విద్యుత్ వాటా కోసం పోరాడుదాం: ఎమ్మెల్యే తాటి | fight for power to telangana, says thati venkateswarlu | Sakshi
Sakshi News home page

విద్యుత్ వాటా కోసం పోరాడుదాం: ఎమ్మెల్యే తాటి

Published Mon, Nov 10 2014 5:53 PM | Last Updated on Sat, Aug 11 2018 6:44 PM

fight for power to telangana, says thati venkateswarlu

హైదరాబాద్: తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటా కోసం పోరాడదామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు- శాసనసభలో అన్నారు. ఈ విషయంలో తెలంగాణ బిడ్డగా ప్రభుత్వానికి మద్దతు ఇస్తానని చెప్పారు.

తెలంగాణకు రావాల్సిన వాటా రావాల్సిందేనని సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యపై ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో తీవ్రంగా ఉన్న విద్యుత్ సమస్యను పరిష్కారించాల్సిన అవసరముందని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. రాష్ట్రం విడపోవడానికి అప్పటి ప్రభుత్వాలే కారణమని ఆయన విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement