Stylish look
-
డార్క్ గ్రీన్ గౌనులో స్టైలిష్‌గా,ఫ్యాషన్ క్వీన్‌లా శోభిత ధూళిపాళ
నటి శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) తన ష్యాషన్ స్టైల్‌తో అందర్నీ మరోసారి మెస్మరైజ్ చేసింది. ఇటీవల అక్కినేని నాగచైతన్యతో వివాహ వేడుకలలో సంప్రదాయ చీరలు, నగలతో అందంగా మురిపించిన శోభిత తాజాగా ఒక జ్యువెల్లరీ యాడ్‌లో మెరిసింది. ఈ సందర్భంగా ఫ్యాషన్ పట్ల తనకున్న అభిరుచిని చెప్పకనే చెప్పింది.డీప్ గ్రీన్ ఫ్రాక్, డైమండ్ ఆభరణాలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఫ్యాషన్ అండ్ స్టైల్‌కు పర్యాయపదంగా తన లుక్‌తో అభిమానులను ఫిదా చేసింది. రోహిత్ గాంధీ. రాహుల్ ఖన్నా కలెక్షన్లో డీప్ గ్రీన్ డ్రెస్‌ను ఎంచుకుంది. దీనికి సంబంధించిన ఫోటోషూట్ నెట్టింట వైరల్‌గా మారింది. స్క్వేర్ నెక్లైన్, షోల్టర్ స్ట్రాప్స్, అలాగే ముందు భాగంలో, వీ ఆకారంలో డీప్ నెక్లైన్కట్ డ్రెస్‌ను ఎంచుకుంది. ఇక నగల విషయానికి వస్తే మల్టీ-స్ట్రాండ్ చోకర్ నెక్లెస్ , వేలాడే చెవిపోగులు, గాజులు, రింగ్ ధరించింది. డైమండ్ ఆభరణాలు హైలైట్ అయ్యేలా, జుట్టును అందంగా ముడి వేసుకుంది. మరీ ముఖ్యంగా క్యాట్ ఐలైనర్ ఆమె ముఖానికి మరింత అందాన్నిచ్చింది.కాగా శోభితా ధూళిపాళ టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన వీరిద్దరి వివాహం సాంప్రదాయ పద్దతిలో ఘనంగా జరిగింది. అంతకుముందు సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందర్నీఆశ్చర్యపరిచింది. తెలుగు సాంప్రదాయాలు, కట్టుబట్టు ఇష్టం అని చెప్పే శోభిత పసుపు కొట్టింది మొదలు, మూడు ముళ్ల వేడుక దాకా ప్రతి సందర్భంలోనూ తనదైన శైలితో శోభితా ఆకట్టుకుంది.అంతేకాదు వీరికి పెళ్లి తరువాత వచ్చిన తొలి సంక్రాంతి పండుగను కూడా ఈ జంట ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దంపతులిద్దరూ ఇద్దరు పట్టు వస్త్రాలు ధరించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టా స్టోరీలో పోస్టు చేసింది శోభితా . ఈ ఫోటోల్లో రెడ్ కలర్ గోల్డెన్ అంచు శారీలో అందంగా ముస్తాబైంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. -
దీపికా స్టైలిష్ డ్రెస్, చూడ్డానికి చాలా సింపుల్ : కానీ ధర తెలిస్తే షాక్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే(Deepika Padukone) ప్రస్తుతం మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది. తాజాగా భర్తతో రణ్వీర్తో కలిసి విమానాశ్రయంలో తళుక్కున మెరిసింది. ఈ సందర్బంగా లవబుల్ కపుల్ ఇద్దరూ మ్యాచింగ్ డ్రెస్‌లో ఫ్యాన్స్‌ను మురిపించారు. ఎప్పటిలాగానే నవ్వుతూ మీడియాకు ఫోజులిచ్చారు.కుమార్తె దువాకు జన్మనిచ్చిన తరువాత తల్లిదండ్రులుగా జంటగా కనిపించారు. ట్రెండింగ్ వైడ్ లెగ్ జీన్స్, పాప్లిన్ స్లిట్ షర్ట్‌లో చాలా సింపుల్‌గా కనిపించింది. కానీ ఈ డ్రెస్ ధర ఎంతో తెలుసా?ఎయిర్‌పోర్ట్‌లో నల్ల చారల చొక్కా, ప్యాంట్ చాలా సింపుల్‌గా కంఫర్టబుల్‌గా చిక్ స్టైల్‌తో మెప్పించింది గ్లోబల్ ఐకాన్. లీ మిల్ కలెక్షన్‌కు చెందిన ఈ డ్రెస్ ధర 79,100. దీనికి జతగా సిటిజన్స్ ఆఫ్ హ్యుమానిటీ హై రైజ్ వైడ్ లెగ్ జీన్స్‌ను ధరించింది. దీని ధర సుమారు రూ. 39వేలే. (యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!)అంతేనా లగ్జరీ ఎలిమెంట్‌ను జోడిస్తూ లూయిస్ విట్టన్ సన్ గ్లాసెస్‌తో తన లుక్‌కి మోడ్రన్ టచ్ ఇచ్చింది. ఇంకా అద్భుతమైన కార్టియర్ శాంటాస్ డి కార్టియర్ వాచ్‌తో రూపాన్ని పూర్తి చేసింది, దీని ధర రూ.3,080,000. ఇదీ చదవండి: పార్కింగ్ స్థలంలో కంపెనీ : కట్ చేస్తే..యూకే ప్రధానికంటే మూడువేల రెట్లు ఎక్కువ జీతం Power couple Ranveer Singh and Deepika Padukone turn heads at the Mumbai airport with their effortless style and charm 💕#RanveerSingh #DeepikaPadukone #deepveer #Bollywood #iwmbuzz @RanveerOfficial @deepikapadukone pic.twitter.com/TE2Al4PK7J— IWMBuzz (@iwmbuzz) January 7, 2025 ఇక రణవీర్ సింగ్ తన జుట్టును పోనీ టైల్లో కట్టి, తన క్యాజువల్ బెస్ట్ డ్రెస్‌లో అందరికీ హాయ్ చెప్పాడు. దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ కూతురు దువాతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. ఇటీవల దీపిక 39వ పుట్టినరోజు (జనవరి,5)కు ఈ జంట మాల్దీవుల్లో సెల్రబేషన్స్ ముగించుకొని తిరిగి ముంబై చేరుకున్నారు. కాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas)తో కలిసి దీపికా కల్కి( Kalki ) సినిమాలో నటించింది. గర్భంతో ఉన్న మహిళగా నటనతో విమర్శకులను సైతం మెప్పించింది. ప్రెగ్నెంట్‌గా ఉన్నపుడే ఈ సినిమాలో నటించడం మాత్రమే కాదు, నిండు గర్భంతో ప్రమోషన్స్‌లో పాల్గొని అందర్నీ మెస్మరైజ్ చేసింది.ఈ ప్రమోషన్స్‌లో రూ.1.14 లక్షల విలువైన బ్లాక్ డ్రెస్‌తో ఆకట్టుకుంది. Magda రూ.41.500 విలువైన Butrym బ్రాండ్ స్టైలీష్ చెప్పులు ధరించింది. కోటి రూపాయల విలువచేసే బ్రేస్ లేట్ కూడా ధరించిన విషయం తెలిసిందే. -
నీతా అంబానీయా మజాకా : ఆమె బ్యాగు ధరతో కారు కొనేయొచ్చట!
మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 3 కోసం నిర్వహించిన మినీ వేలంలో ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ తనదైన స్టైల్‌తో ఆకట్టుకున్నారు. సందర్భానికి తగ్గట్టు తన డ్రెస్సింగ్ స్టైల్‌తో అదరగొట్టడం మాత్రమే కాదు, హై-ఎండ్ యాక్సెసరీలతో స్పెషల్ లుక్‌లో అందరి కళ్లను తనవైపు తిప్పుకోవడంలో నీతా అంబానీ ముందుంటారు. తాజాగా బెంగళూరులో నిర్వహించిన WPL 2025 మినీ వేలం ఈవెంట్లో మరోసారి ఈ విషయాన్నే రుజువుచేశారు. ముఖ్యంగా ఆమె చేతిలోని పింక్ బ్యాగ్ హాట్ టాపిక్‌గా నిలిచింది.నీతా అంబానీ పవర్ లుక్!ఈ వేలం కార్యక్రమం కోసం నీతా అంబానీ నీతా అంబానీ పవర్లుక్లో అదర గొట్టారు. ఈ బిజినెస్ ఐకాన్ పవర్ షోల్డర్లు, డబుల్ కాలర్స్‌తో కూడిన చిక్ పాస్టెల్ పింక్ బ్లేజర్‌ను ధరించారు. స్టైలిష్ డెనిమ్ బ్లేజర్‌కు జతగా విలాసవంతమైన హ్యాండ్‌బ్యాగ్‌తో కనిపించారు. అంతేనా డైమండ్ స్టడ్స్, హార్ట్ షేప్డ్ లాకెట్టు నెక్లెస్, తెల్లటి చేతి గడియారం , హై హీల్స్‌తో తన స్టయిల్‌కి లగ్జరీ టచ్ ఇచ్చారు.ఇదీ చదవండి: ముంబై ఇండియన్స్ మహిళా టీం, యువ ప్రతిభకు ప్రాధాన్యం : నీతా పింక్ హ్యాండ్బ్యాగ్ఈ ఔట్‌ఫిట్‌కు తగ్గట్టుగా పర్ఫెక్ట్ మ్యాచింగ్‌తో ధరించిన పింక్ హ్యాండ్‌బ్యాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పింక్ అండ్ వైట్ గోయార్డిన్ కాన్వాస్, చెవ్రోచెస్ కాల్ఫ్స్కిన్ సైగాన్ స్ట్రక్చర్ ఉన్న ఈ వాచ్ ధరతో ఒక కారు కొనేయొచ్చంటే నమ్ముతారా? ప్రఖ్యాత బ్రాండ్ గోయార్డ్ బ్రాండ్‌కు చెందిన బ్యాగ్ ధర సుమారు 10 లక్షల(12వేల అమెరికా డాలర్లు) రూపాయలట.కాగా మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 3 కోసం రిలయన్స్ఫౌండేన్ చైర్పర్సన్ నీతా అంబానీ యాజమాన్యలోని ముంబై ఇండియన్స్ పటిష్టమైన టీంను సిద్ధం చేసింది. WPL 2025 ఆదివారం బెంగుళూరులో జరిగిన వేలంలో కొత్తగా నలుగురు మహిళా క్రికెటర్లను జట్టులో చేర్చుకుంది. దీనిపై నీతా అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. -
ఎలిగెంట్లుక్, స్టైలిష్ బ్యాగ్ : ఇషా అంబానీ లెవలే వేరు!
యువ మహిళా వ్యాపారవేత్తగా రాణిస్తున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వ్యాపార రంగంలో రాణిస్తూనే, ఫ్యాషన్ ఐకానిక్‌లా కూడా తనదైన శైలిని ప్రదర్శిస్తుంది. తాజాగా ఒక ఫ్యాషన్ ఈవెంట్లో ఇషా స్పెషల్లుక్లో ఆకట్టుకుంది. ఈ విషయంలో తల్లి నీతా అంబానీకి తగ్గ తనయ అనిపించుకుంటోంది. సోమవారం జరిగిన లగ్జరీ స్కిన్‌కేర్ అండ్ హెయిర్‌కేర్ బ్రాండ్ అగస్టినస్ బాడర్ నిర్వహించిన స్టార్-స్టడెడ్ లాంచింగ్ కార్యక్రమంలో ఇషా అంబానీ బ్లాక్ డ్రెస్‌లో తళుక్కున మెరిసారు. అనైతా ష్రాఫ్ అడ్జానియా డిజైన్ చేసిన స్ట్రాప్‌లెస్ బ్లౌజ్, నెక్లైన్ కార్సెట్ టాప్ ,మ్యాచింగ్ స్కర్ట్ ధరించింది. అంతేకాదు లగ్జరీ చిట్టి బ్యాగ్ హీర్మేస్ కెల్లీ బ్యాగ్ ఆకర్షణగా నిలిచింది. తన కవల పిల్లలు ఆదియా,కృష్ణ పేర్లతో ప్రత్యేకంగా తీర్చిదిద్దడం హైలైట్. గ్లామరస్ అవతార్‌లో శిరస్సునుంచి పాదం వరకు ఆసాంతంగా పర్ఫెక్ట్గా కనిపించింది.కాగా ఇషా అంబానీ 2018లోవ్యాపారవేత్త ఆనంద్ పిరమల్‌ను పెళ్లి చేసుకున్నారు. 2022, నవంబరులో వీరికి కవల పిల్లలు పుట్టారు. -
స్టైలిష్ లుక్‌లో తెలుసు కదా!
‘డీజే టిల్లు, ‘టిల్లు స్క్వేర్’ వంటి హిట్ సినిమాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ‘‘తెలుసు కదా’ చిత్రంలో సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు సిద్ధు జొన్నలగడ్డ . హైదరాబాద్‌లో నెల పాటు జరిగిన మొదటి షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్లో సిద్ధు, రాశీ ఖన్నా, శ్రీనిధి, వైవా హర్షలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. అలాగే సిద్ధు, రాశీ ఖన్నాపై ఓ పాట కూడా తెరకెక్కించాం. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ అవుట్‌పుట్‌తో సంతోషంగా ఉన్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: జ్ఞానశేఖర్ బాబా. -
ఫ్యావరెట్ ఎల్లో లెహెంగాలో.. ‘శ్రీవల్లి’ లుక్స్ అదుర్స్ (ఫోటోలు)
-
Mohit Rai: స్టార్స్‌ని వాళ్లు పోషించే పాత్రలకు తగ్గట్టుగా..
స్టార్స్‌ని వాళ్లు పోషించే పాత్రలకు తగ్గట్టుగా.. వాళ్లు అటెండ్ అయ్యే ఈవెంట్లకు అనుగుణంగా తీర్చిదిద్దడమంటే అంత ఆషామాషీ వ్యవహారమేం కాదు! కానీ దాన్ని అవలీలగా చేసేసే స్కిల్ పేరే మోహిత్ రాయ్!‘స్టయిలిస్ట్ బై డే, బ్యాట్మన్ బై నైట్’ అని తనను తాను వర్ణించుకునే మోహిత్ రాయ్ స్వస్థలం ఢిల్లీ. అక్కడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ చేశాడు. వెంటనే హార్పర్స్ బజార్ ఇండియా మ్యాగజైన్లో ఫ్యాషన్ స్టయిలిస్ట్‌గా ఉద్యోగం దొరికింది. అక్కడ మూడేళ్లు పనిచేశాక ముంబైకి మకాం మార్చాడు. అక్కడైతే అవకాశాలు ఎక్కువుంటాయని. అక్కడ ‘ద వార్డ్‌రోబిస్ట్’లో క్రియేటివ్ డైరెక్టర్‌గా చేరాడు.రెండేళ్లకు ‘హార్పర్స్ బజార్ బ్రైడ్ ఇండియా’లో ఫ్యాషన్ డైరెక్టర్‌గా కొలువు దొరికింది. అప్పుడే.. ‘ఫాలో మీ టు’ ఫొటో సిరీస్‌తో ఫేమస్ అయిన రష్యన్ ఫొటోగ్రాఫర్ మురాద్ ఉస్మాన్ తన భార్య నటాలియాతో ఇండియా వచ్చాడు. ఆ ఇద్దరితో అద్బుతమైన కవర్ షూట్ చేయించాడు హార్పర్స్ బజార్ కోసం. అది వైరల్ అయి మోహిత్‌ని పాపులర్ చేసింది. ఆ ఖ్యాతిని తన అంట్రప్రెన్యూర్షిప్కి పిల్లర్‌గా వేసుకున్నాడు. ‘ఎమ్ఆర్ (మోహిత్ రాయ్) స్టయిల్స్’ను స్థాపించాడు.ఈ సంస్థ స్టార్ స్టయిలింగ్, సెలబ్రిటీ వెడ్డింగ్స్ మీద ఫోకస్ చేస్తుంది. దీని ద్వారానే మోహిత్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అతను మొదట స్టయిలింగ్ చేసింది.. హీరోయిన్ సోనాక్షీ సిన్హాకు. తర్వాత చిత్రాంగదా సింగ్, కరీనా కపూర్, కంగనా రనౌత్, శిల్పా శెట్టిలాంటి బాలీవుడ్ సెలబ్రిటీలు ఎందరికో స్టయిలిస్ట్‌గా చేశాడు.ఎమ్ఆర్ స్టయిల్స్ బాధ్యతలు చూసుకుంటూనే తన స్నేహితుడు షోహ్న దాస్‌తో కలసి ‘గ్రెయిన్ ఫ్యాషన్ కన్సల్టెన్సీ’నీ ప్రారంభించాడు. పలు ఫ్యాషన్ లేబుల్స్‌కి డిజైన్, స్టయిలింగ్‌లో గైడెన్స్ ఇస్తుందీ సంస్థ.‘స్టార్‌కున్న ఇండివిడ్యువల్ స్టయిల్ అండ్ పర్సనాలిటీని ఎలివేట్ చేయటమే స్టయిలిస్ట్ జాబ్’అని నమ్మే మోహిత్ రాయ్‌ని ‘మీకిష్టమైన సెలబ్రిటీ ఎవరు’ అని అడిగితే ‘సోనాక్షి సిన్హా’ అని చెబుతాడు. ‘ఫ్యాషన్ విషయంలో సోనాక్షీ ఎక్స్పరిమెంటల్ అండ్ ఓపెన్. రెండేళ్లు ఆమెతో కలసి పనిచేశాను. స్టయిలిస్ట్‌ని నమ్ముతుంది. చెప్పేది వింటుంది. డిఫర్ అయితే డిస్కస్ చేస్తుంది. ఆ చర్చలు నాకెంతో ఉపయోగపడ్డాయి. నా పనిని మెరుగుపరచాయి. అందుకే సోనాక్షీ అంటే నాకు చాలా రెస్పెక్ట్’ అంటాడు మోహిత్ రాయ్."నా పనిని చూసుకున్న ప్రతిసారీ .. అరే ఇంతకన్నా బాగా చేసుండాల్సింది అనిపిస్తుంది. అందుకే రోజూ ఆత్మవిమర్శ చేసుకుంటాను. పొరపాట్ల నుంచి పాఠాలు గ్రహిస్తాను. దానివల్ల నా పనితీరు రోజురోజుకి మెరుగవుతుంది. సెలబ్రిటీలకు స్టయిలింగ్ చేస్తున్నప్పుడు మన వర్క్ స్టయిల్ హార్డ్‌వర్క్ అండ్ స్మార్ట్వర్క్ల కాంబినేషన్‌గా ఉండాలి!" – మోహిత్ రాయ్ -
ఖరీదైన నగలు, అదిరే స్టయిల్ : కోడల్ని మించి మెరిసిపోయిన నీతా అంబానీ
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ రెండో ప్రీ వెడ్డింగ్ వేడుక ఇటలీలో లగ్జరీ క్రూయిజ్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కాబోయే వధూవరులు అందంగా మెరిసిపోయారు. వీరితోపాటు అనంత్ తల్లి,ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ మరింత అందంగా స్పెషల్‌గా కనిపించారు. 60 ఏళ్ల వయసులో కూడా తన అందమైన రూపంతో అందర్నీ ఆకర్షించారు.ప్రముఖ పరోపకారి, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు, రిలయన్స్ పౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా తన చిన్న కుమారుడి రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలో రెండో రోజు షియాపరెల్లి బ్రాండ్ వైట్ టోగాలో అద్భుతంగా కనిపించారు. దీనికి జతగా ఇదే బ్రాండ్‌కు చెందిన లక్షల విలువైన ప్రత్యేక ఆభరణాలతో స్టయలిష్ లుక్‌లో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆమె మెడలో ధరించిన మ్యాచింగ్ నెక్లెస్, చెవులకు స్టడ్స్, అలాగే ఒకవైపు మౌత్ బీన్, మరోవైపు బ్రాండ్ సిగ్నేచర్ ‘ఎనామెల్ ఐ’తో రూపొందించిన డబుల్ బ్రూచ్ ప్రత్యేకంగా నిలిచాయి.ఇక నీతా ధరించిన బ్రూచ్ ధర 2 లక్షల రూపాయలకు పై మాటే. అలాగే ఆమెధరించిన ‘కొల్లియర్ రూబన్ స్పైరల్’ అనే ప్రత్యేకమైన నెక్లెస్ ధర రూ. 6.15 లక్షల దాకా ఉంటుందని అంచనా.మే 31 నీతా అంబానీ ఫుల్ స్లీవ్ పర్పుల్ కలర్ పూల ఎంబ్రాయిడరీ గౌనులో మరింత అందంగా ముస్తాబయ్యారు. 4-5 క్యారెట్ల ఎమరాల్డ్-కట్ డైమండ్ నెక్పీస్ని, చెవిపోగులు, వెరైటీ సన్ గ్లాసెస్‌తో రాధికా అత్తగారిగా తన ఫ్యాషన్ స్టయిల్‌ను మరో సారి చాటుకున్నారు -
డెనిమ్ జీన్స్ అవుట్ ఫిట్ తో కృతి సనన్ స్టైలిష్ లుక్స్ (ఫొటోలు)
-
స్టయిల్ అండ్ సారీ...ఆహా ఎంత అందం, ఎవరే వీరు? (ఫోటోలు)
-
Sonakshi Sinha Photos: స్టైలిష్ అండ్ ఎత్నిక్ లుక్‌లో.. (ఫోటోలు)
-
సూపర్ లుక్
‘‘హాలీవుడ్ హీరోలా ఉన్నారు.. సూపర్ లుక్’’ అంటూ మహేశ్‌బాబు తాజా లుక్ గురించి నెటిజన్లు పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. రెండు మూడు రోజులుగా మహేశ్‌బాబు తన స్టయిలిష్ లుక్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తున్నారు. ముందు నలుపు రంగు సూట్లో ఉన్న ఫొటోలు షేర్ చేసినప్పుడు సూపర్ అంటూ అభిమానులు మురిసిపోయారు. శనివారం గళ్ల చొక్కాతో ఒత్తయిన జుట్టుతో ‘త్రూ ది లెన్స్’ అంటూ మహేశ్ మరో ఫొటోను షేర్ చేయగా, ఆ లుక్‌కి కూడా మంచి స్పందన వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో దాదాపు రూ. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో రూపొందనున్న ఈ పాన్ ఇండియా చిత్రం కోసం మహేశ్ కొత్తగా మేకోవర్ అయ్యారు. మహేశ్‌తో పలు రకాల లుక్స్‌ని ట్రై చేస్తున్నారట రాజమౌళి. మరి.. మహేశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది రాజమౌళి సినిమా లుక్కా? లేక ఏదైనా యాడ్ షూటా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఈ చిత్రంలో పలువురు విదేశీ తారలు కూడా నటించనున్నారు. -
రష్మిక స్టయిలిష్ లుక్..ఎవరికోసం అంత ప్రేమ?
సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన యానిమల్ సక్సెస్ జోష్‌లో మునిగి తేలుతున్న ఈ బ్యూటీ స్టైలింగ్‌లో కూడా తన ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంది. సోషల్ మీడియాలో బ్యూటిఫుల్ మూమెంట్స్, స్టయిలిష్ పిక్స్‌తో ఎపుడూ యాక్టివ్‌గా ఉండే రష్మిక తాజాగా లవ్లీ ఫోటోలతో సందడి చేస్తోంది. తనదైన స్టయిల్లో, నార్మల్ లుక్ దుస్తులతో రష్మిక షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్ ఓటీటీలో సందడి చేస్తోంది. ఇదే విషయాన్ని సూచిస్తూ ఆమె తన ఫోటోలను షేర్ చేసింది. అయితే ఫ్యాన్స్ మాత్రం ఎవరికోసం అంత ప్రేమ అంటున్నారు. లైట్ బ్లూకలర్ ఫుల్-స్లీవ్ బ్లేజర్, స్ట్రెయిట్-ఫిట్ టైలర్డ్ ప్యాంట్‌తో చేసిన ఫోటో షూట్‌తో పాటు, చెవులకు ధరించిన వెండి ఇయర్‌కఫ్‌లు, లవ్ సింబల్స్ మరింత ఎట్రాక్టివ్‌గా మారాయి. అంతకుముందు, ముదురు ఎరుపు రంగు ప్యాంట్సూట్లోనూ, ఇటీవల రెడ్ చీరలోనూ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Ami Patel (@stylebyami) -
Allu Arjun Latest Stylish Photos: ట్రెండింగ్‌లో ఐకాన్ సార్ట్ అల్లు అర్జున్ న్యూలుక్...(ఫొటోలు)
-
స్టన్నింగ్ డ్రెస్‌తో మెస్మరైజ్ చేసిందిగా: ధరెంతో తెలిస్తే ఔరా అంటారు!
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ గ్లామర్ ప్రపంచంలో తన స్టైల్‌ను చాటుకుంటూనే ఉంటుంది. చాలా క్యాజువల్‌గా, ఎలాంటి మేకప్ లేకుండా కూడా తన స్టన్నింగ్ లుక్స్‌తో అభిమానులను మెస్మరైజ్ చేయడంలో తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది. కేవలం స్టైలిష్‌గా ఉండటమే కాదు అప్ టూ మార్క్‌గా తనకంటూ ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకుంటుంది. బ్లాక్ కలర్స్ అండ్ ప్రింట్స్ ఇష్టపడే కరీనా ఇటీవలి ఔటింగ్‌లో సమ్మర్‌కు తగ్గినట్టు ప్రింటెడ్ ఓవర్సైజ్డ్ జిమ్మెర్మాన్ కో-ఆర్డ్ సెట్‌తో మెరిసింది. ఇలా స్పెషల్ లుక్‌లో అలరించిన కరీనా వేసుకున్న డ్రెస్ ఎంత అని ఇంటర్నెట్లో వెదికిన ఫ్యాన్స్ ఔరా అంటున్నారు. ఇంతకీ దీని ధర ఎంతంటే అక్షరాలు 75వేల రూపాయలు. ప్రింటెడ్ సిల్క్ షర్ట్ , ప్యాచ్‌వర్క్‌తో కూడిన వైబ్రెంట్ కలర్స్ వైలెట్, పింక్, గ్రీన్ పీచ్ రంగులలో పలాజోను ధరించింది కరీనా.దీనికి మ్యాచింగ్‌గా ఆస్ట్రేలియన్ ఫ్యాషన్ లేబుల్ జిమ్మెర్మాన్ చెందిన సిల్క్ కో-ఆర్డ్ సెట్లో ఫ్లవర్ పైస్లీ ప్రింట్ టాప్, ఏవియేటర్-శైలి సన్ గ్లాసెస్ ఆమె లుక్ మరింత ఎలివేట్ చేసింది. కరీనా కపూర్ ఖాన్ స్టైలిష్ ఔటింగ్స్ గత ఏడాది సెప్టెంబరులో తన 42వ పుట్టినరోజు సందర్భంగా, కరీనా కపూర్ సెక్సీ జిమ్మెర్మాన్ ర్యాప్ డ్రెస్‌లో ఆకట్టుకుంది. రూ. 59,999 విలువైన ఈ ర్యాప్ డ్రెస్‌కు తోడు మినీ బ్లాక్ బకెట్ బ్యాగ్‌తో స్టైలిష్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు) -
స్టైలిష్ లుక్‌లో మహేశ్ బాబు.. ఫోటో వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు వయసు పెరుగుతున్న కొద్దీ మరింత యంగ్‌గా మారిపోతున్నారు. స్టైలిష్ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తున్నారు. తాజాగా మరో కూల్లుక్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు మహేశ్. ప్రస్తుతం సూపర్ స్టార్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో SSMB 28 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఎన్నడూ కనిపించని విధంగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారట. ఇప్పటికే 6ప్యాక్ బాడీతో మేకోవర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన మహేశ్ లేటెస్ట్గా ట్రెండీ లుక్‌లో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టా వేదికగా పంచుకోగా ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఇప్పటికే SSMB28 రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను ఈనెల 31న రిలీజ్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
పుష్పను గుర్తుపట్టని రష్మిక మందన్నా.. ఫ్యాన్స్ ఫైర్
Rashmika Mandanna Reaction To Allu Arjun Stylish Look Goes Viral: నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఇటీవల విడుదలైన 'సీతారామం' చిత్రంలో రష్మిక నటించిన విషయం తెలిసిందే. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో తన వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతుంటుంది. చిట్టి పొట్టి డ్రెస్‌లు వేస్తూ యూత్‌ను అట్రాక్ట్ చేసే రష్మికపై ట్రోలింగ్లు కూడా జరిగాయి. అయితే తాజాగా మరోసారి రష్మిక చేసిన ఓ కామెంట్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆడేసుకుంటున్నారు. ఇటీవల ఓ యాడ్ కోసం తన లుక్ స్టైల్ మొత్తంగా అల్లు అర్జున్ మార్చేసిన విషయం తెలిసిందే. ఈ యాడ్ కోసం బన్నీ నెరిసిన జుట్టు, గడ్డం, నోట్లో సిగార్‌తో స్టైలిష్‌గా కనిపించాడు. ఈ లుక్ సోషల్ మీడియాను షేక్ కూడా చేసింది. అయితే తాజాగా బన్నీ లుక్‌పై రష్మిక కామెంట్ చేసింది. అల్లు అర్జున్ స్టైలిష్ ఫొటో పోస్ట్‌ను ట్యాగ్ చేస్తూ 'మై గాడ్, ఒక్క క్షణం మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను సార్' అని రీట్వీట్ చేసింది. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ నేషనల్ క్రష్‌పై మండిపడుతున్నారు. 'ఎంత బాలీవుడ్ ఆఫర్లు వస్తే మాత్రం టాలీవుడ్ హీరోలు నీకు కనిపించడం లేదా?', 'నీతో నటించిన హీరోను కూడా గుర్తుపట్టలేవా? ఇది మరీ ఓవరాక్షన్', 'ఇప్పుడు నీకు తెలుగు హీరోల కంటే హిందీ హీరోల ముఖాలే గుర్తుంటాయా?', 'నేషనల్ క్రష్ అయితే మాత్రం మా ఐకాన్ స్టార్‌ను గుర్తుపట్టరా?', 'బన్నీనే గుర్తుపట్టకపోవడం దారుణం. ఇది కాస్త ఓవర్‌గా లేదు' అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా అల్లు అర్జున్, రష్మిక మందన్నా కలిసి నటించిన 'పుష్ప' ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ చిత్రీకరణకు సన్నాహాలు చేస్తున్నారు. My god! 🔥 @alluarjun .. I couldn’t recognise you there for a second sir 😄🔥 — Rashmika Mandanna (@iamRashmika) July 29, 2022 -
ట్రోలర్స్‌కు షాకిచ్చిన ప్రభాస్, స్టైలిష్ లుక్‌లో ‘డార్లింగ్’
పాన్ ఇండియ స్టార్, డార్లింగ్ ప్రభాస్ ట్రోలర్స్‌కు షాకిచ్చాడు. ‘సాహో’ మూవీ తర్వాత నుంచి ఆయన లుక్‌పై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ లుక్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన ఫిట్‌నెస్‌పై ఎప్పుడు దృష్టి పెడతాడా? మళ్లీ ఎప్పుడు సన్నబడతాడా? అని ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన కొత్త లుక్ ఒకటి బయటకు వచ్చింది. ఇందులో ప్రభాస్ సన్నగా.. మిర్చి లుక్‌లో దర్శనం ఇచ్చాడు. మునుపటి వరకు బోద్దుగా ఉన్న ప్రభాస్ ఒక్కసారిగా స్టైలిష్‌గా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. దీంతో ప్రభాస్‌ను ట్రోల్ చేసిన వారిని టార్గెట్ చేస్తూ నెటిజన్లు, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటూ తమ అభిమాన హీరోని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కాగా ప్రభాస్ తాజాగా ఆది పురుష్ డైరెక్టర్ ఓం రౌత్‌ను ముంబైలోని ఆయన నివాసంలో కలిశాడు. ప్రభాస్‌తో పాటు ఆది పురుష్ ‘రావణుడు’ సైఫ్ అలీఖాన్ సైతం కనిపించాడు. ఓం రౌత్‌తో ముచ్చటించిన అనంతరం ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రభాస్ లుక్‌ను చూసి అందరూ షాకయ్యారు. ఇక ఆయనను చూడగానే మీడియా వ్యక్తుల ప్రభాస్‌ను తమ కెమెరాల్లో బంధించారు. దీంతో ప్రభాస్ నయా లుక్ నెట్టింట వైరల్‌గా మారింది. చాలా కాలం తర్వాత తమ ‘డార్లింగ్’ను ఇలా చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అంతేకాదు ప్రభాస్ కొత్త లుక్కు సంబంధించిన ఫొటోలను వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆది పురుష్ షూటింగ్‌ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం పొస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది. -
స్టైలిష్‌లుక్‌లో మహేశ్ బాబు.. అదిరిపోయిన ఫోటోషూట్
Mahesh Babu Latest Pic Goes Viral: సూపర్‌స్టార్ మహేశ్ బాబు స్టైలిష్ లుక్‌లో అదిరిపోయాడు. వయసు పెరుగుతున్నా రోజురోజుకి మరింత యంగ్ లుక్‌లో సర్ప్రైజ్ చేస్తున్నారు మహేశ్. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు పలు బ్రాండ్స్‌కి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న మహేశ్ తాజాగా పాల్గొన్న ఓ ఫోటోషూట్ ఇప్పుడు నెట్టంట వైరల్ అవుతుంది. కంప్టీట్ బ్లాక్ డ్రెస్‌లో చేతిలో మొబైల్ పట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చాడు. ప్రస్తుతం మహేశ్ సూపర్ స్టైలిస్ లుక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది ఏదైనా కమర్షియల్ యాడ్ ఫిల్మ్ కోసమా లేదా సర్కారు వారి పాట సినిమాకు సంబంధించినదా అన్నది తెలియలేదు. కాగా మహేశ్, కీర్తి తొలిసారి జంటగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా 2022, ఏప్రిల్ 1న రిలీజ్ కానుంది. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాయి. Super ⭐ @urstrulyMahesh looks Ultra Stylish in this latest photoshoot 🖤🔥#MaheshBabu #SarkaruVaariPaata #TeluguFilmNagar pic.twitter.com/2j2QGPAhno — Telugu FilmNagar (@telugufilmnagar) November 25, 2021 -
షరారా శారీ.. చూపు తిప్పుకోలేరు మరి!
లంగా ఓణీ వేసుకున్న కళ రావాలి.. చీరకట్టుకున్న హుందాతనం కళ్లకు కట్టాలి.. ఇండోవెస్ట్రన్ లుక్ అనిపించాలి.. పూర్తి ట్రెడిషనల్ అని మార్కులు కొట్టేయాలి వీన్నింటికీ ఒకే ఒక సమాధానం షరారా శారీ డ్రెస్. నవతరం అమ్మాయి అయినా సంప్రదాయ వేడుకలకు తగినట్టుగా తయారు కావాలని కోరుకుంటుంది. అందుకు తగిన డ్రెస్‌ను ఎంపిక చేసుకుంటుంది. కానీ, సంప్రదాయ చీరకట్టులో సౌకర్యం ఉండదనుకునేవారికి స్టైల్‌గా సమాధానం చెబుతోంది షరారా శారీ. వందల ఏళ్ల ఘనత షరారాను ఘరారా అని కూడా అంటారు. ఇది పూర్తిగా సంప్రదాయ లక్నో డ్రెస్‌గా కూడా చెప్పుకోవచ్చు. ఈ డ్రెస్ పుట్టినిల్లుగా ఉత్తరప్రదేశ్ నవాబ్‌ల ఇంట 19, 20 శతాబ్దాలలో డెయిలీ డ్రెస్‌గా పేరొందింది. టాప్‌గా షార్ట్ కుర్తీ, బాటమ్‌గా షరారా ప్యాంట్ ధరించి దుపట్టాను తల మీదుగా తీసుకుంటూ భుజాలనిండా కప్పుకుంటారు. నడుము నుంచి మోకాలి వరకు ఫిట్ గా ఉంటూ, మోకాలి నుంచి కింద వరకు వెడల్పుగా, కుచ్చులతోనూ ఉంటుంది. అయితే, ఈ స్టైల్ లోనే చిన్న మార్పు చేసి దుపట్టాను పవిటలా ధరించి లంగా ఓణీ స్టైల్, ఇంకొంచెం ముందుకు వెళ్లి శారీ స్టైల్లో తీసుకువస్తున్నారు. చాలా వరకు ఈ షరారా సూట్స్ సిల్క్ బ్రొకేడ్‌తో డిజైన్ చేసినవి ఉంటాయి. ఈ డ్రెస్ ఇప్పుడు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంది. ముఖ్యంగా పండగలు, వివాహ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇలా స్టైలిష్ లుక్ ► మన సంప్రదాయ చీరకట్టు స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకోవడానికి షరారా శారీ అమ్మాయిలకు సరైన ఎంపిక అవుతుంది. ► సాయంకాలాలు గెట్ టు గెదర్ వంటి పార్టీలకైతే ప్రిల్స్, ఫ్లోరల్, టాప్ టు బాటమ్ సేమ్ కలర్ షరారా శారీ సెట్ బాగా నప్పుతుంది. వీటికి పెద్దగా ఆభరణాల అలంకరణ అవసరం ఉండదు. ► సంప్రదాయ పండగలు ఎరుపు, పసుపు షరారా డ్రెస్ సరైన ఎంపిక. ► వివాహ వేడుకలకు ఎంబ్రాయిడరీ బ్లౌజ్, సంప్రదాయ ఆభరణాల ఎంపిక సరైన అందాన్ని తీసుకువస్తాయి. ► శరీరాకృతి ఫిట్‌గా ఉన్నవారు ఈ తరహా స్టైల్‌ను ఎంపిక చేసుకుంటే వేడుకలో ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు. ► టాప్‌గా షార్ట్ కుర్తా వేసుకుంటే ఒక స్టైల్, ఎంబ్రాయిడీ బ్లౌజ్ లేదా స్లీవ్‌లెస్ ట్యునిక్ వేసుకుంటే మరో స్టైల్‌తో ఆకట్టుకుంటుంది షరారా సూట్. ► షరారా ప్యాంట్లా కాకుండా కుచ్చులు ఎంత ఎక్కువగా ఉన్నది ఎంచుకుంటే అంత అందంగా, అచ్చు శారీ కట్టుకున్న విధంగా కనిపిస్తారు. ప్యాంట్ స్టైల్ కావడం, దానికి బెల్ట్ జత చేయడంతో సౌకర్యంగానూ ఉంటుంది. -
ఇలా కుట్టేశారు...
మొన్నటి దాకా అలా చుట్టేశారునిన్నటి దాకా ఏదోలా వేసేశారుఅటు మొన్నదాకా మెడకు పట్టేశారునిన్న మొన్నటి దాకా కట్టేశారుఅందుకే.. ఇక లాభం లేదనిదుపట్టాని ఇలా కుట్టేశారు. సల్వార్, పైజామాలతో పాటు దుపట్టా కంపల్సరీ. కుర్తా, లెగ్గింగ్స్‌కు తప్పనిసరి కాకపోయినా దుపట్టాని మెడకు చుట్టేసి స్టైలిష్ అనిపించారు. ఒక్కోసారి ఒన్‌సైడ్ బెస్ట్ అని తేల్చారు. అసలు దుపట్టాని కుర్తాకు జత చేస్తే గొడవే లేదుగా అని డిజైనర్లు కొత్తగా ఆలోచించారు. దీంతో, ఇదిగో పొడవు, పొట్టి కుర్తాలు ఇలా దుపట్టాతో కలిసి సరికొత్త డిజైన్‌తో స్టైల్‌గా వెలిగిపోతున్నాయి. ఇందుకు ఈ డిజైనర్ దుపట్టా కుర్తాలే సిసలైన ఉదాహరణ. -
రవికట్టు
చీర కట్టుకుని నడుముకు వడ్డాణం పెట్టుకోవడం పాత పద్ధతి. బ్లౌజ్‌నే బెల్ట్‌గా మార్చేసి చుట్టేయడం నేటి పద్ధతి. రవికను ముడి వేసినట్టుగా... బెల్ట్‌తో పవిటను కట్టేస్తే... ఆ బెల్ట్‌కి ఎంబ్రాయిడరీ సొబగులు అద్దితే... అది ఇలా అందమైన బెల్ట్ బ్లౌజ్‌గా రూపుదిద్దుకుంటుంది. స్టైలిష్ లుక్ ►పైట చెంగుకు 8–10 ఫ్రిల్స్ పెట్టి, భుజం మీదుగా జాకెట్‌కు పిన్‌తో జత చేసి, అదే జాకెట్ బెల్ట్ పెట్టేసుకుంటే సరి. ఎలా సెట్ చేసిన ఫ్రిల్స్ అలాగే ఉంటాయి. సౌకర్యంగా ఉంటుంది. లుక్స్‌లో వచ్చిన స్టైలిష్ మార్పుకు వేడుకలో ఎక్కడా ఉన్నా బ్రైట్‌గా వెలిగిపోతారు. ►జాకెట్టు మాత్రమే కాదు బెల్ట్కూ ఎంబ్రాయిడరీ చేసి, ఇలా పైట కొంగుమీదుగా తొడిగేస్తే సరి. అలంకరణ పూర్తయినట్టే. ట్రెండ్‌లో ఉన్నారన్న కితాబులూ సొంతం అవుతాయి. ►ప్లెయిన్ శారీకి బెల్ట్ బ్లౌజ్ ప్రత్యేక ఆకర్షణ ►కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్యాటర్న్ ఎంపిక చేసుకోవాలి. దానితో పాటు బ్లౌజ్‌కి సన్నని బెల్ట్నీ అదే రంగు ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేయించుకోవాలి. ►చిన్న ప్రింట్లు లేదా ప్లెయిన్ శారీకి ఎంబ్రాయిడరీ బెల్ట్ బ్లౌజ్ అక్కర్లేదు. ఫ్లోరల్ ప్రింట్ బెల్ట్ బ్లౌజ్ తీసుకుంటే చాలు. ఫ్యాషన్ వేదికలైనా, సంప్రదాయ వేడుకైనా స్పెషల్‌గా కనిపిస్తారు ►లాంగ్ బ్లౌజ్‌కి బెల్ట్ హంగుగా అమరితే సాదా చీర అయినా సరికొత్త స్టైల్‌తో మెరిసిపోతుంది. –కీర్తిక, డిజైనర్, హైదరాబాద్ -
స్టైలిష్ నెక్ పీస్
మీ దగ్గర ఉన్న పాత ఇమిటేషన్ జువెల్రీ రంగు పోయినా లేదంటే మరో కొత్త రూపం తీసుకురావాలన్నా ఓ చిన్న ఆలోచన చాలు. డ్రెస్ కలర్‌కు మ్యాచ్ అయ్యే ఆభరణం కొనుగోలు కోసం ప్రయాస పడకుండా ఇలా వినూత్న డిజైన్ నెక్‌పీస్‌ను రూపొందించుకోవచ్చు. ఇందుకు కావల్సినవి: ► రాళ్లు పొదిగి ఉన్న పాత నెక్లెస్ ►నెయిల్ పాలిష్ ► నూలు దారాలతో అల్లిన తాడు లేదంటే సన్నని వైర్లతో అల్లిన మందపాటి తాడు (అన్ని రంగుల్లోనూ ఈ తాళ్లు మార్కెట్లో లభ్యమవుతాయి) u సూది, దారం u కత్తెర u క్యాండిల్ లేదా లైటర్ స్టెప్ : 1 .. తాడుకు పూర్తి కాంట్రాస్ట్ నెయిల్ పాలిష్‌ను తీసుకోవాలి. అన్ని రాళ్ల మీద నెయిల్ పాలిష్ కోటింగ్ వేయాలి. ఒక్కో రాయి మీద ఒక్కో నెయిల్ పాలిష్ రంగు కూడా వేసుకోవచ్చు. అన్ని రాళ్ల మీద రెండవ సారి కూడా నెయిల్ పాలిష్ కోటింగ్ వేసి ఆరనివ్వాలి. స్టెప్ : 2 .. నెక్లెస్ ఎంత పొడవు ఉందో అంత పొడవు తాడు కత్తిరించుకోవాలి. స్టెప్ : 3 నూలు తాడు అయితే చివర్లు ముడివేయాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ వైర్ తాడు కాబట్టి చివరన క్యాండిల్ లైట్‌తో గానీ లైటర్ మంటతో గానీ కాల్చాలి. వేడికి చివర్లు ముడుచుకుపోయి, విడిపోకుండా ఉంటాయి. స్టెప్ : 4 .. నెక్లెస్ రంగు దారం తీసుకొని సూదికి ఎక్కించాలి. ఆ సూదితో నెక్లెస్‌ను తాడుకు జత చేసి కుట్టాలి. ప్లెయిన్ డ్రెస్‌ల మీదకు ఇలాంటి నెక్లెస్ చూడగానే ఆకట్టుకుంటుంది. ఖర్చు కూడా నెక్లెస్ కొనుగోలు చేసేటంత కాదు. నెయిల్ పాలిష్ గోళ్లకు వేసుకోవ డానికి తీసుకుంటారు. సూది దారం ఇంట్లోనే ఉంటాయి. ప్లాస్టిక్ లేదా నూలు దారం తాడుకు రూ.5 నుంచి రూ.10 లోపు అవుతుంది. -
కవర్ పేజ్‌పై బన్నీ స్టైలిష్ లుక్
స్టైలిష్ స్టార్‌గా అల్లు అర్జున్‌కు ఉన్న ఇమేజ్ సంగతి తెలిసిందే. ఇప్పటికే తన స్టైల్స్‌లో యూత్‌ను కట్టిపడేస్తున్న బన్నీ ఓ మ్యాగజైన్ కవర్ పేజ్‌పై కనిపించి అభిమానులను మరోసారి ఫిదా చేశాడు. మ్యాక్సిమ్ స్టీడ్ ఫిబ్రవరి ఎడిషన్ కవర్ పేజ్‌పై డీసెంట్ లుక్‌లో దర్శనమిచ్చాడు బన్నీ. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా కోసం చేయించుకున్న డిఫరెంట్ హెయిర్ కట్ తో ఉన్న బన్నీ అదే మేకోవర్‌లో కవర్ పేజ్ పై కనిపించాడు. వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ సరసన అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తుండగా యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ నటుడు శరత్ కుమార్‌లు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. MAXIM STEED . FEB 2018. Thank You ! pic.twitter.com/zWHkUVHIHv — Allu Arjun (@alluarjun) 8 February 2018 -
ఆలియా సిలాయీ
సిలాయీ అంటే హిందీలో.. ‘కుట్టు పని’. ఆలియా భట్‌కి ఏ బట్టలు తొడిగినా.. కుట్టినట్టు ఉంటాయి. అమె కోసమే పుట్టినట్టు ఉంటాయి. బట్టలు పుట్టడం ఏంటి?! పోనీ.. ప్రాణం పోసుకుంటాయి అందాం! ఆలియా వేసుకుంటే.. ఆలిండియా మురిసిపోదా? ఆమె బట్టలు మెరిసిపోవా? ►ఆరెంజ్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ లెహంగా మీద, నెటెడ్ దుపట్టా అంచులకు ఎంబ్రాయిడరీ చేశారు. లెహంగా హెవీగా ఉండటం వల్ల లాంగ్ స్లీవ్స్ ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటే గ్రాండ్ లుక్ వస్తుంది. ►లోపల సింగిల్ పీస్ షార్ట్ గౌన్.. పైన ఓవర్ కోట్ ధరిస్తే చాలు స్టైలిష్ లుక్ వస్తుంది. ఇది పూర్తి వెస్ట్రన్ డ్రెస్సింగ్. అయితే మన ట్రెడిషనల్ లుక్ రావడం కోసం రాజస్థానీ పెయింటింగ్స్‌ని ప్రింట్‌గా ఉపయోగించారు. దీంతో ఇండో–వెస్ట్రన్ లుక్ వచ్చేసింది. ►చందేరీ ఫ్యాబ్రిక్ మీద బెనారస్ వీవ్ చేశారు. యంగ్, టీనేజ్‌లో ఉన్నవారు ఇలాంటి లేత రంగులు కట్టుకుంటే ఇంకా చిన్నపిల్లల్లా క్యూట్‌గా కనిపిస్తారు. ఆలియాభట్ పర్సనాలిటీ చిన్నగా ఉంటుంది. ఇలాంటి పర్సనాలిటీ ఉన్నవారికి ఈ తరహా చీరలు సరైన ఎంపిక. ►తెల్లని టాప్ అదే రంగు ధోతీ ప్యాంట్‌తో ఈ స్టైల్ తెప్పించవచ్చు. ఇది పూర్తిగా సిల్క్ ఫ్యాబ్రిక్. టాప్ ముందువైపు పొట్టిగా, వెనుక వైపు పొడవుగా ఉండేలా అన్ ఈవెన్ కట్‌తో డిజైన్ చేశారు. టాప్‌కి సిల్వర్ వర్క్ చేయడంతో క్లాస్ లుక్ వచ్చింది. నైట్ పార్టీలకు ఈ డ్రెస్ సరైన ఆప్షన్. ►పాత కాలంలోలా ప్లీటెడ్ స్కర్ట్.. దీని మీదకు వి నెక్ టీ షర్ట్ ధరిస్తే క్యాజువల్ లుక్ వచ్చేస్తుంది. డే టైమ్‌లో ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు ఇలాంటి డ్రెస్ బాగుంటుంది. ► సాధారణంగా మనం ఏ పార్టీకి వెళ్లాలన్నా, ఏ సందర్భానికైనా ఆభరణాలను ఎక్కువ వేసుకోవాలని చూస్తాం. దీంతో స్టైలిష్ లుక్ రాదు. సెలబ్రిటీలను, టాప్ హీరోయిన్స్‌ని గమనిస్తే డ్రెస్ ప్రత్యేకంగా ఉన్నప్పుడు ఆభరణాలను చాలా తక్కువగా ధరించడం చూస్తుంటాం. ఒక స్టైలిష్ లుక్ క్రియేట్ చేయాలంటే మాత్రం ఇలాంటి తారామణుల డ్రెస్సింగ్‌ని గమనించవచ్చు.