swelling
-
పాదాల వాపు ప్రమాదమా! ఆ వ్యాధులకు సంకేతమా!
సాధారణంగా ఏ బస్సులోనో చాలాసేపు కూర్చుని ప్రయాణం చేశాక... పాదాల్లో వాపురావడం చాలామందిలో కనిపించేదే. ఇది నిరపాయకరమైన వాపు. కానీ కొన్నిసార్లు అలా ఏ కారణం చేత ఆ వాపు వచ్చిందో తెలుసుకోడానికి డాక్టర్‌ను సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వాపు కొన్నిసార్లు ప్రమాదకరం కావచ్చు, అప్రమత్తంగా ఉండాల్సి రావచ్చు. పాదాలవాపు కనిపించినప్పుడు ఏయే అంశాలపై దృష్టిపెట్టాలన్న అవగాహన కోసమే ఈ కథనం. కాళ్లలో/పాదాల్లో వాపు కనిపించడాన్ని ‘ఎడిమా’ అంటారు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా సెల్యులైటిస్, డీప్‌వీన్ థ్రాంబోసిస్ అనే కండిషన్లతో పాటు హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్... ఈ మూడు కీలక అవయవాల పనితీరు తగ్గడం వల్ల ఇలా జరిగిందేమో చూడాలి. హైపోథైరాయిడిజమ్ వల్ల కూడా ఇలా జరగవచ్చు. దాంతోపాటు కొన్ని మందుల వాడకంతో పాటు, అసలు ఏ కారణమూ తెలియకుండా కూడా పాదాల్లో వాపు రావచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల... కిడ్నీ ఫెయిల్యూర్లో ముఖం మాత్రమే ఉబ్బుతుందని చాలామంది అనుకుంటారు. కానీ కాళ్లవాపూ కనిపిస్తుంది. ఇలాంటప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ నిర్ధారణకు రీనల్ ఫంక్షన్ టెస్ట్ అనే పరీక్ష చేయించి, దానికి అనుగుణంగా చికిత్స అందించాల్సి ఉంటుంది. లివర్ ఫెయిల్యూర్ వల్ల... కాలేయ వైఫల్యంలోనూ కాళ్ల వాపు కనిపిస్తుంది. దీని నిర్ధారణ కోసం ‘లివర్ ఫంక్షన్ టెస్ట్ – ఎల్ఎఫ్టీ’ పరీక్ష చేయించి, సమస్య నిర్ధారణ అయినప్పుడు దానికి అనుగుణంగా చికిత్స అందించాల్సి ఉంటుంది. కాలి సిరల్లో లోపంతో... కొన్నిసార్లు కాళ్లలోని సిరలు చక్కగా పనిచేయకపోవడం వల్ల రక్తంలోని నీరు అక్కడే ఉండిపోయి, పాదాల వాపు రూపంలో బయటపడుతుంది. ఎక్కువసేపు నిల్చుని పనిచేసే వృత్తుల్లో ఉన్నవారిలో, ఊబకాయం ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువ. పిక్కల్లో నొప్పి, కాళ్లు బరువుగా అనిపించడం, అటు తర్వాత క్రమంగా కాళ్లపైనా, మడమ లోపలి వైపున నల్లటి మచ్చలు, కొంతకాలానికి కాలి సిరలు ఉబ్బి మెలికలు తిరిగి ఉన్నట్లుగా చర్మంలోంచి బయటికి కనిపించడంతో పాటు, అవి పచ్చగా లేక నల్లగా కనిపిస్తే, అది ‘వేరికోస్ వెయిన్స్’ లేదా ‘‘వీనస్ ఇన్సిఫిషియెన్సీ’ అనే కండిషన్ కావచ్చు. తొలిదశలో సాయంత్రం మాత్రమే ఉండే కాళ్లవాపు ఆ తర్వాత రోజంతా ఉంటుంది ∙ఇది కాకుండా సెల్యులైటిస్ అనే కండిషన్‌లోనూ కాళ్ల వాపు కనిపిస్తుంది. అంతేకాదు.. ఇలా వాపు వచ్చిన కారణంగా కాలు కాస్త మెరుపుతో కనిపిస్తుంది ∙దీనితో పాటు కాలి సిరల్లో రక్తం గడ్డకట్టడం వల్లకనిపించే ‘డీప్ వీన్ థ్రాంబోసిస్ – (డీవీటీ)’ అనే కండిషన్లో కూడా కాలివాపు కనిపిస్తుంది ∙ఈ కండిషన్స్ అన్నింటి నిర్ధారణ కోసం కాలి సిరలకు వీనస్ డాప్లర్ టెస్ట్ అనే పరీక్ష చేయించాలి. ఇవేగాక... ఇతర సమస్యల్లో కూడా... ఇక్కడ పేర్కొన్న సమస్యలతో పాటు అనేక ఇతర సమస్యల వల్ల కూడా కాళ్ల/పాదాల వాపు రావచ్చు. కొన్ని ప్రోటీన్ల లోపం, మహిళల్లో కటి భాగంలో వచ్చే క్యాన్సర్లలో కూడా కాళ్ల వాపు రావచ్చు. కొందరు గర్భవతుల్లో కాలి సిరలు సామర్థ్యం తగ్గడం, కొన్నిసార్లు థైరాయిడ్ హార్మోన్ లోపించినప్పుడూ వాపు రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో జనరల్ ఫిజీషియన్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించడం, తదనుగుణంగా చికిత్సలు అవసరం. గుండె పంపింగ్ తగ్గడం వల్ల... గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గినప్పుడు పాదాల వాపు కనిపిస్తుంది. ఒక్కోసారి రక్తపోటు పెరగడమూ జరుగుతుంది. గుండెజబ్బు కారణంగా రెండు కాళ్లలోనూ వాపు కనిపిస్తుంది. ముందుగా కాలి ముందు భాగంలోనూ... ఆ తర్వాత మడమ భాగంలో వాపు వస్తుంది. మొదట్లో నొప్పి ఉండదు. ఆయాసం, నడవలేకపోవడం జరగవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే తక్షణం మెడికల్ స్పెషలిస్ట్ / గుండె వైద్య నిపుణులను కలవాలి. గుండెజబ్బు వల్లనే పాదాల వాపు వచ్చిందా అన్న విషయం తెలుసుకోవడం కోసం బీఎన్పీ అనే రక్తపరీక్ష చేయించి, ఈ విలువ 100 కంటే ఎక్కువగా ఉంటే గుండె సమస్య ఉందేమోనని అనుమానించాలి. అప్పుడు గుండె నిపుణుల ఆధ్వర్యంలో ఈసీజీ, ఎకోకార్డియోగ్రఫీ వంటి పరీక్షలు చేయించుకోవాలి. చికిత్స : ఇది గుండెజబ్బు కారణంగానే జరిగితే డైయూరెటిక్స్ అనే మందులు వాడాల్సి ఉంటుంది. ఇవి మూత్రం రూపంలో దేహంలోంచి నీటిని బయటకు పంపిస్తాయి. అయితే గుండెజబ్బు ఉన్నప్పుడు మాత్రమే ఈ డైయూరెటిక్స్ వాడాలి, లేకపోతే అవి ప్రమాదకరంగా పరిణమించవచ్చు. అంతేకాదు... గుండెజబ్బు కాకుండా ఇతర కారణాల వల్ల కాలి వాపు వచ్చి ఉంటే... ఆ మూల కారణాన్ని కనుగొనే అవకాశం ఉండక, ఇతరత్రా సమస్యలు రావచ్చు. ఊపిరితిత్తుల్లో రక్తపోటు పెరగడం... ఊపిరితిత్తుల్లో రక్తపోటు పెరగడం వల్ల కూడా పాదాలకు వాపు వస్తుంది. ఊబకాయం ఉన్నవారిలో ఇది ఎక్కువ. ఈ కారణంగా సమస్య వస్తే... నిద్రలో పెద్దగా గురకపెట్టడం, నిద్రనుంచి అకస్మాత్తుగా లేవడం, నిద్రలో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడం కనిపిస్తాయి. వీరు తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి. లంగ్స్‌లో రక్తపోటు పెరగడాన్ని తెలుసుకోవడం కోసం డాక్టర్లు ఎకో పరీక్ష చేయిస్తారు. వయసు 40 దాటి, కాళ్ల వాపులు ఉన్నవారు ఒకసారి తప్పనిసరిగా ఎకో పరీక్ష చేయించడం మంచిది. చికిత్స : ఊపిరితిత్తుల్లో రక్తపోటు కారణంగా వచ్చే స్లీప్ ఆప్నియాకు తప్పనిసరిగా చికిత్స చేయించాలి. దాంతో స్లీప్ ఆప్నియా సమస్య తగ్గి, కాళ్ల వాపూ తగ్గుతుంది. జాగ్రత్తలు / ఫస్ట్‌లైన్ చికిత్స : చాలాసేపు నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వాపు ఉన్న కాళ్లపై ఎలాస్టిక్ స్టాకింగ్స్ తొడగాలి. ఈ జాగ్రత్తలతో కాలివాపును నివారించవచ్చు. స్టాకింగ్ సిరలకు అది మంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల క్రమేణా రక్తం సజావుగా ప్రవహిస్తుంటుంది. ఈ దశలో నిర్లక్ష్యం చేసి, సమస్య ముదిరి ‘వేరికోస్ వెయిన్స్’గా పరిణమిస్తే, కాళ్లకు పుండ్లు వంటి దుష్ప్రభావాలు (కాంప్లికేషన్లు) రావచ్చు. ఆయా కండిషన్లకు అనుగుణంగా రేడియాలజీ చికిత్స, శస్త్రచికిత్సలు అవసరం కావచ్చు. కారణం తెలియకుండా... కొందరిలో, ముఖ్యంగా 40 ఏళ్ల మహిళల్లో కాళ్ల వాపుతో పాటు మరికొందరిలో ముఖం, చేతులు కూడా ఉబ్బడం జరగవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందన్న కారణం కొన్నిసార్లు తక్షణం తెలియకపోవచ్చు. వీరికి అన్ని పరీక్షలూ చేసి... నిర్దిష్టంగా ఎలాంటి కారణం లేదని తెలుసుకున్న తర్వాత డైయూరెటిక్స్ వాడాలి. ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవాలనీ డాక్టర్లు సూచిస్తారు. (చదవండి: మీకు మీరే నిజమైన స్నేహితుడు, మీరే అసలైన శత్రువు) -
దంచికొడుతున్న వానలు.. మళ్లీ యమునకు పోటెత్తిన వరద.. రెడ్ అలర్ట్ జారీ
ఢిల్లీ: ఉత్తరాదిలో వర్షాలు కాస్త తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పుంజుకున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు పలు రాష్ట్రాలను మళ్లీ వణికిస్తున్నాయి. ఇప్పటివరకు సంభవించిన వరదల భీబత్సం నుంచి తేరుకోకముందే మరోమారు ముప్పు పొంచి ఉంది. నిన్న రాత్రి ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో వానలు దంచికొట్టాయి. దీంతో ప్రయాగ్‌రాజ్ వద్ద గంగా, యమునా నది ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. వర్షాలకు తోటు రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లో గంగ, యమునా నది ప్రవాహం ఉద్దృతంగా ప్రవహిస్తోంది. ఫఫమౌ వద్ద గంగా నది ప్రవాహం 11 సెంటీమీటర్ల నుంచి 24 సెంటీమీటర్ల వరకు పెరిగిపోయింది. నైనీ వద్ద యమునా నది 29 సెంటీమీటర్ల మేర పెరిగింది. ఉత్తరఖండ్‌లో చమోలీ జిల్లాలో జాతీయ రహదారి 7పై కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షాలతో రాష్ట్రంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. అటు అసోంలోనూ వరదలు సంభవించాయి. దాదాపు 47 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. 32,400 మంది ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారు. గత 24 గంటల్లో కురిసిన వర్షాలకు ఉత్తరప్రదేశ్‌లో 10 మంది వరకు మరణించారు. పంజాబ్, హర్యానాల్లో వర్షాలకు దాదాపు 55 మంది మృతి చెందినట్లు సమాచారం. ఇక వరదలతో అతలాకుతలం అయిన హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికే రూ.8000 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గత మూడు రోజులుగా యమునా నది ప్రవాహం పెరగడంతో ఢిల్లీ వణికిపోయింది. ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగుపడినా ఇంకా కొన్ని ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. త్రాగునీటి వ్యవస్థ, విద్యుత్ సరఫరాకు ఇంకా కొన్ని ప్రాంతాల్లో అంతరాయం కొనసాగుతోంది. మళ్లీ ఇప్పుడు వర్షాల రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాజ్‌ఘాట్ నుంచి నిజాముద్దీన్ మార్గంలో ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఐపీ ఫ్లైఓవర్ రింగ్ రోడ్డు కాకుండా వేరే మార్గంలో రావాలని వాహనదారులకు సూచనలు చేస్తున్నారు పోలీసులు. ఇదీ చదవండి: వరద గుప్పిట ఉండగానే మళ్లీ అందుకున్న భారీ వర్షం.. ఢిల్లీలో స్తంభించిన జనజీవనం -
ముఖంపై వాపు ఉంటే తస్మాత్ జాగ్రత్త
-
అసలే చలికాలం..సైనసైటిస్‌కు ఈ జాగ్రత్తలు తీసుకుందాం..
ప్రస్తుత చలి వాతావరణం సైనసైటిస్కి అత్యంత అనుకూలించే సీజన్. అంతేకాదు అస్తవ్యస్త వాతావరణ పరిస్థితులు కూడా. ఎండగా ఉండాల్సిన రోజుల్లో వర్షం, వర్షాకాలంలో ఎండ.. మధ్యాహ్నం సమయంలో చల్లని గాలులు... ఇటీవల అన్నీ ఇలాంటి చిత్ర విచిత్ర వాతావరణ పరిస్థితులే చూస్తున్నాం. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అత్యధికులు ఎదుర్కొంటున్న సర్వ సాధారణ ఆరోగ్య సమస్య సైనసైటిస్. ఈ నేపధ్యంలో హైదరాబాద్, కొండాపూర్‌లో ఉన్న అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ ఇఎన్‌టి డాక్టర్ మహమ్మద్ నజీరుద్దీన్ సైనసైటిస్‌కు లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నారిలా... శ్వాస..ఇన్ఫెక్షన్... సైనసైటిస్ అనేది సైనస్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్. ఇది సైనస్ లైనింగ్ కణజాలంలో వాపు కారణంగా ఏర్పడుతుంది. సైనస్‌లు సన్నని శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది ముక్కు మార్గాల ద్వారా బయటకు వస్తుంది. ఇదే ముక్కును శుభ్రంగా, ఇన్ఫెక్షన్ లేకుండా ఉంచుతుంది. ఈ సైనస్‌లు సాధారణంగా గాలితో నిండినప్పుడు, ద్రవంతో నిండినప్పుడు, సైనసైటిస్‌కు దారితీసే ఇన్ఫెక్షన్లకు లోనుకావడం జరుగుతుంది. ఈ ఇన్ఫెక్షన్ ఎవరికైనా రావచ్చు కానీ అలర్జీలు, ఉబ్బసం మరియు బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు తరచుగా సైనస్ ఇన్ఫెక్షన్ బారిన పడుతుంటారు. కొన్ని లక్షణాలు: ► దట్టమైన రంగు మారిన ద్రవంతో ముక్కు నుంచి స్రావాలు ► ముఖం నొప్పి 10 రోజులకు మించి ఉండడం ► ముక్కు మూసుకుపోవడం లేదా మూసుకుపోవడం వల్ల ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ► కళ్ళు, బుగ్గలు, చెవులు, తల, పై దవడ మరియు దంతాల చుట్టూ నొప్పి, సున్నితత్వం, వాపు ► వాసన మరియు రుచి తగ్గినట్టు అనిపించడం ► గొంతు నొప్పి, నోటి దుర్వాసన, అలసట కారణాలు ► సైనసైటిస్ సాధారణంగా వైరస్, బాక్టీరియా లేదా ఫంగస్ వల్ల వస్తుంది, ► సాధారణ జలుబు వల్ల సైనస్‌లు ఉబ్బి ఇన్ఫెక్షన్లకు దారితీసినప్పుడు సైనసైటిస్‌కు దారి తీస్తుంది. ► కాలానుగుణ అలెర్జీలు పుప్పొడి లేదా ధూళి వంటి అలెర్జీ కారకాలకు శరీరం లోనైనప్పుడు సైనస్‌లు ఉబ్బి, సైనసైటిస్‌కు దారితీసే మార్గాన్ని అడ్డుకుంటుంది. ► ధూమపానం సైనస్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది, పొగాకు పొగ నాసికా వాయుమార్గాలను చికాకుపెడుతుంది, తద్వారా శరీరం మరింత శ్లేష్మం ఉత్పత్తి చేస్తుంది, దీని వలన అలెర్జీలు లేదా జలుబు సైనసైటిస్‌కు దారితీసే అవకాశం ఉంది. చికిత్స ► సైనసైటిస్ తీవ్రతను బట్టి వివిధ పద్ధతులలో చికిత్స చేయవచ్చు. డీకోంగెస్టెంట్లు, సెలైన్ ద్రావణంతో నాసికా నీటిపారుదల, యాంటీబయాటిక్స్, పుష్కలంగా నీరు త్రాగడం వంటివి ఈ ఇన్ఫెక్షన్స్కు ప్రాథమిక చికిత్సగా చెప్పొచ్చు. ► దీర్ఘకాలిక/క్రానిక్ సైనసైటిస్ కోసం అలెర్జీలు. ఇంట్రానాసల్ స్టెరాయిడ్ స్ప్రేలు, ఓరల్ హిస్టామిన్ మాత్రలు, యాంటిహిస్టామైన్ స్ప్రేలు చికిత్సలో భాగంగా వైద్యులు సూచిస్తారు. ► అదనపు మందులను కలిగి ఉండే సెలైన్ సొల్యూషన్స్ ఉపయోగించి చేసే నాసికా ప్రక్షాళన కూడా సైనస్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి సమర్థవంతమైన సాధనం. ► వేరే చికిత్సలు ఏవీ ఇన్ఫెక్షన్స్ నియంత్రించడంలో విజయవంతం కానప్పుడు సమస్యను పరిష్కరించడానికి శస్త్రచికిత్స... తర్వాత ఇఖీ స్కాన్ చేయబడుతుంది. నివారణ ప్రధానం.. ► తగినంత అవగాహన, ముందస్తు జాగ్రత్తలతో సైనసైటిస్‌ను నివారించవచ్చు. జలుబు లేదా ఇ¯Œ ఫెక్ష¯Œ లతో అనారోగ్యంగా ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంబంధాన్ని వదులుకోవాలి. –భోజనానికి ముందు చేతులు తరచుగా సబ్బుతో కడుక్కోవాలి. ► వైద్యుల సూచనలు పాటించడం ద్వారా తమకేవైనా అలర్జీలు ఉంటే వాటిని అదుపులో ఉంచుకోవాలి. ► ఊపిరితిత్తులు, నాసికా భాగాలకు చికాకు కలిగించే, మంటను కలిగించే పొగాకు పొగ వంటి కాలుష్య కారకాలకు గురికాకూడదు. పైన పేర్కొన్న లక్షణాలతో పాటు, ఏవైనా ఇతర అసాధారణతలు గమనించినట్లయితే తక్షణ నిపుణుల సంప్రదింపులు అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అనేది శరీరం నుండి అవాంఛిత టాక్సిన్లను తొలగించడంలో సహాయపడుతుంది. –డాక్టర్ మహమ్మద్ నజీరుద్దీన్ఇఎన్టి అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ -
‘నా తల బెలూన్లా ఉబ్బిపోయింది’
పారిస్ : బ్యూటి ఉత్పత్తులు వాడే ముందు వాటి మీద ఒక హెచ్చరిక తప్పక కనిపిస్తుంది. ‘ఈ ఉత్పత్తులను వాడే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ (డైరెక్ట్‌గా వాడకుండా.. చేతి మీద లేదా చెవి వెనక వైపున రాసి చూడండి) చేయండి. 24 గంటల్లోపు ఏలాంటి చెడు ప్రభావం లేకపోతే అప్పుడు పూర్తిగా వాడండి’ అని ఉంటుంది. ఎందుకంటే సదరు ఉత్పత్తుల్లో వాడిన రసాయనాలు మన శరీరానికి సరిపోకపోతే దారుణమైన పరిస్థితులు చవి చూడాల్సి వస్తుంది కాబట్టి. కానీ ఈ ప్యాచ్ టెస్ట్ ఓ మహిళ పాలిట శాపంగా మారింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిన చందంగా తలకు రంగేద్దామనుకుని హెయిర్ డైని ప్రయత్నిస్తే.. ఏకంగా తల ఆకారమే మారిపోయింది. వివరాలు.. పారిస్‌కు చెందిన ఓ పంతొమ్మిదేల్ల పడుచు తలకు కలర్ చేసుకుందామని సూపర్ మార్కెట్ నుంచి ఓ ప్రముఖ హెయిర్ డైని తీసుకొచ్చింది. ప్యాకెట్ మీద సూచించిన విధంగా ప్యాచ్ టెస్ట్ చేయడం కోసం కొద్దిగా రంగును తల మీద అప్లై చేసింది. కొద్ది సేపటికే తలలో విపరీతమైన దురద రావడంతో డాక్టర్ దగ్గరకు పరిగెత్తింది. డాక్టర్లు ఆమెను పరిశీలించి కొన్ని మందులు, ఓ క్రీమ్ ఇచ్చారు. వాటిని వాడింది. మరుసటి రోజు ఉదయం లేచి చూసే సరికి సదరు యువతి తల అనూహ్యమైన రీతిలో ఉబ్బి పోయి కనిపించింది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటమే కాక నాలుక కూడా ఉబ్బటంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ డాక్టర్లు ఆమెని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఆమె వాడిన హెయిర్ డైలో పారాఫినైలినిడయమినే(పీపీడీ) అనే రసాయనం ఎక్కువగా ఉందని తేల్చారు. ఈ రసాయనం వల్ల 56 సెంటీమీటర్లు ఉన్న యువతి తల ఏకంగా 63 సెంటీమీటర్లకు పెరిగింది. దీని గురించి సదరు యువతి ‘పొద్దున లేచే సరికే నా తల సైజు పెరిగి.. ఒక లైట్ బల్బ్‌గా మారింది’ అని తెలిపింది. యువతిని ఓ రోజంతా అబ్జర్వేన్లలో ఉంచిన డాక్టర్లు చివరకు ఆమె తలను పూర్వ స్థితికి తీసుకువచ్చారు. ముఖ్యండా హెయిర్ డైలో ఉండే ఈ పీపీడి రసాయనం వల్ల మూత్రపిండాలు పని చేయకపోవడం.. కండరాలు దెబ్బతినడం వంటి దుష్పరిణామాలు కల్గుతాయంటున్నారు వైద్యులు. అందంగా తయారు కావడం కోసం చేసే ప్రయత్నాలు బెడిసి కొడితే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి. కాబట్టి మనం వాడే ఉత్పత్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. -
మన్యంలో మృత్యు ఘంటికలు
కాళ్లవాపు వ్యాధితో మరో గిరిజనుడి మృతి చింతూరులో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు లేనట్టేనా? రంపచోడవరం/వీఆర్ పురం : ఏజెన్సీలో మళ్లీ మృత్యుఘంటికలు మోగుతున్నాయి. మృత్యువాత పడుతున్న గిరిజనుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. పెరుగుతునే ఉంది. విలీన మండలం చింతూరు ఏరియా ఆస్పత్రిలో ఆదివారం కాళ్లవాపు వ్యాధితో మరో గిరిజనుడు ప్రాణాలు కోల్పోయాడు. వీఆర్ పురం మండలం కుంజంవారిగూడెం గ్రామానికి చెందిన పర్షిక ధర్మయ్య ( 30) పది రోజులుగా కాళ్లవాపు వ్యాధితో బాధపడుతూ శనివారం చింతూరు ఏరియా ఆస్పత్రిలో ప్రాణాలు వదిలాడు. ఒకే వ్యాధి లక్షణాలతో అనేక మంది చనిపోతున్నా అధికార యంత్రంగంలో కదలిక రావడం లేదు. వ్యాధి కారణాలు, నివారణ, చికిత్స గురించి ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదు. రేఖపల్లిలో ప్రారంభమై... వీఆర్‌పురం మండలం రేఖపల్లి పంచాయతీ పరిధిలోని అన్నవరం గ్రామంలో కాళ్లవాపు వ్యాధితో తొలి మరణం సంభవించింది. తరువాత క్రమంలో ఇతర మండలాల్లో కాళ్లవాపు లక్షణాలతో గిరిజనులు మృత్యువాత పడడం ప్రారంభమైంది.కాళ్లవాపుతో ఇప్పటి వరకు విలీన మండలాల్లో మొత్తం 13 మంది గిరిజనులు మరణించారు. వీఆర్‌పురం మండలంలో 8 మంది, చింతూరు మండలంలో నలుగురు, కూనవరంలో ఒకరు మృత్యువాతపడ్డారు. కాళ్లవాపుతో బాధపడుతున్న వారిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించినా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. నేటికీ అందని పౌష్టికాహారం కాళ్లవాపు వ్యాధి ప్రభావంతో విలీన మండలాలు అతలాకుతలమయ్యాయి. ప్రభావిత గ్రామాల పర్యటనకు వచ్చిన ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కేవలం మాటలు చెప్పి వెళ్లారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ప్రభావిత గ్రామాల్లోని ప్రజలకు పౌష్టికాహారం అందించేందుకు రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పాలు, పౌష్టికాహారం పంపిణీ చేసేలా చర్యలు చేపడతామని కలెక్టర్ అరుణ్‌కుమార్ స్వయంగా హామీ ఇచ్చారు. కానీ అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. గిరిజనుల ఆరోగ్యంపై అధికారులు చూపుతున్న శ్రద్ధ ఏమిటో అర్థమవుతోంది. విలీన మండలాల్లో రక్షిత నీరు లేకపోవడం వల్ల వ్యాధులకు కారణమవుతుందని భావించారు. రక్షిత నీరు అందించేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. తాజాగా మరో గిరిజనుడు కాళ్లవాపు వ్యాధితో మృతి చెందడంతో అధికారుల హడావుడి మళ్లీ మొదలైంది. ఇప్పటికీ గుర్తించని మూలాలు కాళ్లవాపు వ్యాధితో గిరిజనులు మరణించి నాలుగు నెలలు కావస్తున్నా ఆ వ్యాధి రావడానికి గల కారణాలను గుర్తించలేకపోయారు. విలీన మండలాల నుంచి ఈ వ్యాధి బారిన పడిన సుమారు 200 మందికి పైగా రోగులు కాకినాడ జీజీహెచ్‌కు వెళ్లి చికిత్స పొందారు. వ్యాధి బారిన పడిన వారికి కిడ్నీలు పనిచేయకపోవడంతో చింతూరులో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. నేటికీ చింతూరు ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయలేదు. డయాలసిస్ అవసరమైన రోగులను కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తున్నారు. మన్యంలో మృత్యుఘంటికలు ఆపేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
మన్యానికి మాయరోగం
గిరిజనంపై విరుచుకుపడుతున్న కాళ్లవాపు వ్యాధి నాలుగు నెలల వ్యవధిలో 14 మంది మృత్యువాత వ్యాధి మూలాలు కనుగొనడంలో ప్రభుత్వం విఫలం ఇచ్చిన హామీల అమలు గాలికి.. బాధితులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ అధినేత జగన్ నేడు బాధితులకు పరామర్శ ఆ రోగం.. ఇంటి పెద్దదిక్కులను పొట్టనపెట్టుకుంది.. ఆ ఇంటి మహలక్ష్ములను బలితీసుకుంది. ఎందరినో అనాథలను చేసింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. నాలుగు మాసాల్లో ఏకంగా 14 మంది ప్రాణాలను హరించింది. వారి కుటుంబాలను శోకసంద్రంలో ముంచింది. కాళ్లవాపు వ్యాధి అన్నారే తప్ప.. అదేం రోగమో పూర్తిగా నిర్ధారించని అధికారగణం, కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించని పాలకుల తీరు మన్యంవాసులను మరింత బాధించాయి. అయితే వారికి కొండంత భరోసానిస్తూ.. వైఎస్సార్ సీపీ జిల్లా నేతలు అండగా నిలిచారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. తాజాగా వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం మన్యంలో పర్యటించి కాళ్లవాపు బాధితులను పరామర్శించనున్నారు. కాళ్లవాపు వ్యాధి. వీఆర్ పురం మండలం రేఖపల్లి పంచాయతీ పరిధి అన్నవరం గ్రామంలో తొలుత ప్రారంభమై పరిసర గ్రామాలకు, చింతూరు, కూనవరం మండలాలకు వ్యాపించింది. ఈ వ్యాధి బారినపడి వీఆర్‌పురం మండలంలో ఎనిమిది మంది, చింతూరు మండలంలో ఐదుగురు, కూనవరం మండలంలో ఒకరు, మొత్తం 14 మృతిచెందారు. కన్నెత్తి చూడని పాలకులు ఏజన్సీలో కాళ్లవాపు మరణాలతో గిరిజనులు ప్రాణాలు విడుస్తున్నా జిల్లాకు చెందిన ప్రభుత్వ పెద్దలు కనీసం కన్నెత్తి చూడ లేదు. ఓ మంత్రి చుట్టపుచూపుగా వచ్చి బాధితులను హడావిడిగా పరామర్శించి వెళ్లారే తప్ప ఇప్పటి వరకు ఆయనిచ్చిన హామీలు నెరవేరలేదు. ఏదో అరకొర సాయంగా వీఆర్‌పురం మండలానికి చెందిన ఆరు కుటుంబాలకు మాత్రమే రూ.లక్ష చొప్పున పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. జిల్లాకు చెందిన హోంమంత్రి, ఆర్థికశాఖ మంత్రులతో పాటు ఇన్చార్జి మంత్రి, స్థానిక ఎంపీలెవరూ బాధితులను పరామర్శించక పోవడం విమర్శలకు తావిస్తోంది. కార్యరూపం దాల్చని కలెక్టర్ హామీ కాళ్లవాపునకు నాటుసారా కూడా కారణమని జిల్లా కలెక్టర్ పేర్కొనడంతో ఈ ప్రాంత గిరిజనుల మనోభావాలు దెబ్బతిన్నాయి. మృతుల్లో ఇంటర్ విద్యార్థులూ ఉన్నారు. ఏజన్సీ ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పాలు, పౌష్టికాహార పదార్థాలు పంపిణీ చేసేలా చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ ఇచ్చిన హామీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. పత్తాలేని నివేదిక కాళ్ల వాపు ప్రభావంతో 14 మంది గిరిజనులు మరణించినా.. ఆ వ్యాధి మూలాలు కనుగొనడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ వ్యాధితో విలీన మండలాల నుంచి 200 మందికి పైగా రోగులు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స చేయించుకున్నారు. వైద్య నిపుణులు గ్రామాల్లో పర్యటించి రోగులు, స్థానికుల రక్త నమూనాలు, ఆహారం, నీరు తదితర నమూనాలు సేకరించారు. వ్యాధి నిర్ధారణ కోసం దిల్లీ నుంచి కేంద్ర వైద్య బృందం పర్యటిస్తుందని చెప్పినా.. ఆ దిశగా అడుగుపడలేదు. కాళ్లవాపు అనేది వైద్య పరిభాషలో లేదని కిడ్నీ సంబంధిత వ్యాధితోనే కాళ్లవాపులు వస్తున్నాయని వైద్యసిబ్బంది చెబుతున్నారు. మరోవైపు రంపచోడవరంలో బ్లడ్‌బ్యాంక్, చింతూరులో కిడ్నీ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామని జిల్లా అధికారులు ప్రకటించి నెలలు గడుస్తున్నా నేటికీ ఏర్పాటు చేయలేదు. అలాగే చింతూరు ఏరియా ఆసుపత్రిని ప్రధాన వైద్యకేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన అధికారులు అరకొర సిబ్బందిని నియమించి చేతులు దులుపుకొన్నారు. -
మన్యంపై మొద్దు నిద్ర
వరుసగా చనిపోతున్నా చలనం లేదాయె కాళ్లవాపు, పొట్టవాపు రోజుకొకటి వెలుగులోకి రోజుల పసిగుడ్డులనుంచి వృద్ధుల వరకు మృత్యువాత ఇంతవరకూ నిర్ధారణ కాని వ్యాధి నాటు సారా తాగడం వల్లనేనని ప్రకటనలు చిన్నపిల్లలు, విద్యార్థులు మృతికీ తాగుడే కారణమా? తరువాత అదీ ఓ కారణమంటూ మాట మార్పు ‘సాక్షి’ వరుస కథనాలతో కొంత కదలిక జగన్ మోహన్ రెడ్డి ఆరాతో మరింత హడావుడి సాక్షి ప్రతినిధి, కాకినాడ/వి.ఆర్.పురం/చింతూరు : మన్యంలో గిరిజనుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారాయి. మరణశయ్యపై ఉన్న ‘తూర్పు’ మన్యానికి భరోసా కల్పించలేక సర్కార్ చేతులెత్తేస్తోంది. గడచిన నెలన్నర రోజులుగా మన్యం వాసులను వణికిస్తున్న కాళ్లవాపు వ్యాధి అసలు ఎందుకు వస్తుందో ఇంతవరకు నిర్థారణ కాలేదు. కాకినాడ రంగరాయ, విశాఖ ఆంధ్రా మెడికల్ కళాశాలలకు చెందిన వైద్య బృందాలు రోగుల రక్త నమూనాలు సేకరించినా నివేదికలు మాత్రం ఇంకా రాలేదు. ఆ నివేదికలు ఎప్పుడు వస్తాయో అధికారులు ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. నాటుసారా తాగడంతోనే మరణాలు సంభవించాయని మొదట్లో జిల్లా కలెక్టర్ వెల్లడించినట్టు పలు పత్రికల్లో (సాక్షి కాదు) వార్తలు వచ్చాయి. మృతుల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులుండటం, అందులో ఒక విద్యార్థిని కావడంతో విమర్శలు వెల్లువెత్తడంతో నాటుసారా మాత్రమే కారణం కాదని అది కూడా ఒకటై ఉంటుందని సర్థిచెప్పే ప్రయత్నం చేశారు. వ్యాధి నియంత్రణ, వ్యాధిగ్రస్తులకు భరోసా ఇవ్వడంలో పాలకుల చొరవ, ప్రభుత్వ ప్రయత్నాలు విమర్శపాలవుతున్నాయి. కాళ్లవాపు వ్యాధి అదుపులోకి రాకపోగా, మలేరియా, టైపాయిడ్, విషజ్వరాలతో మృతి చెందుతున్న గిరిజనుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఏజెన్సీలో ఇంత ఆందోళనకరమైన పరిస్థితులున్నా నామమాత్రపు చర్యలతో కాలక్షేపం చేస్తూ వ్యాధి అదుపులోకొచ్చిందని జిల్లా యంత్రాంగం చెబుతూ వస్తోంది. కాళ్లవాపు వ్యాధి వీఆర్‌పురం, చింతూరు, కూనవరం మండలాల్లో గ్రామాలను వణికిస్తోంది. అంతుచిక్కని ఈ వ్యాధితో ఏడుగురు గిరిజనులు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఇద్దరు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు కూడా ఉన్నారు. ఇంకా ఈ వ్యాధితో అటు విలీన మండలాల్లో, ఇటు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 50కి పై మాటే. మన్యంలో నెలకొన్న పరిస్థితులపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించి ముళ్లుకర్రతో వెంటపడడంతో తాబేలు నడకలా పరిశీలిస్తున్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరా తీస్తున్న విషయం పత్రికల్లో రావడంతో గిరిజన శాఖా మంత్రి హడావుడిగా పర్యటించారు. బాబు, కామినేనిలు జిల్లాకు వచ్చినా... వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు ఈ నెలన్నరలో జిల్లా పర్యటనకు వచ్చి వెళ్లిన వారే. కానీ కాళ్లవాపు వ్యాధితో మృతి చెందిన కుటుంబాల వైపు కన్నెత్తిచూసే తీరిక, ఓపిక వారికి లేకుండా పోయిందని గిరిజన సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యశాఖా మంత్రి కామినేని జగ్గంపేటలో పలు ప్రారంభోత్సవాలకు హాజరవడానికి తీరిక దొరికింది కానీ తమను పలకరించడానికి దొరకలేదా అని మన్యంవాసులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దేవినేని ఉమ కనీసం కన్నెత్తి చూడలేకపోవడాన్ని బట్టే గిరిజనులపై ఎంతటి శ్రద్ధ కనబరుస్తున్నారో అర్థమవుతోందంటున్నారు. ఆగని మరణాలు... కాళ్లవాపు వ్యాధితో ఏడుగురు గిరిజనులు మృతి చెందగా, తాజాగా రాజవొమ్మంగి మండలం పూదూడి, పాకవెల్లిలో నెల వయసు పసికందులు ఇద్దరు, మారేడుమిల్లి మండలం వేటుకూరుకు చెందిన ఆరో తరగతి విద్యార్థి రాజారెడ్డి తాజాగా బుధవారం అనారోగ్యంతో మృతిచెందడం గమనార్హం.సరిగ్గా ఏడాది క్రితం వీఆర్‌పురం రాజుపేట కాలనీలో దుర్గాభవానీ అనే యువతి కాళ్లవాపు వ్యాధితో కాళ్లు చచ్చుబడిపోగా విజయవాడలో రెండు కాళ్లు తొలగించేశారు. ఇప్పుడు ఆ యువతి కిడ్నీల వాధితో బాధపడుతూ కాకినాడ జీజీహెచ్‌లో చికిత్సపొందుతోంది. ఇచ్చిన లక్ష ఏ మూలకు...? కాళ్లవాపు వ్యాది మృతులకు ప్రభుత్వం రూ.లక్ష ఇచ్చింది. అంతుచిక్కని వ్యాధి వచ్చాక స్థానికంగా వైద్యానికే లక్ష ఖర్చు అయ్యిపోయింది, ప్రభుత్వం ఇచ్చిన లక్ష ఏమూలకూ రాలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భర్త కోల్పోయి బతుకు భారమైన కుటుంబం, చేతికందొచ్చిన కొడుకును కోల్పోయి తల్లిదండ్రులు...ఇలా ఏ కుటుంబాన్ని కదిలించినా కన్నీటి గాధలే. ఏజన్సీలో వైద్యసేవలు మెరుగు పరుస్తామన్న హామీ కార్యరూపం దాల్చలేదు. కొత్తగా వైద్యుల పోస్టులు భర్తీ కాకపోగా ఉన్న వైద్యులే మన్యం వీడిపోతున్నారు. మన్యంలో మరణ మృదంగంపై పాలకులు మానవతాదృక్పధంతో స్పందించి వారికి మనో ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
వనసీమ వణుకుతోంది..
విలీన మండలాల్లో కాళ్లవాపు కలవరం ఇప్పటికే కొందరు మృత్యువాత కాకినాడ జీజీహెచ్‌లో 43 మందికి చికిత్స నెలన్నరైనా అంతుపట్టని వ్యాధిమూలం కాకినాడ సిటీ : లేళ మందలపై విరుచుకుపడ్డ బెబ్బులిలా.. మన్యంలోని విలీన మండలాల్లో గిరిజనులను భయకంపితుల్ని చేస్తున్న కాళ్లవాపు వ్యాధిని గుర్తించి నెలన్నర దాటి నా దానికి కారణాలేమిటో అంతు చిక్కడం లేదు. ఇప్పటికే ఈ వ్యాధి కొందరిని పొట్టన పెట్టుకుంది. కాగా వీఆర్ పురం, చింతూరు, కూనవరం మండలాల నుంచి 43 మంది ఈ వ్యాధితో ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 15 మంది మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారని జీజీహెచ్ వైద్యులు నిర్ధారించారు. వారిలో జోగయ్య, బొజ్జి, మల్లమ్మలకు వ్యాధి తీవ్రంగా ఉన్నట్టు గుర్తించి డయాలసిస్ చేస్తున్నారు. జయమ్మ అనే మహిళకు హెపో థైరాయిడ్ సమస్య ఉండటంతో ప్రత్యేకమైన వైద్యం అందిస్తున్నారు. మిగిలిన వారి రక్త నమూనాల నివేదికలు రావల్సి ఉందంటున్నారు. కాళ్ళవాపుతో జీజీహెచ్‌లో ఉన్న రోగులు ఆయాసం, బీపీ, రక్తహీనత, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చిన ముగ్గురు నెఫ్రాలజిస్టులతో పాటు జీజీహెచ్ మెడిసిన్ విభాగం హెచ్‌వోడీలతో కూడిన వైద్యుల బృందం సేవలు అందిస్తోంది. చిల్లిగవ్వ ఇవ్వలేదు.. కాళ్లవాపు పీడితులకు అసలు వచ్చిన రోగమేమిటో ఇంతవరకూ నిర్థారణ కాకపోవడం గిరి జనులను కలవరపరుస్తోం ది. జీజీహెచ్‌లోని ఈఎన్టీ బ్లాక్‌లో 43 మందికి వైద్య సేవలందిస్తున్నారు. ఇంకా ఎంత కాలం ఉండాలి, తమను ఇళ్లకు ఎప్పుడు పంపిస్తారని వ్యాధిగ్రస్తులు అడుగుతున్నారు. ఇంటి వద్ద తమ వారి పరిస్థితి ఏమిటని ఆవేదన చెందుతున్నారు. వ్యాధిగ్రస్తుల సహాయకులకూ ఆర్థిక సాయం అందిస్తామన్నా ఇంతవరకు చిల్లిగవ్వ ఇవ్వలేదు. కాళ్ళవాపు ప్రబలిన గ్రామాల్లో ప్రజలు తీసుకుంటున్న ఆహారం, తాగునీరు, నూనె తదితరాల నమూనాలను పరీక్షల నిమిత్తం హైదరాబాద్ ల్యాబ్‌కు పంపగా ఏమీ లేదని నివేదికలు వచ్చినట్టు జీజీహెచ్ వర్గాల ద్వారా తెలిసింది. అధికారులు మాత్రం పసరు మందుల వినియోగం, నాటుసారా, జీలుగు, తాటికల్లుల్లో కలిపే రసాయనాలే కారణాలు కావచ్చంటున్నారు. -
నొప్పి లేదు కానీ... వాపు ఉంది!
క్యాన్సర్ కౌన్సెలింగ్ నా వయసు 24 ఏళ్లు. నా మెడ భాగంలో నొప్పి లేదు కానీ, చిన్న వాపులాంటిది వచ్చింది. రాత్రి సమయంలో జ్వరం వస్తోంది. చలిగా అనిపిస్తోంది. డాక్టర్‌ను కలిస్తే లింఫోమా అని తెలిపారు. దీని లక్షణాలను, నిర్ధారణ పరీక్షలతో పాటు అసలు ఈ లింఫోమా అంటే ఏమిటి అనే విషయాలను వివరించండి. - ఒక సోదరి, హైదరాబాద్ లింఫోమా అంటే ఉత్పత్తి, నిల్వ చేయడంతో పాటు తమతో తీసుకెళ్లే కణజాలం అయిన లింఫ్ సిస్టమ్‌లో కలిగే ఒక రకం క్యాన్సర్లు. ఈ లింఫోమా అనేవి ప్రధానంగా రెండు రకాలు. 1) హాడ్జ్కిన్స్ లింఫోమా 2) నాన్-హాడ్జ్కిన్స్ లింఫోమా. లింఫోమా లక్షణాలు: నొప్పి లేకుండా మెడల్లో, చంకల్లో వాపులు రావడం స్ప్లీన్ పెరగడం, పొట్ట నొప్పి/అసౌకర్యం జ్వరం, చలితో పాటు రాత్రిళ్లు చెమటలు పట్టడం శక్తి లేకపోవడం అకస్మాత్తుగా బరువు తగ్గడం ఎక్కువ మందిలో బరువు తగ్గడం సాధారణ రోగ నిర్ధారణ పరీక్షలు రక్త పరీక్షలు బయాప్సీ ఎముక మూలుగ పరీక్ష సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్స్ పరీక్ష మాలిక్యులార్ రోగి నిర్ధారణ పరీక్షలు ఇమేజింగ్ పరీక్షలు (ఎక్స్-రే, కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ స్కాన్ (సీటీ), మాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ (ఎమ్మారై), పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ స్కాన్ (పెట్ స్కాన్) లింఫోమా సమస్యకు తగిన చికిత్స తీసుకున్న తర్వాత థైరాయిడ్, కాలేయం, మూత్రపిండాలను క్రమపద్ధతిలో చెక్ చేయించుకోవాలి. లిపిడ్స్ పరీక్ష కూడా చేయించుకోవాలి. - డా॥ఆర్ సింగీ హెమటాలజిస్ట్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్, సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
పౌష్టికాహార దినుసులు అందించాలి
కాళ్లవాపు బాధితులను పరామర్శించిన భద్రాచలం ఎమ్మెల్యే కాకినాడ సిటీ : కాళ్లవాపు వ్యాధి ఉన్న గిరిజనులలో ఎక్కువ మం ది రక్తహీనతతో బాధపడుతుండడం వల్ల ఆయా కుటుంబాలకు ఆరు నెలలకు సరిపడా పౌష్టికాహార దినుసులు అందించాలని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజనులను ఎమ్మెల్యే రాజయ్య, వీఆర్‌పురం ఎంపీపీ శరమయ్యలు పరామర్శించారు. అక్కడే రోగులను పరీక్షిస్తున్న ప్రొఫెసర్ హరి విజయకుమార్‌తో రోగుల సమాచారం అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మంచి వైద్యం అందించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట గిరిజన సంఘం నాయకులు బొప్పన కిరణ్, సీపీఎం నగర కార్యదర్శి పలివెల వీరబాబు ఉన్నారు. శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలి ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో సమస్య వచ్చినప్పుడు స్పందిం చడం కన్నా శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని జన విజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చల్లా రవికుమార్ డిమాండ్ చేశారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజనులను సోమవారం పరామర్శించారు. ఆయ న మాట్లాడుతూ ముంపు మండలాల్లో కనీసం 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుచేసి పూర్తిస్థాయిలో వైద్యులను నియమించి మందులు, పరీక్షల సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. రవికుమార్‌తో పాటు జేవీవీ సీనియర్ నాయకులు మోకా సుబ్బారావు పాల్గొన్నారు. -
కీళ్లను ముట్టుకుంటే మంట.. పట్టుకుంటే తంటా..!
రుమటాయిడ్ ఆర్థరైటిస్ మన కీళ్లు మనకు తెలియకుండా అవసరానికి తగినట్లుగా వంగిపోతూ రోజువారీ పనుల్లో పాల్గొంటుంటాయి. అవి ఏదైనా కారణాలతో వంగక తీవ్రమైన నొప్పితోనూ, వాపుతోనూ ఉంటే అప్పుడుగాని కీళ్లకు వచ్చిన సమస్య మనకు తెలియదు. అప్పటివరకూ మన దైనందిన కార్యకలాపాల్లో వాటి ప్రాధాన్యం మనకు అర్థం కాదు. కీళ్లనొప్పుల్లో అనేక రకాలు ఉన్నా... ప్రధానంగా చిన్న కీళ్లలో వచ్చే నొప్పుల్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్‌గా పేర్కొనవచ్చు. చలి ఎక్కువగా ఉండే రోజుల్లో సమస్య మరింతగా కనిపించే ‘రుమటాయిడ్ ఆర్థరైటిస్’పై అవగాహన కోసం ఈ కథనం. చిన్న చిన్న కీళ్లలో వచ్చే ఇన్ఫ్లమేషన్ ద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యక్తమవుతుంది. నొప్పి, వాపు, ముట్టుకుంటే నొప్పి/మంటతో పాటు ముట్టుకోనివ్వని లక్షణాన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు. డయాబెటిస్, రక్తపోటు (హైబీపీ)లాగే... రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా దీర్ఘకాలిక (క్రానిక్) వ్యాధే. అయితే ఇప్పుడు లభ్యమవుతున్న ఆధునిక వైద్య చికిత్సా ప్రక్రియతో గతంతో పోలిస్తే మరింత సమర్థంగా అదుపులో ఉంచేందుకు వీలైన వ్యాధి ఇది. మూడు ‘ఎస్’లతో గుర్తించడం తేలిక: మీకు కనిపిస్తున్న మూడు ప్రధాన లక్షణాలను ఇంగ్లిష్‌లో చెప్పుకోవడం ద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను తేలిగ్గా గుర్తించవచ్చు. అవి... ఊ స్టిఫ్నెస్ (బిగుసుకుపోవడం): ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోయినట్లుగా అయిపోయి అలాగే 30 నిమిషాలకుపైగా ఉండటం. ఊ స్వెల్లింగ్ (వాపు): కీళ్ల వాపు కనిపించడం (ప్రధానంగా చేతి వేళ్ల కణుపుల వద్ద అంటే చిన్న కీళ్లు అన్నమాట) ఊ స్క్వీజింగ్ (నొక్కడంతో నొప్పి): సాధారణంగా ఎవరైనా షేక్‌హ్యాండ్ ఇచ్చినప్పుడు కలిగే ఒత్తిడితో పెద్దగా నొప్పి ఫీల్ అయ్యేందుకు అవకాశం ఉండదు. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు... షేక్‌హ్యాండ్ వల్ల కలిగే చిన్నపాటి ఒత్తిడికి కూడా భరించలేరు. ఈ మూడు ‘ఎస్’ ఫ్యాక్టర్లకు మీ సమాధానం కూడా ‘ఎస్’ అయితే మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందేమోనని చూసుకోవాలి. ఇతర లక్షణాలు: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను గుర్తించడం చాలా తేలిక. ఇది వచ్చిందంటే రెండు చేతుల కీళ్లూ... నొప్పి పెడతాయి. ఒక్కోసారి రాత్రికి రాత్రే కీళ్లన్నీ బిగుసుకుపోయి ఉదయానికి పరిస్థితి దుర్భరమవుతుంది. కొందరిలో ఎంతగా అలసట ఉంటుందంటే వాళ్లు అదేపనిగా నిద్రపోతుంటారు. ఇక ఉదయాన్నే కీళ్ల కణుపుల వద్ద నొప్పి తగ్గడానికి చేతులను వేడినీళ్లలో ముంచితే తమకు ఉపశమనం కలుగుతుందేమోనని అనుకుంటుంటారు. సాధారణంగా మనం డోర్‌నాబ్ తిప్పడం, షర్ట్ బటన్లు పెట్టుకోవడం వంటి సమయంలో వేళ్ల కణుపుల్లోనూ, మణికట్టులోనూ కలిగే నొప్పితో దీన్ని గుర్తించవచ్చు. అయితే మొదట్లో చిన్న కీళ్లకు (అంటే వేళ్ల కణుపులకు) పరిమితమైన నొప్పి... వ్యాధి తీవ్రత పెరుగుతున్న కొద్దీ పెద్ద కీళ్లకూ (అంటే.. మోచేయి, మోకాలు, మడమ... వంటివాటికి) వ్యాపిస్తుంది. ఎందుకు వస్తుందిది..? మన వ్యాధినిరోధక వ్యవస్థ మనపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే వ్యాధి ఇది. మన కీళ్లు ఎందుకో మన వ్యాధి నిరోధక వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్)కు కొత్తగా అనిపిస్తాయి. దాంతో ఆ వ్యవస్థ మన కీళ్లపై పోరాటం మొదలుపెడుతుంది. మన కీళ్ల కణుపులపై యాంటీబాడీస్‌ను క్షిపణుల్లా ప్రయోగిస్తుంటుంది. దాంతో ఎముకల కీళ్ల చివరన ఉండే సైనోవియమ్ అనే పొర దెబ్బతింటుంది. ఫలితంగా కీళ్ల వద్ద, కీళ్ల చుట్టూ నొప్పి, వాపు, ముట్టుకోనివ్వనంత మంట కనిపిస్తాయి. నిర్ధారణ: ఊ లక్షణాలు కనీసం ఆరు వారాల పాటు అలాగే కొనసాగడం (అయితే ఇటీవల ఆరువారాల లోపే లక్షణాలు తీవ్రతరమవుతున్నాయి. దాంతో వ్యాధిని త్వరగా గుర్తించడం... ఫలితంగా చికిత్సకు స్పందన కూడా త్వరితంగా కనిపించడం జరుగుతోంది). ఊ రుమటాయిడ్ ఫ్యాక్టర్ పరీక్ష: ఇది వ్యాధి పేరుతో ఉన్న పరీక్షే అయినా... ఒక్కోసారి వ్యాధి ఉన్నప్పటికీ ఇందులో నెగెటివ్ రావచ్చు. ఇంకా విచిత్రం ఏమిటంటే... ఒక్కోసారి కొందరిలో ఏ వ్యాధి లేనివారిలోనూ ఇది పాజిటివ్ వచ్చే అవకాశమూ ఉంది. కాబట్టి రుమటాలజిస్టులు కానివారు నిర్దిష్టంగా నిర్ధారణ చేయలేకపోవచ్చు. రుమటాలజిస్ట్ మాత్రమే ఈ వ్యాధిని సరిగా నిర్ధారణ చేయగలరు. ఊ యాంటీ-సీసీపీ (సైక్లిక్ సిట్రులినేటెడ్ పెప్టైడ్)తో నిర్ధారణ నిర్దిష్టంగా జరిగే అవకాశం ఉంది. అయితే ఇందులోనూ ఒక ప్రతికూలత ఉంది. అదేమిటంటే... రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న 60 శాతం మంది రోగుల్లోనే యాంటీ-సీసీపీ కనపడుతుంది. వ్యాధిని ఎదుర్కోవడం ఇలా ... రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను పూర్తిగా నయం చేయడం కంటే వ్యాధిని అదుపులో ఉంచడమే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రక్రియ. అందుకే వ్యాధిని ఎదుర్కునే క్రమంలో రోగికి వ్యాధి పట్ల అవగాహన కల్పించడం, కొన్ని సూచనలు ఇవ్వడం, ఫిజియోథెరపీ వంటివి అవసరం. చికిత్సతో పాటు ఇవన్నీ కలగలిసి ఆచరించాల్సిన అవసరం ఉంది. ఊ రోగికి అవగాహన: వ్యాధిని అదుపులో పెట్టాలంటే ముందు వ్యాధిపట్ల రోగికి అవగాహన అవసరం. రోగి తెలుసుకోవాల్సిందేమిటంటే... ఇది దీర్ఘకాలిక వ్యాధి. చికిత్స తీసుకోగానే టక్కున మాయమైనట్లుగా నయమయ్యేది కాదు. చికిత్స కూడా దీర్ఘకాలంపాటు తీసుకుంటూ ఉండాలి. గుణం కనిపించడం కూడా అంత త్వరగా జరగదు. (మందులు పనిచేయడం అన్నది ఆరు వారాలకు ముందుగా కనిపించదు). పాటించాల్సిన సూచనలు ఊ రోగి నిద్ర మేల్కోగానే పడకపైనుంచి లేచేముందుగా కనీసం ఐదు నిమిసాల పాటు అలాగే పడుకుని కీళ్లను ముడుస్తూ, రిలాక్స్ చేస్తూ ఉండాలి. దాంతో కండరాలన్నీ బిగుతును కోల్పోయి, సాఫ్ట్‌గా మారతాయి. ఊ కీళ్లు బిగుతుగా ఉంటే పొద్దున్నే వేణ్ణీళ్లతో స్నానం చేస్తే, ఆ బిగుతు తగ్గుతుంది. ఊ రోగి తాను పనిచేస్తున్నప్పుడు కనీసం ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి పనికి బ్రేక్ ఇచ్చి ఒక ఐదు నిమిషాల పాటు రిలాక్స్ కావాలి. ఇలా రోజంతా చేయాలి. ఊ పతి కీలుపైనా పడే ఒత్తిడిని నిరోధించడానికి చేయాల్సిన వ్యాయామ విధానాలను డాక్టర్‌ను లేదా ఫిజియోథెరపిస్ట్‌ను అడిగి తెలుసుకుని, వాటిని పాటించాలి. ఊ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఉపశమనం కోసం వాడాల్సిన కొన్ని ఉపకరణాలను డాక్టర్‌ను అడిగి తెలుసుకుని వాటిని వాడాలి. ఫిజియోథెరపీ : ఈ వ్యాధి వచ్చిన వారు తమ కీళ్ల పనితీరును మెరుగుపరచుకునేందుకు తరచూ ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించి, వారు సూచించిన వ్యాయామాలను చేయాలి. ముఖ్యంగా కీళ్లు కదలడానికి చేసే ప్రక్రియల వల్ల వాటిపై పడే ఒత్తిడిని తొలగించేలా / లేదా తగ్గించేలా ఈ వ్యాయామాలు ఉంటాయి. వాటిని విధిగా పాటించాలి. వైద్యచికిత్స : రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు చేసే చికిత్స అనేకబరకాలుగా ఉంటుంది. తక్షణం నొప్పిని ఉపశమింపజేసేందుకు ఉపయోగించాల్సిన మందులు, మన ఇమ్యూనిటీ వ్యవస్థ ప్రతికూలంగా పనిచేయకుండా చూసేందుకు వాడాల్సిన మందులు, స్టెరాయిడ్స్ ఇలా రకరకాల మందులు ఉపయోగించాల్సి ఉంటుంది. నొప్పినివారణకు: కీళ్లలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల వచ్చే నొప్పిని తగ్గించడానికి సాధారణ నొప్పి నివారణ మందులు వాడితే వాటి ప్రభావం కొద్ది గంటలకు మించి ఉండదు. అందుకోసం వ్యాధిని అదుపులో పెడుతూనే, నొప్పిని తగ్గించగల మందులనూ వాడాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉద్దేశించిన మందులను నాన్‌స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎస్ఏఐడీ) అంటారు. ఈ జబ్బులో వాటిని వాడతారు. అసలు జబ్బుపై పనిచేయడానికి: ఇక ఈ వ్యాధిలో మన సొంత వ్యాధి నిరోధక శక్తే మనపై ప్రతికూలంగా పనిచేసి, మన కీళ్ల యాంటీబాడీలను ప్రయోగిస్తుందన్న విషయం తెలిసిందే. అందుకే ఇలాంటి యాంటీబాడీస్ దాడులను తగ్గించే మందులు వాడాల్సి ఉంటుంది. అందుకోసం మన వ్యాధి నిరోధక శక్తి తాలూకు ప్రభావాన్నే కాస్తంత తగ్గించేలా మందులు వాడాల్సి వస్తుంది. మరి అలాంటప్పుడు సొంత వ్యాధి నిరోధక శక్తిని తగ్గించుకుంటే అది ఇతరత్రా ప్రమాదం కావచ్చు కదా. అందుకే ఇతరత్రా వ్యాధి కారకాల విషయంలో తగ్గనంతగానూ, కేవలం మన సొంత కీళ్ల కణుపులు రక్షితమయ్యేంతగానూ ఉండేలా ఈ మందుల మోతాదులు చాలా సునిశితంగా నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే ఇతరత్రా మనకు హాని కాకుండా కేవలం కీళ్లపై పనిచేసే యాంటీబాడీస్ ప్రభావాన్ని తగ్గించే ఈ తరహా మందుల్ని ‘డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్’ (డీఎమ్‌ఏఆర్‌డీ) అంటారు. ఇవి కూడా తమ ప్రభావాన్ని చూపడానికి కనీసం 6 నుంచి 8 వారాల వ్యవధి పడుతుంది. స్టెరాయిడ్స్‌తో బ్రిడ్జింగ్ థెరపీ: మొదట నొప్పిని తగ్గిస్తూ... ఆ తర్వాత అసలు వ్యాధిపై పనిచేసేలా ప్రభావాన్ని చూపడానికి కనీసం 6 నుంచి 8 వారాలు పడుతుందని ముందే తెలుసుకున్నాం. మరి ఈ లోపు... నొప్పితో కూడిన కణుపులతో బాధపడటమేనా? అందుకే అసలు ప్రభావం కనిపించే లోపు... ఉపశమనం కలిగించడానికి, వ్యాధిని అదుపుచేయడానికీ మధ్య వంతెనలా పనిచేయడానికి పనికి వచ్చేలా స్టెరాయిడ్స్ వాడాల్సి ఉంటుంది. ఇలా ఇవి వంతెన భూమికను నిర్వహిస్తాయి కాబట్టే ఈ స్టెరాయిడ్స్‌తో చేసే చికిత్సను ‘బ్రిడ్జింగ్ థెరపీ’ అంటూ అభివర్ణిస్తారు నిపుణులు. మొదట్లో అసలు కదిలించడానికే వీల్లేనంత తీవ్రంగా ఉండే వేళ్ల కీళ్లనూ, వాటి కణుపులనూ మామూలుగా మార్చడానికి కొంతమోతాదులో స్టెరాయిడ్ ఇంజెక్షన్లను ఇవ్వడం మొదలు పెట్టి... నిపుణులు క్రమంగా ఆ మోతాదును తగ్గించుకుంటూ వస్తారు. రోగులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు మందులు వాడే సమయంలో కాస్తంత తెరిపి కనిపించినా... ఎట్టిపరిస్థితుల్లోనూ మందులు మానకూడదు. - నిర్వహణ: యాసీన్ కొత్త చికిత్సా విధానాలు మనలోని వ్యాధి నిరోధక శక్తే కొన్ని యాంటీబాడీస్‌ను మన కీళ్లపైకి ప్రయోగించడం వల్ల తీవ్రమైన బాధ కలుగుతుందన్న విష యం తెలిసిందే. అందుకే కీళ్లపై పనిచేసే యాంటీబాడీస్‌ను అణిచేసేలా కొత్త మందు లు రూపొందించారు. ఇవి వ్యాధినిరోధకతకూ, కీళ్లకూ మధ్యలో వ్యాధి నిరోధకత సృష్టించే యాంటీబాడీస్‌ను అణిచేలా పని చేస్తాయి కాబట్టి ఇంటర్మీడియరీ పదార్థాలు అని కూడా అంటారు. వీటిని టీఎన్ఎఫ్-ఆల్ఫా, ఐఎల్-6 వంటి జీవసంబంధమైన (బయాలజిక్) పదార్థాలనుంచి రూపొందిస్తారు కాబట్టి వీటిని ‘బయాలజిక్ ఏజెంట్స్’ అని కూడా వ్యవహరిస్తారు. అయితే ఈ మందులు చాలా ఖరీదైనవి. ఉదాహరణకు ఇన్‌ఫ్లిక్సిమాబ్, ఎటానెర్సెప్ట్, అబాటసెప్ట్, రిటుక్సిమాబ్. ఈ కేటగిరీలో టొఫాసిటినిబ్ అన్నది సరికొత్త మందు. త్వరలోనే భారతదేశంలోకి రానుంది. - డాక్టర్ కె. ధీరజ్, రుమటాలజిస్ట్, యశోదా హాస్పిటల్, మలక్‌పేట, హైదరాబాద్