
ఎన్నెల్లు తిరిగొచ్చె మా కళ్లకు! చాలా కాలంగా ప్రేమికులుగా వార్తల్లో ఉన్న కరీనాకపూర్, షాహిద్ కపూర్‌లు ‘బ్రేకప్’ అంటూ అభిమానులను నిరాశపరిచారు. బ్రేకప్‌కు కారణాలు ఏమిటో తెలియదుగానీ వీరి అప్పటి లవ్‌స్టోరీ ఇప్పటికీ హాట్ టాపిక్కే! వారు మళ్లీ నవ్వుతూ మాట్లాడుకుంటుంటే చూడాలనేది ఎంతోమంది కల.
వారి కల ఎట్టకేలకు నిజం అయింది. జైపూర్‌లో జరిగిన ఐఫా 2025 ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాజీ జంట కరీనా కపూర్, షాహీద్ కపూర్‌లు ఒకరినొకరు హగ్ చేసుకున్న దృశ్యం అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విడిపోయిన చాలా సంవత్సరాల తర్వాత ఇద్దరూ ఆత్మీయంగా మాట్లాడుకుంటున్న దృశ్యం అభిమానులకు కన్నుల పండగ అయింది.
Comments
Please login to add a commentAdd a comment