భద్రచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆమరణ నిరాహర దీక్షను శనివారం తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. ఆయన్ని దీక్షాస్థలి నుంచి బలవంతంగా భద్రచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. భద్రచలాన్ని జిల్లాగా ప్రకటించాలని గత రెండు రోజులుగా సున్నం రాజయ్య దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.