
దీపావళిని మెచ్చిన కెనడా ప్రధాని
టోరంటో: దీపావళి ప్రపంచ పండుగ అని కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడూ అన్నారు. తనకు దీపావళి పండుగ అంటే ఎంతో ఇష్టం అని చెప్పారు. ఒట్టావాలోని ఓ హిందూ దేవాలయంలో భారతీయ హిందువులు, సిక్కులు, బుద్ధులు, జైనులు కలిసి దీపావళి జరుపుతున్న సందర్భంగా ప్రధాని జస్టిన్ కూడా వెళ్లి వారితో చేరిపోయారు. వారందరిని పేరుపేరున పలకరించి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
కెనడాలోని భారత హైకమిషనర్ విష్ణుప్రకాశ్, పార్లమెంటు సభ్యుడు చంద్రకాంత్ ఆర్యా ఈ సందర్భంగా ప్రధాని జస్టిన్ ను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో జస్టిన్ మాట్లాడుతూ 'చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా ఈ రాత్రి కొన్ని కుటుంబాలు, కొందరు స్నేహితులతో కలసి జరుపుకుంటున్న దీపావళి వేడుకలో నేను కూడా భాగస్వామ్యం అయ్యాను. దీపకాంతుల వెలుగుల మధ్య జరుపుకుంటున్న ఈ వేడుక అంటే నాకు చాలా ఇష్టం' అని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరుపేరున దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాను.