పౌష్టికాహార దినుసులు అందించాలి
Published Mon, Sep 26 2016 11:12 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
కాళ్లవాపు బాధితులను పరామర్శించిన భద్రాచలం ఎమ్మెల్యే
కాకినాడ సిటీ : కాళ్లవాపు వ్యాధి ఉన్న గిరిజనులలో ఎక్కువ మం ది రక్తహీనతతో బాధపడుతుండడం వల్ల ఆయా కుటుంబాలకు ఆరు నెలలకు సరిపడా పౌష్టికాహార దినుసులు అందించాలని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజనులను ఎమ్మెల్యే రాజయ్య, వీఆర్‌పురం ఎంపీపీ శరమయ్యలు పరామర్శించారు. అక్కడే రోగులను పరీక్షిస్తున్న ప్రొఫెసర్ హరి విజయకుమార్‌తో రోగుల సమాచారం అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మంచి వైద్యం అందించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట గిరిజన సంఘం నాయకులు బొప్పన కిరణ్, సీపీఎం నగర కార్యదర్శి పలివెల వీరబాబు ఉన్నారు.
శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలి
ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో సమస్య వచ్చినప్పుడు స్పందిం చడం కన్నా శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని జన విజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చల్లా రవికుమార్ డిమాండ్ చేశారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజనులను సోమవారం పరామర్శించారు. ఆయ న మాట్లాడుతూ ముంపు మండలాల్లో కనీసం 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుచేసి పూర్తిస్థాయిలో వైద్యులను నియమించి మందులు, పరీక్షల సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. రవికుమార్‌తో పాటు జేవీవీ సీనియర్ నాయకులు మోకా సుబ్బారావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement