ఖమ్మం: భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సీపీఎం కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ సీపీఎం కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు.
పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా రాజయ్య గత నాలుగు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నారు. ముంపు మండలాలను తెలంగాణాలోనే ఉంచాలని, పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చి నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.
సున్నం రాజయ్య దీక్ష భగ్నం
Published Sun, Jun 1 2014 6:13 PM | Last Updated on Sat, Sep 2 2017 8:10 AM
Advertisement