పోలవరానికి వ్యతిరేకంగా మావోలు బంద్ కు పిలుపు
ఖమ్మం: వివాదస్పద పోలవరం ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తూ మావోయిస్టులు ఖమ్మం జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు. పోలవరం నిర్మాణానికి వ్యతిరేకంగా జూన్ 27 తేదిన బంద్ పాటించాలని మావోయిస్టు కార్యదర్శి కిరణ్ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఇస్తున్న బంద్‌కు సహకరించాలని జిల్లా కార్యదర్శి కిరణ్ పేరుతో లేఖలు విడుదల చేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో భద్రాచలం, పాల్వంచ రెవెన్యూ డివిజన్‌ల నుంచి వేరు చేయాలని చూస్తున్న ఏడు మండలాలను తమ ప్రాణం పోయినా వదులుకునేది లేదని అఖిలపక్షం ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే.