Stalking
-
ఆ సమయంలో అమ్మాయిని ఫాలో కావడం అసాధ్యం.. కోర్టు కీలక తీర్పు
ముంబై: మహిళపై వేధింపుల కేసులో ముంబై మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు గతవారం కీలక తీర్పునిచ్చింది. 40 ఏళ్ల నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముంబైలో ఉదయం వేళ చాలా రద్దీగా ఉంటుందని, ఆ సమయంలో ఒకరిని మరొకరు ఫాలో కావడం అసాధ్యమని వ్యాఖ్యానించింది. ఏం జరిగిందంటే..? ముంబై చిరా బజార్లో నివసించే ఓ మహిళ.. ఓ వ్యక్తి తనను రోజు ఫాలో అవుతున్నాడని ఆరోపించింది. ఉదయం రైల్వే స్టేషన్‌కు వెళ్లే సమయంలో అతడు తనను బైక్‌పై అనుసరిస్తున్నాడని, తనవైపే చూస్తూ ఇబ్బంది పెడుతున్నాడని కేసు పెట్టింది. నిందితుడు కూడా అదే ప్రాంతంలో ఓ గ్యారేజీ నడుపుతున్నాడు. ఆమె వెళ్లేదారిలోనే ఆ షాపు కూడా ఉంది. అయితే మహిళ చేసిన ఆరోపణలపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముంబైలో ఉదయం వేళ చాలా రద్దీగా ఉంటుందని, ఆపీసులకు వెళ్లేవారితో రోడ్లు కిక్కిరిపోతాయని పేర్కొంది. అలాంటి సమయంలో ఒకరిని మరొకరు ఫాలో చేయడం అసలు సాధ్యం కాదని చెప్పింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి బెయిల్ ఇచ్చింది. ఈ కేసు 2017 ఆగస్టు 3న నమోదైంది. చదవండి: ఇండియన్ కరెన్సీ నోట్లపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు -
లైంగిక వైధింపుల కేసు: ప్రముఖ కొరియోగ్రాఫర్‌పై చార్జ్‌షీట్
లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై చార్జ్‌షీట్ దాఖలైంది. అతనితో పాటు ఆయన అసిస్టెంట్‌పై 354-ఎ, 354-సి, 354-డి,509,323, 504 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. కాగా 2020లో మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఆయనకు అసిస్టెంట్‌గా పనిచేసిన ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మాస్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు పోర్న్ వీడియోలు చూపించాడని ఆరోపించింది. ఫిర్యాదులో ఏమందంటే..'గణేష్ మాస్టర్ నన్ను చాలా రకాలుగా వేధించాడు. అంతేకాకుండా మే, 2010లో తనతో శృంగారంలో పాల్గొనాలని గణేష్ మాస్టర్ బలవంతం చేశాడు. తాను చెప్పినట్లు చేస్తే ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి లొంగదీసుకోవాలని చూశాడు. అయనప్పటికీ తాను నిరాకరించడంతో 6నెలల్లోనే ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్‌లో సభ్యత్వం రద్దు చేయించారు. అలాగే మాస్టర్ తన అసిస్టెంట్స్‌తో నాపై దాడి చేయించాడు. ఆ మహిళా అసిస్టెంట్లు నాన్ను కొట్టి దుర్భాషలాడారు.. నా పరువు తీశారు. ఇవన్నీ జరిగాక నేను నాన్ కాగ్నిసబుల్ కేసు నమోదు చేశాను. అనంతరం తదుపరి చర్యల కోసం లాయర్ని సంప్రదించాను' అని సదరు మహిళ వెల్లడించింది. కాగా రీసెంట్గా 'ఊ అంటావా మావ..ఊఊ అంటావా మావ సాంగ్'కు గణేష్ మాస్టరే కొరియోగ్రఫీ చేశారు. -
భర్తకు గండం ఉందని వివాహిత మెడలో తాళి కట్టి..
సాక్షి, హైదరాబాద్ : పూజలు చేయకుంటే భర్తకు ప్రమాదం జరుగుతుందంటూ మాయమాటలు చెప్పి ఓ వివాహిత మెడలో తాళి కట్టి బెదిరింపులకు పాల్పడ్డాడో వ్యక్తి. ఈ సంఘటన హైదరాబాద్, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మాధవ్ అనే వ్యక్తి తాను జ్యోతిష్యుడినంటూ మాయమాటలు చెప్పి కేపీహెచ్‌బీకి చెందిన ఓ వివాహితకు పరిచయమయ్యాడు. ఓ రోజు మాటల సందర్భంలో.. మహిళ జాతకంలో దోషం వల్ల ఆమెకు పక్షవాతం, భర్తకు ప్రాణాపాయం ఉందంటూ భయపెట్టాడు. ( డ్రగ్స్ కేసులో చిక్కుకున్న బడా ప్రొడ్యూసర్ భర్త లేని సమయంలో పూజ చేయాలంటూ, బాధితురాలికి మాయమాటలు చెప్పి ఆమె మెడలో తాళి కట్టాడు. తాళి కట్టిన తర్వాత ఆమె తన భార్య అంటూ డబ్బు కోసం బెదిరించాడు. అసభ్యకరమైన ఫొటోలు మెసేజ్ చేస్తూ బాధితురాలిని ఇబ్బంది పెట్టసాగాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు మాధవ్‌ను, అతడికి సహకరించిన రాఘవ్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండుకు తరలించారు. -
వెంబడిస్తూ వేధింపులు.. భారత యువకుడికి జైలు
లండన్ : లండన్‌లో ఓ యువతిని నిత్యం వెంబడిస్తూ వేధింపులకు గురిచేస్తున్న భారత యువకుడికి 29 నెలల జైలు శిక్షతోపాటూ, భారత్‌కు పంపించాలని కోర్టు తీర్పునిచ్చింది. లండన్‌లోని వెంబ్లీలోని ఓ షాప్‌లో పని చేస్తున్న యువతి(20)ని 2017లో భారత్‌కు చెందిన రోహిత్ శర్మ(28) మొదటి సారి చూశాడు. అనంతరం తనను పెళ్లి చేసుకోవాలని కోరడంతో అమె నిరాకరించింది. ఇక అప్పటి నుంచి ఆమెను వెంబడించడంతో బాధితురాలు ఏకంగా ఉద్యోగం మానేసి మరో చోట పనిచేయడం ప్రారంభించింది. ఆ తర్వాత కూడా ఆమె పని చేసే చోటును కనిపెట్టి మరీ వేధించడం ప్రారంభించాడు. బాధితురాలికి రోజుకు 40కిపైగా వివిధ ఫోన్ల నుండి కాల్స్ చేసి వేధించేవాడు. బాధితురాలు ఫోన్ నెంబర్లను బ్లాక్ చేసిన ప్రతిసారి కొత్త ఫోన్ నెంబర్ నుంచి కాల్స్ చేసి వేధించేవాడు. వేధింపులు ఎక్కువ కావడంతో 2018ఫిబ్రవరిలో పోలీసులకు యువతి ఫిర్యాదు చేయడంతో రోహిత్‌కు హారాస్మెంట్ వార్నింగ్ ఇచ్చారు. అప్పటికీ మారకుండా తరచూ యువతిని వెంబడిస్తూ పని చేసే చోటుకు వెళ్లి గంటల తరబడి చూస్తూ వేధించేవాడు. దీంతో 2018 జూలైలో పోలీసులు కేసు నమోదు చేసి రోహిత్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలై తిరిగి వేధింపులు ప్రారంభించాడు. 2018 నవంబర్‌లో కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో అతడికోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇంటెలీజెన్స్ పోలీసుల సమాచారంతో 2019 ఏప్రిల్‌లో రోహిత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో రోహిత్ దోషిగా తేలడంతో యువతిని వెంబడించినందుకు 22 నెలలు, వేధింపులకు పాల్పడినందుకు 6 నెలలు, కోర్టు విచారణకు హాజరు కానందుకు ఒక నెల కలిపి మొత్తం 29 నెలల జైలు శిక్షతోపాటూ, శిక్షాకాలం పూర్తయిన తర్వాత అతడిని భారత్‌కు పంపించాలని లండన్‌లోని ఐల్వర్త్ క్రౌన్ కోర్టు తీర్పు వెలువరించింది. -
వెంటపడ్డ విద్యార్థులపై చార్జ్‌షీటు
సాక్షి, న్యూఢిల్లీ : మద్యం సేవించి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కారును వెంబడించిన నలుగురు ఢిల్లీ వర్సిటీ విద్యార్థులపై సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతేడాది ఫిబ్రవరిలో విమానశ్రయం నుంచి ఇంటికి వెళ్తున్న ఇరానీని నలుగురు వెంబడించారు. దీంతో పోలీసులకు ఫోన్ చేసిన స్మృతి, తనను కొందరు యువకులు వెంబడిస్తున్నారని ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన చైతన్యపురి పోలీసులు నలుగురు యువకుల్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వైద్యపరీక్షలు నిర్వహించగా వారందరూ మద్యం సేవించినట్లు తేలింది. రిపోర్టుల నేపథ్యంలో నలుగురు విద్యార్థులపై పోలీసులు చార్జ్‌షీటు దాఖలు చేశారు. -
ఎఫ్బీలో స్నేహితుడై.. ఆపై వెంటపడి..
సాక్షి, హైదరాబాద్ : నగరంలో ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ వివాహితను వేధించిన లాయర్‌ను లంగర్‌హౌజ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చార్మినార్ ఖిల్వాత్ ప్రాంతానికి చెందిన లాయర్ మీర్జా మౌజం బైగ్ (31)పై లంగర్‌హౌజ్‌కు చెందిన 33 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేసింది. మొదట ఫేస్బుక్లో పరిచయమైన బైగ్.. ఆ తర్వాత వ్యక్తిగతంగా కలిశాడని, ఇప్పుడు తనను లైంగికంగా వేధిస్తూ వెంటాడుతున్నాడని ఆమె ఫిర్యాదులో తెలిపింది. ఈవెంట్ మేనేజర్ కావడం వల్ల వృత్తిపరంగా తాను బైగ్తో కలిసి కొన్ని పార్టీలకు హాజరయ్యానని, ఈ క్రమంలో అతను తన వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవడం ప్రారంభించాడని, అతడు స్నేహితులతో కలిసి ఫేస్బుక్లో తనకు అసభ్య మెసేజ్‌లు పంపిస్తున్నాడని ఆమె తెలిపింది. బైగ్ యూత్ కాంగ్రెస్ నేతగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ‘అతను ఆమె వ్యక్తిగత సమాచారం సేకరించి.. తప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టాడు. ఆమె ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఆమెను బలవంతపెట్టాడు. అందుకు ఆమె నిరాకరించడంతో వేధించడం మొదలుపెట్టాడు’ అని పోలీసులు తెలిపారు. బైగ్ తన స్నేహితులు జీషాల్ అలీ ఖాన్, మెహ్రాజ్ పటేల్, మహ్మద్ లుఖ్మన్‌లతో ఆమె వ్యక్తిగత విషయాలు చర్చించి.. వారి ద్వారా ఆమె గురించి పుకార్లు వ్యాప్తి చేశాడని, అంతేకాకుండా తన స్నేహితుడు షైక్ అహ్మద్ పర్వేజ్ ద్వారా బాధితురాలి భర్తకు ఈ పుకార్లు చేరవేశాడని పోలీసులు వివరించారు. ఆమె ఫిర్యాదు మేరకు బైగ్‌ను విచారణకు పిలిచామని, హాజరుకాకపోవడంతో మంగళవారం అరెస్టు చేశామని తెలిపారు. అయితే, తనకు అస్వస్థతగా ఉందని అతను ఆస్పత్రిలో చేరాడని, అనంతరం పోలీసులు తనను విచారణ సందర్భంగా కొట్టారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని చెప్పారు. -
గుర్గావ్లోనూ యువతిని వెంటాడారు..
గుర్గావ్: చండీగర్ వీధుల్లో వర్ణికా కుందుకు ఎదురైన అనుభవమే గుర్గావ్లో ఓ యువతికి ఎదురైంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి ఓ యువతి(25) విధులను ముగించుకుని స్కూటర్‌పై ఇంటికి వెళుతుండగా ఇద్దరు దుండగలు కారులో ఆమెను వెంటాడారు. మూడు కిలోమీటర్ల మేర యువతిని అనుసరించినవాళ్లు ఆమె వాహనాన్ని ఆపాల్సిందిగా కేకలు వేశారు. దుండగులు వెంబడిస్తున్నట్టు గమనించిన బాధితురాలు నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే తనను వెంబడించిన కారు నెంబర్ ఆమెకు గుర్తురాలేదు. కేవలం హెచ్ఆర్-57 అనే నెంబర్లు మాత్రమే యువతి చెప్పగలుగుతున్నదని పోలీసులు తెలిపారు. అనంతరం పోలీస్ కమీషనర్ సందీప్ కిర్వార్ కార్యాలాయానికి వెళ్లిన బాధితురాలు ఘటనపై ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ దృశ్యాలు రికార్డు అయితే తప్ప దర్యాప్తులో తాము పురోగతి సాధించలేమని పోలీసులు పేర్కొనడం గమనార్హం. చండీగఢ్‌లో వర్ణికా కుందు అనే యువతిని హరియాణా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా కుమారుడు వికాస్ బరాలా తన ఎస్‌యూవీలో వెంటాడి వేధింపులకు గురిచేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో గుర్గావ్లో ఈ తరహా ఘటన చోటుచేసుకుంది. -
స్కూటర్‌పై వెళుతున్న యువతిని వెంబడించి..!
గురుగ్రామ్: చండీగఢ్‌లో సాక్షాత్తు బీజేపీ అధ్యక్షుడి కొడుకే ఓ యువతిని వెంటాడి వేధించిన ఘటనను మరువకముందే.. గురుగ్రామ్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. సోమవారం రాత్రి స్కూటర్‌పై ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతున్న 25 ఏళ్ల యువతిని ఇద్దరు వ్యక్తులు కారులో వెంబడించారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో గురుగ్రామ్ సెక్టర్-18లోని ఆఫీస్ నుంచి ఆమె స్కూటర్‌పై ఇంటికి బయలుదేరారు. ఇద్దరు వ్యక్తులు కారులో ఆమెను దాదాపు మూడుకిలోమీటర్ల వరకు వెంబడించి వేధించారు. స్కూటర్ ఆపాలంటూ పదేపదే అరవడమే కాకుండా.. ఆమెను కారుతో కార్నర్ చేసి కిందపడేయాలని చూశారు. ఓల్డ్ ఢిల్లీ-గురుగ్రామ్ రోడ్డు సమీపంలోని అతుల్ కటారియా చౌక్ వరకు ఈ దుర్మార్గం కొనసాగింది. 'వారు బెదిరింపులను పట్టించుకోకుండా ప్రాణాలు కాపాడుకోవడమే లక్ష్యంగా స్కూటర్‌ను వేగంగా నడిపాను. ఎంతో కష్టం మీద ఇంటికొచ్చాను' అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంలోనూ ఆమెకు చేదు అనుభవమే ఎదురైంది. సెక్టర్-14 పోలీసు స్టేషన్‌కు వెళ్లగా.. జరిగిన ఘటన తమ పరిధిలోకి రాదంటూ.. సెక్టర్-18 పోలీసు స్టేషన్‌కు వెళ్లమంటూ ఆమెను తిప్పిపంపారు. దీంతో మధ్యాహ్నం ఆమె పోలీసు కమిషనర్ ఆఫీస్‌కు నేరుగా వెళ్లి ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 354డీ (స్టాకింగ్) కింద అభియోగాలను మోపిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులను గుర్తించడానికి సీసీటీవీ దృశ్యాలు పోలీసులకు కీలకంగా మారనున్నాయి. -
ఆకతాయిల వేధింపులతో బాలిక ఆత్మహత్య
హైదరాబాద్: పోకిరీల వేధింపులతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని బలవన్మరణం చెందింది. ఆల్వాల్‌లోని కేఎంఆర్ జూనియర్ కళాశాలలో ఫస్టియర్ చదువుతున్న గౌతమి(16)ను కొందరు వేధిస్తున్నారు. వారి చేష్టలను తట్టుకోలేని బాలిక గురువారం ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ మేరకు ఆమె తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు విజయ్, నాని, ఘని అనే ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
పెళ్లిలో చూసిన అమ్మాయికోసం చివరకు విలనై..
న్యూఢిల్లీ: అచ్చం సినిమాలో విలన్‌లాగే.. మనసు పడిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఓ యువకుడు వికృత చేష్టలకు దిగాడు. ఇష్టపడిన అమ్మాయి అక్క కుమారుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి తనను పెళ్లి చేసుకుంటేనే అతడిని విడిచిపెడతానని లేదంటే చంపేస్తానని బెదిరించాడు. అయితే, చివరకు పోలీసులు పథకం ప్రకారం అతడి ఆటను కట్టించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పింతూ కుమార్ అనే వ్యక్తిది బిహార్‌లోని బాగల్పూర్ జిల్లాలోని హిరాన్ కుద్నా అనే గ్రామం. అతడు ఓ పెళ్లిలో ఓ యువతిని చూసి ఇష్టపడ్డాడు. దీంతో ఎలాగైనా ఆ అమ్మాయిని సొంతం చేసుకోవాలని ఆలోచించి ఆ అమ్మాయి బావతో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. అనంతరం వారితోపాటు ఢిల్లీకి మకాం మార్చాడు. తాను ఇష్టపడిన యువతి సోదరితో కూడా పరిచయం పెంచుకున్నాడు. అలా నెల రోజులుగడిచిన తర్వాత తన ప్రేమ విషయం ఆ ఇంట్లో వాళ్లకు చెప్పాడు. అయితే అతడికి ఏ ఉద్యోగం లేదని ఆ అమ్మాయిని ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో అప్పటి వరకు బుద్ధిమంతుడిలా ఉన్న పింటూ కుమార్ లో విలన్ బయటకొచ్చాడు. వెంటనే వాళ్ల ఆరేళ్ల పిల్లాడిని కిడ్నాప్ చేసి బిహార్ లోని షేక్ పూరా అనే గ్రామానికి పరారయ్యాడు. అనంతరం ఓ ఎస్టీడీ బూత్ నుంచి ఫోన్ చేసి ఆ ఇంట్లో తాను ఇష్టపడిన ఆమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తేనే బాబును విడిచిపెడతానని లేదనంటే చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయం పోలీసులకు చెప్పడంతో వారు పథకం ప్రకారం అతడిని అరెస్టు చేసి బాలుడిని విడిపించారు. -
'ఓలా' గోల: మహిళను వెంటాడి వేధించిన డ్రైవర్!
ముంబై: 30 ఏళ్ల మహిళను వెంటాడి వెంటాడి లైంగికంగా వేధించిన 'ఓలా' క్యాబ్ డ్రైవర్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. 'ఓలా' డ్రైవర్ తరచూ ఫోన్ చేస్తూ.. తనను వేధిస్తుండటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో 50 ఏళ్ల ప్రదీప్ తివారీ అనే క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగినిగా పనిచేస్తున్న మహిళ గత శనివారం సాయంత్రం ముంబైలోని పొవై ప్రాంతం నుంచి క్యాబ్ బుక్ చేసుకుంది. తివారీ లాంగ్ రూట్ నుంచి ఆమెను గమ్యస్థానానికి తీసుకెళ్లాడు. తీసుకెళ్లే సమయంలో తరచూ ఆమెను అద్దంలో చూస్తూ.. తన కారును ఓవర్ టేక్ చేసిన ఇతర వాహనాల డ్రైవర్లను తిట్టిపోశాడు. క్యాబ్ గమ్యస్థానానికి చేరిన తర్వాత అతని ప్రవర్తన ఇబ్బందికరంగా ఉండటంతో హద్దుల్లో ఉండమని ఆమె హెచ్చరించింది. దీంతో ఆమెను తివారీ వెంటాడాడు. ఆమె అపార్ట్మెంట్ లిఫ్ట్ వరకు ఆమెతోపాటు వెళ్లి.. బండ బూతులు తిట్టాడు. ఆ తర్వాత కూడా ఆమె ఫోన్‌కు కాల్ చేస్తూ.. తరచూ వేధించాడు. అతని ఫోన్ నంబర్‌ను బాధితురాలు బ్లాక్ చేసినా.. కొత్త నంబర్‌తో అతడు ఫోన్ చేసి వేధిస్తుండటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. డ్రైవర్ తివారీపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారని, గతంలోనూ అతనిపై ఇదే తరహా కేసు నమోదైందని దీన్దోషి పోలీసుస్టేషన్ అధికారి గిరీష్ అనవ్కర్ తెలిపారు. -
ఆ స్టార్ జంట డర్టీ సీక్రెట్స్ బయటపడ్డాయి!
బాలీవుడ్లో ప్రేమలు, ప్రణయాలు, వాటి చుట్టూ వదంతులు కొత్త కాదు. కానీ బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, కంగనా రనౌత్ మధ్య 'ఎఫైర్' మాత్రం రచ్చకెక్కి హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ ఇద్దరు నటులు పరస్పరం లీగల్ నోటీసులు పంపించుకున్నారు. గత జనవరిలో హృతిక్ ను ఉద్దేశించి కంగనా 'సిల్లీ ఎక్స్' (బోయ్‌ఫ్రెండ్) అనడంతో వివాదం మొదలైంది. ఈ వ్యవహారంపై అప్పట్లో గుర్రుగా స్పందించిన హృతిక్ ఇప్పుడు ఏకంగా కంగనాకు లీగల్ నోటీసులు పంపాడు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. దీనికి దీటుగా కంగనా కూడా లీగల్ నోటీసులతో బదులిచ్చింది. ఈ లీగల్ నోటీసుల్లోని కంటెంట్ మాత్రం ఈ ఇద్దరి మధ్య పెద్ద గూడుపుఠాణి జరిగినట్టు వెల్లడిస్తోంది. కంగనా తనకు రోజుకు 50కిపైగా ఈమెయిల్స్ పంపి.. తనను వెంటాడిందని, ఆమె మొత్తంగా 1,439 ఈమెయిల్స్ పంపిందని తన లీగల్ నోటీసులలో హృత్తిక్ తెలిపాడు. సామాజికంగా సరిగ్గా వ్యవహరించలేని అస్పర్జెర్ అనే మానసిక రుగ్మతతో ఆమె బాధపడుతున్నదని, అందుకే ఈమెయిల్స్‌కు తాను ఎప్పుడూ సమాధానమివ్వలేదని అతను పేర్కొన్నాడు. కంగనా కూడా తన లీగల్ నోటీసులలో దీటుగా సమాధానమిచ్చింది. ఒక సీక్రెట్ ఈమెయిల్ ఐడీతో హృతిక్ తనతో సంభాషణ కొనసాగించాడని, మెయిల్స్ కూడా పంపాడని పేర్కొంది. అయితే హృతిక్ మాత్రం తన పేరిట ఎవరో నకిలీ ఐడీతో ఆమెకు మెయిల్స్ పంపించడంతో తాను ఒరిజినల్ ఐడీని ఆమెకు ఇచ్చానని, అంతేకానీ కంగనాతో తాను మాట్లాడలేదని హృతిక్ అంటున్నాడు. కంగనా మాత్రం తన అకౌంట్‌ను హృత్తిక్ హ్యాక్ చేసి.. అతడు విడాకుల వ్యవహారానికి ఇబ్బంది కలుగకుండా ఆ మెయిల్స్ అన్ని డిలీట్ చేశాడని ఆరోపించింది. తాను ఆయనకు పంపిన ఈమెయిల్స్ బహిర్గత పరిస్తే అతడిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించింది. హృతిక్ తో సత్సంబంధాలు కొనసాగిన సమయంలో ఆ మెయిల్స్ పంపడం జరిగిందని, వాటిని అడ్డం పెట్టుకొని బెదిరించాలని చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. హృతిక్, కంగనా రెండు సినిమాలు 'కైట్', 'క్రిష్-3'లో కలిసి నటించారు. 'కైట్' సందర్భంగా వీరి మధ్య స్నేహం చిగురించగా.. 'క్రిష్-3' సమయంలో వీరి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయనే వదంతులు వచ్చాయి. ఆ సమయంలోనే హృతిక్ భార్య సుసానే ఖాన్ విడాకుల కోసం కోర్టుకు ఎక్కింది. ఈ దంపతులు వీడిపోవడానికి కంగనానే కారణమని అప్పట్లో పుకార్లు షికారు చేశాయి. ఈ వార్తల నేపథ్యంలో కంగనా ...హృతిక్ ను ఎక్స్ బోయ్‌ఫ్రెండ్ అనడం.. చినికిచినికి పెద్ద వివాదంగా మారి లీగల్ నోటీసులకు దారితీసింది.