Neck
-
మెడ పట్టేసిందా..? ఇలా చేస్తే నొప్పి మాయం..
చాలామందికి నిద్రలోగాని, లేదా ప్రయాణంలో గానీ లేదా సుదూర ప్రయాణాల తర్వాత గాని మెడ పట్టుకుంటుంది. ఇలా మెడ పట్టేయడాన్ని ఇంగ్లిష్‌లో రై నెక్ (wry neck) అంటారు. ఇలా మెడ పట్టేస్తే, నిద్రలో దానంతట అదే వదిలేస్తుందని, లేదా తలదిండు తీసేసి పడుకోవడం వల్ల త్వరగా తగ్గుతుందని అనుకుంటారు. ఇది అపోహ మాత్రమే. మెడపట్టేసినప్పుడు ఆ పరిస్థితి త్వరగా సర్దుకునేందుకు పాటించాల్సిన సూచనలివి...మెత్తటి టవల్‌ను తీసుకుని, దాన్ని గుండ్రంగా చుట్టి (రోల్ చేసుకుని) మెడ కింద దాన్ని ఓ సపోర్ట్‌గా పెట్టుకోవాలి. లేదా తలగడనే భుజాల వరకు లాగి పడుకోవాలి. అంటే తలగడ అన్నది కేవలం తలకు మాత్రమే కాకుండా... భుజాలకు కూడా సపోర్ట్ ఇచ్చేలా అమర్చుకోవాలి. దీనివల్ల మెడ నొప్పి ఒకటి రెండు రోజుల్లో తగ్గుతుంది. వ్యాయామాలు చేసేవారు మెడకు సంబంధించిన ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకూడదు. పైగా మెడ పరిస్థితి సర్దుకునేందుకు ఎలాంటి వ్యాయామాలూ చేయకూడదు. ఇలా చేస్తే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. కుడి చేత్తోగాని లేదా ఎడమ చేత్తో గానీ ఐదు కిలోలకు మించి బరువు అకస్మాత్తుగా గబుక్కున ఎత్తకూడదు. అంతకు మించిన బరువులు అసలే ఎత్తకూడదు. కొందరు సెలూన్ షాప్‌లో మెడను రెండుపైపులా అకస్మాత్తుగా కటకటమని శబ్దం వచ్చేలా విరిచేస్తున్నట్లుగా తిప్పిస్తుంటారు. ఇలాంటి మొరటు పద్ధతుల్ని ఏమాత్రం అనుసరించకూడదు. దీనివల్ల పరిస్థితి మరింతగా ప్రమాదకరంగా మారవచ్చు. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే పారాసిటమాల్ లేదా ప్రమాదం లేని నొప్పినివారణ మందును రెండు రోజుల కోసం మాత్రమే వాడాలి. సాధారణంగా రెండు రోజుల్లో తగ్గిపోయే ఈ సమస్యతో అప్పటికీ ఉపశమనం కలగకపోతే అప్పుడు డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. (చదవండి: డార్క్ చాక్లెట్స్‌తో గుడ్ మూడ్స్... గుడ్ హెల్త్!) -
చైన్ స్నాచింగ్‌కు మహిళ బలి
గజ్వేల్‌రూరల్: మహిళ మెడపై ఉన్న బంగారు ఆభరణాలను ఓ ఆగంతకుడు చోరీకి యత్నించాడు. ప్రతిఘటించేక్రమంలో ఆమెకు గాయాలై అపస్మారక స్థితిలో వెళ్లింది. ఆపై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరులో చోటు చేసుకుంది. అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు వెల్లడించిన వివరాల ప్రకారం..కొల్గూరుకు చెందిన చెన్న శ్రీనివాస్– శ్యామలత(55) దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. అందరికీ వివాహాలు జరగ్గా, కొడుకు హైదరాబాద్‌లో జాబ్ చేస్తూ అక్కడే ఉంటున్నాడు. దంపతులిద్దరూ స్థానికంగా ఉంటూ కిరాణ దుకాణం నడుపుతున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు నిద్రలేచిన శ్యామలత ఇంటి వెనుక భాగంలో ఉన్న డోర్ తీసి బాత్రూమ్కు వెళ్లింది. ఇదే సమయంలో ఓ ఆగంతకుడు ఇంటి వెనుక నుంచి లోపలికి ప్రవేశించాడు. శ్యామలత భర్త శ్రీనివాస్ బెడ్రూమ్లో నిద్రిస్తుండగా, ఆగంతకుడు తలుపు లకు గొళ్లెం పెట్టాడు. బాత్ రూమ్ నుంచి శ్యామలత ఇంట్లోకి వస్తున్న సమ యంలో ఆమె మెడలో ఉన్న 3 తులాల బంగారు గొ లుసు, చెవికి ఉన్న అరతులం కమ్మలను దొంగిలించేందుకు ప్రయత్నించాడు. శ్యామలత ప్రతిఘటిండంతో ఆమె ముఖంపై దిండు(మెత్త)ను అదిమి పట్టి ఆభరణాలను దొంగిలించాడు. ఈ క్రమంలోనే ఆమె చెవికి గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. భారతమ్మ పాలు పోసేందుకు వస్తుండగా, మంకీ క్యాప్ పెట్టుకున్న ఆగంతకుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్లడాన్ని గమనించింది. ఇంట్లోకి వెళ్లి బెడ్రూమ్ గొళ్లెం తీయగా భర్త శ్రీనివాస్ బయటకు వచ్చాడు. శ్యామలతను వెంటనే గజ్వేల్‌లోని ప్రైవే టు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు మెరుగైన చికిత్స అవసరమని చెప్పడంతో గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ శ్యామలత మృతి చెందింది. -
శివుని కోసం మెడ నరుక్కున్నాడు.. ఇప్పుడతని పరిస్థితి ఇదే!
ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో మూఢనమ్మకాలకు సంబంధించిన ఉదంతమొకటి సంచలనంగా మారింది. మహాశివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆలయంలో ఒక యువకుడు వృక్షాలను కట్ చేసే యంత్రంతో తన గొంతు కోసుకున్నాడు. సమాచారం తెలియగానే అతని కుటుంబ సభ్యులు పరుగుపరుగున ఆలయానికి చేరుకుని, బాధితుడిని చికిత్స కోసం ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలించారు. బాధిత యువకుని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటన రఘునాథ్పురా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన పల్టూ రామ్ కుమారుడు దీపక్ కుశ్వాహ్(30) కూలీనాలీ చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తుంటాడు. దీపక్ తండ్రి పల్టూరామ్ తెలిపిన వివరాల ప్రకారం దీపక్‌కు ఇద్దరు పిల్లలు. దీపక్ మహాశివుని భక్తుడు. గత కొంతకాలంగా దీపక్ ఉదయం, రాత్రివేళల్లో మహాశివునికి పూజలు చేస్తుంటాడు. ఇటీవల దీపక్ తాను మెడ కోసుకుని మహాశివుని ప్రసన్నం చేసుకుంటానని కుటుంబ సభ్యులకు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న పల్టూ రామ్ తన కుమారుతో అటువంటి పని చేయవద్దని చెప్పాడు. అయితే కుమారుడు అతని మాట వినలేదు. కాగా దీపక్ ఒక నోట్‌బుక్‌లో మహాశివుని మంత్రాలను, శివునితో సాగించిన సంభాషణను రాస్తుంటాడు. దానిలో దీపక్ మహాశివునికి తనను తాను అర్పించుకుంటానని రాశాడు. దానిలో పేర్కొన్న విధంగా ఉదయం 4 గంటలకు ఆలయానికి వెళ్లాడు. అక్కడ చెట్లు కట్ చేసే యంత్రంతో మహాశివుని సమక్షంలో తన మెడను కట్ చేసుకుని జయజయధ్వానాలు చేశాడు. దీనిని అక్కడున్నవారు గమనించారు. వెంటనే ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వారు వెంటనే ఆలయానికి చేరుకుని భాధితుడిని ఆసుపత్రికి తరలించారు. దీపక్ చిన్నాన్న ప్రసాద్ మాట్లాడుతూ దీపక్ మెడ కట్ చేసుకున్న సమయంలో ‘జై భగవాన్ శంకర్’ అనే నినాదాలు చేశాడని తెలిపారు. బాధితునికి చికిత్స అందిస్తున్న వైద్యులు డాక్టర్ సచిన్ మాహుర్ మాట్లాడుతూ దీపక్ అనే యువకుడు స్వయంగా తన మెడ కోసుకున్నాడని, అతనికి వైద్య చికిత్స జరుగుతున్నదని, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నదని తెలిపారు. ఇది కూడా చదవండి: సీమా హైదర్, అంజూ తరహాలో రాజస్థాన్ దీపిక.. భర్త, పిల్లలను వదిలేసి విదేశాలకు.. -
ఫాన్స్‌తో వ్యవహారం మామూలుగా ఉండదు..అదొక మనస్తత్వ శాస్త్రం!
అది న్యూస్ రిపోర్టర్ల వాట్సాప్ గ్రూప్. అందులో ఒక వీడియో. ఆ వీడియోలో.. కొత్తగా రిలీజ్ అయిన సినిమా థియేటర్ ముందు సినిమా హాల్ నుంచి బయటకు వచ్చిన వారిని "సినిమా ఎలా వుంది ? అని అడుగుతున్నారు . సాధారణంగా " సూపర్ " " హండ్రెడ్ డేస్ " వెయ్యి రోజులు ఖాయం " కలియుగాంతం దాకా ఈ సినిమా ఆడుతుంది " అని ఇలాంటి సందర్బాల్లో సమాధానాలు వస్తుంటాయి . అది అభిమానులు చెప్పే మాటలో లేక మానేజ్ చేసినవో తెలియదు. లోతుగా పరిశీలించి తెలుసుకోవాల్సినంత సీన్ లేదు. ఇలాంటి వీడియో ఒకటి ఉంటుంది అనుకొని దాన్ని చూడలేదు. ఆ గ్రూప్‌లో వచ్చిన కామెంట్స్ చూసి అసలు వీడియోలో ఏముందో అని క్లిక్ చేసి డౌన్ లోడ్ అయ్యాక చూసా. ఎవరో వ్యక్తి సినిమా బాగోలేదు అని కామెంట్ కామెంట్ చేసాడు. దానితో అక్కడ ఉన్న అభిమానులు అతనిపై దాడి చేసారు. చూడగానే మనసు చివుక్కు మంది. ఆ వ్యక్తి తన మనసులోని ఫీలింగ్స్ చెప్పాడో లేదా కావాలనే దుష్ప్రచారం చేసాడో .. తరువాతి మాట . సినిమా బాగా లేదు అనగానే దాడి చేస్తారా ? మనం ఏమైనా తాలిబన్ల రాజ్యంలో ఉన్నామా? అనిపించింది. హీరోల అభిమానులు అలాగే ఉంటారని మా బాల్యంలో చెప్పుకునేవారు. ఒకప్పుడూ ఎంజీఆర్ సినిమా తొలి రోజు సినిమాకు వెళితే అయన అభిమానులు తలతో ఫైట్ చేసేవారట. అమాయకుడు ఎవరైనా వెళితే తలపగలడం ఖాయం అట. అది ఎంత వరకు నిజమో కానీ ఫాన్స్ వ్యవహారం మామూలుగా ఉండదు . అదొక సామాజిక- మనస్తత్వ శాస్త్ర టాపిక్. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక రకమయిన మానసిక రుగ్మత. కాలం మారినా దక్షిణాదిన ఈ ధోరణి మారలేదు. అభిమానులు తమకు అసెట్ అని చాలా మంది సో కాల్డ్ హీరోస్ అనుకొంటారు. అభిమానులు వీరి మెడకు వేలాడే గుదిబండలు అని .. పాపం గ్రహించలేరు. అంత తెలివితేటలు ఉండే అవకాశం తక్కువ. భ్రమల లోకంలో బతికేస్తుంటారు . సాగినన్నాళ్లు సాగుతుంది. ఒక్కోసారి ఆకాశం నుంచి నేలకు పడిపోతారు. నిన్నటి హీరో.. పాపం తీవ్ర డిప్రెషన్ తో బాధ పడుతున్నాడు . ఇంకా ఎంతో మంది ఇలాంటి కోవలో ఉన్నారో లేదా కాస్త తక్కువ స్థాయిలో డిప్రెషన్లో ఉన్నారు అనేదాని గురించి మాట్లాడడం .. విశ్లేషించడం టైం వేస్ట్. చిత్రమయిన విషయం ఏమిటంటే అంత బహిరంగంగా దాడి చేయడం. నిజానికి ఇది తప్పు .. మీకు అభిమానం ఉంటే సినిమా ఎందుకు బాగోలేదో చెప్పుమని అడగొచ్చు అంతే గాని దాడి చెయ్యడం ఏంటి ? అని ఎవరూ అడిగినట్లు లేరు . పోలీస్‌లు ఏమి చేసారో తెలియదు. అటుపై ఇంకో వీడియో చూసా. దాడి జరిగిన వ్యక్తి .. హీరో నన్ను ఇంటికి పిలిస్తే సంతోష పడుతాను అంటున్నాడు . అలాంటివి జరగవు అని నాకు తెలుసు. ఒక వేళా హీరో జరిగిన దానికి సారీ చెప్పాలనుకున్నా అభిమానులు .. సలహాదారులు చెప్పనివ్వరు. నెక్స్ట్ సీన్.. ఫేస్బుక్ ఫ్రెండ్ .. ఓ మహిళ. ఆ మధ్యలో మెసెంజర్లో లండన్ గురించి సమాచారం ఇచ్చారనుకొంటా! నా పోస్ట్‌ల పై కామెంట్స్ పెడుతుంటారు . నేను లోతుగా పరిశీలించలేదు. ఆమెకు దేవుడంటే భక్తి . విదేశాల్లో ఉన్నా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అంటే అమితంగా ఇష్ట పడే వ్యక్తి. ఆమె ఆ సినిమా నచ్చలేదని పోస్ట్ పెట్టినట్టున్నారు . దాని పై కొంత మంది తనని టార్గెట్ చేసుకొంటూ ఎలా మాట్లాడింది అంటూ.. పోస్ట్‌లు పెట్టారు . నేను ఎప్పుడో కానీ ఫేస్‌బుక్‌లోకి వెళ్లి ఇతరుల పోస్ట్‌లు చూడను. అనుకోకుండా ఈ పోస్ట్ కనిపించింది. ఆ సినిమాను విమర్శించింది కాబట్టి ఆమె హిందువు కాదు అని.. ఇంకా రకరకాలుగా కామెంట్స్ చేసారని అర్థం అయ్యింది. సినిమా సినిమానే . జీవితం కాదు. ఒకే ఇంట్లో ఒకరికి సినిమా నచ్చోచ్చు. ఇంకొరికి నచ్చక పోవచ్చు. అదేమీ అసాధారణం కాదు. సినిమా నచ్చకపొతే ఆమె తన అభిప్రాయాన్ని పోస్ట్ చేసారు . ఒకవేళ..లేదు సినిమా బాగుంది .. ఈ కోణం లో చూడాలి" అని కామెంట్ చెయ్యడం సమంజసం. తప్పు లేదు. కానీ వ్యక్తిగత దాడి చేయడానికి అసలు ఎవరు మీరు ? సినిమా అభిమానులా ? హీరో అభిమానులా? అంటే కాదు. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే ఒక పార్టీ అభిమానులు (అందరూ కాదు .. కొందరు ) ఇలా పోస్ట్ లు పెట్టడాన్ని చూసాను. ఇదేమి పార్టీ వ్యవహారం కాదు. పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వదు . వీరికి సినిమా నచ్చితే దాన్ని పోస్ట్ చేసుకోవచ్చు. సినిమాపై వస్తున్న విమర్శల్ని కూడా తిప్పి కొట్టొచ్చు. కానీ ఆ క్రమం లో వ్యక్తిగత కామెంట్స్ చేయడం .. పిచ్చి పిచ్చి లాజిక్‌లు తియ్యడం .. సినిమాను విమర్శించిన వారందరూ సంఘ వ్యతిరేఖ శక్తులు వీరికి భక్తి లేదు .. దేవుడంటే నమ్మకం లేదు అని కామెంట్స్ చెయ్యడం .. ఈ పనులు వల్ల వీరు ఏమి సాధించారో నాకైతే అర్థం కాలేదు. మొదట్లో సదరు హీరోపై నాకు సధాభిప్రాయం ఉండేది. కష్టపడుతాడు, అనుకొన్నది సాధించాలన్న పట్టుదల ఉంది అనుకొనే వాడిని. ఆ సినిమాపై, ప్రారంభంలో నాకు ఎలాంటి అభిప్రాయం లేదు . కానీ ఈ అభిమానులు చేసిన రచ్చ తరువాత ఒక నెగటివ్ ఫీలింగ్ వచ్చింది. నాలా నెగటివ్ ఫీలింగ్స్ తెచ్చుకొన్నవారు కచ్చితంగా వేలల్లో/లక్షల్లో వుంటారు. చాలా మంది అన్నీ గమనిస్తుంటారు. జరుగుతున్న దాన్ని బట్టి ఒక అభిప్రాయాన్ని ఏర్పర్చుకుంటారు. అభిమానం అంటే నిర్మాణాత్మక విమర్శలను ఆహ్వానించడం. అంతే కానీ తనకు నచ్చనిది అవతలి వారు చెప్పారు కనుక వారిపై మాటలతో దాడికి రెడీ అవ్వడం కాదు. అత్యుత్సాహంతో ఎవరో ఇద్దరు ముగ్గురు కామెంట్ చెయ్యడంతో నొచ్చుకొన్న ఆమె " ఛీ .. మీరు ఇలాంటి వారా?" అంటూ మొత్తం ఆ ఐడియాలజీ వర్గాన్ని అసహ్యించుకొంటూ పోస్ట్ పెట్టారు . సెల్ఫ్ గోల్ వేసుకోవడం అని దీన్నే అంటారని చెబుతున్నారు.మానసిక శాస్త్ర పరిశోధకులు, - వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక శాస్త్ర పరిశోధకులు, సీనియర్ విద్యావేత్త. (చదవండి: పేద విద్యార్థులకు అండగా నాట్స్ అధ్యక్షుడు) -
మెడ పట్టేసినప్పుడు.. త్వరగా నార్మల్ కావాలంటే?
నిద్రలో మెడపట్టేయడం చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. అలాగే ప్రయాణాల్లో మెడను అసహజ భంగిమలో ఉంచి వాహనాల్లో నిద్రపోయేవారిలో కూడా ఇది కనిపిస్తుంది. మెడ పట్టేయడాన్ని ఇంగ్లిష్‌లో రై నెక్ అంటారు. మెడపట్టేసినప్పుడు ఆ పరిస్థితి త్వరగా నార్మల్ అయ్యేందుకు పాటించాల్సిన సూచనలివి.. నిద్రలో చాలా పలచటి తలగడను వాడుతూ దాన్ని మెడ భాగంలోనే కాకుండా.. భుజాల వరకు సపోర్ట్‌గా ఉంచాలి. తలగడకు బదులుగా మెత్తటి టర్కీ టవల్నూ గుండ్రంగా చుట్టి (రోల్ చేసి) మెడ కింద సపోర్ట్‌గా ఉంచవచ్చు. ఊ మెడ మీద భారం పడేలా ఎక్కువ బరువున్న వాటిని అకస్మాత్తుగా ఎత్తకూడదు. ఇలా చేయడం వల్ల నొప్పి ఇంకా పెరుగుతుంది. కొందరు సెలూన్స్‌లో మెడను రెండువైపులా విరిచేసినట్లుగా టక్కున తిరిగేలా చేస్తుంటారు. ఇలా ఎంతమాత్రమూ చేయకూడదు. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే ప్రమాదకరం. కానీ నొప్పినివారణ మందును రెండు రోజుల పాటు వాడవచ్చు. అప్పటికీ తగ్గకపోతే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించాలి. (చదవండి: ఎవాస్క్యులార్ నెక్రోసిస్ అంటే?) -
హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్.. పరాకు వద్దు
తల భాగంలోని శ్వాస–జీర్ణ సంబంధ వ్యవస్థలో వచ్చే క్యాన్సర్స్‌ను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటారు. పెదవులు, నోరు, చిగుర్లు, నాలుక, నేసల్ క్యావిటీ (ముక్కు భాగం), ఫ్యారింగ్స్, స్వరపేటిక వంటి భాగాలలో క్యాన్సర్స్ హెడ్ అండ్ నెక్ కిందికి వస్తాయి. ఈ క్యాన్సర్స్‌లో 90 శాతం వరకు స్క్వామస్ సెల్ కార్సినోమా రకానికి చెందినవి. అంటే మ్యుకస్ ఉండి ఎప్పుడూ తడిగా ఉండే లోపలి పెదవులు, చిగుర్లు, కాలుక వంటి భాగాలలో ఈ క్యాన్సర్ వస్తుంటాయి. మెదడు, అన్నవాహిక, థైరాయిడ్ గ్రంథి, తలలోని కండరాలు, చర్మానికి వచ్చే క్యాన్సర్స్‌ను క్యాన్సర్స్‌ను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లుగా పరిగణించరు. ఊపిరితిత్తుల క్యాన్సర్స్‌కు లాగానే ఈ క్యాన్సర్స్కూ ఆల్కహాల్, పొగాకు, దాని సంబంధిత ఉత్పత్తులే ప్రధాన కారణాలు. తల, మెడకు సంబంధించిన క్యాన్సర్స్‌కు 75% కారణాలుగా పొగాకు, పొగాకు సంబంధిత ఉత్పాదనలు, గుట్కా, పాన్, జర్దా, నస్యం, వక్క, బీడీ, చుట్ట, తమలపాకులు, సిగార్లు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆల్కహాల్, పొగాకు... రెండు అలవాట్లూ ఉన్నట్లయితే ముప్పు మరింత ఎక్కువ. నోటిలో తెలుపు ఎరుపు మిళితమైన మచ్చలు (ప్యాచెస్), గొంతు బొంగురుగా ఉండటం, మింగడంలో ఇబ్బంది, దవడల వాపు, శ్వాస తీసుకోవడం, మాట్లాడటం కష్టం కావడం, తలనొప్పి, వినికిడిశక్తి తగ్గడం, చెవిపోటు... ఇలా క్యాన్సర్ కణితి పెరిగే ప్రదేశాన్ని బట్టి లక్షణాలు అనేక రకాలుగా ఉంటాయి. లక్షణాలు అనుమానాస్పదంగా ఉంటే బయాప్సీ, ఎమ్మారై, పెట్ స్కాన్ వంటి ఇమేజింగ్ ప్రక్రియలతో క్యాన్సర్ వచ్చిన భాగాన్ని పరీక్షించి స్టేజ్నూ, గ్రేడింగ్‌లను నిర్ధారణ చేస్తారు. క్యాన్సర్ వచ్చిన భాగం, స్టేజ్, రోగి వయసు, ఆరోగ్యం వంటి అనేక అంశాల ఆధారంగా చికిత్స ఉంటుంది. సర్జరీ, రేడియేషన్, కీమో, టార్గెటెడ్ థెరపీ లేదా అవసరాన్ని బట్టి కొన్ని కాంబినేషన్ థెరపీలూ నిర్ణయిస్తారు. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు ఓరల్ క్యావిటీ అంటే పెదవులు, నాలుక చిగుర్లు, నోటిలోని కింది భాగం, పైభాగం, జ్ఞానదంతాల వెనుకవైపున ఉండే చిగుర్ల వంటి ప్రాంతాల్లో ప్రధానంగా కనిపిస్తుంటాయి. ఫ్యారింజియల్ : ముక్కు వెనక కూడా ఆ భాగం 5 అంగుళాల లోతు వరకు ఉంటుంది. లారింజియల్ : మాట్లాడటానికి సహకరించే స్వరపేటిక, వోకల్ కార్డ్స్, ఆహారాన్ని శ్వాసనాళాల్లోకి పోకుండా అడ్డుకునే ఎపిగ్లాటిస్. పారానేసల్ సైనసెస్తో పాటు నేసల్ క్యావిటీ : తల మధ్యభాగంలో ముక్కుకు ఇరువైపులా బోలుగా ఉండే సైనస్‌లు. లాలాజల (సెలైవరీ) గ్రంథులు : నోటి లోపల కింది భాగంలో దవడ ఎముకలకు ఇరుపక్కలా ఉండే లాలాజల గ్రంథులు. మన దేశంలో కనిపించే ప్రతి మూడు క్యాన్సర్లలో ఒకటి ఈ తరహా క్యాన్సర్లకు సంబంధించినదై ఉంటుంది. లేటు దశలో గుర్తించడం వల్ల లేదా ఇతర భాగాలకు (మెటాస్టాసిస్) క్యాన్సర్ పాకడం వల్ల ఈ క్యాన్సర్‌కు గురైన వారిలో మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. మనదేశంలో ఏడాదికి పది లక్షల మంది వరకు ఈ క్యాన్సర్లకు గురవుతున్నారు. వారిలో దాదాపు రెండు లక్షల మంది వరకు ఈ క్యాన్సర్‌కు సంబంధించినవారే. పొగాకును అనేక రకాలుగా ఉపయోగించడం, సున్నంతో కలిపి ఎక్కువసేపు నోటిలో ఉంచుకోవడం, తమలపాకు, వక్క నమలడం వంటి అలవాట్లే మనదేశంలో ఈ సంఖ్య ఇంతగా పెరగడానికి దోహదం చేస్తున్నాయి. తొలిదశలో అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 లలో కనుగొంటే... కేవలం సర్జరీతోనే ఈ క్యాన్సర్‌కు శాశ్వత పరిష్కారం లభించవచ్చు. సర్జరీ తర్వాత చాలాసార్లు రీ–కన్స్ట్రక్టివ్ సర్జరీ అవసరం ఉంటుంది. స్టేజ్ 3, స్టేజ్ 4 లలో కీమో, రేడియేషన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. 3 డీసీఆర్, వీఎమ్‌ఏటీ, ఐఎమ్ఆర్టీ, ఐజీఆర్టీ, బ్రాకీథెరపీ, బీమ్ థెరపీ వంటి ఆధునిక రేడియోథెరపీ పద్ధతులలో చికిత్స విధానాలుంటాయి. సాధారణంగా ఈ క్యాన్సర్‌కు కీమోథెరపీ పాత్ర ఒకింత తక్కువే అని చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో కీమోను కంబైన్డ్ ట్రీట్మెంట్గా లేదా కొంతవరకు ఉపశమనంగా ఉపయోగిస్తారు. ఈ చికిత్స తర్వాత బాధితులు తమకు ఇంతకుముందు ఉన్న అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. నోటి పరిశుభ్రతను పాటించాలి. ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ, జా–స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ల వంటివాటిని అనుసరించాలి. డాక్టర్లు సూచించిన మేరకు తప్పనిసరిగా ఫాలో–అప్‌లో ఉండాలి. మానసిక ఒత్తిడి, విటమిన్ల లోపంతో వచ్చే నోటిపొక్కులు, అల్సర్స్ బాధాకరంగా ఉంటాయి కాబట్టి మనం వాటిని ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటాం. నొప్పిలేని వాటిని నిర్లక్ష్యం చేస్తాం. నోటిలో నొప్పిలేకుండా తెలుపు (ల్యూకోప్లేకియా) లేదా ఎరుపు (ఎరిథ్రోప్లేకియా) రంగులో ప్యాచెస్ కనిపించినప్పుడు తప్పక పరీక్షలు చేయించుకోవాలి. చాలామంది డెంటల్ చెకప్స్ లేదా దంత, చిగుర్ల సంబంధిత సమస్యలతో డెంటిస్టుల దగ్గరికి వెళ్లినప్పుడు ఈ సమస్యలు బయటపడుతూ ఉంటాయి. అందుకే తరచూ దంతవైద్యుడిని కలుస్తూ, నోటి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటూ ఉండటం అవసరం. - డా. సీహెచ్. మోహన వంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్ ఫోన్ నంబరు: 9849022121 -
మెడలో గుచ్చుకున్న త్రిశూలం.. అలాగే 65 కి.మీ. ప్రయాణించి..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మెడలోకి గుచ్చుకున్న త్రిశూలంతో ఓ వ్యక్తి ఏకంగా 65 కిలోమీటర్లు ప్రయాణించాడు. కళ్యాణి ప్రాంతానికి చెందిన భాస్కర్ రామ్‌కు గత వారం కోల్‌కతాలోని నీలరతన్ సర్కార్ మెడికల్ కాలేజీలో అత్యవసర శస్త్ర చికిత్స జరిగింది. మెడకు త్రిశూలం గుచ్చుకున్న ఉన్న ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో త్రిశూలం వ్యక్తి మెడకు కుడివైపు నుంచి గుచ్చుకొని ఎడమ వైపుకు బయటకు దిగింది. గొంతు దగ్గర ఇరుక్కుపోయిన త్రిశూలాన్ని బయటకు తీసేందుకు అతను కళ్యాణి ప్రాంతం నుంచి కోల్‌కతాలోని ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీకి 65 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. గొంతు దగ్గర చిక్కుకున్న త్రిశూలంతో యువకుడు నవంబర్ 28 తెల్లవారుజామున తమ వద్దకు వచ్చినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. 30 సెంటిమీటర్ల పొడవున్న త్రిశూలం గుచ్చుకొని, మెడపై రక్తం కారుతున్న స్థితిలో రామ్‌ని చూసిన వైద్య సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లు పేర్కొన్నారు. అయితే భాస్కర్ రామ్ ప్రాణాలతో బయటపడడంపై వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. త్రిశూలం శరీర అవయవాలు, సిరలు,ధమనులను డ్యామెజ్ చేయకపోవడంతో ఈ కేసు మెడికల్ వండర్‌గా భావిస్తున్నారు. అంతర్గతంగా కూడా పెద్దగా నష్టం జరగలేదని వైద్యులు తెలిపారు. కోల్‌కతా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు త్రిశూలాన్ని తొలగించేందుకు అత్యవసర శస్త్ర చికిత్స చేశారు. కంటి-ముక్కు-గొంతు(ఈఎన్టీ)స్పెషలిస్ట్ డాక్టర్,అసోసియేట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ ప్రణబాసిస్ బంద్యోపాధ్యాయ నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది. కొన్ని గంటలపాటు సాగిన ఈ శస్త్రచికిత్సలో చివరకు రోగి మెడ నుంచి త్రిశూలాన్ని తొలగించారు. గాయంతో అంత దూరం ప్రయాణం చేసినప్పటికీ రామ్ తనకు ఎలాంటి నొప్పి లేదని చెప్పాడని వైద్యులు వెల్లడించారు. అంతేగాక ఆపరేషన్ ముందు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అయితే బాధితుడికి త్రిశూలం ఎలా గుచ్చుకుందనే దానిపై స్పష్టత లేదు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ త్రిశూలాన్ని శ్రీ రామ్ తన ఇంట్లోని దేవుని బలిపీఠంపై ఉంచారని, తరతరాలుగా ఈ చారిత్రక త్రిశూలాన్ని పూజిస్తూ వస్తున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఓ వ్యక్తితో భాస్కర్ రామ్‌కు చిన్న వాగ్వాదం జరిగిందని, దీంతో అతడు త్రిశూలంతో దాడి చేయడంతో భాస్కర్ రామ్ మెడ వెనుక భాగంలో గుచ్చుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఆప్‌కు ఎదురుదెబ్బ.. స్పందించిన కేజ్రీవాల్ -
తవ్వకాల్లో బయటపడ్డ ‘రక్తపిశాచి’ అస్థికలు!
ఈ భూమ్మీద కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. ప్రత్యేకించి.. ‘అంతుచిక్కని’ మిస్టరీలుగా భావించే వాటిని చేధించేందుకు నిరంతరం పరిశోధకులు కృషి చేస్తూనే ఉన్నారు. తాజాగా.. అలాంటి లిస్ట్ నుంచి ఓ మిస్టరీని చేధించే యత్నాల్లో ఒక ‘క్లూ’ చిక్కింది. ఆడ వాంపైర్(రక్తపిశాచి) అస్థిపంజరం ఒకటి అసాధారణ రీతిలో తవ్వకాల్లో బయటపడింది. యూరప్ దేశం పోలాండ్లోని ఒస్ట్రోమెక్కో పరిధిలోని పెయిన్ అనే గ్రామంలోని ఓ స్మశానానికి ఆనుకుని ఉన్న నిర్జన ప్రదేశంలో ఈ వ్యాంపైర్ సమాధిని గుర్తించారు. టోరన్లోని నికోలస్ కోపర్నికస్ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజీ బృందం ఈ పరిశోధన చేపట్టింది. అది 17వ శతాబ్దానికి చెందిన ఒక యువతి అస్థిపంజరంగా నిర్ధారించుకున్నారు. మెడ చుట్టురా కొడవలి చుట్టి, ఆమె ఎడమ పాదం బొటనవేలుకి తాళం వేసి ఉంది. ఆగష్టులోనే ఈ అస్థికలు బయటపడ్డప్పటికీ.. తాజాగా ఇందుకు సంబంధించిన డాక్యుమెంటరీ, ఫొటోలు బయటపెట్టారు. వ్యాంపైర్ అంటే.. కోరల్లాంటి పళ్లతో రక్తం పీల్చి బతికే పిశాచి. పగలు సాధారణం రూపం లేదంటే అసలుకే కనిపించకుండా తిరుగుతూ.. రాత్రి పూట మాత్రమే సంచరిస్తూ వేటాడుతుంది. మెడపై వ్యాంపైర్ గనుక కొరికితే.. అవతలి వాళ్లూ వ్యాంపైర్లుగా మారిపోతారని, లేదంటే ఎముకల గూడుగా మిగిలిపోతారని.. చాలా కథల్లో, సినిమాల్లో చూసే ఉంటారు. కానీ, వ్యాంపైర్ల ఉనికి, మనుగడ అనేది ఇప్పటిదాకా కేవలం జానపద కథలుగానే, ఫిక్షన్ క్యారెక్టర్‌గానే ప్రచారంలో ఉంది. చాలామందికి అదొక నమ్మకంగానే మిగిలిపోయింది. పరిశోధకులు ఏమన్నారంటే.. 17వ శతాబ్దంలో పాశ్చాత్య ప్రపంచంలో మూఢనమ్మకాలు తారాస్థాయిలో ఉండేవి. బహుశా.. ఆ యువతిని వాంపైర్‌గా అనుమానించి అంత ఘోరంగా చంపేసి ఉంటారు. ఆమెను వ్యాంపైర్‌గా భావించి.. ఎక్కడ సమాధి నుంచి లేచి వస్తుందో అనే భయంతో మెడలో కొడవలిని అలాగే ఉంచేశారు. ఒకవేళ బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే.. తల తెగిపోతుందని అలా చేసి ఉంటారు. అలాగే ఆమె పాదానికి తాళం కూడా వేశారు. ఆరోజుల్లో మూఢనమ్మకాలు అలా ఉండేవి’’ అని తెలిపారు ఈ పరిశోధనకు నేృతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ డారియుస్జ్ పోలిన్స్కి. అయినప్పటికీ తమ పరిశోధన ముందుకు వెళ్తుందని ఆయన అన్నారు. అయితే.. గతంలో యూరప్ తూర్పు ప్రాంతంలోనూ ఈతరహా సమాధులు చాలానే బయటపడ్డాయి. వాటిలో చాలావరకు ఈ తరహాలోనే పాతిపెట్టబడ్డప్పటికీ.. తలలు, కాళ్లు చేతులు, తల తిప్పేసి ఉండడం, లేదంటే తల పూర్తిగా ధ్వంసమై ఉండడం లాంటి పరిస్థితుల్లో బయటపడ్డాయి. వాస్తవ-అవస్తవాలను పక్కనపెడితే.. వ్యాంపైర్ ప్రపంచం గురించి పరిశోధిస్తున్నవాళ్లకు.. ప్రత్యేకించి రచయితలకు ఈ అస్థికలు బయటపడడం మాత్రం ఓ కుతూహలాన్ని రేపుతోంది. ఇదీ చదవండి: క్వీన్ ఎలిజబెత్ మరణం.. ఆకాశంలో అద్భుతం -
అయ్యో పాపం.. అడవి కుక్క
మైసూరు: ప్లాస్టిక్ వల్ల జీవజాలం మనుగడకు ముప్పు ఏర్పడుతోంది. మైసూరు సమీపంలోని నారగహోళె అడవిలో ఒక అడవి కుక్క మెడకు దారం చుట్టుకుని మెడభాగం దాదాపు తెగిపోయే స్థితిలో ఉంది. అంతలో అటవీసిబ్బంది దానిని పట్టుకుని చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రపంచంలోనే అరుదైన అడవి కుక్కలు నాగరహోళె అడవుల్లో కనిపిస్తాయి. వీటిపై పలు అంతర్జాతీయ చానెళ్లలో కథనాలు కూడా వచ్చాయి. ఇటీవల కుక్కల గుంపు తిరుగుతుండగా ఒక కుక్క మెడకు ప్లాస్టిక్ దారం చుట్టుకోవడంతో తీవ్ర గాయమైంది. మృత్యువు అంచుల్లో ఉన్న దానిని అటవీ సిబ్బంది చాకచక్యంగా పట్టుకుని దారాన్ని తొలగించి వైద్యం చేయించారు. (చదవండి: పిల్లి అరుస్తూ నిద్రాభంగం చేస్తోందని యజమాని హత్య) -
వింతైన ట్రిక్ : ఇంధనం పొదుపు చేయడం కోసం నెక్కి 'టై' ధరించొద్దు!
డబ్బలు వృధాగా ఖర్చుపెట్టకుండా ఉండటం కోసం, కాలుష్య నివారణ కోసం తదితర వాటిన్నంటికి నిపుణులు చిన్న లాజికల్ ట్రిక్‌లు సూచించడం మాములే. ఇది అందరికి తెలిసిన విషయమే. ఐతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు, ఆహార, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రతిదేశం ఈ సంక్షోభం తలెత్తకుండా ఉండేలా తమదైన తరహాలో పద్ధతులను అవలంబిస్తున్నాయి. ఐతే ఈ విషయమై స్పెయిన్ ప్రధాని తమ ప్రజలకు ఒక విభిన్నమైన ట్రిక్ అనుసరించమని సూచించాడు. ఆ ప్రధాని చెప్పిన పరిష్కార మార్గం వింటే చాలా వింతగానూ, అర్థం లేనిదిగానూ అనిపిస్తుంది. వివరాల్లోకెళ్తే...స్పానిష్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ తమ దేశ ప్రజలకు ఇంధనాన్ని సాధ్యమైనంత మేర తక్కువగానే వినియోగించుకోవాలంని విజ్ఞప్తి చేశాడు. పైగా వృధాగా ఇంధనాన్ని ఖర్చు పెట్టకుండా ఉండేందుకు ఇలా చేయండి అంటూ ఒక వింతైన ట్రిక్ గురించి చెప్పాడు. ఈ మేరకు ఆయన విలేకరులు సమావేశంలో మాట్లాడుతూ... ఇంధనాన్ని ఆదా చేసేందుకు నెక్కి 'టై' లు ధరించవద్దని చెప్పాడు. అంతేకాదు ఆయన కూడా ఆ ప్రసంగంలో నెక్కి టై ధరించకుండా ఉన్నాడు. ఇంధనం ఆదా చేయడానికికి నెక్కి టై ధరించకపోవడానికిక సంబంధం ఏమిటో అర్థం కాదు ప్రజలకు. అంతేకాదు తాను కూడా టైం ధరించకపోవడాన్ని గమనించండని చెబుతుంటాడు. అంతేకాదు తన ప్రజలను మంత్రులను దీన్ని అనుసరించాలని కూడా కోరాడు. ఐతే స్పెయిన్ ప్రధాని సాంచెజ్ దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనను తీసుకువచ్చినట్లు సమాచారం. అధిక ఉష్ణోగ్రతలు కారణంగా స్పెయిన్ ప్రజలు ఎయిర్ కండిషనింగ్ పై ఆధారపడుతున్నారు. దీంతో దేశంలో గృహాలకు, వ్యాపార కార్యాలయాలకు అధిక ఇంధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతేకాదు యూటీలిటీ బిల్లులను తగ్గించడంతోపాటు ఇంధనం కోసం రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా ఈ పొదుపు ప్రణాళిక ట్రిక్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. (చదవండి: భూ వాతావరణంలోకి చైనా రాకెట్ శకలాలు.. వీడియో వైరల్) -
సరి‘హద్దు’లు చెరిపిన మానవత్వం.. పాక్ బాలికకు పునర్జన్మ!
న్యూఢిల్లీ: ‘మతములన్నియు మాసిపోవును... జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అన్నారు మహాకవి గురజాడ. మత, ప్రాంత భేదాలన్నీ మాసిపోయి.. మానవత్వమొక్కటే నిలబడుతుందని రుజువు చేశారో ఢిల్లీ డాక్టర్. ఉచితంగా వైద్యమందించి మెడ వంకరతో ఏళ్లుగా బాధపడుతున్న పాక్ బాలికను మామూలు మనిషిని చేశారు. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన అఫ్షీన్ గుల్ వయసిప్పుడు 12 ఏళ్లు. బాలిక పది నెలల చిన్నారిగా ఉన్నసమయంలో తన అక్క చేతుల్లోంచి జారిపడిపోయింది. అంతే మెడ 90 డిగ్రీలు వంగిపోయింది. అక్కడ డాక్టర్లకు చూపిస్తే మందులిచ్చారు. కానీ మెడ సెట్ కాలేదు. మెడ వంకరకు సెరిబ్రల్ పాల్సీ కూడా తోడవడంతో అఫ్షీన్ జీవితం నిత్య నరకమైంది. ఆడుకోలేదు. చదువుకోనూ లేదు. స్నేహితులు లేరు. అవన్నీ కాదు... అసలు తినడం, నడవడం, మాట్లాడటమే కష్టమైంది. బ్రిటిష్ జర్నలిస్టు అలెగ్జాండ్రియా థామస్ అఫ్షీన్ వ్యథను రిపోర్ట్ చేసింది. అది ఢిల్లీలోని అపోలో హాస్పిటల్ డాక్టర్ రాజగోపాలన్ కృష్ణన్‌కు తెలిసింది. జర్నలిస్టు ద్వారా కుటుంబంతో మాట్లాడిన డాక్టర్... అఫ్షీన్ను మామూలు మనిషిని చేస్తానని మాటిచ్చారు. అలా 2021 నవంబర్‌లో బాలికను ఢిల్లీకి తీసుకొచ్చారు. ఉచిత వైద్యమందించారు. నాలుగు అతిపెద్ద సర్జరీలను పైసా తీసుకోకుండా చేశారు. ఇప్పుడా బాలిక నవ్వుతోంది, మాట్లాడగలుగుతోంది. మామూలు మనిషైపోయింది. డాక్టర్ సర్జరీలు చేసి చేతులు దులుపుకోలేదు. ఇప్పటికీ స్కైప్‌లో బాలిక పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారు. ఇదీ చదవండి: Viral Video: ఆ పసికందు ప్రేమకు అంతా ఫిదా.. ఇంటర్నెట్ను కదిలిస్తున్న వీడియో చూశారా? -
Beauty Tips: ఇలా చేస్తే మెడపైన పేరుకున్న నలుపు దెబ్బకు వదులుతుంది!
Beauty Tips In Telugu: మెడ నల్లగా ఉందని బాధపడుతుంటారు చాలా మంది. కొంతమందికేమో కేవలం స్నానం చేస్తున్నప్పుడు మాత్రమే మెడ కడుక్కునే అలవాటు ఉంటుంది. అలా కాకుండా ఈ చిన్న చిట్కాలు పాటిస్తే సరి. టీ స్పూను కాఫీ పొడిలో టీస్పూను పంచదార, టీస్పూను ఈనోపొడి, టీస్పూను నిమ్మరసం, టీస్పూను కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నల్లగా మారిన మెడకు అప్లై చేసి పదినిమిషాలపాటు మర్దన చేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో మూడు సార్లు ఇలా చేయడం వల్ల మెడపైన పేరుకున్న నలుపు వదిలి మెడ సహజసిద్ద రంగులో అందంగా కనిపిస్తుంది. మెడ మీదే కాకుండా మోచేతులు, మోకాళ్ల మీద ఉన్న నలుపునకు కూడా ఈ ప్యాక్ అప్లై చేస్తే నలుపు పోతుంది. ముఖం మరీ మురికి పట్టినట్టు అనిపిస్తే పాలు, మీగడ, పెరుగు, మజ్జిగ ఏది అందుబాటులో ఉంటే దానిని పట్టించి మెల్లగా రుద్దుకోవాలి. ఇవి సహజమైన క్లెన్సర్స్‌గా పనిచేస్తాయి. బయట దొరికే క్లెన్సింగ్ మిల్క్‌కు బదులుగా వీటిని వాడవచ్చు. ముఖాన్ని మామూలుగా శుభ్రం చేస్తున్నప్పటికీ దుమ్ముకణాలు చర్మం లోపలి గ్రంథుల్లోకి వెళ్తాయి. అలాంటప్పుడు ఈ క్లెన్సర్‌ను వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. చదవండి: Beauty Tips: కొబ్బరి నూనె.. కాఫీ పొడి.. ముఖం మెరిసిపోవడం ఖాయం -
మెడలో పర్సుల హారాలు.. భలే ఉన్నాయ్!
డబ్బు పెట్టుకునే చిన్ని పర్సులు అతివల చేతుల్లో అందంగా ఇమిడిపోవడం చూస్తుంటాం. కళా హృదయం గలవారు మగువలు వాడుకునే ఈ పర్సులను ఆభరణాలుగా మార్చగలరు అనిపిస్తుంది ఈ డిజైన్స్ చూస్తుంటే. పర్సుకు హ్యాండిల్ ప్లేస్‌లో పొడవాటి బీడ్స్ లేదా ఇతర లోహాలతో డిజైన్ చేసి ఉంటే.. అది ఇక్కడ చూపినట్టుగా హారంగా అమర్చవచ్చు. ఫ్యాబ్రిక్ జువెల్రీలో భాగంగా పర్సుల తయారీ కూడా హ్యాండ్మేడ్లో ఒక కళాత్మకవస్తువుగా మారిపోయింది. రంగు క్లాత్‌లతో చేసిన మోడల్ పర్సులకు కొన్ని అద్దాలు, కొన్ని పూసలు, ఇంకొన్ని గవ్వలు, కాసులు జత చేరిస్తే ఇలా అందంతో ఆకట్టుకుంటున్నాయి. మరికొన్నింటికి చక్కని పెయింట్, ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తే .. పర్సుల ఆభరణాలను ఇలా కళాత్మకంగా మెరిపించవచ్చు. (క్లిక్: స్టయిలిష్ లుక్‌తో టైమ్‌కి టైమొచ్చింది) పాత డెనిమ్ ప్యాంట్ల జేబులతోనూ బొహేవియన్ స్టైల్లో పర్సు హారాలను తయారుచేసుకోవచ్చు. సృజనాత్మకతకు అడ్డే లేదని నిరూపిస్తున్న ఈ ఆభరణాలు నవతరాన్ని అమితంగా ఆకర్షిస్తున్నాయి. హ్యాండ్లూమ్ చీరలు, డ్రెస్సులకు కూడా కొత్త అందాలను మోసుకువస్తున్నాయి. ఇక నుంచి డబ్బుల కోసమే కాదు పర్సు హారం మెడకు నిండుదనాన్ని తీసుకువస్తుందని కూడా ఎంపిక చేసుకోవచ్చు అన్నమాట. (చదవండి: జంతు చర్మాలు ఒలిచి అలంకారం.. ఇదిగో సమాధానం!) -
ఇది జిరాఫీ కాదు!! కుక్క.. అత్యంత అరుదైన బ్రీడ్!! కానీ కారు ప్రమాదంలో..
అతిపెద్ద మెడ జిరాఫీకి మాత్రమే ఉంటుందని అనుకుంటే పొరపాటే..! ఇంకెవరికుంటుందబ్బా.. అని ఆలోచిస్తున్నారా? పొడవాటి మెడ, శరీరంపై మచ్చలతో ఉన్న ఓ వింత కుక్కను జిరాఫీతో పోలుస్తున్నారందరు. దీని అందం వెనుక తీవ్ర విషాదం కూడా దాగి ఉంది. అసలేం జరిగిందంటే.. లూయిసా క్రూక్ అనే యువతి 2016లో కారు ప్రమాదంలో గాయపడిన బ్రాడీ అనే అజ్వాక్ జాతి కుక్కను రక్షించింది. అప్పుడు బ్రాడీ వయస్సు 6-7 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఐతే ఈ ప్రమాదంలో బ్రాడీ ఒక కాలు, చెయ్యి కోల్పోయింది. సాధారణంగా అజ్వాఖ్ జాతి కుక్కల మెడలు పొడవుగా ఉంటాయి. ఐతే కారు ప్రమాదం తర్వాత బ్రాడీ రూపం గణనీయంగా మారింది. లూయిసా మాటల్లో.. ‘బ్రాడీ నేను చూసిన అత్యంత అందమైన కుక్కపిల్ల. బ్రాడీని మొదటిసారి చూసినప్పుడు రక్తపు మడుగులో విపరీతమైన బాధతో కదలలేకపోయింది. బ్రాడీ మెడ చాలా పొడవుగా ఉండటం గమనించాను. కానీ దాని తెగిపోయిన భుజం, మెడతో ముడిపడి ఉన్నట్లు అనిపిస్తుంది. అది చాలా పొడవుగా ఉన్నట్లు కూడా కనిపించిందని తెల్పింది. ఐతే అన్ని అజ్వాక్ జాతి కుక్కలకు మచ్చలు ఉండవని లూయిసా పేర్కొంది. ఇది బ్రాడీ ప్రత్యేక లక్షణాల్లో ఒకటి. ప్రస్తుతం బ్రాడీ చాలా ఆరోగ్యంగా ఉందని, మా ఇద్దరికీ మంచి స్నేహం కుదిరిందని స్థానిక మీడియాకు తెలిపింది. చదవండి: శీతాకాలంలో చలిని తట్టుకోవాలంటే ఇది ఎక్కువగా తినాలి..! -
ఫిర్యాదు తీసుకోవడం లేటైందని బ్లేడుతో కోసుకున్నాడు
సాక్షి, విజయనగర్‌కాలనీ(హైదరాబాద్): ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్లో వ్యక్తి గొంతుకోసుకున్న సంఘటన శనివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మెహిదీపట్నం భోజగుట్టలో నివసించే హరి (33) పనీపాటా లేకుండా జులాయిగా తిరుగుతుంటాడు. అతనికి ముగ్గురు భార్యలు. అతని రెండో భార్య సెల్‌ఫోన్ లాక్కోవడంతో గొడవ జరిగింది. ఫిర్యాదు చేయడానికి ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు ఇతని మరో భార్యతో వచ్చాడు. ఫిర్యాదు తీసుకోవడం లేటవుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మద్యం మత్తులో ఉన్న హరి తనతో తెచ్చుకున్న బ్లేడుతో గొంతు దగ్గర కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో పోలీసులు అతనిని వైద్యసేవల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇతను గతంలో పలుమార్లు ఇదే విధంగా బ్లేడుతో శరీరం కోసుకోవడంతో శరీరమంతా కత్తిగాట్లు ఉన్నాయన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
మెడమీద ముడతలు తగ్గాలంటే..
ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు క్లెన్సింగ్ మిల్క్‌లో ముంచిన కాటన్‌తో మెడను తుడిచి, ఆ తర్వాత టీ స్పూన్ కీరా దోసకాయ రసంలో టీ స్పూన్ ఆపిల్ వెనిగర్ కలిపిన మిశ్రమాన్ని మెడకు పట్టించాలి. ఉదయం చన్నీటితో కడిగేయాలి. ఇలా కనీసం మూడు వారాల పాటు చేస్తే క్రమంగా మెడ మీద నలుపు వదులుతుంది. ఆపిల్ వెనిగర్ చర్మాన్ని టైట్ చేస్తుంది, కీరదోస చర్మాన్ని కోమలంగా మారుస్తుంది. ⇔ ప్రతి రోజూ ఒంటికి మాయిశ్చరైజర్, బాదం ఆయిల్ లేదా నువ్వుల నూనె రాస్తుంటే చర్మం చలికి పొడిబారకుండా ఉంటుంది. ⇔ శీతాకాలంలో చేతులకు ఆయిల్‌తో మర్దన చేయడం వల్ల ముడతలు తగ్గి చేతివేళ్ళు అందంగా తయారవుతాయి. ⇔ చలికాలంలో పెదవులు పగులుతుంటే... రాత్రి పడుకోబోయే ముందు నెయ్యి, వెన్న, మరేదైనానూనె రాస్తే పెదవులు మృదువుగా ఉంటాయి. బయటకు వెళ్లేటప్పుడు జెల్ వంటివి రాసుకోవచ్చు. -
మెడ మీద నల్లబడుతోంది..?
నా వయసు 38 ఏళ్లు. వృత్తిరీత్యా నాకు బయట ఎక్కువగా తిరగాల్సిన పని ఉంటుంది. ఇటీవల నా మెడమీద, నుదురు,నడుము మీద విపరీతంగా నల్లబడుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? దయచేసి వివరించండి. మీరు ఎదుర్కొంటున్న కండిషన్‌ను ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ అంటారు. ఈ కండిషన్ ఉన్నవారిలో మెడ, నుదురు వంటి చోట్ల నల్లబడటంతో పాటు అక్కడ చర్మం ఒకింత దళసరిగా కూడా మారుతుంది. సాధారణంగా ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉన్నవారిలో ఈ సమస్య కనిపిస్తుంటుంది. తక్కువ వ్యవధిలో ఎక్కువగా బరువు పెరగడం, కొన్ని హార్మోన్ల అస్తవ్యస్తతో ఇలా జరుగుతుంది. కొందరిలో కొన్ని రకాల మందులు వాడినా కూడా ఈ సమస్య రావచ్చు. మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, ఏ కారణాల వల్ల ఇలా జరుగుతుందో తెలుసుకుని, అందుకు అనుగుణంగా చికిత్స తీసుకోండి. టీవీ యాడ్స్‌లోని కాస్మటిక్స్ వాడమంటారా? నా వయసు 20 సంవత్సరాలు. నా ముఖం విషయంలో నాకు ఎలాంటి సమస్యా లేదు. ఎలాంటి ఫిర్యాదులూ లేవు. నేను ఎలాంటి క్రీమ్స్ రాయను. అయితే టీవీ యాడ్స్ చూసినప్పుడు నేను కూడా ఏవైనా క్రీమ్స్ రాస్తే మంచిదా అన్న భావం కలుగుతోంది. వాటివల్ల ఏమైనా సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయా అన్న ఆందోళన కూడా ఒక్కోసారి కలుగుతోంది. నాకు తగిన సలహా చెప్పండి. మీ ముఖం, చర్మం విషయంలో ఎలాంటి సమస్యా లేదంటున్నారు కాబట్టి మీరు టీవీ యాడ్స్ వలలో పడకుండా... మీ చర్మాన్ని కాపాడుకోడానికి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు. సూర్యకిరణాల దుష్ప్రభావం నుంచి కాపాడుకోడానికి మీరు డాక్టర్ సూచించిన సన్‌స్క్రీన్ వాడితే చాలు. అలాగే ముఖాన్ని శుభ్రపరచుకోడానికి సోప్ ఫ్రీ క్లెన్సర్ వాడండి. ఇక చర్మం పొడిబారకుండా ఉండేందుకు మాయిష్చరైజర్ ఉపయోగించండి. స్విమ్మింగ్ తర్వాత మాడుపై దురద! నా వయసు 20 ఏళ్లు. నాకు స్విమ్మింగ్ అంటే ఇష్టం. ఈ మధ్య స్విమ్మింగ్ చేసిన తర్వాత మాడు బాగా దురదగా ఉంటోంది. చర్మం కూడా పొడిబారినట్లు నల్లగా మారుతోంది. ఎందుకిలా జరుగుతోంది? స్విమ్మింగ్‌పూల్‌లో శానిటైజింగ్ కోసం కొన్ని రసాయనాలు (ఉదాహరణకు క్లోరిన్ వంటివి) వాడుతుంటారు. ఆ రసాయనాలు కొంతమందికి సరిపడవు. దాంతో అలర్జీలా వస్తుంటుంది. మరికొంతమందిలో చర్మం పొడిబారడం, మాడుపైన దురదలు రావడం మామూలే. మీరు స్విమ్మింగ్‌కు వెళ్లేముందు డాక్టర్ సూచించిన మెడికేటెడ్ మాయిష్చరైజర్ వాడితే, ఈ రసాయనాల ప్రభావం చర్మంపై పడకుండా చూసుకోవచ్చు. ఔట్‌డోర్ స్విమ్మింగ్‌పూల్స్‌లో ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు స్విమ్మింగ్ చేసినట్లయితే వాటర్ రెసిస్టెంట్ సన్‌స్క్రీన్ ఎస్పీఎఫ్ 50 ఉన్నది వాడటం సముచితం. ఇలా చేయడం వల్ల చర్మాన్ని సూర్యకిరణాల నుంచి సంరక్షించుకోవచ్చు. మాడు భాగం అంటే స్కాల్ప్‌కు స్విమ్మింగ్‌పూల్‌లోని నీళ్లు తగలకుండా ఉండేందుకు క్యాప్ వాడండి. అంతేగాక మైల్డ్ మెడికేటెడ్ షాంపూ అండ్ కండిషనర్ వాడటం ద్వారా జుట్టు పొడిబారకుండా కాపాడుకోవచ్చు. డాక్టర్ సుభాషిణి జయం, చీఫ్ మెడికల్ కాస్మటాలజిస్ట్, ఎన్ఛాంట్ మెడికల్ కాస్మటాలజీ క్లినిక్, శ్రీనగర్‌కాలనీ, హైదరాబాద్ -
స్టైలిష్ నెక్ పీస్
మీ దగ్గర ఉన్న పాత ఇమిటేషన్ జువెల్రీ రంగు పోయినా లేదంటే మరో కొత్త రూపం తీసుకురావాలన్నా ఓ చిన్న ఆలోచన చాలు. డ్రెస్ కలర్‌కు మ్యాచ్ అయ్యే ఆభరణం కొనుగోలు కోసం ప్రయాస పడకుండా ఇలా వినూత్న డిజైన్ నెక్‌పీస్‌ను రూపొందించుకోవచ్చు. ఇందుకు కావల్సినవి: ► రాళ్లు పొదిగి ఉన్న పాత నెక్లెస్ ►నెయిల్ పాలిష్ ► నూలు దారాలతో అల్లిన తాడు లేదంటే సన్నని వైర్లతో అల్లిన మందపాటి తాడు (అన్ని రంగుల్లోనూ ఈ తాళ్లు మార్కెట్లో లభ్యమవుతాయి) u సూది, దారం u కత్తెర u క్యాండిల్ లేదా లైటర్ స్టెప్ : 1 .. తాడుకు పూర్తి కాంట్రాస్ట్ నెయిల్ పాలిష్‌ను తీసుకోవాలి. అన్ని రాళ్ల మీద నెయిల్ పాలిష్ కోటింగ్ వేయాలి. ఒక్కో రాయి మీద ఒక్కో నెయిల్ పాలిష్ రంగు కూడా వేసుకోవచ్చు. అన్ని రాళ్ల మీద రెండవ సారి కూడా నెయిల్ పాలిష్ కోటింగ్ వేసి ఆరనివ్వాలి. స్టెప్ : 2 .. నెక్లెస్ ఎంత పొడవు ఉందో అంత పొడవు తాడు కత్తిరించుకోవాలి. స్టెప్ : 3 నూలు తాడు అయితే చివర్లు ముడివేయాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ వైర్ తాడు కాబట్టి చివరన క్యాండిల్ లైట్‌తో గానీ లైటర్ మంటతో గానీ కాల్చాలి. వేడికి చివర్లు ముడుచుకుపోయి, విడిపోకుండా ఉంటాయి. స్టెప్ : 4 .. నెక్లెస్ రంగు దారం తీసుకొని సూదికి ఎక్కించాలి. ఆ సూదితో నెక్లెస్‌ను తాడుకు జత చేసి కుట్టాలి. ప్లెయిన్ డ్రెస్‌ల మీదకు ఇలాంటి నెక్లెస్ చూడగానే ఆకట్టుకుంటుంది. ఖర్చు కూడా నెక్లెస్ కొనుగోలు చేసేటంత కాదు. నెయిల్ పాలిష్ గోళ్లకు వేసుకోవ డానికి తీసుకుంటారు. సూది దారం ఇంట్లోనే ఉంటాయి. ప్లాస్టిక్ లేదా నూలు దారం తాడుకు రూ.5 నుంచి రూ.10 లోపు అవుతుంది. -
మెడ ఇరుకుపడితే.. తలగడే మంచి మందు!
మెడ పట్టేయడాన్ని సరిచేయడానికి మొదటి మందు, మంచి మందు తలగడే అంటున్నారు కెనడాకు చెందిన పరిశోదకులు. మెడపట్టేయడంతో బాధపడే రోగులపై నిర్వహిం చిన ఒక అధ్యయనంలో వారి పరిస్థితిని చక్కదిద్దడానికి, వారి సమస్యకు విరుగుడుగా అనేక ప్రక్రియలను అనుసరించి చూశారు ఆ పరిశోధకులు. అందులో భాగంగా తాము ఎంచుకున్న దాదాపు నూటాయాభైకి పైగా రోగులకు మసాజ్ వంటి అనేక ప్రక్రియలు, చిట్కాలు ప్రయోగించారట. అయితే మరీ ఎక్కువ లావు, మరీ ఎక్కువ సన్నమూ కాని మంచి తలగడను ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనం చేకూరిందని గ్రహించాచు. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమిటంటే.. తలగడను కేవలం తలకిందేకి మాత్రమే పరి మితం చేయకుండా, కాస్తంత భుజాల కింది వరకూ దాన్ని జరిపితే ఫలితం మరీ బాగుందట. తలగడను అలా పెట్టుకొని నిద్రించడం ద్వారా మెడపట్టేయడాన్ని సమర్థంగా నివారించ వచ్చని ఆ అధ్యయనంలో తేలింది. తలగడ తర్వాత మంచి మార్గం స్ట్రెచ్చింగ్ వ్యాయామం అని కూడా ఈ అధ్యయనంలో తేలింది. -
బ్యూటిప్స్
నునుపైన మెడ కోసం బంగాళదుంప – 1, పచ్చి పాలు – పావు కప్పు కొబ్బరి నూనె – టీ స్పూన్ బంగాళదుంపని మెత్తగా ఉడకబెట్టి పొట్టు తీయకుండా మెదుపుకోవాలి. దీంట్లో పాలు, కొబ్బరి నూనె జత చేసి పేస్ట్‌లా కలపాలి. శుభ్రపరచుకున్న మెడ పై ఈ మిశ్రమాన్ని అప్లై చేసి, 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఇలా నెల రోజులపాటు క్రమం తప్పకుండా చేస్తే మెడ మీద పేరుకుపోయిన నలుపు తగ్గి చర్మం కాంతివంతం అవుతుంది. మొటిమల నివారణకు... కొద్దిగా తేనె తీసుకుని దానిలో శనగపిండి కలుపుకుని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని మొటిమలపై అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. తులసి ఆకులు మెత్తగా గ్రైండ్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్‌లో కొద్దిగా నీటిని కలిపి యాక్నే ఉన్న ప్రదేశంలో అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. -
మెడమీద ముడతలు తగ్గాలంటే...
ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు క్లెన్సింగ్ మిల్క్‌లో ముంచిన కాటన్‌తో మెడను తుడిచి, ఆ తర్వాత టీ స్పూన్ కీరాదోసకాయ రసంలో టీ స్పూన్ ఆపిల్ వెనిగర్ కలిపిన మిశ్రమాన్ని మెడకు పట్టించాలి. ఉదయం చన్నీటితో కడిగేయాలి. ఇలా కనీసం మూడు వారాల పాటు చేస్తే క్రమంగా మెడ మీద నలుపు వదులుతుంది. ఆపిల్ వెనిగర్ చర్మాన్ని టైట్ చేస్తుంది, కీరదోస చర్మాన్ని కోమలంగా మారుస్తుంది. యాంటీ ఏజింగ్ ఫేషియల్ మాస్క్ పెరిగే వయసును అద్దంలా ప్రతిబింబింపజేసేది చర్మం. అందులోనూ చలికాలంలో మరీ ఎక్కువ ముడతలు పడుతుంది. అందుకే వార్ధక్య లక్షణాలకు చెక్‌పెట్టే హోమ్మేడ్ ఫేషియల్ మాస్క్ ఇది. ఒక నిమ్మకాయను తీసుకుని, గింజలు వేరుచేసి, అందులో ఒక స్పూను మీగడ వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పలుచటి పొరలా ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత తీసేసి ముఖానికి ఫేషియల్ క్రీమ్ రాసి మర్దన చేయాలి. ముడతలు పడిన చర్మానికి ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది. -
గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం
శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైల దేవస్థానం పరిధిలో నివాసముంటున్న పసుపుల మల్లేశ్వరి (18) గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. బుధవారం తెల్లవారుజామున 5.30గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. గమనించిన బంధువులు మల్లేశ్వరిని.. శ్రీశైలం ప్రాజెక్టు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డాక్టర్ లక్ష్మి గొంతు చుట్టూ కుట్లు వేసి.. ప్రాణప్రాయం నుంచి కాపాడారు. ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. అత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
నొప్పి లేదు కానీ... వాపు ఉంది!
క్యాన్సర్ కౌన్సెలింగ్ నా వయసు 24 ఏళ్లు. నా మెడ భాగంలో నొప్పి లేదు కానీ, చిన్న వాపులాంటిది వచ్చింది. రాత్రి సమయంలో జ్వరం వస్తోంది. చలిగా అనిపిస్తోంది. డాక్టర్‌ను కలిస్తే లింఫోమా అని తెలిపారు. దీని లక్షణాలను, నిర్ధారణ పరీక్షలతో పాటు అసలు ఈ లింఫోమా అంటే ఏమిటి అనే విషయాలను వివరించండి. - ఒక సోదరి, హైదరాబాద్ లింఫోమా అంటే ఉత్పత్తి, నిల్వ చేయడంతో పాటు తమతో తీసుకెళ్లే కణజాలం అయిన లింఫ్ సిస్టమ్‌లో కలిగే ఒక రకం క్యాన్సర్లు. ఈ లింఫోమా అనేవి ప్రధానంగా రెండు రకాలు. 1) హాడ్జ్కిన్స్ లింఫోమా 2) నాన్-హాడ్జ్కిన్స్ లింఫోమా. లింఫోమా లక్షణాలు: నొప్పి లేకుండా మెడల్లో, చంకల్లో వాపులు రావడం స్ప్లీన్ పెరగడం, పొట్ట నొప్పి/అసౌకర్యం జ్వరం, చలితో పాటు రాత్రిళ్లు చెమటలు పట్టడం శక్తి లేకపోవడం అకస్మాత్తుగా బరువు తగ్గడం ఎక్కువ మందిలో బరువు తగ్గడం సాధారణ రోగ నిర్ధారణ పరీక్షలు రక్త పరీక్షలు బయాప్సీ ఎముక మూలుగ పరీక్ష సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్స్ పరీక్ష మాలిక్యులార్ రోగి నిర్ధారణ పరీక్షలు ఇమేజింగ్ పరీక్షలు (ఎక్స్-రే, కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ స్కాన్ (సీటీ), మాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ (ఎమ్మారై), పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ స్కాన్ (పెట్ స్కాన్) లింఫోమా సమస్యకు తగిన చికిత్స తీసుకున్న తర్వాత థైరాయిడ్, కాలేయం, మూత్రపిండాలను క్రమపద్ధతిలో చెక్ చేయించుకోవాలి. లిపిడ్స్ పరీక్ష కూడా చేయించుకోవాలి. - డా॥ఆర్ సింగీ హెమటాలజిస్ట్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్, సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
గొలుసు చోరీ
నిజామాబాద్ కైం: ఉమెన్స్ కళాశాల లెక్చరర్ మెడలో నుంచి చైన్‌ను లాక్కెళ్లారు దుండగులు. మూడో టౌన్ ఎస్సై–2 వెంకట్ కథనం ప్రకారం.. నీలకంఠనగర్‌కు చెందిన అనసూయ కంఠేశ్వర్ ఉమెన్స్ కళాశాలలో లెక్చరర్. రెండు రోజుల క్రితం గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపల్‌ను కలిసేందుకు గిరిరాజ్ కళాశాలకు ఆటోలో వచ్చింది. కళాశాల ముందు ఆటో దిగి లోనికి నడుచుకుంటూ వెళ్తుండగా, వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఓ రాయితో ఆమె కాలిపై విసిరారు. దాంతో ఆమె ఏమైందోనని చూసేకునే లోపు ఆమె మెడలోనున్న మూడు తులాల బంగారు గొలుసును తెంపుకొని పారిపోయారు. బిత్తరపోయిన ఆమె తెరుకుని కేకలు పెట్టేసరికి దొంగలు అక్కడి నుంచి క్షణల్లో మాయం అయిపోయారు. అనంతరం అక్కడి స్థానికులు ఆమె వద్దకు చేరుకోగా వారికి జరిగిన విషయం తెలిపింది. సంఘటన అనంతరం లెక్చరర్ దిగులుపడుతూ ఇంటికి చేరుకుంది. బంధుమిత్రుల సలహా మేరకు బాధితురాలు సోమవారం మూడో టౌన్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ంది. -
మెడపై మచ్చలు తొలగాలంటే...
బ్యూటిప్స్ బ్యూటిప్స్అందమైన మెడ... ముఖారవిందాన్ని మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. చెమట, మురికి కారణంగా మెడ భాగమంతా నల్లగా, డల్‌గా అవుతుంది. ఈ సమస్య తీరాలంటే... అరటిపండుని గుజ్జులా చేసి... అందులో కాసిన్ని పాలు, రెండు చుక్కల నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మెడ భాగానికి ప్యాక్‌లా వేసి, ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. వారానికోసారి చొప్పున ఇలా కొన్ని వారాలు చేస్తే మంచి ఫలితముంటుంది. రోజూ స్నానం చేసేముందు మెడకి పెట్రోలియం జెల్లీ పట్టించాలి. కాసేపు అలా ఉంచి, తర్వాత మెత్తని పొడి బట్టతో రుద్ది తుడవాలి. ఇలా చేయడం వల్ల పేరుకున్న మురికి పోతుంది. తెల్లద్రాక్షలను మెత్తగా రుబ్బి గుజ్జులా చేయాలి. ఈ మిశ్రమంతో మెడను బాగా రుద్ది వదిలేయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి. వారానికి రెండు మూడుసార్లు ఇలా చేస్తే మెడమీది చర్మం ఆరోగ్యంగా తయారై కాంతులీనుతుంది. మజ్జిగలో దూదిని ముంచి మెడ భాగాన్ని తరచూ శుభ్రం చేసుకుంటూ ఉంటే... మురికి, నలుపు పోయి అందంగా తయారవుతుంది. -
పీకలదాకా తాగి..పీక కోసుకున్నాడు
-
మెడా పెడా వాడకండి ప్లీజ్!
సర్వైకల్ స్పాండిలోసిస్ మెడకాయ మీద తలకాయ ఉన్నవారెవరూ మెడనొప్పి ఉంటే మెడను ఎడామెడా వాడకూడదు. ఎందుకంటే... శరీరంలోని అత్యంత కీలకమైన భాగం మెడ. అది సులువుగా, ఏ ఇబ్బందీ లేకుండా కదులుతూ ఉంటేనే హాయి. కానీ ఆ భాగంలో ఏమాత్రం ఇబ్బందిగా ఉన్నా చాలు... అదెంతో కష్టమనిపిస్తుంది. అలాంటిది మెడలోని వెన్నుపూసల నుంచి మొదలుకొని, భుజం చేతిలోకి దూసుకువస్తున్నట్లుగా వచ్చే నొప్పి. క్షణక్షణం మెడనూ, భుజాన్నీ నొక్కుకుంటూఉండి సాంత్వన పొందాలన్న ఆరాటం. ఎంతో బాధగాపరిణమిస్తూ... మెడ నుంచి చేతికి పాకుతున్నట్లుగా ఉండే ఈ నొప్పినే వైద్య పరిభాషలో సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. ఈ కండిషన్‌కు కారణాలు, దీని నుంచి విముక్తి కోసం చేయాల్సిన ప్రయత్నాల గురించి తెలుసుకుందాం. సర్వైకల్ స్పాండిలోసిస్ పేరిట వచ్చే మెడ నొప్పి చాలా సాధారణ సమస్య. మన జనాభాలో దాదాపు 80 శాతం మందికి తమ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో మెడనొప్పి వస్తుంది. ఇది ఇంత సాధారణంగా కనిపించడానికి అనేక కారణాలున్నాయి. మరీ ముఖ్యంగా మన జీవితాల్లోకి కంప్యూటర్ ప్రవేశించాక... దానిపై సుదీర్ఘకాలం పనిచేస్తుంటాం. ఈ సమయంలో మనం తప్పుడు భంగిమలో కూర్చోవలసి రావడంతో ఎప్పుడూ తల భారం మెడపైన అదేపనిగా పడుతూ ఉంటుంది. దాంతో మెడపై భంగిమపరమైన ఒత్తిడి పడి అది అలసటకు (పోష్చరల్ ఫెటీగ్‌కు) గురవుతుంది. ఇదే క్రమక్రమంగా కొనసాగుతూ సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యకు దారితీస్తుంది. సర్వైకల్ స్పాండిలోసిస్ నొప్పి ఎలా వస్తుంది? మెడలోని వెన్నుపూసలను సర్వైకల్ ఎముకలు అంటారు. ఈ ఎముకల మధ్య ఒరిపిడినీ, రాపిడినీ తగ్గించడానికి ఒకింత మెత్తగా ఉండే డిస్క్‌లు ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ వెన్నుపూస డిస్క్‌లలో తేమ తగ్గుతుంది. దాంతో ఎముకబంధాలను పటిష్టంగా ఉంచే ప్రోటియోగ్లైకాన్ మ్యాట్రిక్స్ అనే ప్రోటీన్ బంధాలలోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ అన్ని మార్పుల ఫలితంగా ఎముకల మధ్య ఒరిపిడినీ, రాపిడినీ తగ్గించే మెత్తటి డిస్క్‌లు కాస్తా గట్టిగా, పెళుసుబారినట్లుగా అవుతాయి. ఇలా పెళుసుబారిన డిస్క్‌లలో చిన్న చిన్న పగుళ్లు, చీలికలు వస్తాయి. దాంతో రక్తనాళాలు ఈ పగుళ్లలోకి, చీలికల్లోకి ప్రవేశిస్తాయి. దాంతోపాటు డిస్క్‌ల అరుగుదల కూడా మొదలవుతుంది. దాంతో వెన్నుపూసల మధ్య ఘర్షణ, రాపిడి చోటు చేసుకుంటుంది. దాంతో ఎముకలు ఒరుసుకుపోవడం, అరుగుదలకు దారితీయడం జరుగుతుంది. ఈ అరుగుదల జరుగుతున్న చోట అరుగుదలను భర్తీ చేసేందుకు కొత్తగా ఎముక పెరుగుదల ప్రారంభమవుతుంది. సర్వైకల్ స్పాండిలోసిస్ సమయంలో ఈ ప్రక్రియ అంతా చాలా విపరీతమైన వేగంతో జరుగుతుంది. ఈ సమయంలో డిస్క్‌లు స్థానాలు తప్పడాలు, ఎముకల పెరుగుదల ప్రక్రియలు... అక్కడి నరాలను, నరాల చివరలను బలంగా నొక్కుతాయి. నరాలు ఇలా నొక్కుకుపోవడం వల్ల నరం పొడవునా నొప్పి వస్తుంది. అందుకే నొప్పి పాకినట్లుగా జాలుగా వస్తుంటుంది. దాంతోపాటు భుజాల్లోకి నొప్పి పాకే సమయంలో అక్కడి కండరాలు కూడా బలహీనంగా మారతాయి. కొద్దిమేరకు స్పర్శలో మార్పులూ రావచ్చు. నియంత్రణ ఎలా? ... సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల వచ్చే మెడ నొప్పిని నివారించుకోవడానికి విశ్రాంతి తీసుకోవడం మంచి మార్గం. దాంతో పాటు నొప్పినివారణ కోసం ఉపయోగించే పైపూత మందులు సురక్షితం. ఈ పైపూత మందులను మృదువుగా మసాజ్ చేసినట్లుగా రాయాలి. ఇక ఐస్‌ను కాపడం పెట్టినట్లుగా నొప్పి ఉన్న చోట అద్దడం చేయాలి. ఇవన్నీ కుదరకపోతే అప్పుడు డాక్టర్ సలహా మేరకు మాత్రమే నొప్పినివారణ మందులు వాడాల్సిరావచ్చు. వీటి కంటే తల భారాన్ని పూర్తిగా ఎముకలపైనే పడనివ్వకుండా మెడ కండరాలను బలంగా చేసేందుకు మెడ వ్యాయామాలను (ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్‌సెజైస్) చేయాలి. ఫిజియోల సలహాల మేరకు వ్యాయామాలు చేయడం వల్ల నొప్పి చాలావరకు ఉపశమిస్తుంది. డాక్టర్‌ను కలవాల్సిందెప్పుడు..? మెడ నొప్పి వచ్చినప్పుడు సాధారణ పెయిన్‌కిల్లర్ వేసుకున్నా ఆగకుండా అదేపనిగా నొప్పి వస్తున్నప్పుడు, ఆ నొప్పి అలా పెయిన్‌కిల్లర్స్ వేసుకుంటున్నా వారం రోజుల తర్వాత కూడా తగ్గకపోతేనొప్పి ఒకే చోట లేకుండా చురుక్కుమంటూ భుజానికిగాని, ఇతర అవయవాలకు గాని పాకుతూ ఉన్నట్లుగా ఉంటేపై లక్షణాలతో పాటు నీరసంగా ఉండి చేతులు గాని, కాళ్లు గాని తిమ్మిరి పట్టినట్లుగా ఉంటేకాళ్లు లేదా చేతులు బిగదీసినట్లుగా (స్టిఫ్నెస్తో) ఉంటేమెడపై ముట్టుకున్నా ఇబ్బందిగా (టెండర్నెస్) ఉంటే శరీరంలో ఎక్కడైనా స్పర్శజ్ఞానం కోల్పోయినట్లుగా అనిపిస్తే... ఈ లక్షణాలన్నీ సర్వైకల్ స్పాండిలోసిస్ను సూచిస్తాయి. చికిత్స... మెడలోని వెన్నుపూసలు అరిగి, అక్కడి నరాలు, నరాల అంకురాల చివర్లు నొక్కుకుపోతూ వస్తున్న నొప్పిని తగ్గించేందుకు ప్రీగ్యాబలిన్, గాబాపెంటిన్ వంటి నరాల కణాలను పుట్టించే ప్రోటీన్లు ఉండే ‘న్యూరోట్రాఫిక్’ మందులు బాగా ఉపయోగపడతాయి. ఇక కొన్నిసార్లు అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు. ఎవరెవరిలో ఎక్కువ... సాధారణంగా పురుషులలో సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్య ఎక్కువ. ప్రధానంగా నిటారుగా కూర్చుని డ్రైవింగ్ చేసేవారు, పొగతాగేవారు, చాలా ఎక్కువ బరువున్న వస్తువులను మోసేవారిలో సర్వైకల్ స్పాండిలోసిస్ రిస్క్ పాళ్లు అధికం. లక్షణాలివి... మెడ నొప్పిగా ఉండటం ఆయా అవయవాలను నియంత్రించి నరాలపై ఒత్తిడి పడటం వల్ల ఆ అవయవాలు సైతం నొప్పికి గురి కావడం, ఉదాహరణకు భుజం, మోచేయి, చేతి వేళ్లు లాంటివి చేయి, వేళ్లు, కొన్ని సందర్భాల్లో కాళ్లు తిమ్మిరి పట్టినట్లు అనిపించడం కాళ్లు బిగదీసుకుపోయినట్లు (స్టిఫ్నెస్) అనిపించడం నడకలో ఇబ్బంది కొందరిలో ఈ లక్షణాలు నెమ్మది నెమ్మదిగా క్రమంగా వస్తే మరికొందరిలో ఒక్కసారిగా కనిపించవచ్చు. డాక్టర్ హరి శర్మ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదర్‌గూడ, హైదరాబాద్ -
తెలిసినవారా..? దుండగులా..?
కోల్‌సిటీ : గోదావరిఖని జీఎం కాలనీలో శనివారం అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన చింతల సులోచన మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేతులు, కాళ్లను తాళ్లతో బంధించి.. మెడ కోసి హత్య చేసిన ఆనవాళ్లు ఉండడం వెనుక తెలిసినవారి ప్రమేయముం దా..? లేక దుండగులా చేశారా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఆమెను దుండగులు పథకం ప్రకారమే హత్య చేసి అనం తరం కారంపొడి చల్లారని స్థానికులు అను మానిస్తుండడం ఈ కేసులో కొత్త కోణం. అనేక సందేహాలు.. దారుణ హత్యకు గురైన సులోచన ఇంటి నుంచి ఎలాంటి అరుపులూ వినిపించలేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. వంటింట్లో చాపపై పడుకోబెట్టి ఉండడం, ఇంట్లోని గదులన్నీ కా రం పొడి చల్లిఉండడం.. ఒంటిపై ఉన్న బంగా రు ఆభరణాలు.. బీరువాలో ఖరీదైన చీరలున్నా వాటిని ముట్టుకోకుండా కేవలం బీరువాలోని బంగారు ఆభరణాలు మాత్రమే దోచుకెళ్లడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడూ లాకర్లో ఉంచే బంగారు ఆభరణాలు బీరువాలోకి ఎలా వచ్చాయి..? ఆ విషయం హత్య చేసిన వారికి ఎలా తెలిసింది..? అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. సులోచన ఇల్లు రహదారి సమీపంలోనే ఉంది. ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అయినా హత్య చేసినవారు అంత సులువుగా ఎలా పారిపోయారో తెలియడం లేదు. పైగా ఇంటి వెనకాల రక్తం మరకలను బక్కెట్లోని నీటితో కడుక్కున్న ఆనవాళ్లు కనిపించాయి. పోస్టుమార్టంపైనే అందరి దృష్టి సులోచన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు పూర్తి నివేదిక కోసం కొన్ని అవయవాలను ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. హత్య సమంలో ఆమె ఎలా ఉంది.. ? ఆమెను ఏదైనా ఆహార పదార్థంలో మత్తు మందు కలిపి తినిపించి హత్య చేశారా..? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదికకు 15 రోజులు పడుతుందని సమాచారం. సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌పై ఆరా సులోచన సెల్‌ఫోన్ కనిపించకుండాపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. నిందితులు సంఘటనకు ముందే సులోచనకు ఫోన్ చేసైనా ఉండాలి..? లేదా ఆమెతో తరు చూ మాట్లాడేవారైనా ఉండాలి..? అనే కోణం లో పోలీసులు ఆరా తీస్తున్నారు. మిస్సింగ్ అయిన సులోచన సెల్‌ఫోన్‌పై నిఘా పెట్టిన పోలీసులు.. కాల్‌లిస్ట్ సేకరిస్తున్నట్లు సమాచా రం. హత్యకు ముందు రెండ్రోజులుగా సులోచనకు ఎవరెవరు ఎన్నిసార్లు ఫోన్ చేశారో..? సులోచన ఫోన్ నుంచి ఎవరెవరికి ఎన్నికాల్స్ వెళ్లాయో తెలుసుకుంటున్నారు. కాల్‌లిస్టు సమాచారం కోసం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. స్వగ్రామంలో అంత్యక్రియలు గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని స్వగ్రామమైన జమ్మికుంట సమీపంలోని చెల్పూర్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు కుటుంబసభ్యులు, బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. -
అబ్బా.. మెడనొప్పి
డాక్టర్స్ కాలమ్ తలకూ మొండేనికి మధ్య బాల్ బేరింగ్ లాంటిది మెడ. వాహనాలు నడపడంలో బాల్ బేరింగ్లు ఎంత ముఖ్యమైనవో మన శరీరంలో మెడకూడా అంతే. తిరుగుతున్నాయి కదా అని బేరింగ్లను ఎలాగ పడితే అలా తిప్పితే అవి ఎలా పాడైపోతాయో.. ఇష్టారాజ్యంగా తిప్పితే మెడ పరిస్థితీ అంతే. మెడ పనితీరు, దీని ప్రాధాన్యం అనేది నగరీకరణ జరుగుతున్న క్రమంలో బాగా తగ్గిపోవడంతో బాధితులు ఎక్కువయ్యారు. నడక, పడకల నుంచీ కూర్చునే కుర్చీలు, కూర్చునే తీరు అన్నీ మెడ నొప్పికి కారణాలవుతున్నాయి. కంప్యూటరీకరణ నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులు శిలల్లా మారి పనిచేయడం వల్ల మెడ నరాలు మొద్దుబారి.. కండరాలు పట్టేస్తున్నాయి. హైదరాబాద్‌లో చాలామంది ముప్పయ్ ఏళ్లు నిండకుండానే మెడ నొప్పితో బాధపడుతున్నారు. విధి నిర్వహణలో, వాహనాలు నడిపేటప్పుడు పక్కా ప్రిన్స్‌పుల్స్ ఫాలో కాకపోవడం మెడపై ఒత్తిడి పెరుగుతోంది. చిన్నపాటి మెడనొప్పే కదా అని అశ్రద్ధ చేస్తే.. తర్వాత స్పాండిలైటిస్, ఆ తర్వాత నెక్ సర్జరీ వరకూ వెళ్తోంది. మన పనితీరులో కొన్ని పద్ధతులు ఫాలో అయితే మెడను ఈజీగా కాపాడుకోవచ్చంటున్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డా.బి.సాంబశివారెడ్డి. నగరంలో వాహన చోదకులు, సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే వారిలో రెండొంతుల మంది మెడనొప్పి బాధితులేనని ఆయన చెబుతున్నారు. ప్రజెంటర్: జి.రామచంద్రారెడ్డి అపసవ్య దిశలే కారణం.. * 90 శాతం మందిలో కూర్చునే తీరు, పనిచేసే తీరు వల్లే మెడనొప్పి కలుగుతుంది * ద్విచక్రవాహనాలు నడుపుతున్న సమయంలో మణికట్టు, భుజాలు సరైన దిశలో పెట్టకపోవడం మెడపై ప్రభావం చూపుతోంది * గంటల తరబడి కంప్యూటర్ల ముందు పనిచేయడం వల్ల మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి మొదలవుతుంది * ఈ నొప్పి దీర్ఘకాలంగా ఉంటే స్పైనల్ (వెన్నుపూస) నరాలు దెబ్బతినే అవకాశం ఉంది * పడుకోవడంలో సరైన పద్ధతులు ఫాలో కాకపోవడం కూడా మెడనొప్పికి హేతువవుతోంది * మెడనొప్పి తీవ్రమైతే శస్త్రచికిత్స మినహా మార్గం లేదు దిశను మార్చుకుంటేనే.. * చాలామంది మెడనొప్పి రాగానే నెక్ కాలర్ (మెడకు ఓ పట్టీ) వేస్తుంటారు. దీనివల్ల ఉపయోగం ఉండదు * కంప్యూటర్ వద్ద పనిచేస్తున్నప్పుడు భుజాలు, మోచేతులు సమాంతర దిశలో ఉండాలి * అలాగే కంప్యూటర్ కీబోర్డుకు మణికట్టు సమాంతరంగా ఉండాలి. * టూ వీలర్ నడుపుతున్నప్పుడు నిటారుగా ఉండి, భుజాలు మెడకు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి * రోజుకు కనీసం ఐదారు సార్లు నెక్ వ్యాయామం చేయాలి. అంటే రెండు చేతులూ తల వెనుక అదిమి పట్టి ముందుకు, వెనకకు స్ట్రెచ్ చేయడం * గంటల తరబడి కుర్చీలో కూర్చోకుండా మధ్య మధ్యలో రిలాక్స్ అవుతుండాలి -
మెడకు బదులుగా...మనిషే తిరగాల్సి వస్తే!
బహుశా మనలో చాలామందికి తలకు- దేహానికి మధ్య మెడ అనే కీలకమైన భాగం ఉందనే విషయం పెద్దగా గుర్తుండదు. మెడకు ప్రాధాన్యత కూడా తక్కువే. సర్వైకల్ స్పాండిలోసిస్ వంటి సమస్య ఏదో వచ్చి, తల తిప్పాల్సి వచ్చినప్పుడు ఆ పని సాధ్యం కాక మనిషి తిరగాల్సి వచ్చినప్పుడు మెడ ఎంత కీలకమైనదో తెలిసి వస్తుంది. దీనికి చికిత్స సులభమే కానీ దానికి ముందు ఒక నిర్ధారణకు రావడానికి కొన్ని పరీక్షలు అవసరమవుతాయి. ప్రాథమికంగా ఎక్స్-రే తీస్తారు. ఇందులో మెడ ఎముక ఒక చోట ములుకులా పొడుచుకురావడం, లేదా ఎముకకు సంబంధించి ఇతర అపసవ్యతలు తలెత్తినా తెలుసుకోవచ్చు. ఎక్స్-రే ద్వారా కచ్చితంగా నిర్ధారించలేని సందర్భాలలో కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ స్కాన్ (సి.టి. స్కాన్) ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు మాగ్నటిక్ రిజొనెన్స్ ఇమేజింగ్(ఎంఆర్ఐ) పరీక్ష ద్వారా నరాల స్థానాల్లో వెంట్రుక వాసి తేడా వచ్చినా కూడా స్పష్టంగా తెలుస్తుంది మైలోగ్రామ్ పరీక్షలో ఇంజక్షన్ ద్వారా రంగును వెన్నులోకి పంపించి ఆ తర్వాత సి.టి స్కాన్ లేదా ఎక్స్-రే పరీక్షలు చేస్తారు. రంగు విస్తరించడంతో ఏర్పడిన ఆకారాన్ని బట్టి వెన్నుపూసలలో వచ్చిన తేడాను తెలుసుకుంటారు. మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి వస్తే నరాల పనితీరును కూడా పరీక్షిస్తారు. వీటిలో... ఎలక్ట్రో మయోగ్రామ్ (ఇఎమ్జి) పరీక్ష ద్వారా కండరాలకు కొన్ని సంకేతాలను పంపించి నరాల స్పందనను అధ్యయనం చేస్తారు. దాంతో నరాల పనితీరు సాధారణంగానే ఉందా, తేడా ఉందా అనే వివరాలు తెలుస్తాయి. చికిత్స: నొప్పి నివారణకు, నరాలు శక్తిమంతం కావడానికి మందులు వాడుతూ ఫిజియోథెరపీ (మెడకు వ్యాయామం) చేస్తే సమస్య తగ్గిపోతుంది. చాలా కొద్ది సందర్భాలలో శస్త్రచికిత్స అవసరమవుతుంది.