Kabyle
-
కీలక ఖనిజాలపై భారత్ దృష్టి
న్యూఢిల్లీ: కీలక ఖనిజాల(మినరల్స్)తోకూడిన ఆస్తుల మైనింగ్‌కు ఆసక్తిగా ఉన్నట్లు గనుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతా రావు పేర్కొన్నారు. కాంగో, జాంబియా, టాంజానియా, ఆస్ట్రేలియా తదితర దేశాలలో అవకాశాలను అన్వేషిస్తున్నట్లు ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. కాబిల్తో ఆస్ట్రేలియా ప్రభుత్వం కలసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ బాటలో దేశీ కంపెనీల కోసం కాంగో, టాంజానియా తదితర కొన్ని దేశాలలో కీలక ఖనిజ ఆస్తులను వెలికి తీసేందుకు పనిచేస్తున్నట్లు తెలియజేశారు. కాపర్, లిథియం, నికెల్, కోబాల్ట్ తదితరాలను అత్యంత ప్రాధాన్యతగల ముడిసరుకులుగా పేర్కొన్నారు. వేగవంత వృద్ధిలో ఉన్న శుద్ధ ఇంధన టెక్నాలజీలకు ఇవి బూస్ట్నివ్వగలని పేర్కొన్నారు. గాలి మరలు(విండ్ టర్బయిన్లు), ఎలక్ట్రిక్ వాహనాలు, వాటి బ్యాటరీల తయారీ ఎలక్ట్రిసిటీ నెట్వర్క్స్ తదితరాలలో వీటి వినియోగం విస్తరిస్తున్నట్లు వివరించారు. ఈ బాటలో కోల్ ఇండియా, ఎన్ఎండీసీ, ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ తదితర పీఎస్‌యూ దిగ్గజాలు కాబిల్తో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా ఆస్ట్రేలియాలో కీలక మినరల్ బ్లాకులను అన్వేషిస్తున్నట్లు తెలియజేశారు. జాంబియా గ్రీన్ సిగ్నల్ కోబాల్ట్, కాపర్ అన్వేషణకు జాంబియా ప్రభుత్వం 9,000 చదరపు కిలోమీటర్ల క్షేత్రాల(గ్రీన్‌ఫీల్డ్)ను భారత్‌కు ఇచ్చేందుకు ఇటీవల అంగీకరించినట్లు రావు తెలియజేశారు. రెండు, మూడేళ్లలో ఖనిజాన్వేషణ చేపట్టనున్నట్లు, తద్వారా మైనింగ్ హక్కులను సైతం పొందనున్నట్లు పేర్కొన్నారు. దేశీ జియలాజికల్ సర్వే(జీఎస్ఐ).. భారీ డిమాండుగల లిథియం బ్లాకులను జమ్ము, కాశీ్మర్(జేఅండ్‌కే), చత్తీస్‌గఢ్‌లలో గుర్తించినట్లు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. వెరసి జేఅండ్కేలో లిథియం బ్లాకుల అన్వేషణకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసేందుకు జీఎస్ఐ నిర్ణయించినట్లు తెలియజేశారు. ఏప్రిల్, మే నెలకల్లా వీటిపై స్పష్టత రానున్నట్లు వెల్లడించారు. -
యుట్యూబ్ హిట్స్
కాబిల్ : ట్రైలర్ 2 నిడివి : 1 ని. 58 సె.; హిట్స్ : 1,65,71,127 సరిగ్గా ముప్పై రోజుల్లో (జనవరి 25) విడుదల కాబోతున్న ‘కాబిల్’ చిత్రంలోని పాటలు, ట్రైలర్స్ వెంటవెంటనే యూట్యూబ్‌లో రిలీజ్ అవుతున్నాయి. తాజాగా రిలీజ్ అయిన కాబిల్ రెండో ట్రైలర్ ప్రణయభరితంగా ఉంది. రాజేశ్ రోషన్ మ్యూజిక్ ఆ ప్రణయానికి ప్రాణం పోసింది. హీరో హృతిక్ రోషన్, యామీ గౌతమ్‌ల మధ్య ‘చూపుకు అందని’ స్వచ్ఛమైన ప్రేమ ఈ వీడియోలో మీ హృదయాన్ని తాకుతుంది. ఇద్దరూ అంధులు. ఒకర్నొకరు ప్రేమిస్తుంటారు. వాళ్లది వెలుగు చొరబడని ప్రేమలోకమే అయినప్పటికీ, ఆ ప్రేమ.. వారి జీవితాలను వెలిగిస్తూ ఉంటుంది. అంతలో ఒక విషాదం వారి జీవితాలను తలకిందులు చేస్తుంది. తన ప్రేమను బతికించుకోడానికి హృతిక్.. శక్తికి మించిన ప్రయత్నం చేస్తాడు. పగ తీర్చుకుంటేనే తన ప్రేమను నిరూపించుకున్నట్లన్న నిర్ణయానికి వచ్చి విరోధులతో తలపడతాడు. ఇదంతా మీరు సినిమాలో చూడొచ్చు. ఈ ట్రైలర్లో 2లో మాత్రం మీరొక అందమైన ప్రపంచాన్ని మాత్రమే చూస్తారు. అందమైన ప్రేమను, అందమైన మనసును, అందమైన భావాలను అనుభూతి చెందుతారు. క్లాష్ ఆఫ్ క్లాన్స్ : శాంటాస్ సర్ప్రైజ్ నిడివి : 34 సె.; హిట్స్ 1,40,59,355 ‘క్లాష్ ఆఫ్ క్లాన్స్’ వీడియో గేమ్‌ను డిజైన్ చేసిన ప్రముఖ ఫిన్లాండ్ వీడియో గేమ్ కంపెనీ ‘సూపర్సెల్’ ఇప్పుడు తాత్కాలికంగా.. అంటే జనవరి 5 వరకు అందుబాటులో ఉండేలా ‘శాంటాస్ సర్ప్రైజ్’ గేమ్‌ను విడుదల చేసింది. ఆ గేమ్ ట్రైలరే ఈ వీడియో. మెర్రీ క్రిస్మస్ అనే కార్డ్‌తో వీడియో స్టార్ట్ అవుతుంది. అంతలోనే స్క్రీన్ మీద 1, 2, 3 అనే మూడు గిఫ్టు ప్యాక్‌లు ప్రత్యక్షం అవుతాయి. వాటిలో మొదటిది ఓపెన్ అవుతుంది. అది గిఫ్ట్ 1 అన్నమాట. అదే శాంటాస్ సర్ప్రైజ్. శత్రువుల ఇళ్లపై ఆకాశం నుంచి బాంబులు వచ్చిపడుతుంటాయి. అవి ఎక్కడివో కాదు. శాంటాక్లాజ్ బహుమతిగా పంపిన గిప్టు బాంబులు! ఈ గేమ్‌ను ఇవాళ్టి నుంచి పది రోజుల పాటు ఫ్రీ గా ఆపిల్ స్టోర్స్‌లో, గూగుల్ ప్లేలో ఆన్‌లైన్‌గా ఆడుకోవచ్చు. బ్లేడ్ రన్నర్ 2049 : అనౌన్స్మెంట్ నిడివి : 1 ని. 45.; హిట్స్ : 60,17,964 ముప్పై నాలుగేళ్ల్ల క్రితం వచ్చిన సైన్స్ ఫిక్షన్ హాలీవుడ్ మూవీ ‘బ్లేడర్ రన్నర్’ సీక్వెల్ ఈ చిత్రం. ఆ మూవీలోని ముగింపు సన్నివేశాలకు కొనసాగింపుగా ఈ మూవీలో లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ‘కె’.. అప్పట్లో భూస్థాపితమైపోయిన ఒక రహస్యాన్ని ఈ చిత్రంలో వెలికితీస్తాడు. దానిని ఛేదించే క్రమంలోనే.. ముప్పై ఏళ్లుగా ‘మిస్సింగ్’లో ఉన్న నాటి పోలీస్ ఆఫీసర్ రిక్ డెకార్డ్ ఆచూకీని కూడా కనిపెడతాడు ఆఫీసర్ ‘కె’! డెన్నిస్ విల్నోవ్ దర్శకత్వంలో ఈ చిత్రం 2017 అక్టోబర్ 6న విడుదల అవుతోంది. ఆ విడుదల ప్రకటనకు సంబంధించినదే ఈ వీడియో. ఆధునిక నగర జీవితం పొగబారిపోతున్న సన్నివేశంతో వీడియో మొదలౌతుంది. 1982లో విడుదలైన తొలి బ్లేడ్ రన్నర్ చిత్రంలో 2019 నాటికి లాస్ ఏంజిల్స్ నగరం ఎంత భయానకంగా విధ్వంస దశలో ఉంటుందో చూపిస్తారు. అందుకు కారణమైన ఆండ్రాయిడ్స్ (మానవులు కాని మానవులు)ను నాశనం చేసేందుకు పోలీస్ ఆఫీసర్ రిక్ డెకార్డ్.. బ్లేడ్ రన్నర్‌లా బయల్దేరుతాడు. బ్లేడ్ రన్నర్ అంటే కిల్లర్ అని అర్థం. ఈ రెండు సినిమాల కథ ఒకటే అయినా, టేకింగ్ భిన్నంగా, ముప్పై ఏళ్లు అడ్వాన్స్‌గా ఉంటుందని నిర్మాతలు చెబుతున్నారు. కొత్త బ్లేడ్ రన్నర్ వచ్చేలోపు పాత బ్లేడ్ రన్నర్‌ని మరోసారి చూసేయండి. -
మనసు అన్నీ చూస్తుంది!
కంటితో చూస్తారు కానీ.. ఎవరైనా మనసుతో చూస్తారా? మనసు పెడితే చూడొచ్చంటున్నారు హృతిక్ రోషన్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాబిల్’. సంజయ్ గుప్తా దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లో హృతిక్ నుదుటిపై ‘ది మైండ్ సీస్ ఆల్’ (మనసు అన్నీ చూస్తుంది) అని రాసి ఉంది. మరి.. మనసుతో హృతిక్ ఏం చూస్తున్నారో? తెలియాలంటే వచ్చే ఏడాది జనవరి 26 వరకూ ఆగాల్సిందే. తెలుగులో హృతిక్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.