Indian High Commissioner
-
కెనడా ప్రధాని చుట్టూ ఖలిస్తాన్ ఉగ్రవాదులే
న్యూఢిల్లీ: కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో తీరును కెనడాలో భారత హై కమిషనర్‌గా పనిచేసిన సంజయ్ కుమార్ వర్మ బట్టబయలు చేశారు. ట్రూడో ఆంతరంగికుల్లో ఖలిస్తానీ ఉగ్రవాదులతోపాటు భారత వ్యతిరేక శక్తులు ఉంటాయని చెప్పారు. కెనడాలో రాజకీయ అవసరాల కోసం ఖలిస్తానీ ఉగ్రవాదులకు ట్రూడో ప్రభుత్వం రక్షణ కవచంగా నిలుస్తోందని అన్నారు. భారత్–కెనడా మధ్య వివాదం నేపథ్యంలో సంజయ్ కుమార్ వర్మను భారత ప్రభుత్వం ఇటీవల వెనక్కి పిలిపించిన సంగతి తెలిసిందే. ఆయన తాజాగా ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కెనడాలోని ఖలిస్తానీ శక్తులు, భారత వ్యతిరేక శక్తులు ప్రధాని ట్రూడోతో అత్యంత సన్నిహితంగా మెలుగుతుంటాయని వెల్లడించారు. ఖలిస్తాన్ మద్దతుదారులు ట్రూడో ఆప్తమిత్రులుగా మారిపోయారని తెలిపారు. 2018లో ట్రూడో భారత్‌ను సందర్శించినప్పుడు ఆయన వెంటనే ఖలిస్తాన్ సానుభూతిపరులు కూడా కనిపించారని సంజయ్ కుమార్ వర్మ గుర్తుచేశారు. ఖలిస్తాన్ పోరాట యోధులమని చెప్పుకుంటున్న వ్యక్తులకు కెనడాలో ఎనలేని ప్రోత్సాహం లభిస్తోందని ఆరోపించారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో సంజయ్ కుమార్ వర్మను కెనడా ప్రభుత్వం అనుమానితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. నిజ్జర్ హత్య కేసు దర్యాప్తునకు భారత్ సహకరించడం లేదని కెనడా చేస్తున్న ఆరోపణలపై సంజయ్ కుమార్ వర్మ స్పందించారు. ఆ కేసులో భారత్ పాత్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదని తేలి్చచెప్పారు. ఖలిస్తానీ ముష్కరులు కెనడాలో భారత కాన్సులేట్ కార్యాలయాల ఎదుట అల్లర్లు సృష్టించారని, భారత దౌత్యవేత్తలను సోషల్ మీడియా ద్వారా బెదిరించేందుకు ప్రయత్నించారని గుర్తుచేసుకున్నారు. దారుణ పరిస్థితుల్లో విద్యార్థులు కెనడాలో ఉన్నత విద్య అభ్యసించాలని కోరుకుంటున్న భారత విద్యార్థులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సంజయ్ కుమార్ వర్మ సూచించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు మెరుగ్గా లేవని అన్నారు. రూ.లక్షలు ఖర్చు చేసినా మంచి కాలేజీల్లో ప్రవేశాలు దొరకడం లేదని, చదువులు పూర్తిచేసుకున్నాక ఉద్యోగాలు లభించడం లేదని చెప్పారు. విద్యార్థుల్లో కుంగుబాటు, ఆత్మహత్య వంటి పరిణామాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. తాను కెనడాలో హైకమిషనర్‌గా పనిచేసిన సమయంలో వారానికి కనీసం రెండు మృతదేహాలను భారత్‌కు పంపించిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉద్యోగాలు రాక, తల్లిదండ్రులకు ముఖం చూపించలేక కెనడాలో భారతీయ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. అందుకని కెనడాను ఎంచుకోకపోవడమే మంచిదని సూచించారు. ఒకవేళ భారత్–కెనడా మధ్య సంబంధాలు బాగున్నా కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు తాను ఇదే సలహా ఇచ్చేవాడినని వ్యాఖ్యానించారు. ఎన్నో ఆశలతో వెళ్లిన విద్యార్థులు శవాలై తిరిగి వస్తున్నారని పేర్కొన్నారు. ఈ దుస్థితికి ఏజెంట్లు కూడా కొంత కారణమని విమర్శించారు. రూ.లక్షలు దండుకొని ఊరూపేరు లేని కాలేజీల్లో విద్యార్థులను చేరి్పస్తున్నారని, సరైన వసతులు కూడా కలి్పంచడం లేదని వెల్లడించారు. వారానికి కేవలం ఒక క్లాసు నిర్వహించే కాలేజీలు కూడా ఉన్నాయన్నారు. ఇరుకు గదిలో ఎనిమిది మంది విద్యార్థులు సర్దుకోవాల్సిన పరిస్థితి అక్కడ కనిపిస్తున్నాయని తెలిపారు. కెనడాలో భారతీయ విద్యార్థులు చదువులు పూర్తి చేసుకున్నప్పటికీ ఉద్యోగాలు రాక జీవనోపాధి కోసం క్యాబ్ డ్రైవర్లుగా పని చేస్తున్నారని, దుకాణాల్లో చాయ్, సమోసాలు అమ్ముకుంటున్నారని సంజయ్ వర్మ ఆవేదన వ్యక్తంచేశారు. -
వెన్నుపోటు పొడిచింది
న్యూఢిల్లీ: ఒక ఖలిస్తానీ వేర్పాటువాద ఉగ్రవాదికి వంతపాడుతూ భారత్ వంటి ప్రజాస్వామ్య దేశం పట్ల కెనడా అత్యంత అనైతికంగా వ్యవహరించిందని అక్కడి నుంచి తిరిగొచ్చిన భారత హైక మిషనర్ సంజయ్ కుమార్ వర్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. కెనడాలో ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యోదంతంలో సంజయ్ వర్మసహా పలువురు దౌత్యాధికారులను విచారిస్తామని కెనడా ప్రకటించడం, కెనడా చర్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ భారత్ తన దౌత్యాధికారులను వెంటనే వెన క్కి రప్పించి, కెనడా దౌత్యాధికారులను బహిష్కరించడం తెల్సిందే. హఠాత్తుగా భారత్– కెనడా దౌత్యబంధంలో భారీ బీటలు వారిన వేళ సంజయ్ గురువారం ‘పీటీఐ’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.పాలకవర్గం మొదలు పార్లమెంట్‌దాకా‘‘ కెనడాలో పాలకవర్గం మొదలు రక్షణ బలగాలు, చివరకు పార్లమెంట్‌దాకా అన్ని రాజ్యాంగబద్ధ్ద సంస్థల్లో ఖలిస్తానీ సానుభూతిపరులు చొరబడ్డారు. ఇలా ఖలిస్తానీవాదులు తమ అజెండాను బలంగా ముందుకు తోస్తున్నారు. భారత సార్వభౌమత్వాన్ని సైతం సవాల్ చేసే సాహసం చేస్తున్నారు. మన సమగ్రతను అక్కడి ఎంతోమంది కెనడియన్ పార్లమెంటేరియన్లు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. తోటి ప్రజాస్వామ్య మిత్రదేశంగా భారత సమగ్రతను కెనడా గౌరవిస్తుందని భావించా. కానీ వాళ్లు వెన్నుపోటు పొడిచారు. అత్యంత అనైతికంగా వ్యవహరించారు. ఖలిస్తానీవాదుల కారణంగా కెనడా విదేశాంగ విధానం పెడతోవలో వెళ్తోంది. ఓటు బ్యాంక్‌ను కాపాడుకునేందుకు రాజకీయనేతలకు ఖలిస్తానీ వాదుల మద్దతు అవసరమైంది. ఇదే చివరకు ఇరుదేశాల దౌత్యసత్సంబంధాల క్షీణతకు ప్రధాన హేతువు. రోజురోజుకూ కెనడా రాజకీయ ముఖ చిత్రంపై ఖలిస్తానీవాదుల పాత్ర పెద్దదవుతోంది. అక్కడి భారతీయ సంతతి ప్రజలు ప్రశాంత జీవనం గడుపుతుంటే ఖలిస్తానీవాదులు మాత్రం తమ అనైతిక డిమాండ్ల కోసం తెగిస్తున్నారు. ‘ఖలిస్తాన్’ వాదనను ఖలిస్తానీవాదులు కెనడాలో ఒక వ్యాపారంగా మార్చేశారు. ఆయుధాలు, మత్తుపదార్థాల అమ్మకాలు, మానవుల అక్రమ రవాణా, వ్యభిచారం, బెదిరింపులు వంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. ఓట్లు పోతాయన్న భయంతో అక్కడి ప్రభుత్వం ఇవన్నీ తెల్సి కూడా కళ్లుమూసుకుంటోంది’’ అని అన్నారు.దౌత్య రక్షణ పీకేస్తామన్నారుతనతోపాటు మరో ఐదుగురు దౌత్యసిబ్బందిని కెనడా బహిష్కరించిన ఘటనను వర్మ గుర్తుచేసుకున్నారు. ‘‘ అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం టొరంటో ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నప్పుడు నాకొక మెసేజ్ వచ్చింది. అర్జంటుగా కెనడా విదేశాంగ శాఖకు వచ్చి అధికారులను కలవాలని ఆ సందేశంలో ఉంది. 13వ తేదీన గ్లోబల్ అఫైర్స్ కెనడా(విదేశాంగశాఖ) ఆఫీస్‌కు నేను, డెప్యూటీ హైకమిషనర్ వెళ్లాం. ‘నిజ్జర్ హత్య కేసులో మీ ప్రమేయంపై మిమ్మల్ని ఇంటరాగేషన్ చేయాల్సి ఉంది. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు మిమ్మల్ని విచారిస్తారు. వీటికి అవరోధంగా ఉన్న, మిమ్మల్ని కాపాడుతున్న ‘దౌత్యరక్షణ’ను తీసేస్తాం’ అని కెనడా అధికారులు మాతో చెప్పారు. దాంతో మాకో విషయం స్పష్టమైంది. దౌత్యనీతిని అవహేళన చేస్తూ, నిబంధనలకు నీళ్తొదిలేస్తూ హైకమిషనర్‌ను ప్రశ్నిస్తామని చెప్పడంతో నిర్ఘాంతపోయాం. పలు దేశాల్లో దౌత్యవేత్తగా పనిచేసిన నా 36 సంవత్సరాల కెరీర్లో ఇలాంటి అవమానాన్ని ఏ దేశంలోనూ ఎదుర్కోలేదు. నిజ్జర్హత్యసహా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు మేం పాల్పడలేదు. అయినా దౌత్యవేత్తలతో వ్యవహరించాల్సిన పద్ధతి ఇదికాదు’’ అని ఆయన అన్నారు. -
భగ్గుమన్న దౌత్య బంధం
న్యూఢిల్లీ: సిక్కు వేర్పాటువాది, ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యోదంతం ఒక్కసారిగా భారత్, కెనడా దౌత్యసంబంధాల్లో మంటలు రాజేసింది. నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును కెనడా ప్రభుత్వం చేర్చింది. వర్మను విచారించాల్సి ఉందంటూ ఆదివారం భారత విదేశాంగ శాఖకు కెనడా సందేశం పంపింది. దీంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఖలిస్తాన్ వేర్పాటువాది హత్య కేసులో తమ దౌత్యాధికారులను ఇరికించడంపై భారత సర్కార్ తీవ్రంగా స్పందించింది. కెనడా తాత్కాలిక హైకమిషనర్ స్టివార్ట్ వీలర్సహా ఆరుగురు దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించింది. బహిష్కరణకు గురైన వారిలో డెప్యూటీ హై కమిషనర్ ప్యాట్రిక్ హేబర్ట్, ఫస్ట్ సెక్రటరీలు మేరీ కేథరీన్ జోలీ, అయాన్ రోస్ డేవిడ్ ట్రైస్, ఆడమ్ జేమ్స్ చుప్కా, పౌలా ఓర్జులాలు ఉన్నారు. అక్టోబర్ 19వ తేదీన రాత్రి 11.59 గంటల్లోపు భారత్‌ను వీడాలని ఆదేశాలు జారీచేసింది. కెనడాలో విధులు నిర్వర్తిస్తున్న భారత దౌత్యవేత్త, దౌత్యాధికారులు, సిబ్బందిని స్వదేశానికి రప్పిస్తామని సోమవారం భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అంతకుముందు తన నిరసన తెలిపేందుకు కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్ రోస్ వీలర్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీచేసింది. దీంతో ఆయన సోమవారం సాయంత్రం ఢిల్లీలోని విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చి ఆ శాఖ కార్యదర్శి(తూర్పు) జైదీప్ మజుందార్‌ను కలిశారు. అనుమానితుల జాబితాలో భారత దౌత్యవేత్త పేరును చేర్చడంపై ఆయన ఎదుట భారత్ తన నిరసనను వ్యక్తంచేసింది. ఇది జరిగిన కొద్దిసేపటికే దౌత్యాధికారులను రప్పించడంపై విదేశాంగశాఖ నిర్ణయం వెలువడింది. ‘‘ కెనడాలో తీవ్రవాదం, హింసాత్మక ఘటనలు, ట్రూడో ప్రభుత్వ చర్యలు అక్కడి భారతీయ దౌత్యాధికారులను ప్రమాదంలోకి నెట్టేశాయి. ప్రస్తుత కెనడా ప్రభుత్వం వీళ్ల భద్రతకు భరోసా కలి్పస్తుందన్న నమ్మకం పోయింది. అందుకే వీళ్లందరినీ వెనక్కి రప్పించుకోవాలని భారత సర్కార్ నిర్ణయంచుకుంది. సిక్కు వేర్పాటువాదానికి మద్దతు పలుకుతూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ట్రూడో సర్కార్ దుందుడుకు చర్యలకు దీటుగా ప్రతిస్పందించే హక్కు భారత్‌కు ఉంది’’ అని విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్, కెనడా దౌత్యసంబంధాలు దారుణస్థాయికి క్షీణించడంతో కెనడాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయ పౌరులు, విద్యనభ్యసిస్తున్న లక్షలాది మంది భారతీయ విద్యార్థులపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ట్రూడో ఓటు బ్యాంక్ రాజకీయాలు ఓటు బ్యాంక్ రాజకీయ లబి్ధపొందేందుకు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఇలా తమ దౌత్యవేత్తలను అప్రతిష్టపాలు చేస్తోందని భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. మీ ప్రభుత్వం నిందారోపణలు చేయడం మానుకోవాలని కెనడా దౌత్యవేత్త ఎదుట భారత్ తన నిరసన వ్యక్తంచేసింది. ‘‘ కెనడాలోని భారతీయ హై కమిషనర్, ఇతర దౌత్యవేత్తలు, అధికారులపై ఇలా నిరాధారపూరితంగా వేధించడం ఏమాత్రం ఆమోదనీయం కాదు’’ అని స్పష్టంచేసింది. ఆరోపణలకు తగ్గ ఆధారాలు ఇవ్వలేదు ‘‘ 2023 సెపె్టంబర్లో ఈ ఉదంతంలో భారత ప్రమేయం ఉందంటూ ట్రూడో ఆరోపణలు చేశారు. కానీ ఆ మేరకు సాక్ష్యాధారాలను భారత ప్రభుత్వానికి అందజేయలేదు. ట్రూడో కెనడా ఓటుబ్యాంక్ రాజకీయాల్లో లబ్ది పొందేందుకే కేసు దర్యాప్తు సమగ్రంగా జరక్కముందే వాస్తవాలు లేకుండా భారత హైకమిషనర్ వర్మకు వ్యతిరేకంగా కెనడా వ్యవహరిస్తోందన్నది సుస్పష్టం. 2018లో భారతలో పర్యటించినప్పటి నుంచే ట్రూడో భారత్‌తో ఘర్షణాత్మక వైఖరిని అవలంభిస్తున్నారు. భారత్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న, తీవ్రవాదులతో సత్సంబంధాలున్న వ్యక్తులకు ట్రూడో మంత్రివర్గంలో చోటుదక్కింది. 2020 డిసెంబర్లో భారత ఎన్నికల ప్రక్రియలోనూ ట్రూడో జోక్యం చేసుకునేందుకు యతి్నంచారు. ట్రూడో ప్రభుత్వం పూర్తిగా ఒకే రాజకీయ పారీ్టపై ఆధారపడింది. ఆ పార్టీ కేవలం భారత్‌లో సిక్కు వేర్పాటువాదాన్ని ఎగదోయడమే పనిగా పెట్టుకుంది’’ అని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.విశ్వసనీయ సమాచారం ఇచ్చాం: వీలర్ భారత విదేశాంగ శాఖ కార్యాలయం నుంచి బయటికొచ్చాక కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్ వీలర్ మీడియాతో మాట్లాడారు. ‘‘ భారత్ ఏవైతే ఆధారాలను అడిగిందో వాటిని కెనడా ప్రభుత్వం ఇచి్చంది. కెనడా సొంత గడ్డపై కెనడా పౌరుడి హత్యోదంతంలో భారత సర్కార్‌కు చెందిన ఏజెంట్ల పాత్రపై విశ్వసనీయ, ఖచి్చతమైన సమగ్ర ఆధారాలను భారత్‌కు కెనడా ప్రభుత్వం అందజేసింది. ఇక నిర్ణయం భారత్‌కే వదిలేస్తున్నాం. ఇరు దేశాల స్వప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్ తన తదుపరి చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నాం. ఈ విషయంలో సహకరించేందకు కెనడా సిద్ధంగా ఉంది’’అని వీలర్ వ్యాఖ్యానించారు.ఏమిటీ నిజ్జర్ వివాదం? నిజ్జర్ కెనడా కేంద్రంగా భారత వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని గతంలోనే భారత్ కెనడా సర్కార్‌కు తెలియజేసినా ఎలాంటి స్పందనా రాలేదు. 2023 ఏడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రే నగరంలో గురుద్వారా సాహెబ్ పార్కింగ్ ప్రదేశంలో నిజ్జర్‌ను గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు కాల్చి చంపారు. అయితే ఈ కాల్పుల ఘటన వెనుక భారత నిఘా ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో గత ఏడాది సెపె్టంబర్లో తీవ్ర ఆరోపణలు చేశారు. ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించింది. ఆధారాల్లేకుండా నిందలు వేయడం తగదని గట్టిగా హెచ్చరించింది. హత్యకు సంబంధించి ఆధారాలు సమర్పిస్తే పరిశీలించి దర్యాప్తునకు సహకరించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని భారత్ స్పష్టంగా చెప్పింది. అయితే నిజ్జర్‌ను పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు చంపేసి ఆ నేరం భారత్‌పై మోపాలని కుట్ర జరిగిందని గతంలో అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. నిజ్జర్ హత్యకు గురై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది జూన్‌లో అక్కడి పార్లమెంట్ దిగువసభలో కెనడా ఎంపీలు నిజ్జర్‌కు నివాళులర్పించడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘ భారత్ ఉగ్రవాదిగా ప్రకటించిన, ఇంటర్‌పోల్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తికి ఏకంగా పార్లమెంటులో నివాళులరి్పంచడం దారుణం’’ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఎవరీ నిజ్జర్? నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్, ‘గురునానక్ సిక్ గురుద్వారా సాహిబ్’ అధిపతి అయిన నిజ్జర్ సిక్కు వేర్పాటువాదిగా పేరొందాడు. భారత్‌లోని జలంధర్ ప్రాంతంలోని బార్సింగ్పూర్లో జని్మంచాడు. 1997లో తప్పుడు పాస్ట్‌పోర్ట్‌లో కెనడాకు వెళ్లి స్థిరపడ్డాడు. అయితే అక్కడి నుంచే భారత్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించాడు. అమెరికాలో నెలకొల్పిన జస్టిస్ ఫర్ సిఖ్స్ సంస్థలో క్రియాశీలకంగా పనిచేశాడు. పంజాబ్‌లో హత్యలకు కుట్రపన్నాడన్న కేసులో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద భారత్ ఇతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఇతని తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. జాతీయ దర్యాప్తు సంస్థ భారత్‌లోని ఇతని ఆస్తులను స్వా«దీనం చేసుకుంది. -
Lakshadweep vs Maldives: ముదిరిన లక్షద్వీప్–మాల్దీవుల వివాదం
న్యూఢిల్లీ: ‘లక్షద్వీప్–మాల్దీవుల’ వివాదం ముదురుతోంది. మన పర్యాటక రంగంపై మాల్దీవుల మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలతో మొదలైన ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ పిలుపుకు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఆ దేశ దౌత్యవేత్త అలీ నజీర్ మొహమ్మద్‌తో భారత హైకమిషనర్ మును ముహావర్ సోమవారం సమావేశమయ్యారు. భారత్ పట్ల, ప్రధాని మోదీ పట్ల మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలను ఎండగట్టారు. వారిని మాల్దీవులు ఇప్పటికే సస్పెండ్ చేయడం తెలిసిందే. అయినా దీనిపై భారతీయ సమాజంలో ఆగ్రహావేశాలు తగ్గలేదు. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, శ్రద్దా కపూర్, వెంకటేశ్ ప్రసాద్, వీరేందర్ సెహా్వగ్ తదితర సెలెబ్రిటీలు కూడా ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’కు జై కొట్టారు. మాల్దీవుల పర్యటన మానేసి లక్షద్వీప్, అండమాన్ వంటి భారతీయ రమణీయ కేంద్రాలకు వెళ్లాలంటూ ఫొటోలను షేర్చేశారు. మాల్దీవులతో వాణిజ్య కార్యకలాపాలు తగ్గించుకోవాలని కన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ పిలుపునిచి్చంది. 3,400 శాతం పెరిగిన సెర్చింగ్! లక్షద్వీప్‌లో మోదీ పర్యటన తర్వాత ఆన్లైన్ వేదికల్లో భారత దీవుల కోసం వెతికే వారి సంఖ్య ఏకంగా 3,400 శాతం పెరిగిందని మేక్మైట్రిప్ సంస్థ పేర్కొంది. మాల్దీవులకు పర్యాటకుల్లో భారతీయుల సంఖ్యే అత్యధికమని ఆ దేశ పర్యాటక శాఖ గణాంకాల్లో వెల్లడైంది. గతేడాది 2.09 లక్షల మంది భారతీయులు అక్కడికెళ్లారు. 2022లో 2.4 లక్షలు, 2021లో 2.11 లక్షల మంది పర్యటించారు. అంతేకాదు, కోవిడ్ కాలంలోనూ 63,000 మంది అక్కడ పర్యటించారు! ట్రెండింగ్‌లో లక్షద్వీప్ మాల్దీవులకు బదులు భారతీయ పర్యటక కేంద్రాలకే వెళ్దామన్న సెలబ్రిటీలు పిలుపుతో లక్షద్వీప్ కోసం ఆన్లైన్లో సెర్చింగ్ అనూహ్యంగా పెరిగింది. ‘లక్షద్వీప్’ పదంతో ప్రపంచవ్యాప్తంగా సెర్చింగ్ చేస్తున్న వారి సంఖ్య గత రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత ఎక్కువ స్థాయికి చేరుకుందని ‘గూగుల్ ట్రెండ్స్’ గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఈజ్‌మైట్రిప్ సంస్థ భారత్‌కు మద్దతుగా మాల్దీవులకు విమానాల బుకింగ్స్‌ను రద్దుచేసింది. ‘‘మాల్దీవులు/సీషెల్స్ మాదిరే లక్షద్వీప్‌లోని బీచ్‌లు, పరిసరాలు అద్భుతంగా ఉంటాయి. ఇక్కడే పర్యటించండి’’ అని సంస్థ సీఈవో నిషాంత్ పిట్టి చెప్పారు. -
భారత హైకమిషనర్‌కు మాల్దీవులు సమన్లు
మాలె: ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు జారీ చేసిన కొన్ని గంటలకే కీలక పరిణామం చోటుచేసుకుంది. మాల్దీవుల ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న భారత హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది. భేటీ కావాల్సిందిగా మాలేలోని భారత హైకమిషనర్ మును మహావార్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్‌కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నేడు నేడు సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్‌కు ఆయన వచ్చివెళ్లినట్లు సమాచారం. వివాదంపై రెండు దేశాలు సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులపై మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఇది ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పడటానికి కారణమైంది. ఇదీ చదవండి: Lakshadweep Islands History: లక్షద్వీప్‌పై పాక్ కన్ను.. భారత్ ఎత్తుగడతో చిత్తు! -
భారత హైకమిషన్‌కు ఖలిస్తాన్ నిరసన సెగ
లండన్: బ్రిటన్‌లో ఖలిస్తానీ వేర్పాటువాద మద్దతుదారులు మరోసారి పేట్రేగిపోయారు. లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇటీవల బ్రిటన్‌లోని గ్లాస్గో పట్టణంలో గురుద్వారాలోకి భారత రాయబారి విక్రమ్ దొరైస్వామి వెళ్లకుండా ఖలిస్తానీవాదులు అడ్డుకున్న ఘటనను మరవకముందే మళ్లీ అలాంటి నిరసన కార్యక్రమానికి బ్రిటన్ వేదికగా మారింది. సోమవారం లండన్‌లో ఈ ఘటన జరిగింది. హై కమిషన్ కార్యాలయం ముందే ఆందోళన చేశారు. దీంతో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి వారిని నియంత్రించారు. మరోవైపు, దొరైస్వామిని అడ్డుకోవడాన్ని ఖండిస్తూ సదరు గురుద్వారా ప్రకటన విడుదల చేసింది. -
యూకే గురుద్వారాలో భారత హైకమిషనర్ అడ్డగింత
లండన్: ఖలిస్తాన్ సానుభూతిపరుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కెనడాతో ఖలిస్తాన్ అంశంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే అవి యూకేకు కూడా పాకాయి. స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో ఒక గురుద్వారాలోకి వెళ్లకుండా భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామిని ఖలిస్తానీ అతివాదులు అడ్డుకున్నారు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ (టీఎఫ్సీ) హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్కాట్లాండ్లో ఖలిస్తానీ సిక్కు యువత రెచ్చిపోవడం ఆందోళన కలిగిస్తోంది. యూకే పర్యటనలో ఉన్న దొరైస్వామి అల్బర్ట్ డ్రైవ్‌లోని గ్లాస్గోలో గురుద్వారా గురు గ్రంథ సాహిబ్ కమిటీ సభ్యులతో సమావేశమవడానికి శుక్రవారం వచ్చారు. ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న ఖలిస్తానీ యువత ఆయనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. గురుద్వార సిబ్బందిని కూడా వారు బెదిరించారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గురుద్వారా కమిటీ ఆహ్వానం మేరకే భారత హైకమిషనర్ అక్కడికి వచ్చినా సిక్కు యువకులు వారిని అడ్డుకున్నారు. ఇద్దరు యువకులు విక్రమ్ దొరైస్వామి కూర్చున్న కారు తలుపుని తీయడానికి ప్రయత్నించారు. దీంతో మరింత ఘర్షణని నివారించడానికి దొరైస్వామి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. అడ్డుకోవడం అవమానకరం దొరైస్వామి కాన్వాయ్‌ని ఖలిస్తానీ సానుభూతిపరు లు అడ్డుకోవడాన్ని భారత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. బ్రిటన్ ప్రభుత్వం దృష్టికి దీనిని తీసుకువెళ్లింది. మరోవైపు లండన్‌లో భారత హైకమిషన్ ఈ చర్యను ఉద్దేశపూర్వకంగా అవమానించారంటూ మండిపడింది. బ్రిటన్ ప్రభుత్వానికి, పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేసింది. -
హిందూ ఆలయాల విధ్వంసంపై భారత్ ఫైర్
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో స్వల్ప వ్యవధిలో హిందూ ఆలయాలపై జరిగిన దాడులపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ నెల మొదట్లో మెల్బోర్న్లోని స్వామినారాయణ్ ఆలయం, విక్టోరియా కర్రమ్ డౌన్స్‌లోని చారిత్రాత్మక శ్రీ శివ విష్ణు ఆలయం, మెల్బోర్న్లోని ఇస్కాన్ టెంపుల్‌పై దాడుదలు జరిగాయి. ఆలయాల గోడలపై భారత్‌కు, హిందు మతానికి వ్యతిరేకంగా రాతలను రాశారు. ఈ నేపథ్యంలో ఘటనలు జరిగి రోజులు గడుస్తున్నా దుండగులను పట్టుకోలేకపోవడంపై.. భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు కాన్‌బెర్రాలోని భారత హై కమిషన్ గురువారం ఒక ప్రకటనను విడుదల చేసింది. హిందూ ఆలయాలపై జరిగిన దాడులు, సంఘవిద్రోహ శక్తుల్ని కీర్తిస్తూ గీసిన గ్రాఫిటీల వ్యవహారం ఆందోళనకరంగా ఉందని.. ఈ దాడులను ముమ్మాటికీ కఠినంగా శిక్షించదగినదని సదరు ప్రకటనలో భారత హై కమిషన్ పేర్కొంది. అంతేకాదు ఈ చర్య.. ఇండో-ఆస్ట్రేలియన్ కమ్యూనిటీల మధ్య విద్వేషం రగిల్చేలా ఉందని పేర్కొంది. ఖలీస్థానీ అనుకూల శక్తులు ఆస్ట్రేలియాలో తమ కార్యకలాపాలను ఉధృతం చేశాయని, సిక్క్స్ ఫర్ జస్టిస్ లాంటి నిషేధిత ఉగ్ర సంస్థలు, ఇతర విద్వేషపూరిత సంస్థలతో కలిసి కుట్రలు పన్నుతున్నాయని అక్కడి ప్రభుత్వాన్ని భారత్ వారించింది. ఇప్పటికే ఆలస్యం అయ్యిందన్న కోణంలో.. దాడికి పాల్పడినవాళ్లను గుర్తించి, తగ్గ కఠిన శిక్షలు విధించాలని.. తద్వారా మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావనే ఆకాంక్ష వెలువరించింది భారత హై కమిషన్ ప్రకటన పేర్కొంది. ఇదిలా ఉంటే.. న్యూఢిల్లీలోని ఆస్ట్రేలియా హై కమిషన్ ఈ వ్యవహారంపై బదులిచ్చింది. ప్రస్తుతం విషయం దర్యాప్తులో ఉందని వెల్లడించింది. భారత్‌లాగే.. ఆస్ట్రేలియా కూడా బహుళ సంప్రదయాల దేశమని, హిందూ ఆలయాల విధ్వంసం తమనూ దిగ్భ్రాంతికి గురి చేసిందని భారత్‌లో ఆస్ట్రేలియా హై కమిషనర్ బ్యారీ ఓఫారెల్ తాజాగా ట్వీట్ కూడా చేశారు. -
దినేశ్‌కు మూడు కాంస్యాలు
సాక్షి, హైదరాబాద్: ఉగాండా పారా బ్యాడ్మింటన్ అంతర్జాతీయ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన రామ్‌కో సిమెంట్స్ ఉద్యోగి దినేశ్ రాజయ్య రాణించి మూడు కాంస్య పతకాలు సాధించాడు. దినేశ్ ఎస్ఎల్–3 సింగిల్స్‌లో, ఎస్ఎల్3–ఎస్ఎల్4 డబుల్స్‌లో, ఎస్ఎల్3–ఎస్యు5 మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీ సందర్భంగా దినేశ్‌ను ఉగాండాలో భారత హైకమిషనర్‌గా ఉన్న ఎ.అజయ్ కుమార్ సన్మానించి అభినందించారు. మొత్తం 20 దేశాల నుంచి వివిధ కేటగిరీల్లో కలిపి 191 మంది క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొన్నారు. భారత్‌కు 12 స్వర్ణాలు, 14 రజతాలు, 16 కాంస్యాలతో కలిపి మొత్తం 42 పతకాలు లభించాయి. -
'శ్రీలంక కోలుకునే వరకు భారత్ సాయం చేస్తూనే ఉంటుంది'
కొలంబో: తీవ్ర సంక్షోభంలో చిక్కుకుని విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది శ్రీలంక. ఈ నేపథ్యంలో కొలంబోలోని భారత హైకమిషనర్.. పార్లమెంటు స్పీకర్‌ను శనివారం ఉదయం కలిశారు. కష్టాల్లో ఉన్న లంకకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సంక్షోభ సమయంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను కాపాడటంలో కీలక పాత్ర పోషించిన పార్లమెంటు పాత్రను కొనియాడారు. చదవండి: శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింఘే ప్రమాణం శ్రీలంక ఆర్థికంగా కోలుకునేందుకు, దేశంలో స్థిరత్వం నెలకొనేవరకు భారత్ సాయం కొనసాగిస్తుందని హైకమిషనర్ పేర్కొన్నారు. ఈమేరకు కొలంబోలోని భారత హైకమిషన్ కార్యాలయం ట్వీట్ చేసింది. శ్రీలంక అధ్యక్ష పదవికి గొటబయ రాజీనామ చేసి తాత్కాలిక అధ్యక్షునిగా ప్రధాని రణిల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టిన మరునాడే ఈ సమావేశం జరిగింది. High Commissioner called on Hon’ble Speaker today morning. Appreciated Parliament's role in upholding democracy and Constitutional framework, especially at this crucial juncture. Conveyed that 🇮🇳 will continue to be supportive of democracy, stability and economic recovery in 🇱🇰. pic.twitter.com/apXeVWCnMA — India in Sri Lanka (@IndiainSL) July 16, 2022 -
సోషల్ స్టార్ కిలిపాల్ వీడియోస్‌కి భారత అధికారులు ఫిదా !
కిలి పాల్... ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అయ్యే వారికి పరిచయం అక్కర్లేని పేరు. పల్లెల్లో పిల్లగాళ్ల దగ్గర నుంచి బాలీవుడ్ స్టార్స్ వరకు కిలిపాల్‌కి ఫ్యాన్స్ అయ్యారు. అతని ఇన్‌స్టారీల్స్‌కి ఫిదా అవుతుంటారు. బాలీవుడ్ పాటలకు అదిరిపోయే స్టెప్పులు, అబ్బురపరిచే ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఎంతో మంది ఇండియన్ల మనుసులు దోచేశారు టాంజానియాకి చెందిన అన్నా చెల్లెల్లు కిలిపాల్ నీమాపాల్‌లు. పూర్తిగా ఆఫ్రికా వేషధారణలో ఉంటూ ఇండియాకి చెందిన పాపులర్ సాంగ్స్‌కి కిలిపాల్, నీమాపాల్ కలిసి చేస్తున్న వీడియోలు ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ లిస్టులో విదేశాంగ శాఖకు చెందిన అధికారులు కూడా చేరారు. టాంజానియాలో భారత హైకమిషనర్‌గా పని చేస్తున్న బినయ ప్రధాన్ అనే అధికారి కిలిపాల్ని సన్మానించారు. టాంజానియా, ఇండియాల మధ్య సంబంధాలు కిలిపాల్తో మరింగా బలపడుతున్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య సంస్కృతి సంప్రదాయాలు బాగా అర్థమవుతున్నాయంటూ ప్రశంసించారు. Huyo jamaa ndio huyu eeh??😁 pic.twitter.com/Mm8GSCd3b1 — United (@JosephSailanga) February 21, 2022 -
భారత రాయబారికి పాక్ సమన్లు
న్యూఢిల్లీ : పాకిస్తాన్ విదేశాంగ శాఖ భారత డిప్యూటీ హై కమిషనర్ గౌరవ్ అహ్లువాలియాకు సమన్లు జారీచేసింది. పాక్ అక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 4 ఉగ్రస్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు పాక్ సైనికులతో పాటు, పలువురు ఉగ్రవాదులు మరణించారని భారత ఆర్మీ పేర్కొంది. అయితే భారత్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించి.. తమ దేశ పౌరులను పొట్టనబెట్టుకుందని ఆరోపించింది. దీంతో పాక్ మరోసారి భారత్‌పై తన ద్వేషాన్ని ప్రదర్శించినట్టయింది. భారత కాల్పుల్లో ఓ పాక్ సైనికుడితో పాటు ముగ్గురు పౌరులు చనిపోయారని పాక్ ఆర్మీ అధికారులు చెప్పారు. అలాగే ఇద్దరు సైనికులు, ఐదుగురు పౌరులు చనిపోయినట్టు తెలిపారు. ఎక్కడ కూడా ఉగ్ర స్థావరాలు గానీ, ఉగ్రవాదులు గానీ మరణించినట్టు పాక్ పేర్కొనక పోవడం గమనార్హం. కాగా, తాంగ్ధర్ సెక్టార్లో శనివారం సాయంత్రం పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించిందని భారత ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. భారత్‌లోకి తీవ్రవాదులను పంపేందుకు పాక్ ఆర్మీ ఈ కాల్పులు జరిపిందని తెలిపాయి. అందువల్లే తాము పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేయాల్సి వచ్చిందని వెల్లడించాయి. -
సింగపూర్‌లో బుగ్గనతో భారత హై కమిషనర్ భేటీ
సింగపూర్: 'ఇండియా సింగపూర్- ది నెక్ట్స్ ఫేజ్ సదస్సు'కు హాజరైన ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌తో సింగపూర్‌లోని భారత హైకమిషనర్ సర్ జావేద్ అష్రాఫ్‌తో సమావేశమయ్యారు. సదస్సులో ఆంధ్రప్రదేశ్ పోషిస్తున్న కీలక పాత్రను, నాలుగు అంశాలను పునాదులుగా చేసుకొని రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికలు అమలుపై బుగ్గన రాజేంద్రనాథ్ ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అడిషనల్ చీఫ్ సెక్రటరీ డా. పీవీ రమేష్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ పాల్గొన్నారు. -
ఆస్ట్రేలియాలో భారత హై కమిషనర్‌తో రోజా భేటీ
కాన్బెర్రా : ఆస్ట్రేలియాలో భారత హై కమిషనర్ ఏఎమ్ గొండనేతో ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజా గురువారం సమావేశం అయ్యారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రోజా నేడు గొండనేతో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి అవకాశాల గురించి చర్చించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి రోజా వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని గొండనే మెచ్చుకున్నారు. -
‘పాక్‌లో భారత బాలికల కిడ్నాప్‌పై నివేదిక’
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో హోలీ సందర్భంగా ఇద్దరు భారత మైనర్ బాలికలను అపహరించి వారిని బలవంతంగా ఇస్లాం మతం స్వీకరించేలా చేశారనే ఆరోపణలపై భారత్ స్పందించింది. ఈ వ్యవహారంపై నివేదిక పంపాలని పాకిస్తాన్లో భారత రాయబారిని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కోరారు. ఈ ఘటనకు సంబంధించిన మీడియా కథనాలను ట్యాగ్ చేస్తూ పాక్‌లో భారత హైకమిషనర్‌కు దీనిపై వివరాలు పంపాలని కోరుతూ ట్వీట్ చేశారు. హోలీ వేడుకల నేపథ్యంలో సింధ్ ప్రావిన్స్‌లోని ఘోట్కీ జిల్లా ధర్కి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు మీడియా కధనాలు వెల్లడించాయి. ఈ ఘటన పట్ల తీవ్ర ఆందోళన చేపట్టిన హిందువులు నేరానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని డివమాండ్ చేశారు. పాకిస్తాన్లో మైనారిటీలుగా ఉన్న హిందువుల దుస్థితిపై భారత్ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఇమ్రాన్‌కు బ్యాటు బహుమానం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో భారత హైకమిషనర్ అజయ్ బిసారియా కాబోయే ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపైనా వీరిద్దరు చర్చించారు. సీమాంతర ఉగ్రవాదం, చొరబాట్లు తదితర అంశాలపై ఇమ్రాన్ వద్ద అజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ చీఫ్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తరఫున అజయ్ అభినందించారు. భారత క్రికెట్ జట్టు సంతకాలు చేసిన బ్యాట్‌ను బహూకరించారు. భారత్–పాక్ చర్చలు మళ్లీ ప్రారంభం కావాలని ఇమ్రాన్ ఆకాంక్షించారు. ఇస్లామాబాద్‌లో త్వరలో జరగనున్న సార్క్ సదస్సలో భారత్ పాల్గొనాలని కూడా ఆయన కోరారు. పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 18న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పీటీఐ ప్రకటించింది. భారత క్రికెటర్లు కపిల్ దేవ్, నవజ్యోత్ సింగ్ సిద్ధు, సునీల్ గావస్కర్‌లను ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు పేర్కొంది. ఆగస్టు 13 నుంచి పాక్ పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్నాయి. కాగా, పార్లమెంటు ఎన్నికల్లో బహిరంగంగా ఓటు వేసినందుకు పాక్ ఎన్నికల సంఘానికి ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు చెప్పారు. -
ఇమ్రాన్ ఖాన్‌కు మోదీ అరుదైన గిఫ్ట్
న్యూఢిల్లీ: కాబోయే పాకిస్తాన్ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అపురూపమైన కానుకను పంపించారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మాజీ కెప్టెన్‌కూడా అయిన్ ఖాన్‌కు క్రికెట్ బ్యాట్‌ను గిఫ్ట్‌గా పంపించారు. భారత క్రికెట్ జట్టు సభ్యులందరూ సంతకాలు చేసిన ఈ అరుదైన క్రికెట్ బ్యాట్‌ను భారత హై కమిషనర్ అజయ్ బిసారియా శుక్రవారం ఇమ్రాన్‌ఖాన్‌కు అందించారు. రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాలపై చర్చించేందుకు భారత రాయబారి అజయ్ బిసరియా పాకిస్థాన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఇమ్రాన్ ఖాన్,ఇతర ఉన్నతాధికారులను పిలిచి ప్రధాని మోదీ తరఫునఈ బ్యాట్‌ను బహుకరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సాధించిన ఘనవిజయానికి గాను అభినందనలు తెలిపారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 18న పాక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సెనేటర్ ఫైసల్ జావేద్ శుక్రవారం ప్రకటించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముగ్గురు మాజీ భారత క్రికెటర్లు కపిల్ దేవ్, నవజోత్ సింగ్ సిద్ధూ, సునీల్ గవాస్కర్లను ఆహ్వానించినట్టు తెలిపారు. కాగా జూలై 26న జరిగిన ఎన్నికలలో సాధారణ ఎన్నికలలో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పార్టీ 116 సీట్లను గెలుచుకుని అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ ఇమ్రాన్ అభినందించిన సంగతి తెలిసిందే. Indian HC Ajay Bisaria called on Mr Imran Khan, Chairperson & senior leadership of PTI. HC congratulated @ImranKhanPTI on his electoral success, discussed range of issues, prospects of India-Pak relationship. HC gifted a cricket bat autographed by the entire Indian cricket team. pic.twitter.com/xtdZ8H8ZQ5 — India in Pakistan (@IndiainPakistan) August 10, 2018 -
పాక్‌లో భారత రాయబారికి అవమానం
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి భారత రాయబారిని అవమానించింది. పాక్‌లో భారత హైకమిషనర్ అజయ్ బిసారియాను భద్రతా కారణాలను సాకుగా చూపుతూ గురుద్వారాలోకి వెళ్లకుండా అడ్డుకుంది. శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా బిసారియా కుటుంబ సభ్యులతో కలసి ఇస్లామాబాద్‌లోని గురుద్వారా పంజా సాహిబ్‌కు వెళ్లారు. ఇందు కోసం పాక్ విదేశాంగ శాఖ నుంచి ముందస్తు అనుమతి కూడా తీసుకున్నారు. అయితే గురుద్వారా సమీపానికి చేరుకున్నాక బిసారియాను లోపలకు అనుమతించలేదు. భద్రతా కారణాలను సాకుగా చూపిన పాక్ అధికారులు బిసారియా కారు నుంచి దిగేందుకు కూడా అంగీకరించలేదు. ఈ ఘటనపై ఢిల్లీలోని పాక్ డిప్యూటీ హైకమిషనర్ సయ్యద్ హైదర్ షాకు సమన్లు జారీచేసిన భారత విదేశాంగ శాఖ.. పాక్ అధికారుల వ్యవహారశైలిపై తీవ్ర నిరసన తెలిపింది. -
పాక్‌లో భారత హైకమిషనర్‌గా అజయ్ బిసారియా
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో భారత హైకమిషనర్‌గా 1987 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అజయ్ బిసారియా నియమితుల య్యారు. ప్రస్తుతం పోలెండ్‌లో భారత రాయబారిగా ఉన్న అజయ్ త్వరలోనే విధుల్లో చేరతారని విదేశాంగ శాఖ బుధవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది. పాక్‌లో భారత హైకమిషనర్‌గా పనిచేస్తున్న గౌతమ్ బంబావలే ఇటీవల చైనా రాయబారిగా వెళ్లిన నేపథ్యంలో.. అజయ్ పాక్‌లో భారత హైకమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఢిల్లీలోని ఫారిన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన అనంతరం అజయ్ రష్యన్ భాషను స్పెషలైజేషన్‌గా ఎంచుకున్నారు. -
కెనడా హైకమిషనర్‌గా వికాస్ స్వరూప్
న్యూఢిల్లీ: విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ కెనడాలో భారత హైకమిషనర్‌గా నియమితులయ్యారు. ప్రçస్తుతం అదనపు కార్యదర్శి హోదాలో కొనసాగుతున్న ఆయన త్వరలోనే కొత్త బాధ్యతలు చేపడతారని విదేశాంగ శాఖ వెల్లడించింది. పాకిస్తాన్ అఫ్గానిస్తాన్ , ఇరాన్ డివిజన్ లో ఉమ్మడి కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న గోపాల్ బాగ్లే స్వరూప్ స్థానంలో విదేశాంగ శాఖ నూతన అధికార ప్రతినిధిగా నియమితులవుతారు. 1986 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన స్వరూప్ విదేశాంగ శాఖ సేవలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువచేయడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన రాసిన తొలి నవల ‘క్యూ అండ్ ఏ’ను ఆస్కార్ అవార్డు గెలుపొందిన ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రంగా తీశారు. -
భారత రాయబారి, మాల్యా.. ఓ వివాదం
లండన్: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి బ్రిటన్ కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ మాల్యా లండన్ లోని ఒక పుస్తకావిష్కరణ సభకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి భారత రాయబారి కూడా హాజరుకావడం వివాదాన్ని రేకెత్తించింది. సహ రచయిత, పాత్రికేయుడు సన్నీ సేన్ తో కలసి సుహేల సేథ్ రచించిన 'మంత్రాస్ ఫర్ సక్సెస్' అనే పుస్తకాన్ని ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గురువారం ఆవిష్కరించారు. మీడియా నివేదికల ప్రకారం భారత హై కమిషనర్ నవతేజ్ సార్నా పాల్గొన్న సభకు మాల్యా కూడా హాజరయ్యారు. దీంతోపాటు అనంతరం జరిగిన ప్యానెల్ డిస్కషన్ సెషన్లో కూడా మాల్యా పాల్గొన్నాడని తెలిసింది. ఆ సమయంలో సార్నా అక్కడ ఉండడం విమర్శలకు తావిచ్చింది. దీనిపై ప్రభుత్వం స్పందించింది.ఇది భారత దౌత్యకార్యాలయం ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మాల్యాను చూసిన మరుక్షణమే నవ్ తేజ్ ఆ వేదికనుంచి, ఆ సభనుంచి బయటకు వచ్చేసారని ప్రకటించింది. అలాగే తాము మాల్యాను ఆహ్వానించలేదనీ.. ఈ పుస్తకావిష్కరణ సభ గురించి సోషల్ మీడియా ప్రకటించడం, ముందస్తు రిజిస్ట్రేషన్ అవసరం లేకపోవడం ఈ పరిణామం చోటు చేసుకుందని నిర్వాహకులు చెప్పారని ప్రభుత్వం తెలిపింది. అయితే తన పుస్తకావిష్కరణ సభకు అందరూ ఆహ్వానితులేనని, ప్రత్యేకంగా ఎవరికీ ఆహ్వానాలు పంపలేదని రచయిత సేథ్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. మిగతా ప్రేక్షకుల్లాగానే మాల్యా కూడా పాల్గొన్నారని తెలిపారు. -
దీపావళిని మెచ్చిన కెనడా ప్రధాని
టోరంటో: దీపావళి ప్రపంచ పండుగ అని కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడూ అన్నారు. తనకు దీపావళి పండుగ అంటే ఎంతో ఇష్టం అని చెప్పారు. ఒట్టావాలోని ఓ హిందూ దేవాలయంలో భారతీయ హిందువులు, సిక్కులు, బుద్ధులు, జైనులు కలిసి దీపావళి జరుపుతున్న సందర్భంగా ప్రధాని జస్టిన్ కూడా వెళ్లి వారితో చేరిపోయారు. వారందరిని పేరుపేరున పలకరించి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. కెనడాలోని భారత హైకమిషనర్ విష్ణుప్రకాశ్, పార్లమెంటు సభ్యుడు చంద్రకాంత్ ఆర్యా ఈ సందర్భంగా ప్రధాని జస్టిన్ ను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో జస్టిన్ మాట్లాడుతూ 'చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా ఈ రాత్రి కొన్ని కుటుంబాలు, కొందరు స్నేహితులతో కలసి జరుపుకుంటున్న దీపావళి వేడుకలో నేను కూడా భాగస్వామ్యం అయ్యాను. దీపకాంతుల వెలుగుల మధ్య జరుపుకుంటున్న ఈ వేడుక అంటే నాకు చాలా ఇష్టం' అని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరుపేరున దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. -
భారత్ రాయబారికి పాకిస్థాన్‌లో అవమానం
కరాచీ: పాకిస్థాన్‌లోని భారత హైకమిషనర్ టీసీఏ రాఘవన్‌కు చేదు అనుభవం ఎదురైంది. కరాచీలో ప్రముఖ క్లబ్ అయిన సింధ్ క్లబ్ చివరినిమిషంలో ఆయనకు, ఆయన భార్యకు ఆతిథ్యం ఇవ్వడానికి నిరాకరించింది. గత నెల 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామంతో భారత్-పాకిస్థాన్ సంబంధాలు మరింత దెబ్బతినే అవకాశం కనిపిస్తున్నది. కరాచీలోని అత్యంత ప్రాచీన సంస్థ అయిన సింధ్ క్లబ్లో పాకిస్థాన్-ఇండియా సిటిజెన్ ఫ్రెండ్షిప్ ఫోరం ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఫోరానికి పాకిస్థాన్ స్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా మనవడైన లియాకత్ మర్చంట్ కో చైర్మన్. ఈ కార్యక్రమం భారత్‌కు సంబంధించింది కావడంతో నిర్వాహకులు రాఘవన్‌ను కూడా పిలిచారు. దీంతో ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన, భార్యతో కలిసి కరాచీ వచ్చారు. అయితే నిర్వాహకుల ఆహ్వానం మేరకు వచ్చిన రాఘవన్‌ను తమ క్లబ్‌లోకి అనుమతించబోమని చివరినిమిషంలో సింధ్ క్లబ్ తెగేసి చెప్పింది. ఇందుకు ఎలాంటి కారణాలూ చెప్పలేదు. ఈ అకస్మాత్తు పరిణామంతో ఆయన షాక్ గురయ్యారు. పాకిస్థాన్ అధికారుల ఒత్తిడి వల్లో.. లేకపోతే ముంబైలో గజల్ గాయకుడు గులాం అలీ సంగీత కార్యక్రమాన్ని అనుమతించకపోవడం వల్లో ఆ క్లబ్ ఇందుకు తెగించి ఉంటుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. పాకిస్థాన్‌లో భారత్‌పై విద్వేష ప్రచారం జరుగుతున్నదనడానికి ఇది నిదర్శనమని, గులాం అలీ కార్యక్రమాన్ని రద్దు చేయడంపై విద్వేషపూరితంగా అక్కడి చానెళ్లు చర్చలు నిర్వహించాయని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. పాక్ రాయబారికీ ఇదే అనుభవం! భారత్‌లోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌కు కూడా ఈ ఏడాది ప్రారంభంలో ఇదే తరహా అనుభవం ఎదురైంది. చండీగఢ్‌లో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన సిద్ధమవుతుండగా.. తాము ఆయనకు ఆతిథ్యం ఇవ్వలేమని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు చెప్పడంతో ఆయన ప్రయాణాన్ని మానుకున్నారు. -
భారత రాయబారి వాహనంపై దాడిని ఖండించిన మహమ్మద్ నషీద్
మాల్దీవుల రాజధాని మాలెలో భారత రాయబారి రాజీవ్ షహరి వాహనంపై నిన్న సాయంత్రం ఆగంతకులు రాళ్ల దాడిని ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ తీవ్రంగా ఖండించారు. ఆ ఘటన వెంటనే విచారణ చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ ఘటనకు పాల్పడిన ఆగంతకుల చర్యను మతిలేని చేష్టలుగా వ్యాఖ్యానించారు. మాలెలోని భారత రాయబార కార్యాలయం వెలుపల ఆగి ఉన్న రాజీవ్ షహరి వాహనంపైన మొటర్ సైకిల్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చి రాళ్ల దాడి చేశారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అయితే ఆ ఘటనలో ఎవరు గాయపడలేదని, కానీ రాళ్ల దాడితో కిటికి అద్దాలు పగిలిపోయాయని, అలాగే కారు ధ్వంసమైందని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మాల్దీవుల్లో భారత హై కమిషనర్ కారుపై దాడి
మాలే: మాల్దీవుల్లో భారత హైకమిషనర్ రాజీవ్ షహారే కారుపై రాళ్ల దాడి జరిగింది. మాల్దీవుల రాజధాని మాలేలో ఆయన కారుపై గుర్తుతెలియని దుండగులు రాళ్లు రువ్వారు. అయితే ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. అమీర్ అహ్మద్ మాగులోని హైకమిషనర్ కార్యాలయం ఎదుట కారు పార్క చేసివుండగా సాయంత్రం 6.45 గంటలకు(స్థానిక కాలమానం) ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు కారుపై రాళ్లు రువ్వినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానితుల సమాచారం తెలిస్తే తమకు తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.