సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. పచ్చ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చాకా.. 31 మంది ప్రాణాలు బలిగొన్నారని, 35 మంది ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నేతల ఆస్తులనూ ద్వసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు నిర్విర్యమయ్యాయని అన్నారు గుడివాడ అమర్నాథ్. వినుకొండ సంఘటన దేశాన్ని కుదిపేసిందని, పార్టీకి చెందిన మైనార్టీ నేత చేతులు నరికి దారుణంగా హత్య చేశారన్నారు. ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ళ దాడి చేయడం, మాజీ ఎంపీ రెడ్డప్ప వాహనాన్ని తగులబెట్టారని తెలిపారు. ఎంపీపై రాళ్ళ దాడి ప్రజా స్వామ్యంలో ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. .
‘ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయలేదు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని భూస్థాపితం చేస్తామని చంద్రబాబు మాట్లాడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యలు, హత్యచారాలు, దాడులు, దౌర్జన్యం మీద శ్వేత పత్రం విడుదల చేయాలి. జరిగిన ప్రతి పరిణామానికి ప్రజలు బుద్ధి చెబుతారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు వైఎస్ జగన్ అండగా ఉంటారని తెలిపారు.
ఎర్రమట్టి దిబ్బలు జాతీయ వారసత్వ సంపద. ఎర్రమట్టి దిబ్బలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తున్నారు. నేలను చదును చేసి రోడ్లు వేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 45 రోజులు గడుస్తున్న ఇంకా వైఎస్సార్‌సీపీ మీద అబద్ధాలు మాట్లాడుతున్నారు.
ఎర్రమట్టి దిబ్బలు తవ్వకాలు మీద కోర్టులో కేసు వేస్తాను. గతంలో పవన్ పేదల లేఔట్ వేస్తే నానా రాద్ధాంతం చేశారు. నా మీద వచ్చిన ఆరోపణలపై విచారణ చేసుకోవచ్చు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు దౌర్జన్యాలపై స్వతంత్ర సంస్థతో విచారణ చేయాలని కోరుతున్నాం’. అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment