పోలవరం ఆర్డినెన్స్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందటంతో రేపు ఖమ్మం జిల్లాలో బంద్కు అఖిల పక్షం శుక్రవారం హైదరాబాద్లో పిలుపు నిచ్చింది. తమ రాష్ట్రానికి చెందిన ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలపవద్దంటూ తెలంగాణ ఎంపీలు శుక్రవారం పార్లమెంట్లో నిరసనలు నినాదాలకు దిగారు. అయినా మూజువాణి ఓటుతో పోలవరం ఆర్డినెన్స్ బిల్లును లోక్ సభ శుక్రవారం ఆమోదించింది.
దీంతో పోలవరం ముంపు మండలాలు ఏడింటిని ఆంధ్రప్రదేశ్‌లోకి కలుపుతూ కేంద్రం ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్సుకు చట్టబద్ధత లభించింది. ఈ నేపథ్యంలో రేపు ఖమ్మం జల్లా బంద్కు పిలుపునిచ్చింది. బిల్లు ఆమోదంతో తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లో అయిదు మండలాలు పూర్తిగా, రెండు మండలాలు పాక్షికంగా ఆంధ్రప్రదేశ్లో విలీనమైనాయి.