ఆ స్టార్ జంట డర్టీ సీక్రెట్స్ బయటపడ్డాయి! | Hrithik Roshan, Kangana Ranaut legal mess, All dirty secrets are out | Sakshi
Sakshi News home page

ఆ స్టార్ జంట డర్టీ సీక్రెట్స్ బయటపడ్డాయి!

Published Wed, Mar 16 2016 4:11 PM | Last Updated on Fri, Aug 17 2018 5:11 PM

ఆ స్టార్ జంట డర్టీ సీక్రెట్స్ బయటపడ్డాయి! - Sakshi

ఆ స్టార్ జంట డర్టీ సీక్రెట్స్ బయటపడ్డాయి!

బాలీవుడ్‌లో ప్రేమలు, ప్రణయాలు, వాటి చుట్టూ వదంతులు కొత్త కాదు. కానీ బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్‌, కంగనా రనౌత్‌ మధ్య 'ఎఫైర్‌' మాత్రం రచ్చకెక్కి హల్‌చల్‌ చేస్తోంది. తాజాగా ఈ ఇద్దరు నటులు పరస్పరం లీగల్ నోటీసులు పంపించుకున్నారు. 
 
గత జనవరిలో హృతిక్ ను ఉద్దేశించి కంగనా 'సిల్లీ ఎక్స్' (బోయ్‌ఫ్రెండ్‌) అనడంతో వివాదం మొదలైంది. ఈ వ్యవహారంపై అప్పట్లో గుర్రుగా స్పందించిన హృతిక్ ఇప్పుడు ఏకంగా కంగనాకు లీగల్ నోటీసులు పంపాడు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. దీనికి దీటుగా కంగనా కూడా లీగల్ నోటీసులతో బదులిచ్చింది. 
 
ఈ లీగల్‌ నోటీసుల్లోని కంటెంట్‌ మాత్రం ఈ ఇద్దరి మధ్య పెద్ద గూడుపుఠాణి జరిగినట్టు వెల్లడిస్తోంది. కంగనా తనకు రోజుకు 50కిపైగా ఈమెయిల్స్‌ పంపి.. తనను వెంటాడిందని, ఆమె మొత్తంగా 1,439 ఈమెయిల్స్ పంపిందని తన లీగల్ నోటీసులలో హృత్తిక్ తెలిపాడు. సామాజికంగా సరిగ్గా వ్యవహరించలేని అస్పర్జెర్ అనే మానసిక రుగ్మతతో ఆమె బాధపడుతున్నదని, అందుకే ఈమెయిల్స్‌కు తాను ఎప్పుడూ సమాధానమివ్వలేదని అతను పేర్కొన్నాడు. కంగనా కూడా తన లీగల్ నోటీసులలో దీటుగా సమాధానమిచ్చింది. ఒక సీక్రెట్ ఈమెయిల్ ఐడీతో హృతిక్ తనతో సంభాషణ కొనసాగించాడని, మెయిల్స్ కూడా పంపాడని పేర్కొంది. అయితే హృతిక్ మాత్రం తన పేరిట ఎవరో నకిలీ ఐడీతో ఆమెకు మెయిల్స్ పంపించడంతో తాను ఒరిజినల్ ఐడీని ఆమెకు ఇచ్చానని, అంతేకానీ కంగనాతో తాను మాట్లాడలేదని హృతిక్ అంటున్నాడు.

కంగనా మాత్రం తన అకౌంట్‌ను హృత్తిక్ హ్యాక్ చేసి.. అతడు విడాకుల వ్యవహారానికి ఇబ్బంది కలుగకుండా ఆ మెయిల్స్‌ అన్ని డిలీట్ చేశాడని ఆరోపించింది. తాను ఆయనకు పంపిన ఈమెయిల్స్‌ బహిర్గత పరిస్తే అతడిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించింది. హృతిక్ తో సత్సంబంధాలు కొనసాగిన సమయంలో ఆ మెయిల్స్ పంపడం జరిగిందని, వాటిని అడ్డం పెట్టుకొని బెదిరించాలని చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. 
 
హృతిక్, కంగనా రెండు సినిమాలు 'కైట్', 'క్రిష్-3'లో కలిసి నటించారు. 'కైట్' సందర్భంగా వీరి మధ్య స్నేహం చిగురించగా.. 'క్రిష్-3' సమయంలో వీరి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయనే వదంతులు వచ్చాయి. ఆ సమయంలోనే హృతిక్ భార్య సుసానే ఖాన్‌ విడాకుల కోసం కోర్టుకు ఎక్కింది. ఈ దంపతులు వీడిపోవడానికి కంగనానే కారణమని అప్పట్లో పుకార్లు షికారు చేశాయి. ఈ వార్తల నేపథ్యంలో కంగనా ...హృతిక్ ను ఎక్స్‌ బోయ్‌ఫ్రెండ్ అనడం.. చినికిచినికి పెద్ద వివాదంగా మారి లీగల్‌ నోటీసులకు దారితీసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement