sunnam Rajaiah
-
సున్నం రాజయ్య రాజకీయ ప్రస్థానం ఇలా..
భద్రాచలంఅర్బన్: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య(62) సోమవారం రాత్రి మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్యను కుటుంబసభ్యులు భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో అనుమానం వచ్చిన వైద్యులు సోమవారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ రావడంతో వెంటనే మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించాలని సూచించారు. ఆ రాత్రే అంబులెన్స్‌లో విజయవాడ తీసుకెళ్లారు. ఆస్పత్రికి వెళ్లగానే పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. రాజయ్య మృతిని నియోజకవర్గ ప్రజలు, ఈ ప్రాంత గిరిజనులు తట్టుకోలేకపోతున్నారు. రాజకీయ ప్రస్థానం ఇలా.. గ్రామ సర్పంచ్‌గా మొదలైన రాజయ్య ప్రస్థానంఎమ్మెల్యే వరకు కొనసాగినా.. ఎప్పుడూ నిరాడంబర జీవితం గడిపారు. అనుక్షణం ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసమే పరితపించేవారు. ఏపీలో విలీనమైన వీఆర్ పురం మండలం చిన్నమట్టపల్లి పంచాయతీ శివారులోని సున్నంవారిగూడెంలో 1958 ఆగస్టు 8న సున్నం రాజులు, కన్నమ్మ దంపతులకు జన్మించారు. ఆయనకు భార్య చుక్కమ్మ, నలుగురు పిల్లలు ఉన్నారు. పదో తరగతి వరకు చదువుకున్న రాజయ్య 1988లో చిన్నమట్టపల్లి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అదే సమయంలో ఆ గ్రామ సీపీఎం కార్యదర్శిగా పనిచేశారు. 1990లో డీవైఎఫ్ఐ భద్రాచలం డివిజన్ అధ్యక్షుడిగా, 1994లో సీపీఎం డివిజన్ కార్యదర్శిగా నియమితులయ్యారు. తనకు మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి, సీపీఎం నేత బండారు చందర్రావు గురువులు అని చెప్పుకునేవారు. ఈ క్రమంలోనే తన కుమారుడికి చందర్రావు అని పేరు పెట్టారు. 1999లో తొలిసారి భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి చిచ్చడి శ్రీరామ్మూర్తిపై 6,349 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ పార్టీ పొత్తుతో మళ్లీ టీడీపీ అభ్యర్థి సోడె రామయ్యపై 14 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి కుంజా సత్యవతి చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి 2014 ఎన్నికల్లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భద్రాచలం నియోజకవర్గంలోని మండలాలు ఏపీలో విలీనం కావడంతో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎప్పుడూ ప్రజా సమస్యలు, గిరిజనుల హక్కుల కోసం అసెంబ్లీలో గళమెత్తేవారు. తనదైన శైలితో అందరినీ ఆకట్టుకునేవారు. ఆర్టీసీ బస్సులో లేదా ఆటోలో అసెంబ్లీకి వెళ్లేవారు. తన నియోజకవర్గంలో అయితే ద్విచక్రవాహనంపైనే తిరుగుతూ, ప్రజా సమస్యలు తెలుసుకునేవారు. ఒకసారి రాజయ్య ఆటోలో అసెంబ్లీకి వెళ్లగా, అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. తాను ఎమ్మెల్యేనని గుర్తింపు కార్డు చూపించిన తర్వాత లోనికి అనుమతించారు. దీనిపై అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం సున్నం రాజయ్యను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని, నియోజకవర్గంపై పట్టు సాధించాలని తమ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించడం గమనార్హం. నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి.. ఎమ్మెల్యేగా భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధికి సున్నం రాజయ్య ఎనలేని కృషి చేశారు. ఈ విషయంలో ఆయన ఎక్కడా రాజీపడకుండా వ్యవహరించారు. భద్రాచలంలో ప్రస్తుతం ఉన్న మూడో మంచినీటి ట్యాంక్ కోసం 2005లో విశేష కృషి చేశారు. తునికాకు అమ్మకాలపై ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ఆకు సేకరించే కార్మికులకు బోనస్‌గా ఇవ్వాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని పలుమార్లు కలిసి కోరగా, బోనస్ ఇచ్చేందుకు వైఎస్ అంగీకరించారు. తెలంగాణ ఆదివాసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఆదివాసీల హక్కుల కోసం నిరంతరం పోరాడారు. తాలిపేరు బ్రిడ్జి, వెంకటాపురంలోని పాలెంవాగు ప్రాజెక్ట్‌లు రాజయ్య కృషి వల్లే ఏర్పాటయ్యాయి. విశాఖపట్నంలో బాక్సైట్ భూముల కోసం, 1/70 చట్ట పరిరక్షణకు ఆయన ఎనలేని కృషి చేశారు. ప్రస్తుతం రాజయ్య ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. సున్నం రాజయ్య మృతిపట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల కార్యదర్శులు అన్నవరపు కనకయ్య, నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య తదితరులు సంతాపం తెలిపారు. -
కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి
వీఆర్‌పురం, (రంపచోడవరం)/సాక్షి అమరావతి: సీపీఎం నేత, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (62) కరోనా బారినపడి కన్నుమూశారు. కోవిడ్ సోకిన ఆయనను మెరుగైన వైద్యం నిమిత్తం సోమవారం విజయవాడలోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతిచెందారు. గత కొద్దిరోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో సోమవారం భద్రాచలంలో కరోనా పరీక్ష చేయించగా ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా, కోవిడ్–19 నిబంధనలకు అనుగుణంగా మంగళవారం రాజయ్య అంత్యక్రియలను తూర్పు గోదావరి జిల్లా వీఆర్‌పురం మండలంలోని ఆయన స్వగ్రామం సున్నంవారిగూడెంలో నిర్వహించినట్లు తహసీల్దార్ ఎన్. శ్రీధర్ తెలిపారు. రాజయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భద్రాచలం అసెంబ్లీ స్థానం నుంచి సీపీఎం తరఫున 1999, 2004, 2014లలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రంపచోడవరం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. రాజయ్యకు తల్లి కన్నమ్మ, భార్య చుక్కమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. సున్నం రాజయ్య మృతికి సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీలు మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తంచేశాయి. ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు తీరనిలోటని పేర్కొన్నాయి. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా సంతాపం తెలిపారు. సీఎం జగన్ సంతాపం భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య మృతిపట్ల సీఎం వైఎస్ జగన్ తీవ్ర విచారాన్ని వ్యక్తంచేశారు. రాజయ్య కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/వీఆర్‌పుర : ఆదివాసీల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన కమ్యూనిస్టు యోధుడు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (62) కరోనా కాటుకు బలయ్యారు. ఏపీ రాష్ట్రం విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న రాజయ్య.. భద్రాచలంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని తూర్పుగోదావరి జిల్లా వీఆర్‌పురం మండలంలోని స్వగ్రామమైన సున్నంవారిగూడెంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల ఆయన కుటుంబంలో పలువురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ సమయంలో రాజయ్యకు పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చినప్పటికీ, ఆ మరుసటి రోజు నుంచి జ్వరం వస్తూనే ఉంది. చికిత్స చేయించుకున్నప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో సోమవారం భద్రాచలంలో మరోసారి కోవిడ్ పరీక్ష చేయించారు. అక్కడ ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలోనే చికిత్స కోసం విజయవాడ తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి కన్నుమూశారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మంగళవారం రాజయ్య అంత్యక్రియలను ఆయన స్వగ్రామంలో కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించారు. రాజయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భద్రాచలం అసెంబ్లీ స్థానానికి సీపీఎం తరఫున 1999, 2004, 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ రాష్ట్రం రంపచోడవరం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాజయ్యకు తల్లి కన్నమ్మ, భార్య చుక్కమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివాసీలతో మమేకమై.. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా వీఆర్ పురం మండలం సున్నంవారిగూడెం గ్రామానికి చెందిన రాజయ్య 1958 ఆగస్టు 8న జన్మించారు. 1979 నుంచి ఆయన సీపీఎంలో పని చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని లెభద్రాచలం డివిజన్ డీవైఎఫ్ఐ కార్యదర్శిగా సీపీఎంలో ప్రస్థానం ప్రారంభించిన రాజయ్య.. సాదాసీదా జీవితం గడుపుతూ, నిత్యం ఆదివాసీలతో మమేకమై నడిచారు. ఆదివాసీల హక్కుల కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో 600 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన పోరాట యోధుడు. చివరి వరకు నిరాడంబర జీవితం గడిపిన ఆయన మృతి ఆదివాసీ గిరిజనుల్లో తీవ్ర విషాదం నింపింది. రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు ఏపీలోకి వెళ్లడంతో అక్కడి గిరిజనుల సమస్యలపై గళం వినిపించేందుకు న్యాయస్థానంలో పోరాటం చేశారు. నిత్యం గిరిజన పల్లెల్లో తిరిగే రాజయ్యను కరోనా కాటు వేయడం ప్రతి ఒక్కరినీ విషాదంలో నింపింది. -
కరోనా: మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి
-
మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి
కొత్తగూడెం: భద్రాచలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత సున్నం రాజయ్య కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014లలో ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో రంపచోడవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. (ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూత) కోవిడ్ నిబంధనల మేరకు ఆయన స్వగ్రామం సున్నంవారి గూడెంలో మాజీ ఎమ్మెల్యే అంత్యక్రియలు జరగనున్నాయి. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన ఆయన నిరాడంబరమైన జీవితం గడిపారు. అసెంబ్లీకి ఆటోలో, బస్సుల్లో వెళ్లారు. భాగ్యనగర వీధుల్లో అన్న క్యాంటీన్ల వద్ద భోజనం చేసి కడుపు నింపుకునేవారు. ఆయన విలువలకు మారు పేరు: విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సున్నం రాజయ్య మృతికి సంతాపం తెలియజేశారు. 'సీపీఐ నేత, విలువలకు మారు పేరు అయిన సున్నం రాజయ్య గారి అకాల మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. గిరిపుత్రుల హక్కుల కోసం ఆయన ఎంతగానో కృషి చేసారు. అయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతున్నాను. ఆయన కుటుంబ సభ్యలకు నా ప్రగాడ సానుభూతి' అంటూ ట్వీట్ చేశారు. ఆదర్శ నాయకుడు: మంత్రి హరీశ్‌రావు ‘నేను అత్యంత గౌరవించే, సున్నం రాజయ్య గారి మరణం తీవ్రదుఃఖాన్ని కలిగించింది. పేదప్రజలు,ఆదివాసీలు, గిరిజనులు,దళితుల గొంతుగా జీవితాంతం వారి సమస్యల పరిష్కారం కోసమే బతికిన అసామాన్యుడు. ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల, రాజకీయాల పట్ల జనసామాన్యంలో విశ్వాసం కలిగించిన ఆదర్శ నాయకుడు’ అంటూ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ట్వీట్ చేశారు. -
సినీ రచయితలతో ప్రచారాలా?
సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య సాక్షి, హైదరాబాద్: పంటలను కొనుగోలు చేయకుండా, రైతులకు బేడీలు వేయించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పుడు సినీ రచయితలతో ఏమని ప్రచారం చేయించుకుంటారని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. మిర్చి, కందులకు మద్దతు ధర ఇవ్వకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇచ్చారని విమర్శించారు. నకిలీ విత్తనాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. ఎకరానికి రూ.4 వేలు ఇస్తామని టీఆర్ఎస్ ప్లీనరీ, బహిరంగ సభల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప కౌలు రైతుల ప్రస్తావన లేదన్నారు. విత్తన చట్టం చేయకుండా కార్పొరేట్ విత్తన కంపెనీలతో లాలూచీ పడుతున్నారని ఆరోపించారు. వ్యవసాయ ఉపకరణాలన్నింటినీ ప్రభుత్వమే ఇవ్వాలని, వాటిని కౌలు రైతులకూ వర్తింపజేయాలని పేర్కొన్నారు. పంటలకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
సామాజిక న్యాయమే ప్రధాన ఎజెండా
అసెంబ్లీ, మండలిలో చర్చకోసం సీపీఎం డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఈ నెల 16 నుంచి జరుగనున్న శాసనసభ, మండలి సమా వేశాల్లో సామాజిక న్యాయమే ప్రధాన ఎజెండాగా చర్చ జరగాలని అందుకు అనుగుణంగా టీఆర్ఎస్ ప్రభుత్వం విధా నాలను రూపొందించాలని సీపీఎం డిమాండ్ చేసింది. అసెంబ్లీ వేదికగా సామాజిక న్యాయం చర్చ కోసం పార్టీల కతీతంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విప క్షాల సభ్యులు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ అంశాలపై సీఎం కేసీఆర్‌ను, విపక్షాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలసి కోరనున్నట్లు సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తెలిపారు. మంగళవారం ఎంబీ భవన్ లో జి.నాగయ్య, బి.వెంకట్, టి.సాగర్, జె.వెంకటేశ్‌తో కలసి ఆయన విలేకరుల తో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశా లను కనీసం 25 రోజులు నిర్వహించా లన్నారు. సామాజికన్యాయ ఎజెండా బలోపేతానికి చట్టసభల్లో సమన్వయం తో కృషి చేయాలని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాసిన లేఖను విడుదల చేశారు. -
సున్నం రాజయ్య ఆమరణ దీక్ష భగ్నం
-
సున్నం రాజయ్య ఆమరణ దీక్ష భగ్నం
భద్రచలం: భద్రచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆమరణ నిరాహర దీక్షను శనివారం తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. ఆయన్ని దీక్షాస్థలి నుంచి బలవంతంగా భద్రచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. భద్రచలాన్ని జిల్లాగా ప్రకటించాలని గత రెండు రోజులుగా సున్నం రాజయ్య దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం దసర పండగ రోజున కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తుంది. కొత్త జిల్లాల జాబితాలో భద్రచలం పేరు లేకపోవడంతో సున్నం రాజయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అందులోభాగంగా భద్రచలం ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తు సున్నం రాజయ్య ఆమరణ దీక్షకు దిగారు. -
పోడుభూములపై సీఎం స్పష్టత ఇవ్వాలి
అశ్వారావుపేట రూరల్: ఎన్నోఏళ్లుగా గిరిజ నులు సాగుచేసుకొని జీవిస్తున్న పోడు భూములపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌లు డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేట మండల కేంద్రం లో పోడు భూముల సమస్యను పరిష్కరించి,గిరిజనులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ భారీ ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ వేణుగోపాల్‌రెడ్డికు వినతి పత్రాన్ని అందించారు.అనంతరం వారు మాట్లాడుతూ మండలంలోని వాగొడ్డుగూడెం, మల్లాయిగూడెం గ్రామాల్లో దాదాపు రెండొందల మంది గిరిజ నులు ఇరవై ఏళ్ల క్రితం పోడు నరికి పంటలు సాగుచేసుకుంటున్నారన్నారు. ఆ భూములను అటవీ అధికారులు దౌర్జన్యంగా లాక్కునేందుకు పోలీసుల సహాయంతో గిరిజనుల పై అన్యాయంగా కేసులు పెట్టి భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ వెంటనే అలాంటి చర్యలను ఉపసంహరించుకోవాలన్నారు. అటవీ అధికారులు, పోలీసులు తీరు మార్చుకోకపోతే పోడు పోరును మరింత ఉధృతం చేసి భూములను కాపాడుకుంటామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పోడు భూములపై సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో సమస్య ఉత్పన్నం అవుతుందని వాపోయారు. కలెక్టర్ దృష్టికి పోడు వివాదం.. పోడుభూముల వివాదంపై శుక్రవారం అశ్వారావుపేటలో పర్యటించిన జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ దృష్టికి సీపీఎం నాయకులు పోతినేని సుదర్శన్, ఎమ్మెల్యే సున్నం రాజయ్యలు తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ పోడు భూములపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదని అన్నారు. -
భద్రాచలం ఎమ్మెల్యేకు అస్వస్థత
ఖమ్మం: భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మంగళవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వడదెబ్బకు గురైన ఆయన్ను కుటుంబసభ్యులు భద్రాచలంలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, ఎలాంటి అపాయం లేదని వైద్యులు తెలిపినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. -
ప్రజా సమస్యలపైనే అసెంబ్లీ నడపాలి
సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య సాక్షి, హైదరాబాద్: ప్రజల సమస్యలకు పరిష్కారం లభించేలా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఒక ప్రకటనలో కోరారు. బడ్జెట్ సమావేశాలు 45 రోజులు జరిపే సంప్రదాయం గతంలో ఉండేదని, ఇప్పుడు శాసనసభా నిబంధనలను ఉల్లంఘిస్తూ, ప్రజా సమస్యలపై చర్చించకుండా, మొత్తం ప్రతిపక్షాన్నే విస్మరించే చెడు సంప్రదాయం రాష్ట్రంలో కనిపిస్తోందన్నారు. గత ఏడాది శీతాకాల సమావేశాలనే ఎత్తేశారని, అసెంబ్లీ ఎజెండాలో 344, ఎస్‌ఎన్‌క్యూ, కాల్ అటెన్షెన్ (74) తీర్మానాలు ప్రచురించడాన్ని మానేశారని, చర్చకు కూడా అవకాశం ఇవ్వడం లేదన్నారు. విపక్షాలన్నీ ఒకే సమస్యపై వాయిదా తీర్మానం పెట్టినా తిరస్కరిస్తున్నారన్నారు. రూల్స్ కమిటీ మీటింగ్ పెట్టి.. అసెంబ్లీ జరగాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని, అరెస్ట్‌లు, కేసులు, అవసరమైతే జైల్లో పెడతామని ప్రతిపక్షాలకు హెచ్చరికలు చేయడం సరైంది కాదన్నారు. సభలో సంఖ్యాబలంతో సంబంధం లేకుండా ప్రతిపక్షానికి ప్రాధాన్యతనిచ్చి సభను సజావుగా నడిపించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. -
‘ఆశ వర్కర్లను అవమానించడం తగదు’
సాక్షి, హైదరాబాద్: వేతనాల పెంపు, బకాయిల కోసం సమ్మె చేస్తున్న ఆశ వర్కర్లను అవమానపరిచేలా రాష్ట్ర మంత్రులు మాట్లాడటం సరికాదని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య పేర్కొన్నారు. మహిళల పట్ల మంత్రులు తమ అహంకారపూరిత ధోరణి మానుకోవాలని హితవు పలికారు. మూడేళ్ల నుంచి వేతన బకాయిల కోసం విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ఆశ వర్కర్లను అరెస్టు చేయడాన్ని ఖండించారు. బతుకమ్మ పేరిట కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఆశ వర్కర్ల పట్ల దురహంకారంతో వ్యవహరించడం తగదన్నారు. -
'రైతులకు భరోసా ఇవ్వాలి'
-
'రైతులకు భరోసా ఇవ్వాలి'
హైదరాబాద్: ప్రభుత్వ వైఫల్యాలే రైతుల ఆత్మహత్యలకు కారణం అని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. మంగళవారం రైతుల ఆత్మహత్యల ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయా జిల్లాల్లో చోటు చేసుకున్న రైతుల ఆత్మహత్యలను వివరించారు. ఎక్కువమంది యువ రైతులు, మహిళా రైతులే చనిపోయారని చెప్పారు. రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధానంగా ఆరు కారణాలు ఉన్నాయని చెప్పారు. అందులో అప్పుల వడ్డీ చెల్లించడం, రుణాలు ఇవ్వనీ బ్యాంకులు, కౌలుదారి చట్టాన్ని అమలుచేయలేకపోవడం, అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి వడ్డీ వ్యాపారులు పీడించడం, ప్రభుత్వం తరుపున రైతులకు సరైన భరోసా లేకపోవడం ప్రధాన అంశాలని చెప్పారు. సెప్టెంబర్ 11న ఆత్మహత్యల విషయంలో మంత్రి పోచారం మాట్లాడుతూ అవి ఆత్మహత్యలే కాదని అన్నారని, అలా అనడం ఏమాత్రం సరికాదని చెప్పారు. ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వాల్సిందిపోయి అలా మాట్లాడితే ఎంతవరకు సమంజసం అని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.6లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని చెప్పారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, విత్తన ఉత్పత్తి చేసే ప్రైవేట్ సంస్థలను నియంత్రించాలని కోరారు. -
‘నర్రా’ స్ఫూర్తిగా హక్కుల సాధనకు పోరు
- రాఘవరెడ్డి సంతాప సభలో సున్నం రాజయ్య హైదరాబాద్: ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు నర్రా రాఘవ రెడ్డి స్ఫూర్తిగా హక్కుల సాధనకోసం పోరాటం చేయాలని సీపీఎం శాసన సభాపక్ష నేత సున్నం రాజయ్య అన్నారు. బుధవారమిక్కడ తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో రాఘవ రెడ్డి సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ తొలిసారిగా గ్రామ సేవకుల సంఘాన్ని ఏర్పాటు చేసింది రాఘవ రెడ్డి అని, వారి వేతనాల పెంపుకోసం ఆయన కృషి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర నాయకుడు వంగూరి రాములు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు, రాష్ట్ర నేతలు పాలడుగు భాస్కర్, ఎస్.రమా, రైతు సంఘం నేతలు బొంతల చంద్రారెడ్డి, ప్రొఫెసర్ అరబండి ప్రసాదరావు ప్రసంగించారు. -
హవ్వ..... ఆటోలో వస్తారా...
సాక్షి వెబ్సైట్ ప్రత్యేకం అసలు ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి... ఖరీదయిన ఖద్దరు బట్టలు... ఇద్దరు గన్ మెన్లు పక్కన మందీ మార్బలం ప్రయాణించేందుకు కాస్ట్ లీ కారు.. ఇవి ఓ శాసనసభ్యుడికి ఉండాల్సిన లక్షణాలు. అయితే ఆయన ప్రయాణించేందుకు ఎట్ లీస్ట్ మారుతీ కారు కూడా లేదు. ఎక్కడికి వెళ్లాలన్నా ప్రజా రవాణా వ్యవస్థను ఆశ్రయించాల్సిందే. అదే ఆయన చేసిన తప్పిదం. దాంతో తానేంటో నిరూపించుకునేందుకు గుర్తింపు కార్డు చూపించుకుని దుస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆయన సామాన్య వ్యక్తా అంటే కానేకాదు. సాక్షాత్తు సీనియర్ ఎమ్మెల్యే. పోనీ తొలిసారి ఎన్నికైన శాసనసభ్యుడా అంటే అదీ కాదు. ఒకటి కాదు...రెండు కాదు...ఏకంగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయినాసరే ఆ పెద్ద మనిషి...'నేను ఎమ్మెల్యేను మహాప్రభో నమ్మండి...అంటూ మొత్తుకున్నా వినలేదు. దాంతో తన గుర్తింపు కార్డును చూపించి సచివాలయంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజును చూసిన కళ్లతో మొగుడిని చూస్తే మొట్టబుద్ధి వేసిందంట ఓ ఇల్లాలికి. మార్కెట్ లోకి వచ్చే లేటెస్ట్ కార్లులో రయ్ రయ్ మంటూ వచ్చే ఎమ్మెల్యేలను చూడటం అలవాటు అయిన పోలీసులకు ఆటోలో వచ్చిన ఆయన కళ్లకు ఆనలేదు. అంతేకాకుండా నువ్వు ఎమ్మెల్యేవా ...అయితే కారేదీ...గన్ మెన్లు ఏరీ అంటూ విసిగించారు. సచివాలయం సాక్షిగా ఖమ్మం జిల్లా భద్రాచలం సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్యకు గురువారం ఈ చేదు అనుభవం ఎదురైంది. తన నియోజకవర్గంలో ఓ పని నిమిత్తం సచివాలయానికి ఆటోలో వచ్చిన రాజయ్యను సచివాలయ భద్రతా సిబ్బంది లోపలకి పంపకుండా బయటే ఆపేశారు. ఆయనతో పాటు ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా ఆయన ఎమ్మెల్యే అంటూ సెక్యూరిటీ సిబ్బందికి చెప్పే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. దాంతో ఆటో దిగి సున్నం రాజయ్య లోనికి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. బడాయిలకు పోకుండా, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయకుండా సింపుల్ జీవితాన్ని గడిపే ఎమ్మెల్యేలను మన రాష్ట్రంలో వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఎమ్మెల్యే సున్నం రాజయ్య...ఆయన ఎవరూ అని ఇప్పటికీ చాలామంది తెల్లమొహం వేస్తారు. ఎంతమంది ఆయనను గుర్తుపడతారు అనేది కూడా క్విజ్ పోటీల్లో వేసే ప్రశ్న లాంటిదే. అసెంబ్లీలో పేపర్ల చింపేసి...మైకులు విరగొట్టి... బూతులు తిట్టివారికి సినిమా హీరోల కంటే ఎక్కువ పాపులారిటీ లభిస్తుంది కానీ....ప్రజా సమస్యల కోసం నిస్వార్థంగా పోరాడేవారికి ఆ గుర్తింపు ఉండదేమో. ధర్నాలు, నిరసనలు అంటూ నిత్యం మీడియాలో హైలెట్ అయ్యే పాలి(ట్రి)టిక్స్ ను మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన వంటపట్టించుకోపోవటం వల్లే సెక్యూరిటీ సున్నం రాజయ్యను గుర్తు పట్టలేదేమో. పక్క రాష్ట్రంలో సీఎం ఆటోలో వెళ్లాడు... రైలులో ప్రయాణించాడంటూ గొప్పలు చెప్పుకుంటాం. అదే మన రాష్ట్రంలో ఎమ్మెల్యే మాత్రం ఆటో ప్రయాణిస్తే మాత్రం జీర్ణించుకోలేం. . అలాంటి ఎమ్మెల్యే ఆటోలో మన స్టేటస్ కు నామోషీ కదా. ప్రజల మధ్యలో నుంచి వచ్చి..వారితో మమేకమే..ప్రజా సమస్యల కోసం పోరాడే వారికి మనమిచ్చే గౌరవం ఇదా. నయా పైసా స్వలాభం కోసం ఆశ పడకుండా ప్రజల కోసం పాటుపడుతూ 'రాజకీయాలను' వంట పట్టించుకోలేని రాజయ్యది తప్పా! పార్వతి.వై -
మాటలు కోటలు దాటుతున్నా...
హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక బడ్జెట్ లో అంకెల గారడీ చేశారని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య విమర్శించయారు. మాటలు కోటలు దాటుతున్నా కాళ్లు గడప దాటడంలేదన్న చందంగా బడ్జెట్ ఉందన్నారు. గత బడ్జెట్ లో జరిపిన కేటాయింపులు ఖర్చు చేయలేదని మళ్లీ వాటినే ఈ బడ్జెట్ లో చూపించారని ఆరోపించారు. సేవా రంగాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. పెరుగుతున్న ధరలకు హాస్టల్ విద్యార్థులకు ఉపకార వేతనాలు పెంచలేదన్నారు. అణగారిన వర్గాలకు నామమాత్రంగా కేటాయింపులు జరిపారని దుయ్యబట్టారు. గిరిజన సంక్షేమానికి కనీసం పదివేల కోట్ల రూపాయిలు కేటాయించాల్సిందని అభిప్రాయపడ్డారు. అంగన్ వాడీలకు కంటితుడుపు వేతనాలు పెంచారన్నారు. -
ఏపీ అనుబంధ సభ్యులుగా అనుమతించాలి
గవర్నర్‌కు ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, తాటి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు అనుబంధ సభ్యులుగా పాల్గొనే అవకాశాన్ని కల్పించాలని ఖమ్మం జిల్లా భద్రాచలం, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, తాటి వెంకటేశ్వర్లు సోమవారం గవర్నర్ నరసింహన్‌ను కలసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్విభజనలో భాగంగా జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపివేయడంతో ఆ మండలాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తాము స్థానిక ప్రజాసమస్యల పరిష్కారం కోసం అక్కడి ప్రభుత్వం, పాలన యంత్రాంగంతో సంప్రదింపులు జరుపలేకపోతున్నామని గవర్నర్ దృష్టికి తెచ్చారు. ఏపీ ఐటీడీఏ పాలక మండలి, జిల్లాస్థాయి సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పించాలని కూడా వారు కోరారు. నిధులు, విధులు, సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం కల్పించేలా ఏపీ సర్కార్‌కు తగు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యేలు రాజయ్య, తాటి వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడుతూ, తమ విజ్ఞప్తికి గవర్నర్ సానుకూలంగా స్పందించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. -
బడ్జెట్ నిరాశాజనకం.. : సున్నం రాజయ్య
బడ్జెట్లో రైతులు, కార్మికులు, ఉద్యోగులతోపాటు 10 జిల్లాల సమగ్రాభివృద్ధికి తగ్గ అంశాలు లేవు. బడ్జెట్ నిరాశాజనకంగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడే బడ్జెట్ కాదు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక సాధించుకున్నాం. ఈ చట్టాన్ని పూర్తిగా ఆ వర్గాలకే అమలు చేయాలి. బడ్జెట్ కేటాయింపులను బట్టి చూస్తే ఎస్సీలకు భూపంపిణీకి 30 ఏళ్లు పడుతుంది. భూములు పోడు చేసుకుంటున్న 12 లక్షలమంది గిరిజనులకు పట్టాలివ్వాలి. దుమ్ముగూడెం-సాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టును రద్దు చేయాలి. కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి. మేము అటు(అధికార), ఇటు(ప్రతిపక్షం) కాదు, ప్రజల పక్షం. అయోమయం.. అంకెల గారడీ.. సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ప్రణాళిక బడ్జెట్లో అయోమయం, అంకెల మార్పు, అంకెల గారడీగా ఉందేమో మంత్రి వివరణ నివ్వాలి. రూ. 17 వేల కోట్ల లోటు బడ్జెట్‌ను ఎట్లా భర్తీ చేస్తారో చెప్పాలి. తెలంగాణ వచ్చాక ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి. కరెంట్ సమస్యను అధిగమించడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి. ప్రభుత్వం 14 అంశాలపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏ నివేదికలిచ్చాయో బడ్జెట్లో పేర్కొనలే దు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ నివారణకు నక్కలగండి నుంచి డిండి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలి. ఈ బడ్జెట్‌కాకపోయినా.. వచ్చే బడ్జెట్లో అయినా నిధులు కేటాయించాలి. బీబీనగర్ ఆస్పత్రికి నిధులివ్వాలి. దళితులతోపాటు గిరిజనులకు కూడా భూమి కొనుగోలు చేసి పంపిణీ చేయాలి. బీసీలకు తక్కువ నిధులు కేటాయించారు. చేనేత కార్మికులను విస్మరించడం సరికాదు. వారిని ఆదుకోవాలి. రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా భరోసా కల్పించాలి. తెలంగాణ సాధన కోసం 1,200 మంది ఆత్మ బలిదానం చేసినందున, 459 మందికే పరిహారం పరిమితం చేయకుండా అందరికీ రూ.10 లక్షల పరిహారం ఇచ్చి, ఇళ్లు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించాలి. -
విద్యుత్ వాటా కోసం పోరాడుదాం: ఎమ్మెల్యే తాటి
హైదరాబాద్: తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటా కోసం పోరాడదామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు- శాసనసభలో అన్నారు. ఈ విషయంలో తెలంగాణ బిడ్డగా ప్రభుత్వానికి మద్దతు ఇస్తానని చెప్పారు. తెలంగాణకు రావాల్సిన వాటా రావాల్సిందేనని సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యపై ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో తీవ్రంగా ఉన్న విద్యుత్ సమస్యను పరిష్కారించాల్సిన అవసరముందని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. రాష్ట్రం విడపోవడానికి అప్పటి ప్రభుత్వాలే కారణమని ఆయన విమర్శించారు. -
గిరిజన ఎమ్మెల్యేపై దాడి అమానుషం..
బూర్గంపాడు : తెలంగాణవాదం వినిపించినందుకు ఓ గిరిజన ఎమ్మెల్యేపై దాడికి పాల్పడటం అమానుషమని జిల్లాకు చెందిన భద్రాచలం, ఇల్లెందు, వైరా ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, కోరం కనకయ్య, బానోతు మదన్‌లాల్‌లు అన్నారు. మండలంలోని సారపాకలో ఉన్న అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లును శుక్రవారం వారు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలీనం ప్రక్రియ పూర్తికాకుండానే ఆంధ్రాప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులు భౌతికదాడులకు దిగటం శోచనీయమన్నారు. ఈ దాడి కేవలం ఓ గిరిజన ఎమ్మెల్యేపై జరిగింది కాదని తెలంగాణ ఆత్మగౌరవంపై జరిగిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన జిల్లాలోని ఏడు ముంపు మండలాలకు చెందిన ఓటర్లు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలకు ఓట్లు వేసి గెలిపించారనే విషయం ఆంధ్రా పాలకులు గుర్తుంచుకోవాలన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అధికారుల పాలనలోనే ముంపు మండలాలు ఉన్న విషయం ఆంధ్రా పాలకులు గుర్తుంచుకోవాలన్నారు. గిరిజనుల్లో భయాందోళనలను కలిగించేందుకే ఎమ్మెల్యే తాటిపై దాడికి పాల్పడ్డారన్నారు. ముంపు మండలాల్లో గిరిజనుల మనోభావాలను దెబ్బతిసే విధంగా గిరిజన ఎమ్మెల్యేపై భౌతిక దాడికి దిగిన టీడీపీకి ప్రజలు తగిన విధంగా బుద్ధిచెబుతారని అన్నారు. ముంపు మండలాల ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలుగా వారి బాగోగులను చూసుకునేవిధంగా ఆశ్వారావుపేట, పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలకు అవకాశాలు కల్పించేందుకు రెండురాష్ట్రప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే తాటిపై జరిగిన భౌతికదాడిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి చెందిన 13మంది గిరిజన ఎమ్మెల్యేలం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, గవర్నర్ నరసింహన్‌కు, స్పీకర్ మధుసూధనచారికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తాటిని పరామర్శించిన వారిలో జిల్లా నాయకులు మచ్చా శ్రీనివాసరావు, మాజీ డీసీసీబీ చైర్మన్ యలమంచిలి రవికుమార్ తదితరులున్నారు. -
విద్యాసంస్థల బంద్ విజయవంతం
భద్రాచలం : పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా సోమవారం ముంపు మండలాల్లో చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు రోడ్లకు పైకి వచ్చి కేంద్రప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి, అనంతరం మానవహారం నిర్వహించారు. ఎటపాక పాలిటెక్నిక్ విద్యార్థులు భద్రాచలం-చర్ల రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే సున్నం రాజయ్య, టీపీఆర్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్.వెంకటపతిరాజు అక్కడికి వెళ్లి విద్యార్థులతో చర్చించి ఆందోళనను విరమింపజేశారు. వీఆర్‌పురం, కూనవరం మండల కేంద్రాల్లోనూ విద్యార్థులు రాస్తారోకో చేశారు. కుక్కునూరులో విద్యార్థులు రా స్తారోకో చేసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ద హనం చేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ముం పు మండలాల బదలాయింపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన మెమో ప్రతులను దగ్ధం చేశారు. ఆర్డినెన్స్ రద్దుకు ఢిల్లీ స్థాయిలో ఉద్యమం... పోలవరం ముంపు మండలాల బదలాయింపుపై కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను రద్దు చేసేలా ఢిల్లీ స్థాయిలో ఉద్యమం చేపడతామని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రకటించారు. టీజేఏసీ ఆధ్వర్యంలో భద్రాచలంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాలుగో రోజుకు చేరాయి. ఈ దీక్షలను తెలంగాణ పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నడింపల్లి వెంకటపతిరాజు ప్రారంభించారు. ఈ దీక్షలకు ఎమ్మెల్యే రాజయ్య సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజనుల అభిప్రాయాలను తెలుసుకోకుండా దొడ్డిదారిన తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశామని చెప్పారు. గిరిజనుల గోడు పట్టించుకోని ప్రభుత్వాలు మనుగడ సాగించలేవని హెచ్చరించారు. ఈనెల 14న ఢిల్లీ వెళ్లి ఆర్డినెన్స్ రద్దు చేయాలని కేంద్రప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతామని తెలిపారు. ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచాలి... ముంపు మండలాలను తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగించాలని తెలంగాణ పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నడింపల్లి వెంకటపతిరాజు డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళ్లటం సరైంది కాదన్నారు. ముంపు ప్రాంత ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం అవసరమైతే ఒక ప్రత్యేక బృందాన్ని పంపించి ఈ ప్రాంత గిరిజనులు అభిప్రాయాలు తెలుసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు పోలవరం ఆర్డినెన్స్‌పై పోరాడేందుకు ముందుకు రావాలని కోరారు. కాగా, సోమవారం నాటి దీక్షల్లో టీపీఆర్ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు షేక్ గౌసుద్దీన్, ఎస్వీ సుబ్బారావు, వలరాజు సునందరావు, శ్రీరాం, వెంకటేశ్వర్లు, షేక్ ఇమ్రాన్, సాయిబాబు, శ్రీనివాస్, మల్సూర్, జానకీరాం, నాగబాబు, సతీష్‌బాబు, విజయరాజు, హరినాధ్, సత్యనారాయణ, శ్రీనివాస్ కూర్చున్నారు. దీక్షలకు పలువురి సంఘీభావం.. టీజేఏసీ దీక్షలను భద్రాచలం ఎంపీడీవో మాచర్ల రమాదేవి, పీఆర్ డీఈలు వెంకటరెడ్డి, రాంబాబు, పిలకా మోహన్‌రెడ్డి, ఎంపీడీవో బెక్కంటి శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకులు బడ్జెట్ శ్రీనివాస్, తిలక్, బి.వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి అజయ్‌కుమార్, రామాచారి, జపాన్‌రావు, దాసరి శేఖర్, మడివి నెహ్రూ, చల్లగుళ్ల నాగేశ్వరరావు, వెక్కిరాల శ్రీనివాస్, సోమశేఖర్, పూసం రవికుమారి, ఎంబీ నర్సారెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. నేటి నుంచి మహాపాదయాత్ర... పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలనే డిమాండ్‌తో పీపుల్స్ ఎగెనైస్ట్ పోలవరం ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఈ నెల 15 వరకూ మహా పాదయాత్ర చేపట్టనున్నట్లు కమిటీ నాయకులు సున్నం వెంకటరమణ ప్రకటించారు. సోమవారం భద్రాచలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాదయాత్ర షెడ్యూల్‌ను ప్రకటించారు. పొడియా(ఒడిశా) నుంచి భద్రాచలం వరకు 15 రోజుల పాటు సాగే ఈ పాదయాత్రలో వివిధ ఆదివాసీ, హక్కుల సంఘాల వారు పాల్గొంటారని తెలిపారు. -
రాష్ట్రపతికి ఆర్డినెన్స్ వ్యతిరేక తీర్మానాలు
భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య భద్రాచలం టౌన్: పోలవరం ముంపు విలీన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా సంబంధిత గ్రామా ల్లో గ్రామ సభ తీర్మానాలు చేయించి రాష్ట్రపతికి పంపనున్నట్టు భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తెలిపారు. ఆయన గురువా రం ఇక్కడ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ముంపు మండలాల ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా అఖిల పక్షం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పోరాటాన్ని విస్తృతం చేస్తున్నట్టు చెప్పారు. అఖిలపక్ష బృందం మరో నాలుగు రోజుల్లో రాష్ట్రపతిని కలిసి, ముంపు మండలాల్లోని ఆదివాసీల గోడును వినిపిస్తుందని.. ఆర్డినెన్స్ ఉపసంహరించాలని విజ్ఞప్తి చేస్తుందని చెప్పా రు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుందన్నారు. ముంపు గ్రామాలలోని ‘ఆర్డినెన్స్ వ్యతిరేక గ్రామ కమిటీ’ల ద్వారా ప్రజాభిప్రాయ నివేదికలను ప్రతి రోజు రాష్ట్రపతికు మెయిల్ ద్వారా పంపిస్తామన్నారు. ఐటీడీఏ పాలక మండలి సమావేశాన్ని భద్రాచలంలోనే నిర్వహించాలి ఐటీడీఏ పాలక మండలి సమావేశాన్ని ఈ నెల 21న భద్రాచలంలో కాకుండా ఖమ్మంలో నిర్వహించాలని కలెక్టర్ నిర్ణయించడం సరికాదన్నా రు. ఐటీడీఏ కేంద్రమైన భద్రాచలంలో కాకుం డా ఖమ్మంలో ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిం చారు. ముంపు గ్రామాలను గుట్టుచప్పుడు కాకుండా బదలాయించే కుట్రలో భాగంగానే ఈ సమావేశాన్ని ఖమ్మంలో నిర్వహించాలనుకుంటున్నారని విమర్శించారు. ముంపు మం డలాల్లోని విద్యార్థుల బస్ పాసులు చెల్లవంటూ ఆర్టీసీ అధికారులు ఆపేయడం అన్యాయమన్నారు. ముంపు మండలాల్లో అభివృద్ధి పనులు ఆగకుండా కలెక్టర్ చొరవ తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు ఎజె.రమేష్, రవికుమార్, ఎంబి.నర్సారెడ్డి, శేషావతారం, బ్రహ్మాచారి తదితరులు పాల్గొన్నారు. -
నిమ్స్‌లో ఎమ్మెల్యే రాజయ్య దీక్ష విరమణ
సాక్షి, హైదరాబాద్: పోలవరం డిజైన్ మార్చడంతో పాటు ముంపునకు గురయ్యే మండలాలను ఖమ్మంజిల్లాలోనే ఉంచాలంటూ భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేస్తున్న ఆమరణ దీక్షను రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రివర్గ ప్రతినిధి బృందం నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు. నిమ్స్ ఆసుపత్రిలో ఉన్న రాజయ్య వద్దకు మంగళవారం మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్ నేతృత్వం లోని ప్రతినిధి బృందం వచ్చింది. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఉమ్మడిగా కలిసి పోరాటం చేద్దామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు కోరారని పేర్కొని, రాజయ్యకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. పోలవరం ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచటానికి అన్ని రకాల పోరాటాలను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తోందని మంత్రులు నాయిని, ఈటెల మీడియాతో చెప్పారు. -
ఎమ్మెల్యే రాజయ్య దీక్ష భగ్నం
భద్రాచలం, పోలవరం వుుంపు వుండలాల ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకోవాలని డివూండ్ చేస్తూ భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేపట్టిన ఆవురణ దీక్షలను ఆదివారం పోలీసులు భగ్నం చేశారు. సున్నం రాజయ్యు నేతృత్వంలో ఆ పార్టీ నాయుకులు చేపట్టిన దీక్షలు ఆదివారం నాలుగో రోజుకు చేరాయి. వారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని వైద్యులు సూచించటంతో దీక్ష విరమించాలని పోలీసులు కోరారు. ఎమ్మెల్యే రాజయ్యతో పట్టణ సీఐ ఆంజనేయలు పలుమార్లు చర్చించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్షలను విరమించేది లేదని రాజయ్య చెప్పడంతో సీఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆదివారం మధ్యాహ్నం తర్వాత దీక్ష శిబిరానికి పోలీసులు చేరుకుని, దీక్ష చేస్తున్న అందరినీ బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు, సీపీఎం నాయకులకు తీవ్ర తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బుధవారం ముంపు మండలాల బంద్ దీక్షలను పోలీసులు భగ్నం చేయడంపై సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బి. వెంకట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా బుధవారం ముంపు మండలాల బంద్ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు అన్నిపార్టీలు, ప్రజా, ఆదివాసీ సంఘాలు సహకరించాలని కోరారు. -
సున్నం రాజయ్య దీక్ష భగ్నం
ఖమ్మం: భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సీపీఎం కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ సీపీఎం కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా రాజయ్య గత నాలుగు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నారు. ముంపు మండలాలను తెలంగాణాలోనే ఉంచాలని, పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చి నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. -
'ఆర్డినెన్స్ వెనక్కి తీసుకునేవరకూ దీక్ష'
భద్రాచలం : పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా.. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శనివారానికి మూడోరోజుకు చేరింది. ముంపు మండలాలను తెలంగాణాలోనే ఉంచాలని, పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చి నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకునేంత వరకు తన దీక్ష కొనసాగుతుందని ఎమ్మెల్యే రాజయ్య స్పష్టం చేశారు. మరోవైపు సున్నం రాజయ్యకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆయన శరీరంలో బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయని వారు తెలిపారు. కాగా రాజయ్య దీక్షకు మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మద్దతు తెలిపారు. -
MLA సున్నం రాజయ్య అమరణ దీక్ష
-
గిరిజనుల కోసం గళమెత్తుతా..
భద్రాచలం, న్యూస్‌లైన్ : గిరిజన సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటులో గళమెత్తుతానని, శక్తివంచన లేకుండా వారి అభ్యున్నతి కోసం పోరాడుతానని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, బానోత్ మదన్‌లాల్, ఇతర నాయకులతో కలిసి శుక్రవారం ఆయన భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేపట్టిన ఆమరణ దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజనుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావటం దుర్మార్గమైన చర్య అన్నారు. కేంద్రంలో నరేంద్రమోడీ వస్తే ఏదో అద్భుతాలు సృష్టిస్తారని ఆశించిన తెలంగాణ ప్రజలకు ఈ ఆర్డినెన్స్ ఆశనిపాతంలా మారిందన్నారు. ఆదివాసీలను ముంచే ఆర్డినెన్స్‌ను వెంటనే వెనక్కు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్ రద్దు కోసం టీఆర్ఎస్ ఎంపీలతో కలసి పార్లమెంట్లో చర్చకు లేవనెత్తుతామని చెప్పారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం జరిగే ఉద్యమాల్లో వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ ముందుంటుందని, ఈ విషయంలో సీపీఎం వంటి పార్టీలతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ముంపుప్రాంత వాసులకు అండగా నిలిచేలా ఎమ్మెల్యే రాజయ్య ఆమరణ దీక్ష చేపట్టడం అభినందనీయమన్నారు. తెలంగాణలోనే ఉంచేలా పోరాడుతాం : పాయం ముంపు మండలాలను తెలంగాణ రాష్ట్రంలోనే ఉంచేలా వైఎస్ఆర్సీపీ పక్షాన అసెంబ్లీ లోపల, బయట పోరాడుతామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివాసీల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారు మనోవేదనకు గురవుతున్నారని చెప్పారు. ముంపు ప్రాంతంలో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు తాము ఎటువైపు వెళ్లాలనే దానిపై సందిగ్ధింలో ఉన్నారని, దీనిపై వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరారు. ముంపు ప్రాంత వాసుల సమస్యల పరిష్కారం కోసం రాజకీయాలకతీతంగా ఉద్యమిస్తామని ప్రకటించారు. ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకోవాలి : మదన్‌లాల్ గిరిజనులను గోదావరిలో ముంచే ఆర్డినెన్స్‌ను తక్షణమే వెనక్కు తీసుకోవాలని వైరా ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంతో ఆదివాసీలకు ఎంతో అనుబంధం ఉందని, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారు ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. ముంపు ప్రాంతాల పరిరక్షణకు అన్ని పార్టీలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ భద్రాచలం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తెల్లం వెంకట్రావు, నాయకులు కడియం రామాచారి, మంత్రిప్రగడ నర్సింహారావు, కొవ్వూరి రాంబాబు, గంటా కృష్ణ, రామలింగారెడ్డి, మన్మద హరి, చిట్టిబాబు, చిన్ని, దామెర్ల రేవతి, సమ్మక్క, ఎంపీటీసీ బానోతు రాముడు, మండవ వెంకటేశ్వరెడ్డి, రాయిని రమేష్, కృష్ణారెడ్డి, కాపుల నవీన్, రాజు, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
భద్రాచలం ఎమ్మెల్యే ఆమరణ దీక్ష
ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా నేడు ముంపు మండలాల్లో బంద్ భద్రాచలం, న్యూస్‌లైన్: ఖమ్మం జిల్లాలో పోలవరం ముంపునకు గురయ్యే ఏడు మండలాలను సీమాంధ్రలో విలీనం చేసేందుకు కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య గురువారం ఆమరణ దీక్షకు దిగారు. పినపాక నియోజకవర్గ సీపీఎం డివిజన్ కార్యదర్శి కనకయ్యతోపాటు మరో 15 మంది రాజయ్యకు సంఘీభావంగా దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భద్రాచలం డివిజన్లోని సెంటు భూమిని కూడా వదులుకునేది లేదన్నారు. కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్షలను విరమించేది లేదన్నారు. కాగా, ముంపు మండలాల్లో శుక్రవారం బంద్ నిర్వహించేందుకు అఖిల పక్షం నాయకులు పిలుపునిచ్చారు. జూన్ 2న వీఆర్ పురం మండల కేంద్రంలో గిరిజన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.