
కాంగో, జాంబియా, టాంజానియా, ఆ్రస్టేలియాలో మైనింగ్‌కు ఆసక్తి
న్యూఢిల్లీ: కీలక ఖనిజాల(మినరల్స్)తోకూడిన ఆస్తుల మైనింగ్‌కు ఆసక్తిగా ఉన్నట్లు గనుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతా రావు పేర్కొన్నారు. కాంగో, జాంబియా, టాంజానియా, ఆస్ట్రేలియా తదితర దేశాలలో అవకాశాలను అన్వేషిస్తున్నట్లు ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. కాబిల్‌తో ఆస్ట్రేలియా ప్రభుత్వం కలసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ బాటలో దేశీ కంపెనీల కోసం కాంగో, టాంజానియా తదితర కొన్ని దేశాలలో కీలక ఖనిజ ఆస్తులను వెలికి తీసేందుకు పనిచేస్తున్నట్లు తెలియజేశారు.
కాపర్, లిథియం, నికెల్, కోబాల్ట్ తదితరాలను అత్యంత ప్రాధాన్యతగల ముడిసరుకులుగా పేర్కొన్నారు. వేగవంత వృద్ధిలో ఉన్న శుద్ధ ఇంధన టెక్నాలజీలకు ఇవి బూస్ట్‌నివ్వగలని పేర్కొన్నారు. గాలి మరలు(విండ్ టర్బయిన్లు), ఎలక్ట్రిక్ వాహనాలు, వాటి బ్యాటరీల తయారీ ఎలక్ట్రిసిటీ నెట్‌వర్క్స్ తదితరాలలో వీటి వినియోగం విస్తరిస్తున్నట్లు వివరించారు. ఈ బాటలో కోల్ ఇండియా, ఎన్‌ఎండీసీ, ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్ తదితర పీఎస్‌యూ దిగ్గజాలు కాబిల్‌తో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా ఆస్ట్రేలియాలో కీలక మినరల్ బ్లాకులను అన్వేషిస్తున్నట్లు తెలియజేశారు.
జాంబియా గ్రీన్ సిగ్నల్
కోబాల్ట్, కాపర్ అన్వేషణకు జాంబియా ప్రభుత్వం 9,000 చదరపు కిలోమీటర్ల క్షేత్రాల(గ్రీన్‌ఫీల్డ్)ను భారత్‌కు ఇచ్చేందుకు ఇటీవల అంగీకరించినట్లు రావు తెలియజేశారు. రెండు, మూడేళ్లలో ఖనిజాన్వేషణ చేపట్టనున్నట్లు, తద్వారా మైనింగ్ హక్కులను సైతం పొందనున్నట్లు పేర్కొన్నారు. దేశీ జియలాజికల్ సర్వే(జీఎస్‌ఐ).. భారీ డిమాండుగల లిథియం బ్లాకులను జమ్ము, కాశీ్మర్(జేఅండ్‌కే), చత్తీస్‌గఢ్‌లలో గుర్తించినట్లు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. వెరసి జేఅండ్‌కేలో లిథియం బ్లాకుల అన్వేషణకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసేందుకు జీఎస్‌ఐ నిర్ణయించినట్లు తెలియజేశారు. ఏప్రిల్, మే నెలకల్లా వీటిపై స్పష్టత రానున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment