Delhi University
-
బడా నేతల పుట్టినిల్లు డీయూ.. జైట్లీ నుంచి రేఖా వరకూ..
న్యూఢిల్లీ: దేశంలో పేరెన్నికగన్న విద్యాలయాల్లో ఢిల్లీ విశ్వవిద్యాలయం(డీయూ) ఒకటి. ఈ వర్శిటీ అనుబంధ కళాశాలల్లో చదివిన పలువురు పెద్ద రాజకీయ నేతలుగా ఎదిగారు. వీరిలో చాలామంది క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు. ఢిల్లీ యూనివర్శిటీ(Delhi University) పరిధిలోని వివిధ కళాశాల్లో చదివి బడా నేతలుగా ఎదిగిన వారి జాబితాలో అరుణ్ జైట్లీ, శశి థరూర్ మొదలుకొని మొన్ననే ఢిల్లీ పీఠమెక్కిన రేఖాగుప్తా కూడా ఉన్నారు. మరి.. వీరిలో ఎవరెవరు ఏ కాలేజీలో చదివారనే వివరాల్లోకి వెళితే..శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్అరుణ్ జైట్లీ: మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ(Arun Jaitley) 1973లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి బి.కామ్ ఆనర్స్ డిగ్రీని అందుకున్నారు. 1977లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ లా నుండి ఎల్ఎల్బీ పట్టా పొందారు.విజయ్ గోయెల్: కేంద్ర మాజీ మంత్రి విజయ్ గోయెల్ శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి ఎం.కామ్ పట్టా పొందారు.జితిన్ ప్రసాద్: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జితిన్ ప్రసాద్.. శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి వాణిజ్యంలో డిగ్రీ పట్టా పొందారు.సెయింట్ స్టీఫెన్స్ కళాశాలశశి థరూర్: కాంగ్రెస్ నేత, ఎంపీ శశి థరూర్ 1975లో సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.మణిశంకర్ అయ్యర్: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్(Mani Shankar Iyer) సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి ఆర్థిక శాస్త్రంలో బీ.ఎ. పట్టా పొందారు.వీరభద్ర సింగ్: మాజీ కేంద్ర మంత్రి వీరభద్ర సింగ్ సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి బీ.ఎ. ఆనర్స్ డిగ్రీని అందుకున్నారు.ఖుష్వంత్ సింగ్: ఖుష్వంత్ సింగ్ రచయితగా, న్యాయవాదిగా, పాత్రికేయునిగా, దౌత్యవేత్తగా పేరొందారు. ఈయన సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో చదువుకున్నారు.హిందూ కళాశాలడాక్టర్ సుబ్రమణియన్ స్వామి: రాజకీయవేత్త, ఆర్థికవేత్త, క్యాబినెట్ మాజీ మంత్రి డాక్టర్ సుబ్రమణియన్ స్వామి హిందూ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.రావు ఇంద్రజిత్ సింగ్: భారత ప్రభుత్వ మాజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) రావు ఇంద్రజిత్ సింగ్ హిందూ కళాశాల నుండి న్యాయశాస్త్రం అభ్యసించారు.మీనాక్షి లేఖి: భారత ప్రభుత్వ మాజీ విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షి లేఖి ఢిల్లీలోని హిందూ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ (బీఎస్సీ) పూర్తి చేశారు.రాంజస్ కళాశాలచౌదరి బ్రహ్మ ప్రకాష్: ఢిల్లీ మొదటి ముఖ్యమంత్రి చౌదరి బ్రహ్మ ప్రకాష్, ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని రాంజస్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.సోమనాథ్ భారతి: ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమనాథ్ భారతి, రాంజస్ కళాశాల నుండి న్యాయశాస్త్రం అభ్యసించారు.సరూప్ సింగ్: 1990లో మొదట కేరళ గవర్నర్‌గా, ఆ తర్వాత గుజరాత్ గవర్నర్‌గా పనిచేసిన సరూప్ సింగ్, రాంజస్ కళాశాల నుండి బీ.ఎ. ఇంగ్లీష్ చదివారు.కిరోరి మాల్ కళాశాలనవీన్ పట్నాయక్: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కిరోరి మాల్ కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు.మదన్‌లాల్ ఖురానా: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, మదన్‌లాల్ ఖురానా ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని కిరోరి మాల్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.ప్రవేశ్ వర్మ: ప్రవేశ్ వర్మ ప్రస్తుత ఢిల్లీ బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఈయన ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని కిరోరి మాల్ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చదివారు.హన్స్‌రాజ్ కళాశాలకిరణ్ రిజిజు: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు.. హన్స్‌రాజ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.అజయ్ మాకెన్: ప్రస్తుత ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ హన్స్‌రాజ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్అనుప్రియ పటేల్: పార్లమెంటు సభ్యురాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మాజీ సహాయ మంత్రి అనుప్రియ పటేల్(Anupriya Patel) లేడీ శ్రీరామ్ మహిళా కళాశాల నుండి బీ.ఎ. పట్టా పొందారు.మేనకా గాంధీ: మాజీ ఎంపీ, మహిళా, శిశు అభివృద్ధి మాజీ మంత్రి, జంతు హక్కుల కార్యకర్త, పర్యావరణవేత్త మేనకా గాంధీ ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.దయాల్ సింగ్ కళాశాలపంకజ్ సింగ్: ఉత్తరప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు, నోయిడా ఎమ్మెల్యే పంకజ్ సింగ్ 1999లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని దయాళ్ సింగ్ కళాశాల నుండి బీ.కాం. పట్టా పొందారు. ఆయన దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు.అల్కా లాంబా: జాతీయ కాంగ్రెస్ మహిళా నేత అల్కా లాంబా 1996లో దయాళ్ సింగ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.దౌలత్ రామ్ కళాశాలరేఖ గుప్తా: కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని దౌలత్ రామ్ కళాశాల నుండి బీ.కాం. పట్టా అందుకున్నారు.ఇది కూడా చదవండి; Mahakumbh: 75 జైళ్లలో ఖైదీల పవిత్ర స్నానాలు -
ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
-
డీయూ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
ఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్త జీ.ఎన్ సాయిబాబా కన్నుమూశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నక్సల్స్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో గతంలో సాయిబాబాను అరెస్టు చేశారు. దాదాపు 9 ఏళ్లపాటు ఆయన జైల్లోనే గడపాల్సి వచ్చింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అభియోగాలపై 2014లో మహారాష్ట్ర పోలీసులు సాయిబాబాను అరెస్ట్ చేశారు. సాయిబాబా కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. 2017లో గడ్చిరోలి కోర్టు నిందితులకు జీవితఖైదు విధించగా.. ఆయన నాగ్‌పూర్ జైల్లో శిక్ష అనుభవించారు. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో బాంబే హైకోర్టు విచారణ చేపట్టింది. సాయిబాబాను నిర్ధోషిగా బాంబే హైకోర్టు ప్రకటించింది. మార్చి నెలలో నాగ్‌పూర్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు.సాయిబాబా 1967లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన పోలియో కారణంగా ఐదేళ్ల వయస్సు నుంచి వీల్ చైర్‌ను ఉపయోగిస్తున్నారు. ఆయన జైలులో ఉన్న సమయంలో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. సాయిబాబా ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రామ్ లాల్ ఆనంద్ కళాశాలలో చాలా ఏళ్లు ఇంగ్లీష్ బోధించారు. ఆయన మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనే కేసులో జైలుకు వెళ్లారు. దీంతో ఫిబ్రవరి 2021లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రామ్ లాల్ ఆనంద్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవి నుండి తొలగించబడ్డారు.మావోయిస్టులతో లింకు ఉందన్న కారణంగా మహారాష్ట్ర పోలీసులు 2014లో ఢిల్లీ యూనివర్సిటీ రామ్‌లాల్‌ఆనంద్ కాలేజీ ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్టు చేశారు. ఐపీసీతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)సెక్షన్ల కింద ఆయనపై ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. 2017 వరకు ఈ కేసు విచారించిన గడ్చిరోలి జిల్లా సెషన్స్‌కోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. శిక్ష పడిన తర్వాత ఆయనను ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి తొలగించింది.సెషన్స్‌కోర్టు ఇచ్చిన జీవితఖైదు తీర్పుపై సాయిబాబా అప్పీల్‌కు వెళ్లగా యూఏపీఏ కేసులో ప్రొసీజర్‌ను పోలీసులు సరిగా పాటించలేదన్నా కారణంగా బాంబే హైకోర్టు 2022లోనే సాయిబాబాపై కేసును కొట్టివేసింది. కానీ వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లగా అత్యున్నత కోర్టు సాయిబాబా విడుదలపై స్టే ఇచ్చింది. కేసును తిరిగి వినాలని బాంబే హైకోర్టుకే రిఫర్ చేసింది.చదవండి: డాక్టర్ల రాజీమాలు చట్టపరంగా చెల్లవు: బెంగాల్ సర్కార్ -
మన వర్సిటీలు ప్రపంచంలో మేటి
న్యూఢిల్లీ: విద్యా రంగంలో కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లలో అమల్లోకి తీసుకొచి్చన విధానాలు, తీసుకున్న నిర్ణయాలతో భారతీయ విశ్వవిద్యాలయాలకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మన వర్సిటీలు ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతున్నాయని చెప్పారు. శుక్రవారం ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2014లో క్యూఎస్ గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో కేవలం 12 భారతీయ యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయని, ఇప్పుడు వాటి సంఖ్య 45కు చేరుకుందని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, ఎన్ఐటీల సంఖ్య పెరిగిందని చెప్పారు. నవ భారత నిర్మాణంలో అవి విశిష్టమైన పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఇటీవల జరిగిన తన అమెరికా పర్యటనను మోదీ ప్రస్తావించారు. మన దేశ యువత పట్ల ప్రపంచానికి విశ్వాసం పెరిగిందన్నారు. అమెరికాతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వీటివల్ల అంతరిక్షం, సెమీ కండక్టర్లు, కృత్రిమ మేధ వంటి కీలక రంగాల్లో మన దేశ యువతకు నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. మన విద్యా వ్యవస్థకు ఘన చరిత్ర మైక్రాన్, గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు భారత్‌లో పెట్టుబడులు భారీగా పెట్టబోతున్నాయని, మనదేశ ఉజ్వల భవిష్యత్తుకు ఇదొక సూచిక అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ యూనివర్సిటీ అంటే కేవలం ఒక విద్యాలయం కాదని, ఒక ఉద్యమమని వ్యాఖ్యానించారు. ప్రాచీన కాలంలో నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు సంతోషానికి, సౌభాగ్యానికి వనరులుగా నిలిచాయని చెప్పారు. భారతీయ విద్యావ్యవస్థకు ఘన చరిత్ర ఉందన్నారు. విదేశీయుల నిరంతర దాడుల వల్ల భారతీయ విద్యావ్యవస్థ కుప్పకూలిందని, తద్వారా అభివృద్ధి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం అనంతరం వర్సిటీలు నైపుణ్యం కలిగిన యువతను దేశానికి అందించాయని, అభివృద్ధికి పాటుపడ్డాయని మోదీ ప్రశంసించారు. ‘యుగే యుగే భారత్’ మ్యూజియం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో గిరిజన ప్రదర్శనశాలలు(మ్యూజియమ్స్) ఏర్పాటు చేశామని, ఢిల్లీలోని ‘ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం’ ద్వారా స్వతంత్ర భారత్ అభివృద్ధి ప్రయాణాన్ని తెలుసుకోవచ్చని నరేంద్ర మోదీ చెప్పారు. ‘యుగే యుగే భారత్’ పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద హెరిటేజ్ మ్యూజియాన్ని ఢిల్లీలో నిర్మిస్తున్నామని తెలిపారు. మన స్టార్టప్ కంపెనీల సంఖ్య లక్ష మార్కును దాటిందన్నారు. 2014లో కేవలం వందల సంఖ్యలోనే స్టార్టప్‌లు ఉండేవన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ కంప్యూటర్ సెంటర్, ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీ భవనాలు, నార్త్ క్యాంపస్ అకడమిక్ బ్లాక్ నిర్మాణానికి ప్రధాని పునాదిరాయి వేశారు. ఢిల్లీ యూనివర్సిటీ 1922 మే 1న ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ వర్సిటీలో 86 డిపార్ట్మెంట్లు, 90 కాలేజీలు ఉన్నాయి. మెట్రో రైలులో మోదీ ప్రయాణం ప్రధాని మోదీ శుక్రవారం ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన మెట్రో రైలులో వచ్చారు. రైలులో విద్యార్థులతో సరదాగా సంభాíÙంచారు. అనంతరం ఢిల్లీ యూనివర్సిటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తన మెట్రో రైలు ప్రయాణ అనుభవాన్ని పంచుకున్నారు. ఓటీటీల్లో ప్రసారమవుతున్న కొత్త వెబ్ సిరీస్‌ల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నానని చెప్పారు. ఏ వెబ్ సిరీస్ బాగుంది? ఏ రీల్స్ బాగున్నాయో వారు చెప్పగలరని పేర్కొన్నారు. మాట్లాడేందుకు విద్యార్థుల వద్ద ఎన్నో అంశాలు ఉన్నాయన్నారు. సైన్స్ నుంచి ఓటీటీల్లోని కొత్త వెబ్ సిరీస్‌ల దాకా చాలా విషయాలను వారితో మాట్లాడొచ్చని వెల్లడించారు. ఏ ఒక్క అంశాన్నీ వారు వదిలిపెట్టరని వ్యాఖ్యానించారు. భూగోళంపై ఉన్న అన్ని అంశాలను విద్యార్థులు చక్కగా చర్చించగలరని ట్వీట్ చేశారు. -
ఏదీ వదలకుండా మాట్లాడారు: ప్రధాని మోదీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సాధారణ ప్రయాణికుడిలా ఢిల్లీ మెట్రో రైలులో సందడి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాల ముగింపు వేడుకల కోసం ఇవాళ లోక్ కల్యాణ్ మార్గ్ నుంచి విశ్వ విద్యాలయా మెట్రో స్టేషన్ మధ్య రైలులో ప్రయాణించారు. ప్రధాని మోదీ మెట్రోరైలులో సందడి చేసిన ఫొటోలు, వీడియోలు ట్విటర్లో ట్రెండ్ అవుతున్నాయి. యువ ప్రయాణికులతో ప్రయాణం సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారాయన. On the way to the DU programme by the Delhi Metro. Happy to have youngsters as my co-passengers. pic.twitter.com/G9pwsC0BQK — Narendra Modi (@narendramodi) June 30, 2023 PM Shri #NarendraModi interacts with passengers in #Delhi Metro during his ride to Delhi University.#Viralvideo pic.twitter.com/PkojngLPEe — Akshara (@Akshara117) June 30, 2023 ► ఇక ఢిల్లీ యూనివర్సిటీ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. మెట్రో ప్రయాణ అనుభవాన్ని సైతం వివరించారు. విద్యార్థులు మెట్రో ప్రయాణంలో ఎన్నో మాట్లాడారు. ఓటీటీ నుంచి సైన్స్ అంశాల దాకా దేన్ని వదలకుండా చర్చించారు అని తెలిపారాయన. ► ఢిల్లీ యూనివర్సిటీ కార్యక్రమంలో భాగంగా.. పలు విభాగాలకు శంకుస్థాపనలు.. పలు సెక్షన్లను ప్రారంభించారాయన. ► సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చట్టం ప్రకారం.. ఢిల్లీ యూనివర్సిటీకి 1922లో స్థాపన జరిగింది. ► 2022, మే 1వ తేదీన ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాలు మొదలయ్యాయి. ఇవాళ్టి ప్రధాని మోదీ హాజరు కార్యక్రమంతో ఆ వేడుకలు ముగిశాయి. ► ప్రధాని రాక నేపథ్యంలో విద్యార్థులు నల్ల దుస్తులు(నిరసన తెలిపే అవకాశం ఉన్నందునా) వేసుకురావొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే 10 నుంచి 12 గంటల నడుమ ప్రధాని మోదీ ప్రసంగాన్ని విద్యార్థులు వీక్షించే ఏర్పాట్లు చేశారు. Prime Minister #NarendraModi on Friday travelled on the metro to attend the closing ceremony of the Delhi University's centenary celebrations as the chief guest.#delhiuniversity #Delhi #india pic.twitter.com/RoTeFQi04X — Kashmir Local News (@local_kashmir) June 30, 2023 -
బీసీలకు శాపంగా జాతీయ విద్యా విధానం.. దేశవ్యాప్తంగా బీసీ పోరు!
సాక్షి, హైదరాబాద్: బీసీలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే మండల్ కమిషన్ నిర్దేశించినట్టుగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో, పదోన్నతుల్లో తప్పకుండా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సూరజ్ మండల్ డిమాండ్ చేశారు. దేశంలో బీసీలు సహా కులాల వారీగా జనాభా ఎంత ఉందన్న స్పష్టత వచ్చేలా జనగణన చేయాలని.. ఈ రెండు అంశాల అమలు కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నామని తెలిపారు. ఆ దిశగానే ఈ నెల 11న హైదరాబాద్‌లో బీసీ సదస్సును నిర్వహించి, అందులో లేవనెత్తిన అంశాలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని.. వచ్చే నెలలో హైదరాబాద్‌లో మహా ధర్నా నిర్వహించబోతున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌లో బీసీ సదస్సు కోసం వచి్చన సూరజ్ మండల్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. బిహార్ సీఎంగా పనిచేసి బీసీల కోసం ఉద్యమించిన నేత బిందేశ్వర్ ప్రసాద్ మండల్ (బీపీ మండల్) మనవడిగా బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తాను కృషి చేస్తున్నట్టు చెప్పారు. సూరజ్ మండల్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ఏపీ తరహా స్ఫూర్తిని అనుసరించాలి.. ‘‘చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉన్నా ఆచరణలోకి రాలేదు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపుల్లో వైఎస్సార్సీపీ తీసుకున్న నిర్ణయం హర్షించదగినది. బీసీ ల్లోని పలు సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం దక్కేలా ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపు జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పంథా అనుసరిస్తానని, బీసీలకు ప్రత్యేక ప్రాధా న్యత ఇస్తానని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించడం శుభపరిణామం. ఇదే స్ఫూర్తిని దేశ ప్రధాని సహా ఇతర రాష్ట్రాల సీఎంలు, అన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తే బీసీలకు తగిన న్యాయం జరుగుతుంది. బీసీలకు శాపంగా జాతీయ విద్యా విధానం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానం బీసీల పాలిట శాపంలా మారబోతోంది. ఆ పాలసీ పేరిట ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫీజులను అడ్డగోలుగా పెంచేశారు. అరకొర ఆదాయ కేటగిరీలో ఉన్న బీసీలు ఈ పెరిగిన ఫీజులతో కేంద్ర విద్యా సంస్థల్లో చదువుకోవడంకష్టమే. ఆ సీట్లు చివరికి అగ్రవర్ణాలకే అందుతాయి. అందుకే ఎన్ఈపీలో మార్పులు చేయాలని, ఫీజులు తగ్గించాలని కోరినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం అత్యంత మూర్ఖంగా నిర్ణయం తీసుకుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీలు అన్ని విధాలా నష్టపోయారు. కేంద్రంలో కనీసం బీసీ మంత్రిత్వ శాఖ లేదు. ఎన్సీబీసీ చైర్మన్, సభ్యులను సకాలంలో నియమించకుండా కాలయాపన చేసి బీసీల హక్కులతో ఆటలాడుతున్నారు. కులాల వారీగా జనగణన అవసరం జనగణనలో కులాల వారీగా లెక్కలు తేల్చాలని ఏళ్లుగా ఉద్యమిస్తున్నాం. అన్ని వర్గాల నుంచి ఈ డిమాండ్ వస్తుండటంతో కేంద్రం జనగణన ప్రక్రియనే వాయిదా వేసింది. జనాభాలో కులాల వారీగా సంఖ్య తేలితే రిజర్వేషన్లు, ఇతర సంక్షేమ పథకాల అమలుకు మార్గం సుగమం అవుతుంది. ఈ అంశం కేంద్ర ప్రభుత్వానికి నచ్చడం లేదు. జనాభాలో అగ్రవర్ణాల సంఖ్య ఎంతో తేల్చకుండానే 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసింది. బీజేపీ పాలనలో అగ్రవర్ణాలకు ఒక విధంగా, అణగారిన వర్గాలకు ఒక విధంగా న్యాయం ఉంటుందనిపిస్తోంది. -
బెంగళూరులో నిర్మలా సీతారామన్ కుమార్తె వివాహం
దొడ్డబళ్లాపురం: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ కుమార్తె వాఙ్మయి వివాహం బెంగళూరులో గురువారం నిరాడంబరంగా జరిగింది. ఉడుపి అదమారు మఠం బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం వాఙ్మయి– ప్రతీక్ల వివాహం బెంగళూరులోని టమరిండ్ ట్రీ అనే ఓ హోటల్లో జరిగింది. ఉడుపి మఠానికి చెందిన పలువురు స్వామీజీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల నుంచి అతి కొద్దిమంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్న వాఙ్మయి ఒక ప్రముఖ పత్రికలో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. -
'సారే జహాన్ సే అచ్ఛా' రాసిన కవి గూర్చి సిలబస్ నుంచి తొలగింపు
ప్రసిద్ధ గేయం 'సారే జహాన్ సే అచ్ఛా' రాసిన కవి గూర్చి సిలబస్ నుంచి తొలగించాలని ఢిల్లీ యూనివర్సిటీ అకమిక్ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ మేరకు అకడమిక్ కౌన్సిల్ శుక్రవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించిందని చట్టసభ్యులు ధృవీకరించారు. భారత్ విభజనకు ముందు ఉన్న సియోల్కోట్లో 1877లో జన్మించిన పాక్ కవి అల్లామా ఇక్బాల్‌గా పిలిచే ముమహ్మద్ ఇక్బాల్ ఈ ప్రముఖ గేయం 'సార్ జహాన్ సే అచ్ఛా'ని రాశారు. ఆయన గురించి ఉన్న పాఠ్యాన్ని బీఏలోని పొలిటికల్ సిలబస్ నుంచి తొలగించారు. దీన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏపీవీపీ) స్వాగతించింది. పొలిటికల్ సైన్స్ సిలబస్‌లో మార్పుకు సంబంధించి తీర్మానం తీసుకురావడమే గాక ఆ పార్యాంశాన్ని తొలగించినట్లు కౌన్సిల్ సభ్యుడు తెలిపారు. వాస్తవానకి 'మోడరన్ ఇండియన్ పొలిటికల్ థాట్' అనే సబ్జెక్టు బీఏలోని ఆరవ సెమిస్టర్ పేపర్లో బాగం. దీన్ని ఇప్పుడూ విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కి సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. భారత రాజకీయా ఆలోచనలోని గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని విద్యార్థులకు అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ కోర్సును రూపొందించింది యూనివర్సిటీ. ఈ కోర్సులో భాగంగా సిలబస్‌లో రామ్మోహన్ రాయ్, పండిత రమాబాయి, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ మరియు భీమ్రావ్ అంబేద్కర్ తదితరులు గురించి ఉంది. అంతేగాదు ఆధునిక భారతీయ ఆలోచనలపై విమర్శనాత్మక అవగాహనతో విద్యార్థులను సన్నద్ధం చేసేందుకే ఈ కోర్సును ఏర్పాటు చేశారు. ఆయా ప్రముఖుల ఆలోచనల నేపథ్య అన్వేషణ తోపాటు చారిత్రక పథంలో ముఖ్యమైన విషయాలపై సమయోచిత చర్చలను గుర్తించడం సంబంధిత వారి రచనలలో ప్రదర్శించబడిన విభిన్న అవకాశాలను విద్యార్థులకు తెలుసుకోవాలనే లక్ష్యంతో పాఠ్యాంశాల్లో భాగం చేశారు. సిలబస్‌లో మొత్తం ఆయా ప్రముఖుల గూర్తి మొత్తం 12 యూనిట్లు ఉంటాయి. ఇదిలా ఉండగా, భారత రాజకీయ ఆలోచనలను గూర్చి తెలసుకోవాలన్న ఉద్దేశ్యంతో బీఏ ఆరవ సెమిస్టర్లో ఒక సబ్జెక్టు చేర్చిన దీనిలో ఆ మతోన్మాద పండితుడు మొహమ్మద్ ఇక్బాల్‌ని గూర్చి పాఠ్యాంశాన్ని సిలబస్ నుంచి తొలగించింది అకడమిక్ కౌన్సిల్. నిజానికి ఇక్బాల్‌ని పాకిస్తాన్ తాత్విక తండ్రిగా పిలుస్తారు. అతను ముస్లిం లీగ్‌లో జిన్నాను నాయకుడిగా స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడని, ఇక్బాల్ కూడా జిన్నా వలే భారతదేశ విభజనకు కారణమని యూనివర్సిటీ ఆరోపించింది. (చదవండి: ఆక్రమణ నిరోధక డ్రైవ్‌లో షాకింగ్ దృశ్యాలు..పోలీసులు మహిళ జుట్టు పట్టి లాగి, తన్ని..) -
రాహుల్‌కి ఢిల్లీ యూనివర్సిటీ నోటీసులు: ఇది మీ హోదాకి తగ్గ పని కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీ యూనివర్సిటీలో ఆకస్మికంగా పర్యటించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఢిల్లీ యూనివర్సిటీ కూడా ప్రోటోకాల్ పాటించకుండా ఇలా సడెన్‌గా యూనివర్సిటీలో పర్యటించడం కరెక్ట్ కాదని నోటీసులు పంపుతామని హెచ్చరింది. అన్నట్లుగానే ఢిల్లీ యూనివర్సిటీ రాహుల్ గాంధీకి బుధవారం నోటీసులు పంపించింది. జెడ్‌ప్లస్ భద్రతతో ఓ జాతీయ పార్టీ నాయకుడి హోదాలో ఉన్న రాహుల్‌కి ఇది తన స్థాయికి తగ్గ పని కాదని చురకలంటిస్తూ..రెండు పేజీల నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటనను అతిక్రమణ, బాధ్యతరాహిత్యమైన ప్రవర్తనగా పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించింది. ఆ నోటీసులో హాస్టల్ ప్రవేశ నిర్దేశిత నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంది. ఏ నాయకుడు యూనివర్సిటీలో మూడు వాహానాలతో యూనివర్సిటీలోకి ప్రవేశించేటప్పుడు ఆ నిబంధనలను అనుసరించాలని తెలిపింది. అలాగే హాస్టల్ ప్రాంగణంలో అకడమిక్ అండ్ రెసిడెంట్స్ కౌన్సిల్ కార్యకలాపాల్లో తప్ప మరే ఏ ఇతర కార్యకలాపాల్లో పాల్లొనకూడదని పేర్కొంది. హాస్టల్ యూనివర్సిట్ ఆఫ్ ఢిల్లీ చట్టం ప్రకారం కొన్ని కార్యకలాపాల్లో పాల్గొనేందుకు దానికంటూ కొన్ని నియమ, నిబంధనలు ఉంటాయని తెలిపింది. నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా జరిగే ఏ కార్యక్రమాన్నైనా ఆపే హక్కు మాకు ఉందన్నారు. ఇది హాస్టల్ హ్యాండ్ బుక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రూల్కి సంబంధించిన క్రమశిక్షణలో భాగమని తెలిపారు. హాస్టల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, ఇతర సభ్యులు దీన్ని బాధ్యతరాహిత్యమైన చర్యగా పేర్కొంటూ తీవ్రంగా ఖండిస్తున్నామని నోటీసులో పేర్కొంది. అలాగే ఇలాంటి చర్య హాస్టలోని విద్యార్థుల భద్రతకు ప్రమాదం కలిగిస్తుందని, అందువల్ల ఇలాంటి ఆకస్మిక చర్యలను మానుకోవాలని రాహుల్‌కి సూచిస్తూ యూనివర్సిటీ నోటీసులో పేర్కొంది. ఇదిలా ఉండగా గత శుక్రవారం రాహుల్ గాంధీ ఢిల్లీ యూనివర్సిటీలో మెన్స్ పురుషుల హాస్టల్‌ని సందర్శించి..అక్కడ వారితో సంభాషించడమే గాక కలిసి భోజనం చేశారు. ఇదికాస్త సీరియస్ అంశంగా మారీ డీల్లీ యూనివర్సిటీ అధికారులు ఫైర్ అవ్వుతూ నోటీసులు పంపేందుకు దారితీసింది. (చదవండి: ఢిల్లీ యూనివర్సిటీలో రాహుల్ ఆకస్మిక పర్యటన! నోటీసులు పంపుతామని వార్నింగ్) -
ఢిల్లీ యూనివర్సిటీలో రాహుల్ సడెన్ ఎంట్రీ! నోటీసులు పంపుతామని వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీ యూనివర్సిటీలో ఆకస్మికంగా పర్యటించారు. అక్కడ క్యాంటిన్లోని విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. దీంతో మండిపడ్డ ఢిల్లీ యూనివర్సిటీ ఆయనకు నోటీసులు పంపుతామని హెచ్చరించింది. ఈ మేరకు ఓ సీనియర్ అధికారి రాహుల్ గాంధీకి ఈ విషయమై మంగళవారం లేదా బుధవారం నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న మెన్స్ హాస్టల్‌ను రాహుల్ శుక్రవారం సందర్శించి, అక్కడ కొంతమంది విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడే వారితోపాటు ఆయన భోజనం కూడా చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ దీన్ని సహించం.. అంటూ రాహుల్‌కి నోటీసులు పంపుతామని చెప్పారు. ఆయన క్యాంపస్‌లో అనధికారికంగా పర్యటించారని, ఆయన లోపలికి ప్రవేశించేటప్పుడూ చాలామంది విద్యార్థులు భోజనం చేస్తున్నారని యూనివర్సిటీ రిజిస్ట్రార్ అన్నారు. ఇలాంటి ఘటనను పునరావృతం చేయకుండా ఉండాలని, అలాగే విద్యార్థుల భద్రతకు భంగం కలిగించొద్దని చెప్పారు. నిజానికి ఈ ఘటన విద్యార్థుల భద్రతకు ప్రమాదం కలిగిస్తుందని, ఇలాంటి విషయాల్లో నాయకులు కచ్చితంగా ప్రోటోకాల్ అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇదిలాఉండగా రాహుల్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం యూనివర్సిటీపై ఒత్తిడి తెచ్చిందని కాంగ్రెస్ విద్యార్థి విభాగం స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) ఆరోపించింది. ఐతే యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. ఎలాంటి ఒత్తిడి లేదని, ఇది క్రమశిక్షణకు సంబంధించిన విషయమని అన్నారు. -
సాయిబాబా కేసును మరోసారి విచారించండి: సుప్రీం కోర్టు
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రోఫెసర్ జీఎన్ సాయిబాబాకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. మావోయిస్టులతో సంబంధాలున్న కేసులో సాయిబాబాను నిర్ధోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. ఈ కేసులో మరోసారి విచారణ జరపాలని బాంబే హైకోర్టును బుధవారం ఆదేశించింది. ఈ మేరకు నాలుగు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఎమ్ ఆర్ షా, సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. గతంలో నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు ఇప్పటికే ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నందున సముచిత ప్రయోజనాల దృష్ట్యా మరో బెంచ్ అన్ని కోణాల్లో ఒకే విధంగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు దాఖలైన అప్పీల్‌ను విచారించిన సుప్రీం కోర్టు ఈ విధంగా తీర్పు ఇచ్చింది. గతేడాది అక్టోబర్ 15న చట్ట వ్యతిరే కార్యకలాపాల చట్టం(యూఏపీఏ) కింద.. సాయిబాబా ఇతరులపై ప్రాసిక్యూషన్ చెల్లుబాటు కాదని కొట్టేసిన బాంబే హైకోర్టు.. వాళ్లను తక్షణమే విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు ఎన్ఐఏ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు స్పందిస్తూ.. ట్రయల్ కోర్టుల తీర్పు ప్రకారం దోషులుగా నిర్థారించిన వారి నేరాల తీవ్రతను బాంబే హైకోర్టు పరిగణలోనికి తీసుకోలేదని అభిప్రాయపడింది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు వ్యతిరేకంగా హైకోర్టు అభ్యంతరకరమైన తీర్పు ఇచ్చిందని, దీనిపై సమగ్ర పరిశీలన అవసరమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కాగా, ఈ కేసుకి సంబంధించిన యూఏపీఏ కింద గడ్చిరోలి కోర్టులోని విచారణ ప్రకియను చెల్లదని పేర్కొంటూ బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ అక్టోబర్ 14న ఈ కేసులో జీవిత ఖైదు పడిన సాయిబాబాను విడుదల చేసింది. అలాగే ఈ కేసుకి సంబంంధించిన మరో నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది, అయితే ఆరో నిందితుడు 2022లో చనిపోయాడు. (చదవండి: బీజేపీ యువనేత దారుణ హత్య.. వాళ్ల పనే అని కమలం పార్టీ ఎంపీ ఫైర్..) -
ఐదు దశాబ్దాల తర్వాత డిగ్రీ పట్టా అందుకున్న సీఎం.. కారణం ఏంటో తెలుసా?
సాధారణంగా డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరు పట్టాను అందుకుంటారు. ఇది మూమూలు విషయమే కానీ అదే పట్టాను డిగ్రీ పూర్తి చేసిన 50 ఏళ్ల తర్వాత అందుకుని వార్తల్లో నిలిచారు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి. అయితే ఇన్నేళ్ల తర్వాత ఆయన డిగ్రీ పట్టాను అందుకోవడం వెనుక ఓ కారణం కూడా ఉందంటున్నారు హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్. ఆయన తన గ్రాడ్యుయేషన్ ఢిల్లీ యూనివర్శిటిలో ఐదు దశాబ్దాల క్రితమే (1972) పూర్తి చేశారు. అయితే ఇటీవలే ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ నుంచి డిగ్రీ పట్టాను అందుకున్నారు ఖట్టర్. దీనిపై ఆయన మాట్లాడుతూ.. "నేను మఖ్యమంత్రి అయిన తర్వాత నా ప్రాథమిక పాఠశాల, హైస్కూల్, రోహ్తక్లో ఉన్న కాలేజీకి వేళ్లాను. కానీ ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్లడం మాత్రం కుదరలేదు. అందుకే ఇన్నేళ్లుగా పట్టాను తీసుకోలేకపోయాను. ఈ యూనివర్శిటీతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది, ఇక్కడి నుంచే దేశానికి సేవ చేయాలని స్ఫూర్తి పొందాను" అని సీఎం వెల్లడించారు. అనంతరం విద్యార్థులకు సందేశం ఇస్తూ.. బాల్యంలోనే విద్యార్థులు సరైన దిశను ఎంచుకోవాలని.. భవిష్యత్‌లో ఇబ్బందుల పాలు కాకుండా చూసుకోవాలని సూచించారు. యువత లక్ష్యాలు చిన్నవిగా కాకుండా పెద్దవిగా ఉండాలని, తద్వారా ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చన్నారు. ఆయుధాలను ఎలా తయారు చేయాలో సైన్స్ నేర్పుతుందని, అయితే వాటిని తెలివిగా ఉపయోగించకపోతే వినాశనానికి కారణమవుతుందని కూడా ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ కల్చరల్ కౌన్సిల్ చైర్పర్సన్, పీఆర్ఓ అనూప్ లాథర్ రచించిన “కాల్ ఔర్ తాల్” పుస్తకాన్ని సీఎంకు అందజేశారు. ఈ పుస్తకంలో హర్యాన్వి జానపద సంస్కృతికి సంబంధించిన 150 పాటలు ఉన్నాయి. చదవండి: ఐటీ జాబ్ కూడా తక్కువే!.. ముఖేష్ అంబానీ డ్రైవర్ జీతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! -
మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై రగడ.. ఢిల్లీ యూనివర్సిటీలో ఉద్రిక్తత
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంగణంలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్రం నిషేధించిన మోదీ బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు విద్యార్థులు ప్రయత్నించడం టెన్షన్ వాతావరణానికి దారితీసింది. ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు యూనివర్సిటీ యాజమాన్యం, పోలీసు అధికారులు నిరాకరించారు. అయినా ఎన్ఎస్యూఐకి చెందిన విద్యార్థులు దీన్ని స్క్రీనింగ్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో క్యాంపస్‌కు కరెంట్ సరఫరాను నిలిపివేశారు అధికారులు. ఫలితంగా విద్యార్థులు యూనివర్సిటీ బయట ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా యువత భారీగా తరలివచ్చారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు 144 సెక్షన్ విధించారు. 24 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. తాము స్కీనింగ్‌కు ఏర్పాట్లు చేశామని, ల్యాప్‌టాప్‌లు, ప్రొజెక్టర్లను ధ్వసం చేశారని విద్యార్థులు ఆరోపించారు. Students gathered for screening of BBC’s documentary, India: The Modi Question, at Arts Faculty, DU were stopped by police and security personnel.#BBC #BBCDocumentary #IndiaTheModiQuestion #DU #ArtsFaculty #NorthCampus #DelhiUniversity pic.twitter.com/WwJQEGebS3 — Chirag Jha (@iChiragJha) January 27, 2023 అటు అంబేడ్కర్ యూనివర్సిటీలో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు విద్యార్థులు విఫలయత్నం చేశారు. దీనికి కూడా కరెంటు సరఫరా నిలిపివేశారు. ఫలితంగా విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ఈ రెండు యూనివర్సిటీల్లో ఎలాంటి వీడియోలు ప్రదర్శించడానికి అనుమతి లేదని అధికారులు తెలిపారు. అయినా వారు మెబైల్ ఫోన్లలో చూడాలనుకుంటే వారి విచక్షణకే వదిలేస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2002లో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన అల్లర్లపై బీబీసీ రెండు వీడియోల డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. అయితే ఇది దురుద్ధేశపూర్వకంగా ఉందని కేంద్రం బ్యాన్ చేసింది. యూట్యూబ్, ట్విట్టర్లో ఈ వీడియో లింకులను బ్లాక్ చేసింది. అయినా కొన్ని యూనివర్సిటీల్లోని విద్యార్థులు ఈ డాక్యుమెంటరినీ ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ జేఎన్టీయూ యూనివర్సిటీలో కూడా విద్యార్థులు ఈ వీడియో స్క్రీనింగ్‌కు ప్రయత్నించగా.. అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. చదవండి: రాహల్ జోడో యాత్రకు సడెన్ బ్రేక్! కేవలం కిలోమీటర్ తర్వాతే.. -
ఫిమేల్ ఆర్జే: అహో... అంబాలా జైలు రేడియో!
అక్కడ ఒక ట్రైనింగ్ సెషన్ జరుగుతోంది. ‘మీ ముందు మైక్ ఉన్నట్లు పొరపొటున కూడా అనుకోకూడదు. మీ స్నేహితులతో సహజంగా ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడాలి! భవ్యా... ఇప్పుడు నువ్వు ఆర్జేవి. నీకు ఇష్టమైన టాపిక్‌పై మాట్లాడు...’ భవ్య మైక్ ముందుకు వచ్చింది. ‘హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భవ్యను. ప్రతి ఒక్కరికీ జ్ఞాపకాలు ఉంటాయి. నాకు ఎప్పుడూ నవ్వు తెచ్చే జ్ఞాపకం ఒకటి ఉంది. మా గ్రామంలో సంగ్రామ్ అనే ఒకాయన ఉండేవాడు. ఆయన ఎప్పుడూ ఎవరికో ఒకరికి జాగ్రత్తలు చెబుతూనే ఉండేవాడు. అయితే అందరికీ జాగ్రత్తలు చెబుతూనే తాను పొరపాట్లు చేసేవాడు. ఒకరోజు వర్షం పడి వెలిసింది. ఎటు చూసినా తడి తడిగా ఉంది..కాస్త జాగ్రత్త సుమా! అని ఎవరికో చెబుతూ ఈ సంగ్రామ్ సర్రుమని జారి పడ్డాడు. అందరం ఒకటే నవ్వడం! ఒకరోజు సంగ్రామ్ ఏదో ఫంక్షన్‌కు వచ్చాడు. ఎవరికో చెబుతున్నాడు... వెనకా ముందు చూసుకొని జాగ్రత్తగా ఉండాలయ్యా. ఇది అసలే కలికాలం...అని చెబుతూ, తన వెనక కుర్చీ ఉందన్న భ్రమలో కూర్చోబోయి ధబాలున కిందపడ్డాడు!’ ....ఆ ఆరుగురు మహిళా ఆర్జేలు, హాస్యసంఘటనలను ఆకట్టుకునేలా ఎలా చెప్పాలనే విషయంలో కాదు, శ్రోతలు కోరుకున్న పాట ప్లే చేసేముందు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? ‘సత్యమైన జ్ఞానమే ఆత్మజ్ఞానం’లాంటి ఆధ్యాత్మిక విషయాలను అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు ఎలా సులభంగా చెప్పాలి... ఇలా ఎన్నో విషయాలలో ఒక రేడియోకోసం ఆ ఆరుగురు మహిళలు శిక్షణ తీసుకున్నారు. అయితే ఆ రేడియో మెట్రో సిటీలలో కొత్తగా వచ్చిన రేడియో కాదు, ఆ మహిళలు జర్నలిజం నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లు అంతకంటే కాదు. అది అంబాల జైలు రేడియో. ఆ ఆరుగురు మహిళలు... ఆ జైలులోని మహిళా ఖైదీలు. హరియాణాలోని అంబాల సెంట్రల్ జైలులో ఖైదీల మానసిక వికాసం, సంతోషం కోసం ప్రత్యేకమైన రేడియో ఏర్పాటు చేశారు. ఆరుగురు మగ ఆరేజే (ఖైదీలు)లు ఈ రేడియో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడిక మహిళల వంతు వచ్చింది. రేడియో కార్యక్రమాల నిర్వహణ కోసం ఆరుగురు మహిళా ఖైదీలు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇంకొన్ని రోజుల్లో ‘ఆర్జే’గా విధులు నిర్వహించనున్నారు. దిల్లీ యూనివర్శిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్ వర్తిక నందా ఈ ఆరుగురికి శిక్షణ ఇచ్చారు. ‘ఒత్తిడి, ఒంటరితనం పోగొట్టడానికి, మనం ఒక కుటుంబం అనే భావన కలిగించడానికి ఈ రేడియో ఎంతో ఉపయోగపడుతుంది’ అంటుంది నందా. ఈ మాట ఎలా ఉన్నా మహిళా ఆర్జేల రాకతో ‘అంబాల జైలు రేడియో’కు మరింత శక్తి, కొత్త కళ రానుంది! -
నియామకాల వివాదం : వర్సిటీ వీసీపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ : వర్సిటీ నియామకాల్లో వివాదానికి సంబంధించి ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ యోగేష్ త్యాగిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులపై సస్సెండ్ చేసినట్టు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. యూనివర్సిటీ నియామకాలకు సంబంధించి వివాదంపై వీసీపై దర్యాప్తునకు అనుమతించాలని గతవారం విద్యామంత్రిత్వ శాఖ రాష్ట్రపతిని కోరింది. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నియామకాలపై మంత్రిత్వ శాఖ ఆరోపణల నేపథ్యంలో వీసీపై విచారణకు రాష్ట్రపతి మంగళవారం రాత్రి ఆమోదం తెలిపారు. పదవిలో ఉండగా విచారణను ప్రభావితం చేస్తారని పేర్కొంటూ విచారణ ముగిసే వరకూ వీసీని సస్సెండ్ చేస్తున్నట్టు విద్యామంత్రిత్వ శాఖ వర్సిటీ రిజిస్ర్టార్‌కు రాసిన లేఖలో పేర్కొంది. ప్రస్తుతం ప్రొఫెసర్ పీసీ జోషీ వీసీగా బాధ్యతలు చేపడతారని తెలిపింది. కాగా ఆరోగ్య సమస్యలతో ఈ ఏడాది జులైలో వీసీ యోగేష్ త్యాగి ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి సెలవులో ఉన్నారు. త్యాగి తిరిగి విధుల్లో చేరేవరకూ ప్రొఫెసర్ పీసీ జోషీని ఇన్చార్జ్గా జులై 17న ప్రభుత్వం నియమించింది. ఇక గతవారం జోషీని ప్రో వీసీగా తొలగించి ఆయన స్ధానంలో గీతా భట్‌ను త్యాగి నియమించడంతో వివాదం నెలకొంది. మరోవైపు ప్రొఫెసర్ జోషి ఇటీవల నూతన రిజిస్ర్టార్‌గా వికాస్ గుప్తాను నియమించగా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదించింది. అయితే అదే రోజు తాత్కాలిక రిజిస్ర్టార్‌గా పీసీ ఝాను నియమిస్తూ త్యాగి ఉత్తర్వులు జారీ చేశారు. వీసీ, ప్రో వీసీల మధ్య అధికార వివాదంలో విద్యా మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని త్యాగి సెలవులో ఉన్నందున ఆయన చేపట్టిన నియామకాలు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. చదవండి : గీతం అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు -
ఇంతకీ తన్మే నివేదిత, కళ్యాణీ ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌లో అరారియా ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతి ఇద్దరు సామాజిక కార్యకర్తల సహకారంతో జూలై 7న పోలీసు స్టేషన్‌కు వెళ్లి, కొన్ని రోజుల క్రితం నలుగురు యువకులు తనపై అత్యాచారం జరిపారని ఫిర్యాదు చేశారు. దానిపై పోలీసుల నుంచి ఎలాంటి స్పందన కనిపించక పోవడంతో ఆ యువతి, సామాజిక కార్యకర్తలు తన్మే నివేదిత, కల్యాణిలతో కలిసి దిగువ కోర్టును జూలై పదవ తేదీన ఆశ్రయించారు. తనకు జరిగిన అన్యాయం గురించి కోర్టులో ఆమె, జడ్జీకి వివరించారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న కోర్టు ఉద్యోగి ఆమె వద్దకు వచ్చి, ఆ వాంగ్మూలంపై సంతకం చేయాల్సిందిగా కోరారు. తనకు చదువు రాదని, ఆ వాంగ్మూలాన్ని చదివి వినిపించాల్సిందిగా ఆమె నేరుగా జడ్జీనే కోరారు. అందుకు ఆగ్రహించిన ఆ జడ్జీ ఆమెను దూషించినట్లు ఆమె మీడియా ముఖంగా ఆరోపించారు. ఇదంతా జరిగిన అరగంటకు కోర్టు ఆదేశం మేరకు మూకుమ్మడి అత్యాచారం బాధితురాలిని, ఆమెకు అండగా నిలిచిన ఇద్దరు సామాజిక కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి, అరారియాకు 240 కిలోమీటర్ల దూరంలోని సమస్థిపూర్ జైలుకు తరలించారు. వారిపై కోర్టు కార్యకలాపాలకు ఆటంకం కలిగించారని, ప్రభుత్వాధికారుల విధుల నిర్వహణకు అడ్డు తగిలారంటూ వారిపై నాన్ బెయిలబుల్ కింద కేసులు నమోదు చేశారు. ఆ యువతిపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ నలుగురు యువకులను అరెస్ట్ చేసేందుకుగానీ, కనీసం వారెవరో గుర్తించేందుకుగానీ పోలీసులు నేటి వరకు ప్రయత్నించలేదు. దానికి సంబంధించి కోర్టు కూడా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. ఈ యువతి ఉదంతంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో జూలై 18వ తేదీన మరో దిగువ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. తన్మే నివేదిత, కల్యాణిలు మాత్రం నేటి వరకు కూడా విడుదల కాలేదు. వారి ప్రాణాలకు ప్రమాదం ఉందని వారి మిత్రులు మీడియా ముఖంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇంతకు వారెవరు ? తన్మే నివేదిత, కళ్యాణీ ఈ యువతీ యువకులు ‘జన్ జాగారణ్ శక్తి సంఘటన్’కు చెందిన సామాజిక కార్యకర్తలు. వారివురు మరో ముగ్గురితో కలిసి అరారియా ప్రాంతంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. జన్ జాగారణ్ శక్తి సంఘటన్ ఉత్తర బీహార్‌లో కార్మికుల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం కషి చేస్తోంది. నిమ్న వర్గాల అభ్యున్నతి, వారికి మెరుగైన వైద్య సదుపాయంతోపాటు మహిళా సాధికారికత కోసం కృషి చేస్తోన్న వారిగా తన్మే, కల్యాణీలకు మంచి గుర్తింపు ఉంది. 30 ఏళ్ల తన్మే కేరళలో పుట్టి పెరిగారు. ఆయన అమెరికాలో ‘ఎకాలోజీ అండ్ సోసియాలోజీ’లో పట్టభద్రలు. ఆయన భారత్‌కు వచ్చి గత పదేళ్లుగా వివిధ సామాజిక రంగాల్లో పనిచేశారు. ఆయన ‘క్రాంతి’ సంఘంలో చేరి ముంబైలోని వేశ్య పిల్లల సాధికారికత కోసం పాటుపడ్డారు. 2014లో ఢిల్లీ వెళ్లి అక్కడి అంబేడ్కర్ యూనివర్శిటీలో ‘డెవలప్మెంట్ స్టడీస్’లో పీజీలో చేరారు. ఆయన ఎమ్మే చదువుతోనే కొంత మంది యువతీ, యువకులతో బిహార్‌లోని అరారియాకు వచ్చి గ్రామీణ మహిళల అభ్యున్నతి కోసం వర్క్‌షాపులు నిర్వహించారు. 2016లో ఆయనకు జన్ జాగారణ్ శక్తి సంఘటన్‌తో సానిహిత్యం ఏర్పడి అందులో చేరారు. సంగీతం, సాహిత్యం, చిత్రకళలో మంచి ప్రావీణ్యం ఉన్న తన్మే తన పాటలతో జనాన్ని ఆకట్టుకుంటారు. కళ్యాణీ పరిచయం ఢిల్లీ యూనివర్శిటీలో ‘మ్యాథ్స్, అంతర్జాతీయ సంబంధాలు’లో డిగ్రీ చదివిన కల్యాణి రెండేళ్ల క్రితం జన్ జాగారణ్లో చేరారు. ఆరోగ్య కార్యక్రమాల్లో ఆమెకు అమితాసక్తి పేదలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుంటారు. ఆమె తన్మేతో పాటు మరో ముగ్గురితో కలిసి ఒకే ఇంటిలో ఉంటున్నారు. వారి ఇద్దరి ప్రాణాలకు ముప్పుందని, వారి విడుదల కోసం పట్నా హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశామని జన్ జాగారణ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన కామయాని స్వామి మీడియాకు తెలిపారు. రేపటి వరకు పట్నా హైకోర్టుకు సెలవులు అవడం వల్ల అప్పీలు ఎప్పుడు విచారనకు వస్తుందో తెలియడం లేదని ఆయన చెప్పారు. -
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు: కోమల్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనతో తనకు సంబంధం లేదని ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని కోమల్ శర్మ పేర్కొన్నారు. దాడికి సంబంధించిన వీడియోలో కనిపించింది తాను కాదంటూ జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. జనవరి 5న జేఎన్‌యూలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌తో పాటు మరో 37 మందిని అనుమానితులుగా భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీసీటీవీ పుటేజీలు, వాట్సప్‌లో వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా మరికొంతమందిని పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా.. ముసుగులు ధరించి హాస్టల్లో దాడికి పాల్పడిన ఓ యువతిని.. ఢిల్లీ యునివర్సిటీకి చెందిన విద్యార్థిని కోమల్ శర్మగా పోలీసులు ధృవీకరించారు. ఇందుకు సంబంధించిన వార్తలు, సదరు విద్యార్థిని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.(జేఎన్‌యూ హింస: ముసుగు ధరించింది ఆమేనా!?) ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన కోమల్ మాట్లాడుతూ.. ‘ ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. నన్ను కావాలనే అందులో ఇరికించారు. దురుద్దేశంతో.. నన్ను చెడుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. నా పరిస్థితి అధ్వానంగా తయారైంది. బంధువులు, స్నేహితుల నుంచి అధిక సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆ వీడియోలో మాస్క్ ధరించి ఉన్నది నేనే అని.. నా గురించి చెడుగా అనుకుంటున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక జేఎన్‌యూ ఘటనపై ఓ జాతీయ మీడియా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఏబీవీపీకి చెందిన విద్యార్థులే దాడి చేసినట్టు వెల్లడయిన విషయం తెలిసిందే. అక్షత్ ఆవాస్థీ అనే విద్యార్థి మాట్లాడుతూ.. ఆరోజు రాత్రి జరిగిన ఘటనకు నాయకత్వం వహించింది తానేనని వీడియో ముందు ఒప్పుకున్నాడు. అంతేకాదు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులపై ప్రతీకారం తీర్చుకునేందుకు హాస్టల్ బయట నుంచి కొంతమంది వ్యక్తులను లోపలికి తీసుకెళ్లి ఈ దాడికి పాల్పడ్డటు కూడా అంగీకరించాడు. ఆయితే అవాస్థీతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఏబీవీపీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
ఆ నలుగురే.. ఈ నలుగురు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చరిత్రలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. కళాశాలలో లా విద్యను అభ్యసించే రోజుల్లో క్లాస్మేట్స్గా ఉన్న నలుగురు విద్యార్థులు నేడు దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా నియమితులై సరికొత్త రికార్డును సృష్టించారు. ఈనెల 19న సుప్రీంకోర్టుకు కొత్తగా నలుగురు జడ్జీలు నియమితులైన విషయం తెలిసిందే. వీరిలో జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ ఎస్ఆర్ భట్, జస్టిస్‌వీ రామసుబ్రమణియన్, జస్టిస్ హృతికేశ్‌రాయ్‌లు ఉన్నారని న్యాయశాఖ ప్రకటించింది. వీరు త్వరలోనే ప్రమాణం చేయనున్నారు. అయితే ఎస్ఆర్ భట్, జస్టిస్ హృతికేశ్‌రాయ్‌లు.. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న డీవై చండ్రచూడ్, ఎస్కే కౌల్లు కాలేజీ నాటి స్నేహితులు. ఒకే ఏడాది లా పట్టా పుచ్చుకున్నారు. వీరి స్నేహ ప్రయాణం 37 ఏళ్ల నాటి నుంచి కొనసాగుతోంది. ఢిల్లీ యూనివర్సిటీలో వీరు నలుగురు 1982లో నుంచి ఒకే ఏడాది లా పరీక్షలో ఉత్తీర్ణులైనారు. వీరిలో డీవై చండ్రచూడ్, ఎస్కే కౌల్ ముందుగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులు కాగా.. తాజాగా ఎస్ఆర్ భట్, జస్టిస్ హృతికేశ్‌రాయ్‌లకు కొంత ఆలస్యంగా ఈ అవకాశం దక్కింది. ఈ విషయాన్ని వీరి నలుగురికి కామన్ ఫ్రెండ్ అయిన శివరామ్ సింగ్ అనే వ్యక్తి ట్విటర్ ద్వారా సోషల్ మీడియాతో పంచుకున్నారు. ఈ పరిణామం చాలా అరుదైనదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు యూనివర్సిటీ రోజుల్లో వీరంతా ముందే బెంచ్‌లోనే కూర్చునేవారని.. తాజాగా సుప్రీంకోర్టు బెంబ్‌లోనూ (న్యాయమూర్తులుగా) సీట్లు పంచుకోవడం సంతోషంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వీరిలో డీవై చండ్రచూడ్ 1959లో జన్మించగా.. 2000లో తొలిసారి ముంబై హైకోర్టు అడిషనల్ జడ్జ్‌గా నియమితులైనారు. ఆ తరువాత 2013లో ఆలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించి అనంతరం.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టాపొందిన జస్టిస్ ఎస్ఆర్ భట్ 1958లో జన్మించారు. 1982లో ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2004లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. జస్టిస్ హృతికేరాయ్ 1960లో జన్మించి.. 1980లో లా పట్టా పొందారు. 2006లో గుజరాత్ అడీషనల్ జడ్జ్‌గా నియమితులై.. 2008లో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం గౌహతి, కేరళ హైకోర్టులకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. 2018లో కేరళ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైయ్యారు. తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. జస్టిస్ సజయ్ కృష్ణకౌల్.. తొలుత ఢిల్లీ హైకోర్టులో అడీషనల్ జడ్జిగా నియమితులయ్యారు. అనంతరం పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. అక్కడి నుంచి 2013లో మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్లారు. 2017లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమింపబడ్డారు. దీంతో నాటి స్నేహితులు నేడు సుప్రీంకోర్టు బెంచ్‌కు ప్రాతినిథ్యం వహించనున్నారు. -
కాలేజి పాపల బస్సు...
రద్దీ బస్‌స్టాప్. ఆ బస్‌స్టాప్‌లో హీరో, తన ఫ్రెండ్స్ వెయిట్ చేస్తుంటారు. అమ్మాయిలు ఎక్కువగా ఉన్న బస్ వచ్చినా, లేడీస్ కాలేజీకు వెళ్లే బస్‌లు వచ్చినా ఎక్కి సరదా వేషాలు వేస్తుంటారు. ఇది చాలా సినిమాల్లో కనిపించే సన్నివేశమే. ‘విక్రమార్కుడు’ సినిమాలో అయితే ఏకంగా ‘కాలేజి పాపల బస్సు..’ అనే పాట కూడా ఉంది. ఇలా బస్సులో మిస్సుల కోసం అమితాబ్ బచ్చన్ ఎదురు చూసేవారట. ‘‘అందమైన అమ్మాయిల కోసం బస్‌స్టాప్‌లో ఎదురు చూసేవాళ్లం’’ అని యవ్వనం తాలూకు జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు అమితాబ్. ‘‘నేను ఢిల్లీ యూనివర్శిటీలో విద్యార్థిగా ఉన్న రోజులవి. కాలేజీకి రోజూ బస్‌లో వెళ్లేవాణ్ణి. మా ఏరియా నుంచి నా కాలేజీకి వెళ్లే దారిలో కొన్ని లేడీస్ కాలేజీలు ఉన్నాయి. అక్కడ బస్ ఎక్కే అమ్మాయిల్ని చూడటానికి బాగా ఎదురుచూసేవాళ్లం. ఆ స్టాప్ తొందరగా రావడానికైనా బస్ ఫుల్ స్పీడ్‌గా వెళ్లాలి అనుకునేవాళ్లం’’ అని గతాన్ని షేర్ చేసుకున్నారు. అంతేకాదు యూనివర్శిటీ చదువు పూర్తయిన తర్వాత ఆ ఏరియాకు చెందిన ఓ అమ్మాయిని కలుసుకున్నట్టు తెలిపారు. ఆమె చెప్పిన విషయం విని అమితాబ్ ఆశ్చర్యపోయారట. ‘‘మీరు కాలేజీకి వెళ్లే దార్లోనే ఓ బస్ స్టాప్‌లో మీ కోసం ఎదురుచూసేదాన్ని. నేను, మా ఫ్రెండ్ ప్రాణ్ అక్కడే వేచి చూసేవాళ్లం. మీరు వచ్చినప్పుడల్లా మనసులో ఒకటే ఆలోచన.. ‘ప్రాణ్ (ప్రాణం) పోయినా ఫర్వాలేదు. బచ్చన్ వెళ్లిపోకూడదు’ అనుకునేదాన్ని’’ అంటూ ఆమె ఫ్లాష్‌బ్యాక్‌ని గుర్తు చేసుకున్నారని అమితాబ్ పేర్కొన్నారు. -
ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ హవా
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సత్తా చాటింది. అధ్యక్ష పదవితోపాటు మరో రెండు పదవులు కైవసం చేసుకుంది. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో ఏబీవీపీకి చెందిన అశ్విత్ దాహియ ఎన్ఎస్యూఐ అభ్యర్థి చెత్న త్యాగిపై 19వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. గత కొన్ని సంవత్సరాల ఎన్నికలు పరిశీలిస్తే ఇదే అత్యధిక మెజార్టీ అని ఏబీవీపీ జాతీయ మీడియా కన్వీనర్ మోనికా చౌదరి తెలిపారు. మహిళా సాధికారత కోసం ‘మిషన్ సాహసి’ని ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. ఏబీవీపీకి చెందిన ప్రదీప్ తన్వార్ ఉపాధ్యక్షుడిగా, శివాంగి ఖర్వాల్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. దీంతో వర్సిటీ ప్రాంగణంలో ఆ సంస్థ మద్దతుదారులు భారీ విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ అనుబంధ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) ఒక సెక్రటరీ పదవిని గెలుచుకుంది. ఆ సంస్థ అభ్యర్థి అశిష్ లంబా ఏబీవీపీ అభ్యర్థి యోగి రతీపై విజయం సాధించారు. రామ్జాస్ కాలేజ్‌లో అల్లర్లు జరిగినపుడు యోగి అధ్యక్షుడిగా ఉన్నారని, అల్లర్లకు తాము వ్యతిరేకమని ఈ తీర్పుతో విద్యార్థులు స్పష్టం చేశారని ఎన్ఎస్యూఐ తెలిపింది. గురువారం జరిగిన ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో 39.90 శాతం ఓటింగ్ నమోదైంది. గత సంవత్సరం ఓటింగ్ శాతం (44.46)తో పోలిస్తే ఇది దాదాపు నాలుగు శాతం తక్కువ. మొత్తం నాలుగు స్థానాలకు 16 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఇందులో నలుగురు మహిళా అభ్యర్థులున్నారు. 1.3లక్షల మంది ఓటర్లున్నారు. వామపక్ష పార్టీల మద్దతు సంస్థ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) ఒక్క సీటూ గెలవలేకపోయింది. గతంతో పోలిస్తే తమ ఓటింగ్ శాతం పెరిగినందుకు ఆ సంస్థ హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. -
ఏపీ విద్యార్థులకు న్యాయం చేయండి...
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌బోర్డు గ్రేడింగ్ విధానంతో ఢిల్లీ యూనివర్సీటీలో ఏపీ విద్యార్థులు పడుతున్న కష్టాలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీ ప్రవేశాల్లో ఏపీ విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన శనివారం ఆ వర్సిటీ ఉపకులపతికి లేఖ రాశారు. ఏపీలో మార్కుల విధానానికి బదులు పర్సంటేజీ ప్రకారం గ్రేడింగ్ పాయింట్లు ప్రవేశపెట్టారన్నారు. ఈ విధానంలో వచ్చిన గ్రేడ్లను 10తో కాకుండా వర్సిటీ కేవలం 9.5తో గుణిస్తుండడంతో ఏపీ విద్యార్థులు సీట్లు కోల్పోతారని పేర్కొన్నారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలని వీసీని మంత్రి కోరారు. కాగా దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ఇంటర్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేషన్ కోసం ఢిల్లీ వర్సిటీ, దాని అనుంబంధ కళాశాలల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంటర్లో మార్కులకు బదులుగా రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన సీజీపీఏ గ్రేడ్ల విధానం వల్ల ఏపీ విద్యార్థులకు ప్రవేశాలు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లో యూజీ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకొనే ఏపీ విద్యార్థుల గ్రేడ్ పాయింట్లను 10తో గుణించి వచ్చే శాతాన్ని అడ్మిషన్ల ప్రక్రియలో పరిగణించాలని ఇంటర్ బోర్డు విద్యార్థులకు జారీ చేసిన మెమోలో స్పష్టం చేసింది. అయితే ఢిల్లీ వర్సిటీ మాత్రం తమకు ఏపీ ఇంటర్ బోర్డు నుంచి సమాచారం లేదంటూ విద్యార్థుల గ్రేడ్ పాయింట్లను 10తో కాకుండా 9.5తోనే గుణిస్తామంటూ స్పష్టం చేయడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తాము తీవ్రంగా నష్టపోతామని, కోరుకున్న కాలేజీలో ఎంచుకున్న కోర్సులో సీటు దక్కదని వాపోతున్నారు. సోమవారం మధ్యాహ్నంతో మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తవుతుందని, ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ బోర్డు తక్షణం స్పందించి తమకు న్యాయం చేయాలని అడ్మిషన్ల కోసం ఢిల్లీ వచ్చిన సుమారు 550 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై శనివారం ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్‌ను కలసి సమస్యను వివరించారు. దీంతో ఆయన ఢిల్లీ వర్సిటీ తీరును వివరిస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఆర్ సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారు. -
కోటా కోసం 16,000 సీట్ల పెంపు
సాక్షి, న్యూఢిల్లీ : అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కోటా అమలు కోసం ఢిల్లీ యూనివర్సిటీ కసరత్తు చేపట్టింది. ఈబీసీ కోటాను వర్తింపచేసేందుకు 2019-20 విద్యాసంవత్సరంలో వివిధ కోర్సుల్లో అదనంగా 16,000 సీట్లను పెంచాలని ఢిల్లీ యూనివర్సిటీ నిర్ణయించింది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మొత్తం సీట్లలో 25 శాతం పెరుగుదల ఉండాలని కేంద్ర మానవ వనురుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా ఢిల్లీ యూనివర్సిటీలో ప్రస్తుతం గ్రాడ్యుయేట్ అడ్మిషన్లు 56,000 కాగా, పీజీ అడ్మిషన్ల కింద 9500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పది శాతం కోటాను ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్ధేశించడంతో ఆయా విద్యాసంస్ధలు మౌలిక వసతులను మెరుగుపరచకుండానే సీట్ల సంఖ్యను పెంచాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇక ఐఐటీ ఢిల్లీ, జేఎన్‌యూలు ఇప్పటికే తమ సీట్ల సంఖ్యను వరుసగా 590, 346 సీట్లకు పెంచాయి. ఈ విద్యా సంస్ధల్లో హాస్టల్ వసతి పరిమితంగా ఉండటంతో పెరిగే విద్యార్ధులకు వసతి కల్పించడంపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్ధల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే జనరల్ కేటగిరీలో అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తామని హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సిలబస్ నుంచి ఐలయ్య పుస్తకం తొలగింపు?
సాక్షి, న్యూఢిల్లీ: పొలిటికల్ సైన్స్ సిలబస్ నుంచి ప్రొ.కంచ ఐలయ్య రాసిన పుస్తకాలను తొలగించాలని ఢిల్లీ యూనివర్సిటీ సిఫార్సుచేసింది. విద్యాపర విషయాల్లో దళిత్ అనే పదం స్థానంలో ‘షెడ్యూల్డ్ కులం’ను వాడాలని పేర్కొంది. విద్యా విషయాలపై వర్సిటీ స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా 9 పీజీ కోర్సుల సిలబస్‌పై చర్చించామని ప్రొ.హన్స్‌రాజ్ సుమన్ తెలిపారు. ప్రొ.కంచ ఐలయ్య రాసిన ‘వై ఐ యామ్ నాట్ ఎ హిందు’, ‘పోస్ట్-హిందూ ఇండియా’లో వివాదస్పద విషయాలు ఉన్నందునే వాటిని సిలబస్ నుంచి తప్పించాలని వర్సిటీకి సూచించినట్లు చెప్పారు. అంబేడ్కర్ రచనల్ని సిలబస్‌లో చేర్చాలని సిఫార్సు చేశారు. స్టాండింగ్ కమిటీ సిఫార్సు దురదృష్టకరమని ఐలయ్య వ్యాఖ్యానించారు. తన పుస్తకాలు పలు విదేశీ, దేశీ యూనివర్సిటీల సిలబస్‌లలో భాగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. -
డీయూ ఎన్నికల్లో ఏబీవీపీ హవా
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్) అధ్యక్ష పదవితోపాటు మరో రెండు కీలక పదవులను గెలుచుకుంది. కాంగ్రెస్ అనుబంధ ఎన్ఎస్యూఐ ఒక్క స్థానానికి పరిమితం కాగా, వామపక్ష ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఐ) బలపరిచిన ఆప్ అనుబంధ ఛాత్ర విద్యార్థి సంఘర్‡్ష సమితి ఖాతా తెరవలేదు. ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్‌గా ఏబీవీపీకి చెందిన అంకివ్ బసోయా, వైస్‌ప్రెసిడెంట్‌గా ఏబీవీపీకే చెందిన శక్తి సింగ్, జాయింట్ సెక్రటరీగా జ్యోతి విజయం సాధించారు. సెక్రటరీగా ఎన్ఎస్యూఐకి చెందిన ఆకాశ్ చౌదరి 9,199 ఓట్లతో గెలుపొందగా.. ఈ పోస్టుకు గాను నోటాకు 6,810 మంది విద్యార్థులు ఓటేయడం గమనార్హం. ఈ నెల 13వ తేదీన జరిగిన ఈ ఎన్నికల్లో 23 మంది బరిలో నిలవగా పోలైన ఓట్లు 44.46 శాతం మాత్రమే. -
జామర్లతో అక్రమాలకు ఢిల్లీ వర్సిటీ చెక్
సాక్షి, హైదరాబాద్ : ఎల్ఎల్బీ కోర్సు ప్రవేశ పరీక్షలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఢిల్లీ యూనివర్సిటీ అధికారులు ఈ ఏడాది పరీక్ష గదుల్లో ఫోన్ జామర్స్‌ను ఏర్పాటు చేశారు. గత ఏడాది ఎంట్రన్స్ పరీక్షల్లో అవకతవలకు సంబంధించి ఎనిమిది ఎఫ్ఐఆర్లను వర్సిటీ నమోదు చేసిన క్రమంలో ఈ ఏడాది అత్యంత పకడ్బందీగా ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు సాంకేతిక సమస్యలతో సరైన సమాధానాలు రాయలేదని అభ్యర్ధులు చెప్పేందుకు అవకాశం లేకుండా పరీక్ష అనంతరం ఆన్లైన్ టెస్ట్‌ల్లో తాము రాసిన సమాధానాలను రాసేలా రెస్పాన్స్ షీట్స్‌ను ఇవ్వాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు. దేశవ్యాప్తంగా 89 కేంద్రాల్లో ప్రత్యేక పరిశీలకులను ఢిల్లీ యూనివర్సిటీ నియమించింది. ఇక జామర్లను ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీ నుంచి తెప్పించామని, వీటి గురించి తాము ముందస్తుగా వెల్లడించలేదని, పరీక్షలు నిర్వహించే ముందే ప్రణాళికాబద్దంగా వీటిని పరీక్షించామని వర్సిటీ అధికారి వెల్లడించారు. కాగా గత ఏడాది అభ్యర్ధులు సరైన సమాధానాలు రాబట్టేందుకు పరీక్ష హాల్ వెలుపల కొందరితో వాట్సాప్ ఫీచర్‌తో కనెక్ట్ అయినట్టు తమ విచారణలో వెల్లడైందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. కొందరు దళారులు విద్యార్ధులను రూ 50,000 నుంచి రూ లక్ష వరకూ డిమాండ్ చేస్తూ పరీక్షలు పాసయ్యేలా తాము పూర్తిగా సహకరిస్తామని ప్రలోభపెడుతున్నారని, ఇలాంటి మోసాలకు జామర్ ద్వారా చెక్ పెట్టామని అధికారులు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పారదర్శకంగా పరీక్షల నిర్వహణ చేపట్టామని ఢిల్లీ వర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ వినయ్ గుప్తా చెప్పారు. జామర్లను ఏర్పాటు చేయడంతో పాటు పరీక్షా కేంద్రాల్లో పర్మనెంట్ లెక్చరర్లను నియోగించారు. -
కాఫీకి రా.. లేకపోతే ఫెయిల్ చేస్తా..!
సాక్షి, న్యూఢిల్లీ : భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నత చదువుల కోసం యూనివర్సిటీల్లో అడుగుపెట్టిన విద్యార్థినిలకు వేధింపులు తప్పడం లేదు. దేశంలో అత్యన్నత విశ్వవిద్యాలయంగా పేరుగాంచిన ఢిల్లీ యూనివర్సిటీ(డీయూ)లో విద్యార్థినిలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. గడిచిన నాలుగేళ్లలో డీయూలో 28 లైంగిక వేధింపుల కేసులు నమోదైయ్యాయి. ఈ కేసులన్నీ కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్లపై నమోదు కావడం గమన్హారం. విద్యాబుద్దులు నేర్పించి విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చాల్సిన అధ్యాపకులే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యవతి తనపై ప్రొఫెసర్ వేధింపులకు పాల్పడున్నారంటూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో కాఫీకి రాకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేసి, హాజరుశాతం తగిస్తానంటూ వేధిస్తున్నారని యువతి ఫిర్యాదులో పేర్కొంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ప్రకారం విశ్వవిద్యాలయాల్లో లైంగిక వేధింపులపై చర్యలు తీసుకునేందుకు అంతర్గత ఫిర్యాదులు కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ కమిటీలో ముగ్గురు అధ్యాపకులు, ఓ మహిళ ఫ్రొఫెసర్, ముగ్గురు విద్యార్థులు ఉండాలనేది నిబంధన. కానీ అధికారులు అవేవీ పట్టించుకోవట్లేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. కాగా గతంలో కూడా అనేక యూనివర్సిటీల్లో లైంగిక వేధింపుల కేసులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకు బాలికలపై అనేక దాడులు జరుగుతున్నాయని, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధ్యాపకులను తీవ్రంగా శిక్షించాలని విద్యార్ధినులు డిమాండ్ చేస్తున్నారు. -
పాపులారిటీలో ఎల్‌పీయూకు 5వ ర్యాంకు
జలంధర్: పాపులారిటీ పరంగా దేశంలో ఢిల్లీ యూనివర్సిటీ అన్ని విద్యా సంస్థల్లోకెల్లా అగ్రస్థానంలో నిలిచింది. జలంధర్ కేంద్రంగా పనిచేస్తున్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ)కి ఐదో స్థానం దక్కింది. ప్రముఖ విద్యా సంస్థలు, వర్సిటీలకు ర్యాంకులు ప్రకటించే అంతర్జాతీయ సంస్థ ‘యూనిర్యాంక్’ 2018 ఏడాదికి తాజాగా జాబితాను విడుదల చేసింది. 878 ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులిచ్చింది. కాన్పూర్, మద్రాస్, బాంబే ఐఐటీలు వరుసగా 2, 3, 4 స్థానాలు పొందాయి. ఐఐటీ ఖరగ్‌పూర్‌కు ఆరు, ఐఐటీ ఢిల్లీకి 8వ ర్యాంకులు దక్కాయి. -
తండా బిడ్డ.. హస్తిన గడ్డ..!
హైదరాబాద్: ఇప్పటి వరకు ఢిల్లీని మ్యాప్‌లో చూడడమే గానీ.. ఎప్పుడూ వెళ్లని నిరుపేద విద్యార్థులు వారు. అలాంటిది అక్కడే ఉన్నత విద్య చదువుకునే అవకాశం రావడంతో వారి ఆనందానికి హద్దుల్లేవు. వీరంతా మారుమూల గ్రామాలు, తండాల్లో నివాసముండేవారే. వీరిలో చాలా మంది తల్లిదండ్రులు రోజు కూలీలే. 2018–19 విద్యా సంవత్సరానికి గాను ప్రఖ్యాత ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ చదివేందుకు రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాలకు చెందిన 94 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. గత ఏడాది కేవలం 12 మందే సీట్లు సాధించగా ఈసారి 94 మందికి అవకాశం రావడం విశేషం. సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల నుంచి ఎంపికైన 62 మందిలో 30 మంది బాలికలు కాగా, 32 మంది బాలురు ఉన్నారు. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలల నుంచి 32 మంది ఎంపిక కాగా అందులో 17 మంది బాలురు, 15 మంది బాలికలు ఉన్నారు. వీరంతా ఢిల్లీ వర్సిటీ అనుబంధ కళాశాలలైన హన్స్‌రాజ్, హిందూ, రామ్జాస్, మిరండా హౌజ్, కేశవ మెమోరియల్, కాలేజ్ ఆఫ్ ఒకేషనల్, ఎస్ఆర్సీసీ, శ్రీవెంకటేశ్వర, దౌలత్‌రామ్ వంటి ప్రఖ్యాత కళాశాల్లో సీట్లు పొందడం విశేషం. మాకెంతో గర్వంగా ఉంది.. రాష్ట్ర ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ గురుకులాల పుణ్యమా అని, ప్రవీణ్‌సార్ చలవతో మా పాప మానసకు ఢిల్లీలోని హిందూ కళాశాలలో చదువుకునే అవకాశం వచ్చింది. మాది ఖమ్మం జిల్లా టి.పాలెం మండలంలోని పిండిపోలు గ్రామం. రోజువారీ కూలీ చేసే మాకు ఇది ఎంతో గర్వంగా ఉంది. – ఉపేందర్ ఐఏఎస్ కావాలన్నదే లక్ష్యం బాగా చదివి ఐఏఎస్ కావాలన్నదే నా లక్ష్యం. రామ్జాస్ కళాశాలలో బీఎస్సీ హానర్స్ మ్యాథ్స్‌లో సీటు సాధించా. నేను బాగా చదివి పెద్ద ఉద్యోగం చేయాలన్నది నా తల్లిదండ్రుల కల. దాన్ని నెరవేరుస్తా. – సురేశ్‌నాయక్ చాలా సంతోషంగా ఉంది.. ఐఏఎస్ అధికారినై పేదలకు సేవ చేయాలన్నదే లక్ష్యం. మాది సూర్యా పేట జిల్లా కపూరియాతండాకు చెందిన నిరుపేద కుటుంబం. మిరండా హౌజ్‌లో బీఎస్సీ హానర్స్ బాటనీ కోర్సులో సీటు సాధించా. చాలా సంతోషంగా ఉంది. ఇదంతా గురుకులాల చలవే. – స్వాతి -
వెంటపడ్డ విద్యార్థులపై చార్జ్‌షీటు
సాక్షి, న్యూఢిల్లీ : మద్యం సేవించి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కారును వెంబడించిన నలుగురు ఢిల్లీ వర్సిటీ విద్యార్థులపై సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతేడాది ఫిబ్రవరిలో విమానశ్రయం నుంచి ఇంటికి వెళ్తున్న ఇరానీని నలుగురు వెంబడించారు. దీంతో పోలీసులకు ఫోన్ చేసిన స్మృతి, తనను కొందరు యువకులు వెంబడిస్తున్నారని ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన చైతన్యపురి పోలీసులు నలుగురు యువకుల్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వైద్యపరీక్షలు నిర్వహించగా వారందరూ మద్యం సేవించినట్లు తేలింది. రిపోర్టుల నేపథ్యంలో నలుగురు విద్యార్థులపై పోలీసులు చార్జ్‌షీటు దాఖలు చేశారు. -
కిడ్నాపైన విద్యార్థి దారుణ హత్య
సాక్షి,ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకలో దారుణం చోటు చేసుకుంది. ఢిల్లీ యూనివర్సీటీకి చెందిన ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసిన దుండగులు వారం రోజుల తర్వాత హత్య చేశారు. విద్యార్థి కుటుంబాన్ని 50లక్షలు డిమాండ్ చేసిన దుండగులు.. డబ్బులు ఇవ్వకపోవడంతో అతడిని హత్య చేసి ఇంటికి సమీపంలోనే మృతదేహాన్ని పడేశారు. పోలీసుల వివరాల ప్రకారం..21 ఏళ్ల ఆయుష్ నౌటియల్ ఢిల్లీలోని రామ్‌లాల్ ఆనంద్ కాలేజీలో బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. గత గురువారం ఇంటి నుంచి కాలేజీ వెళ్లిన అతడిని దుండగులు కిడ్నాప్ చేశారు. సాయంత్రం అయినా కొడుకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ఇంతలోనే ఆయుష్ తండ్రికి వాట్సాప్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. దాంట్లో ఆయుష్ కిడ్నాప్ చేశామని, 50 లక్షలు ఇస్తే వదిలేస్తామని డిమాండ్ చేయడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించారు. అనంతరం దుండగులకు 10 లక్షలు ఇస్తామని చెప్పి వారు ఉండేచోటు కనుక్కోవడానికి పోలీసులు ప్రయత్నించారు. కానీ ఆయుష్ ఆచూకీని కనుక్కోలేకపోయారు. చివరికి బుధవారం రాత్రి ద్వారకాలోని ఓ కాలువ వద్ద అతడి మృతదేహాన్ని కనుగొన్నారు. తాము పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు దుండగుల ఆచూకీ కనిపెట్టలేకపోయారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. -
మద్యం మత్తులో డ్రైవింగ్, ఇద్దరు మృతి
న్యూఢిల్లీ : మద్యం మత్తులో వాహనం నడిపి ఓ యువతి .... ఇద్దరు యువకుల మరణానికి కారణమయింది. ఈ ప్రమాదంలో ఆమెతో పాటు మరో ఇద్దరు యువతులు కూడా గాయపడ్డారు. వాయువ్య ఢిల్లీలోని ముఖర్జీనగర్‌లో ఆదివారం తెల్లవారు జామున 2.45 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. నోయిడాలోని అమేథీ యూనివర్సిటీలో జరిగిన ఫెస్ట్‌లో పాల్గొన ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులు, కారులో ఢిల్లీ యూనివర్సిటీకి బయలుదేరారు. కారు ఉడ్సన్ లైన్‌లోని సెంట్రల్ వెర్జ్‌కు చేరుకోగానే ఒక్కసారిగా అదుపుతప్పి, పక్కనే ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ పోల్‌ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మరణించగా, గాయపడిన ముగ్గురు యువతుల్ని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారు అధిక వేగంతో ప్రయాణించడంతో వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. యువతి మద్యం సేవించి వాహనం నడపటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు యువకులను రితేశ్, సిదార్థ్‌లుగా గుర్తించారు. ఇద్దరు మృతికి కారణమైన యువతిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
హోలీ పేరిట విద్యార్థినులపై వికృత చేష్టలు
-
హోలీ పేరిట విద్యార్థినులపై వికృత చేష్టలు
సాక్షి, న్యూఢిల్లీ : హోలీ వేడుకల పేరుతో విద్యార్థినులపై వికృత చేష్టలకు పాల్పడిన ఘటనలు దేశ రాజధానిలో చోటు చేసుకున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థినులపై కొందరు ఆగంతకులు వీర్యంతో నింపిన బెలూన్లను విసిరి పరారయ్యారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి కథనం ప్రకారం... ఫిబ్రవరి 24వ తేదీన ఈశాన్య ప్రాంతానికి చెందిన ఓ యువతి అమర్ కాలేనీ మార్కెట్లోని ఓ కేఫ్‌కు వెళ్లింది. బైకులపై వచ్చిన ఐదుగురు యువకులు ఆమెపై బెలూన్లను విసిరారు. ఆపై హోలీ శుభాకాంక్షలు చెబుతూ అక్కడ నుంచి వేగంగా వెళ్లిపోయారు. హస్టల్‌కు వచ్చిన యువతి దుస్తులను పరిశీలించిన యువతికి అవి రంగులు కావని అర్థమైంది. ఈ వికృత చేష్టలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇక ఢిల్లీ యూనివర్సిటీకే చెందిన మరో యువతికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. హస్టల్ బయట నడుచుకుంటూ వెళ్తున్న తనపై కొందరు వ్యక్తులు బెలూన్లు విసిరారని... ఆపై రంగులు పూస్తూ అసభ్యంగా తాకినట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో యూనివర్సిటీ వద్ద పోలీసులు నిఘాను పటిష్టం చేశారు. మరోవైపు హోలి వేడుకల నేపథ్యంలో ఢిల్లీలోని కాలేజీలు, హాస్టళ్ల వద్ద సెక్యూరిటీని అప్రమత్తంగా ఉండాలంటూ యూనివర్సిటీ అధికారులు సూచిస్తున్నారు. -
యూనివర్సిటీలో వేధింపుల కలకలం
-
'అర్థం మారిన వందేమాతరం పేరు మాకొద్దు!'
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ యూనివర్శిటీకి అనుబంధంగా పనిచేస్తున్న దయాళ్ సింగ్ ఈవినింగ్ కళాశాల పేరును మార్చాలని నవంబర్ 17వ తేదీన కాలేజీ గవర్నింగ్ బాడీ నిర్ణయించింది. కాలేజీ పేరును 'వందేమాతరం మహా విద్యాలయం'గా మార్చాలని కాలేజీ గవర్నింగ్ బాడీ చైర్పర్సన్, లాయర్, బీజేపీ సభ్యుడు అమితాబ్ సిన్హా సూచించారు. కొంత మంది మాత్రమే ఈ పేరును వ్యతిరేకించారని, ఎక్కువ మంది సభ్యులు సమర్థించారని కళాశాల ప్రిన్సిపాల్ పవన్ కుమార్ శర్మ తెలిపారు. ఆయనతోపాటు కాలేజీ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు దివాకర్ యాదవ్‌లు పేరు మార్పు పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. వందేమాతరం లౌకికవాదమేనని వారు వాదిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం రాకముందుకు, ఇప్పటికీ వందేమాతరం నినాదంకు అర్థం మారిపోయిందని, స్వాతంత్య్రానికి ముందు వందేమాతర గీతాన్ని అన్ని మతాల వారు గౌరవించారని, ఇప్పుడు దానికి అర్థమే మారిపోయిందని, మైనారిటీ ప్రజలకు వ్యతిరేకంగా ఈ పదాన్ని, ఈ గీతాన్ని హిందూ శక్తులు ఉపయోగిస్తున్నాయని కాలేజీ గవర్నింగ్ బాడీలోని కొంత మంది సభ్యులు, అధ్యాపకులు, వామపక్ష విద్యార్థులు, విద్యావంతులు విమర్శిస్తున్నారు. పైగా పేరు మార్చడమంటే ప్రముఖ లౌకికవాది, విద్యావేత్త దయాళ్ సింగ్‌ను అవమానించడమేనని వారు వాదిస్తున్నారు. 'దయాళ్ సింగ్ లౌకిక వాది. ఆయన వద్ద ముస్లిం, క్రైస్తవ మతానికి చెందిన వంటవాళ్లు పనిచేసే వారు. ఆయన సిక్కు, హిందూ, క్రిస్టియన్, పార్శియన్ మిత్రులతో కలిసి డైనింగ్ టేబుల్‌పై కలసి భోంచేసేవారు. వారు కలిసి వైన్ కూడా సేవించేవారు. ఆయన కుటుంబానికి చెందిన వారిలో కొందరు అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయ నిర్వహణ బాధ్యతలు నిర్వహించేవారు. అమృత్‌సర్‌లోనే క్రైసవ మిషనరీ స్కూల్లో చదువుకున్న దయాళ్ సింగ్ భగవద్గీతలోపాటు బైబిల్, ఖురాన్‌లను కూడా క్షుణ్ణంగా చదువుకున్నారు. ఆయనకు క్రైస్తవ గురువులకన్నా క్రైస్తవం గురించి ఎక్కువగా తెలుసు. ఫిరోజ్‌పూర్‌కు చెందిన ఓ సంస్కత పండితుడి సహకారంతో ఆయన గీతను అధ్యయనం చేశారు' అని 1998లో దయాళ్ సింగ్ శతజయంతి (1849-1898) సందర్భంగా ప్రముఖ విద్యావేత్త మదన్ గోపాల్ రాశారు. దాన్ని 'ది ట్రిబ్యూన్' మ్యాగజైన్లో ప్రచురించారు. పాకిస్థాన్‌లోని లాహోర్ కేంద్రంగా ఏర్పాటైన దయాళ్ సింగ్ కాలేజ్ ట్రస్ట్ సొసైటీ తమ తొలి కాలేజీని 1910లో లాహోర్‌లో ఏర్పాటు చేశారు. దేశ విభజన జరగడంతో ఆ ట్రస్ట్ భారత్‌కు తరలి వచ్చింది. ఆ ట్రస్ట్ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొమ్మిదేళ్ల తర్వాత అంటే, 1956లో ఢిల్లీలో దయాళ్ సింగ్ పేరిట ఈవెనింగ్ కాలేజీని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత సంవత్సరానికి డే కాలేజీని కూడా ఏర్పాటు చే సింది. ఢిల్లీ యూనివర్శిటీ 1978లో రెండు కాలేజీల నిర్వహణ బాధ్యతలను ట్రస్ట్ నుంచి స్వీకరించింది. ఇటీవలి కాలంలో ఆదరణ తగ్గిపోతుండడంతో ఈవెనింగ్ కాలేజీని డే కాలేజీగా మార్చాలని ఐదు నెలల క్రితం ఢిల్లీ యూనివర్శిటీ నిర్ణయం తీసుకొంది. డే కాలేజీలో ఆరువేల మంది విద్యార్థులు, ఈవెనింగ్ కాలేజీలో రెండున్నర వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. రెండు కాలేజీలకు మొదటి నుంచి ప్రిన్సిపాల్ సహా సిబ్బంది అంతా వేర్వేరుగానే ఉన్నారు. అలాగే ఇప్పుడు నైట్ కాలేజీని డేకు మార్చినప్పటికీ ప్రత్యేక సిబ్బందిని అలాగే కొనసాగించాలని ఢిల్లీ యూనివర్శిటీ నిర్ణయించింది. దాంతో కాలేజీ పేరును మార్చాల్సిన అవసరం ఏర్పడింది. 11 ఎకరాల ఆవరణలో కొనసాగుతున్న రెండు కాలేజీలను డే కాలేజీలుగా మార్చడం వల్ల మౌలిక సదుపాయాల కొరత ఏర్పడుతోందని, వాటిని కల్పించేందుకు 11 ఏకరాల స్థలం సరిపోదని కాలేజీ గవర్నింగ్ బాడీలో, టీచర్లలో, ఇటు విద్యార్థుల్లో ఒక వర్గం వాదిస్తోంది. పేరు మార్పుకన్నా ఈ సౌకర్యాలపైనే దష్టిని కేంద్రీకరించడం మంచిదని వారంటున్నారు. ప్రస్తుతం ఉన్న కాలేజీ పేరునే ఉంచాలనుకుంటే 'దయాళ్ సింగ్ కాలేజీ-1, -2 అని పెట్టుకోవచ్చని, పూర్తిగా పేరు మార్చాల్సిన అవసరమే లేదని ఆ వర్గం సూచిస్తోంది. పేరేదైనా సౌకర్యాలు కల్పిస్తే చాలని మరో వర్గం వాదిస్తోంది. ఇప్పటికే డేకి కాలేజీని మార్చినందున పెద్ద ఇబ్బందులేవీ లేవని, ఉన్న ఆవరణలోనే అదనపు భవనాలు నిర్మిస్తే సరిపోతుందని వందేమాతరం పేరును కోరుకుంటున్న వర్గం భావిస్తోంది. -
దుర్గా మాతపై దారుణమైన కామెంట్
సాక్షి, న్యూఢిల్లీ : హిందువుల ఆరాధ్య దైవం పై దిగ్భ్రాంతికరమైన వ్యాఖ్యలు చేసి ఓ ప్రొఫెసర్ చిక్కుల్లో పడ్డారు. దుర్గాదేవిని వేశ్యతో పోలుస్తూ కామెంట్ చేయటంతో పలువురు మండిపడ్డారు. ఈ మేరకు ఆయనపై పోలీస్ కేసు కూడా నమోదు అయ్యింది. ఢిల్లీ యూనివర్సిటీ(డీయూ) పరిధిలోని దయాల్ సింగ్ కాలేజీలో కేదార్ కుమార్ మండల్ అసిస్టెంట్ ప్రోఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నాతో. ఈ నెల 22వ తేదీన తన ట్విట్టర్ పేజీలో ‘పురాణాల ప్రకారం దుర్గాదేవి ఓ వేశ్య’ అంటూ ఓ వ్యాఖ్యను పోస్ట్ చేశారు. అది చూసిన వారంతా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తమ మనోభావాలను కేదార్ దెబ్బతీశాడంట ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ విద్యాసంస్థలు ఆయనపై లోధీ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. తక్షణమే ఆయన్ను విధుల్లోంచి తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. నవరాత్రుల సమయంలోనే కేదార్ మండల్ ఇలాంటి కామెంట్లు చేయటంతో ఆ ప్రాంతంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. -
డూసూ ఎన్నికల్లో ఎన్ఎస్యూఐ విజయం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ) ఎన్నికల్లో భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) విజయకేతనం ఎగురవేసింది. బుధవారం వెలువడిన ఫలితాల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను కైవసం చేసుకుంది. ఇక ఏబీవీపీ కేవలం కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులు దక్కించుకుంది. కాగా డూసూ ఎన్నికల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు దక్కడంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. -
మూడు యూనివర్శిటీల వెబ్సైట్లు హ్యాక్
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. దేశంలోని మూడు ప్రతిష్టాత్మక యూనివర్శిటీల వెబ్సైట్లను హ్యాక్ చేశారు. ఢిల్లీ యూనివర్శిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ, ఐఐటీ ఢిల్లీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఢిల్లీ) అధికారిక వెబ్సైట్ల మంగళవారం హ్యాకింగ్‌కు గురయ్యాయి. హ్యాకింగ్‌కు పాల్పడిన గ్రూప్ తనను తాను ‘పీహెచ్సీ’గా పేర్కొంటూ... తాము ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా వివరించారు. ఆ వెబ్సైట్లలో 'పీహెచ్సీ' అని ప్రో కాశ్మీర్ స్లోగ్లన్లను హ్యాకర్స్ పోస్ట్ చేశారు. కశ్మీర్లో సో కాల్డ్ జవాన్లు ఏం చేస్తున్నారో తెలుసా అంటూ... సైనికుల హింసాకాండను నిరసిస్తూ హ్యాకర్లు నేరుగా భారత ప్రభుత్వానికి, ప్రజలను సంభోదిస్తూ మెసేజ్‌లు పెట్టారు. అలాగే ’ మీ సోదరుడు, సోదరి, తల్లీదండ్రులను చంపితే మీకెలా అనిపిస్తుంది. మిమ్మల్ని, మీ కుటుంబాలను నాశనం చేస్తే మీరేం చేస్తారంటూ ప్రశ్నలు సంధించారు. అంతేకాకుండా పాకిస్తాన్ జిందాబాద్ అంటూ హ్యాకర్లు పోస్ట్ చేశారు. కాగా చాలావరకూ సెంట్రల్ యూనివర్శిటీ వెబ్సైట్లను నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ నిర్వహిస్తోంది. మరోవైపు హ్యాక్ అయిన కొద్ది గంటల అనంతరం వెబ్సైట్లను పునరుద్దరించారు. -
వీడియోలు లీక్ చేసిన లవర్.. యువతి ఆత్మహత్య
ఢిల్లీ యూనివర్సిటీలో చదివే 21 ఏళ్ల అమ్మాయి ఉత్తరఢిల్లీలోని రూప్‌నగర్ ప్రాంతంలోగల తమ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తామిద్దరం కలిసున్న వ్యక్తిగత వీడియోలను తన ప్రేమికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తట్టుకోలేని ఆ యువతి.. ప్రాణాలు తీసుకుంది. స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్‌లో బీకాం చదువుతున్న ఆ యువతి.. తన చావుకు ప్రేమికుడే కారణమని చెబుతూ సూసైడ్ నోట్ రాసింది. ఇటీవలే ఆమె మోడల్ టౌన్ పోలీసు స్టేషన్లో తనపై అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు చేసిందని, అయితే పోలీసులు దానిపై చురుగ్గా స్పందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో అందుకు ప్రేరేపించాడంటూ నిందితుడు పట్నాకు చెందిన వేద్ ప్రకాష్ మీద పోలీసులు కేసు పెట్టారు. అతడిని అరెస్టు చేయడానికి ఓ బృందాన్ని పంపామని డీసీపీ జతిన్ నర్వాల్ తెలిపారు. యువతి కుటుంబం మధ్యప్రదేశ్‌లో ఉంటుంది. ఆమె చదువుకోడానికి ఢిల్లీ వచ్చి తోటి విద్యార్థి అయిన ప్రకాష్‌తో ప్రేమలో పడింది. ఇద్దరూ ఒకే ప్రాంతంలో ఉండేవారు. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు గానీ, తర్వాత ఎందుకోగానీ ఇద్దరికీ చెడిపోయింది. ఇద్దరూ మూడేళ్ల పాటు సహజీవనం చేసినట్లు తెలిసిందని, అయితే వాళ్ల కుటుంబాలు అంగీకరించలేదని పోలీసులు చెప్పారు. తల్లిదండ్రులను వదిలేసి తనతో పాటు బిహార్ వచ్చేయమని ప్రకాష్ అడిగేవాడని, అయితే అందుకు ఆమె నిరాకరించిందని అన్నారు. అలా రాకపోతే వ్యక్తిగత వీడియోలు బయట పెడతానంటూ అతడు బెదిరించేవాడని తెలిసింది. కొంతకాలం తర్వాత అతడు బిహార్ వెళ్లిపోయాడని, ఆమె ఫోన్లు ఆన్సర్ చేయకపోవడంతో పాటు ఆమెను కలవడం కూడా మానేశాడని చెప్పారు. దాంతో ఆమె ఏప్రిల్ 8వ తేదీన తనపై అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు చేసిందని, తాము దానిపై విచారణ జరుపుతుండగానే ఆమె ప్రాణాలు తీసుకుందని పోలీసులు చెప్పారు. -
టైపింగ్‌లో తప్పిదం.. పరారీలో హంతకుడు
న్యూఢిల్లీ: టైపింగ్‌లో తప్పు దొర్లడంతో ఓ హంతతకుడు జైలు నుంచి విడుదల అయ్యాడు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో టైపింగ్ తప్పిదంతో రెండు హత్య కేసుల్లో దోషిగా నిర్ధారణ అయిన వ్యక్తి జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ఢిల్లీ వర్సిటీ మాజీ విద్యార్థి అయిన జితేందర్ 1999 మార్చి 10న ఓ విద్యార్థి సంఘ నాయకుడ్ని హత్య చేశాడు. ఆ మరుసటి రోజు ఈ ఘటనపై పోలీసులకు సమాచారమిచ్చిన ఓ సాక్షి ఇంటికి వెళ్లి అతని తండ్రిని చంపేశాడు. జితేందర్‌కు మొదటి కేసులో 30 ఏళ్ల జైలు శిక్ష, మరో కేసులో జీవిత ఖైదు విధిస్తూ ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై జితేందర్ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేశాడు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం జితేందర్ ఇప్పటికే 16 ఏళ్ల 10 నెలల పాటు జైలు శిక్ష అనుభవించినందున అతన్ని విడుదల చేస్తూ 2016 డిసెంబర్ 24న తీర్పు వెలువరించింది. దీనిపై సాక్షులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిని విచారించిన హైకోర్టు డిసెంబర్ 24న వెలువరించిన తీర్పులో టైపింగ్ తప్పిదం దొర్లిందని పేర్కొంది. అంతకుముందు తీర్పులో పేర్కొన్న.. ఇప్పటికే 16 ఏళ్ల 10 నెలల పాటు శిక్ష పూర్తయ్యింది. ఇతర కేసుల్లో దోషి అవసరం లేకుంటే విడుదల చేయొచ్చు.. అన్న వాక్యాలను తొలగిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 14న మళ్లీ తీర్పునిచ్చింది. అలాగే, జితేందర్‌ను అరెస్టు చేయాలని, సాక్షులకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. కాగా, జితేందర్ విడుదలైనప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. -
‘హోలీ కూడా జరుపుకోనివ్వరా.. బయటకు నో’
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీలో కొత్త వివాదం రాజుకుంది. యువత ఎంతో సంబురంగా జరుపుకునే హోలీలో తమను పాల్గొనకుండా అడ్డుకున్నారంటూ ఢిల్లీ వర్సిటీ యువతులు వర్సిటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిరంకుశత్వ చర్య అని, తమ స్వేచ్ఛను అడ్డుకోవడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ పాలన వర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఢిల్లీ యూనివర్సిటీ మహిళల అంతర్జాతీయ విద్యార్థుల వసతి గృహ(ఐఎస్‌హెచ్‌డబ్ల్యూ) అధికారులు మాత్రం విద్యార్థినుల మంచి కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. ‘వర్సిటీలో ఉంటున్నవారు బయటకు వెళ్లేందుకుగానీ, బయట నుంచి అతిథులుగా వచ్చే మహిళా స్నేహితులు లోపలికి వచ్చేందుకుగానీ మార్చి 12 రాత్రి 9గంటల నుంచి మార్చి 13 సాయంత్రం 6గంటల వరకు నిషేధం. మార్చి 12 రాత్రి ఆలస్యంగా వచ్చినవారికి లోపలికి అనుమతి ఉండదు. కేవలం హాస్టల్ గదుల ముందు ప్రాంగణంలో మాత్రమే హోలీ ఆడుకునేందుకు అనుమతిస్తున్నాం’ అని ఐఎస్‌హెచ్‌డబ్ల్యూ ఒక నోటీసులో తెలిపింది. దీనిపై వర్సిటీ విద్యార్థునులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బర్నింగ్ వర్శిటీస్.
-
సోషల్ ‘వార్’కు గుర్మెహర్ స్వస్తి
తనను ఒంటరిగా వదిలేయాలని విజ్ఞప్తి ► ఢిల్లీ వర్సిటీలో ఏబీవీపీ వ్యతిరేక ర్యాలీ.. న్యూఢిల్లీ: ఏబీవీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తన ప్రచారాన్ని విరమిస్తున్నట్లు లేడీ శ్రీరాం కాలేజీ విద్యార్థిని, కార్గిల్ అమరుడి కుమార్తె గుర్మెహర్ కౌర్ మంగళవారం స్పష్టంచేసింది. ప్రచారంపై తీవ్ర వ్యతిరేకతతోపాటు అత్యాచార, హత్య బెదిరింపులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ‘ప్రచారాన్ని విరమించుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు. నన్ను ఒంటరిగా వదిలేయండి. నా ధైర్యసాహసాలను ప్రశ్నించేవారికి అవసరమైనదానికంటే ఎక్కువే సమాధానమిచ్చా’ అని ట్వీట్ చేసింది. తన కుటుంబంతో కలసి ఉండేందుకు ఆమె జలంధర్‌కు వెళ్లింది. ఆమెకు రక్షణ కల్పించాలని అక్కడి పోలీసులను ఢిల్లీ పోలీసులు కోరారు. మరోవైపు.. ఢిల్లీ వర్సిటీ నార్త్ క్యాంపస్‌లో ఏబీవీపీకి వ్యతిరేకంగా మంగళవారం జేఎన్ యూ, డీయూ, జామియా వర్సిటీలకు వందలాది విద్యార్థులు, అధ్యాపకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి గుర్మెహర్ కౌర్ గైర్హాజరైంది. కౌర్‌కు వచ్చిన బెదిరింపులకు సంబంధించి ఢిల్లీ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై.. లైంగిక వేధింపులు, బెదిరింపుల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, ర్యాలీలో ఇద్దరు ఏఐఎస్ఏ విద్యార్థులపై దాడి చేశారనే ఆరోపణలపై ఇద్దరు ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కౌర్ వ్యాఖ్యలపై తాను చేసిన ట్వీట్ సరదా కోసమేనని, దాన్ని అపార్థం చేసుకున్నారని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పారు. అయితే కౌర్ వ్యాఖ్యలను ఒలింపిక్ మెడలిస్ట్ యోగేశ్వర్ దత్ ఖండించారు. కౌర్, హిట్లర్, లాడెన్ ల ఫొటోలను జతచేసి దత్ పోస్ట్ చేశారు. ‘తండ్రి ఆత్మ క్షోభిస్తోంది’ కౌర్‌పై కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు విమర్శలు ఆపడం లేదు. ‘మన జవాన్లు విధుల్లో చనిపోతే వేడుక చేసుకునే వారు కౌర్‌ను తప్పుదారి పట్టిస్తున్నారు.. ఆమె తండ్రి ఆత్మ తప్పకుండా క్షోభిస్తూ ఉంటుంది’ అని అన్నారు. ‘జవాన్లు చనిపోతే లెఫ్టిస్టులు పండగ చేసుకుంటారు. వర్సిటీల్లో్ల యువతను తప్పుదారి పట్టిస్తున్నారు’ అని ఆరోపించారు. రిజిజు విమర్శలను సీపీఎం నేత సీతారాం ఏచూరి తిప్పికొట్టారు. ‘‘గాంధీని చంపాక ఎవరు పండుగ చేసుకున్నారు? ‘గాంధీ హత్య తర్వాత ఆరెస్సెస్ కార్యకర్తలు సంతోషంతో స్వీట్లు పంచారు’ అని పటేల్(తొలి హోం మంత్రి)..గోల్వార్కర్(ఆరెస్సెస్)కు 11–09–1948న చెప్పా రు’’ అని ఏచూరి ట్వీట్ చేశారు. -
ఢిల్లీ యూనివర్సిటిలో టెన్షన్
-
’రాంజాస్’ ఘర్షణలపై కమిటీ ఏర్పాటు
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రాంజాస్ కళాశాలలో జరిగిన ఘర్షణలపై విచారణకు కమిటీ ఏర్పాటు అయింది. ఈ కమిటీ విద్యార్థుల పాత్రపై విచారణ చేపట్టనుంది. ఈ సందర్భంగా రాంజాస్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులందరూ సంయమనం పాటించాలని సూచించారు. సమస్యలు ఏమైనా ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థుల భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదని రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన విద్యార్థులకు లేఖ రాశారు. కాగా రాంజాస్ కాలేజీ బుధవారం విద్యార్థుల ఆందోళనలతో అట్టుడిన విషయం తెలిసిందే. విద్యార్థులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో 20మందికిపైగా విద్యార్థులు గాయపడ్డారు. పలువురు జర్నలిస్టులకు కూడా గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే....దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖలిద్‌ను రాజాంస్ కాలేజీలో ఓ సాహిత్య కార్యక్రమంలో ఉపన్యసించేందుకు ఆహ్వానించడంతో వివాదం రాజుకుంది. ఉమర్ ఖలీద్ రాకను వ్యతిరేకిస్తూ మంగళవారం ఏబీవీపీ విద్యార్థులు కాలేజీ ఎదుట ఆందోళన దిగారు. దేశద్రోహులకు ఆహ్వానాలు అందిస్తున్నారని ఆరోపిస్తూ కాలేజీపై దాడి చేశారు. దీంతో ఉమర్ ఖలీద్, షెహ్లా రషీద్ ఆహ్వానాలను కాలేజీ రద్దు చేసుకుంది. అయితే, ఏబీవీపీ ఉద్దేశపూరితంగా ఈ కార్యక్రమాలను రద్దు చేయించిందని, కాలేజీపై దాడి చేసిన ఏబీవీపీపై చర్యలు తీసుకోవాలని రాంజాస్, డీయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఏఐఎస్ఏ నేతృత్వంలో మౌలిస్‌నగర్ పోలీసు స్టేషన్ వరకు ర్యాలీగా బయలుదేరారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అప్పటి నుంచి రాంజాస్ కళాశాలలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కళాశాలలో జరిగిన ఘర్షణలపై కమిటీ ఏర్పాటు అయింది. -
నందిని సుందర్
-
అయానిక్ యాసిడ్స్‌తో గాయాలకు మందు
తెలుగు శాస్త్రవేత్త పి.వెంకటేశ్‌కు ప్రధానమంత్రి ప్రత్యేక పురస్కారం తిరుపతి నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: మీ శరీరంలో ప్రొటీన్లు తగ్గాయా? తద్వారా ఏమైనా రుగ్మతలు వస్తున్నాయా? ఇకపై దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. వాటికో పరిష్కార మార్గం కనిపెట్టానంటున్నారు ఢిల్లీ వర్సిటీలో రసాయన శాస్త్ర విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ పి.వెంకటేశ్. శరీరంలో ప్రొటీన్లు తగ్గినా, పెరిగినా నష్టమే. శరీరంపై గాయాలు ఏర్పడి నప్పుడు అవి మానడం కష్టమవుతుంది. అయానిక్ యాసిడ్స్ (ఓ రకమైన లవణ ద్రావణం)తో గాయాలను తగ్గించవచ్చని ఆయన చెబుతున్నారు. ఈ అంశంపై తాను చేసిన పరిశోధనతో ఆయన ప్రధానమంత్రి ప్రత్యేక పురస్కారానికి ఎంపికయ్యారు. తిరుపతిలో జరుగుతున్న 104వ సైన్స్ కాంగ్రెస్‌లో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. డెంటీస్ట్రరీలో వినూత్న ప్రయోగాలకు పురస్కారం పశ్చిమ బెంగాల్‌కు చెందిన డాక్టర్ బిశ్వజిత్ పాల్ కోల్‌కతా యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగంలో శాస్త్రవేత్త. దంతాలకు సంబంధించిన వ్యాధులు, కట్టుడు పళ్లతో వచ్చే రుగ్మతలపై చేసిన పరిశోధనలకు గాను ఆయనకు ప్రధానమంత్రి అవార్డు లభించింది. కట్టుడు పళ్లకు ఉపయోగించే సిరామిక్స్, సిల్వర్ మెటల్స్ వంటి వాటితో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాన్ని కనిపెట్టినట్టు తెలిపారు. -
స్మార్ట్ చోరీ
జాగ్రత్త! అది.. ఢిల్లీ యూనివర్సిటీ సమీపంలోని విశ్వవిద్యాలయ మెట్రో స్టేషన్. యూనివర్సిటీ విద్యార్థులు భుజానికి బ్యాగ్‌లు తగిలించుకుని, చేతిలో సెల్‌ఫోన్ పట్టుకుని, ఇయర్‌ఫోన్స్ చెవిలో అమర్చుకుని ఎవరికి వారు ఎక్కడో ఉన్న మిత్రులతో కబుర్లలో ఉన్నారు. అంతలో వారి ఎదురుగా ఓ కారు వచ్చి ఆగింది. అందులోంచి అత్యాధునికంగా కనిపిస్తోందో మహిళ. ఆమె కారు ఆపి, అద్దాలు దించి చక్కటి ఇంగ్లిష్‌లో తన ఫోన్ చార్జ్ అయి పోయి డెడ్ అయిందని, అర్జంటుగా ఓ కాల్ చేయాల్సి ఉందని, దయచేసి ఓ సారి ఫోన్ ఇస్తే అర్జంటు కాల్ చేసుకుంటాను అని దివ్య కుమారి అనే స్టూడెంట్‌ని ఎంతో సంస్కారవంతంగా అడిగింది. దివ్య వెంటనే తన ఫోన్‌ని కారులో ఉన్నామెకిచ్చింది. ఆమె ఏదో నంబర్ డయల్ చేయడం చూసి ఫోన్ వినడం సభ్యత కాదన్నట్లు కొద్దిగా పక్కకు జరిగింది. ఆమె ధ్యాస పక్కకు మళ్లడం గమనించిన కారులోని నవనాగరికురాలు కారును ఒక్కసారిగా కదిలించింది. ఫోన్‌తోపాటు పారిపోయింది! స్మార్ట్ ఫోన్, బర్త్‌డే కానుకగా అమ్మానాన్నలను బతిమిలాడి మరీ కొనిపించుకున్న ఫోన్... కళ్ల ముందే మాయం కావడంతో గుండె గుభేలుమందా అమ్మాయికి. వెంటనే అలర్ట్ అయి, ‘దొంగ దొంగ’ అని అరుస్తూ సహాయం కోసం చూసింది. అక్కడే ఉండి అంతా గమనిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నరేశ్‌కుమార్ రంగంలోకి దూకాడు. బైక్‌తో కారును వెంబడించాడు. అప్పటికే కొద్దిదూరం వెళ్లిన కారును ఓవర్టేక్ చేసి ఆపాడు. మరికొద్ది సేపట్లో దివ్య కుమారి ఎదురుగా పోలీస్ నరేశ్‌కుమార్, ఆయన పక్కనే హెడ్ కానిస్టేబుల్ వీరేంద్ర సింగ్. వాళ్లిద్దరి పక్కన ఆ కిలాడీ లేడి. ఆ లేడీ చేతిలో దివ్య దగ్గర దొంగిలించిన స్మార్ట్ ఫోన్. ఆ లేడీ పేరు గురుదీప్ కౌర్. ఆమె సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్! ఢిల్లీలో గత గురువారం ఈ సంఘటన జరిగింది. ఇదంతా ఢిల్లీ పోలీసులు చేసిన మాక్‌డ్రిల్. సెల్‌ఫోన్ దొంగల బారిన పడకుండా ఢిల్లీ టీనేజర్లను అప్రమత్తం చేయడానికి చేసిన ప్రయత్నమిది. సెల్‌ఫోన్ దొంగలు అనుసరిస్తున్న పద్ధతినే ఢిల్లీ పోలీసులు చేసి చూపిస్తూ టీనేజర్లలో అవేర్నెస్ తెస్తున్నారు. ఈ సంఘటనలో పోలీసులు యూనిఫామ్ లేకుండా మఫ్టీలో ఎవరికీ సందేహం రాని విధంగా కథ నడిపారు. ఎందుకిలా అంటే... గత కొంతకాలంగా ఢిల్లీలో సెల్‌ఫోన్ దొంగతనాలు ఎక్కువయ్యాయి. దాదాపుగా నూటికి తొంభై మంది సెల్‌ఫోన్‌ని చేతిలోనే పట్టుకుంటూ ఉంటారు. దుండగులు బైక్, కార్లలో వచ్చి చేతిలో ఫోన్ ఉన్న వారి పక్కనే ఆగుతారు. అదికూడా ఖరీదైన ఫోన్ ఉన్న వారి దగ్గరే ఆగుతారు. తమ ఫోన్ చూపిస్తూ చార్జింగ్ లేక ఆఫ్ అయిపోయిందని చెప్తారు. ఒక్కసారి ఫోన్ ఇస్తే కాల్ చేసుకుని ఇచ్చేస్తామని రిక్వెస్ట్ చేసి, ఫోన్ చేతికి రాగానే ఉడాయిస్తున్నారు. ఈ టైపు మోసాల గురించి అవగాహన లేకపోవడంతో చాలామంది, ముఖ్యంగా టీనేజర్లు మోసపోతున్నారు. ‘అందుకే ఈ అవేర్నెస్ డ్రైవ్’ అంటున్నారు ఢిల్లీ మోరిస్నగర్ పోలీసులు. మోసగాళ్లు ఎలా మోసాలు చేస్తున్నారో తెలిస్తే, ప్రజలు అమాయకంగా మోసపోకుండా జాగ్రత్తపడతారని చెప్తూ... ‘ఎవరైనా వచ్చి చార్జింగ్ లేక తమ ఫోన్ ఆగిపోయిందనే కారణం చెప్పి ఫోన్ అడిగితే... తమ ఫోన్ కూడా ఆగిపోయిందని తప్పించుకోవడమే సులువైన మార్గం’ అంటున్నారు. మరో ప్రత్యామ్నాయంగా ఫోన్‌ను పైకి కనిపించనివ్వకుండా బ్యాగ్‌లోనో, జేబులోనో పెట్టుకుని ఇయర్ ఫోన్ ద్వారా మాట్లాడుకోమని చెప్తున్నారు. ఇది వరకు అమ్మాయిలకు అబ్బాయిల నుంచి ఓ బెడద ఉండేది. అదేంటంటే... ఒక్క ఫోన్ కాల్ చేసుకుంటానని అడిగి తీసుకుని, అమ్మాయి ఫోన్ నుంచి తన ఫోన్‌కి రింగ్ చేసుకునే వారు. అలా ఆ అమ్మాయి నంబరును సంపాదించి, ఆ తర్వాత తరచూ ఫోన్ చేసి వేధించేవాళ్లు. పైన చెప్పుకున్న ఢిల్లీ తరహా సెల్‌ఫోన్ దొంగతనం ఫోన్ పోవడంతో ఆగకపోవచ్చు. ఆ ఫోన్ కాంటాక్ట్స్ లో ఉన్న అందరినీ ఆ ఫోన్ కొట్టేసినవారు వేధింపులకు గురిచేసే ప్రమాదమూ లేకపోలేదు. టీనేజర్లూ జాగ్రత్త. -
ఢిల్లీ వర్సిటీ ఎన్నికలలో ఏబీవీపీ హవా
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలలో అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) యూనియన్ విజయకేతనం ఎగురవేసింది. ఢిల్లీ వర్సిటీలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ఫలితాలలో ఏబీవీపీ యూనియన్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. విద్యార్థి సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలతో పాటు కార్యదర్శి సీటును ఏబీవీపీ కైవసం చేసుకోగా, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) సంయుక్త కార్యదర్శి సీటు మాత్రమే దక్కించుకోగలిగింది. దీంతో రేండేళ్ల తర్వాత ఎన్ఎస్యూఐకి ఒక్క పదవి దక్కింది. వర్సిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫొటోలతో ఏబీవీపీ ప్రచారం చేసిందని ఆరోపణలున్నాయి. ఏబీవీపీ యూనియన్ తరఫున ఉపాధ్యక్ష రేసులో ఉన్న అభ్యర్థి ప్రియాంక చౌరీ తన పేరు కలిసొచ్చేలా ప్రియాంక పోస్టర్లతో వర్సిటీలో ప్రచారం నిర్వహించారు. 2014 వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ సెక్రటరీ అభ్యర్థి నౌహీద్ సైరసీ పోస్టర్లతో ప్రచారం చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. -
కాలేజీలో హీరోయిన్ ఫొటోల హల్ చల్!
యూనివర్సిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికలు ఈ నెల 9న నిర్వహించనున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ వర్గానికి చెందిన స్టూడెంట్ యూనియన్ తమ ఎన్నికల ప్రచార పోస్టర్లపై ప్రియాంక చోప్రా ఫొటోలను వినియోగించారు. అసలు విషయం ఏంటంటే.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) కు చెందిన విద్యార్థి సంఘం నాయకుడు ప్రియాంక చౌరీ అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) యూనియన్ తరఫున ఉపాధ్యక్ష రేసులో ఉన్నాడు. ప్రియాంక పేరు కలిసొస్తుందని ప్రియాంక చౌరీ తమ ప్రచారం పోస్టర్లపై హీరోయిన్ ఫొటో వాడుతున్నారు. గతంలోనూ వర్సిటీ ఎన్నికల్లో భాగంగా సెలబ్రిటీల ఫొటోలతో వాల్ పోస్టర్లు అంటించారు. 'ఆల్ ద బెస్ట్ ప్రియాంక 4 ఇమ్మీస్' అని ప్రియాంక చౌరీ బ్యాలెట్ నెంబర్ 4ను ప్రమోట్ చేస్తున్నారు. ఈ విషయంపై ఏబీవీపీ జాతీయ మీడియా కన్వినర్ సాకేత్ బహుగుణను ప్రశ్నించగా.. తాము హీరోయిన్ పోస్టర్లతో ప్రచారం చేయలేదన్నారు. 68వ ఇమ్మీ అవార్డుల్లో ప్రియాంక చోప్రా పాల్గొననున్న సందర్భంగా హీరోయిన్ ఫ్యాన్స్ వాల్ పోస్టర్స్ అంటించారని, ప్రియాంక 4 ఇమ్మీస్ అంటే ప్రియాంక ఫర్ ఇమ్మీస్ అనే అర్థమని వివరణ ఇచ్చారు. యాధృచ్ఛికంగా తమ అభ్యర్థి బ్యాలెట్ నెంబర్ 4 కావడంతో తమపై దుష్రచారం జరిగిందని ఆరోపించారు. 2014 వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ సెక్రటరీ అభ్యర్థి నౌహీద్ సైరసీ పోస్టర్లతో ప్రచారం చేసి విజయం సాధించడం గమనార్హం. -
డిగ్రీ కోర్సులకు లక్షకు పైగా దరఖాస్తులు
ఢిల్లీ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్న వివిధ డిగ్రీ కోర్సులకు లక్షకు పైగా దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారం సాయంత్రానికి 1,14,152 దరఖాస్తులు వచ్చాయని, అందులో సుమారు 40 వేల మంది ఫీజులు కూడా కట్టేశారని ఢిల్లీ యూనివర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. ఫీజు కట్టినవారిలో 20 వేల మంది అబ్బాయిలు, 20 వేల మంది అమ్మాయిలతో పాటు ఒక హిజ్రా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుకాగా, మొదటిరోజే 39వేల మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఓఎంఆర్ ఫారాలు కూడా యూనివర్సిటీ వెబ్సైట్లో ఉన్నాయని, ఫీజును ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చని అన్నారు. రావడానికి లక్షకు పైగా దరఖాస్తులు వచ్చినా, వివిధ కోర్సులలో కలిపి ఉన్న మొత్తం సీట్లు 60వేలు మాత్రమే. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు జూన్ 19వరకు గడువు ఉంది. మొదటి కటాఫ్‌ను జూన్ 27న ప్రకటిస్తారు. ఇంతకుముందు వరకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండు పద్ధతుల్లో దరఖాస్తులు స్వీకరించగా, ఈసారే పూర్తిగా ఆన్లైన్ దరఖాస్తులు మాత్రమే తీసుకుంటున్నారు. -
ఆ మోదీ.. ఈ మోదీ కాదు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలపై ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శల పర్వం కొనసాగిస్తోంది. మోదీ డిగ్రీ పట్టాపై మరోసారి సందేహం వ్యక్తం చేసింది. 1975 నుంచి 80 వరకు ఢిల్లీ యూనివర్శిటీ రికార్డులను పరిశీలించామని, ప్రధానికి బీఏ డిగ్రీ పట్టా అందజేసినట్టు ఎలాంటి ఆధారాలూ లేవని ఆప్ నేతలు వెల్లడించారు. అయితే నరేంద్ర కుమార్ మహావీర్ ప్రసాద్ మోదీ అనే వ్యక్తికి వర్శిటీ అధికారులు డిగ్రీ ప్రదానం చేశారని, ప్రధాని నరేంద్ర దామోదర్‌దాస్ మోదీకు కాదని చెప్పారు. 'యూనివర్శిటీ రికార్డులను మా స్థాయిలో పరిశీలించాం. డిగ్రీ పట్టా అందుకున్నవారిలో నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ పేరు ఎక్కడా లేదు. 197-78 మధ్య నరేంద్ర కుమార్ మహావీర్ ప్రసాద్ మోదీ అనే వ్యక్తి గ్రాడ్యుయేషన్ చేశారు. ఆయనది రాజస్థాన్‌లోని అల్వార్' అని ఆప్ నేత ఆశీష్ కేతన్ చెప్పారు. మోదీ విద్యార్హతలను తెలియజేయాల్సిందిగా ఆప్ నేతలు సమాచార హక్కు చట్టం కింద కోరిన సంగతి తెలిసిందే. ఓ పత్రికలో మోదీ డిగ్రీ పట్టాకు సంబంధించి రాసిన వివరాలు, ఢిల్లీ యూనివర్శిటీ రికార్డులతో సరిపోలలేదని చెప్పారు. తమ పరిశీలిన ప్రకారం మోదీ డిగ్రీ నకిలీదని ఆశీష్ కేతన్ ఆరోపించారు. ఇది తీవ్రమైన నేరమని, ఫోర్జరీ లాంటిదని అన్నారు. నకిలీ డిగ్రీ ఆరోపణలపై వైదొలిగిన ఆప్ మాజీ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ కేసు లాంటిదే మోదీ వ్యవహారమని చెప్పారు. -
ప్రధాని డిగ్రీలు ఎందుకు చూపించరు: సీఎం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిగ్రీల అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ట్విట్టర్లో విరుచుకుపడ్డారు. ప్రధాని డిగ్రీల రికార్డులు చూపించడానికి ఢిల్లీ యూనివర్సిటీ నిరాకరిస్తోందని.. అది ఎందుకని ప్రశ్నించారు. తనకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయన అక్కడి నుంచి బీఏ చేయలేదని అన్నారు. కొన్ని పత్రికలు ప్రచురించిన డిగ్రీలు ఫోర్జరీవని కూడా సీఎం ఆరోపించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తన డిగ్రీల గురించి కొంతమంది ప్రశ్నించారని, వెంటనే తాను దాన్ని రుజువు చేసుకున్నానని అన్నారు. తనకు అక్కడి నుంచి డిగ్రీ ఉందని కూడా తెలిపారు. సుర్బజిత్ రాయ్ అనే వ్యక్తి ఐఐటీ ఖరగ్‌పూర్‌ను సమాచార హక్కు చట్టం ప్రకారం కేజ్రీవాల్ విద్యార్హతల గురించి ప్రశ్నించగా అక్కడి నుంచి వచ్చిన లేఖను కూడా ఆయన తన ట్వీట్‌తో పాటు జతపరిచారు. తన డిగ్రీల గురించి ఖరగ్‌పూర్ ఐఐటీ ఇంత స్పష్టంగా చెబుతోందని, కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిగ్రీల గురించి ఢిల్లీ యూనివర్సిటీ ఎందుకు దోబూచులు ఆడుతోందని ప్రశ్నించారు. ఎందుకంటే, ఆయనకు డిగ్రీలు లేవని కూడా కేజ్రీవాల్ సూత్రీకరించేశారు. ఆయన యూనివర్సిటీలో చేరడం, ఆయన డిగ్రీ, మార్కుల జాబితా, స్నాతకోత్సవం.. ఇలాంటి వాటికి సంబంధించిన రికార్డులు ఏవీ ఢిల్లీ యూనివర్సిటీలో లేవని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. DU refuses to show records of PM's degree. Why? My info- he did not do BA from DU. No records in DU. Degree published by some papers forged — Arvind Kejriwal (@ArvindKejriwal) 4 May 2016 Someone asked info abt my degree from IIT Kgp. They immediately provided it. Becoz I have a degree from there(1/2) pic.twitter.com/2LMzmZasxS — Arvind Kejriwal (@ArvindKejriwal) 4 May 2016 Why is DU refusing info abt PM's degree? Becoz he does not have it (2/2) — Arvind Kejriwal (@ArvindKejriwal) 4 May 2016 No records in DU related to his enrolment, his degree, his marksheets and convocation — Arvind Kejriwal (@ArvindKejriwal) 4 May 2016 -
తాకట్టులో సార్వభౌమత్వం ప్రొఫెసర్ సాయిబాబా విమర్శ
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ఆదీవాసీల కోసం పాటుపడేవారికి దేశవ్యతిరేకులుగా ముద్రవేస్తున్నారని, జైళ్లలో పెడుతున్నారని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా అన్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై జైలుశిక్ష అనుభవించి గతవారమే బెయిల్‌పై విడుదలైన సాయిబాబా.. ప్రభుత్వ దమనకాండ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో మనకు నచ్చిన విషయాలు బహిర్గతంగా మాట్లాడలేం. ప్రతిచోటా బెదిరింపు వాతావరణమే కనబడుతోంది. ఇదే నియంతృత్వ ధోరణి’ అని సాయిబాబా అన్నారు. అధికారంలో ఉన్నవారు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను హరిస్తున్నారన్నారు. దళితులు, ఆదీవాసీలకు సంబంధించిన కొన్ని కనీస అంశాలపై విద్యార్థులు, ప్రొఫెసర్లు ప్రశ్నలు లేవనెత్తారని.. జేఎన్‌యూ, హెచ్‌సీయూ, నిట్ శ్రీనగర్, ఐఐటీ మద్రాస్ గొడవలు అన్నింటికీ కారణం ఒకటేనన్నారు. రాజ్యాంగపరంగా దేశభక్తుడు అనే దానికి సరైన నిర్వచనం లేదని.. దేశంలోని చాలా సమస్యలపై చర్చను పక్కదారి పట్టించేందుకే ‘దేశవ్యతిరేకం’ అనే చర్చను తెరపైకి తెచ్చారన్నారు. ప్రభుత్వాలు దేశ సార్వభౌమత్వాన్ని సామ్రాజ్యవాదులకు తాకట్టుపెడుతున్నారని ఆరోపించారు. పర్యావరణాన్ని నాశనం చేస్తూ సహజవనరులను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని సాయిబాబా విమర్శించారు. -
తెరుచుకున్న భగత్ గది
న్యూఢిల్లీ: బ్రిటిషర్లకు ముచ్చెమటలు పట్టించిన విప్లవయోధుడు భగత్‌సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని ఢిల్లీ వర్సిటీలో అప్పట్లో ఆయన్ను నిర్బంధించిన గదిలోకి బుధవారం విద్యార్థులను అనుమతించారు. వైస్ రీగల్ లాడ్జ్ ఎస్టేట్‌గా పిలిచే ఆ భవంతిలోని ఓ గదిలో 1931లో భగత్‌సింగ్‌ను ఒకరోజుపాటు బ్రిటిష్ప్రభుత్వం నిర్బంధించింది. అనంతరం ఇప్పటి పాక్‌లో ఉన్న లాహోర్ జైలులో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను మార్చి 23న ఉరితీశారు. 1933లో ఎస్టేట్‌ను ఢిల్లీవర్సిటీకి అప్పగించగా అనంతరకాలంలో దీనిని వైస్‌చాన్స్‌లర్ కార్యాలయంగా వినియోగిస్తున్నారు. ఐదు స్కూళ్లకు చెందిన మొత్తం 100 మంది విద్యార్థులను గదిలోకి అనుమతించారు. భగత్‌సింగ్ స్వయంగా రాసిన ఉత్తరాలను గదిలో ప్రదర్శనకు ఉంచారు. ఆ గదిని ప్రజల సందర్శనార్ధం తెరిచే ఉద్దేశంలేదని వర్సిటీ వీసీ యోగేశ్ త్యాగి స్పష్టంచేశారు. పోరాటంచేసే ప్రతి ఒక్కరూ భగత్‌సింగ్ నుంచి స్పూర్తిపొందుతారన్నారు. -
ప్రొఫెసర్ గిలానీని విడుదల చేయాలి
దేశద్రోహం అభియోగాన్ని ఎదుర్కొంటున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ ఎస్ఏఆర్ గిలానీని విడుదల చేయాలని డీయూ ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది. గిలానీపై దేశద్రోహం అభియోగాన్ని మోపి చట్టాన్ని దుర్వినియోగపరచారని ఆరోపించింది. అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా ప్రెస్ క్లబ్లో జరిగిన వివాదాస్పద కార్యక్రమంలో మాట్లాడినందుకు గిలానీని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తక్షణం ఆయన్ని విడుదల చేసి విధుల్లో చేరేందుకు అనుమతించాలని డీయూ ఉపాధ్యాయసంఘం కోరింది. ఇటువంటి వివాదాస్పద చట్టాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేసింది. దేశద్రోహ చట్టం ప్రయోగించడానికి సంబంధించి పరిమితులను సుప్రీం కోర్టు స్పష్టంగా వెల్లడించిందని, శాంతియుత వాతావరణంలో చర్చ జరుగుతున్నప్పుడు వ్యక్తి తన అభిప్రాయాలను వెల్లడిస్తే అటువంటి సందర్భాల్లో దేశద్రోహ చట్టం ప్రయోగించరాదని స్పష్టం చేసినట్లు తెలిపింది. -
అగ్నిగుండం దండకారణ్యం
‘‘భారతదేశంలో 12 రాష్ట్రాల్లో దండకారణ్యం విస్తరించి ఉంది. కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూరేలా ప్రభుత్వాలు చేపడుతున్న బాక్సైట్, గనుల తవ్వకాల వల్ల అడవులు సర్వనాశనమైపోతున్నాయి. దీనిద్వారా అడవి బిడ్డలైన ఆదివాసీయుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. మందుపాతరలు, ఎన్కౌంటర్లతో దండకారణ్యం అగ్నిగుండంగా మారుతోంది. అక్కడ ఎలాంటి మారణహోమం జరగకుండా, ఆది వాసీయులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రభుత్వాలు కాపాడాలన్నదే ‘దండకారణ్యం’ కథ’’ అని దర్శక-నిర్మాత ఆర్. నారాయణమూర్తి తెలిపారు. ఆయన నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ‘దండకారణ్యం’ ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నారాయణమూర్తి విలేకరులతో మాట్లాడారు. ‘‘బాక్సైట్ గనుల తవ్వకాలకు వ్యతిరేకంగా విశాఖ ఏజెన్సీలో ఆదివాసీయులు ఉద్యమం చేస్తున్నారు. పోలీసులు, మిలటరీ దళాలు అక్కడ కాల్పులు జరుపుతుండడంతో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన సంఘటనపై పార్లమెంట్లో ప్రస్తావించిన ప్రజా ప్రతినిధులు ఆదివాసీయుల సమస్యలపై ఎందుకు స్పందించడం లేదు? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరిపి దండకారణ్యంలో మారణహోమం జరగకుండా శాంతి నెలకొనేలా చర్యలు తీసుకోవాలి. ప్రజాకవులు గద్దర్, గోరటి వెంకన్న, యశ్పాల్, పి.తిరుపతి, కాశీపతి ఈ చిత్రానికి మంచి పాటలు రాశారు. ‘వందేమాతరం’ శ్రీనివాస్, గద్దర్ పాటలు ప్రధాన ఆకర్షణ. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. నా గత చిత్రాలను ఆదరించినట్లే ఈ చిత్రాన్నీ ప్రేక్షకులు ఆదరించి, మరిన్ని చిత్రాలు తీసే ప్రోత్సాహం ఇవ్వాలి’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రం కోసం గద్దర్ స్వయంగా 3 పాటలు రాసి, పాడి, నటించడం విశేషం. సమకాలీన దండకారణ్య చరిత్రకు దర్పణమైన ఈ చిత్రానికి సెన్సార్ దాదాపు 80 ఆడియో కట్స్ విధించడం సంచలనమైంది. -
స్నేహితుడి నివాసంలో శవమై..
న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ విద్యార్థిని తన స్నేహితుడి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతి ఇప్పుడు సంచలనం రేకిత్తిస్తోంది. ప్రస్తుతం చనిపోయిన ఆ అమ్మాయి గత రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయిందని, ఇప్పుడామె చనిపోయిందని తెలియడం తమకు తీవ్ర దిగ్భ్రాంతిని కలగజేసిందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అర్జూ సింగ్ అనే యువతి థర్డ్ ఇయర్ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు రెండు రోజులగా కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు ఢిల్లీలోని శక్తినగర్ లో ఆమె విగత జీవి తన స్నేహితుడు నవీన్ నివాసంలో కనిపించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నవీన్ ను అరెస్టు చేశారు. దీంతో నవీన్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకోవాలని, వారి తమ కూతురు ఏదో చేసి ఉండొచ్చని అర్జూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రముఖ పాత్రికేయుడు అరిందమ్ సేన్‌గుప్తా మృతి
న్యూఢిల్లీ : ప్రముఖ పాత్రికేయుడు అరిందమ్ సేన్‌గుప్తా కేన్సర్‌తో గురువారం కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. గత 33 ఏళ్లుగా ఆయన పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారు. గతంలో అరిందమ్ సేన్‌గుప్తా ది పేట్రియాట్, ది సండే అబ్జర్వర్, ది ఎకనామిక్ టైమ్స్‌లో పని చేశారు. ఎస్టీ స్టిఫెన్స్ కాలేజీలో ఎంఏ పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత పాత్రికేయ వృత్తిలో ప్రవేశించారు. అరిందమ్ సేన్‌గుప్తా ప్రస్తుతం టైమ్స్ మేనేజింగ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అరిందమ్ మృతిపై ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ తీవ్ర దిగ్బాంత్రి వ్యక్తం చేశారు. -
బలవంతంగా చేపట్టబోం
♦ అయోధ్యలో రామ మందిరంపై సుబ్రమణ్యం స్వామి ♦ ఢిల్లీ వర్సిటీ సదస్సులో ప్రసంగం న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీలో పెల్లుబికిన నిరసనలను లెక్కచేయకుండా రామ మందిర నిర్మాణం అంశంపై జరిగిన సదస్సులో బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి ప్రసంగించారు. మన సంప్రదాయాన్ని పునరుద్ధరించాలంటే అయోధ్యలో మందిర నిర్మాణం అవసరమని చెప్పారు. ‘మందిర నిర్మాణాన్ని బలవంతంగా చేపట్టబోం, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించబోం. దీనిపై కోర్టులో నెగ్గుతామన్న పూర్తి విశ్వాసం మాకుంది’ అని స్పష్టంచేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో ‘రామజన్మభూమి’ అంశంపై శనివారం ప్రారంభమైన రెండు రోజుల సదస్సులో ఆయన మాట్లాడారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పూర్తి మద్దతిస్తామని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తనకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. 40 వేలకుపైగా ఆలయాలను ధ్వంసం చేశారని, అయితే వాటన్నింటినీ పునర్నిర్మించాలని తాము అడగడం లేదని, వాటిలో మూడు ఆలయాలైన రామ జన్మభూమి, మథురలో కృష్ణుడి ఆలయం, కాశీ విశ్వనాథ్ మందిరాల విషయంలో రాజీపడబోమని సుబ్రమణ్యం స్వామి అన్నారు. వివాదాస్పద భూమిలో రామాలయాన్ని నిర్మించాలని, ముస్లింలకు మసీదు కోసం సరయు తీరంలో స్థలం కేటాయిస్తారని చెప్పారు. వర్సిటీ క్యాంపస్‌లో ఈ సదస్సు నిర్వహించడాన్ని ఎన్ఎస్యుఐ, తదితర విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. నిరసన చేపట్టిన వారిని పోలీసులు అరెస్టుచేశారు. -
'రామజన్మభూమి'పై వర్సిటీలో ఆందోళనలు
న్యూఢిల్లీ: ఆందోళనలు, ఉద్రిక్తతల మధ్య ఢిల్లీ యూనివర్సిటీలో రామజన్మభూమి అంశంపై శనివారం సెమినార్ ప్రారంభమైంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రారంభమైన ఈ సెమినార్‌కు వ్యతిరేకంగా వామపక్ష విద్యార్థి సంఘాలైన ఆలిండియా స్టూడెంట్ అసొసియేషన్ (ఏఐఎస్ఏ), క్రాంతికారి యువసంఘటన్ (కేవైఎస్)తోపాటు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) విద్యార్థులు ఆందోళనకు దిగారు. డీయూలోని ఆర్ట్స్ ఫాకల్టీ ప్రాంగణం ఎదుటు వారు ఆందోళన చేస్తుండగా.. రైట్ వింగ్ విద్యార్థులు కాన్ఫరెన్స్ సెంటర్ ఎదురుగా గుమిగూడి 'జై శ్రీరాం', 'భారత్ మాతాకీ జై' నినాదాలతో హోరెత్తిస్తున్నారు. దీంతో యూనివర్సిటీ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దివంగత నేత అశోక్ సింఘాల్ స్థాపించిన అరుంధతి వశిష్ఠ అనుసంధాన్ పీఠం నిర్వహిస్తున్న ఈ సెమినార్‌ను బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ప్రారంభించారు. సెమినార్‌కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులు 'అసహనం'గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. -
మాజీ ప్రొఫెసర్‌పై కేసు నమోదు
ఉదయ్‌పూర్: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ఫిలాసఫీ ప్రొఫెసర్ అశోక్ వోహ్రాపై రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ పోలీసులు కేసు నమోదుచేశారు. మోహన్ లాల్ శుక్లా యూనివర్సిటీలో 'రెలిజియస్ డైలాగ్' అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో వోహ్రా మాట్లాడుతూ హిందూ దేవతలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఏబీవీపీ కార్యకర్త దేవేంద్రసింగ్ ఫిర్యాదు మేరకు ఓ మతాన్ని కించపరిచినందుకు సెక్షన్ 295, ఇరువర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించే చర్యకు పాల్పడినందుకు సెక్షన్ 153(ఎ) కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో వోహ్రా.. 'ఈ వ్వాఖ్యలు నావి కావు. నేను కేవలం విదేశీ రచయితల అభిప్రాయాలను మాత్రమే వెల్లడించాను. నా ప్రసంగానికి సంబంధించిన అంశాలను పరిశీలించడానికి ఓ ప్యానల్‌ను నియమించాల్సిందిగా కోరుతున్నాను' అని ముఖ్యమంత్రి వసుంధర రాజేకు లేఖ రాశారు. -
ఉద్యోగ సమాచారం
వ్యాప్కోస్లో ఇంజనీర్లు హైదరాబాద్‌లోని వ్యాప్కోస్ లిమిటెడ్.. సీనియర్ ఇంజనీర్ (ఖాళీలు-2), ఇంజనీర్(ఖాళీలు -2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 28. వివరాలకు www.wapcos.gov.inచూడొచ్చు. ఐసీఏఆర్ అనుబంధ సంస్థలో ఇంటర్వ్యూలు హైదరాబాద్‌లోని ఐసీఏఆర్ అనుబంధ సంస్థ అగ్రిక ల్చరల్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ ఇన్స్టిట్యూట్ (ఏటీఏఆర్ఐ).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ రీసెర్చ ఫెలో (ఖాళీలు-2), డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఖాళీలు-2) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఇంటర్వ్యూ తేదీ నవంబర్ 28. వివరాలకు www.zpd5hyd.nic.inచూడొచ్చు. ఢిల్లీ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఢిల్లీ వర్సిటీకి చెందిన ఫ్యాకల్టీ ఆఫ్ లా.. అసిస్టెంట్ ప్రొఫెసర్, గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 81. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 3. వివరాలకు www.du.ac.in/duచూడొచ్చు. పశ్చిమ బెంగాల్లో లెక్చరర్లు పశ్చిమ బెంగాల్‌లోని సాంకేతిక విద్య, శిక్షణ విభాగం.. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో కాంట్రాక్ట్ ప్రాతిపదికనలెక్చరర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 146. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 14. వివరాలకు www.webscte.orgచూడొచ్చు. చెన్నై పోర్ట ట్రస్ట్‌లో వివిధ పోస్టులు చెన్నై పోర్ట ట్రస్ట్.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 14 (టగ్ మాస్టర్-7, పైలట్-4, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్-1, డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్-1, చీఫ్ మెడికల్ ఆఫీసర్-1). వివరాలకు www.chennaiport.gov.inచూడొచ్చు. సీడీఆర్ఐలో అసిస్టెంట్లు సీఎస్ఐఆర్ అనుబంధ సంస్థ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ ఇన్స్టిట్యూట్ (సీడీఆర్ఐ).. వికలాంగుల కోటాలో వివిధ విభాగాల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 5. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 21. వివరాలకు www.cdriindia.orgచూడొచ్చు. బెనారస్ వర్సిటీ పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు బెనారస్ హిందూ యూనివర్సిటీ పరిధిలోని వసంతా కాలేజ్ ఫర్ ఉమెన్.. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మ్తొతం ఖాళీలు 6. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 13. వివరాలకు www.vasantakfi.comచూడొచ్చు. ‘వివేకానంద ఇన్స్టిట్యూట్’లో వివిధ పోస్టులు స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ.. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 16. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 15. వివరాలకు www.svnirtar.nic.inచూడొచ్చు. 25న ‘మనూ’ క్యాంపస్‌లో జాబ్ ఫెయిర్ హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలీలో ఉన్న మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం(మనూ)లో ఈనెల 25వ తేదీన ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్/ జాబ్ ఫెయిర్‌ను నిర్వహిస్తామని మనూ స్కూల్ ఆఫ్ సీఎస్ అండ్ ఐటీ స్కూల్ డీన్ ప్రొఫెసర్ అబ్దుల్ వాహెద్ శుక్రవారం తెలిపారు. మనూ ప్లేస్మెంట్ అండ్ కెరియర్ గెడైన్స్ సెల్, స్కూల్ ఆఫ్ సీఎస్ అండ్ ఐటీ, పాత్వే హ్యూమన్ రీసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ ఫెయిర్‌లో పాల్గొనదలచిన విద్యార్థులు 23వ తేదీ లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఈ జాబ్ ఫెయిర్‌లో ఐటీ, బీపీఓ, హెచ్ఆర్, ఫార్మసీ, కామర్స్, ఐటీఐ, డిప్లొమో కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తారన్నారు. 2015, 2016లో ఎంసీఏ, ఎంఎస్సీ, బీటెక్, సీఎస్ అండ్ ఐటీ, ఎంబీఏ, ఐటీఐ, పాలిటెక్నిక్, ఇతర డిగ్రీలు పూర్తి చేసిన వారే అర్హులన్నారు. ఎంసీఏ, బీటెక్ పూర్తి చేసిన వారు బొంత కోటయ్య(9666995969), మహ్మద్ ఒమర్ (9160407677)ను సంప్రదించాలి, ఎంబీఏ, ఎంకామ్ విద్యార్థులు కమరుద్ధీన్( 7207973873), రసీద్ ఫారూఖీ(9700911532)ను సంప్రదించాలి. పాలిటెక్నిక్, ఇతర డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన వారు ఫసియుద్ధీన్(9703131787)ను సంప్రదించాలి. ఇతర మనూయేతర విద్యార్థులు సునీల్(8121366633/11/22)ను సంప్రదించాలి. -
ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ క్లీన్ స్వీప్
-
ఢిల్లీ యూనివర్సిటీ ప్రొపెసర్ సాయిబాబాతో ఫేస్ టూ ఫేస్
-
కొన్ని అదృశ్య శక్తులు నాపై కుట్ర పన్నాయి
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో సెయింట్ స్టీఫెన్స్ కళాశాల ప్రిన్సిపల్ వాల్సన్ తంపూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను మొదట్నించి ఖండిస్తున్న ఆయన తనకు వ్యతిరేకంగా రాజకీయ కుట్ర జరుగుతోందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. లైంగిక ఆరోపణల కేసు విచారణ నిమిత్తం మానవ వనరుల మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగిన నేపథ్యంలో తంపూ ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్నిశక్తులు తనకు వ్యతిరేకంగా పీహెచ్డీ విద్యార్థినిని వాడుకుంటున్నాయని తంపూ ఆరోపిస్తున్నారు. నిగూఢమైన ప్రయోజనాల కోసం ఆమెను వాడుకుంటున్నారనీ, ఈ విషయం ఆమెకు ఆర్థం కావడంలేదని అన్నారు. ఇదంతా చివరకు నాశనానికి దారి తీస్తుందంటూ తన అసహనాన్ని ప్రదర్శించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలో ఆడియో టేపుల నిజాలు నిగ్గుతేలతాయని తంపూ వ్యాఖ్యానించారు. అయితే ఆ కొంతమంది ఎవరనేది వెల్లడించడానికి మాత్రం ఆయన నిరాకరించారు. ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ పీహెచ్డీ విద్యార్థిని తనను గైడ్ వేధిస్తున్నాడంటూ కేసు నమోదు చేసింది. కాలేజీ హెడ్‌గా తనకు అండగా నిలవాల్సిన ప్రిన్సిపల్ తంపూ , నిందితుడికి వత్తాసు పలుకుతూ కేసు వెనక్కి తీసుకోమని బెదిరిస్తున్నాడంటూ కొన్ని ఆడియో టేపులను ఆమె విడుదల చేసింది. ఈ టేపులు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో వివాదం రగులుకుంది. ఈ నేపథ్యంలోనే మానవవనరుల శాఖ రంగంలోకి దిగింది. దీనిపై విచారణ చేయాల్సిందిగా యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ఆదేశించింది. మరోవైపు మహిళా సంఘాలు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ..పీహెచ్డీ విద్యార్థినికి మద్దతుగా న్యాయ పోరాటానికి దిగాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులకు కఠినంగా శిక్షించాల్సిందిగా డిమాండ్ చేస్తూ సోమవారం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నాయి. -
ప్రొ.సాయిబాబాకు బెయిల్ మంజూరు
-
ప్రొ.సాయిబాబాకు బెయిల్ మంజూరు
ముంబై: ఏడాదిగా జైల్లో గడుపుతున్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం బాంబే హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఏడాది క్రితం మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై సాయిబాబాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో గడుపుతున్నారు. సాయిబాబాకు బెయిల్ మంజూరు చేసేందుకు గతంలో న్యాయస్థానాలు తిరస్కరించాయి. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు బెయిల్ ఇవ్వాలని సాయిబాబా చేసుకున్న విన్నపాన్ని మన్నించి బాంబే హైకోర్టు మంజూరు చేసింది. -
వాట్సప్ లో క్వశ్చన్ పేపర్ లీక్
న్యూఢిల్లీ: పరీక్ష ప్రారంభం కావడానికి గంట ముందు ప్రశ్నాపత్రం లీకైన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేపింది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఓపెన్ లెర్నింగ్(ఎస్ఓఎల్) బీకాం ఫైనల్ ఇయర్ ఎకనామిక్స్ పేపర్ వాట్సప్ మెసేజ్ ద్వారా బయటకు వచ్చింది. మధ్యాహ్నం 3 గంటలకు పరీక్ష ప్రారంభం కావాల్సివుండగా 2 గంటలకు పేపర్ వాట్సప్ లో వచ్చింది. అయితే పేపర్ లీకైనట్టు వచ్చిన వార్తలను ఎస్ఓఎల్ చైర్ పర్సన్ సీఎస్ దూబే తోసిపుచ్చారు. పరీక్ష పేపర్ ను పరిశీలకుల ముందే బయటకు తీశామని, ప్రశ్నాపత్రం లీకైయ్యే ఛాన్స్ లేదన్నారు. అయితే వాట్సప్ మెసేజ్ లోని పేపర్ కు పరీక్షలో ఇచ్చిన ప్రశ్నాపత్రం సేమ్ టు సేమ్ ఉండడంతో అధికారులు ఖంగుతిన్నారు. దీనిపై స్పందించేందుకు పరిశీలకుల ప్యానల్ ఇన్ చార్జి రమేష్ గౌతమ్ నిరాకరించారు. -
మెట్రో గాలితో కరెంట్
ఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థులు సరికొత్త ఆవిష్కరణ చేశారు. జీనుగాలి(వాహనం ప్రయాణించేటప్పుడు వచ్చే వేగమైన గాలి) సాయంతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా గొప్ప ప్రయోగం చేసి విజయం సాధించారు. ఈ ప్రయోగాన్ని ఢిల్లీ మెట్రో రైలు సాయంతో చేశారు. ఢిల్లీ వర్సిటీకి చెందిన కాలింది కాలేజీలో భౌతికశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ శాఖల్లో చదువుతున్న విద్యార్థులు ఢిల్లీ మెట్రో అధికారులను సంప్రదించారు. మెట్రో రైలు వెళ్లే భూఅంతర్భాగ మార్గంలో టర్బైన్లు పెట్టాలనుకుంటున్నామని, రైలు వెళ్లే సమయంలో వచ్చే గాలి వేగం ద్వారా అవి పనిచేసి విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, ఈ ప్రయోగానికి తమకు అనుమతివ్వాల్సిందిగా కోరారు. దీనిపట్ల ఆసక్తి చూపిన అధికారులు అందుకు సమ్మతించారు. దీంతో ఢిల్లీలో సొరంగ మార్గాల్లో రైలు వెళ్లే చోట్ల ప్రవేశ ద్వారం వద్ద ముందుగా మూడు బ్లేడ్ల టర్బైన్లను, అనంతరం ఐదు బ్లేడ్ల టర్బైన్లను ఏర్పాటు చేశారు. అది మెట్రో సర్వీసులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం రైలు వెళ్లే వేగానికి వస్తున్న గాలి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసి చూపించి అందరి మన్ననలు పొందారు. 'ఒక రోజు మెట్రో స్టేషన్లో నిలుచున్న విద్యార్థులు మెట్రో వేగానికి టన్నెల్లోకి చొచ్చుకొచ్చేగాలి వృధా అయిపోతుంది కదా అని ఆలోచించారు. దానిని ఎలా ఉపయోగించుకోవాలా అని ఆలోచించి ఈ ఆవిష్కరణ చేశారు' అని కళాశాల ప్రిన్సిపాల్ పునితా వర్మ తెలిపారు. ఈ ప్రయోగం చేసేందుకు సదరు విద్యార్థులకు 2013లో విశ్వవిద్యాలయం రూ.15లక్షలు కేటాయించింది. -
ఢిల్లీ వర్సిటీలో పెరుగుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించడానికి వచ్చే విదేశీ విద్యార్థులు, ముఖ్యంగా మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం వర్సిటీలో పెరిగిన విదేశీ విద్యార్థుల అడ్మిషన్లే ఇందుకు నిదర్శనం. 2012 డిసెంబర్ 16న నగరంలో జరిగిన మహిళ గ్యాంగ్ రేప్ సంఘటన ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. అంతేకాక ఉన్నతవిద్య చదవడానికి సురక్షిత ప్రాంతంగా ఢిల్లీ ఉంటుందని విదేశీ మహిళలు భావిస్తున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలోని ఫారిన్ స్టూడెంట్ రిజర్వేషన్ ఆఫీస్(ఎఫ్ఎస్ఆర్ఓ) డాటా ప్రకారం 2014-15 సంవత్సరంలో 1,184 మంది విదేశీ విద్యార్థులు వర్సిటీలో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మహిళా విద్యార్థుల సంఖ్య 492 నుంచి 546కు పెరిగింది. 2011-12లో విదేశీ విద్యార్థుల సంఖ్య 952గా, 2012-13లో 1,007గా ఉంది. 2011-12లో మహిళా విద్యార్థుల సంఖ్య 434గా ఉంది. దక్షిణాసియా, దక్షిణ తూర్పు ఆసియా నుంచే ఎక్కువ: ముఖ్యంగా దక్షిణ ఆసియా, దక్షిణ తూర్పు ఆసియా, యూరోపియన్, ఆఫ్రికా దేశాల విద్యార్థులు ఎక్కువగా ఉన్నట్లు ఎఫ్ఎస్ఆర్ఓ అధికారి అమ్రిత్ కుమార్ బస్రా వెల్లడించారు. యూనివర్సిటీలో జరిగిన అంతర్గత సమావేశంలో....రేప్ సంఘటన ప్రభావం విదేశీ విద్యార్థుల అడ్మిషన్లపై పడలేదనే విషయం అర్థమైందని ఆమె చెప్పారు. ‘వారిలో కచ్చితంగా ఆందోళన ఉంటుంది. కానీ భయపడటం లేదు. ప్రస్తుత విద్యాసంవత్సరం దక్షిణాసియా, దక్షిణ తూర్పు ఆసియాలోని నేపాల్ నుంచి 311, ఆఫ్ఘనిస్థాన్ నుంచి 55, మాల్దీవుల నుంచి 36, శ్రీలంక నుంచి 23, వియాత్నం నుంచి 23, భూటాన్ నుంచి 22, బంగ్లాదేశ్ నుంచి 10, ఇండోనేషియా నుంచి 7 మంది విద్యార్థులు ఢిల్లీ వర్సిటీలో అడ్మిషన్లు పొందారు. అలాగే మధ్య ప్రాచ్య, యూరోపియన్, ఆఫ్రికా దేశాల నుంచి కూడా క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇరాన్ నుంచి 11, ఇరాక్ నుంచి 7, నైజీరియా నుంచి 11, కాంగో నుంచి 10, జింబాబ్వే నుంచి 10, సోమాలియా నుంచి ఇద్దరు వర్సిటీలో చేరారు’ అని బస్రా తెలిపారు. నాణ్యమైన విద్య, తక్కువ జీవన వ్యయమే కారణం: నాణ్యమైన విద్య, తక్కువ జీవన వ్యయమే విదేశీ విద్యార్థుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమని అమ్రిత్ కుమార్ బస్రా చెప్పారు. అదేవిధంగా వారు వర్సిటీలోనే ఉండేలా కచ్చితమైన నియమాలను పాటిస్తున్నామన్నారు. ప్రస్తుతం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, రీసర్చ్ ప్రోగ్రామ్స్ విభాగాల్లో విదేశీ విద్యార్థులకు 5 శాతం సీట్లు రిజర్వ్ చేసినట్లు ఆమె తెలిపారు. వర్సిటీ నిబంధనల ప్రకారం విదేశీ విద్యార్థులు తక్కువగా అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే తప్ప, ఆ సీట్లను ఇతర కేటగిరీలకు మార్చడానికి అవకాశం ఉండదు. అదే విధంగా వర్సిటీలో పురుషులు, మహిళలకు వేర్వేరుగా అంతర్జాతీయ హాస్టల్ సదుపాయాలు, వేర్వేరు బస్ సదుపాయం అందుబాటులో ఉందని ఆమె పేర్కొన్నారు. -
ఎవ్వరికైనా ఉచిత న్యాయ సలహాలు
ఆస్తి వివాదాల్లాంటివాటి విషయంలో ఉచిత న్యాయ సలహాలు ఇచ్చేందుకు ఢిల్లీ విశ్వవిద్యాలయం ముందుకొచ్చింది. గతంలో కేవలం వర్సిటీకి చెందిన వారికి మాత్రమే ఈ సేవలు అందించిన విశ్వవిద్యాలయం తాజాగా ఆ సేవలు బయటవారికి కూడా విస్తరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ వర్సిటీలోని గాంధీ భవన్, క్యాంపస్ లా సెంటర్లో ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సాయంతో (డీఎస్ఎల్ఎస్ఏ) సాయంతో వర్సిటీకి చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు మాత్రమే న్యాయ సలహాల విషయంలో ఉచిత శిక్షణను ఇస్తుంది. తాజాగా ఎవరికైనా ప్రతి శుక్రవారం మూడు గంటల నుంచి ఐదు గంటల ప్రాంతంలో ఉచితంగా న్యాయ సలహాలు, శిక్షణను ఇస్తామని పేర్కొంది. -
డీయూ విద్యార్థుల ఆందోళన
- మానవ వనరుల మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట - 40 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు న్యూఢిల్లీ: తమ సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ సమీపంలోని మానవ వనరుల మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట శుక్రవారం ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీరిలో అత్యధిక శాతం మంది స్కూల్ ఆఫ్ లెర్నింగ్ (ఎస్ఓఎల్) విభాగానికి చెందినవారే. ఈ విషయమై ఎస్ఓఎల్ కు చెందిన దినేశ్ వర్మ అనే విద్యార్థి ఒకరు మాట్లాడుతూ ‘ మొత్తం 20 తరగతులు ఉంటాయని మాకు ఇచ్చిన క ర్కిక్యులంలో ఉంది. అయితే ఇప్పటిదాకా 13 తరగతులే జరిగాయి. పరీక్షలు సమీపిస్తున్నాయి. కోర్సు ఇంకా పూర్తికాలేదు. దీంతోపాటు అపరిషృ్కత సమస్యలు అనేకం ఉన్నాయి. వాటిని ఎస్ఓఎల్ యాజమాన్యం పట్టించుకోవడం లేదు.’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా అనుమతి తీసుకోకుండానే ఆందోళనకు దిగారనే కారణంతో ఆందోళనకు దిగిన విద్యార్థుల్లో 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోయినా తమను అదుపులోకి తీసుకున్నారంటూ విద్యార్థులు ఆరోపించారు. తమను నిర్బంధంలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదన్నారు. కాగా ఈ ఆందోళనకు క్రాంతికారీ యువ సంఘటన్ సంస్థ సారథ్యం వహించింది. -
పది రోజుల్లో పంజాబీ..!
పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం కరీనా కపూర్‌కి చాలా సులువైన విషయం. అందుకు చాలా ఉదాహరణలున్నాయి. ఓ ఉదాహరణ ‘తషాన్’. ఆ చిత్రంలో స్టయిలిష్‌గా కనిపించడం కోసం జీరో సైజ్‌కి మారిపోయారు కరీనా. ఇప్పుడు ‘ఉడ్తా పంజాబీ’ చిత్రం కోసం పంజాబీ అమ్మాయిలా శారీరక భాషను మార్చుకుంటున్నారు. అలాగే, పంజాబీ భాష కూడా నేర్చుకుంటున్నారు. ముందుగా 30 రోజుల్లో పంజాబీ భాష నేర్చేసుకోవచ్చనే పుస్తకం మీద ఆమె ఆధారపడాలనుకున్నారట. కానీ, దానికి బదులు ఓ మంచి టీచర్ని నియమించుకుంటే బాగుంటుందని అనుకున్నారు. దాంతో ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన రజత్ సింగ్ అనే ప్రొఫెసర్ దగ్గర పంజాబీ పాఠాలు నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఈ పాఠాలు ఆరంభించకముందు తన స్నేహితులతో ‘చూస్తూ ఉండండి.. పది రోజుల్లో పంజాబీ భాష నేర్చేసుకుంటా’ అని సవాల్ కూడా విసిరారట. కరీనా అన్నంత పని చేస్తుందనీ, తనకంత ప్రతిభ ఉందని ఆ స్నేహితులు అంటున్నారు. ఆ సంగతలా ఉంచితే.. తన మాజీ ప్రియుడు షాహిద్ కపూర్ సరసన కరీనా ఈ చిత్రంలో నటించనున్నారు. ఈ జంట తెరపై కనిపించి దాదాపు ఏడెనిమిదేళ్లవుతుంది. సో.. ఈ చిత్రానికి భారీ ఎత్తున క్రేజ్ ఏర్పడుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
మరో వివాదంలో డీయూ వీసీ దినేష్‌సింగ్
న్యూఢిల్లీ : ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) ఉపకులపతి దినేష్‌సింగ్ మళ్లీ మరో వివాదంలో చిక్కుకుపోనున్నారు. విశ్వవిద్యాలయంలో జరిగిన అనేక కుంభకోణాల్లో సింగ్ ప్రమేయం ఉందంటూ సీపీఎం నేత సీతారాం ఏచూరి రాసిన లేఖను కేంద్ర మానవ వనరుల శాఖ... రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి పంపనుంది. కాగా నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సుపై గత ఏడాది చెలరేగిన వివాదంలో దినేష్‌సింగ్ కూరుకుపోయిన సంగతి విదితమే. రాష్ట్రపతి ఆమోదముద్ర లేనందువల్ల ఆ కోర్సును ఉపసంహరించుకోవాలంటూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ.. అప్పట్లో వీసీని ఆదేశించిన సంగతి విదితమే. తన కార్యాలయాన్ని వీసీ దుర్వినియోగం చేసిన కారణంగా విద్యార్థులు ఇబ్బందులకు గురవడమే కాకుండా, పాలనాపరంగా కూడా అనేక సమస్యలు తలెత్తాయంటూ ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపకుల సంఘం (డ్యూటా) విడుదల చేసిన శ్వేతపత్రాన్ని ...సీపీఎం నేత సీతారాం ఏచూరి తన లేఖకు జత చేశారు. -
కొత్త సభ్యుణ్ణి చేర్చుకో.. టికెట్ దక్కించుకో
* అనుబంధ సంఘాల నాయకులకు పిలుపు * పార్టీ బలోపేతం చేయడానికి బీజేపీ కొత్త ఎత్తుగడ న్యూఢిల్లీ: ఢిల్లీ పీఠాన్ని దక్కించుకొనేందుకు భారతీయ జనతా పార్టీ విశ్వప్రయాత్నాలు చేస్తోంది. ప్రచారం ఉధృతం చేయడంతోపాటు పార్టీలోకి కొత్త సభ్యులను చేర్పించడానికి బీజేపీ రాష్ర్టశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సభ్యత్వ నమోదు పెంచేందుకు అనుబంధ సంఘాల సెల్స్‌ను సమాయత్తం చేస్తోంది. ‘పార్టీలో నూతనంగా సభ్యులను చేర్పించిన సెల్ నాయకులకు అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుందని పార్టీ నాయకుడు వెల్లడించారు. పార్టీ అనుబంధ సంఘాలివే.. యువ మోర్చా, మహిళా మోర్చా, మైనార్టీ మోర్చా, పూర్వాం చల్ మోర్చాలు ఇప్పటికే ఈ మేరకు కొత్త సభ్యులను పార్టీలో చేర్పించాలని పార్టీ నిర్ణియించింది. ఈ మేరకు ఢిల్లీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఆయా సెల్‌లకు పార్టీ నిర్ణయాలను తెలియజేశారు. కొత్త సభ్యులను చేర్పించిన వారికే ప్రాధాన్యత ఉంటుందనే విషయానికి కట్టుబడి ఉండాలని, తద్వారా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేలా పాటుపడాలని పిలుపు ఇచ్చారు. ‘పార్టీలో కొత్త సభ్యులను చేర్చుకోవాలని సెల్‌లకు ఇచ్చిన టార్గెట్స్‌ను పూర్తి చేయకుంటే అసెం బ్లీ ఎన్నికల టికెట్ కేటాయింపులో ఆయా సెల్ నాయకులకు ప్రాధాన్యత ఉండదని’ కూడా హెచ్చరించినట్లు బీజేపీ ఢిల్లీ శాఖ ఆఫీస్‌బేరర్ తెలియజేశారు. నవంబర్ 1వ తేదీ నుంచి పార్టీ ప్రారంభించిన సభ్యత్వ నమోదు స్పెషల్ డ్రైవ్‌లో 16 లక్షల మంది కొత్త సభ్యులను పార్టీలో చేర్పించినట్లు చెప్పారు. వివిధ మోర్చాలకు టార్గెట్లిలా.. వివిధ సెల్‌లకు పార్టీ టార్గెట్లు నిర్ణయించింది. పూర్వాంచల్ మోర్చా జనవరి 15వ తేదీ వరకు 10 లక్షల కొత్త సభ్యులను చేర్పించాలని సూచించింది. ఇప్పటి వరకు కేవలం సభ్యత నమోదు క్యాంపెయిన్ నిర్వహించి 1 లక్ష మంది కొత్త సభ్యులను చేర్పిం చింది. మైనార్టీ మోర్చా టార్గెట్ 2లక్షల మందిని చేర్పించాల్సి ఉండగా, కేవలం 40 వేల మందిని మాత్రమే చేర్పించింది. అనధికార కాలనీల్లో పట్టుసాధించడానికి పూర్వాంచల్ మోర్చా కృషి చేస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అక్కడ కూల్చివేతలను నిలిపి వేసిన విషయం తెలిసిందే. ఇక్కడ బీజేపీకి పట్టు లభించే అవకాశం ఉండడంతో కొత్త సభ్యత్వాలను ముమ్మరం చేయాలని పార్టీ నిర్ణయించింది. మహిళా మోర్చాకు ఇచ్చిన టార్గెట్ 1.5 లక్షలు కాగా, ఇప్పటి వరకు 80,000 మందిని మాత్రమే పార్టీలో చేర్పించింది. కాలేజీ ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో సమావేశాలు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడంలో భాగంగా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులతో సమావేశాలు ఏర్పాటు చేసి, సాయంత్రం షిప్టులను నడిపించుకోవడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. అదేవిధంగా పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోపై టీచర్ల అభిప్రాయాలు, సూచనలను తెలుసుకొంటున్నారు. వారి డిమాండ్లను పార్టీ మేనిఫెస్టోలో చేర్చుతామని హామీ ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ తూర్పు, పశ్చిమ ప్రాంగణాలను ఏర్పాటు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నరెలా, నజాఫ్‌ఘర్‌లో కాలేజీలు ఏర్పాటు చేయాలని అధ్యాపకులు సూచించారు. కొత్త హాస్టల్స్, డిజిటల్ లైబ్రరరీ ఏర్పాటు చేయాలని కోరారు. విదేశీ వర్సిటీలతో తమ కాలేజీలు అనుబంధంగా ఉండడానికి అనుమతి ఇవ్వాలని ప్రిన్సిపాళ్లు ఆయనకు సూచించారు. -
నాకూ ప్రేమకథ ఉంది!
అర్జున్.. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాల్లో చురుకైన స్టూడెంట్. రూపాలీ.. మహిళలపై హింసకు వ్యతిరేకంగా ఉద్యమించే యువతి. వీరిద్దరూ ప్రేమలో పడతారు. వారి కథే ‘యువర్ డ్రీమ్స్ ఆర్ మైన్ నౌ’. దీని రచయిత రవీందర్‌సింగ్. ఇటీవల సిటీలో జరిగిన ఈ పుస్తకావిష్కరణకు వచ్చిన ఆయనను సిటీప్లస్ పలకరించింది. వివరాలు ఆయన మాటల్లోనే.. - వాంకె శ్రీనివాస్ హైదరాబాద్‌లోనే ఎంబీఏ.. నేను పుట్టింది కోల్‌కతా. పెరిగింది ఒడిశాలోని బుర్లా. కర్ణాటకలోని బీదర్‌లో ఇంజనీరింగ్ చదివా. హైదరాబాద్‌లోని ఐఎస్బీ నుంచి ఎంబీఏ చేశా. పుణేలోని ఓ ఐటీ కంపెనీలో నా జాబ్ కెరీర్‌ను మొదలెట్టా. అప్పుడే మాట్రిమోనియల్ వెబ్సైట్ షాదీ.కామ్ ద్వారా ‘ఖుషీ’తో పరిచయం ప్రేమగా మారింది. 2007, ఫిబ్రవరి 9న చివరి రోజు ఉద్యోగం చేసిన ఆమె ఇంటికి బయలుదేరిన క్యాబ్‌ను వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఫిబ్రవరి 14న మా ఎంగేజ్మెంట్. ఆ టైంలో ఇలా జరగడం నన్ను కోలుకోనివ్వలేదు. భువనేశ్వర్‌లో ఫ్రెండ్‌తో కలిసి ఉన్న సమయంలో ఓ పుస్తకం చదువుతుండగా...నాకూ బుక్ రాయాలనిపించింది. ఫ్రెండ్‌తో చెప్పా. అలా నా తొలి పుస్తకం ‘ఐ టూ హడ్ ఏ లవ్‌స్టోరీ’ సంచలనం సృష్టించింది. ఆ తర్వాత... కెన్ లవ్ హాపెన్ టై్వస్, లైక్ ఇట్ హంపెండ్ యెస్టర్డే పుస్తకాలు కూడా భారీగానే అమ్ముడుపోయాయి. ఇప్పుడు ఇదే కోవలో...కాస్త విభిన్నంగా ‘యువర్ డ్రీమ్స్ ఆర్ మైన్ నౌ’ పుస్తకాన్ని తీసుకొచ్చా. ఢిల్లీ యూనివర్సిటీలో జరిగే స్టూడెంట్ రాజకీయాలను వివరిస్తూనే.. ఓ యువకుడు, యువతి మధ్య సాగిన ప్రేమాయణాన్ని కథాంశంగా ఎంచుకొని ముందుకెళ్లా. అర్జున్, రూపాలీ పేర్లను కామన్‌గా ఎంచుకున్నా. ఫేస్బుక్లో చివరి ఐదుగురు స్నేహితుల్లో ఇద్దరి పేర్లను ఈ కథకు ఎన్నుకున్నా. దేశాన్ని కుదిపేసిన ‘నిర్భయ’ ఉద్యమమే నన్ను ఈ కథవైపు మళ్లించింది. నా తొలి మూడు పుస్తకాల మాదిరే ఈ బుక్కీ ఆదరణ లభిస్తుందనుకుంటున్నా. సిటీ బ్యాక్‌డ్రాప్‌తో త్వరలో పుస్తకం హైదరాబాద్‌లో నా కథలకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సిటీతో నాకు మంచి అనుబంధం ఉంది. భవిష్యత్‌లో సిటీని వేదికగా చేసుకొని పుస్తకం తీసుకొస్తాను. ఉద్యోగం చేస్తూనే పుస్తకాలు రాసేంత తీరిక ఎలా దొరుకుతుందని చాలామంది నన్నడుగుతుంటారు. మహిళలు ఉద్యోగాలు చేస్తూనే ఇంటికెళ్లి పిల్లలు, కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వాళ్లనే స్ఫూర్తిగా తీసుకొని రచనకు సమయం వెచ్చిస్తున్నా. అయితే నా తొలి పుస్తకం ‘ఐ టూ హాడ్ ఏ లవ్‌స్టోరీ’ రాస్తున్నప్పుడు ఏడ్చిన సందర్భాలున్నాయి. ఆ కథ ఎన్నో లక్షల మంది హృదయాలను తాకింది. రాజకీయాలపై నాకు పెద్దగా ఆసక్తి లేదు. వీలు చిక్కితే క్రికెట్ ఆడుతుంటా. సినిమాలూ చూస్తుంటా. -
రేపిస్టుకు రెండేళ్లపాటు శిక్ష తగ్గింపు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన దౌలాఖాన్ సామూహిక లైంగిక దాడికేసులో నిందితులకు రెండేళ్లపాటు శిక్షను తగ్గిస్తూ ఢీల్లీ హైకోర్టు శనివారం తీర్పు చెప్పింది. 2005లో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినిపై నడుస్తున్న కారులో నిందితులు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటనలో ట్రయల్ కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించగా, ఈ శిక్షను 12 ఏళ్లకు తగ్గించింది. ఈ కేసులో నిందితుడు అజిత్ సింగ్ కత్యార్కు జైలు శిక్షతోపాటు రూ. 20,000లను విధిస్తూ డిసెంబర్ 9, 2005లో ట్రయల్ కోర్టు తీర్పు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ నిందితుడు న్యాయవాది ద్వారా హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ప్రతిభా రాణి కేసు పూర్వాపరాలను పరిశీలించి శిక్షను తగ్గించాలని ఆదేశించింది. ఈ కేసులో నేరస్తుడు క్రూరంగా ప్రవర్తించినట్లు ఎలాంటి ఆధారాలు చూపలేదని పేర్కొన్నారు. అంతేగాక సహనిందితులైన మరో ముగ్గురిని పోలీసులు ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. ఒకే నిందితుడికి ఈ శిక్షను ఎలా అమలు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. -
కులాంతర వివాహం చేసుకుందని.. పీక పిసికేశారు!
దేశరాజధాని ఢిల్లీలో అత్యంత ఘోరమైన ఘటన జరిగింది. కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ప్రతిష్ఠాత్మక వెంకటేశ్వర కాలేజిలో చదువుతున్న తమ 21 ఏళ్ల కూతురిని కన్న తల్లిదండ్రులే పీక పిసికి చంపేశారు. ఇందుకు వాళ్ల బంధువు కూడా సహకరించారు. తర్వాత మృతదేహాన్ని తమ గ్రామానికి తీసుకెళ్లి అక్కడ కప్పెట్టేశారు. దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి, స్థానిక కాంగ్రెస్ కార్యకర్త అయిన జగ్మోహన్, ఆయన భార్య సావిత్రిలను పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ల కూతురు భావన (21) ఈనెల 12వ తేదీన ఆర్యసమాజంలో అభిషేక్ సేఠ్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. అతడు కేబినెట్ సెక్రటేరియట్లో అసిస్టెంట్ ప్రోగ్రామర్‌గా పనిచేస్తున్నాడు. భావన రాజస్థానీ యాదవ కులానికి చెందినది కాగా, అభిషేక్ పంజాబీ. ఆమెను క్షమించేశామని, పద్ధతిగా పెళ్లి చేస్తామని పిలిపించి మరీ భావనను చంపేశారని పోలీసులు తెలిపారు. వారిపై పక్కా సాక్ష్యాలు ఉండటంతో తల్లిదండ్రులను అరెస్టు చేశామన్నారు. -
ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థిని ఆత్మహత్య
న్యూఢిల్లీ: నడుస్తున్న రైలు కిందపడి ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ విద్యార్థిని (20) ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానిక రేస్ కోర్సు మెట్రో స్టేషన్లో ఎల్లో మార్గం మంగళవారం సాయంత్రం గం. 3.45 నిమిషాలకు చోటుచేసుకుంది. రెండో నంబర్ ప్లాట్‌ఫాంకు చేరుకున్న విద్యార్థిని అప్పుడే స్టేషన్‌కు వచ్చిన విద్యార్థిని హుడా సిటీ సెంటర్ స్టేషన్ నుంచి జహంగీర్‌పుర దిశగా వెళుతున్న రైలును గమనించి వెంటనే పట్టాలపైకి దూకింది. తీవ్రగాయాలపాలైన బాధితురాలిని సమీపంలోని రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారని రైల్వే శాఖ డీసీపీ సంజయ్ భాటియా తెలిపారు. అయితే ఈ చర్యకు గల కారణాలను నిర్ధారించాల్సి ఉందన్నారు. ఘటనాస్థలిలో తమకు ఎటువంటి సూసైడ్ నోటూ లభించలేదన్నారు. మృతురాలిని నైరుతి ఢిల్లీలోని నజఫ్‌గఢ్‌కు చెందిన మూర్తజాగా గుర్తించామన్నారు. కాళింది కళాశాలలో బీఏ చివరి సంవత్సరం చదువుతోందన్నారు. ఇందుకు సంబంధించిన గుర్తింపు కార్డు మృతురాలి దుస్తుల్లో లభించిందన్నారు. కాగా ఈ ఘటన కారణంగా ఎల్లో మార్గంలో రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.