Moists
-
గడ్చిరోలి: మావోయిస్టులకు భారీ దెబ్బ
సాక్షి, గడ్చిరోలి: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మంగళవారం(మార్చి 19) తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్ట్ అగ్రనేతలు మృతి చెందారు. మిగిలిన మావోయిస్టుల కోసం పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. గడ్చిరోలిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డప్పుడు కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. చనిపోయిన వారంతా మావోయిస్టు అగ్రనేతలని.. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులని అధికారులు ధృవీకరించారు. మంచిర్యాల డివిజన్ కమిటీ సెక్రటరీ వర్గీస్, చెన్నూరు ఏరియా కమిటీ సెక్రటరీ మగ్తూ, కుర్సంగ్ రాజు, కుడిమెట్ట వెంకటేశ్ ఉన్నారు. ఇదిలా ఉంటే.. కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టులపై రూ. 36 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదీ చదవండి.. ప్రాణం పోస్తారనుకుంటే తీశారు -
ఏవోబీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో మావోయిస్టుల దుశ్చర్యకు పాల్పడ్డారు. మంగళవారం మావోయిస్ట్‌లు రెండు వాహనాలను దగ్ధం చేశారు. ఈ ఘటన ఒడిశాలోని మల్కన్ గిరిజిల్లా పప్పర్లమెట్ట అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. దీంతో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దీంతో విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యి ఏవోబీ ప్రాంతంలో నిఘాను పెంచారు. ఏవోబీ వద్ద మావోయిస్ట్‌లకు చెందిన భారీ డంప్‌ను ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన ఎస్‌వోజీ, బీఎస్ఎఫ్ పోలీసులు సంయుక్తంగా మావోయిస్ట్‌ల కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో కటాఫ్ ఏరియాలోని జొడొంబో పోలీసుస్టేషన్ పరిధిలోని ముకిడిపల్లి, గురుసేతు, బెజ్జింగి, జంపలూరు, పర్లుబంద గ్రామాల్లో సంయుక్తంగా గాలింపు చర్యలు నిర్వహిస్తుండగా, మావోయిస్టులు దాచి ఉంచిన డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఒక దేశీయతుపాకీ, క్లైమెర్‌మెన్,వైర్, మూడు రంగుల్లో ఉన్న పేలుడు సామాగ్రీ, ఎనిమిది ఎలక్ర్టిక్ డిటోనేటర్లు , ఆక్సిజన్ సిలిండర్, కెమెరాఫ్లాష్, ఇనుపపైపులు, వైరు, మావోయిస్టు విప్లవసాహిత్యంకు సంబంధించిన వాటిని ఒడిశా పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. చదవండి: సినీ నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్టు -
సీరియస్‌గా ఉన్న డీజీపీ, వారే టార్గెట్
సాక్షి,కొమరం భీం (ఆదిలాబాద్): అసిఫాబాద్ జిల్లాలో పోలీసులు భారీ స్థాయిలో కూంబింగ్ నిర్వహించారు. కేబీఎమ్ కమిటీ కార్యదర్శి భాస్కర్ నేతృత్వంలోని మావోయిస్టులే టార్గెట్‌గా పోలీసులు దీనిని చేపట్టారు. ఇటీవలే రెండు సార్లు మావోయిస్ట్‌లు తప్పించుకోవడంపై డీజీపీ మహేందర్ రెడ్డి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో డీజీపీనే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థిని సమీక్షిస్తున్నారు. పోలీస్ బాస్ డీజీపీతో పాటు అధికారులు, ఇంటెలిజెన్స్ బృందాలు నాలుగురోజులుగా అసిఫాబాద్‌లోనే మకాం వేశారు. చదవండి: మావోయిస్టులను గట్టి దెబ్బ కొడతాం: డీజీపీ -
మావోయిస్టులను తరిమేస్తాం: ఎస్పీ హెచ్చరిక
సాక్షి, కొమురం భీం, ఆసిఫాబాద్: మావోయిస్టులను జిల్లా అటవీ ప్రాంతం నుంచి తరిమి వేస్తామని, వారి ఆగడాలను తిప్పి కొట్టేందుకు పోలీసు దళాలు విస్తృత చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ విష్ణు వారియర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికైనా మావోయిస్టులు తమ తీరును మార్చుకుని ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. వెంటనే లొంగిపోయిన వారికి అన్ని విధాలా జీవనోపాధికి సహకరిస్తామని, కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించవచ్చని పేర్కొన్నారు. మావోయిస్టులకు ప్రజలు ఎవరు సహకరించవద్దని, వారి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు. సమాచారం తెలిపిన వారికి వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు వారికి తగిన బహుమతులు ఇస్తామని పేర్కొన్నారు. ఈనెల 25న తెలంగాణ బంద్ ములుగు జిల్లా వెంకటాపురం మండలం విజయపురి కాలనీ చర్ల- వెంకటాపురం ప్రధాన రహదారిపై పట్టపగలే వెలిసిన మావోయిస్టులు పోస్టర్లు కలకలం రేపాయి. తెలంగాణ రాష్ట్ర కమిటీ సిపిఐ మావోయిస్టు పేరుతో వెలసిన ఈ పోస్టర్లలో.. విరసం నేత వరవరరావు, వికలాంగుడైన సాయిబాబాలతో పాటు మిగతా 12 మందిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. వారిపై పెట్టిన కేసులని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. అంతేకాకుండా అడవుల నుంచి గ్రేహాండ్స్ బలగాలను ప్రభుత్వం తక్షణమే ఉప సంహరించుకోవాలని లేఖలో పేర్కొన్నారు. -
మావోయిస్టుల ప్రతీకారేచ్ఛ..!
‘‘పూజారి కాంకేర్ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం ఉంటుంది. నెత్తుటి బాకీ తీర్చుకుంటాం. అమరులైన వీరులకు నివాళులర్పిస్తాం...’’ ఇది, మార్చి 3న, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ చేసిన హెచ్చరిక (ఆడియో టేప్). అంతకు ముందు రోజు (మార్చి 2న) మన రాష్ట్ర సరిహద్దులోగల ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారికాంకేర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో పదిమంది మావోయిస్టులు మృతిచెందారు. ఒక జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న మావోయిస్టులు అన్నంత పని చేస్తున్నారు. హత్యాకాండ సాగిస్తూనే ఉన్నారు. చర్ల : ఇప్పటికి 12. పూజారి కాంకేర్ ఎన్కౌంటర్ తరువాత మావోయిస్టుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇది. ఇందులో పదిమంది జవాన్లు, ఇద్దరు సామాన్యులు. పూజారి కాంకేర్ ఎన్‌కౌంటర్‌కు కారకులని ఆరోపిస్తూ, చర్ల మండలంలోని పూసుగుప్ప గ్రామస్తుడు ఇర్పా లక్ష్మణ్ అలియాస్ భరత్‌ను, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఊసురు పోలీస్ స్టేషన్ పరిధిలోగల చినఊట్లపల్లికి చెందిన సోడి అందాల్ అలియాస్ నందు అలియాస్ రఘును మావోయిస్టులు బుధవారం సాయంత్రం చంపేశారు. అక్కడ లేఖలు వదిలారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ హెచ్చరించిన మూడో రోజునే హత్యాకాండ మొదలైంది. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా దోర్నపాల్ సమీపంలో నాలుగు బస్సులను దహనం చేశారు. ఓ బస్సులో ప్రయాణిస్తున్న కానిస్టేబుల్‌ను చంపేశారు. మార్చి 13న మరో దారుణానికి తెగబడ్డారు. ఇదే జిల్లాలోని కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోగల పాలోడు బేస్ క్యాంపునకు జవాన్లు వెళుతున్న మైన్ ప్రూఫ్ వాహనాన్ని మందుపాతరలతో పేల్చివేశారు. ఈ దాడిలో తొమ్మిదిమంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, బీజాపూర్ జిల్లాలోని చినఊట్లపల్లి గ్రామ సమీపంలోగల తాలిపేరు వాగు వద్ద పూసుగుప్పకు చెందిన ఇర్పా లక్ష్మణ్ అలియాస్ భరత్‌ను, చినూట్లపల్లికి చెందిన సోడి అందాల్ అలియాస్ నందు అలియాస్ రఘును చంపేశారు. దీంతో, ఎన్కౌంటర్ తరువాత మావోయిస్టులు చంపిన వారి సంఖ్య 12కు చేరింది. రాష్ట్ర సరిహద్దుల్లో బలగాలు కూంబింగ్ సాగిస్తున్నాయి. మావోయిస్టులు కూడా ఇలా హత్యలు, ఇతరత్రా దుశ్చర్యలు (బస్సులు, లారీలు, జేసీబీలు, పొక్లెయిన్లు, కాంక్రీట్ మిల్లర్లను దహనం చేయడం) సాగిస్తూనే ఉన్నారు. ఎన్కౌంటర్లు, ప్రతీకార దాడులు, హత్యల నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతందోనని ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్‌గఢ్ సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు తీవ్ర భయాందోళనతో ఉన్నారు. బలగాలు ఒకవైపు విస్తృతంగా కూంబింగ్ సాగిస్తుండగానే, మావోయిస్టులు మరోవైపు హత్యలు–దుశ్చర్యలకు దిగుతుండడంతో తీవ్ర ఆందోళన–అయోమయం నెలకొంది. పూజారి కాంకేర్ ఎన్కౌంటర్ జరిగిన నెల కూడా పూర్తవలేదు. ఇంతలోనే 12మందిని మావోయిస్టులు బలిగొన్నారు. మున్ముందు ఇంకెంతగా రెచ్చిపోతారో.. ఎవరెవరిని బలి గొంటారో.. సరిహద్దుల్లో సర్వత్రా ఇదే చర్చ. -
మావోల అణచివేతకు కుట్ర
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి కటాఫ్ ఏరియాలోని డిగిజాన్‌బాయి, పెపర్‌మెట్ల, తదితర గ్రామాల్లో సీపీఐ మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లోని గ్రామాల్లో గురు, శుక్రవారాల్లో దినోత్సవం జరుపుకున్నారు. పలుచోట్ల మావోల బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. ఆదివాసీలను చైతన్యం చేసేందుకు గ్రామాల్లో జననాట్య మండలి వారిచే గీతాలు ఆలపించే కార్యక్రమాలు మావోలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గిరిజనులకు అవగాహన కల్పించేందుకు సభలు ఏర్పాటు చేస్తున్నారు. మావో అగ్రనేతలు మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో దళారి, దోపిడీ వ్యవస్థలు ఉండకూడదన్నారు. దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, వారికి తగిన బుద్ధి చెప్పాలని చూసించారు. కొండ ప్రాంతాల్లో ఖనిజ సంపదలు దోచుకునేందుకు ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని, ఇటువైపు కన్నెత్తి చూడకుండా మిగతా గిరిజనులు ఆందోళనలు చేపట్టాలని కోరారు. కొండలను, అడవులను నాశనం చేస్తే ఆదివాసీల జీవనం దుర్భరంగా మారుతాయని ఆవేదన చెందారు. అలాగే మావోలను ఆణచివేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జవాన్లతో ముమ్మరంగా కూంబింగ్‌లు జరుపుతున్నాయని తెలిపారు. సుమారు 8 వేల మంది బీఎస్ఎఫ్ జవాన్లు, సీఆర్పీఎఫ్ జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తున్నారన్నారు. వీరికి పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు చేపడుతున్నారని, కాని గిరిజనులను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వాపోయారు. అధిక ఆదివాసీ గ్రామాలకు రోడ్డు సదుపాయం లేకపోవడం దారుణమన్నారు. తాగునీటి సదుపాయం అంతంతమాత్రమేనని, మురుగుకాలువలు పూర్తిగా లేవని పేర్కొన్నారు. రోడ్లు, విద్య, ఆరోగ్యం, తాగునీరు అందించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాని చెప్పారు. కొండకోనల్లో గిరిజనులు దుర్భర జీవనం సాగిస్తున్నారని, కూంబింగ్‌కు వచ్చిన జవాన్లు ఆదివాసీలపై దాడులు చేస్తున్నారని ఆవేదన చెందారు. పలువురిని మావో ఇన్ఫార్మర్లుగా చేసి హతమార్చుతున్నారని ఆరోపించారు. జవాన్ల చర్యలను గిరిజనులు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. విప్లవం వర్థిల్లాలని, దోపిడీ అరికట్టాలని కోరారు. మల్కన్‌గిరి జిల్లాలో వేలమంది జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తున్నా మావోలు తమ ఉనికిని చాటుకుంటున్నారని మావో అగ్రనేతలు తెలిపారు. ఈ సభలకు మావోయిస్టు అగ్రనేతలు ఉదయ్, తదితరులు పాల్గొన్నారు. సభల్లో అధిక సంఖ్యలో గిరిజనులు, మావో చిన్న కేడర్ పాల్గొన్నారు. -
అడవిలో అలజడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పశ్చిమ ఏజెన్సీలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలను విస్తృ తం చేశారు. గ్రేహౌండ్స్, జిల్లా స్పెషల్ పార్టీ, ఏపీఎస్పీ బలగాలు బృందాలుగా విడిపోయి అన్నల జాడ కోసం అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. బుట్టాయగూడెం, పోలవరం మండలాల్లోని అటవీ ప్రాంతంలో ఈ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. నక్సల్బరీ ఉద్యమం మొదలై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిం చేందుకు మావోయిస్టులు నిర్ణయించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వారోత్సవాలను కచ్చితంగా జరపాలని మావో యిస్ట్ కేంద్ర, రాష్ట్ర కమిటీల నుంచి ఆదేశాలు అందడంతో ఆ పార్టీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఇటు ఛత్తీస్గడ్ వైపు నుంచి, అటు తూర్పు, విశాఖ జిల్లాల నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోని అటవీ ప్రాంతం మీదుగా మావోయిస్టులు సంచరించే అవకాశం ఉన్నందున పోలీస్ శాఖ అప్రమత్తమైంది. నక్సల్బరీ ఉద్యమం 50 ఏళ్ల ప్రస్థానం నేపథ్యంలో ఎక్కడికక్కడ ఉత్సవాలు జరపాలంటూ ఇటు తూర్పు గోదావరి జిల్లా చిం తూరు, అటు ఖమ్మం జిల్లా భద్రాచలంలో మావోయిస్ట్ పార్టీ నేతలు ఇప్పటికే పోస్టర్లు వేశారు. ఆంధ్రా–ఒడిశా బోర్డర్ (ఏఓబీ)లో ఇటీవల వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటోంది. ఛత్తీస్‌గఢ్, ఖమ్మం జిల్లా సరిహద్దుతోపాటు ఇటు విశాఖ జిల్లా ఏఓబీ సరిహద్దులో ఎన్కౌంటర్లు జరగటం.. తూర్పుగోదావరి జిల్లాల్లో మావోయిస్టులు వివిధ ఘటనలకు పాల్పడిన నేపథ్యంలో పోలీసులు వారిని ఎదుర్కొనేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. మరోవైపు ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్ భద్రత విషయంలోనూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అక్కడ గ్రేహౌండ్స్ బలగాలను మోహరించారు. ఇదిలావుంటే.. నక్సల్బరీ ఉద్యమ వారోత్సవాల నేపథ్యంలో రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మావోయిస్ట్ పార్టీలోకి చంద్రన్న వర్గం! ఇదిలావుంటే మొన్నటివరకు ‘పశ్చిమ’ ఏజెన్సీలో సంచరిం చిన న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లిన నేపథ్యంలో ఆ వర్గం మావోయిస్ట్ పార్టీలో విలీనం కాబోతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రా–ఒడిశా బోర్డర్లో చంద్రన్న వర్గానికి చెందిన రాష్ట్ర కమిటీ సభ్యుడు గోపన్న మావోయిస్ట్ నేతలతో చర్చలు జరిపినట్టు ఇప్పటికే ప్రకటించారు. దీంతో చంద్రన్న వర్గం మావోయిస్ట్ పార్టీలో విలీనం కాబోతోందనే అభిప్రాయం పోలీసు వర్గాల్లో ఉంది. అంతేకాకుండా చంద్రన్న వర్గం సైతం నక్సల్బరీ వారోత్సవాల్లో పాల్గొంటోంది. మరోవైపు తెలంగాణ మావోయిస్ట్ కమిటీ పాపికొండల్లో దళాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అలాగే ఖమ్మం, కృష్ణా జిల్లాల సరిహద్దులోనూ దళాలను నెలకొల్పేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా అశ్వారావుపేట, సత్తుపల్లి ప్రాంతాల్లో పార్టీ కమిటీలను నియమించనున్నట్టు చెబుతున్నారు. మరోవైపు గతంలో న్యూడెమోక్రసీ, జనశక్తి పార్టీల్లో అంకిత భావంతో పనిచేసిన వారిని సైతం తమ పార్టీలోకి ఆహ్వానించాలని మావోయిస్టులు నిర్ణయించినట్టు భోగట్టా. ఇదిలావుంటే జనశక్తి రాజన్న వర్గం కోస్తా జిల్లాల్లో పుంజుకోవడం పోలీసు వర్గాలను కలవరపాటుకు గురి చేస్తోంది. ఇటీవల రాజన్న బుట్టాయగూడెం, పోలవరం మండలాల్లో రహస్యంగా పర్యటించి నట్టు తెలుస్తోంది. ఒకవైపు పోలవరం ప్రాజెక్ట్ భద్రత, మరోవైపు నక్సల్బరీ ఉద్యమం వారోత్సవాలు, ఎన్కౌంటర్ల నేపథ్యంలో జిల్లా పోలీస్ ప్రత్యేక బలగాలు అడవిని జల్లెడ పట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. పోలవరంలో భారీ భద్రత పోలవరం : మావోయిస్టుల కదలికల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో భారీభద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏపీ ఎస్పీకి చెందిన 70 మంది, గ్రేహౌండ్స్‌కు చెందిన 30 మంది పోలీసులు ప్రాజెక్ట్ ప్రాంతానికి భద్రత కల్పిస్తున్నారు. గ్రేహౌండ్స్ పోలీసులు ప్రాజెక్ట్ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నారు. ఇదిలావుంటే.. ప్రాజెక్ట్ ప్రాంతంలో 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, 800 మంది పోలీసుల్ని అదనంగా తీసుకు రావాలని ప్రతిపాదన చేశారు. ప్రాజెక్ట్ వద్ద భద్రత ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇటీవల పోలీస్ ఉన్నతాధికారులు తమ శాఖకు చెందిన ఒక ఉద్యోగికి రివాల్వర్ ఇచ్చి అక్కడకు పంపినట్టు సమాచారం. ఆ ఉద్యోగి రివాల్వర్‌తో ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో తిరిగినా కాంట్రాక్ట్ ఏజెన్సీ భద్రతా విభాగం, అక్కడి అధికారులు పట్టించుకోలేదని సమాచారం. -
రామన్న నేతృత్వంలో అంబుష్?
దుమ్ముగూడెం (భద్రాచలం) : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు నేతృత్వం వహిస్తున్న దండకారణ్య కార్యదర్శి రామన్న నేతృత్వంలోనే మావోయిస్టులు సీఆర్పీఎఫ్ బలగాలపై విరుచుకుపడుతున్నట్లు తెలుస్తోంది. 40 సంవత్సరాల క్రితం దండకారణ్యంలోకి ప్రవేశించిన రామన్న కీలకనేతగా ఎదుగుతూ వచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పదేళ్లుగా సల్వాజుడుం, కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దింపి విస్తృత కూంబింగ్‌లు చేపట్టింది. దీంతో మావోయిస్టుల మనుగడ దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో వారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ దాడులకు దిగుతున్నారు. ఆరు సంవత్సరాల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా చింతలనార వద్ద మావోయిస్టులు వ్యూహాత్మకంగా దాడి చేసి కూంబింగ్‌కు వచ్చిన 72 మంది సీఆర్పీఎఫ్ బలగాలను హతమార్చారు. ఇందులోనూ రామన్నే ప్రధాన పాత్ర పోషించినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. కాగా అప్పటి నుంచి చిన్న చిన్న దాడులు చేస్తూ ఒకరిద్దరు సీఆర్పీఎఫ్ బలగాలను హతమార్చుతున్నారు. అయినప్పటికీ ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సరిహద్దు జిల్లాల పోలీసులు ప్రణాళికాబద్ధంగా మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా రంగంలోకి దిగారు. మూడేళ్ల నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని ధర్మపేట, గొల్లపల్లి, ఎలకనగూడెం, దుమ్ముగూడెం మండల సరిహద్దులోని పైడిగూడెం, గౌరారం గ్రామాల్లో సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పని చేస్తున్నారు. దీంతో మావోల షెల్టర్ జోన్‌గా ఉన్న దండకారణ్యం కాస్త పోలీసుల చేతిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. సీఆర్పీఎఫ్ బలగాలు క్యాంపుల ద్వారా గ్రామస్తులకు వివిధ రకాల వస్తువులు అందజేయడంతో పాటు యువకులకు క్రీడా సామగ్రి ఇస్తూ వారిని ఆకర్షిస్తున్నారు. మావోయిస్టులు మాత్రం వ్యూహాత్మకంగా వారి రహస్య ప్రదేశాలకు చేరుకుని పోలీసులపై దాడులకు దిగుతున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో మార్చి 11న బెర్జి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు నిర్మాణ పనులు తనిఖీ చేస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలపై దాడి చేసి 12 మందిని హతమార్చడంతో పాటు వారి వద్ద ఉన్న తుపాకులను తీసుకెళ్లారు. అనంతరం సోమవారం చింతగుప్ప, బుర్కిపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు నిర్మాణ పనులు చేయిస్తున్న బలగాలపై మావోయిస్టులు అంబూష్ వేసి 26 మందిని హతమార్చారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చింతలనార ఘటన తర్వాత ఇదే పెద్ద సంఘటనగా పోలీసులు భావిస్తున్నారు. మావోల దాడులు తిప్పి కొట్టేందుకు పోలీసులు వ్యూహాత్మక చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
ఇన్ఫార్మర్ నెపంతో సేల్స్‌మెన్‌ను హతమార్చారు
సుక్మా(ఛత్తీస్‌గఢ్): సేల్స్‌మెన్‌గా జీవనం సాగిస్తున్న యువకున్ని..ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హతమార్చారు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లోలోని దోర్నపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కర్రిగుండం గ్రామానికి చెందిన చంద్రకుమార్‌ను మావోయిస్టులు ఇన్ఫార్మర్ నెపంతో కాల్చి చంపారు. -
మావోయిస్టుల పేరుతో దందా.. అరెస్ట్
పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీ పరిధిలోని గోపాలపురం మండలం దొండపుడిలో మావోయిస్టుల పేరుతో ఇద్దరు వ్యక్తులు వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకుంటుండగా వారిలో ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారయ్యాడు. వారు ఇంతకు ముందే డబ్బులు డిమాండ్ చేశారని వ్యాపారి తెలిపాడు. పశ్చిమ ఏజెన్సీలో ఇటీవలి కాలంలో మళ్లీ మావోయిస్టుల కదలికలు కనిపిస్తున్నాయి. దాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది ఇలా మావోయిస్టుల పేర్లతో వసూళ్లకు కూడా పాల్పడుతున్నారు. అలాంటి గ్యాంగునే పోలీసులు ఇప్పుడు పట్టుకున్నారు. -
విశాఖలో మావోలను చంపిన గ్రామస్థులు!
బలవం: విశాఖపట్నం జిల్లా బలవం పంచాయితీ పరిధిలోని గున్నమామిడి సెంటర్ లో ఆదివారం సాయంత్రం దారుణం చోటు చేసుకుంది. గిర సింహాచలం అనే వ్యక్తిని హత్య చేసేందుకు చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకోవడమే కాకుండా మావోలపై తిరుగుబాటు చేశారు. ఈ ఘటనలో సింహాచలంను చేతులు కట్టేసి తీసుకువస్తుండగా.. కోరుకొండ వద్ద మావోలు శరత్, నాగేశ్వరరావు, గణపతి, ఆనంద్ లను స్థానికులు అడ్డకున్నారు. స్థానికులు తిరగబడి శరత్, గణపతిని రాళ్లతో కొట్టి గ్రామస్థులు చంపారు. ఈ ఘటన నుంచి మావోయిస్టు ఆనంద్ తప్పించుకుని అక్కడి నుంచి పరారైనట్టు పోలీసులు తెలిపారు. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో సుమారు 500 మంది గ్రామస్థులు పాల్గొన్నారు. -
నల్లగొండలో గ్యాంగ్ వార్, మాజీ మావోపై కాల్పులు
-
నల్లగొండలో గ్యాంగ్ వార్, మాజీ మావోపై కాల్పులు
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో మాజీ మావోయిస్టుల మధ్య గ్యాంగ్‌వార్ ఊపందుకుంది. వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెంలో మాజీ మావోయిస్టు శంకర్‌పై సోమవారం సాయంత్రం ఆగంతకులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన శంకర్ పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. శంకర్ బెక్‌పై వెళ్తుండగా ప్రదీప్‌రెడ్డి కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు. గతంలో నయిమ్ గ్యాంగ్ కాల్పుల్లో మరణించిన కొనపురి రాములుకు ప్రదీప్‌రెడ్డి ప్రధాన అనుచరుడుగా ఉన్నారు. -
నల్లమలలో అలజడి
అడవిని జల్లెడ పడుతున్న పోలీసులు గురువారం జరిగిన ఎన్కౌంటర్ల నేపథ్యంలో భారీ కూంబింగ్ ఎన్కౌంటర్లో ముగ్గురుమవోయిస్టులు మృతి..! గాయాలతో తప్పించుకున్న విక్రమ్ కోసం గాలింపు ముమ్మరం అప్రమత్తమైన గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల పోలీసులు హడలిపోతున్నజాప్రతి నిధులు,రాజకీయ నాయకులు గుంటూరు : నల్లమల అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. గుంటూరు జిల్లా సరిహద్దుల్లోని ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం సతకోడు గ్రామ శివారుల్లో గురువారం పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్ట్‌లు మృతి చెందడం తీవ్ర సంచలనం రేకెత్తించింది. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కమిటీ సభ్యుడు జాన్ బాబూరావుతోపాటు విమల, భారతి అలియాస్ నిర్మల అనే ముగ్గురు మావోయిస్ట్‌లు మృతిచెందారు. పదేళ్ల తర్వాత గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్ కావడంతో మావోయిస్ట్‌లకు పోలీసులు పెద్ద దెబ్బ కొట్టినట్లేనని చెప్పవచ్చు. కొంత కాలంగా నల్లమలలో మావోయిస్ట్‌ల కదలికలు ప్రారంభమయ్యాయనే వదంతులను పోలీసు ఉన్నతాధికారులు కొట్టిపారేస్తూ వచ్చారు. ఈ నెల 9వ తేదీన ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘నల్లమలలో మావోయిస్ట్ కదలికలు’ అనే కథనం ప్రచురితమయింది. గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌తో ‘సాక్షి’ కథనం అక్షరాల నిజమయింది. ఈ నెల 8వ తేదీన గుంటూరులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన సభలో సైతం పోలీసులు మావోయిస్ట్‌ల ఫొటోలతో కూడిన బ్యానర్లు పెట్టడం ఇందుకు నిదర్శనం. గుంటూరు పోలీసులు నల్లమల అటవీప్రాంతంలో కూంబింగ్ సాగిస్తున్న తరుణంలో ప్రకాశం జిల్లా బోర్డర్లో గురువారం మావోయిస్ట్‌లు అకస్మాత్తుగా తారసపడి పోలీసులపై ఎదురు కాల్పులకు దిగడంతో అప్రమత్తమైన పోలీసులు కూడా కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో డీజీపీ ఆదేశాల మేరకు గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. రిక్రూట్మెంట్ నేపథ్యంలోనే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీమాంధ్ర, తెలంగాణా రాష్ట్రాలుగా విడిపోవడంతో ఇదే అదునుగా భావించిన మావోయిస్టులు నల్లమల ప్రాంతాన్నిషెల్టర్ జోన్‌గా మలుచుకుని తిరిగి రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో యువతను ఆకర్షించి తమవైపునకు తిప్పుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఇంటిలిజెన్స్ సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 2004కు ముందు జిల్లాలో వీరి కార్యకలాపాలు యథేచ్చగా సాగేవి. అప్పటి ప్రభుత్వం అనేక మంది మావోయిస్టులను, సానుభూతి పరులను లొంగిపోయేలా చేసి, వారికి జీవన భృతి కల్పించి జన జీవన స్రవంతిలో కలిసే అవకాశం కల్పించారు. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వె ళ్లిన కొందరు మావోయిస్టులు తిరిగి తమ ఉనికిని కాపాడుకునేందుకు రిక్రూట్‌మెంట్‌ను కొనసాగించే ప్రయత్నాలు ప్రారంభించిన క్రమంలో ఎన్కౌంటర్ జరగడంతో ఈ ప్రాంతంలో మావోలకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు నల్లమల అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన సంఘటనలో తీవ్ర గాయాలతో తప్పించుకున్న మావోయిస్ట్ విక్రమ్‌గా అనుమానిస్తున్నారు. అతని కోసం పోలీసులు భారీగా కూంబింగ్ కొనసాగిస్తున్నారు. మూడు జిల్లాల పరిధిలోని ఎస్పీలు అప్రమత్తమై సాయుధ బలగాల ద్వారా నల్లమలను జల్లెడపట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోలతోపాటు తప్పించుకున్న మావోయిస్ట్‌కు నల్లమల అటవీ ప్రాంతంలో అణువణువూ కొట్టినపిండి లాంటిది కావడంతో ఎటు నుంచి ఏ జిల్లాలోకి ప్రవేశిస్తారో ఎవ్వరికీ అంతుబట్టని పరిస్థితి. గతంలో కూడా అనేక సార్లు కూంబింగ్ పార్టీ పోలీసుల నుంచి వీరంతా త్రుటిలో తప్పించుకున్నట్లు సమాచారం. నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న మావోయిస్టు ప్రభావిత గ్రామాలు మావోల కదలికలు, పోలీసుల బూట్ల చప్పుళ్లతో నిత్యం కంటిపై కనుకు లేకుండా ఉండేవి. తాజా ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారని తెలుసుకుని ఎనిమిదేళ్లుగా ప్రశాంతంగా ఉంటున్న ఈ గ్రామాల్లోని ప్రజలు ఉలిక్కిపడ్డారు. మావోయిస్ట్ ప్రభావిత గ్రామా ల్లో ఉండే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం హడలిపోతున్నారు. -
మావోయిస్టులపై నిషేధం ఎత్తివేయం: నాయిని
సాక్షి, హైదరాబాద్: శాంతిభద్రతలు ఎంత అదుపులో ఉంటే రాష్ట్రం అంత బాగా అభివృద్ధి చెందుతుందని కొత్తగా హోంమంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం తన నివాసంలో ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో మత సామరస్యం కాపాడాలనేదే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మావోయిస్టుల కార్యకలాపాలు పెద్దగా లేవని, అయితే సానుభూతి పరులు మాత్రం అక్కడకక్కడ ఉన్నారన్నారు. మావోయిస్టులు పౌర సమాజంలోకి రానప్పుడు వారిపై నిషేధం ఎత్తివేసే సమస్యే లేదన్నారు. -
పోలవరానికి వ్యతిరేకంగా మావోలు బంద్ కు పిలుపు
ఖమ్మం: వివాదస్పద పోలవరం ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తూ మావోయిస్టులు ఖమ్మం జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు. పోలవరం నిర్మాణానికి వ్యతిరేకంగా జూన్ 27 తేదిన బంద్ పాటించాలని మావోయిస్టు కార్యదర్శి కిరణ్ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఇస్తున్న బంద్‌కు సహకరించాలని జిల్లా కార్యదర్శి కిరణ్ పేరుతో లేఖలు విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో భద్రాచలం, పాల్వంచ రెవెన్యూ డివిజన్ల నుంచి వేరు చేయాలని చూస్తున్న ఏడు మండలాలను తమ ప్రాణం పోయినా వదులుకునేది లేదని అఖిలపక్షం ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. -
'మావోయిస్టులతో నాభర్తకు సంబంధాలు లేవు'
న్యూఢిల్లీ: మావోయిస్టులతో నా భర్తకు సంబంధాలు లేవు అని ఢిల్లీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా భార్య వసంత తెలిపారు. మావోయిస్టులతో సంబంధముందనే ఆరోపణలతో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివాసుల హక్కుల కోసం సాయిబాబా పోరాటం చేస్తున్నారని సాక్షి టెలివిజన్ కిచ్చిన ఇంటర్వ్యూలో వసంత తెలిపారు. గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా నా భర్త పోరాడారు. ప్రభుత్వం కక్ష కట్టి వేధిస్తోంది. మైనింగ్ కంపెనీలకు ప్రభుత్వం కొమ్ముకాస్తోంది అని వసంత అన్నారు. నా భర్తకు ఆరోగ్యం సరిగా లేదని, వెంటనే నా భర్తను విడుదల చేయాలని ప్రభుత్వానికి వసంత విజ్ఞప్తి చేశారు. పోలీసులు అక్రమంగా ఆయన్ను తీసుకెళ్లారని వసంత అరోపించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం చెందిన జీఎన్ సాయిబాబాను విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. -
బొగ్గు కేటాయింపుల కుంభకోణంలో మరో ఎఫ్ఐఆర్!
న్యూఢిల్లీ: బొగ్గు కేటాయింపుల కుంభకోణంలో ముంబైకి చెందిన టాప్ వర్త్ ఉర్జా అండ్ మెటల్ లిమిటెడ్ కంపెనీపై తాజాగా ఎఫ్ఐఆర్ ను సీబీఐ దాఖలు చేసింది. ఈకేసులో ముంబైకి చెందిన కంపెనీ డైరెక్టర్, ఇంకా గుర్తు తెలియని వ్యక్తులను దోషులగా చేర్చింది. 1993-2005లో జరిగిన బొగ్గు కేటాయింపుల వ్యవహారంలో సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో ఆ కంపెనీ డైరెక్టర్ సురేంద్ర లోధా, మరో డైరెక్టర్ ఓంప్రకాశ్ నెవాతియాలపై ఇండియన్ పీనల్ కోడ్ 120, 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. గతంలో ఈ కంపెనీని విరంగణ స్టీల్ గా పిలువబడేది. ఇటీవల ఈ కంపెనీకి చెందిన నాగపూర్, యవత్మల్, ముంబైలోని కార్యాలయాలపై సీబీఐ దాడులు నిర్వహించింది.