'కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది' | center moves unilateral for polavaram | Sakshi
Sakshi News home page

'కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది'

Published Sat, Jul 12 2014 7:56 PM | Last Updated on Sat, Sep 2 2017 10:12 AM

'కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది'

'కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది'

ఢిల్లీ: పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో చేసిన సవరణలకు కేంద్రం ఆమోదం తెలపడాన్ని మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తప్పుబట్టారు. ఈ అంశంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించిందని విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడిన జైపాల్ రెడ్డి.. ఉద్దేశ్యపూర్వకంగానే ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాను మొదట్లోనే వ్యతిరేకించానని తెలిపారు.

 

తెలంగాణ బిల్లు ప్రక్రియ పూర్తయిందని,  ఆ బిల్లుకు సవరణ చేసే శక్తి ప్రభుత్వానికి, పార్లమెంట్ కు లేదన్నారు.తెలంగాణ బిల్లు ఆర్టికల్ 3,4 ప్రకారం పాసందైని, అసలు ఆ సవరణ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రద్రించకుండా సవరణ ఎలా చేస్తారని జైపాల్ రెడ్డి ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement