
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి భారత రాయబారిని అవమానించింది. పాక్‌లో భారత హైకమిషనర్ అజయ్ బిసారియాను భద్రతా కారణాలను సాకుగా చూపుతూ గురుద్వారాలోకి వెళ్లకుండా అడ్డుకుంది. శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా బిసారియా కుటుంబ సభ్యులతో కలసి ఇస్లామాబాద్‌లోని గురుద్వారా పంజా సాహిబ్‌కు వెళ్లారు. ఇందు కోసం పాక్ విదేశాంగ శాఖ నుంచి ముందస్తు అనుమతి కూడా తీసుకున్నారు. అయితే గురుద్వారా సమీపానికి చేరుకున్నాక బిసారియాను లోపలకు అనుమతించలేదు. భద్రతా కారణాలను సాకుగా చూపిన పాక్ అధికారులు బిసారియా కారు నుంచి దిగేందుకు కూడా అంగీకరించలేదు. ఈ ఘటనపై ఢిల్లీలోని పాక్ డిప్యూటీ హైకమిషనర్ సయ్యద్ హైదర్ షాకు సమన్లు జారీచేసిన భారత విదేశాంగ శాఖ.. పాక్ అధికారుల వ్యవహారశైలిపై తీవ్ర నిరసన తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment