విశాఖలో మావోలను చంపిన గ్రామస్థులు! | Villagers attacks Moists on Vishaka | Sakshi
Sakshi News home page

విశాఖలో మావోలను చంపిన గ్రామస్థులు!

Published Mon, Oct 20 2014 11:40 PM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM

Villagers attacks Moists on Vishaka

బలవం: విశాఖపట్నం జిల్లా బలవం పంచాయితీ పరిధిలోని గున్నమామిడి సెంటర్ లో ఆదివారం సాయంత్రం దారుణం చోటు చేసుకుంది. గిర సింహాచలం అనే వ్యక్తిని హత్య చేసేందుకు చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకోవడమే కాకుండా మావోలపై తిరుగుబాటు చేశారు. 
 
ఈ ఘటనలో సింహాచలంను చేతులు కట్టేసి తీసుకువస్తుండగా.. కోరుకొండ వద్ద మావోలు శరత్, నాగేశ్వరరావు, గణపతి, ఆనంద్ లను స్థానికులు అడ్డకున్నారు. స్థానికులు తిరగబడి శరత్, గణపతిని రాళ్లతో కొట్టి గ్రామస్థులు చంపారు. ఈ ఘటన నుంచి మావోయిస్టు ఆనంద్ తప్పించుకుని అక్కడి నుంచి పరారైనట్టు పోలీసులు తెలిపారు. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో సుమారు 500 మంది గ్రామస్థులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement