
సున్నం రాజయ్య ఆమరణ దీక్ష భగ్నం
భద్రచలం: భద్రచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆమరణ నిరాహర దీక్షను శనివారం తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. ఆయన్ని దీక్షాస్థలి నుంచి బలవంతంగా భద్రచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. భద్రచలాన్ని జిల్లాగా ప్రకటించాలని గత రెండు రోజులుగా సున్నం రాజయ్య దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.
తెలంగాణ ప్రభుత్వం దసర పండగ రోజున కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తుంది. కొత్త జిల్లాల జాబితాలో భద్రచలం పేరు లేకపోవడంతో సున్నం రాజయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అందులోభాగంగా భద్రచలం ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తు సున్నం రాజయ్య ఆమరణ దీక్షకు దిగారు.