IIFA
-
ఐఐఎఫ్ఏ అవార్డ్స్ నామినేషన్స్.. సత్తా చాటిన లపతా లేడీస్
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ -2025 (IIFA) నామినేషన్స్‌లో బాలీవుడ్ చిత్రాలు సత్తా చాటాయి. తాజాగా ప్రకటించిన ఐఐఎఫ్ఏ నామినేషన్స్‌లో అమిర్ ఖాన్, కిరణ్ రావు తెరకెక్కించిన లపతా లేడీస్ అత్యధిక విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది. ఏకంగా తొమ్మిది విభాగాల్లో లపతా లేడీస్ ఎంపికైంది. ఆ తర్వాత భూల్ భూలయ్యా-2, స్త్రీ-2 చిత్రాలు వరుసగా ఏడు, ఆరు విభాగాల్లో పోటీలో నిలిచాయి.ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ వేడుక మార్చిలో జరగనుంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో మార్చి 8, 9 తేదీల్లో ఈవెంట్ నిర్వహించనున్నారు. ఉత్తమ చిత్రం విభాగంలో లాపతా లేడీస్, భూల్ భూలయ్యా- 3, స్త్రీ- 2, కిల్, ఆర్టికల్ 370, షైతాన్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్నాయి. ఉత్తమ దర్శకుడి కేటగిరీలో కిరణ్ రావు, నిఖిల్ నగేష్ భట్, అమర్ కౌశిక్, సిద్ధార్థ్ ఆనంద్, అనీస్ బజ్మీ, ఆదిత్య సుహాస్ ఝంబాలే నిలిచారు. ఉత్తమ నటి కేటగిరీలో నితాన్షి గోయెల్, అలియా భట్, యామీ గౌతమ్, కత్రినా కైఫ్, శ్రద్ధా కపూర్లు పోటీ పడుతుండగా.. ఉత్తమ నటులుగా స్పర్ష్ శ్రీవాస్తవ, రాజ్‌కుమార్ రావు, కార్తీక్ ఆర్యన్, అభిషేక్, బచ్చన్, అజయ్ దేవగన్‌లు నామినేషన్స్ దక్కించుకున్నారు.సపోర్టింగ్ రోల్ విభాగంలో ఛాయా కదమ్, విద్యాబాలన్, జాంకీ బోడివాలా, జ్యోతిక, ప్రియమణి నిలవగా.. రవి కిషన్, అభిషేక్ బెనర్జీ, ఫర్దీన్ ఖాన్, రాజ్‌పాల్ యాదవ్, మనోజ్ పహ్వా మేల్ విభాగంలో పోటీ పడుతున్నారు. బెస్ట్ విలన్ కేటగిరీలో రాఘవ్ జుయల్, ఆర్ మాధవన్, గజరాజ్ రావ్, వివేక్ గోంబర్, అర్జున్ కపూర్ నామినీలుగా నిలిచారు. -
Indian actress Rekha: పన్నీరద్దుకున్న పసిడి రేఖ
రేఖ... నేటితో 70 నిండి 71లోకి అడుగుపెడుతోంది. కాని మొన్న ఐఫా వేడుకలో వేదిక మీద ఆమె చేసిన 15 నిమిషాల నృత్యం చూస్తే వయసు 17 దగ్గరే ఆగిపోయిందని అనిపించింది. రేఖ – ఎన్నో ఆటుపోట్లు జీవితపు ఎదురుదెబ్బలు ఎదుర్కొంది. కాని ముందుకు సాగడం సౌందర్య భరితంగా జీవించడమే జీవిత పరమార్థం అని నిరూపిస్తూనే ఉంది. కొంచెం కలత చెందితే విరక్తి అవతారం దాల్చే నేటి యువత రేఖ నుంచి ఎంత నేర్చుకోవాలి?1993.ఫిల్మ్‌ఫేర్ మేగజైన్ వారు చెన్నైలో జెమినీ గణేశన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు బహూకరిస్తున్నారు. వేడుకలో దక్షిణాది దిగ్గజాలంతా ఉన్నారు. ప్రతిష్టాత్మకమైన సందర్భం. జెమినీ గణేషన్ స్టేజ్ మీదకు వచ్చారు. మైక్‌లో వినిపించింది– ఇప్పుడు జెమినీ గణేశన్‌కు అవార్డు బహూకరించవలసిందిగా రేఖను ఆహ్వానిస్తున్నాము...చప్పట్లు మిన్నంటాయి. రేఖ స్టేజ్ మీదకు వచ్చింది. జెమిని గణేశన్‌కు అవార్డు ఇచ్చింది. జెమిని మైక్ అందుకుని ‘నా కూతురు రేఖ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది’...రేఖ ఊహ తెలిసినప్పటి నుంచి ఈ మాట కోసం ఎదురు చూస్తోంది. ‘రేఖ నా కూతురు’ అని జెమిని అనాలని ఎదురు చూసిన మాట. ఇంతకాలానికి విన్నమాట. రేఖ సంతోషంతో వెక్కివెక్కి ఏడ్చింది.∙∙ స్త్రీకి మగవాడి తోడు ఉండాలని భారతీయ సంప్రదాయం అంటుంది. అలా తోడు ఉండక తప్పని పరిస్థితులు మన దేశంలో ఉంటాయి. రేఖకు బాల్యం నుంచి కూడా తండ్రి తోడు లేదు. తల్లి పుష్పవల్లి, తండ్రి జెమిని గణేశన్ వివాహ బంధంలో లేకుండానే రేఖను కన్నారు. రేఖ తన బాల్యంలో ‘అక్రమ సంతానం’ గా నింద అనుభవించింది. పుష్పవల్లిని భార్యగా, రేఖను కుమార్తెగా స్వీకరించడానికి జెమిని సిద్ధంగా లేడు. బతుకు గడవడానికి కుమార్తెను సినిమాల్లో ప్రవేశ పెట్టింది పుష్పవల్లి. కాని మద్రాసులో రేఖను హీరోయిన్గా చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు– జెమిని భయంతో. అదీగాక పుష్పవల్లికి నటిగా ఉన్న రోజుల్లో హిందీలో వెలగాలని ఆశ ఉండేది. ఆ ఆశను కనీసం కుమార్తె అయినా నెరవేర్చాలని కోరుకుంది. అప్పటికే ఆమెకు మద్రాసులో చాలా బాధలు ఉన్నాయి. అందుకని తన చెల్లెల్ని తోడు ఇచ్చి రేఖను బొంబాయి పంపింది. పద్నాలుగేళ్ల అమ్మాయి రేఖ. ఏమీ తెలియని రేఖ. బొంబాయిని చూసి బెంబేలెత్తిపోయిన రేఖ.1970లో నవీన్ నిశ్చల్ పక్కన హీరోయిన్గా నటించిన ‘సావన్ భాదో’ సినిమా విడుదలైంది. బొంబాయి పత్రికలన్నీ రేఖను తెర మీద చూసి ఫక్కున నవ్వాయి. నల్లగా, లావుగా ఉన్న రేఖను గేలి చేశాయి. ‘అగ్లీ డక్లింగ్’ అని పేరు పెట్టాయి. ‘33 ఇంచుల నడుము హీరోయిన్’ అని ఎద్దేవా చేశాయి. రేఖకు ఇవన్నీ ఏమీ అర్థం కాలేదు– తాను సినిమాల్లో నటిస్తే ఇంటి దగ్గర కష్టాలు తీరుతాయి అన్న ఒక్క సంగతి తప్ప. పబ్లిసిటీ కోసం రేఖ చేత ఇంటర్వ్యూల్లో అవాకులు చవాకులు మాట్లాడించేవారు నిర్మాతలు. ‘ముద్దు సీన్లు నటించే’ అమ్మాయిగా రేఖకు పేరు పడింది. రేఖను ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు.రేఖ బి–గ్రేడ్ సినిమాల్లో నటిస్తూ ఉంటే ఆ సమయానికి పరిచయమైన జితేంద్రలో ఆమె భవిష్యత్ భాగస్వామిని ఊహించుకుంది రేఖ. అయితే అతను రేఖతో స్నేహంగా ఉన్నా తన గర్ల్‌ఫ్రెండ్, ఎయిర్ హోస్టెస్ శోభనే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత వినోద్ మెహ్రా ఆమెకు ఎంత దగ్గరయ్యాడంటే అతడిని పొందలేక రేఖ ఆత్మహత్యాయత్నం చేసిందన్న వార్తలు వచ్చాయి. తర్వాతి రోజుల్లో విలన్‌గా చేసిన కిరణ్ కుమార్ కూడా ఆమె బోయ్ ఫ్రెండ్‌గా ఉన్నాడు. ఈ దశలన్నీ దాటాక 1976లో ‘దో అంజానే’లో అమితాబ్‌తో కలిసి నటించాక రేఖ జీవితం మారిపోయింది. జీవితాన్నీ, కెరీర్‌నీ సీరియస్‌గా తీసుకోవడం అమితాబ్ నుంచి రేఖ నేర్చుకుంది. ఆమె అమితాబ్‌ను పేరు పెట్టి ఎప్పుడూ పిలవదు. ‘ఓ’ (వారు/ఆయన) అంటుంది. పత్రికలు కూడా ‘ఓ’ అనే రాసేవి. అమితాబ్–రేఖల జోడి సూపర్ హిట్ అయ్యింది. ఆలాప్, ఖూన్ పసీనా, మొకద్దర్ కా సికిందర్, మిస్టర్ నట్వర్లాల్, రామ్ బలరామ్, సుహాగ్, సిల్సిలా. ఆమ్స్టర్ డామ్ డచ్ తులిప్ పూల మధ్య రేఖ, అమితాబ్‌ల మధ్య సాగే ‘దేఖా ఏక్ ఖ్వాబ్ తో ఏ సిల్సిలే హుయే’ పాట హిందీ సినిమాలకు సంబంధించి అత్యంత రొమింటిక్ గీతంగా నేటికీ అభిమానులను సంపాదించుకుంటూనే ఉంది.ప్రతికూలతలను రేఖ అనుకూలంగా మార్చుకుంటూ పోరాటం సాగిస్తూ వచ్చింది. ఒక నటికి దేహానికి మించిన పెట్టుబడి లేదని, దాని పోషణ ప్రథమమని గ్రహించిన మొదటి హీరోయిన్ రేఖ. ఇందుకు అమితాబ్ గైడెన్స్ ఉపయోగపడింది. బరువు తగ్గడం ఒక వ్రతంగా పెట్టుకున్న రేఖ నెలల తరబడి కేవలం యాలకులు కలిపిన పాలు తాగి బతికింది. బాలీవుడ్లో ఆమె వల్లే యోగా, ఏరోబిక్స్ పరిచయం అయ్యాయి. మేకప్ రహస్యాలు నటికి తెలిసి ఉండాలని లండన్ వెళ్లి మేకప్ కోర్సు చేసి వచ్చిందామె. ఇప్పుడు బాలీవుడ్లో ఎలా కనపడాలో, ఎలా ముందుకు సాగాలో, ఎలా ఇమేజ్ను పెంచుకుంటూ వెళ్లాలో ఆమెకు తెలుసు. అంతవరకూ సినిమా స్టిల్స్ మాత్రమే పత్రికలకు అందేవి. రేఖ ప్రత్యేకంగా ఫొటో షూట్స్ చేసి ఆ స్టిల్స్ పత్రికలకు ఇచ్చేది. ఇది బొత్తిగా కొత్త. అందువల్ల ఆమె ఎప్పుడూ కవర్ గర్ల్‌గా నిలిచేది. ఆ తర్వాత హీరో హీరోయిన్లు ఆ ట్రెండ్‌ను ఫాలో అవక తప్పలేదు. రేఖ కేవలం ఒక గ్లామర్ డాల్ కాదు ఆమె మంచి నటి అని చెప్పే సినిమా వచ్చింది. ‘ఘర్’. గుల్జార్ దర్శకత్వంలో 1978లో వచ్చిన ఈ సినిమా రేఖలోని సమర్థమైన నటిని ప్రేక్షకులకు చూపింది. ఈ సినిమాలోని పాటలన్నీ పెద్ద హిట్. ఆ తర్వాత హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖూబ్సూరత్’ (1980) రేఖను యూత్‌కు బాగా దగ్గర చేసింది. దాంతోపాటు ఫిల్మ్‌ఫేర్ అవార్డు తెచ్చి పెట్టింది. అదే సంవత్సరం విడుదలైన ‘ఉమ్రావ్ జాన్’ రేఖ ఒక ఉత్కృష్టమైన నటిగా ప్రపంచానికి చాటింది. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటి పురస్కారం దక్కాక ఇక రేఖ గురించి విమర్శకులు ఎప్పుడూ తక్కువ చేసే పరిస్థితి రాలేదు. రేఖ ఇప్పుడు అన్ని విధాలుగా పరిపూర్ణమైన నటి.రేఖను చాలా తెలివితేటలతో, గ్లామర్‌తో, పరిశ్రమతో ఇండస్ట్రీలో నిలిచింది తప్ప నిజానికి ఇండస్ట్రీ ఆమె టాలెంట్‌ను ఎప్పుడూ పూర్తిగా ఉపయోగించుకోలేదు. పెద్ద నిర్మాణ సంస్థలూ పెద్ద దర్శకులు ఆమెను సపోర్ట్ చేయలేదు. శ్యామ్ బెనగళ్ ‘కలియుగ్’ (1981), గిరిష్ కర్నాడ్ ‘ఉత్సవ్’ (1984), ఆస్థా (1997) రేఖకు చెప్పుకోవడానికి మిగిలాయి. ఆ తర్వాత ఆమె యాక్షన్ సినిమాలకు మళ్లి ‘ఖూన్ భరీ మాంగ్’, ‘ఫూల్ బనే అంగారే’ వంటి సినిమాలు చేసి ‘లేడీ అమితాబ్’ అనిపించుకునే వరకూ వెళ్లింది. ఒక దశలో ఆమె అమితాబ్‌లాగా కాస్ట్యూమ్స్ కూడా ధరించేది.రేఖ అన్‌స్టాపబుల్. అన్లిమిటెడ్. ఆమె ‘కల్ హోన హో’,‘క్రిష్’ వంటి సినిమాల్లో తల్లి/బామ్మ పాత్రలు పోషించినా ప్రేక్షకులు ఎప్పుడూ నల్లజుట్టు రేఖనే ఇష్టపడ్డారు. ఆమె తన ఆకృతిని, ఫిట్‌నెస్‌ని 70 ఏళ్ల వయసు వచ్చినా ఎప్పుడూ కోల్పోలేదు. నేటికీ ఆమె ప్రత్యేకమైన ఫొటోషూట్స్ చేస్తూ కవర్‌గర్ల్ గానే ఉంది. ఇలా హాలీవుడ్ నటీమణులకు చెల్లిందిగానీ మన దేశంలో రేఖకు మాత్రమే సాధ్యమైంది. రేఖ గొప్ప డాన్సర్. పాటలు బాగా పాడుతుంది. కవిత్వం రాస్తుంది. ఆమెలో ఏదో ఆకర్షణ ఉంది. ‘నేను ప్రేమిస్తే సంపూర్ణంగా ప్రేమిస్తాను’ అనే రేఖ ప్రేక్షకులకు కూడా అంతే సంపూర్ణంగా ప్రేమ అందించడం వల్లే నేటికీ నిలబడి ఉంది.ఈ గొప్ప యోధ, కళాకారిణి తెలుగువారి అమ్మాయి కూడా కావడం తెలుగువారు గర్వపడాల్సిన విషయం.రేఖకు జన్మదిన శుభాకాంక్షలు. రేఖ టాప్ 10 సాంగ్స్1. తేరే బినా జియా జాయేనా – ఘర్2. ఆజ్కల్ పావ్ జమీ పర్ – ఘర్3. సున్ దీదీ సున్ తేరేలియే – ఖూబ్సూరత్4. సలామే ఇష్క్ మేరీ జాన్ – ముకద్దర్ కా సికిందర్5. దిల్ చీజ్ క్యా హై – ఉమ్రావ్ జాన్6. ఛోటి సి కహానీ సే బారిషోంకే పానీ సే – ఇజాజత్7. పర్దేశియా ఏ సచ్ హై పియా – మిస్టర్ నట్వర్లాల్8. మన్ క్యూ బెహకా రే బెహకా – ఉత్సవ్9. గుమ్ హై కిసీ కే ΄్యార్ మే – రామ్‌పూర్ కా లక్ష్మణ్10. ఏ కహా ఆగయే హమ్ – సిల్సిలా -
అట్టహాసంగా ఐఫా వేడుక.. సీనియర్ నటి డ్యాన్స్ అదుర్స్!
ప్రతిష్టాత్మక సినీ అవార్డుల వేడుక ఐఫా-2024 అట్టహాసంగా జరుగుతోంది. సినీ ఇండస్ట్రీలో ఉత్తమ నటన కనబరిచిన వారికి అవార్డులను అందజేస్తారు. ఇప్పటికే పలువురు సినీతారలు ఈ అవార్డ్స్ దక్కించుకున్నారు. సెప్టెంబరు 27న మొదలైన ఈ వేడుక ఆదివారంతో ముగియనుంది. ఇప్పటికే సౌత్ ఇండియా, బాలీవుడ్ తారలకు అవార్డులను ప్రకటించారు.అయితే ఈ వేడుకలకు హాజరైన సీనియర్ నటి రేఖ అందరి దృష్టిని ఆకర్షించింది. 1965లో వచ్చిన ఆమె నటించిన చిత్రం గైడ్లోని ఓ సాంగ్‌కు డ్యాన్స్‌తో అదరగొట్టింది. 150 మంది డ్యాన్సర్లతో కలిసి దాదాపు 20 నిమిషాల పాటు అభిమానులను అలరించింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పింక్ అనార్కలి సూట్లో రేఖ మిస్టర్ నట్వర్లాల్ చిత్రంలోని "పర్దేశియా" పాటకు డ్యాన్స్‌తో అదరగొట్టింది.(ఇది చదవండి: ఐఫా- 2024 విజేతలు.. అవార్డ్స్ అందుకున్న బాలీవుడ్, సౌత్ ఇండియా స్టార్స్)కాగా.. టాలీవుడ్లో ఉత్తమ నటుడిగా నాని(దసరా) నిలిచారు. ఉత్తమ చిత్రంగా దసరా మూవీకి అవార్డ్ దక్కింది. బాలీవుడ్లో షారుఖ్ ఖాన్(జవాన్) ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రంగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ నిలిచింది. The one and only #Rekha ji ❤️#IIFA2024 pic.twitter.com/DMUVNOHju7— Raj Nayak (@rajcheerfull) September 29, 2024 #Rekha ji mesmerizing the audience with her ever charming charisma 💓💓💓💓 #IIFA2024 pic.twitter.com/hRc4gV1zZ0— 💖👑 GreatestLegendaryIconRekhaji👑 💖 (@TheRekhaFanclub) September 28, 2024 -
మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్‌కు దక్కిన అరుదైన గౌరవం
ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్‌లో గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులకు ఈ గౌరవం దక్కింది. అయితే, తాజాగా విగ్రహం కూడా ఆవిష్కరించనున్నారు.సింగపూర్‌లోని మ్యూజియంలో చరణ్‌తో పాటు ఆయన పెంపుడు శునకం రైమీ విగ్రహాన్ని కూడా వారు పెట్టనున్నారు. ఇప్పటకే అందుకు సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తి అయిదని తాజాగా జరిగిన ఐఫా వేదక మీద టుస్సాడ్స్ టీమ్ ప్రకటించింది. ఆ వీడియో ఇప్పడు సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది. టుస్సాడ్స్ ఫ్యామిలీలో భాగం కావడం తనకు ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు చరణ్ పేర్కొన్నారు. ఇప్పటికే స్టార్ హీరోలు ప్రభాస్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ మైనపు విగ్రహాలు మేడమ్ టుస్సాడ్స్ కొలువుదీరిన విషయం తెలిసిందే.అయితే, మేడమ్ టుస్సాడ్స్ పుట్టిల్లు అయిన లండన్ మ్యూజియంలో అడుగు పెడుతున్న మొదటి తెలుగు హీరోగా రామ్ చరణ్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ప్రభాస్ (బ్యాంకాక్ మ్యూజియం), మహేశ్ బాబు (సింగపూర్), అల్లు అర్జున్ (దుబాయ్)లలో వారి మైనపు విగ్రహాలు ఉన్నాయి.ఇదీ చదవండి: రెండోరోజు తగ్గిన దేవర కలెక్షన్లు.. బాలీవుడ్లో పెరిగిన క్రేజ్రామ్చరణ్- శంకర్ కాంబినేషన్లో గేమ్ ఛేంజర్ సినిమా తెరకెక్కుతుంది. క్రిస్మస్ సందర్భంగా 'గేమ్ ఛేంజర్' సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.Global Star @AlwaysRamCharan Wax Statue to be unveiled at #MadameTussauds Very Soon ! 🔥Announced at #IIFA2024.@MadameTussauds pic.twitter.com/bznYs3SJXL— Trends RamCharan ™ (@TweetRamCharan) September 29, 2024 -
మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డ్
సినిమా ఇండస్ట్రీలో బోలెడన్ని అవార్డులు ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని మాత్రం ప్రత్యేకమనే చెప్పాలి. అలాంటిదే ఐఫా. తాజాగా అబుదాబిలో ఐఫా అవార్డులు-2024 వేడుక గ్రాండ్‌గా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ స్టార్ సెలబ్రిటీలు ఇందులో పాల్గొన్నారు. చిరంజీవి కూడా సతీమణితో కలిసి హాజరయ్యారు. ఇందులో భాగంగానే ప్రతిష్టాత్మక 'ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా' పురస్కారాన్ని బాలకృష్ణ-వెంకటేశ్ చేతుల మీదుగా అందుకున్నారు. ఉమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని సమంత సొంతం చేసుకుంది.(ఇదీ చదవండి: కేసు పెట్టిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్)ఏయే విభాగాల్లో ఎవరికి అవార్డు?ఉత్తమ సినిమా - జైలర్ఉత్తమ నటుడు - నానిఉత్తమ నటుడు - విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్ 2)ఉత్తమ నటి - ఐశ్వర్యరాయ్ (పొన్నియిన్ సెల్వన్ 2)ఉత్తమ దర్శకుడు - మణిరత్నం (పొన్నియిన్ సెల్వన్ 2)ఉత్తమ సంగీత దర్శకుడు - ఏఆర్ రెహమాన్ (పొన్నియిన్ సెల్వన్ 2)ఉత్తమ విలన్ - ఎస్జే సూర్య (మార్క్ ఆంటోని)ఉత్తమ విలన్ - షైన్ టాక్ చాకో (దసరా)ఉత్తమ సహాయ నటుడు - జయరామ్ (పొన్నియిన్ సెల్వన్ 2)ఉత్తమ సినిమాటోగ్రాఫీ - మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిఉత్తమ సాహిత్యం - హుకుం (జైలర్)ఉత్తమ గాయకుడు - చిన్నంజిరు (పొన్నియిన్ సెల్వన్ 2)ఉత్తమ గాయని - శక్తి శ్రీ గోపాలన్ (పొన్నియిన్ సెల్వన్ 2)ఉత్తమ విలన్ - అర్జున్ రాధాకృష్ణన్ (మలయాళం)ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా - ప్రియదర్శన్ (దర్శకుడు)వుమెన్ ఆఫ్‌ది ఇయర్ - సమంతగోల్డెన్ లెగసీ అవార్డు - బాలకృష్ణఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్ (కన్నడ)- రిషబ్ శెట్టి(ఇదీ చదవండి: 'దేవర' పార్ట్ 2లో స్టోరీ ఏం ఉండొచ్చు?) -
స్టార్ హీరో కాళ్లకు మొక్కిన రానా.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరో రానా ఇటీవలే కొత్త మూవీని ప్రకటించారు. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తోన్న చిత్రంలో కనిపించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమానికి రానా కూడా హాజరయ్యారు. అయితే తాజాగా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్-2024 ప్రెస్ మీట్లో రానా పాల్గొన్నారు. ముంబయిలో జరిగిన ఈవెంట్లో పాల్గొన్న రానా వేదికపై సందడి చేశారు. అక్కడే ఉన్న బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, షారూఖ్ ఖాన్ పాదాలకు నమస్కరించారు. నేను పూర్తిగా సౌత్ ఇండియన్.. అందుకే ఇలా అంటూ రానా మాట్లాడారు. దీంతో కరణ్, షారూఖ్ ఖాన్ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ కార్యక్రమంలో సిద్ధాంత్ చతుర్వేది, అభిషేక్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.(ఇది చదవండి: క్రేజీ ఛాన్స్ కొట్టేసిన మిస్టర్ బచ్చన్ భామ.. ఆ హీరోతో మూవీ!)దుబాయ్‌లోని షారూఖ్ ఇంటికి వెళ్లనప్పుడు తమను అప్యాయంగా చూసుకున్నారని ఈ సందర్భంగా రానా గుర్తు చేసుకున్నారు. దుబాయ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు సౌత్‌కు చెందిన సెలబ్రీటీలంతా వచ్చాం.. ఆ సమయంలో షారూఖ్ ఇంటికి వెళ్లగా.. అందరినీ బాగా చూసుకున్నారని తెలిపారు. షారూఖ్ కేవలం నటుడు మాత్రమే.. మానవతావాది కూడా అని రానా కొనియాడారు. కాగా.. ఐఐఎఫ్ఏ అవార్డ్స్ 2024 ఈవెంట్ సెప్టెంబర్ 27,28, 29 తేదీల్లో అబుదాబిలోని ఓ ఐలాండ్‌లో జరుగనుంది. ఇందులో షాహిద్ కపూర్, విక్కీ కౌశల్, జాన్వీ కపూర్, కృతి సనన్ లాంటి స్టార్స్ ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయని షారూక్ వెల్లడించారు. We're fully South Indian so.. this is how we do.. 🥺🥹 Rana pic.twitter.com/NumYzPpCEc— . (@charanvicky_) September 11, 2024 -
ఎన్టీఆర్ డాన్స్ తో పోటీపడుతున్న హృతిక్
-
అత్యంత చెత్త ఫ్యాషన్ వీళ్లదే.. ఆ లిస్ట్‌లో ఎవరెవరంటే?
బాలీవుడ్ అంటే ఓ ఫ్యాషన్ ప్రపంచం. ఈవెంట్ ఏదైనా సినీ తారలు తమ ఫ్యాషన్‌ను వేదికపైనే పరిచయం చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌లో బాలీవుడ్ తారలు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. తమ ఫ్యాషన్ డ్రెస్సులతో ఆడియన్స్‌ను కట్టిపడేస్తుంటారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) తాజాగా జరిగిన కేన్స్, ఐఫా లాంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఊర్వశి రౌతేలా, ఐశ్వర్యరాయ్, పాలక్ తివారీ, కాజోల్, నోరా ఫతేహి, చాహత్ ఖన్నా వేదికలపై తళుక్కున మెరిశారు. కొందరు తమ డ్రెస్సులతో అభిమానులను మెప్పించగా.. మరికొందరు తారలు విచిత్రమైన ఫ్యాషన్‌తో దారుణ ట్రోల్స్‌కు గురయ్యారు. View this post on Instagram A post shared by Urvashi Rautela❤️ (@asliurvashians) అలా ఇటీవల జరిగిన ఐఫా, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అత్యంత చెత్త ఫ్యాషన్‌తో దారుణంగా ట్రోల్స్‌కు గురయ్యారు. వారిలో ప్రధానంగా ఊర్వశి రౌతేలా, పాలక్ తివారీ, చాహత్ ఖన్నా, కాజోల్, దివ్యాంక త్రిపాఠి, నోరా ఫతేహీ ఉన్నారు. ఈ వారంలో అత్యంత చెత్త ఫ్యాషన్ దుస్తులతో ముందు వరుసలో నిలిచారు. నోరా ఫతేహీ మొదటి రోజే ఎరుపు రంగు దుస్తులు ధరించి ట్రోల్స్‌కు గురైంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) ఐఫా వేడుకల్లో ఊర్వశి రౌతేలా గౌనులో గోధుమ రంగు ఈకలు ఉన్న డ్రెస్సుతో మెరిసింది. ఇది చూసిన నెటిజన్స్ ఆమె ఘోరమైన సెలక్షన్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక చాహత్ ఖన్నా బ్లాక్ గౌనులో ఉర్ఫీ జావెద్‌ను తలపించింటూ కామెంట్స్ చేశారు. కాజోల్ కాషాయ రంగులో డ్రెస్సులో కనిపించగా.. ఆమెదీ పనికిమాలిన ఫ్యాషన్ అంటూ కామెంట్ చేశారు. ఇక మరో నటి పాలక్ తివారీ డ్రెస్ బెడ్‌షీట్, కర్టెన్ క్లాత్‌ను తలపించేలా ఉందంటూ ట్రోల్ చేశారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
IIFA 2023: అట్టహాసంగా ఐఫా అవార్డ్స్ 2023 వేడుక (ఫొటోలు)
-
అవార్డులు కొల్లగొట్టిన ఆలియా భట్ మూవీ..!
దుబాయ్‌లో జరుగుతున్న ఐఫా-2023 అవార్డుల కార్యక్రమంలో ఆలియా భట్ మూవీ సత్తా చాటింది. ఆలియా ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'గంగూబాయి కతియావాడి' అవార్డులు కొల్లగొట్టింది. ముంబయిలోని కామాటిపుర నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తాజాగా ఐఫా అవార్డుల్లో మూడు విభాగాల్లో ఎంపికైంది. ఈ సినిమా తర్వాత కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భూలయ్యా-2 రెండు అవార్డులు దక్కించుకుంది. (ఇది చదవండి: 15 ఏళ్లకే పెళ్లి.. నా కడుపులో బిడ్డకు తండ్రెవరని అడిగాడు: నటి) దుబాయ్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. దక్షిణాది నుంచి కమల్ హాసన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. సల్మాన్‌ఖాన్, విక్కీ కౌశల్, వరుణ్ ధావన్, రకుల్ ప్రీత్ సింగ్, నోరా ఫతేహి పాల్గొన్న ఈ వేడుకలో టెక్నికల్ అవార్డులను అందజేశారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, స్క్రీన్‌ప్లే, కొరియోగ్రఫీ.. ఇలా తొమ్మిది విభాగాల్లో ఈ అవార్డులను ఇచ్చారు. స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సినిమాటోగ్రఫీ అవార్డులను సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘గంగూబాయి కతియావాడి దక్కించుకుంది. (ఇది చదవండి: అమ్మా, నాన్న చనిపోతే.. వారే అంతా పంచుకున్నారు: తేజ) -
మీ కోసమే వచ్చా.. సల్లు భాయ్‌కి ప్రపోజ్ చేసిన అమ్మాయి!
బాలావుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ బీటౌన్‌తో పాటు టాలీవుడ్‌లోనూ పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే బుట్టబొమ్మ పూజా హేగ్డేతో కలిసి కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ అంటూ ప్రేక్షకులను అలరించాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. అయితే ప్రస్తుతం ఆయన దుబాయ్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు(ఐఫా) అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటివరకు పెళ్లి చేసుకోని బాలీవుడ్ స్టార్ హీరోకు ఈవెంట్లో ఓ మహిళా అభిమాని ఊహించని ప్రశ్నతో సర్ప్రైజ్ ఇచ్చింది. (ఇది చదవండి: దానివల్లే శాకుంతలం సినిమాకు కలెక్షన్స్ రాలేదు: పరుచూరి) మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? అంటూ సల్మాన్‌ఖాన్‌కు ప్రపోజ్ చేసింది ఓ అభిమాని. 'సల్మాన్ ఖాన్ నిన్ను ఇష్టపడుతున్నా. ఈ విషయం చెప్పేందుకే హాలీవుడ్ నుంచి ఇక్కడి దాకా వచ్చా. నిన్ను చూసిన క్షణంలోనే ప్రేమలో పడ్డా' అంటూ తన ప్రేమను వెల్లడించింది. దీనికి సల్మాన్ ఖాన్ చమత్కారంగా సమాధానమిచ్చారు. మీరు షారుక్ ఖాన్ గురించి మాట్లాడుతున్నారా? అంటూ జోక్ చేశారు. (ఇది చదవండి: సారా- గిల్ డేటింగ్ రూమర్స్.. అంతలోనే విడిపోయారా?) లేదు.. మిమ్మల్నే ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటారా? అని మరోసారి అడగ్గా.. మీరు 20 ఏళ్ల నన్ను కలిసి ఉండాల్సిందని సరదాగా బదులిచ్చారు. కాగా.. సల్మాన్‌ఖాన్‌కు గతంలో పలు బ్రేకప్ స్టోరీలు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన ప్రేమ కథల గురించి మాట్లాడారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఐఫా ఈవెంట్లో హోయలు పోయిన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
-
ఐఫా ఈవెంట్లో హోయలు పోయిన ముద్దుగుమ్మలు (ఫోటోలు)
-
అప్పుడు చేతిలో ఒక్క సినిమా లేదు: ఏడ్చేసిన సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్.. బాలీవుడ్ స్టార్ హీరోల జాబితాలో ముందు వరుసలో ఉంటాడీ భాయ్‌జాన్. ఎన్నో హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయనకు ఒకానొక సమయంలో చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేకుండా పోయిందట. అబుదాబిలో జరిగిన ఐఫా (ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డ్స్) వేడుకలో ఈ విషయాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకున్నాడు సల్మాన్. '1989లో మైనే ప్యార్ కియా(సల్మాన్ నటించిన తొలి చిత్రం) రిలీజైంది. ఈ సినిమా తర్వాత భాగ్యశ్రీ ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పి పెళ్లి చేసుకుని సెటిలైపోదామని ఫిక్సైంది. దీంతో ఆ సినిమా క్రెడిట్ అంతా భాగ్యశ్రీ ఖాతాలో పడింది. ఈ మూవీ రిలీజయ్యాక ఆరు నెలలపాటు నాకు ఒక్క ప్రాజెక్ట్ కూడా రాలేదు. అప్పుడే రమేశ్ తౌరానీ ఒక దేవుడిలా నా జీవితంలో అడుగుపెట్టాడు. మా నాన్న రెండు వేల రూపాయలిచ్చి అతడితో సినిమా తీస్తున్నట్లు నిర్మాత జీపీ సిప్పీతో పత్రికలో ఒక ఫేక్ ప్రకటన వేయించాడు. నిజంగా సినిమా తీశామా? అంటే లేదు. ఆ తర్వాత రమేశ్ ఒకసారి సిప్పీ ఆఫీస్‌కు వెళ్లి కొత్త సినిమా మ్యూజిక్ కోసం రూ.5 లక్షలిచ్చాడు. అలా నాకు పత్తర్ కె ఫూల్(1991) సినిమా ఛాన్స్ వచ్చింది. వాంటెడ్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలిచ్చి బోనీకపూర్ కూడా నాకెంతో సాయం చేశాడు. ఇదిలా ఉంటే ఓసారి షాప్‌లో నేను కొత్త చొక్కాలవైపు అలానే చూస్తున్నాను. వాటిని కొనేందుకు నాదగ్గర పెద్దగా డబ్బుల్లేవు. అప్పుడు సునీల్ శెట్టి నన్ను చూసి నాకు షర్ట్, వాలెట్ బహుమతిగా ఇచ్చాడు' అని చెప్తూ ఎమోషనలయ్యాడు సల్మాన్. View this post on Instagram A post shared by @SalmanKhan.Fan's.Club (@beingsalmankhan.fans.club) చదవండి: నిజంగానే ఆరోజు తమన్నాతో గొడవపడ్డా.. ఎఫ్ 3 డైరెక్టర్ రికార్డులు బద్ధలు కొడుతున్న విక్రమ్, ఇప్పటిదాకా ఎంత వచ్చిందంటే? -
తక్కువ రెమ్యూనరేషన్.. షాకిచ్చిన నటి!
బాలీవుడ్ పరివారమంతా ఇటీవల న్యూయార్క్‌కు వెళ్లి అట్టహాసంగా జరిగిన ఐఫా అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నది. కానీ, ప్రియాంక చోప్రా మాత్రం ఈ వేడుకకు దూరంగా ఉంది. తన మరాఠీ ప్రొడక్షన్ సినిమా 'క్యా రే రాస్కేలా' ప్రమోషన్, కుటుంబసభ్యులు, సన్నిహితులతో తన 35వ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ఆమె ఐఫాకు డుమ్మా కొట్టింది. బిజీ సినీ షెడ్యూల్ నుంచి విరామం తీసుకొని కుటుంబసభ్యులతో గడిపేందుకు తాను ఐఫా వేడుకలకు వెళ్లడం లేదని ప్రియాంక వివరణ ఇచ్చినా.. 'ముంబై మిర్రర్' మాత్రం తాజాగా ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది ఐఫాలో ఓ నృత్య ప్రదర్శన ఇవ్వాల్సిందిగా నిర్వాహకులు జనవరిలోనే ప్రియాంకను కలిశారట. అంతేకాకుండా వేడుకలో ఓ సెగ్సెంట్కు హోస్ట్‌గా ఉండాలని కోరారట. అయితే, ఇందుకు ప్రియాంక అడిగిన రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు నిర్వాహకులు నిరాకరించట. మరీ ముఖ్యంగా కేవలం వేడుకలో కనిపిస్తే చాలు అంటూ ఒక 'మేల్ సూపర్‌స్టార్'కు అత్యంత భారీ రెమ్యూనరేషన్ ముట్టజెప్పిన నిర్వాహకులు.. ఆయన కంటే తక్కువగా తనకు డబ్బు ఇస్తామనడంతో ప్రియాంక నొచ్చుకున్నారని, అందుకే ఈ వేడుకకు డుమ్మా కొట్టారని ఆ పత్రిక తెలిపింది. ఆ మేల్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్నేనని సంకేతాలు ఇచ్చింది. సల్మాన్ కన్నా తక్కువ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడం వల్లే ఐఫాకు 'దేశీ గర్ల్' ఇలా షాక్ ఇచ్చారని తెలిపింది. -
తనను పెళ్లి చేసుకుంటాననుకోలేదు: హీరో
తాజా ఐఫా అవార్డుల ఉత్సవంలో షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ దంపతులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. గ్రీన్కార్పెట్పై నడుస్తూ ఫొటోలకు ఫోజిలివ్వడమే కాదు.. ఈ జోడీ షో అంతటా సందడి చేసింది. ఇక 'ఉడ్తా పంజాబ్' సినిమాకుగాను ఉత్తమ నటుడు పురస్కారాన్ని సొంతం చేసుకున్న షాహిద్.. ఆ క్రెడిట్ అంత తన భార్యదేనంటూ కొనియాడాడు. 'నా బలం, నా అదృష్టం తనే' అంటూ పొగడ్తల్లో ముంచెత్తాడు. ఐఫా అవార్డుల వేడుక ప్రారంభమై 18 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా 'బెస్ట్ యాక్టర్' అవార్డును అందుకున్న షాహిద్‌ను వ్యాఖ్యాతలు కొంచెం నాటీ క్వషన్స్ అడిగారు. 18 ఏళ్ల వయస్సులో మీరేం చేశారంటూ ప్రశ్నించగా.. 'నాకు 18 ఏళ్ల వయస్సు అప్పుడు నిజంగా అనుకోలేదు. అప్పటికీ ఐదేళ్ల వయస్సున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని.. నిజంగా ఇది నేను చేసిన నాటీ పని అయి ఉంటుంది' అని షాహిద్ చెప్పుకొచ్చాడు. షాహిద్-మీరా దంపతుల మధ్య వయసురీత్యా 13ఏళ్ల వ్యత్యాసం ఉన్న సంగతి తెలిసిందే. ఐఫా పురస్కారం అందుకున్న షాహిద్ భార్యతో కలిసి షోలో ఫుల్ హల్చల్ చేయడమే కాదు.. మీడియాతోనూ సరదాగా ముచ్చటించాడు. -
ఐఫా గ్రీన్ కార్పెట్‌పై బాలీవుడ్
-
ఇకపై తక్కువగా మాట్లాడతా: సల్మాన్ ఖాన్
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్, కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన రేప్ వ్యాఖ్యలపై స్పందించాడు. తనను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని, ఇకపై చాలా తక్కువగా మాట్లాడతానని అన్నాడు. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల ప్రారంభ సమావేశంలో సల్మాన్ మాట్లాడుతూ తాను ఎక్కువ సమయం తీసుకుని.. ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని అన్నాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సల్మాన్ మాట్లాడుతూ సుల్తాన్ సినిమా షూటింగ్ అయిన తర్వాత తన పరిస్థితి రేప్ కు గురైన మహిళలా ఉందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో సల్మాన్ క్షమాపణ చెప్పాలని రాజకీయ పార్టీలు, జాతీయ మహిళా కమిషన్ భగ్గుమన్నాయి. పలువురు హీరోయిన్లు కూడా సల్మాన్ వ్యాఖ్యలను ఖండించారు. -
ప్లీజ్.. నా నుంచి అది ఆశించొద్దు: సల్మాన్
ముంబై: స్టార్ హీరో అయినప్పటికీ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటాడు. అయినా అతని స్టార్ డమ్ కు ఏ లోటూ లేదు. బాలీవుడ్ మూవీలను వంద కోట్ల క్లబ్ కు చేరడం నీళ్లప్రాయంగా మార్చిన హీరో సల్మాన్ ఖాన్. శుక్రవారం అతని పెళ్లి విషయంపై కాస్త వివాదం కావడం తెలిసిందే. తమ్ముడు అర్బాజ్ ఖాన్ పై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేయడంతో పాటు సమర్ధించుకున్నాడు. ఈ జూన్ 23-26 తేదీల మధ్య ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ(ఐఫా) ఉత్సవాలపై సల్మాన్ మాట్లాడుతూ... తాను హృతిక్ రోషన్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ లాగ డాన్స్ చేయలేనని చెప్పాడు. అందుకే ఐఫాలో వారి అంత మంచి స్టెప్పులు వేయలేనని, అందుకే తన నుంచి అలాంటివి ఆశించవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాడు. తనకు వచ్చిన విధంగా నార్మల్ స్టెప్పులతో అలరించేందుకు సిద్ధమైనట్లు ప్రకటించాడు. వరుస షెడ్యూల్స్ తో సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ తాను చాలా బిజీగా ఉన్నా స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో జరగనున్న ఐఫా వేడుకల్లో పాల్గొంటానని చెప్పాడు. సల్మాన్ ఎక్కడుంటే అక్కడ చాలా ఫన్నీగా ఉంటుందని, కుటుంబమంతా ఉన్న ఫీలింగ్ కలుగుతుందని సీనియర్ హీరో అనిల్ కపూర్ అభిప్రాయపడ్డాడు. ఐఫాలో కరీనా కపూర్, మోనాలి ఠాకూర్, ప్రీతమ్, నీతి మోహన్ ఫర్మార్మెన్స్ చూడవచ్చని చెప్పాడు. హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్, సల్మాన్ ఖాన్ కంటెస్ట్ చేసి ఫ్యాన్స్ ను అలరిస్తారని అనిల్ వివరించాడు. -
ఐఫా ఫంక్షన్లో చిరు ఫ్యామిలీ సందడి
-
ఐఫా అదరహో
-
ఐఫా - ఉత్సవమ్
-
కన్నుల పండుగగా ఐఫా అవార్డుల ప్రధానోత్సవం
-
దక్షిణాది సినీ అవార్డుల సంరంభం షురూ!
హిందీ సినిమాకు సంబంధించి పదహారేళ్ళుగా ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ’ (ఐఫా) ఉత్సవాలు తొలిసారిగా దక్షిణాదికి విస్తరించాయి. దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రాంతీయ భాషల (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం) సినిమాల ప్రముఖులనూ ఒకే వేదికపై తీసుకు వచ్చాయి. రెండు రోజుల ఈ దక్షిణాది సినీ అవార్డుల సంరంభానికి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఔట్‌డోర్ స్టేడియమ్ వేదిక అయింది. జియోనీ, రేనాల్ట్ సంస్థల సహ సమర్పణలో ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ అందిస్తున్న ఈ ‘ఐఫా - ఉత్సవమ్’ తొలి నాటి వేడుకలు ఆదివారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభానికి ముందు ఆదివారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ‘ఐఫా’ నిర్వాహకులైన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ‘విజ్‌క్రాఫ్ట్ ఇంటర్నేషనల్’ డెరైక్టర్ విజ్ సబ్బాస్ జోసెఫ్ వేడుకల వివరాలను తెలిపారు. ‘ఐఫా-ఉత్సవమ్’ పేరిట దక్షిణాది లోని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలు నాలుగింటిలోని ప్రతిభను గుర్తించి, అవార్డులు అందించడానికి ‘ఐఫా’ సన్నద్ధమైనట్లు ఆయన చెప్పారు. ఆదివారం రాత్రి పొద్దుపోయాక తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. సోమవారం నాడు తెలుగు, కన్నడ సినీ పరిశ్రమల వేడుక జరుగనుంది. ఈ వేడుక కోసం పలువురు ప్రముఖ తారలు, సాంకేతిక నిపుణులు భాగ్యనగరానికి విచ్చేశారు. ఈ అవార్డులకో బ్రాండ్ ఇమేజ్ ఉంది! - పార్లమెంటు సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి ‘‘హిందీ పరిశ్రమ తర్వాత అత్యధిక సంఖ్యలో సినిమాలను నిర్మించే పరిశ్రమగా తెలుగు చిత్ర పరిశ్రమకు గుర్తింపు ఉంది. ‘ఐఫా’ అవార్డులకు ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. విజ్‌క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతి ఏటా ఈ వేడుకలను చాలా అద్భుతంగా నిర్వహిస్తుంది. అలాంటి ఈ అవార్డు వేడుకలు తొలిసారిగా దక్షిణాదికి రావడం, హైదరాబాద్‌లో నిర్వహించడం ఆనందంగా ఉంది.’’ హైదరాబాద్ బెస్ట్ ప్లేస్! - బి. వెంకటేశమ్, తెలంగాణ ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ‘‘మొదటి నుంచి సాంస్కృతిక వేదికగా హైదరాబాద్‌ను నంబర్‌వన్ చేయాలనే ఆలోచనతో విశేషమైన కృషి చేస్తున్నాం. ఇలాంటి వేడుకలకు హైదరాబాద్ అనువైన స్థలం. ‘ఐఫా’ వేడుకలకు హైదరాబాద్‌ను శాశ్వత వేదికగా మారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.’’ విజ్ సబ్బాస్ జోసఫ్, విజ్‌క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ - ‘ఐఫా’ డెరైక్టర్ ‘‘‘ఐఫా- ఉత్సవమ్’ వేడుకలను డిసెంబరులోనే నిర్వహించాల్సి ఉంది. కానీ హఠాత్తుగా చెన్నైను వరదలు ముంచెత్తడంతో సంఘీభావంగా ఈ వేడుకలను వాయిదా వేశాం. గతంలో జరిగిన ఉత్తరాది వేడుకలకు ఏ మాత్రం తీసిపోకుండా చరిత్రలో నిలిచిపోయేలా ఈ అవార్డు వేడుకలను ప్లాన్ చేస్తున్నాం.’’ అప్పట్లో అందరూ చెన్నయ్‌లోనే - శివరాజ్‌కుమార్, ప్రముఖ కన్నడ హీరో ‘‘హిందీ పరిశ్రమకే కాకుండా దక్షిణాది పరిశ్రమకు కూడా ఈ వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉంది. మా నాన్నగారు రాజ్‌కుమార్ ఉన్న సమయంలో అన్ని భాషల సినీ పరిశ్రమల వాళ్ళూ చెన్నైలోనే ఉన్నారు. అలాంటి చెన్నై వరదబాధితుల బాధను అర్థం చేసుకుని అన్ని భాషల వాళ్ళూ ముందుకు వచ్చారు. ఇప్పుడు జరిగే వేడుకల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.’’ వాళ్ల డ్యాన్స్ కోసం ఎదురుచూస్తున్నా! - ప్రియమణి ‘‘ చెన్నై వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించడం కోసం ఫండ్‌రైజర్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉంది. హీరోయిన్స్‌తో పాటు రామ్‌చరణ్, అఖిల్, జీవా లాంటి అగ్ర హీరోలు కూడా పెర్ఫార్మ్ చేస్తున్నారు. అగ్ర హీరోలు ఇలా ఆహూతుల సమక్షంలో వేదికపై నర్తించడం ఇదే తొలిసారి. వాళ్ళందరి డ్యాన్స్ కోసం ఎదురుచూస్తున్నా!’’ తమిళనాడు ప్రభుత్వం తరపున థ్యాంక్స్! - నాజర్, ప్రముఖ సినీ నటుడు డిసెంబర్లో జరగాల్సిన ‘ఐఫా- ఉత్సవమ్’ వేడుకను తమిళనాడు వరద బాధితులకు సంఘీభావంగా ఇప్పటి దాకా వాయిదా వేసినందుకు నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. వచ్చే ఏడాది చెన్నైలో ఈ వేడుకలను జరపాలని కోరుకుంటున్నా.’’ మన హైదరాబాద్‌కు కొత్త కళ - దేవిశ్రీ ప్రసాద్, ప్రముఖ సంగీత దర్శకుడు ‘‘ ‘ఐఫా’ వేడుకలు మన ఊరికి రావడంతో హైదరాబాద్‌కు కొత్త కళ వచ్చింది. ‘శ్రీమంతుడు’ సినిమాకుగానూ మ్యూజిక్ డెరైక్టర్ గా, అలాగే ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ‘సూపర్ మచ్చీ’ సాంగ్‌కు గీత రచయితగా అవార్డులకు నామినేట్ అయ్యాను. అవార్డు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నాకు ఆడియన్స్‌తో ఇంటరాక్ట్ కావడం ఇష్టం. అందుకే, ఈ వే డుకల్లో మంచి పాటలతో ఓ ఊపు ఊపడానికి రెడీ అవుతున్నా’’ సినీ పరిశ్రమలో దాదాపు సగం దక్షిణాదిదే! - ర సూల్ పూకుట్టి, ‘ఆస్కార్’ అవార్డ్ గెలిచిన ప్రముఖ సౌండ్ ఇంజనీర్ ‘‘ ‘ఐఫా’ వేడుకలను నిర్వహిస్తున్న విజ్ క్రాఫ్ట్ సంస్థతో నాకు 20 ఏళ్ల అనుబంధం ఉంది. దక్షిణాదిలో ఎందుకు చేస్తున్నారని నిర్వాహకులను అడిగాను. భారతీయ సినీ పరిశ్రమ వ్యాపార గణాంకాలను చూస్తే, పరిశ్రమలో 45 శాతం వాటా దక్షిణాదిదే. దాదాపు 17 వేల కోట్ల టర్నోవర్ ఉన్న దక్షిణాదిలో ఇలాంటి వేడుకలను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ‘ఐఫా - ఉత్సవమ్’లో కేవలం గ్లామరే కాకుండా చెన్నై వరద బాధితులను ఆదుకోవడమనే మానవీయ కోణం కూడా ఉంది.’’ ఈ మీడియా సమావేశంలో ప్రముఖ నిర్మాతలు డి.సురేశ్‌బాబు, కె.ఎస్. రామారావు, కథానాయికలు తాప్సీ, మమతా మోహన్‌దాస్, ఆదాశర్మ, నిఖిత, పారుల్ యాదవ్, హీరో నవదీప్ తదితరులు పాల్గొన్నారు. సూపర్‌హిట్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తున్నా! - రామ్‌చరణ్, ప్రముఖ హీరో ఈ వేడుకల గురించి అగ్ర తెలుగు హీరో రామ్‌చరణ్ ఒక ప్రకటన చేస్తూ, ‘‘దక్షిణాది పరిశ్రమను సత్కరించడానికి ‘ఐఫా’ చేస్తున్న కృషి అభినందనీయం. ఎంటర్టైన్మెంట్ దృష్టితోనే కాకుండా ఓ ఫండ్ రైజర్‌గా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి సారిగా సౌత్‌లో జరిగే ఈ ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో సౌత్ ఇండియన్ సినిమాల్లోని సూపర్‌హిట్ సాంగ్స్‌కు లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నా’’ అని తెలిపారు. -
ఆ హీరో పక్కన మరో చాన్స్ కొట్టేసిందా...!
‘ఝమ్మంది నాదం’, తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తాప్సీ. టాలీవుడ్ ఆమెకు అంతగా కలిసి రాలేదు. సెకండ్ హీరోయిన్ గా ఉన్న మూవీలు మాత్రం ఓ మాదిరిగా విజయాలు సాధించాయి. బాలీవుడ్లో మాత్రం ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. అక్షయ్‌కుమార్‌తో నటించిన ‘బేబీ’ ఆమె జాతకాన్నే మార్చేసింది. గ్లామరస్ పాత్రల్లో కనిపించే తాప్సీ పోరాట సన్నివేశాల్లోనూ సత్తా చాటతుందని నిరూపించుకుంది. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు అమితాబ్ నటించనున్న ఓ చిత్రంలో అవకాశం కొట్టేసింది. ఐఐఎఫ్ఏ ఫస్ట్ ఎడిషన్ సందర్భంగా హైదరాబాద్ కు విచ్చేసిన తాప్సీ మీడియాతో కాసేపు ముచ్చటించింది. బిగ్ బి సినిమాలో అవకాశం రావడంతో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయాయని చెప్పింది. తన కెరీర్ లో మరో మెట్టు ఎక్కినట్లు భావిస్తున్నట్లు చెప్పింది. తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'కత్తి' మూవీ హిందీ రీమేక్ లో అక్షయ్ కుమార్, తాప్సీలు జంటగా కనిపిస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రీమేక్ మూవీలో అక్షయ్ కుమార్ నరసన నటిస్తున్నారా అని తాప్సీని అడగగా... ఈ ప్రాజెక్టు గురించి అంతగా ఐడియా లేదు. ఏమైనా వివరాలు తెలిస్తే మీకు కచ్చితంగా చెబుతాను అంటూ చమత్కరించింది. చెన్నై వరద బాధితుల సహాయార్థం నిర్వహిస్తున్న కార్యక్రమం అంటూ ఐఐఎఫ్ఏ గురించి చెప్పుకొచ్చింది. బెంగాళీ దర్శకుడు అనిరుధ్ రాయ్ ఈ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సుజిత్ సర్కార్ నిర్మించే ఈ యాక్షన్ థ్రిల్లర్ కొన్నిరోజుల్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
శృతి మించింది!
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ(ఐఐఎఫ్ఎ) ఉత్సవాల్లో ఏ ముహూర్తాన సోనాక్షి పాట పాడిందోగానీ, ఇక అప్పటి నుంచి పాటలతో పీకలలోతు ప్రేమలో పడిపోయింది. సోనాక్షి పాడిన పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘వన్స్‌మోర్’ అన్నవాళ్లు కూడా లేకపోలేదు. ఇక అప్పటి నుంచి తన గానప్రతిభ మీద ఆమెకు గట్టి నమ్మకం ఒకటి ఏర్పడి పోయింది. ఇక చూసుకోండి... వినేవాళ్లు దొరికితే చాలు పాటలు వినిపిస్తుందట. ‘‘ఈ పాట మొన్ననే వినిపించావుగా...’’ అని శ్రోత బాధితులు తప్పించుకో జూస్తే- ‘‘అలాగా... అయితే నిన్న నేర్చుకున్న కొత్త పాట వినిపిస్తాను’’ అని గొంతు సవరిస్తుందట. ఎప్పుడూ గలగలా మాట్లాడే అమ్మాయి కాస్తా... తనలోనే తాను పాడుకుంటోందట. ఎవరైనా పలకరిస్తే పొడిపొడిగా మాట్లాడి మళ్లీ తనలో తాను పాటలు పాడుకుంటుందట. ఆనాటి ‘మొఘల్-ఏ- ఆజామ్’ పాటల నుంచి, ‘ఎవ్రీటైమ్ వుయ్ సే గుడ్‌బై’ లాంటి పాత ఇంగ్లీష్ పాటల వరకు తెగ పాడేస్తుందట. శ్రద్ధాకపూర్‌ను స్ఫూర్తిగా తీసుకొని సినిమాల్లో కూడా పాడడానికి శ్రద్ధగా ప్రయత్నిస్తుందట సోనాక్షి! -
'అబ్బ.. నా కల నెరవేరబోతుంది'
న్యూఢిల్లీ: లైవ్‌లో ఆడియెన్స్ ముందు ఓ రాక్ స్టార్ లా పాటలపాడుతూ ఉర్రూతలూరించాలని తానెప్పుడూ కలగంటూ ఉంటానని ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా అంది. జూన్‌లో మూడు రోజులపాటు జరుగనున్న అంతర్జాతీయ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్ఏ) అవార్డుల కార్యక్రమంలో ఆమె మైకు అందుకోని పాట పాడబోతోంది. దీనికి సంబంధించిన కబుర్లు చెప్పిన సోనాక్షి 'ఆ వేడుక కోసం నేను అంతా సిద్ధం చేసుకున్నాను. ఓ వేదిక మీద రాక్ స్టార్‌లాగా పాడాలన్న నా కోరిక నెరవేరబోతుంది.. అందుకే నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఆ వేడుక కోసం రోజులు ఎంత తొందరగా అయిపోతే అంతబాగుండనిపిస్తుంది' అని ఆమె చెప్పింది. -
ప్లీజ్... ఆ ఫొటోలు మాత్రం వద్దు!
తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయమైనా సరే... ఒకప్పుడు ధైర్యంగా బయటకు చెప్పేసేవారు దీపిక. అప్పుడెప్పుడో ఓ సారి ఆమె పాల్గొన్న ఓ టీవీషోలో దీపిక మెడపై ఉన్న గాట్లను సదరు కార్యక్రమ వ్యాఖ్యాత గమనించి, మెడపై ఆ గాట్లేంటి? అనడిగితే -‘‘రణబీర్ ప్రేమగాట్లు’’ అని ధైర్యంగా చెప్పి అక్కడున్నవాళ్లందరూ ఆశ్చర్యపోయేలా చేసింది దీపిక. అలాంటి దీపిక మైండ్‌సెట్‌లో ఇప్పుడు అనూహ్యమైన మార్పు. ఇటీవల ఐఫా అవార్డుల్లో పాల్గొని వెళుతున్న దీపిక ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో... ఓ స్టిల్ ఫొటోగ్రాఫర్ ఆమెను క్లిక్ మనిపించాడు. అంతే... ‘నా ఫొటోలు డిలీట్ చేయ్..’ అంటూ అతని వెంట పడింది దీపిక. ‘నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాన’ని ఆఫర్ కూడా చేసిందట. ‘మీ ఫొటోలు ఇప్పటివరకూ నేను చాలా తీశాను. ప్రత్యేకించి ఈ ఫొటోలను ఎందుకు డెలిట్ చేయమంటున్నారో అర్థం కావడం లేదు’ అని వాపోయాడట సదరు ఫొటోగ్రాఫర్. తర్వాత కెమెరాలో స్టిల్స్ ఓపెన్ చేసి చూస్తే... దీపిక మెడపై గోటి గీతలు, పంటిగాట్లు ఉన్నాయట. అవి బయటకు పొక్కుతాయనే దీపిక ఆ ఫొటోలు డిలీట్ చేయమని బతిమాలింది. ఇటీవల ఓ ప్రముఖ పత్రికకు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో... ‘ప్రేమకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఎవరితోనైనా సరే... ఇక నుంచి స్నేహం వరకే’ అని భారీ స్టేట్మెంట్ ఇచ్చిన దీపిక, ఇలా గోటి గాట్లతో ఓ స్టిల్ ఫొటోగ్రాఫర్‌కి చిక్కడం బాలీవుడ్లో పెద్ద చర్చకే దారితీసింది. -
ఓటమి అంటే భయం
వైఫల్యాలు తనను విపరీతంగా భయపెడుతాయని చెబుతోంది ప్రియాంకా చోప్రా. అమెరికాలోని ఫ్లోరిడాలో నిర్వహిస్తున్న భారత అంతర్జాతీయ సినిమా సంస్థ (ఐఐ ఎఫ్ఏ) ఉత్సవంలో మాట్లాడుతూ ఈ విషయం చెప్పింది. సాత్ ఖూన్ మాఫ్, బర్ఫీ, ఫ్యాషన్ సినిమాల్లో చక్కటి నటన ప్రదర్శించిన ఈ బ్యూటీ జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకోవడం తెలిసిందే. ‘ఓటమి అంటే నాకు భయమే. నన్ను ముందుకు నడిపించేవీ అవే! ఏదైనా సినిమా హిట్ కాకుంటే చాలా బాధేస్తుంది. గదిలో ఒక్క దానినే రెండు వారాలపాటు గడుపుతాను. బర్ఫీ వల్ల ఉపయోగం ఏమీ ఉండబోదని, ఆ సినిమా చేయొద్దంటూ చాలా మంది భయపెట్టారు. అయినా నేను పట్టించుకోకుండా సంతకం పెట్టేశాను. ఆ సినిమాలో నా పాత్రకు వచ్చిన స్పందనకు ఎంతో సంతోషించాను’ అని వివరించింది. బాలీవుడ్లో తన ప్రయాణం ఎలా మొదలయిందో కూడా ప్రియాంక ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. సినిమా నేపథ్యం లేని ప్రియాంక 17 ఏళ్ల వయసులోనే మిస్ వరల్డ్‌గా ఎంపిక కావడంతో వెండితెరపైకి వచ్చింది. ‘భారతీయ సినిమాల్లో హీరోయిన్లకు సత్తా ప్రదర్శించే అవకాశాలు చాలా తక్కువ. నా వరకైతే నేను అదృష్టవంతురాలిని. ఇప్పటి వరకు చేసిన పాత్రలన్నీ మంచి పేరు తెచ్చిపెట్టాయి. నాకు సినిమాలకంటే ప్రదర్శనలు అంటే ఇష్టం. ఫ్యాషన్ షోల్లో ప్రేక్షకుల నుంచి వెంటనే గుర్తింపు వస్తుంది.’ అని చెప్పిన ప్రియాంక, ఫ్యాషన్‌లో అత్యద్భుత నటనకుగాను జాతీయ అవార్డు దక్కించుకుంది. ‘నాకు అవార్డు వచ్చిందంటూ ఆ రోజు ఉదయం నాలుగింటికి ఫోన్ వచ్చింది. కాసేపటికే ఇంటర్వ్యూల గోల మొదలయింది. నాకైతే కలా..నిజమా అనిపించింది. జాతీయ అవార్డు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నా తల్లిదండ్రులు కూడా అప్పుడు నాతోనే ఉన్నారు. ఎంతో సంతోషంగా అనిపించింది’ అని ప్రియాంకా వివరించింది. -
'ఫెయిల్యూర్ అంటే చాలా భయం'
అపజయాలంటే (ఫెయిల్యూర్) తనకు చెప్పలేనంత భయమని బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా అన్నారు. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ(ఐఐఎఫ్ఏ) అవార్టుల కార్యక్రమంలో భాగంగా హాలీవుడ్ నటుడు కెవిన్ స్పేసీతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఫెయిల్యూర్స్ అంటే భయం. ఫెయిల్యూర్స్ నన్ను నడిపిస్తాయి. ఒకవేళ తాను నటించిన సినిమా పరాజయం పొందితే బాధపడటమే కాకుండా రెండు వారాలపాటు ఇంట్లోనుంచి బయటకు రాను అని ప్రియాంక వెల్లడించారు. బర్ఫీ చిత్రంలో నటించేముందు హీరోయిన్ ఇమేజ్ సరిపడని క్యారెక్టర్ అని తనను చాలా మంది బెదిరించారని.. అయితే ఎంతమంది హెచ్చరించినా.. బర్ఫీలో నటించానని.. బర్శీ తనకు సంతృప్తిని ఇచ్చిందన్నారు. -
అమెరికాలో బాలీవుడ్ పండగ