
మనసు అన్నీ చూస్తుంది!
కంటితో చూస్తారు కానీ.. ఎవరైనా మనసుతో చూస్తారా? మనసు పెడితే చూడొచ్చంటున్నారు హృతిక్ రోషన్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాబిల్’. సంజయ్ గుప్తా దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌లో హృతిక్ నుదుటిపై ‘ది మైండ్ సీస్ ఆల్’ (మనసు అన్నీ చూస్తుంది) అని రాసి ఉంది.
మరి.. మనసుతో హృతిక్ ఏం చూస్తున్నారో? తెలియాలంటే వచ్చే ఏడాది జనవరి 26 వరకూ ఆగాల్సిందే. తెలుగులో హృతిక్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.