
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌కు కొడుకు పుట్టి రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు అతడి ముఖాన్ని అభిమానులకు చూపించనేలేదు. దీంతో కరీనా ఎప్పుడెప్పుడు ఆ బుడతడిని పరిచయం చేస్తుందా? అని ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ ఈ హీరోయిన్ పిల్లాడిని ఎత్తుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. "మహిళకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.." అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలో కరీనా చంటోడిని తన భుజాలపై పడుకోబెట్టింది. దీంతో అతడి ముఖం కనిపించకపోవడంతో ఆమె ఫ్యాన్స్ కొంత నిరుత్సాహపడుతున్నారు. నీ రెండో కొడుకును ఇంకెప్పుడు చూపిస్తావంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా 2012లో కరీనా కపూర్-సైఫ్ అలీఖాన్ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఈ దంపతులకు 2016 డిసెంబర్‌లో తైమూర్ జన్మించాడు. సుమారు ఐదేళ్ల గ్యాప్ తర్వాత ఫిబ్రవరి 21న కరీనా మరోసారి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో పలువురు సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా వుంటే కరీనా చేతిలో 'లాల్‌సింగ్ చద్దా', 'తాకత్' సినిమాలున్నాయి. ఇక సైఫ్ విషయానికొస్తే అతడు 'ఆదిపురుష్' చిత్రంలో రావణాసురుడిగా కనిపించనున్నాడు. అలాగే హిందీలో 'భూత్ పోలీస్'లో నటిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment