క్యాన్సర్ కౌన్సెలింగ్
నా వయసు 24 ఏళ్లు. నా మెడ భాగంలో నొప్పి లేదు కానీ, చిన్న వాపులాంటిది వచ్చింది. రాత్రి సమయంలో జ్వరం వస్తోంది. చలిగా అనిపిస్తోంది. డాక్టర్‌ను కలిస్తే లింఫోమా అని తెలిపారు. దీని లక్షణాలను, నిర్ధారణ పరీక్షలతో పాటు అసలు ఈ లింఫోమా అంటే ఏమిటి అనే విషయాలను వివరించండి.
- ఒక సోదరి, హైదరాబాద్
లింఫోమా అంటే ఉత్పత్తి, నిల్వ చేయడంతో పాటు తమతో తీసుకెళ్లే కణజాలం అయిన లింఫ్ సిస్టమ్‌లో కలిగే ఒక రకం క్యాన్సర్లు. ఈ లింఫోమా అనేవి ప్రధానంగా రెండు రకాలు. 1) హాడ్జ్‌కిన్స్ లింఫోమా 2) నాన్-హాడ్జ్‌కిన్స్ లింఫోమా.
లింఫోమా లక్షణాలు: నొప్పి లేకుండా మెడల్లో, చంకల్లో వాపులు రావడం స్ప్లీన్ పెరగడం, పొట్ట నొప్పి/అసౌకర్యం జ్వరం, చలితో పాటు రాత్రిళ్లు చెమటలు పట్టడం శక్తి లేకపోవడం అకస్మాత్తుగా బరువు తగ్గడం ఎక్కువ మందిలో బరువు తగ్గడం
సాధారణ రోగ నిర్ధారణ పరీక్షలు
రక్త పరీక్షలు బయాప్సీ ఎముక మూలుగ పరీక్ష సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్స్ పరీక్ష మాలిక్యులార్ రోగి నిర్ధారణ పరీక్షలు ఇమేజింగ్ పరీక్షలు (ఎక్స్-రే, కంప్యూటరైజ్‌డ్ టోమోగ్రఫీ స్కాన్ (సీటీ), మాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ (ఎమ్మారై), పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ స్కాన్ (పెట్ స్కాన్) లింఫోమా సమస్యకు తగిన చికిత్స తీసుకున్న తర్వాత థైరాయిడ్, కాలేయం, మూత్రపిండాలను క్రమపద్ధతిలో చెక్ చేయించుకోవాలి. లిపిడ్స్ పరీక్ష కూడా చేయించుకోవాలి.
- డా॥ఆర్ సింగీ
హెమటాలజిస్ట్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్, సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
నొప్పి లేదు కానీ... వాపు ఉంది!
Published Tue, Sep 27 2016 10:59 PM | Last Updated on Sat, Mar 23 2019 7:54 PM
Advertisement