Polavaram Ordinance
-
ఆ హక్కు కాంగ్రెస్‌కు లేదు
పోలవరంపై ఆర్డినెన్స్ తెచ్చింది బీజేపీయే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నెల్లూరు : పోలవరం ప్రాజెక్టు అంశంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదని, పోలవరానికి ఆర్డినెన్స్ తెచ్చిన ఘనత బీజేపీకే దక్కుతుందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలోని చింతలదేవి పశుగణాభివృద్ధి క్షేత్రంలో శనివారం జాతీయ కామధేను పునరుత్పత్తి కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనకు పదేళ్ల క్రితమే టీఆర్ఎస్తో కాంగ్రెస్ ఒప్పందం చేసుకుందన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్రాన్ని రెండుగా విభజించి, న్యాయం చేయకుండా గాలికొదిలేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. 9 నెలల కిందట గద్దెనెక్కిన ఎన్డీఏ ప్రభుత్వంపై నిందలు వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ నెల 28న ఐఐటీ, ఐఐఐటీ, ఐఎస్ఆర్ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబుతో కలసి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పి.నారాయణ, పి.మాణిక్యాలరావు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. శ్రీసిటీ ఐఐఐటీలో స్మార్ట్ సిటీస్ ప్రారంభం చిత్తూరు జిల్లా, వరదయ్యపాళెం మండలంలోని శ్రీసిటీ సెజ్‌లోని ఐఐఐటీలో కేంద్ర వుంత్రి వెంకయ్యునాయుుడు శనివారం స్మార్ట్ సిటీస్‌ను ప్రారంభించారు. ప్రక్రియ వేగవంతం: ఎంపిక చేసిన కొన్ని ముఖ్యపట్టణాలను స్మార్ట్‌సిటీలుగా రూపొందించే ప్రక్రియను అక్టోబర్ నుంచి వేగవంతం చేస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా తడ సమీపంలోని శ్రీసిటీలో కొన్ని పరిశ్రమలను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. త్రుటిలో తప్పిన ప్రమాదం చెన్నై: చెన్నై విమానాశ్రయంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి శనివారం త్రుటిలో ప్రమాదం తప్పింది. ఉదయం 10.50 గంటలకు విమానంలో చెన్నైకి చేరుకున్న మంత్రి కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేందుకు 3వ నంబర్ ద్వారం సమీపంలోని వీఐపీ లాంజ్‌లోకి వెళ్లారు. ఆయన లోపలికి వెళ్లిన కొద్దిసేపటికి 3వ నంబరు ద్వారానికున్న గ్లాస్ డోర్ ఊడిపడి ముక్కలు ముక్కలైంది. ఈ శబ్దంతో ఒకవైపు విమానాశ్రయ అధికారులు, మరోవైపు వెంకయ్య భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
పోలవరం బిల్లుకు మద్దతు ఇవ్వండి: ఆజాద్
ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజ్యసభ సభ్యులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ముంపు మండలాల విలీనం బిల్లుపై చర్చ జరిపారు. పోలవరం ప్రాజెక్ట్‌కు కాంగ్రెస్ మాట ఇచ్చినందున బిల్లుకు మద్దతు ఇవ్వాలని గులాం నబీ ఆజాద్ ....సభ్యులకు సూచించారు. కాగా సోమవారం పోలవరం బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది. బిజెపితో పోల్చుకుంటే రాజ్యసభలో కాంగ్రెస్‌కు బలం ఎక్కువగా ఉంది. దాంతో కాంగ్రెస్ సభ్యులు కనుక బిల్లుపై ఎదురు తిరిగితే ఆమోదముద్ర పడే అవకాశం లేదు. కాగా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు పోలవరం బిల్లును వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. బిల్లును అడ్డుకుంటామని ఇప్పటికే వారు వ్యాఖ్యానించినఈ నేపథ్యంలోపోలవరం బిల్లును ఆమోదం తెలపాలని ఆజాద్...పార్టీ ఎంపీలను కోరారు. -
'పోలవరం ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది కాంగ్రెస్సే'
హైదరాబాద్:పోలవరం ఆర్డినెన్స్ ను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని బీజేపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఆచారి స్పష్టం చేశారు. ఆ సమయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను టీఆర్ఎస్ పార్టీ అడ్డుకోలేక పోయిందని తెలిపారు. అప్పుడు లోక్ సభలో ఉన్న టీఆర్ఎస్ ఎంపీలు ఆ ఆర్డినెన్స్ ను ఆపలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు తమ అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకు టీఆర్ఎస్ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆచారి మండిపడ్డారు. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడంపై తెలంగాణ వాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో చేసిన సవరణలను నిరసిస్తూ తెలంగాణ జాగృతి కార్యకర్తలు శనివారం బీజేపీ కార్యాలయంపై దాడికి దిగారు. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలపడం తగదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
గత ప్రభుత్వమే ఆర్డినెన్స్ తెచ్చింది: వెంకయ్య
చర్చ జరిగి ఉంటే అన్ని విషయాలు ప్రజలకు తెలిసేవి సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వమే తెచ్చిందని, ఇందులో వివాదం లేదని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. అనవసరంగా ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టవద్దని హితవు పలికారు. శనివారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ఆర్డినెన్స్ లోక్‌సభ ఆమోదం పొందడంలో రాజ్యాంగ ఉల్లంఘన జరగలేదన్నారు. సభలో ఈ విషయంపై చర్చించడం కోసం ప్రభుత్వం 2 గంటలు కేటాయించిందని, చర్చ జరిగితే విషయాలు ప్రజలకు తెలిసేవన్నారు. దురదృష్టవశాత్తూ సభ్యులు వెల్‌లోకి వెళ్లడంతో ఇతర సభ్యులకు చర్చలో పాల్గొనే అవకాశం లేకుండా పోయిందన్నారు. ‘ఈ ఆర్డినెన్స్‌ను 18వ తేదీలోగా రెండు సభలు ఆమోదించి రాష్ట్రపతికి పంపాల్సి ఉంది. కాంగ్రెస్ సభ్యులు దీన్ని విమర్శించడం విడ్డూరం. రాష్ట్రాలు ఏర్పడిన తరువాత తమను సంప్రదించకుండా ఆర్డినెన్స్ ఎలా తెస్తారన్న వాదన సరికాదు. ఉమ్మడి రాష్ట్రం ఉండగానే నిర్ణయం జరిగిపోయింది. ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం, తగిన నష్టపరిహారం బాధ్యతలను కేంద్రం చేపట్టే ఉద్దేశంతో ఏపీకి బదిలీ చేసింది. తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రలో కలుపుతున్నారన్న భావన సరైంది కాదు. సోనియా కూడా ఈ ప్రాజెక్టును త్వరిత గతిన ఏర్పాటు చేయాలని ప్రధానికి లేఖ రాశారు. ఆ ఉత్తరం కూడా నేను ఇస్తాను. అడ్డంకులు తొలగిస్తానని అప్పటి ప్రధాని కూడా చెప్పారు’ అని వెంకయ్య అన్నారు. -
సవరణ రాజ్యాంగ వ్యతిరేకం: జైపాల్
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ఆర్డినెన్స్ రాజ్యాంగ వ్యతిరేకమని, ఆర్టికల్ 3 ప్రకారం వెళ్లకుండా పునర్ వ్యవస్థీకరణ చట్టానికి సవరణ చేయడం నిరంకుశత్వమని కేంద్రమాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. పునర్ వ్యవస్థీకరణ చట్టం తేవడం కోసం చేపట్టిన ప్రక్రియ గెజిట్ నోటిఫికేషన్‌తోనే పూర్తయ్యిందని, ఆ తరువాత తెచ్చిన ఈ సవరణ చెల్లదని శనివారం వ్యాఖ్యానించారు.‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని లోక్‌సభలో సవరించిన తీరు దురదృష్టకరం. ఆర్టికల్ 3, 4 కింద చేపట్టిన బిల్లు ప్రక్రియ పూర్తయ్యింది. మళ్లీ సవరణ చేసే శక్తి ప్రభుత్వానికి గానీ, పార్లమెంటుకు గానీ లేదు. మళ్లీ ఆ ప్రక్రియను రాజ్యాంగంలోని ఆర్టికల్ 3, 4 కిందనే ఆరంభించాలి. రాష్ట్రాల సరిహద్దులు మార్చేందుకు పార్లమెంటుకు సర్వాధికారం ఉంది. కానీ ప్రక్రియ పూర్తయిన తరువాత సవరణలు చేయడం రాజ్యాంగబద్ధం కాదు. తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా చేయడం రాజ్యాంగానికి వ్యతిరేకం. ఈ బిల్లును సుప్రీంకోర్టు కొట్టివేస్తుంది’. ముంపు గ్రామాలు వచ్చిన తర్వాత మళ్లీ మండలాలెందుకు ? ముంపు గ్రామాలను మాత్రమే యూపీఏ సీమాంధ్రకు ఇచ్చింది. తాజా సవరణలో మండలాన్ని యూనిట్‌గా తీసుకున్నారు. కొన్ని గ్రామాలను ముంపునకు తీసుకుంటారట? మిగిలిన వాటిని నిర్వాసితుల పునరావాసానికి తీసుకుంటారట. ఇదేం న్యాయం?. రాజ్యసభలో తెచ్చి పాస్ చేయకముందే ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. -
'కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది'
ఢిల్లీ: పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో చేసిన సవరణలకు కేంద్రం ఆమోదం తెలపడాన్ని మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తప్పుబట్టారు. ఈ అంశంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించిందని విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడిన జైపాల్ రెడ్డి.. ఉద్దేశ్యపూర్వకంగానే ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాను మొదట్లోనే వ్యతిరేకించానని తెలిపారు. తెలంగాణ బిల్లు ప్రక్రియ పూర్తయిందని, ఆ బిల్లుకు సవరణ చేసే శక్తి ప్రభుత్వానికి, పార్లమెంట్ కు లేదన్నారు.తెలంగాణ బిల్లు ఆర్టికల్ 3,4 ప్రకారం పాసందైని, అసలు ఆ సవరణ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రద్రించకుండా సవరణ ఎలా చేస్తారని జైపాల్ రెడ్డి ప్రశ్నించారు. -
బీజేపీ కార్యాలయంపై తెలంగాణ వాదుల దాడి
-
టి.బిల్లులో ఉన్నట్లుగానే పోలవరంపై నిర్ణయం
హైదరాబాద్:పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పునర్విజన బిల్లులో చేసిన సవరణల ఆమోదానికి సంబంధించి తెలంగాణ వాదులు నిరసనం తెలపడం ఎంతమాత్ర సబబు కాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు సూచించారు. తెలంగాణ బిల్లులో ఉన్నట్లుగానే పోలవరంపై నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ఆర్డినెన్స్ పై కొన్ని పార్టీలు వ్యతిరేకించడంపై శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆ పార్టీలు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ అంటూ వ్యాఖ్యానించడం రాజకీయ ఆరోపణ మాత్రమేనని ఈ సందర్భంగా తెలిపారు. ఎయిమ్స్ పై నిర్ధిష్ట హామీ రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదన రాకపోవడమేనన్నారు. -
బీజేపీ కార్యాలయంపై తెలంగాణ వాదుల దాడి
హైదరాబాద్:పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడంపై తెలంగాణ వాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో చేసిన సవరణలను నిరసిస్తూ తెలంగాణ జాగృతి కార్యకర్తలు శనివారం బీజేపీ కార్యాలయంపై దాడికి దిగారు. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలపడం తగదంటూ ఆందోళన చేపట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపుటలా జరిగింది. ఈ క్రమంలోనే తెలంగాణ జాగృతి కార్యకర్తలను బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తెలంగాణ జాగృతి కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలవరం ముంపు మండలాల అంశానికి సంబంధించి పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పునర్విజన బిల్లులో చేసిన సవరణలకు ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ తెలంగాణ జేఏసీ, వామపక్షాలు ఈ రోజు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో శుక్రవారం కూడా తెలంగాణ జిల్లాల్లో తెలంగాణవాదులు, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎన్డీయే ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆంధ్ర పాలకుల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం ఈ చర్యకు ఒడిగట్టిందని పలు రాజకీయ పార్టీల నేతలు విమర్శించారు. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత దొడ్డిదారిలో సవరణకు ఆర్డినెన్స్ తెచ్చి కుట్రలు చేసిందని దుయ్యబట్టారు. -
'ఆ మండలాలను వదులుకోం'
తెలంగాణలోని ఏడు మండలాలను ఒదులుకొనేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్సష్టం చేశారు. పాలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా శనివారం కాంగ్రెస్ పార్టీ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, పువ్వాడ అజేయ్, రామిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... పోలవరం ఆర్డినెన్స్‌పై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. పోలవరంపై ఆంధ్రప్రదేశ్ న్యాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వాటిని ఎదుర్కొంటామని వారు స్పష్టం చేశారు. లోక్‌సభలో శుక్రవారం పోలవరం ఆర్డినెన్స్ బిల్లు... తెలంగాణ ఎంపీలు నిరసనల మధ్య ఆమోదం పొందింది. పోలవరం ఆర్డినెన్స్ బిల్లు ఆమోదాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజుకు అన్ని పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. -
స్థానికతకు 15 ఏళ్లు చాలు: సీఎల్పీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 15 ఏళ్లు స్థిర నివాసం ఉన్న వారందరినీ స్థానికులుగా పరిగణించాలని సీఎల్పీ డిమాండ్ చేసింది. ఈ విషయంలో నిజాం పాలనలో కొనసాగిన ‘ముల్కీ’ నిబంధనలే ప్రామాణికంగా పరిగణించాలని సూచించింది. సీఎల్పీ కార్యాలయంలో శుక్రవారం శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యే భట్టి విక్రమార్కలతో కలసి సీఎల్పీ నేత కె.జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... - పోలవరం ఆర్డినెన్స్‌ను పార్లమెంట్లో చట్టంగా ఆమోదించడాన్ని నిరసిస్తున్నాం. పోలవరం డిజైన్ మారిస్తే సమస్య పరిష్కారమవుతుంది. తక్షణమే రెండు రాష్ర్ట ప్రభుత్వాలతో కేంద్రం చర్చించాలి. - ఆర్డీఎస్ ఎత్తు పెంచాలని గతంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కర్ణాటక చేపడుతున్న పను లను కర్నూలువాసులు అడ్డుకోడం సరికాదు. పోలీ సుల రక్షణతోనైనా ఈ పనులను చేపట్టాలి. - 1956కు పూర్వం తెలంగాణలో స్థిరపడిన వాళ్లు తెలంగాణ బిడ్డలేనని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపా దిస్తే, ఒక ప్రాంతానికి వ్యతిరేకమనే భావన ఇక్కడ స్థిరపడినవారిలో కలిగే ప్రమాదముంది. తెలంగాణలో స్థిరపడిన వాళ్లంతా తెలంగాణ బిడ్డలేనంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయాన్ని మర్చిపోవద్దు. రెండ్రోజుల్లో సీఎల్పీ కార్యవర్గం కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యవర్గాన్ని రెండురోజుల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు జానారెడ్డి విలేకరులకు తెలిపారు. డిప్యూటీ లీడర్లు, కార్యదర్శులు, కోశాధికారి, కార్యవర్గ సభ్యుల ఎంపికపై కసరత్తు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. -
'పోలవరం ఆర్డినెన్స్ ఆమోదం బాధాకరం'
పార్లమెంట్లో పోలవరం ఆర్డినెన్స్ ఆమోదం పోందటం బాధాకరమని తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జానారెడ్డి మాట్లాడుతూ... ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానికత అంశంలో సెటిలర్లకు నష్టం జరగదని అన్నారు. పోలీసు భద్రత కల్పించైనా ఆర్డీఎస్కు మరమ్మతులను పూర్తి చేయాలని జానారెడ్డి ఏపీ సర్కార్‌కు హితవు పలికారు. పోలవరం ఆర్డినెన్స్ ఈ రోజు పార్లమెంట్లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. -
రేపు ఖమ్మం జిల్లా బంద్
పోలవరం ఆర్డినెన్స్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందటంతో రేపు ఖమ్మం జిల్లాలో బంద్‌కు అఖిల పక్షం శుక్రవారం హైదరాబాద్‌లో పిలుపు నిచ్చింది. తమ రాష్ట్రానికి చెందిన ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలపవద్దంటూ తెలంగాణ ఎంపీలు శుక్రవారం పార్లమెంట్లో నిరసనలు నినాదాలకు దిగారు. అయినా మూజువాణి ఓటుతో పోలవరం ఆర్డినెన్స్ బిల్లును లోక్ సభ శుక్రవారం ఆమోదించింది. దీంతో పోలవరం ముంపు మండలాలు ఏడింటిని ఆంధ్రప్రదేశ్‌లోకి కలుపుతూ కేంద్రం ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్సుకు చట్టబద్ధత లభించింది. ఈ నేపథ్యంలో రేపు ఖమ్మం జల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. బిల్లు ఆమోదంతో తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లో అయిదు మండలాలు పూర్తిగా, రెండు మండలాలు పాక్షికంగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైనాయి. -
పోలవరం ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్దం
-
పోలవరం ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్దం
న్యూఢిల్లీ : పోలవరం ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. ఆయన శుక్రవారం లోక్ సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నామన్నారు. విభజన బిల్లు పాసయ్యాక ఆర్డినెన్స్ తీసుకు రావటం అన్యాయమని ఆయన అన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర సరిహద్దులు మార్చేముందు ఇరు రాష్ట్రాల శాసనసభల అభిప్రాయం తీసుకోవాలని ఎంపీ వినోద్ డిమాండ్ చేశారు. ఈ నిబంధనను కేంద్రం పాటించలేదని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై సభలో మొదట చర్చ జరపాలని వినోద్ డిమాండ్ చేశారు. -
ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా 12న జిల్లా బంద్
ఖమ్మం కలెక్టరేట్: పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఈనెల 12న జిల్లా బంద్‌కు జేఏసీ, పోలవరం వ్యతిరేక కమిటీలు పిలుపునిచ్చాయి. ఆర్డినెన్స్ రద్దయ్యేంత వరకూ పోరాటాలు కొనసాగించాలని నిర్ణయించాయి. పోలవరం వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ వట్టం నారాయణ అధ్యక్షతన ఖమ్మంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్హాల్లో బుధవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పలువురు నేతలు మాట్లాడారు. జిల్లా నుంచి ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం సీమాంధ్రుల కుట్రలో భాగమేనని మండిపడ్డారు. గిరిజన సంస్కృతిని కాపాడేందుకు ప్రజా ప్రతినిధులందరూ ఉద్యమంలో కలసి రావాలని పిలుపునిచ్చారు. ఈనెల 10న హైదరాబాద్‌లో జరిగే ధర్నాను, ఈనెల 12న జరిగే జిల్లా బంద్‌ను, 14న ఢిల్లీలో జరిగే భారీ ధర్నాను విజయవంతం చేయాలన్నారు. 12న జరిగే జిల్లా బంద్‌కు వ్యాపార, వాణిజ్య, విద్య, వైద్య రంగాల వారు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఉద్యోగ జేఏసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కూరపాటి రంగరాజు, నడింపల్లి వెంకటపతిరాజు, సీపీఐ (ఎంఎల్)- న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు కెచ్చెల రంగారెడ్డి, సీపీఎం జిల్లా నాయకుడు మచ్చా వెంకటేశ్వర్లు, సీపీఐ జిల్లా నాయకుడు తాటి వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు డోకుపర్తి సుబ్బారావు, కాంగ్రెస్ జిల్లా నాయకుడు శీలంశెట్టి వీరభద్రం, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు వాసం రామకృష్ణదొర, మాలమహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి శేఖర్, టీఎన్జీవోస్ భద్రాచలం డివిజన్ కన్వీనర్ చల్లగుళ్ల నాగేశ్వరరావు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు దుగ్గి కృష్ణ, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకుడు కె.ఎస్.ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
పోలవరం ఆర్డినెన్స్ పై దద్దరిల్లిన లోక్ సభ
న్యూఢిల్లీ : పోలవరం ఆర్డినెన్స్‌పై లోక్ సభ మంగళవారం దద్దరల్లింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుపై లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఏపీ పునర్విభజన బిల్లులో సవరణలు, పోలవరం ముంపు మండలాలపై టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ తేవడం చట్ట విరుద్ధమని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం అభిప్రాయం తీసుకోకుండా ఆర్డినెన్స్ ఎలా తెస్తారని ఆయన ప్రశ్నించారు. ఓ దశలో టీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకు వెళ్లి జై తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎంపీలకు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ఎంపీలు మద్దతు తెలిపారు. దాంతో సభ్యుల నిరసనలు, నినాదాల మధ్య సభ మధ్యాహ్నం మూడున్నర వరకూ వాయిదా పడింది. -
చిన్ని చిన్ని ఆశ...
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పోలవరం ముంపు ప్రాంతం కింద జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే ఆర్డినెన్స్‌ను కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టకపోవడం జిల్లాలో చర్చనీయాంశమయింది. ఆర్డినెన్స్‌ను ఆమోదించే బిల్లును సోమవారం పార్లమెంటులో పెడుతున్నారని, దీనిని ఆమోదిస్తే అది చట్టంగా మారి అనివార్యంగా ఏడు మండలాలు ఆంధ్రలోకి వెళ్లాల్సి వస్తుందని ఆందోళన చెందిన స్థానిక గిరిజనులకు కేంద్రం తీసుకున్న నిర్ణయం కొంత ఊరట కలిగించింది. అయితే, ఆర్డినెన్స్ వాయిదా వ్యవహారం తాత్కాలికమైనదేనని, ఎప్పుడైనా ఈ బిల్లుకు ఆమోదం లభిస్తుందనే ఆందోళన స్థానిక ఆదివాసీలలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేయాలని అఖిలపక్ష పార్టీలు, ఆదివాసీ సంఘాలు, టీజేఏసీలు నిర్ణయించాయి. మరోవైపు, భద్రాచలం పట్టణాన్ని కూడా ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకే ఆర్డినెన్స్ బిల్లును వాయిదా వేశారనే ప్రచారం తెలంగాణవాదుల్లో మరింత గుబులు పుట్టిస్తోంది. అసలేం జరిగింది? వాస్తవానికి పోలవరం ఆర్డినెన్స్‌ను ఆమోదించే బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే, ఆర్టికల్ 3 కింద పార్లమెంటులో పెట్టాల్సిన బిల్లులను రాష్ట్రపతి సిఫారసు మేరకు సభలో పెట్టాల్సి ఉంటుంది. ఆర్టికల్ 3 కింద సభలో ప్రవేశపెట్టే పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు ఆయన సిఫారసు ఇంకా రానందున తాత్కాలికంగా బిల్లు వ్యవహారాన్ని పక్కన పెట్టాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పీకర్‌ను కోరడంతో పోలవరం ఆర్డినెన్స్ వ్యవహారం తాత్కాలికంగా వాయిదా పడింది. అయితే, ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ మరో మెలిక పెట్టింది. రాష్ట్రాల సరిహద్దుల మార్పులకు సంబంధించిన బిల్లులను ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు పంపి, వాటి అభిప్రాయం తీసుకున్న తర్వాతే పార్లమెంటులో పెట్టాలని ఆ పార్టీ అంటోంది. కానీ, బంతి రాష్ట్రపతి కోర్టులో ఉం దని, రాష్ట్రాల అసెంబ్లీలకు పంపి, ఆ తర్వాత పార్లమెంటుకు పంపాలా, లేక నేరుగా పార్లమెం టుకే రాష్ట్రపతి పంపుతారా అనేది ఇప్పుడు కీల కం కానుందని రాజకీయ వర్గాలంటున్నాయి. మళ్లీ నూగూరు కిందికేనా? పోలవరం ఆర్డినెన్స్‌ను కేంద్రం తాత్కాలికంగా పక్కనపెట్టిన నేపథ్యంలో కొత్త చర్చ ప్రారంభమయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ‘1956కు ముందు’ అనే వాదనను తీసుకొస్తున్నందున అదే కోణంలో భద్రాచలం పట్టణాన్ని కూడా ఆంధ్రలో కలిపేస్తారని, అందుకే ఆర్డినెన్స్ ను వాయిదా వేసారనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి 1956కు ముందు భద్రాచలం డివిజన్ తూర్పుగోదావరి జిల్లా నూగూరు తాలూకాలో ఉండేది. పరిపాలనా సౌలభ్యం కోసం 1959లో ఈ డివిజన్‌ను ఖమ్మం జిల్లాలో కలిపారు. అయితే, ఫీజు రీయింబర్స్మెంట్ అమలుకు 1956కు ముందు స్థానికత ఉండాలని ప్రభుత్వం అంటుండడంతో పాటు మున్ముందు కూడా 1956 అన్నప్పుడల్లా భద్రాచలం విషయంలో సమస్యలు వస్తాయని, అందుకే కేంద్రం భద్రాచలాన్ని కూడా ఆంధ్రలో కలుపుతారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆందోళనలు మరింత ఉధృతం.. ఈ నేపథ్యంలో ఆందోళనలను మరింత ఉధృ తం చేసేందుకు అటు అఖిలపక్షం, ఇటు టీజేఏసీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు రిలేదీక్షలు, ప్రదర్శనలు, బహిరం గ సభలు, పాదయాత్రలకు పరిమితమైన ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయిం చారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతు న్న నేపథ్యంలో ఈ నెల 14న ‘చలో ఢిల్లీ’కి పిలుపునిచ్చారు. ఇందుకోసం అఖిలపక్షం, టీజేఏసీ లు, ఆదివాసీ సంఘాలు కార్యాచరణ రూపొం దించుకుంటున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేవలను బహిష్కరించే కార్యక్రమా న్ని మున్ముందు చేపడతామని, అందుకు తగిన సమయంలో పిలుపునిస్తామని ఓ నేత చెప్పారు. -
పోటెత్తిన గిరిజనం
భద్రాచలం: పోలవరం ఆర్డినెన్స్‌కు నిరసనగా భద్రాచలంలో సోమవారం ఆదివాసీలు కదం తొక్కారు. జాతి మనుగడ కోసం ఎంతటి పోరాటాలకైనా సిద్ధమేనని విల్లంబులు ఎక్కుపెట్టారు. ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక కమిటీ, అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో భద్రాచలంలో నిర్వహించిన ‘ఆదివాసీల ఆత్మగౌరవ సభ’కు భారీ సంఖ్యలో గిరిజనులు తరలివచ్చారు. ముందుగా స్థానిక అంబేద్కర్ సెంటర్ నుంచి బ్రిడ్జి సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. గిరిజన సంప్రదాయ నృత్యాలు, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యకర్తలు , కళాకారుల ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం అంబేద్కర్ సెంటర్లో బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఈ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నాయకులు, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఆదివాసీల అభిప్రాయాలు తెలుసుకోకుండానే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపాలని నిర్ణయించడం దారుణమని విమర్శించారు. ప్రాణాలర్పించైనా సరే.. పోలవరం ఆర్డినెన్స్‌ను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ముంపు మండలాల పరిరక్షణ కోసం చింతూరు నుంచి భద్రాచలం బ్రిడ్జి వరకు దిగ్బంధనం చేయాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ ఎంపీలు దీనిపై పోరాడుతున్నారని, మిగతా పార్టీల ఎంపీలు సైతం ముంపు బాధితులకు బాసటగా నిలవాలని కోరారు. దీనిపై న్యాయపోరాట ం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్ పేరుతో ముంపు మండలాలను స్వాధీనం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్సుత్సాహం చూపుతోందని, దీనిలో భాగంగానే మద్యం దుకాణాలను అప్పుడే ఆక్రమించిందని విమర్శించారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గిరిజన చట్టాలను తుంగలో తొక్కి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ముంపు మండలాలను ఖమ్మం జిల్లాలోనే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరారు. ఆదివాసీలు మునిగిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ.. టీడీపీ, బీజేపీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, ఆ పార్టీలు కళ్లు లేని కబోదుల్లా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు కుట్రల కారణంగానే ఆర్డినెన్స్ వచ్చిందన్నారు. ఈనెల 14న ఆదివాసీ సంఘాలు, రాజకీయ పార్టీల సమక్షంలో చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆదివాసీల ఆత్మగౌరవం కోసం విల్లంబులను ఎక్కుపెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వేలాది మంది ఆదివాసీలు తరలివచ్చిన ఈ సభ నరేంద్రమోడీ ప్రభుత్వానికి హెచ్చరిక అవుతుందన్నారు. ముంపు మండలాల కోసం ఆదివాసీలు చేసే ఈ నిరసనలే ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలని హితవు పలికారు. ముంపు ఆర్డినెన్స్ రద్దు కోసం చేసే ఉద్యమాల్లో కలిసి వచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ఇంకా ఈ సభలో ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ వట్టం నారాయణ, కో కన్వీనర్ ముర్ల రమేష్, సీపీఐ డివిజన్ కార్యదర్శి కల్లూరి వెంకటేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర నాయకులు బండారు రవికుమార్, ఎన్డీ రాష్ట్ర నాయకులు కెచ్చెల రంగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తిప్పన సిద్దులు మాట్లాడారు. పోలవరం వ్యతిరేక పోరాట కమిటీ కో కన్వీనర్ గుండు శరత్ అధ్యక్షతన జరిగిన సభలో అడ్వకేట్ జేఏసీ నాయకులు తిరుమలరావు, ఆదివాసీ నాయకులు సోందె వీరయ్య, టీజేఏసీ నాయకులు పూసం రవికుమారి, పొడియం నరేందర్, తాళ్ల రవికుమార్, సీపీఎం నాయకులు అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్, యలమంచి రవికుమార్, మచ్చా వెంకటేశ్వర్లు, బ్రహ్మచారి, ఎంబి నర్సారెడ్డి, అన్నెం సత్యాలు, సీపీఐ నాయకులు టి. వెంకటేశ్వర్లు, న్యూడెమోక్రసీ నాయకులు కెచ్చెల కల్పన, షేక్ గౌస్, వెంకటేశ్వరరావు, బీఎస్పీ నాయకులు ఏవీ రావు, తుడుందెబ్బ నాయకులు వాసం రామకృష్ణ, టీజేఏసీ నాయకులు కూరపాటి రంగరాజు, చల్లగుళ్ల నాగేశ్వరరావు, వెక్కిరాల శ్రీనివాస్, ఎస్కే గౌసుద్దీన్, సోమశేఖర్, బాలకృష్ణ, టీఫీటీఎఫ్ నేత ఎం. రామాచారి, టీఎస్‌యూటీఎఫ్ నాయకులు వెంకటేశ్వరరావు, బి రాజు తదితరులు పాల్గొన్నారు. -
పోలవరంపై ‘అఖిలపక్షం’ పెట్టండి: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుపై కాలయాపన చేయకుండా తక్షణమే అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, కార్యాచరణ ప్రకటించాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుందో తెలపాలన్నారు. సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కింద మంపునకు గురవుతున్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకునేందుకు అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. -
పోలవరం ఆర్డినెన్స్ రద్దుకు 10న టీజేఏసీ ధర్నా
హైదరాబాద్: పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రలో కలిపే ఆర్డినెన్స్‌ను రద్దుచేయాలని, ఆ మండలాలను తెలంగాణలోనే ఉంచాలని కోరుతూ ఈ నెల 10న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కువద్ద ధర్నా చేయనున్నట్టు తెలంగాణ జేఏసీ ప్రకటించింది. జేఏసీ కోచైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య అధ్యక్షతన ముఖ్యనేతలు హైదరాబాద్‌లోని జేఏసీ కార్యాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. అనంతరం లక్ష్మయ్య సి.విఠల్, కారెం రవీందర్ రెడ్డి, మణిపాల్‌రెడ్డి, పిట్టల రవీందర్, రంగరాజు తదితరులు విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ఆదివాసీలను ముంచేయడం సరికాదన్నారు. కేంద్రం తెచ్చిన ఈ ఆర్డినెన్సును రద్దుచేయాలని డిమాండ్ చేశారు. 10 వ తేదీన జరిగే ధర్నాలో అన్ని రాజకీయపార్టీలు పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా ఆదివాసీ జేఏసీ ఈ నెల 14న ఢిల్లీలో తలపెట్టిన నిరసన దీక్షలోనూ జేఏసీ పాల్గొంటుందని వెల్లడించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన సమయంలో స్థానికతను ఆధారంగా తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతారని వారు హెచ్చరించారు. -
ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా రిలే దీక్షలు
కూనవరం: పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా, ముంపు మండలాలను తెలంగాణలోనే కొనసాగించాలన్న డిమాండుతో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఇక్కడ రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. వీటిని సర్పంచ్ కట్టం సునీత ప్రారంభించారు. మొదటి రోజు దీక్షలో ఉపాధ్యాయులు కె.మోహన్‌రావు, సోందె వెంకట్రావు, ఊకె సూర్యారావు, భూక్యా వీరన్న, అనిగె నాగేశ్వరావు, చిచ్చడి చందు, మల్లం భద్రయ్య, బొడ్డు ఆనంద్, సోందె శిరమయ్య, అనిల్‌కుమార్, కారం దూలయ్య, కుర్సం లక్ష్మణస్వామి కూర్చున్నారు. తొలుత, ఉద్యోగ-ఉపాధ్యాయ జేఏసీ నాయకులు టేకులబోరులోని అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూల మాలు వేసి నివాళులర్పించారు. ఆ తరువాత, దీక్షల ప్రారంభమయ్యాయి. ఈ కార్యమ్రంలో జేఏసీ మండల కన్వీనర్ కరక సత్యనారాయణ, కో-కన్వీనర్ ధర్ముల పుల్లయ్య మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ మార్చాలని, ఉద్యోగులను తెలంగాణలోనే కొనసాగించాలని, గిరిజన చట్టాలను అమలుచేయాలని, భద్రాచలాన్ని గిరిజన జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశా రు. ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలన్న డిమాండుతో ఏవీఎస్పీ రాష్ట్ర నాయకుడు సున్నం వెంకటరమణ చేపట్టిన మహాపాదయాత్రకు జేఏసీ మద్దతు తెలిపింది. కార్యక్రమంలో టీఎన్జీవోస్ అసోసియేషన్ నాయకుడు ఎస్ఎన్వి.సుబ్బారావు, హెల్త్ సూపర్వైజర్ డి.శ్రీనివాసరావు, నాయకులు పండా కృష్ణయ్య, కుర్సం వెంకటేశ్వర్లు, వెంకట్ నారాయణ, పి.కన్నారావు, జి.సమ్మయ్య, ఎం.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రదర్శన, రాస్తారోకో భద్రాచలం టౌన్: పోలవరం ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలన్న డిమాండుతో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో ప్రదర్శన, జూనియర్ కళాశాల సెంటర్లో రాస్తారోకో జరిగింది. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సాయికుమార్, నాయకులు శివకృష్ణ, నాగరాజు, గోపి, హరీష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ హామీ.. చంద్రబాబు కమిటీ: కొప్పుల
-
ఏకపక్షంగా ఆర్డినెన్స్ తెచ్చారు: చాడ
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు గుదిబండగా మారిందని, అధికారం చేతిలో ఉంది కదా అని ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ ఏకపక్షంగా ఆర్డినెన్స్ తెచ్చారని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఆయన నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఆర్డినెన్స్‌లు తెచ్చి తెలంగాణలో ఉండాల్సిన గ్రామాలను ఆంధ్రాలో విలీనం చేశారని విమర్శించారు. దీనిని వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. వ్యవసాయ రుణాలను రూ. లక్ష వరకు మాఫీ చేస్తామని టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టిందని, ఇప్పుడు రూ. లక్షలోపు రుణాలు మాఫీ చేస్తామని చెబుతున్నారని తెలిపారు. ఎలాంటి కాలపరిమితి, షరతులు లేకుండా రూ.లక్ష వరకు అన్ని రకాల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.దీనిపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. వర్షాకాలం ముంచుకొస్తున్నందున కొత్త రుణాలిచ్చేలా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. మద్యం మాఫియాపై ఉన్న కేసులపై టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. -
కేసీఆర్ హామీ.. చంద్రబాబు కమిటీ: కొప్పుల
హైదరాబాద్: రైతు పంట రుణాల మాఫీపై తమ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన హామీ ఇస్తే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. రుణమాఫీపై ఎవరి చిత్తశుద్ధి ఏంటో దీన్నిబట్టే అర్ధమవుతోందని అన్నారు. ఈ వాస్తవాన్ని విస్మరించి తెలంగాణ టీడీపీ నేతలు సీఎం కేసీఆర్‌పై చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరం ఆర్డినెన్స్ పాపం చంద్రబాబుదేనని అన్నారు. టీటీడీపీ నేతలు ఈ అంశంపై చంద్రబాబును ప్రశ్నించాలని సూచించారు. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని ప్రశంసించారు. ఆయనకు యేడాది గడువిస్తే ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా అమలుచేస్తారని కొప్పుల ఈశ్వర్ విశ్వాసం వ్యక్తం చేశారు. -
పోలవరం ఆర్డినెన్స్‌ను రద్దు చేసేదాకా పోరు: తమ్మినేని
మహబూబ్‌నగర్: గిరిజనులను ముంచే పోలవరం ప్రాజెక్టు ఆర్డినెన్స్‌ను రద్దుచేసే వరకు పోరాటం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టంచేశారు. ఆదివారం ఆయన మహబూనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. పర్యావరణానికి విఘాతం కలిగించే ఈ ప్రాజెక్టును ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. పోలవరంపై ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేయడం అభినందనీయమని, సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగవిరుద్ధంగా, సీమాంధ్ర పాలకుల మెప్పు కోసం పోలవరంపై ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చారని విమర్శించారు. కఠిన నిర్ణయాలు తప్పవని ప్రధాని మోడీ చెప్పడం చూస్తుంటే ప్రజలపై భారాలు మోపేందుకు సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోందన్నారు. రక్షణశాఖ, మీడియా రంగాల్లో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడుతు తెచ్చేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్ మాట్లాడుతూ.. ఖరీప్ మొదలైందని, విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలని కోరారు. నకిలీ విత్తనాలను అరికట్టి వాటిని విక్రయిస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయాని కోరారు. సమావేశంలో రాష్ట్ర నేత కిల్లే గోపాల్, పట్టణ కార్యదర్శి కురుమూర్తి పాల్గొన్నారు. -
పోలగరం..
-
పోలగరం..
శాసనసభ, మండలిలో వేడివేడిగా చర్చ కేంద్రంపై బాబు ఒత్తిడి వల్లే ఆర్డినెన్స్: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడంపై ఉభయసభల్లో గురువారం గరంగరం చర్చ జరిగింది. అసెంబ్లీలోనూ శాసనమండలిలోనూ ఈ విషయమై సభ్యులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ప్రతిపక్షాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలవరంపై ప్రతిపక్షపార్టీ అధ్యక్షుల అభిప్రాయమేమిటో స్పష్టం చేయాలని సీఎం డిమాండ్ చేశారు. అలా కుదరదని, ఆ ప్రాంత ప్రజాప్రతినిధుల అభిప్రాయాలనే పరిగణనలోకి తీసుకోవాలని ప్రతిపక్షాలన్నాయి. ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ మండలి తీర్మానం చేయాలని కాంగ్రెస్ కోరింది. సీఎం నేతృత్వంలో అఖిలపక్ష బృందం ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీకి విన్నవించాలని డిమాండ్ చేసింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఒత్తిడి వల్లే పోలవరం ఆర్డినెన్స్ జారీ అయిందని కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పోలవరం అంశాన్ని ప్రస్తావించారు. ‘‘నేను తెలంగాణ వాడిని. కానీ నా మండలం, ఊరు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లాయి. నేను ఇక్కడున్నా నా ఓటు, భూమి, గుర్తింపు కార్డు వంటివన్నీ అక్కడున్నాయి’’ అని ఆవేదన వెలిబుచ్చారు. పోలవరం ఆర్డినెన్స్ వల్ల అమాయక గిరిజనులు అన్యాయానికి గురవుతారన్నారు. దాన్ని వెనక్కు తీసుకునేలా ప్రయత్నించాలని సూచించారు. ‘మేం ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు. అయితే ముంపు సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలి’ అని సూచించారు. కేసీఆర్ జోక్యం చేసుకుని, ఈ విషయాన్ని మీ పార్టీ అధ్యక్షులకు చెప్పండని సూచించారు. ‘‘ముందు మీరు కండువాలు కప్పుకున్న పార్టీలు దీనిపై స్పష్టంగా ముందుకు రావాలి. అవి రాకపోతే మీరు బయటకు రండి. పోలవరంపై టీడీపీ కూడా వైఖరి స్పష్టం చేయాలి. ఒక పార్టీకి ఒకే సిద్ధాంతం, ఒకే అభిప్రాయం ఉండాలి. ఈ విషయంలో బాబు దుశ్చర్యకు పాల్పడ్డారు. జూన్ 2న ఆయన ఢిల్లీకి వెళ్లి ఒత్తిడి తేవడం వల్లే కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చింది. దీనిపై నేనిప్పటికే రాష్ర్టపతికి, ప్రధానికి లేఖలు రాశాను. బంద్ కూడా పాటించాం’’ అన్నారు. పోలవరం విషయంలో పార్టీలతో నిమిత్తం లేకుండా, తెలంగాణ ప్రజాప్రతినిధుల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని విపక్ష నేత జానారెడ్డి సూచించారు. పార్టీల అభిప్రాయాలను పట్టించుకోనవసరం లేదన్నారు. దీనిపై రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించొద్దని, వేరే పార్టీలపై ఒత్తిడి తేవద్దని రేవంత్‌రెడ్డి (టీడీపీ) సూచించారు. పోలవరం ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించాలని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి మండలిలో డిమాండ్ చేశారు. ఏడు మండలాలను అప్రజాస్వామికంగా ఆంధ్రలో కలిపేయడంపై భద్రాచలం గిరిజన ప్రాంతం అట్టుడికిపోతోందన్నారు. గవర్నర్ ప్రసంగంలో పోలవరం ఆర్డినెన్స్ ప్రస్తావనే లేదంటూ బి.వెంకటేశ్వర్లు (టీడీపీ) ఆక్షేపించారు. -
టిసిఎల్పి న్యాయపోరాటం
హైదరాబాద్: పోలవరం ఆర్డినెన్స్‌పై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(టిసిఎల్పి) నిర్ణయించింది. అసెంబ్లీ కమిటీ హాల్లో టిసిఎల్పి సమావేశం ముగిసింది. పోలవరం ఆర్డినెన్స్‌పై పోరాడాలని తీర్మానించారు. ఆర్డినెన్స్‌ను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు చట్ట సభల్లోనూ, ప్రజాక్షేత్రంలోనూ పోరాడాలని నిర్ణయించారు. పోలవరం బోర్డులో తెలంగాణకు అవకాశం ఇవ్వకపోవడాన్ని ఒక తీర్మానం ద్వారా ఖండించారు. టీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరారు. ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టేందుకు చురుగ్గా ఉండాలని నేతలు అభిప్రాయపడ్డారు. -
పోలవరం ఆర్డినెన్స్ అక్రమం: కవిత
-
16వ లోక్‌సభలో తొలి ఆందోళన
-
16వ లోక్‌సభలో తొలి ఆందోళన
న్యూఢిల్లీ: పోలవరం ఆర్డినెన్స్ పై 16వ లోక్‌సభలో తొలి ఆందోళన నమోదయింది. పోలవరం ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్, బీజేడీ ఎంపీలు లోక్‌సభలో నిరసనకు దిగారు. బి మహతాబ్ నేతృత్వంలోని బీజేడీ సభ్యులు ఆందోళనకు దిగారు. వీరికి టీఆర్ఎస్ ఎంపీలు జతకలిశారు. పోలవరం ఆర్డినెన్స్ కు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. పోలవరం ప్రాజెట్టు వల్ల గిరిజనులు ప్రయోజనాలు దెబ్బతింటాయంటూ నినాదాలు చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ నచ్చజెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు. ఆర్డినెన్స్ చర్చకు వచ్చినప్పుడు నిరసన తెలపాలని స్పీకర్ కోరినా సభ్యులు ఆందోళన కొనసాగించారు. రాష్రపతి ప్రసంగ ప్రతులను విసిరేశారు. దీంతో స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. -
'చంద్రబాబుకు ధీటుగా లాబీయింగ్ చేస్తా'
హైదరాబాద్ : బీజేపీ అగ్ర నేతలతో తనకున్న పరిచయాలతో తెలంగాణకు నిధులు, ప్రాజెక్టులు తీసుకు వస్తానని మహబూబ్‌నగర్ టీఆర్ఎస్ ఎంపీ, ఆ పార్టీ లోక్ సభ నేత జితేందర్ రెడ్డి తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధీటుగా లాబీయింగ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ మొదటి సమావేశాల్లోనే పోలవరం ఆర్డినెన్స్‌పై గళం విప్పుతామని జితేందర్ రెడ్డి మంగళవారమిక్కడ స్పష్టం చేశారు. లోక్‌సభలో పోలవరం ఆర్డినెన్స్‌ను అడ్డుకుంటామని ఆయన అన్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తే ఎన్డీయేపై పోరాడతామని జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవనున్నట్లు ఆయన చెప్పారు. త్వరలోనే నరేంద్ర మోడీని తెలంగాణకు ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు. ఎన్టీయేతో సత్సంబంధాలు కొనసాగిస్తామని, కేంద్రానికి తాము ప్రతిపక్షం కాదన్నారు. -
తప్పుదోవ పట్టిస్తున్న చంద్రబాబు: కడియం
వరంగల్: తెలంగాణ బిల్లులోలేని పోలవరం అంశంపై చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి విమర్శించారు. హన్మకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. యూపీఏ ఆర్డినెన్స్ తెచ్చినప్పుడే తమ నేత కేసీఆర్ వ్యతిరేకించారని, ఇప్పుడు ప్రధానమంత్రి మోడీపై వెంకయ్య, చంద్రబాబు కలిసి ఒత్తిడి తెచ్చి ఆర్డినెన్స్ తేవడం సిగ్గుచేటన్నారు. రెండు ప్రభుత్వాలతో చర్చించి చేపట్టాల్సిన కార్యక్రమాన్ని రెచ్చగొట్టేందుకు వినియోగించుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా నోరు మెదపని చంద్రబాబు ఇప్పుడు సీమాంధ్రకు అన్యాయం జరిగిందనే వాదన తెస్తున్నారని విమర్శించారు. జనాభా ప్రాతిపదికన విద్యుత్ పంపిణీ చేపట్టలేదనే వాదన వెనుక కుట్ర ఉందన్నారు. తాము కేంద్రంతో స్నేహపూర్వకంగా ఉండాలని భావిస్తున్నామని చెప్పారు. మహబూబాబాద్ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ మాట్లాడుతూ పోలవరంపై న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. -
సున్నం రాజయ్య దీక్ష భగ్నం
ఖమ్మం: భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సీపీఎం కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ సీపీఎం కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా రాజయ్య గత నాలుగు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నారు. ముంపు మండలాలను తెలంగాణాలోనే ఉంచాలని, పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చి నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. -
'మా తప్పిదాల వల్లే ఎన్నికల్లో ఓటమి'
నల్లగొండ: సార్వత్రిక ఎన్నికల్లో తమ తప్పిదాల వల్లే కాంగ్రెస్ ఓటమి పాలయ్యామని కరీంనగర్ కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా... నల్గొండ జిల్లా ప్రజలు విజ్ఞత ప్రదర్శించి గుత్తా సుఖేందర్ రెడ్డిని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆకాంక్షను గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. సోనియా లేకుంటే తెలంగాణ కల సాకారం అయ్యేది కాదని పొన్నం అన్నారు. అయితే కొంతమంది అమర వీరుల త్యాగబలం, 14 ఏళ్ల కేసీఆర్ ఉద్యమం వల్లే తెలంగాణ వచ్చిందనటం సరికాదన్నారు. ఇవన్నీ అందులో భాగమేనని పొన్నం వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాటకు కట్టుబడే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటం జరిగిందన్నారు. ఇక పోలవరం ఆర్డినెన్స్ విషయంలో టీఆర్ఎస్ తీసుకొనే నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందన్నారు. -
తెలంగాణ బంద్ సంపూర్ణం
* స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు, సంస్థలు * మూతపడిన బ్యాంకులు, పెట్రోల్ బంకులు, వాణిజ్య సముదాయాలు.. డిపోలు దాటని బస్సులు * అన్ని జిల్లాల్లోనూ భారీగా నిరసనలు, ధర్నాలు * పోలవరం ముంపు మండలాలపై కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు * మోడీ, బాబు, వెంకయ్య దిష్టిబొమ్మల దహనం * ఆందోళనల్లో పాల్గొన్న టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, టీజేఏసీ శ్రేణులు * బంద్ ప్రశాంతం: డీజీపీ సాక్షి నెట్వర్క్: తెలంగాణ బంద్ విజయవంతమైంది. పోలవరం ముంపు ప్రాంతాన్ని సీమాంధ్రలో కలపడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ గురువారం ఇచ్చిన బంద్ పిలుపునకు అన్ని వర్గాలు భారీగా స్పందించాయి. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అంతటా ఆందోళనలు జరిగాయి. టీఆర్ఎస్తో పాటు సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీల శ్రేణులు బంద్‌లో భాగస్వాములయ్యాయి. జేఏసీ కూడా మద్దతు తెలపడంతో బంద్ సంపూర్ణమైంది. అన్ని జిల్లాల్లోనూ బ్యాంకులు, పెట్రోల్ బంకులు, వాణిజ్య, వ్యాపార సంస్థలు పనిచేయలేదు. ఆర్టీసీ బస్సులు సాయంత్రం వరకు డిపోల నుంచి బయటకు రాలేదు. ఆందోళనకారులు ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు దిష్టిబొమ్మలను ద హనం చేశారు. ఖమ్మం జిల్లాలో భారీగా నిరసనలు ఖమ్మంలో ప్రభుత్వ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ముంపు మండలాలైన చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, భద్రాచలం, కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడులో ఆదివాసీలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్లో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆయనతోపాటు మరో 15 మంది దీక్షలో కూర్చున్నారు. వీరికి అశ్వారావుపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఆ పార్టీ నేత డాక్టర్ తెల్లం వెంకట్రావు సంఘీభావం ప్రకటించారు. వీఆర్‌పురంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ముత్యాల రామారావు, కాంగ్రెస్ నాయకుడు కడుపు రమేష్, ఎంపీటీసీ గూటాల శ్రీనివాస్‌లు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఇక ఖమ్మంలో టీఆర్ఎస్, సీపీఎం, ఎల్‌హెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో ధర్నాచౌక్ వద్ద వేర్వేరుగా ఆందోళనలు జరిగాయి. కొత్తగూడెంలో సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కేటీపీఎస్ ముందు విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేశారు. టేకులపల్లి మండలంలో బొగ్గు లారీలను బోడు రోడ్డు సెంటర్లో ఆందోళనకారులు నిలిపివేశారు. వీరికి మద్దతుగా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కూడా ఆందోళనలో పాల్గొన్నారు. వేలేరుపాడు, అశ్వారావుపేటలలో టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనలు తెలిపారు. ఇతర జిల్లాల్లోనూ.. ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్, బీఎస్పీ నాయకులు వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేశారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో పరీక్షలు వాయిదా పడ్డాయి. నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఎదుట నిర్వహించిన ధర్నాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు బైకు ర్యాలీ తీశారు. న్యూడెమోక్రసీ, సీపీఐ, సీపీఎం, పీడీఎస్‌యూ నాయకులు రాస్తారోకోలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో అన్నివర్గాల వారు స్వచ్చందంగా బంద్ పాటించారు. బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. నల్లగొండ జిల్లాలో జాతీయు రహదారిపై పలుచోట్ల టీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో చేపట్టాయి. రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన నల్లబండగూడెం వద్ద రోడ్డును దిగ్బంధించి ఆంధ్రా నుంచి వచ్చే వాహనాలను అడ్డుకున్నారు. ప్రధాని మోడీ, చంద్రబాబు, వెంకయ్యల దిష్టిబొమ్మలను పలుచోట్ల దహనం చేశారు. సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ తదితర పార్టీలు వేర్వేరుగా ర్యాలీల్లో పాల్గొన్నాయి. వుహబూబ్‌నగర్ జిల్లాలో పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు ర్యాలీలు, ధర్నాలు చేపట్టాయి. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లాలోనూ ఆందోళనలు కొనసాగాయి. రాజధానిలో ప్రశాంతం హైదరాబాద్‌లో బంద్ ప్రశాంతంగా ముగిసింది. బ్యాంకులు, వాణిజ్య సముదాయాలు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంకులు, విద్యా సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. కొన్ని చోట్ల టీఆర్ఎస్ శ్రే ణులు బలవంతంగా మూయించారు. నగరం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు ఎంజీబీఎస్, జూబ్లీ బస్స్టేషన్లకే పరిమితం కావడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకున్నారు. టీఆర్ఎస్ శ్రేణుల బైక్ ర్యాలీలు, ముఖ్య కూడళ్ల వద్ద బైఠాయింపులు, మిన్నంటిన తెలంగాణ నినాదాలతో నగరం మార్మోగింది. నిత్యం వాహనాల రద్దీతో కిటకిటలాడే ప్రధాన రహదారులు బోసిపోయి కనిపించాయి. పలు చోట్ల ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని అనంతరం విడుదల చేశారు. బంద్‌ను విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు సర్వశక్తులూ ఒడ్డారు. రంగారెడ్డిలోనూ బంద్ సంపూర్ణంగా జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. తాండూరులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. శంషాబాద్ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై ఎమ్మెల్సీ స్వామిగౌడ్, మేడ్చల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. కలెక్టరేట్లో టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి రామ్మోహన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కాగా, జంట నగరాల పరిధిలోని అన్ని కోర్టుల్లో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఉదయం 10 గంటలకే కోర్టుల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా జరిగిందని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. భద్రతా చర్యల్లో ఏపీఎస్పీ, సీఆర్పీఎఫ్ బలగాలను కూడా వినియోగించామని చెప్పారు. రాజీలేని పోరాటం చేస్తాం: టీఆర్ఎస్ పోలవరం ముంపు పేరిట ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్సును వ్యతిరేకిస్తున్నామని టీఆర్ఎస్ ఎమ్యెల్యే హరీష్ రావు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజల గొంతుకోసి మోసం చేశారన్నారు. ఆర్డినెన్స్‌తో రెండు లక్షల మంది గిరిజనుల బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి గోస ఊరికే పోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులకు అది మరణశాసనం వంటిదని, దీనికి నిరసనగానే వారు ఎన్నికలను కూడా బహిష్కరించారని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు తెలంగాణలోనే ఉంటూ గోతులు తీస్తున్నారని, ఇది అమానుషమని దుయ్యబట్టారు. ఈ ఏడు మండలాల్లో ఉన్న ఖనిజ, అటవీ సంపద, చింతూర్ లోయలోని 460 మెగావాట్ల సీలేర్ విద్యుత్ ప్రాజెక్ట్‌ని సీమాంధ్రలో కలపడం వల్ల ఏడాదికి రూ. వెయ్యి కోట్ల నష్ట జరుగుతుందన్నారు. ఇంత జరుగుతున్నా తెలంగాణ టీడీపీ నేతలు చీమూనెత్తురు లేకుండా మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. పక్క రాష్ట్రానికి చెందిన చంద్రబాబు తెలంగాణ ప్రజల గొంతు కోస్తున్నా టీ-టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు బాబును ఎలా క్షమిస్తారని ప్రశ్నించారు. దీనిపై రాజీలేని పోరాటం చేస్తామని హరీష్‌రావు చెప్పారు. ఇక కేంద్రం చర్య అప్రజాస్వామికమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఎంజీబీఎస్‌లో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోకుంటే టీఆర్ఎస్ నేతృత్వంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఆర్డినెన్స్ తేవడం రాజకీయ కుట్ర: న్యూడెమోక్రసీ పోలవరం ముంపు ప్రాంతాలపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను పెద్ద రాజకీయ కుట్రగా సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ అభివర్ణించింది. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత డిజైన్ ఎంత మాత్రం అంగీకారం కాదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదె దివాకర్ పేర్కొన్నారు. మరోవైపు పోలవరం ముంపు ప్రాంతాలపై ఆర్డినెన్స్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని గిరిజన ఐక్య వేదిక డిమాండ్ చేసింది. కేంద్రం చర్యకు నిరసనగా నగరంలోని ట్యాంక్‌బండ్‌పైనున్న కొమరం భీం విగ్రహం వద్ద గురువారం పలు సంఘాల గిరిజన నేతలు నిరసన తెలి పారు. ఆర్డినెన్స్‌పై న్యాయ పోరాటంతో పాటు, ఉద్యమాలు చేస్తామని వేదిక అధ్యక్షుడు వివేక్ వినాయక్ తెలిపారు. టీ-కాంగ్రెస్ నేతల ఆగ్రహం పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్సును తెలంగాణ కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. ఇరు రాష్ట్రాలతో చర్చించకుండా హడావుడిగా ఆర్డినెన్స్ జారీ చేయడం సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఇలాంటి తొందరపాటు నిర్ణయం వల్ల ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చురేగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఇందిరాసాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టు, 400 మెగావాట్ల హైడల్ ప్రాజెక్టు ముంపు మండలాల్లోనే ఉన్నాయని, వాటిని కూడా ఆంధ్రప్రదేశ్‌కు తరలించే కుట్రతోనే ఆర్డినెన్స్‌ను తెచ్చారని అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రులు జానారెడ్డి, జీవన్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి గురువారం వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై మండిపడ్డారు. ఈ ఆర్డినెన్స్ న్యాయ సమీక్షకు నిలబడదని, రాష్ర్ట అసెంబ్లీ అభిప్రాయం కోరకుండా సరిహద్దులు మార్చే అధికారం కేంద్రానికి లేద ని జీవన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశమైన వెంటనే ఈ ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయాలని సూచించారు. -
పోలవరం ఆర్డినెన్స్‌కు ఓకే
* రాష్ట్రపతి ప్రణబ్ ఆమోదం.. ముంపు గ్రామాలపై గెజిట్ నోటిఫికేషన్ సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ముంపు గ్రామాలను తెలంగాణ నుంచి విడదీసి ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ కేంద్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. తదనుగుణంగా గురువారం ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈమేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014కు తొలి సవరణ ఇది. చట్టంతోపాటే ఇదీ అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు లేనందున రాష్ట్రపతి ఈ ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. దీనిని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) ఆర్డినెన్స్, 2014గా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండో భాగంలోని సెక్షన్ 3లో ఖమ్మం జిల్లాను నిర్వచిస్తూ ‘2005 జూన్ 27వ తేదీ నాటి సాగునీటి శాఖ విడుదల చేసిన జీవో ఎం.ఎస్.111 ప్రకారం ఉన్న రెవెన్యూ గ్రామాలు, బూర్గంపాడు మండలంలోని బూర్గంపాడు, సీతారామనగరం, కొండ్రేకలను మినహాయించి’ అని నిర్వచించారు. నిర్వాసితులకు అక్కడే పునరావాసం కల్పించేందుకు వీలుగా మండలాలను యూనిట్‌గా తీసుకుని సీమాంధ్రలో కలపాలన్న డిమాండ్ మేరకు గత యూపీఏ ప్రభుత్వం మార్చి 2న ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేబినెట్లో నిర్ణయించింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం, చట్టం అమల్లోకి రాక ముందే హడావుడిగా సవరణ తేవడం సమంజసంగా ఉండదన్న భావనతో రాష్ట్రపతి ఆ ఫైలును తిప్పిపంపారు. దీంతో తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం మంగళవారం కేబినెట్లో ఆ సవరణను ఆమోదించింది. దీని ప్రకారం ఖమ్మం జిల్లాను పునర్నిర్వచించారు. పాల్వంచ డివిజన్లోని కుకూనూరు, వేలేరుపాడు, బూర్గుంపాడు (రెవెన్యూ గ్రామాలు పినపాక, మోరంపల్లి బంజర, బూర్గంపాడు, నాగినిప్రోలు, కృష్ణసాగర్, టేకుల, సారపాక, ఇలవెండి, మోతెపట్టినగర్, ఉప్పుశాక, నకిరీపేట, సోంపల్లి గ్రామాలు మినహా), మండలాలు, భద్రాచలం రెవెన్యూ డివిజన్లోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, భద్రాచలం (భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా) మండలాలు మినహాయిస్తూ ఖమ్మం జిల్లాను నిర్వచించారు. అంటే ఈ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనమవుతాయి. -
హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు
* పోలవరం ఆర్డినెన్స్ వివాదాస్పదమేమీ కాదు * గత ప్రభుత్వ హామీనే అమలుచేశాం * కేంద్ర మంత్రి అశోక్‌గజపతి రాజు సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును ఎన్టీయార్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చే విషయాన్ని పరిశీలిస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతి రాజు వెల్లడించారు. ప్రస్తుత డిమాండ్‌ను పరిశీలిస్తామని, అవకాశం ఉంటే మార్చేస్తామని చెప్పారు. ఆయన గురువారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఉదయం, మళ్లీ సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే... బేగంపేట్ ఎయిర్‌పోర్టులో ఉన్నప్పుడు అంతర్జాతీయ టెర్మినల్‌కు రాజీవ్‌గాంధీ పేరు, దేశీయ టర్మినల్‌కు ఎన్టీఆర్ పేరుండేది. టీడీపీ హయాంలో శంషాబాద్‌లో కొత్త విమానాశ్రయం ఏర్పాటుచేసింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దానికి రాజీవ్‌గాంధీ పేరు పెట్టింది. పేరు మార్చాలని మహానాడులో డిమాండ్ వచ్చింది. డిమాండ్‌ను పరిశీలించి, అవకాశం ఉంటే మార్చేస్తాం. పోలవరం ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌లో వివాదమేమీ లేదు. కొత్త విషయం అంతకన్నా లేదు. పోల వరం స్వాతంత్య్రంనాటి నుంచి పెండింగ్‌లో ఉంది. ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతామని గత ప్రభుత్వం పార్లమెంట్లో హామీ ఇచ్చింది. బీజేపీ కూడా దానికి మద్దతు ఇచ్చింది. అయితే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి ఆపేసి ఉండొచ్చు. తొలి కేబినెట్ సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకున్నాం. దీన్ని కొందరు రాద్ధాంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇరు రాష్ట్రాలకు కాబోయే(డిజిగ్నేటెడ్) ముఖ్యమంత్రులను పిలిచి చర్చ పెట్టాలంటే.. అపాయింటెడ్ డేను పోస్ట్‌పోన్ చేయాలి. కానీ అందుకు ప్రజలు ఇష్టపడకపోవచ్చు. -
తెలంగాణ బంద్‌కు ముంబైకర్ల మద్దతు
సాక్షి, ముంబై: పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ బంద్‌కు మద్దతుగా గురువారం మధ్యాహ్నం ముంబైలోని ములుండ్ అంబేద్కర్ నగర్లో ముంబై టీ జాక్ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలోని టీఆర్ఎస్ చేపట్టిన రాష్ట్ర బంద్‌కు ముంబైకర్లు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని టీఆర్ఎస్ ముంబై శాఖ ప్రధాన కార్యదర్శి శివరాజ్ బోల్లె వెల్లడించారు. ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని జాక్ కన్వీనర్ బి. ద్ర విడ్ మాదిగ డిమాండ్ చేశాడు. ఈ ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేక అతిథులుగా నిజామాబాద్ జిల్లా జేఏసీ కన్వీనర్ చాకు లింగం పద్మశాలి తో పాటు భివండీ నుంచి బోగ సుదర్శన్ పద్మశాలి, గాది లక్ష్మణ్, జి. ఏసుదాస్, జి. లక్ష్మణ్ మాదిగ, కె. శేఖర్ మాదిగ, రామగిరి శంకర్, కె. సాయిలు తదితరులు పాల్గొన్నారు. కార్మిక నాయకుల ఖండన ఖమ్మం జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న ఏడు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్‌ను ముంబై మిల్లు కార్మిక నాయకుడు గన్నారపు శంకర్ ఖండించారు. వెంటనే ఆర్డినెన్స్‌ను తిరిగి వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
పోలవరం ఆర్డినెన్సును తిప్పి పంపండి..!
సాక్షి, ముంబై: పోలవరం ఆర్డినెన్సును తిప్పి పంపాలని ముంబై తెలంగాణ సంఘీభావ వేదిక డిమాండ్ చేసింది.సీమాంద్ర రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి... మోడీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబుల కుట్రల ఫలితంగా పోలవరంపై ఆర్డినెన్సును రూపొందించారని ఆరోపించింది. వివిధ తెలంగాణ సంఘాల మద్దతుతో తూర్పు దాదర్‌లోని అంబేద్కర్ భవనం ఎదురుగాగల శ్రామిక హాలులో మధ్యాహ్నం 2.00 గంటలకు వేదిక ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఆర్డినెన్సును తిప్పి పంపాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం హాలులో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముంబై రిలయన్స్ ఎనర్జీ కార్మిక సమాఖ్య నాయకుడు పొట్ట వెంకటేశ్, మహారాష్ట్ర తెలంగాణ మంచ్ అధ్యక్షుడు గుడుగుంట్ల వెంకటేశ్, వేదిక నాయకులు అక్కనపెల్లి దుర్గేశ్, మల్లేశ్, శ్రమజీవి సంఘం నాయకులు బాబుశంకర్, ఎడ్ల సత్తయ్య, అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి మచ్చ ప్రభాకర్ హాజరై ప్రసంగించారు. ఖమ్మం జిల్లాలోని(భద్రాచలం) 7 మండలాలను సీమాంధ్రలో కలపడాన్ని తెలంగాణ వ్యతిరేక చర్యగా పొట్ట వెంకటేశ్ అభివర్ణించారు. ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోకపోతే భవిష్యత్తులో మన జలవనరులు, అటవీ సంపదలే కాకుండా ఆదివాసుల జీవితాలు కూడా నాశనమయ్యే ప్రమాదం ఉందని దుర్గేశ్ పేర్కొన్నారు. వెంకటేశ్ జి. మాట్లాడుతూ.. రాబోయే తెలంగాణకు సీమాంధ్రుల కుట్రలు ఎంత ప్రమాదకరమో మొదటి ఆర్డినెన్సు ద్వారా రుచి చూపింరని, దీనిని వ్యతిరేకించాలని కోరారు. రచయిత మచ్చ ప్రభాకర్ మాట్లాడుతూ.. మోడీ, వెంకయ్య, చంద్రబాబుల కుట్రల ఫలితంగానే పోలవరం ఆర్డినెన్సును కేంద్రం రాష్ట్రపతికి పంపించే ధైర్యం చేసిందని, దీనితో వారి తెలంగాణ వ్యతిరేక స్వభావాలు బయట పడ్డాయని, ఇక రాబోయే తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యోగులు, మేధావులు, కవులు, ప్రజలు మరింత చైతన్యవంతమై ఎదుర్కొంటే తప్ప తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోదన్నారు. ఇదిలాఉండగా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ముంబైలోని తెలంగాణ ప్రజా, కులసంఘాలు ఘనంగా జరుపుకోవాలని వేదిక నాయకులు బాబూ శంకర్, పొట్ట వెంకటేశ్, ఎడ్ల సత్తయ్య, శ్రీను, మల్లేశ్ తదితరులు కోరారు. -
పోలవరం ఆర్డనెన్స్కు వ్యతిరేకం: టి-కాంగ్ నేతలు
-
'సీఎం అవుతున్నా కేసీఆర్ వైఖరిలో మార్పురాలేదు'
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కాబోతున్నా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. బంద్‌లతో ప్రజలను మళ్లీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. పోలవరం ఆర్డినెన్స్‌పై ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని మోత్కుపల్లి అన్నారు. ఆర్డినెన్స్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయటం తగదని మోత్కుపల్లి హితవు పలికారు. -
పోలవరం ఆర్డినెన్స్ తొందరపాటు చర్య
పోలవరం ఆర్డినెన్స్ తొందరపాటు చర్య అని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభివర్ణించారు. పార్లమెంట్ సమావేశాలకు ముందుగా అర్డినెన్స్ తేవడం సరైన చర్యల కాదని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో అసదుద్దీన్ ఓవైసీ భేటీ అయ్యారు. అనంతరం అసదుద్దీన్ విలేకర్లతో మాట్లాడారు. కిషన్‌బాగ్ ఘటనపై జ్యుడిషయల్ విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి అసదుద్దీన్ ప్రభుత్వానికి సూచించారు. -
'తెలంగాణకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు'
టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. గురువారం నల్గొండలో ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకునేలా చంద్రబాబు కేంద్రంతో సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో గండిపేటలో నిన్న మొన్న జరిగిన మహానాడులో రెండు ప్రాంతాలు తనకు సమానమని అన్నారని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణకు అన్యాయం చేస్తే తాము చూస్తూ ఊరుకోమని ప్రభాకర్ రెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు నేపథ్యంలో తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపుతూ రాష్ట్రపతి బుధవారం ఆర్డినెన్స్ జారీ చేశారు. ఆ ఆర్డినెన్స్‌ను తెలంగాణలో అధికారాన్ని చేపట్టనున్న టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. దాంతో గురువారం తెలంగాణ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. -
కొనసాగుతున్న తెలంగాణ బంద్
-
పోలవరం ఆర్డినెన్స్’కు కేంద్ర కేబినెట్ ఆమోదం
-
ఆర్డినెన్స్‌పై సుప్రీంకు టీఆర్ఎస్
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం తేనున్న ఆర్డినెన్స్‌పై న్యాయ పోరాటం చేసేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఈ విషయంలో హడావుడిగా ఆర్డినెన్స్ తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ఆ పార్టీ నిర్ణయానికి వచ్చింది. తెలంగాణ ప్రజల మనోభీష్టానికి విరుద్ధంగా ఆర్డినెన్స్ తెస్తే న్యాయపోరాటం చేస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇప్పటికే ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా పార్టీ ఎంపీ వినోద్‌కుమార్ బుధవారం ఢిల్లీలో పలువురు సీనియర్ న్యాయవాదులతో భేటీ అయ్యారు. ఈ అంశంపై కోర్టులో ప్రత్యేక పిటిషన్ వేసే విషయమై చర్చలు జరిపారు. ప్రస్తుతం కోర్టుకు సెలవులు ఉన్నందున, అవి ముగిసిన వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. అంతకుముందు కేంద్ర హోం శాఖ అధికారులతోనూ వినోద్ భేటీ అయ్యారు. ఆర్డినెన్స్‌ను తీసుకురావద్దని కోరినట్లు తెలిసింది. ఆర్టికల్ 3ని కాదని ఓ రాష్ట్ర పరిధిలోని ప్రాంతాన్ని మరో రాష్ర్టంలో కలపడం కుదరదని వారితో చెప్పారు. అయితే దీనిపై హోంశాఖ అధికారులు ఎలా స్పందించారన్నది తెలియరాలేదు. అనంతరం వినోద్ మీడియాతో మాట్లాడుతూ.. మరో 4 రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న సమయంలో ఇలాంటి ఆర్డినెన్స్ తేవడం సరికాదన్నారు. ఇరు ప్రభుత్వాలతో చర్చించాకే దీనిపై ముందుకు వెళ్లాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. -
7 మండలాలు సీమాంధ్రకు
* ‘పోలవరం ఆర్డినెన్స్’కు కేంద్ర కేబినెట్ ఆమోదం * ముంపు మండలాలపై నేడో రేపో ఉత్తర్వులు జారీ * ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలంలోని 12 గ్రామాలు తెలంగాణకు * భద్రాచలం పట్టణం, రామాలయం కూడా సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం జిల్లాలో ఉన్న ఏడు పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014కు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ తొలి సమావేశంలోనే ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సంబంధిత ఫైలు బుధవారం రాష్ట్రపతి కార్యాలయానికి చేరడం, దానిపై ఆయన సంతకం చేయడం కూడా జరిగిపోయినట్టు పలు చానళ్లలో బుధవారం సాయంత్రం వార్తలుచ్చాయి. ఆర్డినెన్స్ నేడో రేపో జారీ కానుందని విశ్వసనీయ సమాచారం. నిజానికి విభజన బిల్లు గతంలో రాజ్యసభలో చర్చకు వచ్చిన సందర్భంలో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ చేసిన ప్రకటన మేరకు గత కేంద్ర కేబినెట్ మార్చి 2వ తేదీనే ఆర్డినెన్స్ నిర్ణయం తీసుకుంది. కానీ సంబంధిత ఫైలుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేయలేదు. మంత్రిమండలి సమావేశం జరిగిన 3 రోజులకే మార్చి 5న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటం తెలిసిందే. పైగా విభజన చట్టం అమల్లోకైనా రాకముందే మళ్లీ సవరణ తేవడం సమంజసం కాదన్న యోచనతో రాష్ట్రపతి అప్పుడు ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలుపకుండా ఫైలు తిప్పి పంపారు. విశ్వసనీయ సమాచారం మేరకు... గత మంత్రిమండలి నిర్ణయాన్ని అమలు చేసేందుకు మోడీ కేబినెట్ పూనుకుంది. మంగళవారం తన తొలి భేటీలోనే సంబంధిత ఫైలును మళ్లీ ఆమోదించి బుధవారం రాష్ట్రపతికి పంపింది. మంగళవారం నాటి మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన సందర్భంగా కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను ఆర్డినెన్స్ తదితరాలపై ప్రశ్నించగా, అసలు పోలవరంపై చర్చే జరగలేదని చెప్పడం తెలిసిందే. ఆర్డినెన్స్‌లో ఏముంది.. పోలవరం నిర్వాసితులకు సొంత మండలంలోనే భూమికి బదులు భూమి లభించేలా పునరావాస ప్యాకేజీని అమలు చేసేందుకు ఆర్డినెన్స్ దోహదపడుతుంది. ఇందుకోసం మండలాలను యూనిట్‌గా తీసుకుని నిర్వాసిత ప్రాంతాలను యూపీఏ-2 సర్కారు సీమాంధ్రలో కలిపింది. అయితే భద్రాచలానికి దారినిచ్చే బూర్గంపాడు మండలంలోని 12 రెవెన్యూ గ్రామాలను, భద్రాచలం పట్టణాన్ని మాత్రం తెలంగాణలోనే ఉంచింది. ఈ విషయమై మార్చి 2న జరిగిన కేబినెట్ భేటీలో రాష్ట్రానికి చెందిన అప్పటి మంత్రులు ఎస్.జైపాల్‌రెడ్డి, కావూరి సాంబశివరావు, పల్లంరాజు, కిశోర్ చంద్రదేవ్ పాల్గొన్నారు. ఏడు పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలపాలన్న అంశంపై చర్చ జరిగింది. దాన్ని జైపాల్ తీవ్రంగా వ్యతిరేకించారు. విభజన బిల్లులో ఇలా... నిజానికి భద్రాచలం పట్టణం, రామాలయం మినహా ఏడు మండలాల్లోని రెవెన్యూ గ్రామాలను మాత్రమే విభజన బిల్లులో చేర్చారు. ముంపు గ్రామాల జీవోను ఇందుకు ప్రాతిపదికగా తీసుకున్నారు. కానీ కేవలం ముంపు గ్రామాలను మాత్రమే కలిపితే నిర్వాసితులకు భూమికి బదులు భూమి ఇవ్వాలంటే సీమాంధ్ర రాష్ట్రానికి కష్టమవుతుందన్న అక్కడి ప్రజాప్రతినిధుల డిమాండ్ మేరకు అప్పటి కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే అప్పట్లో రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. నిర్వాసితుల పునరావాసం విషయంలో అవసరమైన అన్ని చర్యలూ కేంద్రం తీసుకుంటుందని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ గ్రామాలను కాకుండా పూర్తిగా మండలాలనే సీమాంధ్రకు ఇస్తే భూమికి బదులు భూమిని సొంత మండలంలోనే ఇవ్వొచ్చని యూపీఏ-2 సర్కారు భావించింది. ఆ మేరకు మండలాలను యూనిట్‌గా తీసుకునేందుకు మార్చి 2న జరిగిన మంత్రివర్గ భేటీలో నిర్ణయించింది. కానీ దీన్ని జైపాల్ తప్పుబట్టారు. మండలాలన్నింటినీ ఇచ్చేస్తే భ ద్రాచలం పట్టణానికి తెలంగాణతో అనుసంధానం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దాంతో అనుసంధానానికి అవసరమైన బూర్గంపాడు మండలంలోని 12 రెవెన్యూ గ్రామాలను తెలంగాణలోనే ఉంచేందుకు కేబినెట్ తీర్మానించి, ఆ మేరకు చట్ట సవరణ చేయాలని భావించింది. ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లే మండలాలివీ... పాల్వంచ రెవెన్యూ డివిజన్: కుకునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు (పినపాక, మోరంపల్లి బంజర, బూర్గంపాడు, నాగినిప్రోలు, కృష్ణసాగర్, టేకుల, సారపాక, ఇరవెండి, మోతెపట్టినగర్, ఉప్పుసాక, నకిరిపేట, సోంపల్లి రెవెన్యూ గ్రామాలు మినహా. ఈ 12 గ్రామాలూ తెలంగాణకు వెళ్తాయి) భద్రాచలం రెవెన్యూ డివిజన్: చింతూరు, కూనవరం, వీఆర్ పురం, భద్రాచలం (భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా) మండలాలు భద్రాచలం టౌన్, రామాలయం తెలంగాణలో ఉంటాయి ఎందుకీ నిర్ణయం? దీనివల్ల ముంపు, పునరావాస ప్రాంతాలు రెండూ సీమాంధ్రలోనే ఉంటాయి. కాబట్టి ముంపు బాధితులు తాము కోల్పోయే భూమికి బదులుగా సొంత మండలంలోనే భూమి పొందుతారు. తద్వారా పోలవరం నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలూ ఉండవు. ఆర్డినెన్స్‌ను ఆమోదించొద్దు: రాష్ట్రపతికి కేసీఆర్ లేఖ ‘పార్లమెంటు ఆమోదంతో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలోని 7 మండలాలను తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సును ఆమోదించకండి’ అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు కోరారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆయనకు లేఖ రాశారు. పార్లమెంటు చేసిన చట్టాన్ని ధిక్కరిస్తూ నరేంద్ర మోడీ సర్కారు ఇలా ఆర్డినెన్స్ తేవడం పార్లమెంటు సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడమేనన్నారు. ‘‘రాజ్యాంగంలోని 3వ అధికరణ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014ను ఫిబ్రవరిలో పార్లమెంటు ఆమోదించింది. అందులో పార్లమెంట్ నిర్దేశించిన రాష్ట్రాల సరిహద్దులను మార్చేలా ప్రధాని ఆర్డినెన్స్ తేవడం దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులను మార్చకుండా, ఆంక్షలు లేకుండా ఉండేలా కృషి చేస్తామని చెప్పిన టీఆర్ఎస్కు ఇక్కడి ప్రజలు ఎన్నికల్లో పట్టం కట్టారు. వారెన్నుకున్న ప్రజా ప్రభుత్వం జూన్ 2 నుంచి ఏర్పాటవనుంది. కానీ అలా ప్రభుత్వం ఏర్పాటవకముందే సరిహద్దులను మార్చడం రాజ్యాంగ విరుద్ధం. అప్రజాస్వామికం. వారం రోజుల్లో పార్లమెంటు కొలువుదీరనుండగా ఆర్డినెన్స్ తేవడం సరికాదు’’ అని పేర్కొన్నారు. ఇది కేసీఆర్ అనవసర రాద్ధాతం: మురళీధర్ రావు పోలవరం ముంపు గ్రామాలపై రాజ్యసభలో చర్చించి తీసుకున్న తుది నిర్ణయం మేరకే ఆర్డినెన్స్ రూపొందుతుంది. యూపీఏ హయాంలో ఈ కసరత్తు జరిగింది. దాన్ని ఆర్డినెన్స్‌గా తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఇపుడు ఆ తంతే జరిగింది. ఇందులో కొత్త విషయమేమీ లేదు. ముంపు గ్రామాలకు సంబంధించి రాజ్యసభలో తీసుకున్న నిర్ణయాన్ని అప్పట్లో అన్ని పార్టీలు ఆమోదించాయి. ఆ తరవాతనే,.. తెలంగాణ బిల్లు ఆమోదం నేపథ్యంలో కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో సోనియాగాంధీ నివాసానికి వెళ్లి ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్డినెన్స్‌పై ఇపుడు కేసీఆర్ చేసే రాద్ధాంతం, మోడీపై బురద జల్లేందుకే. దీన్ని ప్రజలు హర్షించరు. తెలంగాణ సాకారమయ్యే దిశలో పట్టువిడుపుల ధోరణితోనే పోలవరం ముంపు గ్రామాలపై నిర్ణయం తీసుకున్నారు. - మురళీధర్ రావు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.