
మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 3 కోసం నిర్వహించిన మినీ వేలంలో ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ తనదైన స్టైల్‌తో ఆకట్టుకున్నారు. సందర్భానికి తగ్గట్టు తన డ్రెస్సింగ్ స్టైల్‌తో అదరగొట్టడం మాత్రమే కాదు, హై-ఎండ్ యాక్సెసరీలతో స్పెషల్ లుక్‌లో అందరి కళ్లను తనవైపు తిప్పుకోవడంలో నీతా అంబానీ ముందుంటారు.
తాజాగా బెంగళూరులో నిర్వహించిన WPL 2025 మినీ వేలం ఈవెంట్‌లో మరోసారి ఈ విషయాన్నే రుజువుచేశారు. ముఖ్యంగా ఆమె చేతిలోని పింక్ బ్యాగ్ హాట్ టాపిక్‌గా నిలిచింది.
నీతా అంబానీ పవర్ లుక్!
ఈ వేలం కార్యక్రమం కోసం నీతా అంబానీ నీతా అంబానీ పవర్‌లుక్‌లో అదర గొట్టారు. ఈ బిజినెస్ ఐకాన్ పవర్ షోల్డర్‌లు, డబుల్ కాలర్స్‌తో కూడిన చిక్ పాస్టెల్ పింక్ బ్లేజర్‌ను ధరించారు. స్టైలిష్ డెనిమ్ బ్లేజర్‌కు జతగా విలాసవంతమైన హ్యాండ్‌బ్యాగ్‌తో కనిపించారు. అంతేనా డైమండ్ స్టడ్స్, హార్ట్ షేప్డ్ లాకెట్టు నెక్లెస్, తెల్లటి చేతి గడియారం , హై హీల్స్‌తో తన స్టయిల్‌కి లగ్జరీ టచ్ ఇచ్చారు.
ఇదీ చదవండి: ముంబై ఇండియన్స్ మహిళా టీం, యువ ప్రతిభకు ప్రాధాన్యం : నీతా
పింక్ హ్యాండ్‌బ్యాగ్
ఈ ఔట్‌ఫిట్‌కు తగ్గట్టుగా పర్ఫెక్ట్ మ్యాచింగ్‌తో ధరించిన పింక్ హ్యాండ్‌బ్యాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పింక్ అండ్ వైట్ గోయార్డిన్ కాన్వాస్, చెవ్రోచెస్ కాల్ఫ్‌స్కిన్ సైగాన్ స్ట్రక్చర్ ఉన్న ఈ వాచ్ ధరతో ఒక కారు కొనేయొచ్చంటే నమ్ముతారా? ప్రఖ్యాత బ్రాండ్ గోయార్డ్ బ్రాండ్‌కు చెందిన బ్యాగ్ ధర సుమారు 10 లక్షల(12వేల అమెరికా డాలర్లు) రూపాయలట.
కాగా మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 3 కోసం రిలయన్స్‌ఫౌండేన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ యాజమాన్యలోని ముంబై ఇండియన్స్ పటిష్టమైన టీంను సిద్ధం చేసింది. WPL 2025 ఆదివారం బెంగుళూరులో జరిగిన వేలంలో కొత్తగా నలుగురు మహిళా క్రికెటర్లను జట్టులో చేర్చుకుంది. దీనిపై నీతా అంబానీ సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment