సోషల్‌ స్టార్‌ కిలిపాల్‌ వీడియోస్‌కి భారత అధికారులు ఫిదా ! | Indian High Commissioner Binaya pradhan Honored Instagram star Kili Paul | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టా స్టార్ కిలిపాల్‌ని సన్మానించిన భారత అధికారులు

Published Tue, Feb 22 2022 1:48 PM | Last Updated on Wed, Feb 23 2022 2:22 PM

Indian High Commissioner Binaya pradhan Honored Instagram star Kili Paul - Sakshi

కిలి పాల్‌... ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అయ్యే వారికి పరిచయం అక్కర్లేని పేరు. పల్లెల్లో పిల్లగాళ్ల దగ్గర నుంచి బాలీవుడ్‌ స్టార్స్‌ వరకు కిలిపాల్‌కి ఫ్యాన్స్‌ అయ్యారు. అతని ఇన్‌స్టారీల్స్‌కి ఫిదా అవుతుంటారు. బాలీవుడ్‌ పాటలకు అదిరిపోయే స్టెప్పులు, అబ్బురపరిచే ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ ఎంతో మంది ఇండియన్ల మనుసులు దోచేశారు టాంజానియాకి చెందిన అన్నా చెల్లెల్లు కిలిపాల్‌ నీమాపాల్‌లు. 

పూర్తిగా ఆఫ్రికా వేషధారణలో ఉంటూ ఇండియాకి చెందిన పాపులర్‌ సాంగ్స్‌కి కిలిపాల్‌, నీమాపాల్‌ కలిసి చేస్తున్న వీడియోలు ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ లిస్టులో విదేశాంగ శాఖకు చెందిన అధికారులు కూడా చేరారు. టాంజానియాలో భారత హైకమిషనర్‌గా పని చేస్తున్న బినయ ప్రధాన్‌ అనే అధికారి కిలిపాల్‌ని సన్మానించారు. టాంజానియా, ఇండియాల మధ్య సంబంధాలు కిలిపాల్‌తో మరింగా బలపడుతున్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య సంస్కృతి సంప్రదాయాలు బాగా అర్థమవుతున్నాయంటూ ప్రశంసించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement