మీ దగ్గర ఉన్న పాత ఇమిటేషన్ జువెల్రీ రంగు పోయినా లేదంటే మరో కొత్త రూపం తీసుకురావాలన్నా ఓ చిన్న ఆలోచన చాలు. డ్రెస్ కలర్‌కు మ్యాచ్ అయ్యే ఆభరణం కొనుగోలు కోసం ప్రయాస పడకుండా ఇలా వినూత్న డిజైన్ నెక్‌పీస్‌ను రూపొందించుకోవచ్చు.
ఇందుకు కావల్సినవి: ► రాళ్లు పొదిగి ఉన్న పాత నెక్లెస్ ►నెయిల్ పాలిష్
► నూలు దారాలతో అల్లిన తాడు లేదంటే సన్నని వైర్లతో అల్లిన మందపాటి తాడు (అన్ని రంగుల్లోనూ ఈ తాళ్లు మార్కెట్లో లభ్యమవుతాయి) u సూది, దారం u కత్తెర u క్యాండిల్ లేదా లైటర్
స్టెప్ : 1 .. తాడుకు పూర్తి కాంట్రాస్ట్ నెయిల్ పాలిష్‌ను తీసుకోవాలి. అన్ని రాళ్ల మీద నెయిల్ పాలిష్ కోటింగ్ వేయాలి. ఒక్కో రాయి మీద ఒక్కో నెయిల్ పాలిష్ రంగు కూడా వేసుకోవచ్చు. అన్ని రాళ్ల మీద రెండవ సారి కూడా నెయిల్ పాలిష్ కోటింగ్ వేసి ఆరనివ్వాలి.
స్టెప్ : 2 .. నెక్లెస్ ఎంత పొడవు ఉందో అంత పొడవు తాడు కత్తిరించుకోవాలి.
స్టెప్ : 3
నూలు తాడు అయితే చివర్లు ముడివేయాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ వైర్ తాడు కాబట్టి చివరన క్యాండిల్ లైట్‌తో గానీ లైటర్ మంటతో గానీ కాల్చాలి. వేడికి చివర్లు ముడుచుకుపోయి, విడిపోకుండా ఉంటాయి.
స్టెప్ : 4 .. నెక్లెస్ రంగు దారం తీసుకొని సూదికి ఎక్కించాలి. ఆ సూదితో నెక్లెస్‌ను తాడుకు జత చేసి కుట్టాలి.
ప్లెయిన్ డ్రెస్‌ల మీదకు ఇలాంటి నెక్లెస్ చూడగానే ఆకట్టుకుంటుంది. ఖర్చు కూడా నెక్లెస్ కొనుగోలు చేసేటంత కాదు.
నెయిల్ పాలిష్ గోళ్లకు వేసుకోవ డానికి తీసుకుంటారు. సూది దారం ఇంట్లోనే ఉంటాయి. ప్లాస్టిక్ లేదా నూలు దారం తాడుకు రూ.5 నుంచి రూ.10 లోపు అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment