరణ ఉండగా, క్యాస్ట్బాక్స్ కంపెనీకి పది నుంచి పన్నెండు శాతం ప్రజాదరణ ఉంది. వీటిని వింటున్న, వీక్షిస్తున్న వారంతా 18 ఏళ్ల నుంచి 34 ఏళ్ల మధ్య వయస్కులే. వీటిద్వారా వ్యక్తిగత టాలెంట్లు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఈ రంగంలో ముందుండాల్సిన మీడియానే వెనకబడింది.