బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ గ్లామర్ ప్రపంచంలో తన స్టైల్‌ను చాటుకుంటూనే ఉంటుంది. చాలా క్యాజువల్‌గా, ఎలాంటి మేకప్ లేకుండా కూడా తన స్టన్నింగ్ లుక్స్‌తో అభిమానులను మెస్మరైజ్ చేయడంలో తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది. కేవలం స్టైలిష్‌గా ఉండటమే కాదు అప్ టూ మార్క్‌గా తనకంటూ ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకుంటుంది.
బ్లాక్ కలర్స్ అండ్ ప్రింట్స్ ఇష్టపడే కరీనా ఇటీవలి ఔటింగ్‌లో సమ్మర్‌కు తగ్గినట్టు ప్రింటెడ్ ఓవర్‌సైజ్డ్ జిమ్మెర్‌మాన్ కో-ఆర్డ్ సెట్‌తో మెరిసింది. ఇలా స్పెషల్ లుక్‌లో అలరించిన కరీనా వేసుకున్న డ్రెస్ ఎంత అని ఇంటర్నెట్‌లో వెదికిన ఫ్యాన్స్ ఔరా అంటున్నారు. ఇంతకీ దీని ధర ఎంతంటే అక్షరాలు 75వేల రూపాయలు.
ప్రింటెడ్ సిల్క్ షర్ట్ , ప్యాచ్‌వర్క్‌తో కూడిన వైబ్రెంట్ కలర్స్ వైలెట్, పింక్, గ్రీన్ పీచ్ రంగులలో పలాజోను ధరించింది కరీనా.దీనికి మ్యాచింగ్‌గా ఆస్ట్రేలియన్ ఫ్యాషన్ లేబుల్ జిమ్మెర్‌మాన్ చెందిన సిల్క్ కో-ఆర్డ్ సెట్‌లో ఫ్లవర్ పైస్లీ ప్రింట్ టాప్, ఏవియేటర్-శైలి సన్ గ్లాసెస్ ఆమె లుక్ మరింత ఎలివేట్ చేసింది.
కరీనా కపూర్ ఖాన్ స్టైలిష్ ఔటింగ్స్
గత ఏడాది సెప్టెంబరులో తన 42వ పుట్టినరోజు సందర్భంగా, కరీనా కపూర్ సెక్సీ జిమ్మెర్‌మాన్ ర్యాప్ డ్రెస్‌లో ఆకట్టుకుంది. రూ. 59,999 విలువైన ఈ ర్యాప్ డ్రెస్‌కు తోడు మినీ బ్లాక్ బకెట్ బ్యాగ్‌తో స్టైలిష్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు)
Comments
Please login to add a commentAdd a comment