ఖరీదైన నగలు, అదిరే స్టయిల్‌ : కోడల్ని మించి మెరిసిపోయిన నీతా అంబానీ | Nita Ambani Stunning looks White Toga and Unique Jewellery Worth In Lakhs | Sakshi
Sakshi News home page

ఖరీదైన నగలు, అదిరే స్టయిల్‌ : కోడల్ని మించి మెరిసిపోయిన నీతా అంబానీ

Published Sat, Jun 15 2024 5:15 PM | Last Updated on Sat, Jun 15 2024 5:35 PM

Nita Ambani Stunning  looks White Toga and Unique Jewellery Worth In Lakhs

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీ చిన్న  కుమారుడు  అనంత్‌ అంబానీ రాధిక మర్చంట్ రెండో ప్రీ వెడ్డింగ్ వేడుక ఇటలీలో లగ్జరీ క్రూయిజ్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కాబోయే వధూవరులు అందంగా  మెరిసిపోయారు. వీరితోపాటు అనంత్‌ తల్లి,ఫ్యాషన్‌ ఐకాన్‌ నీతా అంబానీ మరింత అందంగా స్పెషల్‌గా కనిపించారు.  60 ఏళ్ల వయసులో కూడా తన అందమైన రూపంతో  అందర్నీ ఆకర్షించారు.

ప్రముఖ పరోపకారి, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు, రిలయన్స్  పౌండేషన్‌ ఛైర్‌ పర్సన్ నీతా తన చిన్న కుమారుడి రెండో ప్రీ వెడ్డింగ్‌ వేడుకలో రెండో  రోజు  షియాపరెల్లి  బ్రాండ్‌  వైట్ టోగాలో అద్భుతంగా కనిపించారు. దీనికి జతగా ఇదే బ్రాండ్‌కు చెందిన  లక్షల విలువైన ప్రత్యేక ఆభరణాలతో స్టయలిష్‌ లుక్‌లో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆమె మెడలో ధరించిన మ్యాచింగ్‌ నెక్లెస్‌, చెవులకు స్టడ్స్‌, అలాగే ఒకవైపు మౌత్‌ బీన్‌, మరోవైపు బ్రాండ్ సిగ్నేచర్‌ ‘ఎనామెల్  ఐ’తో రూపొందించిన డబుల్ బ్రూచ్‌ ప్రత్యేకంగా నిలిచాయి.

ఇక నీతా  ధరించిన బ్రూచ్ ధర  2 లక్షల రూపాయలకు పై మాటే. అలాగే ఆమెధరించిన ‘కొల్లియర్ రూబన్ స్పైరల్’ అనే ప్రత్యేకమైన నెక్లెస్‌ ధర రూ. 6.15 లక్షల దాకా ఉంటుందని అంచనా.

మే 31 నీతా అంబానీ  ఫుల్ స్లీవ్ పర్పుల్  ‍కలర్‌ పూల ఎంబ్రాయిడరీ గౌనులో మరింత అందంగా ముస్తాబయ్యారు. 4-5 క్యారెట్ల ఎమరాల్డ్-కట్ డైమండ్ నెక్‌పీస్‌ని, చెవిపోగులు, వెరైటీ సన్‌ గ్లాసెస్‌తో రాధికా అత్తగారిగా తన ఫ్యాషన్‌ స్టయిల్‌ను మరో సారి చాటుకున్నారు 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement