
100 కోట్ల డీల్ సెట్ చేసిన హృతిక్
సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా బాలీవుడ్ సూపర్ హీరో బ్రాండ్ అంబాసిడర్ గా దూసుకుపోతున్నారు. తాజాగా ఓ హెల్త్ స్టార్టప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా రూ 100 కోట్ల ఒప్పందంపై సంతకాలు చేశారు హృతిక్. ఐదేళ్ల పాటు ఈ ఒప్పందం కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఓ భారతీయ స్టార్టప్ ఇంత పెద్దమొత్తం ఆఫర్ చేయడం ఇదే తొలిసారి. కల్ట్.ఫిట్ నిర్వహించే ఫిట్‌నెస్ సెంటర్ల ప్రమోషన్ కోసం హృతిక్ సేవలు అందిస్తారు.
దీనికోసం బాలీవుడ్ స్టార్ తన సొంత సంస్థ హెచ్‌ఆర్‌ఎక్స్ స్పెషలైజ్‌డ్ వర్క్‌అవుట్ ప్లాన్‌ను డిజైన్ చేశారు. కల్ట్ ఫిట్‌నెస్ సెంటర్లలో హెచ్‌ఆర్‌ఎక్స్ వర్కవుట్ ప్లాన్ అందుబాటులో ఉండేలా మొబైల్ యాప్‌ను ప్రారంభిస్తారు. దీని ద్వారా రానున్న సంవత్సరాల్లో రూ.250 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. స్టార్టప్స్‌తో పలువురు సెలబ్రిటీలు పలు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఆన్‌లైన్ గ్రాసరీ సంస్థ బిగ్ బాస్కెట్‌కు షారూక్ ఖాన్, స్నాప్‌డీల్‌కు అమీర్‌ఖాన్, ఆన్‌లైన్ జ్యూవెలరీ బ్రాండ్ బ్లూస్టోన్కు అలియా భట్ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.