భద్రాచలం ఎమ్మెల్యేకు అస్వస్థత
ఖమ్మం: భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మంగళవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వడదెబ్బకు గురైన ఆయన్ను కుటుంబసభ్యులు భద్రాచలంలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, ఎలాంటి అపాయం లేదని వైద్యులు తెలిపినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.