బొగ్గు కేటాయింపుల కుంభకోణంలో మరో ఎఫ్ఐఆర్! | Fresh FIR registered in coal blocks case | Sakshi
Sakshi News home page

బొగ్గు కేటాయింపుల కుంభకోణంలో మరో ఎఫ్ఐఆర్!

Published Fri, May 9 2014 8:52 PM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM

Fresh FIR registered in coal blocks case

న్యూఢిల్లీ: బొగ్గు కేటాయింపుల కుంభకోణంలో ముంబైకి చెందిన టాప్ వర్త్ ఉర్జా అండ్ మెటల్ లిమిటెడ్ కంపెనీపై తాజాగా ఎఫ్ఐఆర్ ను సీబీఐ దాఖలు చేసింది. ఈకేసులో ముంబైకి చెందిన కంపెనీ డైరెక్టర్, ఇంకా గుర్తు తెలియని వ్యక్తులను దోషులగా చేర్చింది. 1993-2005లో జరిగిన బొగ్గు కేటాయింపుల వ్యవహారంలో సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.
 
ఈ కేసులో ఆ కంపెనీ డైరెక్టర్ సురేంద్ర లోధా, మరో డైరెక్టర్ ఓంప్రకాశ్ నెవాతియాలపై ఇండియన్ పీనల్ కోడ్ 120, 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. గతంలో ఈ కంపెనీని విరంగణ స్టీల్ గా పిలువబడేది. ఇటీవల ఈ కంపెనీకి చెందిన నాగపూర్, యవత్మల్, ముంబైలోని కార్యాలయాలపై సీబీఐ దాడులు నిర్వహించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement