
కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి స్మృతీ జుబిన్ ఇరానీ (పాత ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ : మద్యం సేవించి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కారును వెంబడించిన నలుగురు ఢిల్లీ వర్సిటీ విద్యార్థులపై సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతేడాది ఫిబ్రవరిలో విమానశ్రయం నుంచి ఇంటికి వెళ్తున్న ఇరానీని నలుగురు వెంబడించారు. దీంతో పోలీసులకు ఫోన్ చేసిన స్మృతి, తనను కొందరు యువకులు వెంబడిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన చైతన్యపురి పోలీసులు నలుగురు యువకుల్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వైద్యపరీక్షలు నిర్వహించగా వారందరూ మద్యం సేవించినట్లు తేలింది. రిపోర్టుల నేపథ్యంలో నలుగురు విద్యార్థులపై పోలీసులు చార్జ్‌షీటు దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment